ఇర్బియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Erbium,  68Er
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈɜːrbiəm/ (UR-bee-əm)
కనిపించే తీరుsilvery white
ఆవర్తన పట్టికలో Erbium
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium


Er

Fm
holmiumerbiumthulium
పరమాణు సంఖ్య (Z)68
గ్రూపుgroup n/a
పీరియడ్పీరియడ్ 6
బ్లాక్f-బ్లాక్
ఎలక్ట్రాన్ విన్యాసం[Xe] 4f12 6s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 30, 8, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1802 K ​(1529 °C, ​2784 °F)
మరుగు స్థానం3141 K ​(2868 °C, ​5194 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)9.066 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు8.86 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
19.90 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
280 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ28.12 J/(mol·K)
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1504 1663 (1885) (2163) (2552) (3132)
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు3, 2, 1 ​(a basic oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.24
అయనీకరణ శక్తులు
  • 1st: 589.3 kJ/mol
  • 2nd: 1150 kJ/mol
  • 3rd: 2194 kJ/mol
పరమాణు వ్యాసార్థంempirical: 176 pm
సమయోజనీయ వ్యాసార్థం189±6 pm
ఇతరములు
స్ఫటిక నిర్మాణంhexagonal close-packed (hcp)
Hexagonal close packed crystal structure for erbium
Speed of sound thin rod2830 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచంpoly: 12.2 µm/(m·K) (r.t.)
ఉష్ణ వాహకత14.5 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధంpoly: 0.860 µΩ·m (r.t.)
అయస్కాంత క్రమంparamagnetic at 300 K
యంగ్ గుణకం69.9 GPa
షేర్ గుణకం28.3 GPa
బల్క్ గుణకం44.4 GPa
పాయిసన్ నిష్పత్తి0.237
వికర్స్ కఠినత్వం589 MPa
బ్రినెల్ కఠినత్వం814 MPa
CAS సంఖ్య7440-52-0
చరిత్ర
పేరు ఎలా వచ్చిందిafter Ytterby (Sweden), where it was mined
ఆవిష్కరణCarl Gustaf Mosander (1842)
erbium ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోపు సమృద్ధి అర్ధ జీవితం (t1/2) క్షయం ఉత్పత్తి
160Er syn 28.58 h ε 160Ho
162Er 0.139% >1.4×1014 y (α) 158Dy
(β+β+) 162Dy
164Er 1.601% (α) 160Dy
+β+) 164Dy
165Er syn 10.36 h ε 165Ho
166Er 33.503% (α) 162Dy
167Er 22.869% (α) 163Dy
168Er 26.978% (α) 164Dy
169Er syn 9.4 d β 169Tm
170Er 14.910% >3.2×1017 y (α) 166Dy
(ββ) 170Yb
171Er syn 7.516 h β 171Tm
172Er syn 49.3 h β 172Tm
Decay modes in parentheses are predicted, but have not yet been observed
| మూలాలు | in Wikidata

మౌలిక సమాచారం[మార్చు]

ఇర్బియం ఒక రసాయనిక మూలకం. మూలకాల ఆవర్తన పట్టికలో ల్యాంథనాయిడుల శ్రేణికి చెందిన, f బ్లాకుకు చెందిన,6 వపిరియడ్‌కు చెందిన మూలకం.[1] ప్రకృతిలో ఈ మూలకం సాధారణంగా ఇతర మూలకాలఖనిజాల లతో కలిసి భూమిలో లభిస్తుంది.

చరిత్ర[మార్చు]

ఇర్బియాన్ని మొదట 1843 లో కార్ల్ గుస్తఫ్ మోసండర్ (Carl Gustaf Mosander) అను స్వేడన్ శాస్త్రవేత్త కనుగొన్నాడు.గాడో లినైట్ (gadolinite) అనే ఖనిజం నుండి ఇర్బిడియాన్ని మూడు భాగాలుగా వేరుచేసివాటికి ఇట్రియా (yttria, ఇర్బియ (erbia), టేర్బియా (terbia) అని పేర్లు పెట్టాడు.[2] ఇర్బియాన్ని మొదట స్విడనులోని ఇట్టర్బి (ytterby) అనుగ్రామంలో లభించిన ఖనిజం నుండి మొదటగా కనుగోనటం వలన, ఆ గ్రామనామం కలిసివచ్చేలా ఇర్బియం అని నిర్ణయించారు.

