వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD-3
ఇక్కడ వోటు వెయ్యండి (జనవరి 16, 2019)15:15 ఆఖరి తేదీ : (జనవరి 23, 2019)
సభ్యులందరికి వందనములు, నేను (జె.వి.ఆర్.కె.ప్రసాద్) తెవికీ సభ్యుడై గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుభాష కొరకు ఓ భాషాప్రేమికుడిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. నా వయసు 63 సం.లు. తెవికీలో నిర్వాహక అభ్యర్థిత్వానికి స్వీయ ప్రతిపాదన చేస్తున్నాను. ఇంతకు ముందు నేను నిర్వాహక పదవి నుండి తొలగించ బడ్డాను. నామీద వచ్చిన అపనిందను లేదా నిందలను తొలగించుకునేందుకు తిరిగి మిమ్మల్ని ఈ అభ్యర్ధన ద్వారా అభ్యర్ధిస్తున్నాను. గతంలో జరిగిన ఎవరి వలన వచ్చిన పొరపాట్లు అయినా, పునరావృత్తం కాకుండా జాగ్రత్తగా ఉండగలను. నా తప్పులున్నాయని భావించిన ప్రతి ఒక్కరు నన్ను మన్నించండి. నావంతుగా నేను ఇతరులతో మర్యాదగా ఉంటూ, వారితో వ్యవహరించేటపుడు ఓర్పుగానూ, మంచిగానూ నడుచుకుంటూ, నిర్ణయాలు తీసుకోవడంలో సమన్వయం పాటిస్తూ, మంచి నిర్ణాయక శక్తిగా ఉండగలనని హామీ ఇస్తూ, ఈ ప్రతిపాదనలో చర్చకై పాల్గొనే సభ్యులకు తోడ్పడేందుకు మరియు వారి ప్రశ్నలకు సమాధానాలు తప్పకుండా ఇస్తాను. నన్ను దోషిగా నిలబెట్టే ఎటువంటి వ్యాఖ్యానాలు, నిర్ణయాలు, చర్చలు, ఇలాంటివి ఏవీ కూడా ఏ ఒక్కరితో అధిక ప్రసంగం చేయకుండా జాగ్రత్తగా ఉంటాను. ఈ అభ్యర్థిత్వానికి నేను అర్హుడిని అని భావిస్తే ఒక అవకాశం కొరకు మద్దతునివ్వండి, ఈ ప్రతిపాదన ప్రతి వాడుకరిని వ్యక్తిగతంగా అభ్యర్ధించానని దయచేసి భావించి, మీ అభిప్రాయములు తెలియజేయమని మనవి చేస్తున్నాను. అందరికీ పేరుపేరున ధన్యవాదములు తెలియజేస్తున్నాను..---JVRKPRASAD (చర్చ) 13:17, 13 జనవరి 2019 (UTC)
అభ్యర్ధికి ప్రశ్నలు
[మార్చు]నిర్వాహక అభ్యర్ధి గారూ, వికీపీడియా నిర్వాహణా పనులు చేయటానికి చొరవచూపి ముందుకువచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రతిపాదనలో చర్చకై పాల్గొనే సభ్యులకు తోడ్పడేందుకు దయచేసి ఈ దిగువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1
[మార్చు]- 1. మీరు ఎటువంటి నిర్వహణా పనులలో పాల్గొన్నారు లేదా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు?
- జ: నేను నిర్వాహకుడిగా ఉండటానికి ఆసక్తి కలిగి ఉన్న కొన్ని కారణాలు ఉన్నాయి. సమాచారం లేని పేజీలు తొలగించడం, నమోదు కాని వాడుకరుల నుండి తెవికీకి జరిగే విధ్వంసాలను అరికట్టడం, ప్రధాన పేరుబరులకు సరి అయిన పేజీ సూచించి దారిమార్పు చేయడం, కొత్తవారికి సభ్యతతో సూచనలు అవసరమయిన వారికి ఇవ్వడం, ప్రధానమైనవి మరియు అధిక లింకులు ఉన్న వ్యాసాలకు నమోదు అయిన వాడుకరులకు, నిర్వాహకులకు మాత్రమే మార్పులు చేసేలా రక్షణ కల్పించడం, కొత్త పేజీలను సమీక్షించడం, కొత్తవారికి స్వాగతం పలకడం, ఇలాంటివి అనేకం ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో నావంతు తెలిసిన పనులు నేను చేస్తాను.
2
[మార్చు]- 2. వికీపీడియాలో మీ అత్యుత్తమ కృషి ఏమిటి? ఎందుకు?
