"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
(సమాచార పెట్టెలో జన్మ స్థలం, మరణం తేదీ సవరణ)
ట్యాగు: 2017 source edit
 
===బాల్యం, విద్యాభ్యాసం===
బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న తిరువళ్ళూరు జిల్లాలో కోనేటమ్మపేట గ్రామంలో సాంప్రదాయ శాఇవశైవ తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన [[శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి]], శకుంతలమ్మ దంపతులకు జన్మించాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/latestnews/sp-balasubrahmanyam-actor-to-singer-life-journey/0201/120112193|title=బహుముఖ ప్రజ్ఞాశాలి..ఎస్పీబీ|website=www.eenadu.net|language=te|access-date=2020-09-25}}</ref> అతని స్వగ్రామం మొదట గోల్కొండ పాలకుల ఆధీనంలో ఉండేది. ఆ తరువాత 1825 నుండి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమయ్యింది.<ref>{{Cite web|url=https://tiruvallur.nic.in/about-district/|title=Ab klout District {{!}} Tiruvallur District {{!}} India|language=en-US|access-date=2020-09-25}}</ref> అతని తండ్రి పేరొందిన హరికథా కళాకారుడు. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. తండ్రి భక్తిరస నాటకాలు కూడా వేస్తుండేవాడు. సాంబమూర్తితో ఇంట్లో పండితులు, కవులు భాషా, సాహిత్య పరమైన చర్చలు జరుపుతూంటే విని విని బాలసుబ్రహ్మణ్యానికి బాల్యం నుంచే భాషపై ఆసక్తి పెరిగింది. {{sfn|ఈటీవీ (మార్గదర్శి) బృందం|2013|loc=3:55 ని - 4:38 ని|p=}} తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది.
 
ఐదేళ్ళ వయసులో తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించాడు. ప్రాథమిక విద్య [[నగరి]] లోని మేనమామ శ్రీనివాసరావు ఇంటిలో ఉంటూ పూర్తి చేశాడు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో స్కూలు ఫైనలు చదివాడు. చదువులోనే కాక, ఆటల్లో కూడా మొదటి వాడుగా ఉండేవాడు. [[శ్రీకాళహస్తి]]<nowiki/>లో చదివేటప్పుడే జి. వి. సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు [[చెంచులక్ష్మి (1958 సినిమా)|చెంచులక్ష్మి]] సినిమాలో [[పి.సుశీల|సుశీల]] పాడిన ''పాలకడలిపై శేషతల్పమున'' అనే పాటను ఆలపింపజేసి టేపు మీద రికార్డు చేయించారు. రాధాపతి అనే మరో ఉపాధ్యాయుడు ఈయనను ''ఈ ఇల్లు అమ్మబడును'', ''ఆత్మహత్య'' లాంటి నాటకాల్లో నటింప జేశాడు. తర్వాత తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో పియుసి చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో స్త్రీ పాత్ర ధరించాడు. [[ఆకాశవాణి కేంద్రం, విజయవాడ|ఆకాశవాణి విజయవాడ కేంద్రం]]<nowiki/>లో బాలు స్వయంగా రాసి, స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది.
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3043704" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