వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 90
← పాత చర్చ 89 | పాత చర్చ 90 | పాత చర్చ 91 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2023-10-06 : 2024-01-18
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
రచ్చబండ లో కొన్ని విభాగాలు : ప్రతిపాదనకోసం - చర్చ
[మార్చు]ప్రపంచ కప్పు - 2023 ప్రపంచ కప్పు! ఎక్కడుంది తప్పు, ఏంచెయ్యాలో చెప్పు!!
[మార్చు]మనకు క్రికెట్ ప్రపంచ కప్ గురించిన సాధారణ సమాచారం గురించి ఒక పేజీ, 2023 క్రికెట్ ప్రపంచ కప్ గురించి మరొక పేజీ ఉన్నాయి. నిన్న, ప్రపంచ కప్ మొదలైన రోజున, "క్రికెట్ ప్రపంచ కప్" పేజీకి 2,156 పేజీవ్యూలొచ్చాయి (మొన్నటి దాకా రోజుకు పాతిక, ముప్పై కంటే లేవు). "2023 క్రికెట్ ప్రపంచ కప్" పేజీకి మాత్రం నిన్న 155 పేజీవ్యూలే వచ్చాయి. ఈ లింకు చూడండి. పాఠకులు చూడదలచిన పేజీ "2023 క్రికెట్ ప్రపంచ కప్" అనేది సుస్పష్టం. వాళ్ళు చూడదలచిన పేజీ తెవికీలో ఉంది. కానీ అది ఉందని పాఠకులకు తెలియలేదు. ఏం చెయ్యాలి చెప్మా!?
ఇలా జరుగుతుందేమోనని ఊహించి (గతంలో "2022 ఫిఫా ప్రపంచ కప్" పేజీలో నాకీ అనుభవం ఉంది), క్రికెట్ ప్రపంచ కప్ పేజీలో పైన ఒక "ఇతర వాడుకలు"లో ఒకటి, కింద "ఇవి కూడా చూడండి" విభాగంలో ఒకటీ - రెండు లింకులు "2023 క్రికెట్ ప్రపంచ కప్" పేజీకి ఇచ్చాను. అయినా ఇలా జరిగింది. ఇవ్వాళ మధ్యాహ్నం ఏం చేసానంటే-
- ప్రవేశికలో కూడా మరొక లింకు ఇచ్చాను.
- పైన అయోమయ నివృత్తి మరింత స్ఫుటంగా కనబడేలా పెట్టాను.
- "క్రికెట్ ప్రపంచ కప్ 2023" అనే దారిమార్పు పేజీని సృష్టించాను
వీటివలన ఫలితమేమైనా ఉంటుందేమో చూడాలి.
మనం పాఠకులను సరైన పేజీకి పంపడం లేదనేది మాత్రం స్పష్టం. అందుకోసం ఇంకా ఏమైనా చెయ్యాలా? ఒక ఆలోచన ఏంటంటే -
- "క్రికెట్ ప్రపంచ కప్" పేజీని వేరే పేజీకి (ఉదా: "క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర") తాత్కాలికంగా తరలించాలి.
- "క్రికెట్ ప్రపంచ కప్" అనే పేజీని "2023 క్రికెట్ ప్రపంచ కప్" అనే పేజీకి దారిమార్పు చెయ్యాలి.
- ప్రపంచ కప్ పోటీలు ముగిసాక ఈ పేజీలను మళ్ళీ యథాతథ స్థితికి తీసుకుపోవాలి.
ఇది ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. కానీ, ఇలా చెయ్యడం సరో కాదో, సముచితమో అనుచితమో ఆలోచించాలి. దీన్ని ఉదాహరణగా తీసుకుని భవిష్యత్తులో స్పష్టంగా అనుచితంగా ఉండే వేరే దారిమార్పులను చూడాల్సి వస్తుందేమో తెలీదు. ఈ విషయమై అభిప్రాయాలు, వేరే సూచనలూ చెప్పగలరు.
పోతే, ఇతర భాషల్లో పేజీవ్యూల ధోరణి ఎలా ఉందో చూసాను-
- ఇంగ్లీషులో రెండు పేజీలకూ వ్యూలు పెరిగాయి. 2023 పేజీకి బాగా పెరిగాయి.
- హిందీ బెంగాలీల్లో కూడా అలాగే రెండూ పెరిగాయి, 2023 పేజీకి బాగా పెరిగాయి.
- తమిళంలో, మనంత అన్యాయం కాదుగానీ, మన పరిస్థితే ఉంది.
- మరాఠీ, పంజాబీల్లో రెండూ పెరిగాయి, కానీ 2023 కు కొద్దిగా తక్కువగా ఉన్నాయి.
- మలయాళంలో చాలా బాగా ఉంది. 2023 పేజీకి విపరీతంగా పెరిగాయి.
- కన్నడంలో 2023 పేజీ చప్పగా పడి ఉండగా, "ಐಸಿಸಿ ಕ್ರಿಕೆಟ್ ವಿಶ್ವ ಕಪ್" అనే పేజీకి వ్యూలు ఊహాతీతంగా పెరిగిపోయాయ్. ఇంతకీ వాళ్ళకు ఉత్త "ಕ್ರಿಕೆಟ್ ವಿಶ್ವ ಕಪ್" అనే పేజీయే లేదసలు. దారిమార్పుగా కూడా లేదు.
తెలుగు, తమిళం, కన్నడం, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, పంజాబీల్లో పేజీల పేర్లు "2023 క్రికెట్ ప్రపంచ కప్" రూపంలో ఉండగా, మరాఠీ, మలయాళం పేర్లు "క్రికెట్ ప్రపంచ కప్ 2023" రూపంలో ఉన్నాయి. ఇవ్వాళ "క్రికెట్ ప్రపంచ కప్ 2023" అనే దారిమార్పు పేజీ సృష్టించాం కాబట్టి ఏమైనా మారుతుందేమో చూడాలి. లేక... అసలు ఈ ప్రపంచ కప్ పేజీపై ఆసక్తి మొదటి మ్యాచ్ వరకే పరిమితమా!? చూద్దాం.__ చదువరి (చర్చ • రచనలు) 15:21, 6 అక్టోబరు 2023 (UTC)
- క్రికెట్ ప్రపంచ కప్ పేజీకి మొదటి రోజు మాత్రమే ఉన్నవి, తరువాత 6, 7 తేదీలలో వరుసగా 145, 143 మాత్రమే ఉన్నాయి.అలాగే 2023 క్రికెట్ ప్రపంచ కప్ పేజీకి తరువాత 6, 7 తేదీలలో వరుసగా 105, 118 మాత్రమే ఉన్నవి.దీనిని బట్టి వారికి సంవత్సరంతో పనిలేదు.క్రికెట్ ప్రపంచ కప్ అంటే 2023 దే అని వారి అభిప్రాయం కాబోలు అని అర్థం చేసుకోవాలి.కానీ దానికి సర్చ్ చేసినా ఈ పేజీని కూడా గూగుల్ చూపిస్తుందికదా!అంత పరిశీలించి, ఈ పేజీ చూచే ఒపిక లేదోమో అని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 08:17, 8 అక్టోబరు 2023 (UTC)
== Opportunities open for the Affiliations Committee, Ombuds commission, and the Case Review Committee ==
[మార్చు]You can find this message translated into additional languages on Meta-wiki.
More languages • Please help translate to your languageHi everyone! The Affiliations Committee (AffCom), Ombuds commission (OC), and the Case Review Committee (CRC) are looking for new members. These volunteer groups provide important structural and oversight support for the community and movement. People are encouraged to nominate themselves or encourage others they feel would contribute to these groups to apply. There is more information about the roles of the groups, the skills needed, and the opportunity to apply on the Meta-wiki page.
On behalf of the Committee Support team,
A2K Monthly Newsletter for September 2023
[మార్చు]
Please feel free to translate it into your language.
Dear Wikimedians,
In September, CIS-A2K successfully completed several initiatives. As a result, A2K has compiled a comprehensive monthly newsletter that highlights the events and activities conducted during the previous month. This newsletter provides a detailed overview of the key information related to our endeavors.
- Conducted events
- Learning Clinic: Collective learning from grantee reports in South Asia
- Relicensing and Digitisation workshop at Govinda Dasa College, Surathkal
- Relicensing and Digitisation workshop at Sayajirao Gaekwad Research Centre, Aurangabad
- Wiki Loves Monuments 2023 Outreach in Telangana
- Mula Mutha Nadi Darshan Photography contest results and exhibition of images
- Train The Trainer 2023
Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 15:52, 10 అక్టోబరు 2023 (UTC)
తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం
[మార్చు]తెలుగు వికీపీడియా వార్షికోత్సవం గురించిన చర్చను గత నెలలో తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ యూజర్ గ్రూప్ సెప్టెంబరు 2023 సమావేశంలో చర్చించినప్పుడు దశాబ్ది ఉత్సవాలు, 11వ వార్షికోత్సవం చేసినప్పుడు ఎక్కడైనా ఒక తెలుగు నగరంలో తెలుగు వికీమీడియన్లు కలిసి గత ప్రగతిని, భవిష్యత్ వ్యూహాలనూ చర్చిస్తూ, నైపుణ్యాలు పెంచుకుంటూ, ఒకరి గురించి ఒకరు తెలుసుకునేలా చేస్తే బావుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయంలో ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేద్దామన్నది తెలుగు వికీపీడియా రచ్చబండలో ఇప్పుడు చర్చకు పెడుతున్నాను. ఈ అంశంపై దయచేసి మీ అభిప్రాయాన్ని పంచుకోగలరు. పవన్ సంతోష్ (చర్చ) 04:12, 11 అక్టోబరు 2023 (UTC)
- తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించి చర్చకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు @Pavan santhosh.s గారు. 2013లో తెవికీ ఉగాది మహోత్సవం హైదరాబాద్‌లోనూ, 2014లో విజయవాడలోని కేబీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలోనూ, 2015లో తిరుపతిలోని ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్‌లోనూ, ఆ తరువాత పలు వికీ కార్యక్రమాలు హైదరాబాదులోనూ జరిగాయి. కాబట్టి, ఈసారి విశాఖపట్టణంలో వార్షికోత్సవం నిర్వహించాలనీ, డిసెంబరు 10న తెవికీ జన్మదినం కాబట్టి 8,9,10 తేదీలలో నిర్వహించాలని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:50, 11 అక్టోబరు 2023 (UTC)
- బావుందండి. పెట్టండి, ఇసాపట్నంలో పెట్టండి. మనాళ్ళందరినీ బళ్ళు కట్టించి రప్పించండి. ఎన్ని రోజులైనా పెట్టండి.. ఒక్క రోజు మాత్రం ఆటవిడుపుకు పెట్టండి.
- ఒకప్పుడు వికీలో విస్తృతంగా రాసి ఇప్పుడు రాయని భాస్కరుల్ని ప్రత్యేకించి పిలిపించండి. రాకపోతే ఊరుకోమని చెప్పండి. వాళ్ళు అక్కడికొచ్చాక, రాయకపోతే ఊరుకోమని చెప్పండి. పై ఊళ్ళలో ఉండేవారు, పైదేశాల్లో ఉండేవారూ బోలెడు మంది ఉన్నారు. అందరూ పెద్దాళ్ళే, అందరూ మనకు మార్గదర్శకులే.. వాళ్ళని పిలిపించండి. వాళ్ళు చెప్పేది విందాం. కొత్తవాళ్ళు, యువకులు చాలా మంది వచ్చారు. అందరినీ పిలిపించండి. కార్యక్రమాన్ని వాళ్ళచేతనే నిర్వహింపజెయ్యండి.