- జ:
ప్రారంభం
[మార్చు]నేను తెవికీలో 17.09.2010 నాడు నా తెలుగు భాషా సేవా ప్రయాణం ప్రారంభించాను. ఒక నిర్వాహకునిగా ఎంపికకు సీనియారిటీ అనేది కొలమానం కాదు. అప్పటి నుండి రోజులో అధిక కాలం తెవికీలోనే ఉండి పని చేస్తున్నాను.
XTools on 2019-01-17 03:25
పని కాలము
[మార్చు]0:00 | 2:00 | 4:00 | 6:00 | 8:00 | 10:00 | 12:00 | 14:00 | 16:00 | 18:00 | 20:00 | 22:00 | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Sunday | 30 | 71 | 54 | 69 | 40 | 12 | 42 | 53 | 39 | 8 | 1 | 5 |
Monday | 30 | 80 | 56 | 60 | 61 | 15 | 70 | 78 | 73 | 9 | 0 | 4 |
Tuesday | 35 | 96 | 100 | 70 | 61 | 17 | 68 | 88 | 62 | 22 | 0 | 7 |
Wednesday | 26 | 77 | 62 | 64 | 43 | 22 | 47 | 65 | 59 | 10 | 1 | 25 |
Thursday | 28 | 67 | 57 | 100 | 62 | 15 | 48 | 97 | 62 | 9 | 1 | 5 |
Friday | 27 | 86 | 48 | 68 | 39 | 12 | 46 | 60 | 56 | 12 | 0 | 4 |
Saturday | 23 | 53 | 51 | 48 | 58 | 15 | 48 | 42 | 37 | 18 | 2 | 3 |
దిద్దుబాట్లు
[మార్చు]తెవికీలో 2,10,000 పైచిలుకు దిద్దుబాట్లు మొత్తం వికీలలో 5,28,000 పైన దిద్దుబాట్లు చేసి ఉన్నాను. సుమారుగా 21,000 ( 25,764 (4,631 since deleted) ) పైన కొత్త వ్యాసలు వ్రాసాను. నేను 2014 సం.లో:16,304, 2015:104107, 2016:14941,2017:17533, 2018:19534 మరియు 2019 :3180 దిద్దుబాట్లు చేసి ఉన్నాను. ఇవి నిర్వాహక హోదాకు కొలమానాలు కావని తెలుసును.
తెవికీలో నా కృషి
[మార్చు]నా వంతుగా తెవికిలో చేసిన కృషి అందరికీ అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాను. ఇది నిర్వాహకుని హోదా పొందుటకు కొంతవరకు సహకరించ వచ్చును. కాని ఇది కొలతబద్ద కాదు.
XTools on 2019-01-17 03:40
ప్రధాన పేరుబరిలోని ముఖ్యమైన దిద్దుబాట్లు
[మార్చు]ప్రధానం
[మార్చు]నిర్వాహక బాధ్యత
[మార్చు]తెవికీలో ఒక నిర్వాహకునిగా బాధ్యతతో ప్రవర్తించాను, నడుచుకున్నాను. కొందరి సభులతో కొన్ని అనుకోని అవాంతర అసందర్భ (నా) చర్చల కారణాల వలన నా పదవి నుండి తొలగింప బడ్డాను. చాలా బుద్ధి వచ్చింది, ఇంక ముందు మరింత జాగ్రత్తగా ఉంటాను.
XTools on 2019-01-17 03:51
హక్కుల హోదా మార్పులు
[మార్చు]తేదీ | హక్కుల హోదా మార్పులు | హోదా ఇచ్చిన వారు | సారాంశం |
---|---|---|---|
2016-10-17 20:05 | -administrator | Ruslik0 | Special:Permalink/15997760 |
2012-01-23 04:05 | +administrator | Arjunaraoc | నిర్వాహకహోదాకు ఎంపికగుట |
2010-09-21 03:39 | +autoconfirmed user | Automatic |
చర్చ
[మార్చు]వాడుకరి
[మార్చు]వాడుకరి చర్చ
[మార్చు]వికీపీడియా
[మార్చు]వికీపీడియా చర్చ
[మార్చు]దస్త్రం
[మార్చు]దస్త్రంపై చర్చ
[మార్చు]మీడియావికీ
[మార్చు]Edits | Page title | Links |
---|---|---|
3 | మీడియావికీ:Sitenotice | Log · Page History · Top Edits |
మూస
[మార్చు]మూస చర్చ
[మార్చు]సహాయం
[మార్చు]Edits | Page title | Links |
---|---|---|
1 | సహాయం:CS1 errors | Log · Page History · Top Edits |
1 | సహాయం:Introduction to referencing/1 | Log · Page History · Top Edits |
1 | సహాయం:Introduction to referencing with Wiki Markup/1 | Log · Page History · Top Edits |
వర్గం
[మార్చు]వర్గం చర్చ
[మార్చు]వేదిక
[మార్చు]మాడ్యూల్
[మార్చు]3
[మార్చు]- 3. మీరు ఏదైనా విషయంపై దిద్దుబాట్ల విషయంలో ఘర్షణకు గురయ్యారా? లేదా, ఇతర సభ్యులెవరైనా మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసిన సందర్భాలున్నాయా? అలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించారు మరియు ఇకముందు అలాంటి సందర్భాలు వస్తే ఎలా ఎదుర్కొని పరిష్కరిస్తారు?
