ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం | |
---|---|
భౌగోళికాంశాలు: | 22°14′46″N 76°09′01″E / 22.24611°N 76.15028°E |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | మధ్యప్రదేశ్ |
ప్రదేశం: | మధ్యప్రదేశ్, భారతదేశం |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | ఓంకారేశ్వరుడు (శివుడు) |
వెబ్‌సైటు: | http://www.shriomkareshwar.org |
ఓంకారేశ్వరం (హిందీ: ओंकारेश्वर) భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖాండ్వా జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో Mortakka నుండి సుమారు 12 మైళ్లు (20 కి.మీ.) దూరంలో వుంటుంది. ఓంకారేశ్వర రివర్ నర్మదా ఏర్పడుతుంది. ఈ నది భారతదేశంలోని నదుల్లో పవిత్రమైన నది, ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్ట ప్రాజెక్టులో ఒకటి ఇక్కడ ఉంది. రెండుకొండల మధ్య నుండి ప్రవహించే నర్మదా నది, ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుండి చూస్తే ‘’ఓం ‘’ఆకారం గా కని పిస్తుందిట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు. ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం అని రాయబడి ఉంటుంది.
ఇక్కడి ప్రధాన దైవం శివుడికి అంకితం హిందూ మతం ఆలయం. ఇది శివున్ని గౌరవించే జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. ఇది నర్మదా నదిలో Mandhata లేదా పురి అని ఒక ద్వీపంలో ఉంది; ద్వీపం ఓం ఆకారంలో హిందూ మతం చిహ్నంగా ఉంటుంది అని చెప్పబడుతుంది. ఇక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి, ఓంకారేశ్వరం అని ఒకటి (దీని పేరు "లార్డ్ ఓంకార "), అమరేశ్వర్ అని ఇంకోకటి (దీని పేరు "ఇమ్మోర్టల్ లార్డ్" లేదా "ఇమ్మోర్టల్స్ లేదా దేవతలు ప్రభువు" అర్థం). కానీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ప్రకారం, మమలేశ్వర్ అనే జ్యోతిర్లింగం నర్మదా నదికి ఇతర వైపు ఉంటుంది.
మధ్య ప్రదేశ్ లో నర్మదా నదీ తీరాన ఓంకార జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఉజ్జైన్ కు సుమారు రెండు వందల కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి శివ లింగం ‘’భాణలింగం ‘’. నర్మదానదిలో లభించిన భాణలింగం అత్యుత్తమమైనదని శివపురాణం చెప్పింది. అన్ని నదులూ తూర్పు దిశగా ప్రవిహించి సముద్రం లోకలిస్తే, నర్మదా నది పడమర గా ప్రవహించి అరేబియా సముద్రం లో కలవటం విశేషం. అదీ ఈక్షేత్ర ప్రశస్తి. ఉజ్జైన్ దేవాలయం లో కింద శ్రీ మహా కాలేశ్వరుడు, పైన ఓంకారేశ్వరుడు ఉంటారు. కానీ ఓంకారేశ్వరంలో కింద ఓంకారేశ్వరుడు, పైన మహా కాలేశ్వరుడు ఉండటం విచిత్రం. గుడి నాలుగు అంతస్తులుగా ఉంటుంది. కింద ఓంకారేశ్వరుడు, మొదటి అంతస్తులో మహా కాలేశ్వరుడు ఉండగా మిగిలిన అంతస్తులలో ఉప ఆలయాలు ఉంటాయి. శివుడు అమ్మవారి విగ్రహాలు ఇందులో ఉన్నాయి. నర్మదానది నర్మదా, కావేరికా అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తోంది. ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివ పురి మాం దాత్రు పురి అని పిలుస్తారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉందట. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుందని భావిస్తారు.