లభ్యత[మార్చు]

భూమి ఉపతితల పటలంలో ఇర్బియం 3.5 మి.గ్రాము /కిలో ఉండును.సముద్ర జలంలో8.7×10−7మి.గ్రాం /లీటరు[2] భూమి ఉపరితల మట్టిలో తగినంత పుష్కలంగా లభించు మూలకాలలో ఇర్బియం 45 వది. ఇర్బియం అరుదైన మృత్తిక,[3] మిగతా అరుదైన మృత్తికలవలె ఇదికూడా ప్రకృతిలో విడిగా మూలకంరూపంలో లభ్యం కాదు, కాని ఇది మోనజైట్ (monazite) ఇసుకఖనిజంలో లభించును. గతంలో ముడిఖనిజాల నుండి అరుదైన మృత్తికలను వేరుచేయ్యడం చాలా కష్ట తరంగా, అధిక ధనవ్యయంతో కూడుకున్నదై యుండేది. కాని 20 శతాబ్దిలో పరివర్తన వర్ణలేఖన విధానాన్ని (ion-exchangechromatography methods ) అభివృద్ధి పరచిన పిమ్మట, అరుదైన మృత్తిక మూలాల ను, వాటి సమ్మేళనాలను వేరుచేయ్యటం సులభతరం అయ్యింది.

భౌతిక ధర్మాలు[మార్చు]

ఇర్బియం సాధారణ ఉష్ణోగ్రత వద్ద వెండి లా తెల్లగా ఘనస్థితిలో ఉండు మూలకం. ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 68.న్యూట్రానులసంఖ్య 99.[3] పరమాణు భారము 167.257 మోల్/గ్రామ్. తటస్థ పరమాణు ఎలక్ట్రాను విన్యాసం [Xe] 4f12 6s2.[1].ఇర్బియం యొక్క సంకేత అక్షరము Er.ఇర్బియం అరుదైనమృత్తిక లోహం.ఇర్బియం యొక్క ద్రవీభవన స్థానం 1529 °C. భాష్ఫిభవన స్ధానం 2868 °C.గది ఉష్ణోగ్రత వద్ద ఇర్బియం యొక్క సాంద్రత 19.90 గ్రాములు/సెం.మీ3.[1] మూలకం ద్రవస్థితిలో ఉన్నప్పుడు సాంద్రత 18.8 గ్రాములు/సెం.మీ 3. అణువు స్పటిక నిర్మాణం అరుభుజాల సౌష్టవం కలిగియుండును. ఇర్బియం లోహం యొక్క ఉష్ణ వాహక తత్త్వం 14.5W /m −1.k −1.ఇర్బియం యొక్క పింకు రంగు Er3+ అయానులకున్న ఆప్టికల్ ఫ్లోరోసెంట్ లక్షణాలవలన దీనిని కొన్నిరకాల లేసరు అప్లికేసనులలో ఉపయోగిస్తారు.

శుద్ధమైన ఇర్బియం మెత్తని, తీగెలు, రేకులుగా సాగు లక్షణమున్నలోహం.ఇర్బియం మెత్తటి మూలకమైన ప్పటికి గాలిలో స్థిరంగా ఉంది, తతిమ్మా అరుదైన మృత్తిక లోహాలవలె కాకుండగా, నెమ్మదిగా ఆక్సీకరణ పొందును.ఈ మూలకం యొక్క లవణాలు గులాబీ రంగులో ఉండును.ఈ మూలకం మామూలు కాంతిలో, అతినీలలోహిత కాంతిలో, పరాణు కాంతిలో ఒకప్రత్యేక మైన అవశోషణ వర్ణక్రమముబంధనం కలిగి యున్నది. 19K కన్న తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఫెర్రో మాగ్నెటిక్ ధర్మాలను,19-80 K మధ్యలో అంటి ఫెర్రో మాగ్నెటిక్ గుణాలను,80 K దాటినచో పారా మాగ్నెటిక్ లక్షణాన్ని ప్రదర్శిస్తుంది.ఇర్బియం మూలకపు అణువు ప్రోపెల్లరు ఆకారపు కేంద్రీయ సమూహాసౌష్టవము కలిగి, ఇర్మియం పరమాణు లమధ్య దూరం 0.35 nm ఉండును.

