శ్రీకాకుళం
శ్రీకాకుళం
కళింగపట్నం శ్రీకాకుళం | |
---|---|
నగరం | |
శ్రీకాకుళం | |
Nickname(s): చికాకోల్, శిక్కోలు | |
Coordinates: 18°18′N 83°54′E / 18.3°N 83.9°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
పట్టణంగా గుర్తింపు | 1856 |
Founded by | బలరామ |
వార్డులు | 36 |
Government | |
• Type | Mayor–Council |
• Body | శ్రీకాకుళం నగరపాలక సంస్థ |
• MLA | ధర్మాన ప్రసాదరావు |
• MP | కింజరాపు రామ్మోహన నాయుడు |
విస్తీర్ణం | |
• నగరం | 20.89 కి.మీ2 (8.07 చ. మై) |
జనాభా (2011)[2] | |
• నగరం | 2,28,025 |
• Metro | 1,65,735 |
అక్షరాస్యత వివరాలు | |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 532001 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91–8942 |
వాహనాల నమోదు | AP–39 ( 2019 జనవరి 30 నుండి)[4] AP-30 (2019 జనవరి 30కు ముందు) |
శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రం.[6]ఇదే పేరుతో శాసనసభ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నాయి. ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున నది కిరువైపుల విస్తరించి ఉంది. ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు.[7]
పేరు వ్యుత్పత్తి
[మార్చు]బ్రిటిషు వారు శ్రీకాకుళం పేరును పలకలేక "చికాకోల్" అనేవారు. చికాకోల్ కు సంబంధించిన మరో కథనం ప్రకారం ఈ ప్రాంతం నైజాం ఆధిపత్యంలో ఉండే సమయంలో ఈ ఊళ్లోనే ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహిస్తూ రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు. రైతులు తాము కట్ట వలసిన పన్ను సొమ్మును విచ్చు రూపాయల రూపంలో చిన్నచిన్న గుడ్డసంచులలో పోసి, మూటకట్టి, ఆమూటను తీసికొనివచ్చి ఖుద్దున సమర్పించేవారు. ఆ మూట లోని సొమ్ము సరిగా ఉందో లేదో చూసుకోవడానికి మూటను విప్పాలి. ఆ మూటలు చాలా ఉంటున్నందువలన, ఆ మూటల మూతికట్టు విప్పమని రైతులతో చెప్పడానికి "శిఖా ఖోల్" అనేవారు. అంటే "మూతికట్టువిప్పు" అని అర్థం. ఈమాట క్రమంగా "చికా కోల్", సిక్కోలు అయి, శ్రీకాకుళంగా స్థిరపడింది అని అంటారు.[7]
భౌగోళికం
[మార్చు]శ్రీకాకుళం నగర విస్తీర్ణం 20.89 చ.కి.మీ.[5] రాష్ట్ర రాజధాని అమరావతి నుండి ఈశాన్య దిశలో 463 కి.మీ దూరంలో వుంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కలు ప్రకారం, ఈ నగర జనాభా 1,49,592. ఇందులో 74,546 మగవారు,75,046 ఆడవారు ఉన్నారు.[8] 11,001 మంది 0–6 వయసు లోపు వారు ఉన్నారు. ఇందులో 5,686 అబ్బాయిలు, 5,315 అమ్మయిలు. ఈ నగరంలో 84.62% అక్షరాస్యతతొ 96,744 మంది అక్షరాస్యులు ఉన్నారు.[9]
పరిపాలన
[మార్చు]శ్రీకాకుళం నగరపాలక సంస్థ నగర పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా
[మార్చు]జాతీయ రహదారి 16 నగరానికి సమీపంగా పోతుంది.[10] 13 కి.మీ దూరంలో శ్రీకాకుళం రోడ్ అనే పేరుతో ఆమదాలవలసలో ఉంది. 2006 లో రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ మాత్రం శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆఫీసు ఆవరణలో పెట్టారు. సమీప విమానాశ్రయం 106 కి.మీ. దూరంలో గల విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం.
విద్య
[మార్చు]ఒక మెడికల్ కాలేజి (రిమ్స్), దంత వైద్యకళాశాల ("చాపురం" గ్రామ సమీపాన), ఒక హోమియో వైద్యశాల, ఒక ఆయుర్వేద వైద్యశాల, ఒక న్యాయ కళాశాల ఉన్నాయి. ప్రైవేటు రంగంలో రాగోలు వద్ద జెమ్స్ వైద్య కళాశాల ఉంది.
వైద్యం
[మార్చు]400 పడకల జిల్లా కేంద్ర ఆసుపత్రి తో పాటు, కిమ్స్ ఆసుపత్రి ఉంది.
న్యాయ స్థానాలు
[మార్చు]నగరంలో 1. జిల్లాకోర్టు, 2. మున్సిపల్ బెంచికోర్టు ఉన్నాయి.
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]- శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లి
- ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయము - గుడి వీధి
- వెంకటేశ్వర ఆలయం (నారాయణ తిరుమల) - గుజరాతీపేట
ప్రముఖులు
[మార్చు]- స్వామి అగ్నివేష్ - సామాజిక కార్యకర్త
- మగటపల్లి వెంకటరమణమూర్తి - దాత, సమాజ సేవకుడు.
- రావిశాస్త్రి
- తంగి సత్యనారాయణ
- వడ్డాది పాపయ్య
- సోమంచి వాసుదేవరావు తెలుగు కవి, నిర్వచన సుందరకాండ సమీర సందేశం వంటి కావ్యాల రచయిత.
- లోకనాథం నందికేశ్వరరావు - మిమిక్రీ కళాకారుడు
- నందిత బన్న - మిస్ యూనివర్స్ సింగపూర్ - 2021
మూలాలు
[మార్చు]- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 8 ఆగస్టు 2016. Retrieved 23 June 2016.
- ↑ "Statistical Abstract of Andhra Pradesh, 2015" (PDF). Directorate of Economics & Statistics. Government of Andhra Pradesh. p. 44. Archived from the original (PDF) on 14 జూలై 2019. Retrieved 27 April 2019.
- ↑ "Andhra Pradesh (India): State, Major Agglomerations & Cities – Population Statistics in Maps and Charts". citypopulation.de.
- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
- ↑ 5.0 5.1 "District Census Hand Book : Vizianagaram (Part B)" (PDF). Census of India. Directorate of Census Operations, Andhra Pradesh. 2011. pp. 16, 48. Retrieved 10 June 2019.
- ↑ "District Census Handbook – Srikakulam" (PDF). Census of India. p. 27. Retrieved 18 January 2015.
- ↑ 7.0 7.1 "Srikakulam Municipality". Commissioner & Director of Municipal Administration. Municipal Administration and Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 2 December 2014. Retrieved 16 February 2015.
- ↑ "Andhra Pradesh (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
- ↑ "Srikakulam City Population Census 2011 - Andhra Pradesh". Archived from the original on 2016-04-05. Retrieved 2016-07-02.
- ↑ "National Highways Development Project Map". National Highways Authority of India. Archived from the original on 22 ఏప్రిల్ 2017. Retrieved 21 ఏప్రిల్ 2017.