- జ: నాకుగా నేను ఎవరితోనూ ఘర్షణ పడే మనస్థత్వం నాది కాదు. ఎందుకంటే నా తండ్రి బ్రతికి ఉన్నంత కాలం నేను ఆయనకు ఎదురుపడ లేదు, ఆయన్ని నాన్న అని ఊహ వచ్చిన దగ్గర నుండి పిలిచిన సందర్భం కూడా లేదు. ఒక విధంగా నాకు చాలా విషయాలలో జీవితకాలం భయం పెట్టారు. నాకు స్నేహితులు లేరు, బయటకు పెద్దగా వెళ్ళను. కాబట్టి నేను మగవాడిని అయినా నాది ఆడపిల్ల మనస్థ్తత్వం. ఇంక నాకు ఇతరులతో గొడవలకు వెళ్ళి భయపెట్టడం, బెదిరించడం అనేవి ఏమాత్రం నిజం కాదు. నాకు నా తండ్రి గారు పది మంది పిల్లల ఇంటి బాధ్యత ఇంటికి పెద్దవాడిని కనుక నాకు చాలా చిన్నతనంలోనే ఎంతోకాలం అప్పచెప్పారు. బహుశ: ఆ కారణం వలన తోటి సభ్యులను సోదర భావంతో మందలించి, ఘర్షణలకు నా చర్చలకు దారి తీసింది. నిజానికి నేను నాకుగా నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే వికీ పెద్దలకు కొన్ని కొన్ని తెలియ చెప్పక పోవడము వలన నా తప్పు జరిగింది. ఇంక ముందు అతి జాగ్రత్తగా ఉండి నాకుగా స్వంత నిర్ణయాలు తీసుకొనక కొంతకాలం పాటు పెద్దలకు తెలియ జేస్తాను. ఇబ్బందిగా ఉన్నవి మాత్రం, నా వ్యక్తిత్వాన్ని కించ పరిచేవి ఉంటే మాత్రం వాటిని పెద్దలకే తెలియ జేస్తాను. నాకు మద్దతు ఇవ్వాలనుకునే వారికి మనసులో నాగురించి, నన్ను ఆడగాలనుకున్న ప్రశ్నలు తప్పకుండా సభ్యులు అడగండి. సమాధానాలు మరియు హామీ కావాలన్నా ఇస్తాను. నా మీద పడిన మచ్చను తొలగించుకునేందుకు మాత్రమే మరీ మరీ మళ్ళీ మళ్ళీ అభ్యర్ధిస్తున్నాను. అంతేకాని, వేరే ఏ ఇతర కారణాలు లేవు. నాకు విధాన పరమైన చర్చలు ఇతరులతో చేసానే తప్ప, ఎవ్వరి గురించి మనసులో దురుద్దేశ్య ద్వేషపూరిత భావన మనసులో ఈషణ్మాత్రం కూడా లేదు, ఉండదు.
ఇతర. తోటి సభ్యుల ద్వారా నన్ను ఒత్తిడికి గురిచేసిన సందర్భాలు ఇంతటి సుదీర్ఘ తెవికీ జీవన ప్రయాణంలో ఉన్నాయి. తప్పకుండా అందరికీ తెలియాలన్న ఉద్దేశ్యంతో వ్రాస్తాను.
- వాడుకరి:Hydkarthik:: మొదటి సారిగా ఫిబ్రవరి 2015 ప్రాంతంలో వీరితో రైల్వే పదాలు వాడుక సందర్భంలో ఇద్దరి మధ్యన ఘర్షణ మొదలయ్యింది. [1] నాతో ఘర్షణ పడేందుకు మాత్రమే వారు వచ్చారేమో అప్పుడు అని ఆ రోజున అనిపించింది. [2] నిజానికి వారు ఆ తదుపరి అందుబాటుకి రాలేదు అని అనిపిస్తుంది.