- ఇప్పటి వరకు చేసిందేంటో, చెయ్యనిదేంటో చెప్పుకుందాం. ఇకనేం చెయ్యాలో చెప్పుకుందాం. చదువరి (చర్చ • రచనలు) 05:42, 11 అక్టోబరు 2023 (UTC)
- ఈసారి ఉత్సవాలకు గనక వెంకటరమణ గారు రాకపోతే, పవన్ గారు నిరాహార దీక్ష చెయ్యాలని నేను ప్రతిపాదిస్తున్నాను. :-) __ చదువరి (చర్చ • రచనలు) 05:49, 11 అక్టోబరు 2023 (UTC)
- 20వ వార్షికోత్సవం నిర్వహణకేంద్రంగా విశాఖపట్నం పట్టణాన్ని ఎన్నుకోవడం శ్లాఘనీయం. అక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం మరి ఇతర విద్యాసంస్థలను సంప్రదిస్తే వారివారి విద్యార్థులను ఇందులో పాల్గొనేలా చేయవచ్చును. ధన్యవాదాలు, శుభాకాంక్షలు.Rajasekhar1961 (చర్చ) 06:56, 11 అక్టోబరు 2023 (UTC)
- @Chaduvari గారూ, కరెక్ట్. ఈసారైనా @K.Venkataramana గారిని చూసి, హాయిగా, నేరుగా మాట్లాడాల్సిందే. పవన్ సంతోష్ (చర్చ) 13:52, 11 అక్టోబరు 2023 (UTC)
- ఈసారి ఉత్సవాలకు గనక వెంకటరమణ గారు రాకపోతే, పవన్ గారు నిరాహార దీక్ష చెయ్యాలని నేను ప్రతిపాదిస్తున్నాను. :-) __ చదువరి (చర్చ • రచనలు) 05:49, 11 అక్టోబరు 2023 (UTC)
విశాఖపట్నం బాగుంటుంది, ముందుగానే కొన్ని వికీ కార్యక్రమాలు విశాఖపట్నం లో చేస్తే అక్కడ మరింత అవగాహన పెంచవచ్చు బడ్జెట్‌లో మంచి కేటాయింపుల వలన, మరింత మంది తెలుగు వికీపీడియన్లు ఈ అవకాశాన్ని పొందగలరు. కొత్త వికిపీడియన్లు ఈ వేడుకను నిర్వహించాలని కోరుకుంటున్నాను, వీలయితే ఈసారి హైదరాబాద్ నుంచి బస్సు యాత్ర , లేదా విమాన సౌకర్యం , మంచి రిసార్ట్ వంటి సదుపాయాలు కల్పించాలని విన్నపం ! ( ఈ మధ్య కాలంలో, పోదుపు , పరిమితుల లోబడకుండా వేడుకలు ఘనంగా నిర్వహించటం వలన లాభమేమిటో తెలుసుకొన్నాను), ఏమైనా తోర్పాటుకు నేను సిద్దం :) . Kasyap (చర్చ) 09:44, 11 అక్టోబరు 2023 (UTC)
- మద్యస్తంగా రాజమమహేంద్రి కూడా పరిశీలించండి. చారిత్రక నగరం కదా.--B.K.Viswanadh (చర్చ) 07:15, 14 అక్టోబరు 2023 (UTC)
- ప్రస్తావన బాగుందండీ, తోడ్పాటుకు నేను సిద్ధం. NskJnv 13:43, 19 అక్టోబరు 2023 (UTC)
- అందరికీ నమస్కారం,
- ఈ సందేశాన్ని సీఐఎస్-ఎ2కె సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ హోదాలో పెడుతున్నాను. తెలుగు వికీపీడియా 20 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలుగు వికీమీడియన్లు ఒకచోట చేరి, జరిగిన కార్యకలాపాలను, పనిని సమీక్షించుకుని, కొత్త సంగతులు నేర్చుకుని, భవిష్యత్ ప్రణాళికలను నిర్వహించుకునే ఉద్దేశంతో ఏర్పాటుచేసుకునే కార్యక్రమానికి సీఐఎస్-ఎ2కె నిర్వహణలో భాగం తీసుకోవడానికి ఆసక్తితో ఉంది.
- సీఐఎస్-ఎ2కె తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపుతోనూ, సముదాయంతోనూ కలసి ఈ విషయంలో పనిచేయగలదు. ఒకవేళ ఇందుకు గల అవకాశాన్ని చర్చించడానికి ఇష్టపడితే ఈ కింది విధంగా ప్రతిపాదిస్తున్నాము
- ఈ అంశంపై మొదట ఒక ఆన్లైన్ సమావేశం నిర్వహించి చర్చిద్దాము. ఆ చర్చలో నాతో పాటు మా టీమ్ సభ్యులు ఇతరులు కూడా పాల్గొంటారు. రెండుపక్షాలకూ మౌలిక ఉద్దేశాలు చర్చించుకుని అవి కలుస్తున్నట్టైతే ముందుకు వెళ్ళవచ్చు. ఆపైన ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంత వంటి వివరాలను కూడా చర్చించుకోవచ్చు.
- ఆన్లైన్ సమావేశంలో చర్చించుకున్న విషయాలన్నీ కూలంకుషంగా తెలుగు వికీపీడియాలో రాసి, ఇక్కడ చర్చ పూర్తయ్యాకా ఒప్పుదల అయితే తదుపరి కార్యప్రణాళిక నిర్వహించుకోవచ్చు.
- చర్చలో పాల్గొన్నవారు, ఆసక్తి ఉన్న ఇతరులు ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు చెప్పాకా ఆ సమావేశాన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. @Pranayraj1985, @Chaduvari, @Rajasekhar1961, @Kasyap, @B.K.Viswanadh, @Nskjnv, తదితరులందరూ తమ అభిప్రాయాన్ని తెలియజేయగలరు.
- ధన్యవాదాలతో పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:09, 21 అక్టోబరు 2023 (UTC)
- నేను ఆన్‌లైన్ చర్చలో పాల్గొంటాను.
- @Pavan (CIS-A2K) గారూ, మీరు సిఐఎస్‌లో నిర్ణాయక హోదాలో ఉన్నారు. ఇరువైపులా చురుగ్గా ఉంటారు కాబట్టి పరస్పర ప్రయోజనాల ఘర్షణ లేకుండా చూసుకుంటారని భావిస్తున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 16:44, 21 అక్టోబరు 2023 (UTC)
- @Chaduvari గారూ, ధన్యవాదాలు. మంచి అంశాన్ని ప్రస్తావించారు. సీఐఎస్-ఎ2కె ద్వారా ముందుకు వెళ్తే దీనికి, తెలుగు వికీతో మేము చేసే ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన ఫైనాన్షియల్ అప్రూవల్ అథారిటీగా నేను ఉండకుండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టరును ఆ బాధ్యతలు తీసుకొమ్మని కోరనున్నానండీ. చర్చలో భాగంగా ఇంకా ఎలాంటి పరస్పర ప్రయోజనాల ఘర్షణ ఉండవచ్చో ఆలోచించి అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకుందామని, అవన్నీ కూడా బహిరంగంగా ప్రకటిద్దామని నా ఆలోచన. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:55, 21 అక్టోబరు 2023 (UTC)
- @Pavan (CIS-A2K) గారూ, తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవ అంశంపై చర్చించడానికి ఒక ఆన్లైన్ సమావేశం నిర్వహణ అనేది మంచి విషయమే, ఆన్లైన్ సమావేశానికి నా అంగీకారాన్ని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:40, 1 నవంబరు 2023 (UTC)
- @Chaduvari గారూ, ధన్యవాదాలు. మంచి అంశాన్ని ప్రస్తావించారు. సీఐఎస్-ఎ2కె ద్వారా ముందుకు వెళ్తే దీనికి, తెలుగు వికీతో మేము చేసే ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన ఫైనాన్షియల్ అప్రూవల్ అథారిటీగా నేను ఉండకుండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టరును ఆ బాధ్యతలు తీసుకొమ్మని కోరనున్నానండీ. చర్చలో భాగంగా ఇంకా ఎలాంటి పరస్పర ప్రయోజనాల ఘర్షణ ఉండవచ్చో ఆలోచించి అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకుందామని, అవన్నీ కూడా బహిరంగంగా ప్రకటిద్దామని నా ఆలోచన. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:55, 21 అక్టోబరు 2023 (UTC)
ఉల్లేఖన సమస్య
[మార్చు]శుభోదయం..! నాకు గత రెండు రోజులుగా ఉల్లేఖన ఆటోమేటిక్ గా తయారు కావడం లేదు.దయచేసి ఎవరైనా పరిశీలించగలరు.--Muralikrishna m (చర్చ) 01:38, 12 అక్టోబరు 2023 (UTC)
- ప్రస్తుత సమస్య ఏంటో నేను చూళ్ళేదు గానీ మురళీకృష్ణ గారూ, మీరు పీడీయెఫ్ లాంటి ఫైళ్ళుండే యూఆరెల్ కాకుండా మామూలు హెచ్‌టిఎమ్మెల్ పేజీ యూఆరెల్‌ను ఆటో మూలంలో ఇచ్చి చూసారా? పీడీయెఫ్ లాంటివాటికి ఆటో మూలం పనిచెయ్యకపోవడం నేను అనేక సార్లు గమనించాను. __ చదువరి (చర్చ • రచనలు) 03:10, 12 అక్టోబరు 2023 (UTC)
- చదువరిగారు.. శుభోదయం..!
- ధన్యవాదాలు. నేను ప్రయత్నిస్తున్నది పీడీయెఫ్ మూలాలు కాదండి.. మామూలు హెచ్‌టిఎమ్మెల్ పేజీ యూఆరెల్ మాత్రమే. గతంలో కూడా ఇలా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకసారి బ్రౌజర్ లాగౌట్ చేసి మళ్ళీ ప్రయత్నిస్తే వచ్చేది. Muralikrishna m (చర్చ) 03:16, 12 అక్టోబరు 2023 (UTC)
- @Muralikrishna m గారూ, నాకు ఉల్లేఖన ఆటోమేటిక్ గానే తయారవుతోంది. మీరు మరో బ్రౌజర్ లోగానీ, మరోసారి లాగిన్ అయికానీ ప్రయత్నించండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:34, 12 అక్టోబరు 2023 (UTC)
- ధన్యవాదాలు... ప్రయత్నిస్తాను... Muralikrishna m (చర్చ) 03:47, 12 అక్టోబరు 2023 (UTC)
- నాకు బాగానే పనిచేస్తున్నది.నేను ఈ రోజు మణిపూర్ జిల్లాల జాబితా వ్యాసంలో వాడాను.సరిగానే పనిచేసింది.మురళీకృష్ణ గారూ ఇలాంటివి సాంకేతిక సమస్యలు విభాగంలో వివరించగలరు.పైన రచ్చబండ విభాగాలు ఒకసారి పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 03:41, 12 అక్టోబరు 2023 (UTC)
- ధన్యవాదాలు... అలాగేనండి ప్రయత్నిస్తాను... Muralikrishna m (చర్చ) 03:47, 12 అక్టోబరు 2023 (UTC)
- @Muralikrishna m గారూ, నాకు ఉల్లేఖన ఆటోమేటిక్ గానే తయారవుతోంది. మీరు మరో బ్రౌజర్ లోగానీ, మరోసారి లాగిన్ అయికానీ ప్రయత్నించండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:34, 12 అక్టోబరు 2023 (UTC)
విదేశీయుల పేర్లు ఉచ్చరణ
[మార్చు]ముందుగా సభ్యులందరికీ నమస్కారం. నేను వికీపీడియాలో విదేశీయుల గురించి రచనలు ఇప్పుడు చేస్తున్నాను. కానీ వాళ్ల పేర్లు టైపింగ్ మైకు ద్వారా పలికేటప్పుడు రాసేటప్పుడు గానీ తప్పుగా అచ్చవుతున్నాయి. విదేశీయుల పేర్ల అంత కష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు మరి కష్టంగా ఉన్నాయి. ఉదాహరణకు లారెంట్ డిజైర్ కబీలా దీనికి పరిష్కారము చెప్పగలరు. ఉదయ్ కిరణ్ (చర్చ) 07:08, 12 అక్టోబరు 2023 (UTC)
- @ఉదయ్ కిరణ్ వికీపీడియాలో విదేశీయుల గురించి రచనలు చేస్తున్నందుకు అభినందనలు, ఈ ఇబ్బంది అందరం అనుభవించేదే ! నేను ఇలాంటి పేర్లు ఉన్నప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ లో ఆయా భాషల్లో ఉన్న text to speech ద్వారా విని దాని దగ్గరగా తెలుగులొ రాసి వీలునుబట్టీ పక్కన ఆపేరు మూల భాషలో ఉంచుతాను. Kasyap (చర్చ) 07:39, 12 అక్టోబరు 2023 (UTC)
- ధన్యవాదాలు ఉదయ్ కిరణ్ (చర్చ) 07:44, 12 అక్టోబరు 2023 (UTC)
- @ఉదయ్ కిరణ్ గారూ, మొదట తెలుగులో వాళ్ళ గురించి ఏమైనా రాసివుంటే వాళ్ళెలా రాశారో చూస్తాను. ఆ తర్వాత, గూగుల్లో "Pronounce xyz" అని వెతుకుతాను. ఒక్కోసారి టైం బావుంటే యూట్యూబులో ఎలా ఉచ్చరించాలో చెప్పే చిరువీడియోలు దొరుకుతాయి. ఒకవేళ పూర్తి పేరుకు దొరకకపోతే, మొదటి పేరు, మధ్యపేరు, చివరి పేరు విడివిడిగా వెతికి ఉచ్చారణ తెలుసుకుని రాస్తాను. పవన్ సంతోష్ (చర్చ) 16:17, 12 అక్టోబరు 2023 (UTC)
- చాలా మంచి సమస్యను లేవనెత్తారు. నాకయితే తెలుగులో వారిగురించి పత్రికలలో ప్రచురించబడిన వ్యాసాలుంటే ఉత్తమము. అసలు తెలుగువారికి పూర్తిగా పరిచయం కాని పేరయితే ఆంగ్ల వికీపీడియాలో కొన్నింటిలో ఉచ్చారణ లింకు ఇస్తారు. దానిని తీసుకోవచ్చును. మొత్తం పేరు అంతా కలిపి కాకుండా వేరువేరుగా అయితే పరిష్కారం తెలుసుకోవచ్చును. ఇలాంటి సమస్య వున్న వ్యాసం చర్చపేజీలో పేరు విభాగంలో చర్చ మొదలుపెడితే మనం అంతా కలిసి సరైన తెలుగు పేరును నిర్ణయించవచ్చును. ఈ సమస్య ఇలా పరిష్కరించవచ్చును. మరి మొదలుపెట్టండి.--Rajasekhar1961 (చర్చ) 16:59, 12 అక్టోబరు 2023 (UTC)
- ఉదాహారణకు: నేను మీరు సృష్టించిన బెంజమిన్ మకప వ్యాసం నుండి "టాంజానియా మూడవ అధ్యక్షుడు" అని గూగుల్ లో కాపీ పేస్ట్ చేసి వెతికితే "బెంజమిన్ విలియం మకాపా" పేరు ఎక్కువ మూలాలలో కనిపించింది. కాబట్టి మనం తెవికీ వ్యాసంలో కూడా "బెంజమిన్ విలియం మకాపా" పేరే సరైనదిగా గుర్తించవచ్చును.Rajasekhar1961 (చర్చ) 17:06, 12 అక్టోబరు 2023 (UTC)
- @ఉదయ్ కిరణ్ గారూ, మీరు అడుగుతున్నది.. మీరు "చెప్పే" మాటను గూగుల్ సరిగ్గా రాయడం లేదు అనే కదా? దానికి ఏం చెయ్యాలో నేను చెప్పలేను. ఒకవేళ దానికి సరైన/సరికాని ఉచ్చారణ కారణం అని మీరు భావిస్తోంటే సరే.
