తిరువెళ్ళరై
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరువెళ్ళరై | |
---|---|
భౌగోళికాంశాలు : | 10°29′N 78°25′E / 10.49°N 78.41°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | Trichy |
ప్రదేశం: | Tamilnadu, India |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | Pundarikakshan(Vishnu) |
ప్రధాన దేవత: | Pankajavalli (Lakshmi) |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | Dravidian architecture |
తిరువెళ్ళరై (Thiruvellarai) తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చిరాపల్లి నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ దేవాలయం వైష్ణవ దివ్యదేశాలుగా ప్రసిద్ధిచెందినది.
సాహిత్యం
[మార్చు]శ్లో. తీర్దై: పుష్కల పద్మ చక్ర కుశకై స్సంశోభ మానస్థితే
రమ్యే శ్రీ మణి కర్ణి కాహ్వాయ వరాహఖ్యాత తీర్దాఞచ్‌తే |
గంధ క్షీరసు దివ్య పుష్కరిణికా యుక్తే సితాద్ర్యాహ్వయే
రాజంతం నగరేతు వెళ్లర పదే ప్రాగస్య సంస్థానగమ్ ||
శ్లో. శ్రీ మచ్చంపక వల్లికా పరిగతం శ్రీ పంగయచ్చెల్వికా
నాయక్యా విమలాకృతిం సురుచిరం వైమాన వర్యశ్రితమ్ |
మార్కండేయ శిబిక్షితీశ గరుడ క్షోణీ దృశాం గోచార
పద్మాక్షాహ్వయ మాశ్రయే కలిరిపు శ్రీ విష్ణు చిత్త స్తుతమ్ ||
పాశురం
[మార్చు] ఇన్దిరవోడు పిరమన్ ఈశన్ ఇమయవ రెల్లామ్
మన్దిర మామలర్ కొణ్డు మఱైన్దువరాయ్ వన్దు నిన్ఱార్
శన్దిరన్ మాళిగై శేరుం శదురరగళ్ వెళ్లఱై నిన్ఱాయ్
అన్దియ మ్చోదిదువాగుమ్ అழగనే ! కాప్పిడ వారాయ్.
పెరియాళ్వార్-పెరియాళ్వార్ తిరుమొழி 2-8-1
విశేషం
[మార్చు]ఈ క్షేత్రమునకు శ్వేతగిరి యనిపేరు. శిబి చక్రవర్తి ప్రార్ధనచే స్వామి పుండరీకాక్షునిగా వెలిసాడు. ఇచట స్వామికి ఇరువైపుల సూర్య చంద్రులు వింజామరలు వీస్తూ ఉంటారు. ఇచ్చట ఉత్తరాయణ-దక్షిణాయన ద్వారములు ఉన్నాయి. ఉయ్యక్కొండార్ (పుండరీకాక్షుడు) అవతార స్థలము. మీన మాసమున బ్రహ్మోత్సవం నిర్వహించబడుతుంది.
మార్గం
[మార్చు]శ్రీరంగము నుండి ఉత్తమర్ కోయిల్ మీదుగా తిరుచ్చి-ఉరయూర్ బస్ మార్గములో శ్రీరంగమున నుండి 15 కి.మీ దూరమున గలదు. బస్ దిగిన పిమ్మట 1/2 కి.మీ దూరంలో సన్నిధి ఉంది. ఏ వసతులు లేవు. శ్రీరంగము నుండి సేవించాలి.
వివరం
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
పుండరీకాక్షులు | పంగయచ్చెల్వి తాయార్ (చంపకవల్లి) | పుష్కల, పద్మ, చక్ర, కుశ, మణి కర్ణిక, వరాహ, గంద, క్షీర, పుష్కరణులు | తూర్పు ముఖము | నిలచున్న సేవ | తిరుమంగై ఆళ్వారులు, పెరియాళ్వారులు | శ్వేతాద్రి-విమలాకృతి విమానము | మార్కండేయ, శిబి, గరుడ, భూదేవులకు |
చిత్రమాలిక
[మార్చు]-
The temple entrance arch on the Trichy-Thuraiyur main road
-
Thiruvellarai Temple
-
Thiruvellarai Temple
-
Thiruvellarai Temple
-
Thiruvellarai Temple
-
Thiruvellarai Temple, innner gopuram and vimaanam
-
Thiruvellarai Temple, the huge main rajagopuram in ruins
-
Thiruvellarai Temple, the present main entrance