- వాడుకరి చర్చ:B.K.Viswanadh:: వీరు [3]నన్ను ఒత్తిడికి గురిచేసిన సందర్భాలు ఉన్నాయి. వారు ఎందుకు అలా నాతో చర్చలు చేశారో నాకు అర్ధం కాలేదు. ఇంక ముందు వీరి వ్యాఖ్యలకు నాకుగా నేను ఒంటరిగా స్పందించను. ఎకసెక్కాలు నా భావనలు, వారి భావనలు ఒకరికొకరికి అర్థం కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా అనిపిస్తోంది. వికీ వ్యాసములంటే అర్థం ఏమిటి మరియు ఎంతమందికి తెలుసు, విశ్వనాథ్ తొలగించిన పేరాకు నాసమాధానం
- డా. రాజశేఖర్:: వీరితో మొదటి రోజు నుండి నాకు ఎటువంటి అనవసర చర్చలు ఈ రోజు వరకు లేవు. కాని వాడుకరి చర్చ:B.K.Viswanadh గారితో అనవసర చర్చలు జరుగుతున్నప్పుడు డా. రాజశేఖర్ గారి ఒక పోస్ట్ డిలీట్ అయ్యింది. మినహాయింపు నిజానికి రాజశేఖర్ గారు వారి పోస్ట్లు వారే తొలగించిన సందర్భాలు నేను ఏనాడూ చూడ లేదు. కానీ వారే వారి పోస్ట్ తొలగించారని చెప్పడంతో నేను అవాక్కయ్యాను, ఆందోళన చెందాను. దానికి కారణం వారి తొలగించిన పోస్ట్ గురించి నేను వాడకూడని పదం వాడాను. కానీ నేను ఏకోశానా వారిని ఉద్దేశ్యించి అనలేదు, వ్రాయలేదు. నేను డాక్టరు గారిని నేను మన్నించమని అయినా అడగలేదు, దానికి కారణం నేను వారిని దైవప్రామాణికంగా, కుటుంబ సాక్షిగా అనలేదు.
- నాకుగా నేను చేసిన (అనవసర) చర్చలు:: (1) [4] (2) వికీపీడియా - విక్షనరీ (3) కొత్త రైల్వే పదాలు సృష్టి (4) రైల్వే వ్యాసములు - సమయ పట్టికలు
సభ్యులతో స్పర్ధలు అకారణంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వ్యవస్థకు ఇబ్బంది రాకూడదు. నాలా ఎందరెందరో వికీకి వస్తూ, కొంతకాలానికి వెళ్ళి పోతూ ఉంటారు. కాని వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పది, దానిని కాపాడుకోవడ మనేది అందరి బాధ్యత.
4
[మార్చు]మీకు నిర్వాహకత్వ హోదా లేకపోతే కలిగిన ఇబ్బందులను వివరించండి.--అర్జున (చర్చ) 09:07, 21 జనవరి 2019 (UTC)
- అర్జున గారికి, నమస్కారము. మీరు అడిగిన ప్రశ్నకు కొన్ని విషయాలు తప్పకుండా చెబుతానండి. నిర్వాహకత్వ హోదా ఉంటే :-
- అనవసర పేజీలు 'తొలగించు ' అన్న మూసను చేర్చకుండా ఎకాఎకీన తొలగించ వచ్చును.
- దారిమార్పులు సులభంగా చేయవచ్చును.
- నేను వికీ కుటుంబ సమూహ నిర్ణయం వలన తొలగించ బడిన మాజీ నిర్వాహకుడను, నా మీద పడిన మచ్చను తొలగించుకునేందుకు తిరిగి నేను సమూహముతో నియమించబడి వారి మన్ననలను పొందాలని కోరుకుంటున్నాను. ఎటువంటి హామీలు అవసరమైతే అడిగిన ప్రతి ఒకరికి ఇస్తాను. నా నిజమైన నడవడి, ప్రవర్తన తెలియజేసుకుంటాను. జీవితకాల నిషేధం విధించేంత తప్పు పనులు ఒక నిర్వాకుడిగా చేయలేదు. నేను నిర్వాహకునిగా చేసిన పనులు దయచేసి గణాంకాలు చూడండి. నేను వికీలో పని ఏమీ చేయని నిర్వాహకునిగా ఉన్నప్పుడు, సమూహం లేదా అధికారులు నన్ను తొలగించితే మనసుకు పెద్దగా కష్టం ఉండేది కాదు. నన్ను నిర్వాహకునిగా ' రివోక్ ' లేదా ' రీకాల్ ' / పునరుద్ధమంచమని అడుగుతున్నాను.