రసాయనిక లక్షణాలు[మార్చు]

ఇర్బియం గాలిలో మెల్లగా ఆక్సీకరణ వరణ వలన మెరుపు తగ్గి మసక బారుతుంది. అలాగే గాలిలో త్వరగా దహనం చెంది ఇర్బియం (III) ఆక్సైడును ఏర్పరచును.

4 Er + 3O2 → 2 Er2O3

ఇర్బియం ఎలక్ట్రో ధనాత్మకత కలిగియుండి, చల్లనినీటిలో మెల్లగా, వేడినీటిలో వేగంగా చర్యలో పాల్గొని ఇర్బియం హైడ్రోక్సైడ్‌ను ఏర్పరచును.

2 Er (s) + 6 H2O (l) → 2 Er (OH) 3 (aq) + 3 H2 (g)

ఇర్బియం లోహం అన్ని హలోజనులతో రసాయనిక చర్యలో పాల్గొనును. ఇర్బియం హలోజను లవణాలను ఏర్పరచును.

2 Er (s) + 3 F2 (g) → 2 ErF3 (s) [పింకు]

2 Er (s) + 3 Cl2 (g) → 2 ErCl3 (s) [ఊదా/నీలలోహితం]

2 Er (s) + 3 Br2 (g) → 2 ErBr3 (s) [ఊదా/నీలలోహితం]

2 Er (s) + 3 I2 (g) → 2 ErI3 (s) [ఊదా/నీలలోహితం]

ఇర్బియం సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరిగిజలయోజిత ఇర్బియం ఆయానులను (Er (III) ions) ఏర్పరచును.ఇది గులాబి-ఎరుపు రంగులో ఉన్న [Er (OH2) 9]3+ హైడ్రేటేడ్ సంక్లిష్టమైన సమ్మేళనం.

2 Er (s) + 3 H2SO4 (aq) → 2 Er3+ (aq) + 3 SO2−4 (aq) + 3 H2 (g)

ఐసోటోపులు[మార్చు]

స్వాభావికంగా ప్రకృతిలో ఇర్బియం మూలకం 6 రకాల స్థిర ఐసోటోపులు 162Er, 164Er, 166Er, 167Er, 168Er, 170Er .వీటిలో 166Er ఐసోటోపు ప్రకృతి సిద్ధంగా 33.503% లభించును. ఇవికాక 29 రకాల రేడియో ధార్మికత కలిగిన ఐసోటోపులను కూడా గుర్తించారు. ఈ రేడియో ధార్మికత కలిగి న ఐసోటోపులలో ఎక్కువ స్థిరమైన రేడియో ఐసోటోపు169Er యొక్క అర్ధజీవిత కాలం 9.4 రోజులు. కాగా మిగిలిన రేడియో ఐసోటోపులలో172Er అర్ధ జీవితకాలం 49.3గంటలు, 160Er ఐసోటోపు అర్ధజీవిత కాలం 28.58గంటలు, 165Er ఐసోటోపు అర్ధ జీవితకాలం10.36 గంటలు, 171Er ఐసోటోపు అర్ధ జీవితకాలం7.516 గంటలు, తతిమ్మా రేడియో ఐసోటోపుల అర్ధజీవిత కాలం 3.5 గంటల కన్న తక్కువ.కొన్ని రేడియో ఐసోటోపుల అర్ధ జీవిత కాలం 4 నిమిషాలకన్న తక్కువ.ఇర్బియం ఇంకను 13 న్యూక్లియరు ఐసోమరులు (meta states) కలిగియుండి, అందులో ఎక్కువ స్థిరమైన 167mEr ఐసోమరు అర్ధజీవితకాలం 2.269 సెకండులు.ఇర్బియం ఐసోటోపుల పరమాణు భారం,142.9663 u (143Er) నుండి 176.9541 u (177Er) వరకు ఉన్నది

