తనికెళ్ళ భరణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
→‎మూలాలు: అవసరం లేని యూట్యూబు మూలాల తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 136: పంక్తి 136:
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
5.https://www.youtube.com/watch?v=wWFFWysF6nQ
6.https://www.youtube.com/watch?v=RCofmPzDlMM
7.https://www.youtube.com/watch?v=s9br0dApmxs


==బయటి లింకులు==
==బయటి లింకులు==

17:25, 27 మార్చి 2020 నాటి కూర్పు

తనికెళ్ళ భరణి
దస్త్రం:TANIKELLA BHARANI.jpg
తనికెళ్ళ చిత్రపటం
జననం (1956-07-14) 1956 జూలై 14 (వయసు 67)
ఎత్తు5"7
జీవిత భాగస్వామిభవాని
పిల్లలుకన్నబాబు (కొడుకు), సౌందర్యలహరి (కుమార్తె)
తల్లిదండ్రులు
  • టి. వి. ఎస్. ఎస్ రామలింగేశ్వర రావు (తండ్రి)
  • లక్ష్మీ నరసమ్మ (తల్లి)
తనికెళ్ళ భరణి

తనికెళ్ళ భరణి (జననం: జులై 14, 1956) రంగస్థల, సినిమా రచయిత, నటుడు. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకల కళాకోవిదుడు. ఇతనికి దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమాకు మంచి సంభాషణలు అందివ్వడమే కాక ఒక మంచి పాత్రను కూడా పోషించాడు. ఇప్పటిదాకా దాదాపు 320 సినిమాలలో నటించాడు.[1]

వ్యక్తిగతం

భరణి భార్య పేరు భవాని. వారికి మహాతేజ అనే కొడుకు, సౌందర్యలహరి అనే కుమార్తె ఉన్నారు.

కుటుంబం

తనికెళ్ళ భరణి తండ్రి టి. వి. ఎస్. ఎస్ రామలింగేశ్వర రావు, తల్లి లక్ష్మీ నరసమ్మ. భార్య దుర్గాభవాని. ఒక కుమారుడు పేరు కన్నబాబు. ఒక కుమార్తె పేరు సౌందర్యలహరి. ఆయన నిర్మించిన నివాసగృహానికి కుమార్తె పేరు పెట్టుకున్నాడు.

ఆరంభకాల కళాపయనం

తనికెళ్ళ భరణి ఇంటర్మీడియట్ వరకు ఏమీ వ్రాయలేదు. హైదరాబాద్‌లోని రైల్వే కాలేజీలో ఓ నాటకం వేయాల్సివచ్చినపుడు ‘అద్దె కొంప’ అనే నాటకం రాసి ప్రదర్శించగా ఆ నాటకానికి మొదటి బహుమతి వచ్చింది.[2] ఇంటర్ చదివే సమయంలో ఆయన మిత్రుడు శ్రేయోభిలాషి అయిన దేవరకొండ నరసింహ ప్రసాద్ ప్రేరణతో వ్రాసిన "అగ్గిపుల్ల ఆత్మహత్య", "కొత్త కలాలు" కవితలు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైంది. తరువాత బి. కాం చదివే సమయంలో రాళ్ళపల్లితో పరిచయం అయింది. రాళ్ళపల్లి వ్రాసిన "ముగింపు లేని కథ" నాటకంలో తనికెళ్ళ భరణి 70 సంవత్సరాల వయోధిక పాత్ర ధరించాడు. ఆ నాటకం విజయం సాధించిన తరువాత భరణికి నాటకరంగంలో స్థిరమైన స్థానం లభించింది. రాళ్ళపల్లి నాటక సంస్థ పేరు "శ్రీ మురళీ కళానిలయం". రాళ్ళపల్లి మద్రాసు వెళ్ళిన తరువాత "శ్రీ మురళీ కళానిలయం" సంస్థకు రచయిత కొరత ఎదురైంది. అది భరణికి నాటక రచయితగా నిలదొక్కుకోవడానికి సహకరించింది. ఆయన ఆ సంస్థ కొరకు 10 నాటకాలు రచించాడు. ఆ నాటకాలకు తల్లావఝుల సుందరం దర్శకత్వం వహించాడు. అందులో స్త్రీవాదాన్ని బలపరుస్తూ వ్రాసిన " గోగ్రహణం " నాటకం సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం విశేషం. ప్రయోగాత్మకంగా ప్రదర్శించబడిన ఆ నాటకాలకు ప్రజల ఆదరణ లభించింది.

వీధినాటకాలు

ఔత్సాహిక నాటకాలు వేయడానికి వేదికగా ఉన్న రవీంద్రభారతి, నారద గానసభ వంటి నాటకరంగాలలో నాటకం వేయడానికి అధికంగా వ్యయం కావడం అది భరించే అవకాశాలు లేని కారణంగా భరణి పనిచేస్తున్న సంస్థ వారు బెంగాలీ నాటకకర్త "బాదల్ సర్కార్"ను ప్రేరణగా తీసుకుని వీధినాటకాలు వేయడం ప్రారంభించారు. ఇలా ప్రదర్శించిన నాటకాలలో మొదటిది "పెద్దబాలశిక్ష" నాటకం. తలావఝుల సుందరం ప్రారంభించిన ఈ నాటకాలకు మంచి ఆదరణ లభించింది. భరణి వీటిలో నటించడమే కాక నాటకాల నటనా బాధ్యత కూడా వహించాడు. భరణి రచించిన "గోగ్రహణం, కొక్కరకో, గొయ్యి" నాటకాలు తల్లవఝుల సుందరం దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి. నాటకాలలో భరణి అత్యధికంగా విలన్ పాత్రలు ధరించాడు.