- విదేశీ పేర్లను తెలుగులో రాసేప్పుడు అనుసరిస్తున్న పద్ధతి గురించి నేను కుడా రాస్తాను.
- వ్యావహారికంగా తెలుగువాళ్ళ/పత్రికల ఉచ్చారణ ఎలా ఉందో చూస్తాను. అది ఉంటే దాన్ని అనుసరించాల్సిందే. అది వికీపీడియా పద్ధతి. ఈ పద్ధతి అందరికీ శిరోధార్యం. ఉదాహరణకి పాలస్టైన్ కాదు, పాలస్తీనా అనాలి.
- వ్యావహారికంలో ఆ మాట లేకపోతే అప్పుడు ఉచ్చారణ ఎలా ఉండాలి..
- అన్నిటికంటే అత్యంత ప్రధానంగా నేను భావించేది - తెలుగువాడికి అది ఇన్‌ట్యూటివ్‌గా ఉండాలి. Laurent అనే మాటను లారెంట్ అని పలకకుండా లారూ అనో లోరా అనో అనమంటే మనకు ఇన్‌ట్యూటివ్‌గా ఉండదు.
- ఇంగ్లీషు పేజీలో ఉచ్చారణ ఉందేమో చూస్తాను. ఉంటే దాన్ని పాటిస్తాను. భారతీయ పదాలకైతే ఇంగ్లీషు చూణ్ణు, హిందీ, మరాఠీ, భోజ్‌పురి, నేపాలీ వగైరాలు చూస్తాను
- ఉచ్చారణ కోసం గూగిలిస్తాను. pronounce అని మాట రాస్తే వస్తాయి. కానీ దీనిలో చూపించే ఫలితాలన్నీ ప్రామాణికం కావు. ఫలితాల్లో నేరుగా గూగులే చూపించే ఉచ్చారణను తీసుకోవచ్చు. యూట్యూబులో వాటిని నేను చాలావరకు పరిగణించను.
- వీటన్నిటిలోనూ అక్కడ ఉన్నది ఉన్నట్టుగా తీసుకోను. కొంచెం స్టైలైజ్‌డ్ ఉచ్చారణను పరిగణించను. స్పష్టంగా 'ఎ' కారం ఉండాల్సిన చోట 'అ' కార ఉచ్చారణ ఉన్నప్పటికీ నేను 'ఎ' కారాన్నే తీసుకుంటాను. నా జడ్జిమెంటుకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తాను. నా జడ్జిమెంటు రైటని కాదు, తెలుక్కి ఇన్‌ట్యూటివ్‌గా ఉంటుంది, అంతే. ఆ జడ్జిమెంటులో ముఖ్యమైనవి:
- కొన్ని ఉచ్చారణలు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఫ్రెంచి పదాలు - ఉదాహరణకు Bordeaux - దీన్ని బాడో అనాలంట!! (ఏంటో ఈ ఫ్రెంచి) అలాంటి సందర్భాల్లో ఉన్నది ఉన్నట్లుగా రాస్తాను. ఇప్పుడు ఈ లారెంట్ కూడా ఫ్రెంచి మాటే! ఇలాంటి మాటల్ని మనకు ఇన్‌ట్యూటివ్‌గా ఉండేలా రాస్తాను.
- విదేశీ భాషల్లో, చాలావరకు హ్రస్వాంత పదాలు సాధారణంగా ఉండవు. అంటే అ, ఇ, ఉ, ఎ, ఒ లతో అంతమయ్యే పదాలు చాలా తక్కువగా ఉంటై - వాటిని అ,ఈ,ఊ,ఏ,ఓ కారంత పదాలుగా - దీర్ఘాంతాలుగా - రాస్తాను. ఉదాహరణకు "రబడ" అని కాక, "రబాడా" అని రాసాను. ఎక్కడైనా మినహాయింపులు ఉండొచ్చు గానీ సాధారణంగా ఈ పద్ధతినే పాటిస్తాను.
- ఇవి కొన్ని. __ చదువరి (చర్చ • రచనలు) 02:20, 14 అక్టోబరు 2023 (UTC)
- @Chaduvari గారూ, నేను ఉచ్చారణ కోసం వెతికేప్పుడు గూగుల్ ఉచ్చారణ ఇవ్వకపోతున్నట్టైతే యూట్యూబులో ఉచ్చారణ కోసం ప్రాచుర్యం చెందిన ఛానెళ్ళ వాళ్ళ ఉచ్చారణ అనుసరిస్తున్నాను. ఇది సరి కాదా? పవన్ సంతోష్ (చర్చ) 05:33, 14 అక్టోబరు 2023 (UTC)
- @Pavan santhosh.s గారూ, అది సరికాదని తెగేసి చెప్పలేను గానీ, చాలా వరకు నేను గణించనండి. కొన్ని మిషను చేత కూడా చెప్పిస్తూంటారు. అవి ప్రామాణికమైనవి కావని నా ఉద్దేశం. ఒక గైడెన్సుగా మాత్రం తీసుకోవచ్చు. ఉదాహరణకు -
- ఇది చూడండి.
- అలాగే ఇది కూడా
- ఏదో మిషను చెబుతున్నట్లు ఉంది. పైగా ఉచ్చారణ ఎలా ఉండాలో చెబుతున్నాం అంటే సహజ (నేటివు) ఉచ్చారణ లాగా ఉండాలి గదా. సౌరభ్ ను ఎలా పలుకుతున్నాడూ.. సోరాబ్ అని ఇంగ్లీషోడు పలికినట్టు పలుకుతున్నాడు. అంచేత, ఈ యూట్యూబర్ల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలని నేను భావిస్తానండి. __ చదువరి (చర్చ • రచనలు) 06:29, 14 అక్టోబరు 2023 (UTC)
- @Chaduvari ధన్యవాదాలండీ. మీరన్నది కరెక్టే. ఇకపై ఈ విషయంలో జాగ్రత్త వహిస్తాను. బైదవే, మీరు చేసిన సూచనలు, ఇంకొంతమంది చేసిన సూచనలు కలిపి మనం ఒక మార్గదర్శకం ఏర్పరుచుకోవచ్చేమో! పవన్ సంతోష్ (చర్చ) 06:36, 14 అక్టోబరు 2023 (UTC)
- @Pavan santhosh.s గారూ, ఔనండి. శైలిలో భాగంగా పెట్టుకోవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 10:06, 14 అక్టోబరు 2023 (UTC)
- @Chaduvari ధన్యవాదాలండీ. మీరన్నది కరెక్టే. ఇకపై ఈ విషయంలో జాగ్రత్త వహిస్తాను. బైదవే, మీరు చేసిన సూచనలు, ఇంకొంతమంది చేసిన సూచనలు కలిపి మనం ఒక మార్గదర్శకం ఏర్పరుచుకోవచ్చేమో! పవన్ సంతోష్ (చర్చ) 06:36, 14 అక్టోబరు 2023 (UTC)
- @Pavan santhosh.s గారూ, అది సరికాదని తెగేసి చెప్పలేను గానీ, చాలా వరకు నేను గణించనండి. కొన్ని మిషను చేత కూడా చెప్పిస్తూంటారు. అవి ప్రామాణికమైనవి కావని నా ఉద్దేశం. ఒక గైడెన్సుగా మాత్రం తీసుకోవచ్చు. ఉదాహరణకు -
- @Chaduvari గారూ, నేను ఉచ్చారణ కోసం వెతికేప్పుడు గూగుల్ ఉచ్చారణ ఇవ్వకపోతున్నట్టైతే యూట్యూబులో ఉచ్చారణ కోసం ప్రాచుర్యం చెందిన ఛానెళ్ళ వాళ్ళ ఉచ్చారణ అనుసరిస్తున్నాను. ఇది సరి కాదా? పవన్ సంతోష్ (చర్చ) 05:33, 14 అక్టోబరు 2023 (UTC)
తెలుగు వికీపీడియాపై మన అభిప్రాయాలు
[మార్చు]తెలుగు వికీపీడియాపై మన అభిప్రాయాలు, మన ఆలోచనలు, మన స్వగతం చెప్పుకునే ఒక పద్ధతి ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రతిపాదన పెట్టాను. పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 11:04, 14 అక్టోబరు 2023 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:40, 14 అక్టోబరు 2023 (UTC)
రచ్చబండ పునర్వ్యవస్థీకరణపై చర్చ
[మార్చు]రచ్చబండ పునర్వ్యవస్థీకరణపై కశ్యప్ గారు మొదలుపెట్టిన చర్చను వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) పేజీకి తరలించాను. దానిపై స్పందనలు అక్కడ రాయవలసినది. నిర్వాహకులు ఆ చర్చను పరిశీలించి తగు నిర్ణయం చేయవలసినదిగా విజ్ఞప్తి. __ చదువరి (చర్చ • రచనలు) 05:36, 15 అక్టోబరు 2023 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:25, 20 అక్టోబరు 2023 (UTC)
మూలాలతో సహా విస్తరించబడిన వ్యాసాలలో తొలగింపు మూసలు పెట్టిన వాళ్ళే తీయలా లేక ఎవరైనా తీయవచ్చా
[మార్చు]రీఛార్జబుల్ బ్యాటరీ వ్యాసం మూలాలతో సహా విస్తరించబడింది, కానీ తొలగింపు మూసను పెట్టిన వారు తీయలేదు, మూలాలతో సహా విస్తరించినవారు తీయలేదు. మూలాలతో సహా విస్తరించబడిన వ్యాసాలలో తొలగింపు మూసలు తొలగించుటకు ఏవైనా అధికారాలు అవసరమవుతాయా తెలియజేయగలరు. Yavath Vyasa Swayam Rakshak (చర్చ) 01:29, 16 అక్టోబరు 2023 (UTC)
- మూసలు తొలగింపుకు ఏ ప్రత్యక అధికారం అవసరం లేదండీ, ఈ విలువైన వ్యాసం మీ సహకారంతో వ్యాసం ప్రమాణాలు చేరుకుంటుంది అని ఆశిస్తున్నాను. Kasyap (చర్చ) 04:53, 16 అక్టోబరు 2023 (UTC)
Review and comment on the 2024 Wikimedia Foundation Board of Trustees selection rules package
[మార్చు]Dear all,
Please review and comment on the Wikimedia Foundation Board of Trustees selection rules package from now until 29 October 2023. The selection rules package was based on older versions by the Elections Committee and will be used in the 2024 Board of Trustees selection. Providing your comments now will help them provide a smoother, better Board selection process. More on the Meta-wiki page.