ఉత్పత్తి[మార్చు]

ErF3 ను కాల్సియంతో క్షయికరణ చెయ్యడం వలన శుద్ధమైన ఇర్బియం ఉత్పత్తి అగును[1]

2ErF3 + 3Ca → 2Er + 3CaF2

1934 వరకు శుద్ధమైన.సచ్ఛమైన (pure) ఇర్బియాన్ని ఉత్పత్తి చెయ్యలేక పోయారు.1935లో Wilhelm Klemm మరి Heinrich Bommer శాస్త్రవేత్తలు స్వచ్ఛమైన ఇర్బియం క్లోరైడును పొటాషియం తోకలిపి వేడి చెయ్యడం ద్వారా మొదటి సారిగా ఉత్పత్తి చేసారు[4][5]

ఉపయోగాలు/వినియోగం[మార్చు]

ఇర్బియాన్ని పోటోగ్రాఫిక్ ఫిల్టరులో పరాణుకురణాలను శోషించుటకు ఉపయోగిస్తారు.[5] పరమాణు పరిశోధనలలో న్యూట్రాను శోషణకడ్డిలలో ఉపయోగిస్తారు.వెనెడియం లోహంతో కలిపి మిశ్రమ దాతువుగా కలిపినచో, వెనెడియం యొక్క గట్టిదనాన్ని/కఠినత్వాన్ని తగ్గిస్తుంది.[2] పింకురంగు కలిగిన ఇర్బియంఆక్సైడునుగాజు (glass), పింగాణి, క్యూబిక్ ఈజిర్కోనియ లకు రంగును కలిగించుటకై ఉపయోగిస్తారు.ఇర్బియం కలిపిన గాజును, సన్ గ్లాసెస్, ఆభరణాలలో చౌకరకపు రంగురాళ్ళగా ఉపయోగిస్తారు. ఇర్బియం–డోపుడ్ ఫైబరు అంపి ఫైరు (EDFA) లలో ఇర్బియం డోపుడ్ ఆప్టికల్సిలికా గ్లాస్‌ఫైబరును ఉపయోగిస్తారు.

జీవ క్రియల్లో ఇర్బియం పాత్ర[మార్చు]

మానవజీవ జీవక్రియ వ్యవస్థలో ఇర్బియం యొక్క పాత్ర లేనప్పటికీ, ఈ మూలక లవణాలు జీవక్రియను ఉద్దీపనచేయును. మానవును దేహంలో ఎక్కువపాళ్ళలో ఎముక లలో ఉండును.అలాగే మూత్రపిండాలు, కాలేయంలో కూడా ఉండును.

విషప్రభావం[మార్చు]

ఇర్బియంమానవునుకి విషకారి.పొరబాటున కడుపులోకి వెళ్ళిన జీర్ణాశయంపై విష ప్రభావం కల్గించును.కాని ఇర్బియం యొక్క సమ్మేళనాలు మాత్రం విషతుల్యము కాదు. పుడి రూపంలో ఉన్న ఇర్బియం వలన అగ్ని ప్రమాదము జరుగు అవకాశమున్నది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Erbium: the essentials". webelements.com. Retrieved 2015-04-20.
  2. 2.0 2.1 2.2 "The Element Erbium". education.jlab.org. Retrieved 2015-04-20.
  3. 3.0 3.1 "Periodical Table: Erbium". chemicalelements.com. Retrieved 2015-04-20.
  4. "Erbium-History". rsc.org. Retrieved 2015-04-20.
  5. 5.0 5.1 "Erbium Element Facts / Chemistry". chemicool.com. Retrieved 2015-04-20.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇర్బియం&oldid=3901930" నుండి వెలికితీశారు