చలనచిత్రరంగ ప్రవేశం

తనికెళ్ళ భరణి వ్రాసిన "చల్ చల్ గుర్రం" నాటకం చూసిన రామరాజు హనుమంతరావుకు, రాళ్ళపల్లి ద్వారా వంశీకి పరిచయమై కంచు కవచం చిత్రానికి ఆ సినిమాకు రచయితగా, నటుడిగా చేశాడు.[2] తరువాత " లేడీస్ టైలర్" చిత్రానికి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత " శివ " చిత్రంలో నటుడిగా అవకాశం అలాగే పేరూ వచ్చింది. దాదాపు 60 చిత్రాలకు పనిచేసే అవకాశం లభించింది. ఆయన తెలంగాణా యాసలో మాటలు వ్రాయడంలో సిద్ధహస్థుడు. " మొండి మొగుడు - పెంకి పెళ్ళాం" చిత్రంలో కథానాయికకు పూర్తిగా తెలంగాణ యాసలో రాశాడు.

నటుడిగా

తనికెళ్ళభరణి చలనచిత్ర నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. సొగసు చూడతరమా, ఎగిరేపావురమా, మావిచిగురు, పరదేశి చిత్రాలలో భరణి ఉదాత్తమైన నటన ప్రదర్శించాడు. కామెడీ, విలన్, ఉదాత్తమైన వైవిధ్యమైన పాత్రధారణతో భరణి ప్రజాదరణ పొందిన నటులలో ఒకడయ్యాడు. ఆయన దాదాపు 200 పైచిలుకు చిత్రాలలో నటించాడు.

పాక్షిక చిత్ర సమాహారం

దర్శకుడిగా

నటించిన చిత్రాలు

  1. ప్రెషర్ కుక్కర్ (2020)
  2. ఎంత మంచివాడవురా! (2020)[3][4]
  3. నా నువ్వే (2018)
  4. అమర్ అక్బర్ ఆంటోని (2018)
  5. శరభ (2018)[5]
  6. విజేత (2018 సినిమా) (2018)
  7. కథలో రాజకుమారి (2017)
  8. శమంతకమణి (2017)
  9. నేనే రాజు నేనే మంత్రి (2017)
  10. హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌ (2017)
  11. సుప్రీమ్ (2016)
  12. అరెరె
  13. కిక్ 2 (2015)
  14. జెండాపై కపిరాజు (2015)[6]
  15. సూర్య వర్సెస్ సూర్య (2015)
  16. బెంగాల్ టైగర్ (సినిమా) (2015)
  17. కార్తికేయ (సినిమా) (2014)
  18. రఫ్‌ (2014)
  19. రారా...కృష్ణయ్య (2014)
  20. పాండవులు పాండవులు తుమ్మెద (2014)
  21. పవిత్ర (2013)[7]
  22. ఢి ఫర్ దోపిడి (2013)
  23. అడ్డా (2013)[8]
  24. క్షేత్రం (2011)
  25. కలెక్టర్ గారి భార్య (2010)
  26. శంభో శివ శంభో (2010)
  27. బావ (సినిమా) (2010)
  28. రక్తచరిత్ర - రామ్మూర్తి - (2010)
  29. కరెంట్ (2009)
  30. నేనున్నాను - సింహాచలం నాయుడు - (2004)
  31. మిస్సమ్మ (2003)
  32. విష్ణు (2003)
  33. ఎంత బావుందో! (2002)
  34. మనసున్న మారాజు (2000)
  35. సర్దుకుపోదాం రండి (2000)
  36. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
  37. స్వర కల్పన
  38. చెట్టు కింద ప్లీడర్
  39. శివ
  40. జగదేక వీరుడు అతిలోక సుందరి
  41. సీతారామయ్య గారి మనవరాలు
  42. అప్పుల అప్పారావు
  43. యమలీల
  44. నువ్వు నాకు నచ్చావ్
  45. మన్మథుడు
  46. ఇంద్ర
  47. చిత్రం
  48. చెవిలో పువ్వు (1990)

రచయితగా

నాటకాలు

తనికెళ్ళ భరణి సమాజంలో జరుగుతున్న సంఘటలనపై నాటకాలు రాశాడు.[9]

సినీ రచనలు

ప్రజాదరణ పొందిన తనికెళ్ళ భరణి సినీ సంభాషణలు

  • నన్ను గిట్ల డిసైడ్ చేసినావేందన్నో... (యమలీల సినిమా)
  • ఆడు మగాడ్రా బుజ్జీ ... (అతడు)

పురస్కారాలు

రచనలు

  1. నక్షత్ర దర్శనం
  2. పరికిణీ
  3. ఎందరో మహానుభావులు
  4. మాత్రలు
  5. శబ్బాష్‌రా శంకరా

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-21. Retrieved 2008-11-26.
  2. 2.0 2.1 సాక్షి, ఫ్యామిలీ (19 May 2019). "రత్నాలపల్లి". Archived from the original on 19 May 2019. Retrieved 19 May 2019. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 18 మే 2019 suggested (help)
  3. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 జనవరి 2020. Retrieved 19 January 2020.
  4. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  5. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 నవంబర్ 2018. Retrieved 19 March 2020. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  6. "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 10 January 2020.
  7. "Pavitra to hit screens on May 10". Deccan Chronicle. 10 May 2013. Archived from the original on 14 October 2016. Retrieved 28 July 2019. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  8. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.
  9. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 March 2020. Retrieved 27 March 2020.

బయటి లింకులు