Best,
Katie Chan
Chair of the Elections Committee
01:13, 17 అక్టోబరు 2023 (UTC)
శైలి - భౌగోళిక ప్రదేశాల ప్రసక్తి
[మార్చు]రచ్చబండ (ప్రతిపాదనలు) పేజీలో శైలి - భౌగోళిక ప్రదేశాల ప్రసక్తి చూడవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 01:38, 20 అక్టోబరు 2023 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:24, 20 అక్టోబరు 2023 (UTC)
లింగ్వ లిబ్రే - తెలుగు గళం
[మార్చు]సముదాయ సభ్యులకు నమస్కారం!
ఇటీవల నేను లింగ్వ లిబ్రే ప్రాజెక్టు గురించి రచ్చబండ ద్వారా మీ అందరితో పంచుకున్న విషయం విదితమే. లింగ్వ లిబ్రే ప్రాజెక్టు, తెలుగు భాషలో ఆడియోల రికార్డింగు చాలా వృద్ధి చెందినది అని తెలియజేయటానికి నేను సంతోషిస్తున్నాను.
ప్రపంచంలో 5 వ స్థానంలో తెలుగు
[మార్చు]ఇక లెక్కల్లోకి వస్తే ఫ్రెంచ్ వికీమీడియా వారు ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో అత్యధిక ఆడియోలు ఎక్కించడంలో ఫ్రెంచ్ వారు మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో ఒడియా(130504 ఆడియోలతో), నాలుగో స్థానంలో బెంగాలీ (67786 ఆడియోలతో), 67132 ఆడియోలతో తెలుగు 5 వ స్థానంలోకి చేరుకుంది.[1]
గతంలో నేను ప్రస్తావించినప్పుడు తెలుగు భాష 4500 ఆడియోలతో 27వ స్థానంలో ఉండేది, ఈ సంఖ్య కేవలం మూడు నెలల్లోనే పది రేట్లకు పైగా వృద్ధి చెంది మనం 5 వ స్థానంలోకి చేరుకోవటం గర్వించదగ్గ విషయం.
లింగ్వ లిబ్రే లో 10 లక్షల పదాలు
[మార్చు]లింగ్వ లిబ్రే ఇటీవల 10 లక్షల పదాల మైలు రాయిని చేరుకుంది, విషయం ఏమిటి అంటే ఈ పది లక్షవ పదం ఏదైతే ఉందొ అది ఒక తెలుగు పదమ, దాన్ని ఎక్కించింది ఎవరో కాదు మన తెలుగు వికీపీడియన్ భవ్య గారు, కంటకితము అనే తెలుగు పదంతో లింగ్వ లిబ్రే ద్వారా నమోదు చేయబడ్డ ఆడియోల సంఖ్య 10 లక్షలకు చేరుకుంది.
భవ్య గారు 10 లక్షవ పదం నమోదు చేయడమే కాదు లింగ్వ లిబ్రే, తెలుగులో ఉన్న 67132 ఆడియోలలో ఏకంగా 56184 పదాలను నమోదు చేసి ప్రపంచంలోనే 5 వ స్థానంలో నిలిచారు[2], ఇక ఈ ప్రాజెక్టులో ప్రశాంతి , మమత, దివ్య, సుశీల గార్లు పాల్గొనటం ద్వారా వికీమీడియా కామన్స్లో తెలుగు మహిళా వికీమీడియన్ల కృషి గమనించవచ్చు.
లింగ్వ లిబ్రే ప్రాజెక్టులో కృషి చేయడం ద్వారా తెలుగు కీర్తిని ప్రపంచ స్థాయిలో చాటుతున్న వారందరికీ శుభాకాంక్షలు. మీ కృషి ఇలాగే ముందుకు సాగాలని మరిన్ని మైలు రాళ్లు చేరుకోవాలని ఆశిస్తున్నాను.
వాడుకరి :V Bhavya గారు ఇతర మహిళా వికీమీడియన్లు, మీ ఈ అనుభవాన్ని తెలుగు వికీమీడియాలో మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా కార్యాచరణ రూపంలోకి తెస్తే బాగుంటుందని నా సూచన.
NskJnv 08:19, 20 అక్టోబరు 2023 (UTC)
- అందరికి నమస్కారం!
- ముందుగా ఈ ప్రాజెక్ట్ గురించి తెలియచేసినందుకు వాడుకరి:Nskjnv గారికి ధన్యవాదాలు.
- ఈ మధ్యే నేను తెలుగు వికీలో 100 రోజుల్లో 100 వ్యాసాలూ పూర్తి చేసాను, అలాగే ఈ లింగ్వ లిబ్రే ప్రాజెక్టు ద్వారా 50 వేయిలకు పైగా పదాలను నమోదు చేసాను. తెలుగు వికీమీడియాకి ఇలాంటి సేవలు అందించటం నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికి ధన్యవాదాలు.
- నేను రికార్డు చేసిన కంటకితము అనే పదంతో లింగ్వ లిబ్రే ప్రాజెక్టు 10 లక్షల పదాల మైలు రాయిని చేరుకోవటం చాలా సంతోషకరమైన వార్త.
- తెలుగు వికీమీడియాలో మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా ఎటువంటి కృషి చేయవచ్చో నాకు తెలపగలరు. V Bhavya (చర్చ) 13:09, 20 అక్టోబరు 2023 (UTC)
- V Bhavya గారు, తెవికీమీడియాలో మహిళలు భాగస్వామ్యం అలాగే మహిళలకు సంబంధించిన అంశాలపై వికీ కంటెంట్ నిర్మించడం పై మీరు కృషి చేయవచ్చు.
వికీపీడియా:వికీప్రాజెక్టు పేజీలో గతంలో తెలుగు వికీలో జరిగిన ప్రాజెక్టుల గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇటీవల తెలుగు వికీ నుండి జరిగిన/జరుగుతున్న ప్రాజెక్టులను దగ్గరగా అధ్యయనం చేయటం ద్వారా ప్రస్తుత ప్రాజెక్టుల గురించి అవగాహన మీ కార్యాచరణలో ఉపయోగపడవచ్చు.
అలాగే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న she said లాంటి ప్రాజెక్టులు, Wiki Loves Women ప్రాజెక్టుల్ని కూడా పరిశీలించగలరు.
వీటిల్లో ఏదేని అంశంపై కృషి చేయాలీ అనుకుంటుంటే వాడుకరి:Nskjnv/తెవికీ యువ పేజీకి చర్చలో అంశాన్ని ప్రవేశ పెట్టండి, తెలుగు వికీలో యువతకు సహాయం ఆంచించే దిశగా ఈ తెవికీ యువ ప్రారంభించాను, ప్రస్తుతం ఇది ప్రాథమిక స్థాయిలో ఉంది..
ధన్యవాదాలు.
NskJnv 06:45, 25 అక్టోబరు 2023 (UTC)
- ఈ ప్రాజెక్టులో పనిచేసినవారందరికీ నా అభినందనలు, చప్పట్లు! గూగుల్ ఫలితాల్లో ప్రొనన్సియేషన్ను చూపించినట్టు పెదాల కదలికను కూడా చూపించగలిగితే, ఆ ప్రాజెక్టుకు మరింత విలువ చేకూరుతుంది. ఉదాహరణకు, ఇలా!
- దీన్ని ఇంతటితో ఆపకూడదు, మరింత ముందుకు తీసుకుపోవాలి. అక్కడ ఏయే పదాలనైతే మాట్లాడారో, ఆయా పదాలకు చెందిన తెలుగు వికీపీడియా, తెలుగు విక్షనరీ పేజీల్లో ఆ ఆడియో ఫైళ్ళను చేర్చాలి. ఈ పనులు చేస్తే వికీపీడియా, విక్షనరీలకు మంచి విలువ చేకూరుతుంది.
- తెలుగు విక్షనరీ అనగానే ఒక మాట, దాని అర్థం, దాని నానార్థాలు, పర్యాయ పదాలు, దాని బొమ్మ, దాన్ని ఎలా పలకాలో చెప్పే ఆడియో ఫైలూ ఇవి ఉంటే ఆ పేజీ ఎంతో సమగ్రంగా ఉన్నట్టౌతుంది.
- అలాగే వికీపీడియాలో వ్యాసవిషయాన్ని లేదా ఆయా వస్తువును ఎలా పలకాలో సంబంధిత పేజీలో ఉంటే అదొక అదనపు విలువ ఔతుంది.
- ఈ పనులను ఈసరికే ఎవరైనా చేస్తున్నారేమో చూడాలి. ఈ విషయంలో పవన్ సంతోష్ గారు ఆలోచిస్తున్నట్లున్నారు.
- ఈ పనులను ఆటోమేటు చెయ్యాలి - చేసేందుకు ఈసరికే ఏదైనా పని జరుగుతుందేమో చూడాలి. ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉండి ఉంటుంది. ఎవరో ఒకరు చేస్తూనే ఉండి ఉంటారు.
- ఈ పని బాటు చేసినా మనిషి చేసినా, మహిళలు చేసినా మగవాళ్ళు చేసినా.. ఎవరు చేసినా సరే, అదొక మాన్యుమెంటల్ కాంట్రిబ్యూషనౌతుంది. __చదువరి (చర్చ • రచనలు) 14:24, 20 అక్టోబరు 2023 (UTC)
- లింగ్వ లిబ్రే ద్వారా తెవికి వికీ కామన్స్లో 5వ స్థానం చేరుకున్నందుకు సంతోషం. మొదటి ప్రయత్నంగా కొంచెం చేసాను. పై సూచనలను అనుసరించి ఇంకొంత ప్రయత్నం చేయాలి. --VJS (చర్చ) 02:59, 21 అక్టోబరు 2023 (UTC)
- అందరికి నమస్కారం!
- నేను మా కళాశాలలో వికీమీడియా కామన్స్ ట్రైనింగ్ వర్కుషాప్ చేద్దాం అనుకుంటున్నా. ఆసక్తి గల మహిళా వికీమీడియన్స్ నాతో పాటు ఈ కార్యక్రమం లో పాలు పంచుకుంటే బాగుంటుంది దాని గురించి ఇక్కడ చర్చించగలరు. V Bhavya (చర్చ) 02:59, 26 అక్టోబరు 2023 (UTC)
- 5వ స్థానం చేరుకున్నందుకు సంతోషం. వికీమీడియా కామన్స్ ట్రైనింగ్ వర్క్ షాప్ చేద్దాం అనే ఆలోచన బాగుంది. Divya4232 (చర్చ) 16:24, 2 నవంబరు 2023 (UTC)
ఈ వారం వ్యాసం పరిగణనలు
[మార్చు]వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు వర్గంలో 90 కి పైగా వ్యాసాలున్నాయి. వాటిలో కొన్ని చాన్నాళ్ళుగా పరిగణన లోనే ఉన్నాయి గానీ మొదటిపేజీలో ప్రదర్శనకు ఇంకా వెళ్ళలేదు. వాటిని పరిశీలించి, మొదటిపేజీకి అర్హత లేని వాటిని తీసేసి మిగతావాటికి తగిన ప్రదర్శన వారాన్ని కేటాయిస్తే బాగుంటుంది. మొదటి పేజీ నిర్వహణ చూసేవారు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 03:51, 23 అక్టోబరు 2023 (UTC)
తెవికీలో చెక్‌యూజర్లు ఉండాలా?
[మార్చు]ప్రతిపాదనలు విభాగంలో "తెవికీలో చెక్‌యూజర్లు ఉండాలా?" అనే ప్రతిపాదనను ప్రవేశపెట్టాను. __ చదువరి (చర్చ • రచనలు) 01:51, 24 అక్టోబరు 2023 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:57, 25 అక్టోబరు 2023 (UTC)
అజ్ఞాతవాడుకరి చేష్టలు
[మార్చు]గత రెండు రోజులుగా అజ్ఞాత వాడుకరి పనిగట్టుకొని దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఒకటే సారి 9 10 వ్యాసాలలోని సమాచారం తీసేస్తున్నాడు. ఒక్కొక్కసారి మొత్తం వ్యాసంలోని సమాచారాన్ని కూడా తీసేస్తున్నాడు. అజ్ఞాతవాడుకరి నా వాడు కరి పేజీతోపాటు బత్తిని వినయ్ కుమార్ గౌడ్ మురళీకృష్ణ ప్రణయ్ రాజ్ గారి వాడుకరి పేజీలలో చర్చ పేజీలోని సమాచారాన్ని మొత్తం తీసివేస్తున్నాడు. ఎప్పుడు లేనిది గత రెండు రోజులుగా అజ్ఞాతవాడుకరి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. దీనిపై నిర్వాహకులు సభ్యులు స్పందించాలని కోరుతున్నాను. ఉదయ్ కిరణ్ (చర్చ) 07:13, 26 అక్టోబరు 2023 (UTC)
- అవునండీ @ఉదయ్ కిరణ్ గారూ, గత రెండురోజులుగా అజ్ఞాత వాడుకరి పనిగట్టుకొని కొందరి వాడుకరి పేజీలు, వాడుకరి చర్చాపేజీలు, ఆయా వాడుకరులు రాసిన వ్యాసాలలోని సమాచారాన్ని తొలగిస్తున్నాడు. వెంటనే వాటన్నీంటిని సరిచేసి, ఆ రెండు ఐపీ అడ్రస్ లపై శాశ్వత నిరోధం విధించాను. అయితే, ఎవరో ఇది కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:13, 26 అక్టోబరు 2023 (UTC)
"సమాచారపెట్టె పుస్తకం", "Infobox book" మూసలు
[మార్చు]{{సమాచారపెట్టె పుస్తకం}} అనే సమాచారపెట్టె మూసను పుస్తకాల వ్యాసాల్లో వాడుతున్నాం. దీనికి ఎన్వికీ లింకు "Infobox book" అనే మూస. తెవికీలో కూడా {{Infobox book}} అనే మూస ఉంది గానీ అది "సమాచారపెట్టె పుస్తకం" కు దారిమార్పుగా ఉంది.
