శివాజిపాలెం (విశాఖపట్నం)
శివాజిపాలెం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°44′07″N 83°19′42″E / 17.735163°N 83.328361°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530017 |
Vehicle registration | ఏపి 31, 32, 33 |
శివాజిపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఒక ప్రాంతం.[1] నగరంలోని అత్యంత శివారు ప్రాంతాలలో ఇదీ ఒకటి.[2]
భౌగోళికం
[మార్చు]ఇది 17°44′07″N 83°19′42″E / 17.735163°N 83.328361°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
ఉప ప్రాంతాలు
[మార్చు]లక్ష్మీనగర్, నౌకా నగర్, రాజీవ్ నగర్, పిఠాపురం కాలనీ మొదలైనవి శివాజిపాలెంకు ఉపప్రాంతాలు.
వాణిజ్య ప్రాంతం
[మార్చు]ఈ ప్రాంతంలో చాలా చిన్న దుకాణాలు ఉన్నాయి. దీని పక్కన ఎంవిపి కాలనీ ఉంది. 16వ జాతీయ రహదారికు ఎదురుగా ఉన్న ఈ ప్రాంతంలో శివాజి పార్కు ఉంది.
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్, భవన నిర్మాణాల నుండి వస్తోంది.
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో శివాజిపాలెం మీదుగా వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, హెచ్‌బి కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్, తగరపువలస మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Shivaji Palem, Pithapuram Colony, Maddilapalem Locality". www.onefivenine.com. Retrieved 2021-05-06.
- ↑ "location". one five nine. 11 May 2017. Retrieved 22 September 2017.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 6 May 2021.