నీలగిరి (బ్లూ మౌంటెన్) ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీలగిరి (బ్లూ మౌంటెన్) ఎక్స్‌ప్రెస్/நீலகிரி அதிவிரைவு வண்டி/नीलगिरि(नील माउंटेन) एक्सप्रेस
దస్త్రం:Nilgiri Express at Chennai Central Station.jpg
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్టు
స్థానికతతమిళనాడు
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ రైల్వే మండలం
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను
ఆగే స్టేషనులు7
గమ్యంమెట్టుపాలయం కోయంబత్తూరు
ప్రయాణ దూరం530 km (330 mi)
సగటు ప్రయాణ సమయం09గంటల 10నిమిషాలు
రైలు నడిచే విధంప్రతీరోజూ
సదుపాయాలు
శ్రేణులుAC 1 Tier, AC 2 Tier, AC 3 Tier, Sleeper 3 Tier, Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలులేదు
సాంకేతికత
వేగం58 km/h (36 mph) average with halts Maximum speed : 110 kmph
మార్గపటం
Nilagiri (Blue Mountain) Express Route map

నీలగిరి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, దక్షిణ రైల్వే మండలం ద్వారా నడుపుతున్న ఎక్స్‌ప్రెస్.ఈ ఎక్స్‌ప్రెస్ ను బ్లూ మౌంటెన్ ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు.ఈ రైలు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుండి మెట్టుపాలయం వరకు ప్రయాణిస్తుంది.

చరిత్ర[మార్చు]

కోయంబత్తూరు జిల్లాలో గల నీలగిరి కొండల పేరుమీదుగా ఈ రైలుకు నీలగిరి (బ్లూ మౌంటెన్) ఎక్స్‌ప్రెస్ గా పేరు పెట్టారు.నీలగిరి ఎక్స్‌ప్రెస్ (బ్లూ మౌంటైన్ ఎక్స్‌ప్రెస్) మెట్టుపాలయాన్ని రాష్ట్ర రాజధాని చెన్నైతో కోయంబత్తూర్ మీదగా కలుపుతుంది.ఇక్కడ నుండి ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కోటగిరి, మెట్టుపాలయం, కోనూర్ పర్యాటకులను చేర్చడానికి ఇక్కడ నుండి నీలగిరి మౌంటెన్ రైల్వే ఊటీ వరకు ఒక నారో రైలు మార్గంలో ఒక పాసింజర్ రైలును నడుపుతున్నది. దీనినే "నీలగిరి ప్యాసింజర్" అని పిలుస్తారు. ఇది ఆసియాలో ఉన్న ఏకైక రాక్, పినియన్ రైల్వేగా గుర్తింపు పొందింది.

ప్రయాణ మార్గం[మార్చు]

నీలగిరి ఎక్స్‌ప్రెస్ కోయంబత్తూరు వద్ద తన ప్రయాణిదిశను మార్చుకుంటుంది.

జోన్, డివిజన్[మార్చు]

నీలగిరి ఎక్స్‌ప్రెస్ దక్షిణ రైల్వే మండలానికి చెందింది.

వేగం[మార్చు]

12671/71 నీలగిరి ఎక్స్‌ప్రెస్ మొత్తం 530 కిలోమీటర్ల దూరం అధిగమించడానికి 09గంటల 10నిమిషాలు తీసుకుంటుంది.ఈ రైలు యొక్క సరాసరి వేగం గంటకు 58కిలోమీటర్లు. ఇది గంటకు 55 కి.మీ. / గం. పైన నడుస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు, సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.

కోచ్ల కూర్పు[మార్చు]

12671/71 నీలగిరి ఎక్స్‌ప్రెస్ లో 1మొదటి తరగతి ఎ.సి భోగి,2 రెండవ తరగతి ఎ.సి భోగీలు,6 మూడవ తరగతి ఎ.సి భోగీలు,10 స్లీపర్ క్లాస్ భోగీలు,3జనరల్ భోగీలు లతో కలిపి మొత్తం 24 భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
SLR జనరల్ ఆర్.ఎం.ఎస్ A2 A1 హెచ్.ఎ1 బి1 బి2 బి3 బి4 బి5 బి6 ఎస్10 ఎస్9 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 జనరల్ SLR Loco Icon.png

సమయ సారిణి[మార్చు]

సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 MAS చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభం 21:05 0.0 1
2 AJJ అరక్కోణం 22:03 22:05 2ని 68.1 1
3 KPP కాట్పాడి 22:53 22:05 2ని 129.1 1
4 SAT సేలం 01:47 01:50 3ని 334.0 2
5 ED ఈరోడ్ 02:47 02:50 3ని 393.7 2
6 TUP తిరుప్పూర్ 03:33 03:35 2ని 444.0 2
7 CBF ఉత్తర కోయంబత్తూరు 04:18 04:20 2ని 491.5 2
8 CBE కోయంబత్తూరు 05:00 05:15 15ని 494.5 2
9 MTP మెట్టుపాలయం 06:15 గమ్యం 530.3 2
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 MTP మెట్టుపాలయం ప్రారంభం 19:45 0.0 1
2 CBE కోయంబత్తూరు 20:30 20:55 25ని 35.8 1
3 TUP తిరుప్పూర్ 21:33 21:35 2ని 86.3 1
4 ED ఈరోడ్ 22:25 22:30 5ని 136.6 1
5 SAT సేలం 23:25 23:30 5ని 196.3 1
6 KPP కాట్పాడి 02:23 02:25 2ని 401.2 2
7 AJJ అరక్కోణం 03:13 03:15 2ని 462.2 2
8 PER పెరంబూరు 04:08 04:10 2ని 525.3 2
9 MAS చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను 05:05 గమ్యం 530.8 2

ట్రాక్షన్[మార్చు]

నీలగిరి ఎక్స్‌ప్రెస్ కు రాయపురం లోకోషెడ్ ఆధారిత WAP-7/ఈ రోడ్ లోకోషేడ్ ఆధారిత WAP-4 లోకోమొటివ్లను ఉపయోగిస్తున్నారు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]