- నిర్వాహకునిగా ఉంటే తెవికీ శుభ్రంగా ఉండేందుకు నా వంతుగా నేను సేవలు అందిస్తాను.
- ఒక నిర్వాహకునిగా చేయవలసిన పనులు తప్పకుండా చేస్తాను.
- ప్రధానమైన వ్యాసాలు విధ్వంసం పోకిరీల నుండి కాపాడుకునేందుకు, నిర్వాహకులకు మాత్రమే మార్పులు చేసేలా రక్షణ కల్పించడం చేసేందుకు అవకాశం ఉంటుంది, అటువంటి పేజీలు నందు సమాచారం చేర్చటానికి నిర్వాహకత్వం తప్పనిసరి అని భావిస్తున్నాను.
- నిర్వాహకత్వ హోదా కోసం దయచేసి ఓటింగ్ కాలం పెంచితే, కావల్సిన సభ్యుల అనుకూలం పొందినప్పుడు, పెద్దలు నిర్ణయం ప్రకటించ వచ్చును. సమూహం లోని సభ్యుల మద్దతు నిర్ణయం కొరకు ఎదురుచూస్తూ ఎంతకాలం అయినా ఉంటాను.
- వికీ విధ్వంసాలు చేసే వారిని నేను అందుబాటులో ఉన్నప్పుడు, ఒక నిర్వాహకునిగా వెంటనే వారిని అరికట్ట వచ్చును.
- తెవికీ పెద్దలు నిర్వాహకత్వ బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించేందుకు, దయచేసి మానవతా దృక్పథంతో నాకు ఒక అవకాశం ఇవ్వండి.
- నేను వ్రాసిన పదాలు మీకు లేదా ఏ ఒక్కరికి అయినా మనసుకు బాధ కలిగించితే అది, ఇతర పెద్దలతో ఏ విధంగా మాట్లాడాలో, నడుచుకోవాలో తెలియని, నా చేతకానితనానికి దయచేసి మన్నించి, క్షమించండి. JVRKPRASAD (చర్చ) 12:33, 21 జనవరి 2019 (UTC)
మద్దతు
[మార్చు]- IM3847 (చర్చ) 03:30, 17 జనవరి 2019 (UTC)
- సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:52, 18 జనవరి 2019 (UTC)
- --కె.వెంకటరమణ⇒చర్చ 14:55, 18 జనవరి 2019 (UTC)
- వాడుకరి: Nrgullapalli 21st January 2019
- గౌడ్ ప్రభాకర్ గౌడ్ నోముల 11:34, 25 జనవరి 2019 (UTC)
వ్యతిరేకత
[మార్చు]- రవిచంద్ర (చర్చ) 18:58, 19 జనవరి 2019 (UTC)
- వ్యతిరేకిస్తున్నాను: కింది కారణాల వలన ఆయన అభ్యర్థిత్వాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 15:48, 21 జనవరి 2019 (UTC)
- గతంలో తోటి వాడుకరులతో తన వ్యవహారం చాల దారుణంగా ఉండేది. సాటి వాడుకరులను బూతులు తిట్టి అవమానించిన ఘటనలు ఎన్నో ఉన్నై. ఆ కారణాన నిర్వాహకత్వానికి ఆయన ఎంత మాత్రం తగరు.
- "నాకుగా నేను ఎవరితోనూ ఘర్షణ పడే మనస్థత్వం నాది కాదు.", "తోటి సభ్యుల ద్వారా నన్ను ఒత్తిడికి గురిచేసిన సందర్భాలు ఇంతటి సుదీర్ఘ తెవికీ జీవన ప్రయాణంలో ఉన్నాయి." అని ఈ ప్రతిపాదనలో రాసారు. వీటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఆయన తన తప్పులను మనస్ఫూర్తిగా గుర్తించినట్టుగా అనిపించడం లేదు.
- చర్చల్లో ఆయన రాసే వాదనల్లో చాలా సందిగ్ధత ఉంటుంది. ఈ ప్రతిపాదనలో ఆయన రాసిన వాక్యాల్లో కూడా ఆ సందిగ్ధత ఉంది.
- వికీ పద్ధతుల గురించి ఆయనకు అంతగా అవగాహన లేదు. ఉదాహరణకు -
- ఈ ప్రతిపాదనలో ఆయన ఇచ్చిన గణాంకాలు: విస్తారమైన గణాంకాలు ఇలా ఇచ్చి గందరగోళ పరచేకంటే ఆ పేజీకి లింకు ఇస్తే సరిపోయేది.