పురాణ గాథ
సూర్య వంశానికి మాంధాత రఘు వంశ మూల పురుషుడు. మాంధాత ఇక్కడేపర్వతం పై తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొన్నాడు. స్వామి అనుగ్రహం తో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు. ఈ పర్వతంమీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారంలో ఉండే ఓంకారేశ్వర్ దేవాలయం ప్రణవం పై సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తోంది. దగ్గరలో విష్ణుపురి బ్రాహ్మ పురి కొండలున్నాయి. వాటి మధ్య నుంచి కపిల ధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది. ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రం లో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు వింధ్యుడీ పూజని గ్రహించాడు. తనలో రత్న మాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వం గా మహర్షితో అన్నాడు. ’’నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే.ళమేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి ‘’అన్నాడు. సిగ్గుపడ్డ వింధ్యుడు శివునికోసం ఆరు నెలలు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుని చూడగానే మనో బాధలు పోయాయి. తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపొమ్మని శివుని వేడుకొన్నాడు. సంతోషించిన శివుడు ప్రణవాకారాంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిర పడిపోయి భక్తుల అభీష్టాలను నేర వేరుస్తున్నాడు. ఓంకారేశ్వరుడని, పార్దివాకారంలో అమలేశ్వరుడని రెండు పేర్లతో ఈ జ్యోతిర్లిన్గాన్ని అర్చిస్తారు.
ఓంకార క్షేత్రం లోనే ఆది శంకరాచార్యులవారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఈయన గురువు గారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధరించారు. ఇక్కడి గౌరీ సోమనాధ మందిరంలో శివ లింగ దర్శనం చేస్తేపునర్జన్మ ఉండదని విశ్వాసం. రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయట. అందరూ గర్భాలయం చేరి అభిషేకం చేయవచ్చు.
మమలేశ్వర జ్యోత్రిర్లింగం
నర్మదా నదీ తీరంలో శ్రీ మమలేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం ఓంకారేశ్వర్ కు ఎదురుగా ఉంటుంది. ఇక్కడ సహస్ర శివ లింగ పూజ ప్రత్యేకం, అభిషేకం మనమే చేసుకోవచ్చు, శివ లింగం వెనుక పార్వతి అమ్మవారు ఉంటారు. ఒకప్పుడు నారదుడి ప్రేరేపణతో వింధ్య పర్వతం శివుడి గూర్చి తపస్సు చేసి అనుగ్రహించబడి దేవతల కోరికపై ఇక్కడే మామలేశ్వరుడిగా ఉండి పోయాడు. వరగర్వంతో వింధ్య పర్వతం మేరువును దాటి గర్వంగా పెరిగి పోయింది. సూర్యుడు ఉత్తర దిశలోనే ఉండిపోయాడు దక్షిణ భాగం అంతా అధికారంతో నిండిపోయింది. దేవతలు విష్ణువును ప్రార్థించారు వింధ్య గర్వం హరిన్చాటానికి అతని గురువు అగస్త్య మహర్షికి మాత్రమేసాధ్యమని చెప్పి కాశీ పంపాడు. మహర్షిని ప్రార్థించి వింధ్య గర్వాపహరణం చేయమన్నారు సరేనన్న మహర్షి కాశీ విశ్వనాథుని వదలలేక వదలలేక వింధ్య పర్వతం సమీపించి దక్షిణానికి ప్రయాణమైనాడు. శిష్యుడు వంగిగురువుకు నమస్కరించాడు తానూ దక్షిణ దేశానికి వెళ్తున్నానని తిరిగి వచ్చే దాకా అలాగే ఉండి పొమ్మని శిష్యుడిని శాసించాడు. అప్పటి నుండి అలానే వింధ్య పర్వతం ఉంది ఇక్కడే వింధ్య పర్వత గర్వాపహరణం జరిగిందన్నమాట.