ఈ "సమాచారపెట్టె పుస్తకం" మూస పాత కూర్పుతో ఉంది. అందులో ప్రస్తుతం వాడుకలో లేని html (టేబుల్) ట్యాగులు వాడారు. ఉండాల్సిన కొన్ని ఫీల్డులు లేవు. {{Infobox book}} లోని దారిమార్పు స్థానంలో ఎన్వికీలో ఉన్న మూసను దిగుమతి చేసుకుని వాడుకుంటే బాగుంటుంది. నిర్వాహకులు తగు చర్య తీసుకోవవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 13:26, 27 అక్టోబరు 2023 (UTC)
- దారిమార్పు స్థానంలో ఎన్వికీలో ఉన్న మూసను {{Infobox book}} దిగుమతి చేసి కేంద్ర డేటా లింకు సవరించాను.దిగుమతి చేసిన మూసలో ఇంకా ఏమైనా అవసరమైన సవరణలు చేయవలసి ఉంటే చదువరి గారు పరిశీలించి చేయవలసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 12:11, 8 నవంబరు 2023 (UTC)
వాడుకరిపెట్టెల్లో లింగతటస్థత
[మార్చు]వాడుకరిపెట్టెలు కొన్నిటిలో లింగతటస్థత లోపించింది. అవి పుంలింగాన్ని సూచిస్తూ ఉన్నాయి. -చేస్తున్నాడు, చూస్తున్నాడు, సభ్యుడు, పౌరుడు.. ఇలాగ. వీటిని బహువచనంగా మారిస్తే (చేస్తున్నారు, చూస్తున్నారు, సభ్యులు, పౌరులు..) లింగతటస్థత చేకూరుతుంది. కర్త ఏకవచనంలో ఉండగా క్రియ బహువచనంగా ఉంటే బాగుండదు గదా అని అనవచ్చు - అది తప్పడం లేదు. లేదంటే పౌరుడు/పౌరురాలు, ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయురాలు అని రాయాల్సి ఉంటుంది. దాని బదులు బహువచనం మెరుగని నా అభిప్రాయం (ఇంగ్లీషులో కూడా they అని రాయడం చూస్తున్నాం గదా).
ఈ మూసలు చాలావరకు క్యాస్కేడింగు సంరక్షణలో ఉన్నాయి. ఉదాహరణకు {{User IND Citiz}}, {{User Wikipedian For}}. నిర్వాహకులు మాత్రమే దిద్దుబాట్లు చెయ్యగలరు. అంచేత, పై సూచన సముచితంగా ఉందని భావిస్తే, ఈ మార్పులు చెయ్యవలసినదిగా నిర్వాహకులను కోరుతున్నాను.__ చదువరి (చర్చ • రచనలు) 15:10, 27 అక్టోబరు 2023 (UTC)
- @చదువరి గారి సూచన సముచితంగా ఉంది.వికీపీడియా వాడుకరులుగా ఒక్క పురుషులు మాత్రమే కాదుగదా!స్త్రీలు మగవారికన్నా ఎక్కువమంది చేస్తున్న ఈ రోజుల్లో ఇది చాలా అవసరం.ఒకరకంగా వారిని గౌరవించటం.నాకేమీ అభ్యంతరంలేదు.అయితే ఉపయోగించే పదం పొందికగా తగిన పదం ఉండాలి. యర్రా రామారావు (చర్చ) 13:42, 29 అక్టోబరు 2023 (UTC)
'డిఫ్' (Diff) తెలుగు
[మార్చు]తెవికీ సభ్యులకు నమస్కారం.
డిఫ్ (Diff), వికీమీడియా ఉద్యమానికి సంబంధించిన కమ్యూనిటీ బ్లాగ్. వికీమీడియన్లు వివిధ భాషలలో విశేషాలు,వార్తలు దీంట్లో ప్రచురిస్తారు. మన 'తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్' అభ్యర్ధన అనుసరించి 'డిఫ్' ఇపుడు తెలుగు భాషకి కూడా వేదిక ఏర్పాటు చేసింది. మన తెలుగు కమ్యూనిటీ వార్తలు పోస్ట్ చేయవచ్చు. ఇతర భాషల నుంచి ఉపయోగపడే విశేషాలు అనువాదం చేసి ప్రచురించవచ్చు. తెవికీ విశేషాలు ఇతర భాషా వికీమీడియన్ల అందుబాటులోకి తేవడానికి ఈ ప్రసారమాధ్యమం ఉపయోగపడుతుంది.
తెలుగు కి డిఫ్ వేదిక రాక మునుపు మన తెవికీ క్రికెట్ 2023 ప్రాజెక్ట్ గురించిన పవన్ సంతోష్ గారి పోస్ట్ [[3]] చూడవచ్చు. VJS (చర్చ) 10:21, 28 అక్టోబరు 2023 (UTC)
- @Vjsuseela గారూ, ఈ అంశాన్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. అందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని మనవి. పవన్ సంతోష్ (చర్చ) 07:37, 5 నవంబరు 2023 (UTC)
"ఈ వారపు వ్యాసం" విషయమై నిర్వాహకులకు మనవి
[మార్చు]వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా పేజీ సంరక్షణలో ఉన్నందున 2023 జాబితాను తాజాకరించడం కుదరలేదు. దాన్ని తాజాకరించవలసినదిగా నిర్వాహకులను కోరుతున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 10:41, 29 అక్టోబరు 2023 (UTC)
- @చదువరి గారూ దీని మీద సంరక్షణ ప్రస్తుతానికి సడలించాను.కేవలం అజ్ఞాత వాడుకరులు మాత్రమే సవరించకుండా సంరక్షణలో ఉంచాను.అవసరమైతే పరిశీలించి తిరిగి యథాస్థితికి పెడదాం.అవకాశముంటే దానిలో సవరించగలరు. యర్రా రామారావు (చర్చ) 13:29, 29 అక్టోబరు 2023 (UTC)
- ధన్యవాదాలు సార్. పనైపోయింది. ఇక సంరక్షణను పెంచొచ్చు. సంరక్షణ తగ్గించాలనేది నా ఉద్దేశం కాదు. ఏదో ప్రత్యేకమైన కారణం తోటే దాన్ని సంరక్షించి ఉంటారు. ఇకపై తగ్గించవద్దు లెండి.__ చదువరి (చర్చ • రచనలు) 13:39, 29 అక్టోబరు 2023 (UTC)
- తిరిగి పూర్వ స్థితికి మార్చాను యర్రా రామారావు (చర్చ) 13:45, 29 అక్టోబరు 2023 (UTC)
- ధన్యవాదాలు సార్. పనైపోయింది. ఇక సంరక్షణను పెంచొచ్చు. సంరక్షణ తగ్గించాలనేది నా ఉద్దేశం కాదు. ఏదో ప్రత్యేకమైన కారణం తోటే దాన్ని సంరక్షించి ఉంటారు. ఇకపై తగ్గించవద్దు లెండి.__ చదువరి (చర్చ • రచనలు) 13:39, 29 అక్టోబరు 2023 (UTC)
"సినిమా" మూస, "Infobox film" మూస
[మార్చు]సినిమా పేజీల కోసం {{Infobox film}}, {{సినిమా}} అనే రెండు మూసలున్నాయి. రెండూ విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. మొదటి దాన్ని 3,100 పేజీల్లో వాడగా రెండో దాన్ని 3,900 పేజీల్లో వాడారు. వీటిలో తేడాలు చాలానే ఉన్నాయి. రెంటిలో ఉన్న ఫీల్డుల పరంగా చూస్తే "సినిమా" అనే మూస తెవికీకి ఎక్కువ అనువుగా ఉందనిపిస్తోంది. దానిలో ఉన్న ఫీల్డుల కారణంగా ఆయా పేజీలు సంబంధిత వర్గాల్లోకి చేరిపోతున్నాయి కూడా. అయితే రెండోదానిలో ఇందులో లేని విశేషాలు కొన్నున్నాయి. నిర్వహణ పరంగా సులువుగా ఉండేందుకు గానూ ఈ రెంటినీ కలిపేస్తే బాగుంటుంది (ఒకే పని కోసం రెండు మూసలుండడం అభిలషణీయం కాదు కూడాను). కలిపాక "సినిమా" మూసను "Infobox film" కు దారిమార్పుగా చెయ్యాలి. అందుకు కింది పనులు చెయ్యాలి:
- "సినిమా" మూసలో ఉన్న అదనపు ఫీల్డులను, వర్గాలనూ "Infobox film" లో చేర్చాలి.
- ఆ తరువాత "సినిమా" మూసను, "Infobox film" మూసకు దారిమార్పుగా చెయ్యాలి
- అవకాశం చూసుకుని "సినిమా" మూస ఉన్న పేజీల్లో దాని స్థానంలో "Infobox film" అని మార్చాలి. ఇది తప్పనిసరేమీ కాదు గానీ చేస్తే మంచిది (తద్వారా, ఆ తరువాత "సినిమా" అనే పేరును వేరే మూసకు వాడుకునే వీలు కలుగుతుంది).
నిర్వాహకులు తగు చర్య తీసుకోవలసినదిగా కోరుతున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 13:51, 30 అక్టోబరు 2023 (UTC)
రోజుకో వ్యాసం రాసేవారి కోసం
[మార్చు]"100 రోజులు/100 వ్యాసాలు" దీక్ష తీసుకున్నవారు రోజువారీగా వ్యాసాలు ఉంటున్నాయో లేదో సరిచూసుకునేందుకు ఈ పరికరం పనికొస్తుంది - https://dicare.toolforge.org/100wikidays/
అక్కడే వికీడేటాకు పనికొచ్చే పరికరం కూడా ఒకటుంది. __ చదువరి (చర్చ • రచనలు) 14:14, 30 అక్టోబరు 2023 (UTC)
- ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:35, 1 నవంబరు 2023 (UTC)
- పరికరం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు @Chaduvari గారు. Divya4232 (చర్చ) 16:04, 2 నవంబరు 2023 (UTC)
తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన చర్చించడానికి సమావేశం
[మార్చు]అందరికీ నమస్కారం,
పైన రచ్చబండలోనే తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం అన్న విభాగంలో తెలుగు వికీపీడియా వార్షికోత్సవాన్ని సీఐఎస్-ఎ2కెతో భాగస్వామ్యంతో చేయడానికి ఆలోచనలు తెలియజేయడమూ, దానిపై చర్చించడానికి సమావేశం నిర్వహించుకుందామని ప్రతిపాదించడమూ గమనించవచ్చు. ఇలాంటి చర్చలో పాల్గొనడానికి సంసిద్ధత వ్యక్తపరుస్తూ వాడుకరి:Chaduvari, వాడుకరి:Pranayraj1985 గార్లు ప్రతిస్పందించారు. అందువల్ల దీనిపై చర్చ నిర్వహించుకోవడానికి ఒక ఆన్లైన్ సమావేశాన్ని 2023 నవంబర్ 5, ఆదివారం ఉదయం నిర్వహించనున్నాము. చర్చ జరిగాకా అందులో ఆలోచించిన విషయాలను, ప్రతిపాదనలు తిరిగి తెలుగు వికీపీడియాలో చర్చకు పెట్టి, ఇక్కడి నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్తాము. ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి కలవారు సమావేశపు పేజీలో తమ ఆసక్తి తెలియజేయగలరు. మిగిలిన వివరాలు కూడా అక్కడే చూడవచ్చు. ధన్యవాదాలతో పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:49, 2 నవంబరు 2023 (UTC)
- అలాగేనండీ @Pavan (CIS-A2K) గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:10, 2 నవంబరు 2023 (UTC)
మన ఓటు మన హక్కు - ఎడిట్-ఎ-థాన్
[మార్చు]సముదాయ సభ్యులకు నమస్కారం!