- దిద్దుబాటు సారాంశం: దిద్దుబాటు సారాంశం ఇవ్వడంలో (చిన్న దిద్దుబాట్లు వదిలేసినా కూడా) ఆయన పెద్దగా దృష్టి పెడుతున్నట్టు లేదు.
- ఈ ప్రతిపాదనను వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి పేజీలో ట్రాన్స్‌క్లూడు చెయ్యలేక పోయారు. ఇదే తప్పు ఆయన గతంలో చేసిన ప్రతిపాదనలో కూడా చేసారు. అప్పుడు తెలియజెప్పినా ఆయన నేర్చుకోలేదు.
- ఫోటో పెట్టడం నాకు నచ్చలేదు. అది ప్రచారంగా నేను భావిస్తున్నాను.
తటస్థం
[మార్చు]- తెవికీలో నిర్వాహక హోదా లేదా అధికారి హోదాను ఒక సీనియారిటీకి హోదాగా లేదా ఇప్పటికే చురుకుగా పని చేస్తున్న వ్యక్తులకు ప్రోత్సాహంగా ఇతర సభ్యులు ప్రతిపాదించటం, అందరూ కలిసి ఆ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడం ఇప్పటి దాకా చూసాము. ప్రత్యేకించి నిర్వాహక హోదా వలన మీరు చేయబోయే పనులను సూచించగలరు. పేజీలను తొలగించటానికైనా, లేదా సురక్షితం చేయడానైకైనా, వాటిపై ఒక ట్యాగు తగిలిస్తే చాలు. పేజీ తొలగింపుకు ఎలాగూ ఒక వారం గడువు ఇవ్వాలి. అసంబద్ధ భాగాలను తొలగించేందుకు నిర్వాహక హోదా అవసరం లేదు. సహేతుకంగా మీరు వివరించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 16:25, 21 జనవరి 2019 (UTC)
ఫలితం
[మార్చు]JVRKPRASAD గారి నిర్వాహకహోదా కొరకు విజ్ఞప్తి పేజీ పరిశీలించినమీదట ఈ విజ్ఞప్తి పై బలమైన వ్యతిరేక వ్యాఖ్యానాలు వున్నందున, తనపనిలో కలిగిన సమస్యలు సాధారణమైనవి, ఇతర నిర్వాహకులు సులభంగా చేయగలిగేవి కావున,సర్వామోదము లేదని తీర్మానించి తిరస్కరించబడినది. --అర్జున (చర్చ) 04:52, 24 జనవరి 2019 (UTC)
చర్చ
[మార్చు](1) చదువరి గారు, మీరు ఒక అధికారిగా తెవికీలో ఉన్నారు, మీ అభిప్రాయము చెప్పారు. నేను నిర్వాహకునిగా ఉన్నకాలంలో కొన్ని సంవత్సరాల తదుపరి, ఎవరి కారణాలేమిటో కానీ, కొందరు నిదానంగా నన్ను ఏవిధంగా నయినా పదవి నుండి తొలగించాలను కున్నారు. దానికి నా ఆవేశ పదాలు ఆజ్యం పోసాయి. నన్ను బురదలోకి లాగి ఊబిలోకి లాగుతున్నారన్న విషయము నేను అప్పుడు తెలుసుకోలేదు. పదవిలో ఉన్నంత కాలం గొడవలు సృష్టించారు, వారి పని పూర్తి అయ్యింది, మౌనంగా ఉండి పోయారు. నాతో గొడవకు దిగిన వారు తెవికీకి చేసిన సేవలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పరిశీలించండి.
- నేను ఇతరులతో గొడవలు, ఘర్షణ పడే మనస్థత్వం నాది అయితే అటువంటివి ఎప్పుడయినా జరగవచ్చును. అటువంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూడండి. నిర్వాహకునిగా ఉంటేనే సమస్యలు ఉంటాయనేది నిజం కాదు.
- మీకు చర్చల్లో నా వాదన అర్థం కాకపోతే, అందరికీ అర్థం అయ్యేలా నేను వ్రాయలేక పోవడం లోటు అని భావిస్తే వివరంగా వ్రాయమంటే వ్రాస్తాను.