రవాణా
[మార్చు]ఈ పుణ్యక్షేత్రానికి చేరడానికి పూర్తిగా నర్మదా నదిపై స్టీమ్ బోట్లు, రెండు ఒడ్డులను అనుసంధానించే వంతెనలు ఉన్నాయి. ఎయిర్: ఓంకారేశ్వరం దగ్గరగా విమానాశ్రయాలు ఇండోర్ (77 కి.మీ.), ఉజ్జయినీ (133 కి.మీ.) నగరాలలో ఉన్నాయి. దీనికి సమీపంలో వున్న రైలు స్టేషను ప్రధాన మైనది కాదు. వెస్ట్రన్ రైల్వే యొక్క రత్లాం-ఖాండ్వా విభాగం ఓంకారేశ్వర రోడ్డుకు (12 కి.మీ.) దూరంలో ఉంది. ఢిల్లీ, ముంబైకి కనెక్ట్ చేసే ఇతర సమీప రైల్వే స్టేషను ఇండోర్లో (77 కి.మీ.) ఉంది. రోడ్: ఓంకారేశ్వర మధ్యప్రదేశ్ లోని ప్రధాన పట్టణాలు, నగరాలకు కలపబడింది. ఓంకారేశ్వర నుండి ఉజ్జయినీ (133 కి.మీ.), ఇండోర్ (77 కి.మీ.), ఖాండ్వా (61 కి.మీ..), ఓంకారేశ్వర రోడ్ (12 కి.మీ.) నుండి బస్సు సర్వీసెస్ ఉన్నాయి. బస్సు ద్వారా, ఇది ఖాండ్వా రైల్వే స్టేషను నుండి ఓంకారేశ్వర 2.5 గంటలు పడుతుంది. ఖాండ్వా శివారులో రోడ్ ఎడమవైపు, ఓంకారేశ్వరకు ప్రయాణిస్తుండగా మీరు ప్రముఖ గాయకుడు, కిషోర్ కుమార్ స్మారక చిహ్నాన్ని చూడవచ్చు.
గ్యాలరీ
[మార్చు]-
మమలేశ్వర్ ఆలయం
-
ఓంకరేశ్వర్ ఆలయంలో శిల్పం
-
Sculpture at Omkareshwar Temple
-
మమలేశ్వర్ జ్యోతిర్లింగ
-
ఆలయ పుణ్యక్షేత్రాలలో ఒకటి
-
నర్మదా నది దృశ్యం
మూలాలు
[మార్చు]నోట్సు
[మార్చు]- Chaturvedi, B. K. (2006), Shiv Purana (First ed.), New Delhi: Diamond Pocket Books (P) Ltd, ISBN 81-7182-721-7
- Eck, Diana L. (1999), Banaras, city of light (First ed.), New York: Columbia University Press, ISBN 0-231-11447-8
- Gwynne, Paul (2009), World Religions in Practice: A Comparative Introduction, Oxford: Blackwell Publication, ISBN 978-1-4051-6702-4.
- Harding, Elizabeth U. (1998). "God, the Father". Kali: The Black Goddess of Dakshineswar. Motilal Banarsidass. pp. 156–157. ISBN 978-81-208-1450-9.
- Lochtefeld, James G. (2002), The Illustrated Encyclopedia of Hinduism: A-M, Rosen Publishing Group, p. 122, ISBN 0-8239-3179-X
- R., Venugopalam (2003), Meditation: Any Time Any Where (First ed.), Delhi: B. Jain Publishers (P) Ltd., ISBN 81-8056-373-1
- Vivekananda, Swami. "The Paris Congress of the History of Religions". The Complete Works of Swami Vivekananda. Vol. 4.
ఇతర లింకులు
[మార్చు]- Official Website
- ఓంకరేశ్వర్ హెల్ప్ డెస్క్
- Jyotirlinga Virtual Darshan
- http://www.templenet.com/Madhya/Omkareshwar.htm
- Omkareshwar and Vindhya Mountain
- http://www.narmada.org/ Archived 2019-05-07 at the Wayback Machine
- Omkareshwar temple and Parikrama Archived 2010-01-20 at the Wayback Machine
- http://www.omkareshwar.org/
- Travel guide and lockdown udate Archived 2021-04-28 at the Wayback Machine