తెలంగాణతో పాటు మనదేశంలో మొత్తం 5 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా ఎన్నికలు ఉన్న ప్రతీ రాష్ట్రంలోని పౌరుడికి ఓటుహక్కు అనేది ఆయుధంగా మారింది. ఈ సందర్భంగా ఓటుహక్కును గుర్తు చేసుకుంటూ ఒక వారం రోజులపాటు (ఈ నెల 12 ఆదివారం నుండి 18 శనివారం వరకు) ఎన్నికలపై ఎడిటథాన్ నిర్వహిస్తే బావుంటుందని అభిప్రాయం. దీంట్లో భాగంగా ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించిన నాయకుల వ్యాసాలు, మొదలైన ఎన్నికలకు సంబంధించిన వ్యాసాలు సృష్టిస్తే బావుంటుంది. దీనిపై సముదాయ సభ్యులు మీమీ అభిప్రాయాలను తెలుపగలరు. -- అభిలాష్ మ్యాడం (చర్చ) 06:11, 3 నవంబరు 2023 (UTC)
- @MYADAM ABHILASH గారూ ఈ ఎడిటథాన్ అంశం చాలా బాగుంది, ముఖ్యంగా వారి అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలు జనాలకు తెలవ వలసిన అవసరం చాలా ఉన్నది వాటిని సరైన మూలాలతో చేర్చాలి. Kasyap (చర్చ) 06:24, 3 నవంబరు 2023 (UTC)
- మ్యాడం అభిలాష్ గారు, మన ఓటు మన హక్కు గురించి ఎడిటథాన్ నిర్వహించాలి అనే ఆలోచన బాగుంది. నా వంతు కృషి నేను ఈ ఎడిటథాన్ పై చేస్తాను. V Bhavya (చర్చ) 09:56, 4 నవంబరు 2023 (UTC)
- @MYADAM ABHILASH గారు ఎడిటాన్ నిర్వహించాలి అనే ఆలోచన బాగుంది. Divya4232 (చర్చ) 13:24, 4 నవంబరు 2023 (UTC)
- అభిలాష్ మ్యాడం గారు, చక్కటి ప్రస్తావన. ప్రస్తుతం బాహ్య ప్రపంచంలో జరుగుతున్న అంశాలపై ఎడిటతాన్ లాంటివి నిర్వహించడం ద్వారా తెలుగు వికీలో మరింత చైతన్యవంతమైన కృషి జరిగే ఆస్కారం ఉంది. అయితే ఈ ప్రస్తావనను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను, ఇక ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒక నమూనా పేజీ రూపొందించడం మొదలు పెట్టాను, దీనిని ముందుకు తీసుకువెళ్లే ఆసక్తి ఉంటె వాడుకరి:Nskjnv/Our Vote Our Right పేజీని అభివృద్ధి చేయడంలో మీవంతు దిద్దుబాట్లు చేయడం మొదలెట్టండి.
@Kasyap గారి సూచన బాగుంది, ఇంకా ఇలాంటి వ్యాసాలకి సంబంధించి కొన్ని వర్గాలు నేను జాబితా ఏర్పరుస్తున్నాను. అయితే ఈ ఎడిటతాన్ వారం రోజులు కాకుండా 15 రోజులు ఉంటె బాగుంటుందేమో అని నా అభిప్రాయం, నవంబరు 10 నుండి 25 వరకు చేపట్టచ్చు, పరిశీలించడండి.
ధన్యవాదాలు. NskJnv 15:27, 3 నవంబరు 2023 (UTC)
- @MYADAM ABHILASH గారూ ఈ ప్రస్తావన తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు.ఈ ఆధునిక కాలంలో ఓటు హక్కు ఆవశ్యకత గురించి అవగాహన అవసరం, అందుకు ఈ ఎడిటథాన్ ఉపయోగపడుతుంది.నా వంతుగా ఈ ఎడిటథాన్ కు కృషి చేస్తాను.అలాగే Kasyap సార్ చెప్పినట్లు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన అఫిడవిట్ లోని వారి ఆస్తుల వివరాలు అలాగే వారి మీద గల కేసుల గురించి కూడా మూలాలతో సహా వ్యాసాల్లో పొందుపరచాలి. అప్పుడు ఓటర్లకు అభ్యర్థి గురించి అవగాహన వస్తుంది.KINNERA ARAVIND (చర్చ) 14:29, 4 నవంబరు 2023 (UTC)
అభిప్రాయాలను తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు. అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎడిట్ తాన్ పేజీ ఒకటి సృష్టించాను. గమనించగలరు. -- అభిలాష్ మ్యాడం (చర్చ) 13:46, 7 నవంబరు 2023 (UTC)
- మన ఓటు మన హక్కు ఎడిట్-ఎ-థాన్ లో ఏ వ్యాసాలు రాయాలో సరైన సమాచారం లేదు. క్రికెట్ ప్రాజెక్ట్ లో లాగా సమాచారం ఉంటే బాగుంటుంది. V Bhavya (చర్చ) 05:42, 17 నవంబరు 2023 (UTC)
అందరికి నమస్కారం.! ఈ ఎడిట్-ఎ-థాన్ నిర్వహకులకు అభినందనలు. కోట నీలిమ, గుర్మీత్ సింగ్ కూనర్, ఛత్తీస్‌గఢ్ శాసనసభ, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్, నారాయణ్ చందేల్, నారాయణ్ బెనివాల్, బినోయ్ విశ్వమ్, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ, విజయలక్ష్మి సాధో, హనుమాన్ బెనివాల్ వ్యాపాలు ఎడిట్-ఎ-థాన్ లో భాగంగా రాసాను. ఇంతకీ నా సందేహం ఏంటంటే నేను మన ఓటు మన హక్కు - ఎడిట్-ఎ-థాన్లో పాల్గొన్న విధానం సరియైనదేనా కాదా. దయచేసి చెప్పగలరు.Muralikrishna m (చర్చ)
A2K Monthly Newsletter for October 2023
[మార్చు]
Please feel free to translate it into your language.
Dear Wikimedians,
In the month of October, CIS-A2K achieved significant milestones and successfully concluded various initiatives. As a result, we have compiled a comprehensive monthly newsletter to showcase the events and activities conducted during the preceding month. This newsletter offers a detailed overview of the key information pertaining to our various endeavors.
- Conducted events
- Image Description Month in India
- WikiWomen Camp 2023
- WWC 2023 South Asia Orientation Call
- South Asia Engagement
- Wikimedia Commons session for Birdsong members
- Image Description Month in India Training Session
Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 05:25, 7 నవంబరు 2023 (UTC)
AMS కళశాలలో వికీమీడియా వర్కుషాప్
[మార్చు]అందరికి నమస్కారం!
నేను వికీపీడియా గురించి తెలుసుకున్నాక ఇందులో దిద్దుబాట్లు చేస్తూ తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను. అదే విధంగా నా తోటి మహిళలకి కూడా వికీపీడియా కామన్స్ అలాగే తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల గురించి ఇందులో ఏమి చేయవచ్చు తద్వారా తెలుగు భాషాభివృద్ధికి మనం ఏమి చేయవచ్చు అనే విషయం పై అవగాహన కలించాలని నేను AMS కళశాలలో ఒక వర్క్ షాప్ నిర్వహించదలుచుకున్నాను.
దాదాపుగా తెలుగు వికీకి సంబంధించి జరిగే సమావేశాలు ఓపెన్ వేదికల్లో ఉండడం వల్ల ఎక్కువగా పురుషుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం గమనించవచ్చు, అయితే తెలుగు వికీలో మహిళలు భాగస్వామ్యం పెంచే దిశగా మహిళా కళాశాల అయినా AMS కళశాలలో వర్క్ షాప్ నిర్వహించి తెలుగు వికీమీడియా ప్రాజెక్టులపై వారికి అవగాహన కలిపించాలని అనుకుంటున్నాను.
ఈ కార్యక్రమానికి వికీ ఫౌండేషన్ ద్వారా సహాయం అందుకోవచ్చని గ్రహించి, తెవికీ యువ సహాయంతో ఒక ప్రపోసల్ ని నిర్మించడం జరిగింది. ఈ విషయంలో సహాయం అందిస్తూ తెవికీలో యువత, మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా కృషి చేస్తున్న తెవికీ యువ ప్రాజెక్టు నిర్వాహకులకు ధన్యవాదాలు.
ఈ ప్రాజెక్టు ప్రస్తుతం మెటాలో రివ్యూ లో ఉంది - లింకు, కనుక ఈ ప్రపోజల్ని సమర్థించేవారు మీ మద్దతు తెలుపవచ్చు. మీ అందరి సహకారం ఉంటుందని భావిస్తున్నాను. ముఖ్యంగా తోటి మహిళా వికీపీడియన్లు ఈ ప్రాజెక్ట్ లో భాగం కావాలని కోరుకుంటున్నాను. V Bhavya (చర్చ) 05:57, 8 నవంబరు 2023 (UTC)
- @V Bhavya గారూ, చాలా మంచి ప్రయత్నం అండీ. మీకు ఈ విషయంలో ఏ సహాయం అవసరమైనా తప్పక చెప్పండి. పవన్ సంతోష్ (చర్చ) 05:28, 12 నవంబరు 2023 (UTC)
- తప్పకుండా పవన్ సంతోష్ గారు, మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. V Bhavya (చర్చ) 06:14, 12 నవంబరు 2023 (UTC)
- నా మద్దతు తెలుపుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 07:29, 12 నవంబరు 2023 (UTC)
- @యర్రా రామారావు గారూ, ఆ గ్రాంటు పేజీలో Endorsements_and_Feedback అన్న దగ్గర Endorsements అన్న బటన్ నొక్కి మీ మద్దతును, దానికి గల కారణాన్ని (తెలుగులోనే) రాసెయ్యండి. పవన్ సంతోష్ (చర్చ) 08:00, 12 నవంబరు 2023 (UTC)
- పవన్ సంతోష్ గారూ మీరు తెలిపినట్లు, @భవ్య గారూ నా మద్దతు మెటా పేజీలో తెలిపాను యర్రా రామారావు (చర్చ) 08:30, 12 నవంబరు 2023 (UTC)
- @యర్రా రామారావు గారూ, ఆ గ్రాంటు పేజీలో Endorsements_and_Feedback అన్న దగ్గర Endorsements అన్న బటన్ నొక్కి మీ మద్దతును, దానికి గల కారణాన్ని (తెలుగులోనే) రాసెయ్యండి. పవన్ సంతోష్ (చర్చ) 08:00, 12 నవంబరు 2023 (UTC)
- @V Bhavya గారూ, చాలా మంచి ప్రయత్నం అండీ. మీకు ఈ విషయంలో ఏ సహాయం అవసరమైనా తప్పక చెప్పండి. పవన్ సంతోష్ (చర్చ) 05:28, 12 నవంబరు 2023 (UTC)
- @ V Bhavya గారు, తెవికీ యువ ద్వారా మీకు ఈ ప్రాజెక్టు రూపకల్పనలో సహాయం అందించినందుకు నేను సంతోషిస్తున్నాను. తెలుగు వికీలో మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా చేపట్టాలనుకున్న ఈ కార్యం దిగ్విజయంగా అప్రూవల్ పొందాలని ఆశిస్తున్నాను. మెటాలో నా మద్దతు తెలియజేశాను, ధన్యవాదాలు. నేతి సాయి కిరణ్ (చర్చ) 13:18, 12 నవంబరు 2023 (UTC)
- ధన్యవాదాలు అండీ @యర్రా రామారావు గారు. V Bhavya (చర్చ) 15:29, 12 నవంబరు 2023 (UTC)
- ధన్యవాదాలు అండీ @ నేతి సాయి కిరణ్ గారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో సహాయం అందించినందుకు ధన్యవాదాలు. V Bhavya (చర్చ) 15:31, 12 నవంబరు 2023 (UTC)
- చేసాను __చదువరి (చర్చ • రచనలు) 01:33, 13 నవంబరు 2023 (UTC)
- ధన్యవాదాలు అండీ @చదువరి గారు. మీ మద్దతు తెలిపినందుకు. V Bhavya (చర్చ) 07:01, 14 నవంబరు 2023 (UTC)
- @ V Bhavya గారు, తెవికీ యువ ద్వారా మీకు ఈ ప్రాజెక్టు రూపకల్పనలో సహాయం అందించినందుకు నేను సంతోషిస్తున్నాను. తెలుగు వికీలో మహిళల భాగస్వామ్యం పెంచే దిశగా చేపట్టాలనుకున్న ఈ కార్యం దిగ్విజయంగా అప్రూవల్ పొందాలని ఆశిస్తున్నాను. మెటాలో నా మద్దతు తెలియజేశాను, ధన్యవాదాలు. నేతి సాయి కిరణ్ (చర్చ) 13:18, 12 నవంబరు 2023 (UTC)
- @ V Bhavya గారు, మెటాలో నా మద్దతు తెలియజేశాను, ధన్యవాదాలు.Divya4232 (చర్చ) 04:38, 13 నవంబరు 2023 (UTC)
- ధన్యవాదాలు అండీ @ Divya4232 గారు, మీ మద్దతు తెలిపినందుకు. V Bhavya (చర్చ) 07:03, 14 నవంబరు 2023 (UTC)
- @ V Bhavya గారు, మెటాలో నా మద్దతు తెలియజేశాను, ధన్యవాదాలు.Divya4232 (చర్చ) 04:38, 13 నవంబరు 2023 (UTC)
- @భవ్యగారు మెటాలో నా మద్దతు తెలియ చేశాను. ఈ మీ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. VJS (చర్చ) 06:30, 13 నవంబరు 2023 (UTC)
- @VJS గారు, మీ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అండీ. V Bhavya (చర్చ) 07:04, 14 నవంబరు 2023 (UTC)
- చేసాను @ V Bhavya గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:54, 19 నవంబరు 2023 (UTC)
- ధన్యవాదాలు అండీ @ --ప్రణయ్‌రాజ్ వంగరి గారూ,మీ మద్దతు తెలిపినందుకు. V Bhavya (చర్చ) 06:33, 22 నవంబరు 2023 (UTC)
- చేసాను @ V Bhavya గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:54, 19 నవంబరు 2023 (UTC)
- @VJS గారు, మీ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అండీ. V Bhavya (చర్చ) 07:04, 14 నవంబరు 2023 (UTC)
వికీపీడియా 20వ వార్షికోత్సవాల విషయమై సీఐఎస్-ఎ2కె ప్రతిపాదన
[మార్చు]గతంలో రచ్చబండలో సీఐఎస్-ఎ2కె 20వ వార్షికోత్సవం విషయంలో తెలుగు వికీమీడియా సముదాయంతోనూ, యూజర్ గ్రూపుతోనూ కలసి పనిచేయడానికి ఆసక్తి కలిగి ఉందని, దాని గురించి వివరాలు మాట్లాడడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటుచేయడం అభ్యంతరం లేకపోతే చేసి మాట్లాడడతానని నేను రాశాను. దానికి కొందరు తెలుగు వికీపీడియన్లు అంగీకారం తెలపడంతో సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించాం. నిర్వాహకుడిని మినహాయిస్తే 16 మంది హాజరయ్యారు. దానిలో సీఐఎస్-ఎ2కె ప్రోగ్రామ్ మేనేజర్ హోదాలో పవన్ సంతోష్ చేసిన ప్రతిపాదన సారాంశం ఇది:
సీఐఎస్-ఎ2కె ప్రోగ్రామ్ మేనేజర్ హోదాలో తాను ఈ సమావేశంలో మాట్లాడుతున్నట్టు మొట్టమొదట స్పష్టం చేశారు. కనుక, ఈ ప్రతిపాదన సీఐఎస్-ఎ2కె తరఫు నుంచి తెలుగు వికీమీడియా సముదాయంతోనూ, యూజర్ గ్రూప్‌తోనూ తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం విషయమై కలసి పనిచేసేందుకు ఆసక్తి ఉందంటూ చేసిన ప్రతిపాదన.