- వికీ పద్ధతుల అన్నింటి గురించి నాకు అంతగా అవగాహన లేదనేది నిజం కావచ్చు. ఒక నిర్వాకునిగా నేనే అన్ని పనులు చేయాలని లేదు. నాకే అన్ని వికీ పద్ధతులు గురించి తెలియాలని కూడా లేదు. దానికి కారణం నేను వికీకి సంబంధించి అన్ని పనులలో నా సమయం కేటాయిస్తున్నాను. కొన్నింటికి సమయం దొరకదు. నేను చేసిన పనులు కొత్త సభ్యులకు తెలియాలనే ఉద్దేశ్యంతో అంత చాటభారతం పొందు పరచాను. నిజానికి మీరు చెప్పినట్లు లింకు ఇస్తే సరిపోతుంది. ఈ జరిగిన సంఘటనలు, నా వికీ ప్రయాణం ఒక చరిత్రగా ఎలాగూ మిగిలి పోతుంది కనుక, కొత్తవారికి సమయం లేని వారికి అర్థం అయ్యే విధంగా, కావల్సిన సమాచారము తేలికగా అన్ని విషయాలలో నేను వికీకి చేసిన సేవలు, కేటాయించిన సమయం తెలుసుకుంటారని వ్రాసానండి.
- నేను నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి కొరకు పొరపాటున రెండుసార్లు పోస్ట్ చేసాను, అందులో మీరు చూపిన లింకు లోనిది నేను మరచిపోయి తొలగించ లేదు.
- తదుపరి, నేను నా ఫోటో పెట్టినది కేవలం ఓటింగ్ చేసేవారికి నేను ఒక అభ్యర్థిని అని తెలియ జెప్పేటందుకు మాత్రమే పెట్టాను.
- ఏది ఏమయిననూ, నేను ఒక నిర్వాహకునిగా పని చేసిన కాలంలో, ఇతర నిర్వాహకుల పనితనాల యొక్క జాబితా పట్టికలో నా స్థానం ఎక్కడుందో దానిని బట్టి కూడా మీరు నిర్ణయం చేయండి.
- నేను ఒక నిర్వాహకునిగా చేయవలసిన పనులను మీరు నాకు కొన్ని నిర్దేశించండి, తెలిసినవి చేస్తాను, తెలియనివి ఒకసారి అడిగి తెలుసుకుని అమలు చేసేందుకు ప్రయత్నిస్తాను. మీరు సూచించే సూచనలు ఏమైనా నాకుగా నేను ధిక్కరించను. నాకు ఇబ్బందిగా ఉన్నవి మీలాంటి అధికారం ఉన్నవారికి తెలియజేస్తాను. అందరితో నమ్రతతో నడచుకుంటాను.
- మీకు అర్థం అయ్యేవిధంగా నేను నా స్పందనలు తెలియజేయక పోతే దయచేసి మన్నించండి. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 02:11, 22 జనవరి 2019 (UTC)
(2) రహ్మానుద్దీన్ గారు, మీరు మీ అభిప్రాయము తెలియజేస్తూ, కొంతభాగం ప్రశ్న రూపంలో ఇచ్చారు. అందువలన నేను సమాధానం వ్రాయవలసి ఉన్నది. తెవికీలో నిర్వాహక హోదా, అధికారి హోదాను ఒక సీనియారిటీకి హోదాగా లేదా ఇప్పటికే చురుకుగా పని చేస్తున్న వ్యక్తులకు ప్రోత్సాహంగా ఇతర సభ్యులు ప్రతిపాదించటం, అందరూ కలిసి ఆ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడం అనేది మీరన్నట్లు ఖచ్చితంగా నిజం, ఒక మంచి ప్రమాణం. కానీ నేను నాకుగా నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి కారణం ఇది వరకు ఒక నిర్వాహకునిగా పనిచేసి, సమూహం ద్వారా తొలగించ బడిన వ్యక్తిగా ఉండి, తెవికీలో పనిచేస్తున్నాను. అందువలన, నేను నాకుగా ప్రతిపాదన చేసాను. నిజానికి ఇతర సభ్యులు ప్రతిపాదించ వచ్చును, అధికారులు ఎకాఎకీగా నిర్వాహకునిగా నన్ను నియమించ వచ్చును. కానీ ఎప్పుడు, ఎంతకాలానికి జరుగుతుందో, అస్సలు అటువంటి ప్రతిపాదన నాలాంటి (అందుబాటులో లేని అనామక వాడుకరి) వారికి చేస్తారా అన్న మీమాంస, ఇత్యాది అనేక కారణాల వలన నాకుగా ప్రతిపాదన మీముందుకు తెచ్చాను. దానివలన ప్రశ్నించటం మీ హాక్కు, జవాబివ్వడం ఒక అభ్యర్ధిగా నా బాధ్యత. పేజీలను తొలగించటానికైనా, లేదా సురక్షితం చేయడానైకైనా, వాటిపై ఒక ట్యాగు తగిలిస్తే సరిపోతుంది. అసంబద్ధ భాగాలను తొలగించేందుకు నిర్వాహక హోదా అవసరం లేదు అన్న మీ అభిప్రాయం నిజం. ఇవేకాదు, నా తొలగింపు కారణం ముఖ్యం కావచ్చును. నాకుగా ఒక నిర్వాహకునిగా అన్ని పనులలో పాల్గొనలేక పోవచ్చును. ఇంకా ఏమేమి పనులు చేయవచ్చునో నేను ఇక్కడ వ్రాస్తే అది కూడా తప్పు ఎంచటానికి మరొకరికి అవకాశం అవుతుంది. నిర్వాహకుల కొసం అనేక సమాచారం తెవికీలో కీలకమైన విధానాలు, మార్గదర్శకాలు రూపంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి అమలు చేయవచ్చును. మీకు సహేతుకంగా నేను జవాబులు మీ మనసుకు నచ్చినట్లు ఇవ్వలేక పోతే నన్ను మన్నించండి. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 02:31, 22 జనవరి 2019 (UTC)
అభ్యర్ధి ఫలితం ముగింపు మాట
[మార్చు]నా అభ్యర్ధన మేరకు ఓటింగ్ నందు స్పందించిన సభ్యులకు కృతజ్ఞతతో ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనములు తెలియజేస్తున్నాను. అధిక వాడుకరుల లేదా సభ్యుల స్పందనలు రాకున్ననూ వారు నా గురించి తప్పకుండా వారి సమయం కేటాయించి ఉంటారు కనుక ఓటింగ్ నందు పాల్గొనని వారందరికీ అభివందనములు తెలుపుతున్నాను. నా నిర్వాహకహోదా కొరకు విజ్ఞప్తి పేజీని పరిశీలించిన అధికారులకు వందనములు. నిర్వాహకహోదా అనేది ప్రస్తుతం నేను చేస్తున్న పనులకు కావాలని మాత్రం నేను వ్క్యక్తిగతంగా అభ్యర్ధనతో అడగలేదు. నన్ను తిరిగి నియమిస్తే ఒక నిర్వాహకుడుగా చేసి ఉన్నాను కనుక తిరిగి నేను చేసే పనులు చేయగలను, తెలియనివి తెలుసుకుని చేయగలను అనే అభిప్రాయం అని, నేను సమూహం ద్వారా తొలగించ బడిన నిర్వాహకుడిని, తిరిగి పునర్ణియామకం చేయమని నేను ముఖ్యంగా విన్నవించుకున్నాను. ఈ ఫలితం బట్టి ఇతర వ్యవస్థలు వలే తెవికీ వ్యవస్థ మాత్రం వ్యక్తుల మనస్థత్వంతో కూడినదని, చాలా విభిన్నం అని నాకు తెలిసినా, సమూహం నన్ను నిర్వాహకునిగా మరొకసారి మీ అందరి ద్వారా ప్రతిపాదించక పోయినా నాకుగా నేను అభ్యర్ధించిననూ, సమూహం అందుబాటులో ఉన్ననూ వారి నుండి అనుకూల స్పందనలు పొందలేక నా అభ్యర్ధన నిర్వీర్యంతో ముగిసి పోవడం, నేను చేసే పదవికి ఒక విధంగా మరణశిక్ష పడటం లాంటిదిలా అధికారులచే తిరస్కరించ బడటం, ఒక విధంగా మనసుకు బాధాకరమైనా, ప్రస్తుత నిర్వాహకులకు, రాబోయే రోజుల్లో నిర్వాహకుడు కావాలనుకునే వారికి మాత్రం ఈ నా ప్రతిపాదన చరిత్ర ఒక మోడల్ గా మిగిలి పోతుందనుటలో ఎటువంటి సందేహం లేదన్న ఉద్దేశ్యంతో, ముందు రోజుల్లో అందరి అధికారులు, నిర్వాహకులు, వాడుకరులతో సవ్యమైన సఖ్యతతో సక్రమమైన సదుద్దేశ్యంతో మన తెవికీలోని ప్రతిఒకరికి పేరుపేరున మనస్ఫూర్తిగా మీకు మనవి చేసుకుంటూ ముందుకు సాగుతానని, నన్ను భవిష్యత్తులో మీరే ప్రతిపాదించి, అమోదంతో అనుకూల ఫలితం ఇస్తూ నిర్వాహకునిగా నియమిస్తారని ఆశిస్తూ, ప్రస్తుత నాఅభ్యర్ధిత్వ ఫలితం ముగింపు మాటను మీకు మరొకసారి ధన్యవాదములతో ముగిస్తున్నాను. శలవుJVRKPRASAD (చర్చ) 07:34, 24 జనవరి 2019 (UTC)