- లాభాపేక్ష రహిత పరిశోధన సంస్థ అయిన సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీలోని యాక్సెస్ టు నాలెడ్జ్ టీమ్ (ఇకపై సీఐఎస్-ఎ2కె అని వ్యవహరిస్తాను) గత పది సంవత్సరాలకు పైగా భారతీయ భాషల్లో వికీమీడియా ప్రాజెక్టులతోనూ, భారతీయ వికీమీడియన్లతోనూ కలసి భారతీయ భాషల వికీమీడియా ప్రాజెక్టుల వృద్ధి లక్ష్యంతో (స్థూలంగా) పనిచేస్తోందని @Pavan (CIS-A2K): తెలియజేశారు.
- 2014-19 మధ్యకాలంలో సీఐఎస్-ఎ2కె తెలుగు వికీమీడియా ప్రాజెక్టులను ఫోకస్ లాంగ్వేజ్ ఏరియా పేరిట ఒక ప్రత్యేకమైన వర్టికల్‌గా లేక వర్టికల్‌లో భాగంగా ఎంచుకుని ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రకరకాల ప్రణాళికలను అమలుచేసి పనిచేసిన సంగతి కొత్తవారికి తెలియజేశారు. ఆ సందర్భంగా 2013లో తెలుగు వికీపీడియా ఉగాది మహోత్సవం, 2014లో తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు, 2015లో తెలుగు వికీపీడియా 11వ వార్సికోత్సవం కార్యక్రమాలకు సహజంగానే ఆ ప్రణాళికలో భాగంగా సీఐఎస్-ఎ2కె మద్దతునిచ్చి పనిచేసిందని తెలిపారు. అయితే, సీఐఎస్-ఎ2కె ప్రస్తుతం కొన్ని సంవత్సరాలుగా ఫోకస్ లాంగ్వేజ్ ఏరియా పద్ధతిలో పనిచేయట్లేదని తెలియజేశారు.
- ప్రస్తుతం సీఐఎస్-ఎ2కె ప్రణాళికలో వికీమీడియా ప్రాజెక్టులపై జరిగిన పని గురించిన సమీక్ష, అవకాశాలు-సవాళ్ళపై అధ్యయనం, భవిష్యత్ కార్యప్రణాళిక వంటివాటిపై దృష్టి ఉందని చెప్పారు. తెలుగు వికీమీడియా సముదాయం కూడా తరచుగా ఈ దృష్టిలోనే ఆలోచిస్తుందని తాము గమనించామన్నారు. వల్ల తెలుగు వికీపీడియా సమీక్ష, అధ్యయనం, ప్రణాళిక రచన వంటివాటిని కూడా కొన్ని లక్ష్యాలుగా తీసుకుని 20వ వార్షికోత్సవం నిర్వహించే ఉద్దేశం ఉంటే 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించడంలో భాగస్వామ్యం వహించడానికి సీఐఎస్-ఎ2కె ఇష్టపడుతోందని చెప్పారు.
- సీఐఎస్-ఎ2కె వారు తెలుగు వికీపీడియా కంటెంట్ నాణ్యత, కార్యక్రమాల ప్రభావం, సాంకేతిక సామర్థ్యం, వంటి కొన్ని అంశాలపై స్వతంత్ర్య అధ్యయనం చేయించి ఇవ్వడమూ, 20వ వార్షికోత్సవానికి సంబంధించిన ఆర్థిక ఖర్చులను, రవాణా-వసతి వంటి ఏర్పాట్ల సహా సీఐఎస్-ఎ2కె అందించడానికి ఆసక్తి చూపుతోందన్నారు.
- ముందుగా తెలుగు వికీమీడియన్లు ఈ లక్ష్యాలతో కార్యక్రమం నిర్వహించడానికి ఉత్సాహం చూపిస్తూంటే గనుక ఎప్పుడు, ఎక్కడ, ఎంత ఖర్చుతో, ఎలా నిర్వహించాలన్న అంశాలపై తదుపరి చర్చలు చేయవచ్చన్నారు.
- ఈ కార్యక్రమాన్ని గనుక సీఐఎస్-ఎ2కె భాగస్వామ్యంతో చేసేట్టయితే తనకు రెండుపక్షాలతోనూ సంబంధం ఉన్నందున, ఆసక్తుల ఘర్షణ ఏర్పడే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా ఎ2కెలో నిర్ణయాత్మకమైన స్థానం ఉన్నందున ఈ కార్యక్రమం విషయంలో సీఐఎస్-ఎ2కెలో "ఆర్థికపరమైన అభ్యర్థనలను స్వీకరించి, నిర్ణయించే అధికారాన్ని" తన బదులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ని స్వీకరిస్తారని పవన్ సంతోష్ తెలియజేశారు.
దీనిపైన తర్వాత హాజరైన సభ్యులతో చర్చలు జరిగాయి. దాని చిత్తు నోట్స్ ఇక్కడ చదవవచ్చు: తెలుగు_వికీపీడియా_20వ_వార్షికోత్సవం_గురించిన_ఆన్లైన్_సమావేశం నివేదిక.
ఇప్పుడు ఈ అంశంపై మీమీ అభిప్రాయాలను, ప్రశ్నలను తెలియజేయమని తెలుగు వికీపీడియా సముదాయాన్ని ఆన్-వికీ వేదికగా అభ్యర్థిస్తున్నాను. ఒకసారి ఈ అంశంలో ముందుకు వెళదామని నిర్ణయించుకున్నాకా మరో సమావేశం, ఈసారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తన్వీర హాసన్ ను కూడా ఆహ్వానిస్తాను. ఆ సమావేశంలో కార్యక్రమ ప్రణాళిక చర్చించవచ్చు. అందరికీ ముందస్తుగా ధన్యవాదాలు. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 11:07, 10 నవంబరు 2023 (UTC)
- వికీపీడియా 20వ వార్షికోత్సవాలు జరిపే కార్యక్రమంపై 2023 నవంబరు 2న జరిగిన ఆన్లైన్ గూగుల్ మీట్ సమావేశంలో నేనుకూడా పాల్గొన్నాను.వికీపీడియా 20వ వార్షికోత్సవాలు జరపటానికి సీఐఎస్-ఎ2కె భాగస్వామ్యం వహించటానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు.@Pavan (CIS-A2K) గారూ CIS-A2K వారిని గురించి భారతీయ భాషల్లో వికీమీడియా ప్రాజెక్టులతోనూ, భారతీయ వికీమీడియన్లతోనూ కలసి భారతీయ భాషల వికీమీడియా ప్రాజెక్టుల వృద్ధి లక్ష్యంతో పనిచేస్తున్న వివరాలు క్షుప్తంగా వివరిస్తూ, కార్యక్రమం జరపటానికి ఎలా ముందుకు వెళ్లాలి, ఎలాజరుపుకుందాం అనేదానిపై సోదాహరణంగా వివరించినందుకు ధన్యవాదాలు.పైన వివరించిన నివేదికలో సభ్యులు వివరించిన అన్ని విషయాలు నివేదికలో పొందుపర్చారు. అయితే నావరకు నాకు వార్షికోత్సవాలు జరిపే కార్యక్రమంపైకన్నా ఎక్కువ విషయాలు ఇతరత్రా కార్యక్రమాలపై మాట్లాడినట్లు అనిపించింది.వికీపీడియాలో ఏవోవో ఎన్నో చేయాలని చాలా విషయాలు చెప్పారు.చాలా సంతోషం. అందరూ వికీపీడియా అభిపృద్ధికి పనికివచ్చే మంచిసూచనలు చేసారు.సూచనలు చేసిన వారందరికి ధన్యవాదాలు. అయితే అసలు లోపంపై ఎవ్వరూ స్పందించకపోవటం నాకు కొద్దిగా బాధకలిగించింది.సరే దీనిని పక్కనబెడదాం.ఇక వార్షికోత్సవాలు జరిపే కార్యక్రమానికి వస్తే వికీపీడియా చర్చ:సమావేశం/తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశం నివేదికలో చదువరి గారు వార్షికోత్సవం కార్యక్రమంలో ఆటవిడుపు, వేడుకలు వగైరాలతో పాటు సమీక్ష, ప్రణాళికల వంటివి ఉంటే సిఐఎస్ అందులో భాగస్వామ్యం తీసుకోవాలంటే అది ఒక నిబంధన అని భావిస్తున్నట్టు, తెవికీని సమీక్షించాలనే సిఐఎస్ వారి ప్రతిపాదన బాగుందని, అలాగే వారు స్వతంత్ర సమీక్షచేసి, ఆ నివేదికను వార్షికోత్సవంలో సమర్పిస్తారని, తద్వారా వార్షికోత్సవ సమయంలో దానిపై చర్చ జరిపే అవకాశం కూడా ఉండగలదని, ఈ సమీక్ష భవిష్యత్తులో తెవికీ ప్రగతికి ఉపయోగపడే అవకాశం ఉందని, సీఎస్ భాస్వామ్యం కారణంగా నిధులు చేకూరి, ఈ కార్యక్రమాన్ని మరింత పెద్దయెత్తున నిర్వహించే అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం వెల్లడిస్తూ, ఈ ప్రతిపాదనపై సర్వత్రా ఆమోదం లభించింది కాబట్టి, సిఐఎస్, తెవికీ రెండూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటానికి తదుపరి చర్యలు తీసుకోవాలని తెవికీ లోని కార్యక్రమ ప్రతిపాదకులు/నిర్వాహకులను, సిఐఎస్‌నూ కోరుతూ అభిప్రాయం తెలిపారు.వారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తూ నేను మరికొన్ని సూచనలు లేదా అభిప్రాయాలు వెల్లడిస్తున్నాను.
- కార్యక్రమం మూడు రోజులు జరగాలి.
- కార్యక్రమం ముందురోజు సాయంత్రానికి అందరూ చేరుకోవాలి.
- మూడు రోజులు కార్యక్రమంలో జరిగే కార్యక్రమాల చిత్తు పట్టికను ఈ సారి జరిగే సమావేశంలో చర్చించటానికి ముందుగానే తయారుచేయాలి.
- వేడుకల కార్యక్రమాలలో అందరి అభిప్రాయాలు తప్పనిసరిగా తెలపటానికి తగిన సమయం కేటాయించాలి.
- తెవికీలో అభివృద్ధిని లేదా లోటుపాట్లును గురించి వెల్లడించిన అభిప్రాయాలుపై ఎప్వరూ వ్యక్తిగతంగా స్పందించకూడదు.అవి వికీ అభివృద్దిలో భాగంగా చేసిన అభిప్రాయాలుగానే భావించాలి.
- కార్యక్రమం 100% విజయవంతం కావాలంటే ఎవరికి వారు వారి స్వంతపనిగా భావించి హాజరుకావాలి. అందరూ వస్తే ఆ కార్యక్రమం అనుభూతి మాటల్లో చేప్పేదికాదు.అందరూ తప్పనిసరిగా వస్తారని నేను నమ్ముతున్నాను.ప్రస్తుతానికి ఇంతే.
- ముందుకు పోవటానికి దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని తెవికీ లోని కార్యక్రమ ప్రతిపాదకులు/నిర్వాహకులను, సిఐఎస్‌నూ కోరుతున్నాను. యర్రా రామారావు (చర్చ) 17:39, 14 నవంబరు 2023 (UTC)
- @యర్రా రామారావు గారూ, @Chaduvari గారూ, ఈ అంశంపై పలు అభిప్రాయాలను సమీక్షించి తుది నిర్ణయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. దీనిపై ఇరుపక్షాలూ సుముఖంగానే ఉన్నందున ముందుకు వెళదాము. వారం రోజుల లోపు ఒక సమావేశం నిర్వహించుకుందాం. మావైపు నుంచి ఇతర టీమ్ సభ్యులను కూడా ఆహ్వానించి ఆ కార్యక్రమం నిర్వహిస్తాను. వీలైతే సమీక్ష చేసే పనిని చేపట్టి నడిపిస్తున్న జట్టుకు చెందినవారిని కూడా ఆహ్వానిస్తాను. ఈ తదుపరి సమావేశ వివరాలను ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఈలోగా దయచేసి తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఒక పేజీ సృష్టించమని అభ్యర్థిస్తున్నాను. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:00, 15 నవంబరు 2023 (UTC)
- వాడుకరి:Pavan (CIS-A2K) గారు సూచన ప్రకారం, చదువరి గారూ లేదా ప్రణయ్ రాజ్ గారూ తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం కార్యక్రమం గురించిన పేజీని సృష్టించగలందులకు కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:08, 15 నవంబరు 2023 (UTC)
- @యర్రా రామారావు గారూ, @Chaduvari గారూ, ఈ అంశంపై పలు అభిప్రాయాలను సమీక్షించి తుది నిర్ణయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. దీనిపై ఇరుపక్షాలూ సుముఖంగానే ఉన్నందున ముందుకు వెళదాము. వారం రోజుల లోపు ఒక సమావేశం నిర్వహించుకుందాం. మావైపు నుంచి ఇతర టీమ్ సభ్యులను కూడా ఆహ్వానించి ఆ కార్యక్రమం నిర్వహిస్తాను. వీలైతే సమీక్ష చేసే పనిని చేపట్టి నడిపిస్తున్న జట్టుకు చెందినవారిని కూడా ఆహ్వానిస్తాను. ఈ తదుపరి సమావేశ వివరాలను ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఈలోగా దయచేసి తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఒక పేజీ సృష్టించమని అభ్యర్థిస్తున్నాను. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:00, 15 నవంబరు 2023 (UTC)
భారతదేశపు రాష్ట్రాల వర్గాల పేర్ల క్రమబద్ధీకరణ
[మార్చు]భారతదేశ రాష్ట్రాలకు చెందిన కొన్ని పేజీల వర్గాల పేర్లు వివిధ రూపాల్లో కనిపిస్తున్నాయి. వర్గ పృక్షాలను ప్రత్యేకంగా లేదా నిశితంగా పరిశీలించగా కొన్ని రాష్ట్రాలకు కొన్ని వర్గాలు వివిధ రూపాల్లో ఉన్నవి. అసలే వర్గాల పరిశీలన గందరగోళంగా ఉంటుంది. ఇవి పరిశీలించినవారు మరింత గందరగోళానికి ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఇలా ఉండటం వికీమార్గదర్శకాలకు విరుద్దం. వాటిని దష్టిలో పెట్టుకుని ఏకరూపతలోకి మార్చటానికి ఈ ప్రాజెక్టుపేజీ నొకదానిని తయారుచేసి వికీపీడియా:చర్చ కొరకు వర్గాల పేజీలో అభిప్రాయాల కొరకు ప్రవేశపెట్టమైనది. ఆయా పేర్ల రూపాలతో ఉన్న వివిధ వర్గాల జాబితాను వివరించటమైనది.ఆ వర్గాలను పరిశీలించి సరైన వర్గాలను ఎంచుకొని, వాటి ప్రకారం ఏకరూపతలోకి సవరించటం కోసం ఈ ప్రాజెక్టు పేజీ ముఖ్య ఉద్దేశ్యం.ఈ లింకులోని ప్రాజెక్టుపేజీలో దిగువన సముదాయ సభ్యులు వారి అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు ఒక వారంరోజులు లోపు తెలుపగలందులకు కోరటమైనది. యర్రా రామారావు (చర్చ) 09:19, 14 నవంబరు 2023 (UTC)
- ఈ చర్చలో సముదాయ సభ్యులు ఎవ్వరూ అభిప్రాయాలు, సూచనలు లేనందున అంగీకరించినట్లుగా భావించి, దాని ప్రకారం ఒక వారం రోజులు తరువాత ఆయా వర్గాలు సవరించటానికి నిర్ణయించటమైనది. యర్రా రామారావు (చర్చ) 12:31, 26 నవంబరు 2023 (UTC)
Coming soon: Reference Previews
[మార్చు]A new feature is coming to your wiki soon: Reference Previews are popups for references. Such popups have existed on wikis as local gadgets for many years. Now there is a central solution, available on all wikis, and consistent with the PagePreviews feature.
Reference Previews will be visible to everyone, including readers. If you don’t want to see them, you can opt out. If you are using the gadgets Reference Tooltips or Navigation Popups, you won’t see Reference Previews unless you disable the gadget.
Reference Previews have been a beta feature on many wikis since 2019, and a default feature on some since 2021. Deployment is planned for November 22.
- Help page
- Project page with more information (in English).
- Feedback is welcome on this talk page.
-- For Wikimedia Deutschland’s Technical Wishes team,
Johanna Strodt (WMDE), 13:11, 15 నవంబరు 2023 (UTC)
తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన రెండవ సమావేశం
[మార్చు]- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి. ముగింపు అభిప్రాయాల సారాంశం(సందర్భాన్ని బట్టి), చర్చ ముగింపు కారణం క్రింద ఇవ్వబడింది..
- 20 వ వార్షికోత్సవం విషయమై సమాచారం కోసం, చర్చల కోసం ప్రత్యేకంగా సృష్టించిన పేజీలను చూడవచ్చు.
గత సమావేశమూ, దాని తర్వాత తెలుగు వికీపీడియాలో జరిగిన చర్చల ఫలితంగా తెలుగు వికీమీడియా సముదాయమూ, సీఐఎస్-ఎ2కె రాబోయే 20వ వార్షికోత్సవంపై కలసి పనిచేస్తాయన్న నిర్ణయం వెలువడ్డందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్ళి నిర్దిష్టమైన అంశాలపై చర్చ ప్రారంభించేందుకు వీలుగా ఈ ఆదివారం నాడు (2023 నవంబర్ 19) భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 వరకూ రెండవ సమావేశం నిర్వహించనున్నాము. ఈ సమావేశానికి సీఐఎస్-ఎ2కె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తన్వీర్ హాసన్, ఒకరిద్దరు సీఐఎస్-ఎ2కె ఉద్యోగులు, తెలుగు వికీపీడియా రివ్యూ కోసం మేము సంప్రదించిన వ్యక్తులు కూడా హాజరుకానున్నారు. దీని వివరాలు ఇక్కడ చూడొచ్చు. ఇందులో పాల్గొనే ఆసక్తి ఉన్న సభ్యులందరూ అక్కడ నమోదుచేసుకుని, కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాము. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 17:26, 15 నవంబరు 2023 (UTC)
- ఆ సమయంలో బహుశా నేను ఒక వివాహ కార్యక్రమానికి వెళ్లటానికి ప్రయాణంలో ఉంటాను.మీటింగు విషయాలు వినటానికి మాత్రం పర్వాలేదు.నేను అభిప్రాయాలలో భాగస్వామ్యం కాలేను. యర్రా రామారావు (చర్చ) 04:59, 16 నవంబరు 2023 (UTC)
- వచ్చే ఆదివారం ఆ సమయంలో పెళ్ళిళ్ళతో పాటుగా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఈ సమావేశం పెట్టడం వాడుకరులందరికీ అసౌకర్యంగా ఉండవచ్చన్న ఆలోచనతో వాయిదా వేస్తున్నాం. రానున్న బుధవారం, అనగా 22వ తేదీ, రాత్రి 8 నుంచి సమావేశాన్ని నిర్వహించనున్నాం. కనుక గమనించగలరు. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:49, 17 నవంబరు 2023 (UTC)
వికీవ్యాఖ్య:ఆమె చెప్పింది - వికీవ్యాఖ్య
[మార్చు]Metaలో Wiki Loves Women/SheSaid ప్రాజెక్ట్ లో తెలుగు వికీ సమూహం నుంచి భవ్య గారు వికీవ్యాఖ్య:ఆమె చెప్పింది - వికీవ్యాఖ్య ప్రాజెక్ట్ పేజీ తయారు చేసారు. దానికి Metaలో లింక్ అయింది. ఆసక్తికలిగిన వారు అందరు వికీవ్యాఖ్యలో, ముఖ్యంగా మహిళా సభ్యులు మహిళల ప్రాజెక్ట్ #SheSaid పరిశీలించగలరు. ధన్యవాదాలు. VJS (చర్చ) 16:07, 16 నవంబరు 2023 (UTC)
- VJS గారు, అలాగేనండి. నేతి సాయి కిరణ్ (చర్చ) 13:22, 18 నవంబరు 2023 (UTC)
వికీవ్యాఖ్య:ఆమె చెప్పింది ప్రాజెక్ట్ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ లింకును వికీపీడియా పేజీలో ఇంకా వికీ వ్యాఖ్య పేజీలో ఇస్తే నడుస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి అందరికి తెలుస్తుందని భావిస్తున్నాను. నిర్వాహకులు అంగీకరిస్తే ఈ లింక్ ఏర్పరచగలరు. --VJS (చర్చ) 15:09, 24 నవంబరు 2023 (UTC)
20 వ వార్షికోత్సవం పేజీలు
[మార్చు]తెవికీ 20 వ వార్షికోత్సవానికి సంబంధించిన పేజీలు సిద్ధమయ్యాయి. వాటిని పరిశీలించి, మార్పుచేర్పులేమైనా అవసరమైతే సూచించండి. ఇకపై ఈ వార్షికోత్సవానికి సంబంధించిన చర్చలు విశేషాలూ అన్నీ ఆ పేజీల్లోనే చేద్దాం.__ చదువరి (చర్చ • రచనలు) 05:57, 17 నవంబరు 2023 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:14, 17 నవంబరు 2023 (UTC)
రెండవ సన్నాహక సమావేశపు సారాంశం, దానిపై చర్చకు ఆహ్వానం
[మార్చు]తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవాల నిర్వహణ విషయంలో రెండవ సన్నాహక సమావేశం ముందు అనుకున్న విధంగా వీడియో కాల్‌లో గత బుధవారం రాత్రి 8-9.30 మధ్యకాలంలో జరిగింది. ఇందులో జరిగిన చర్చ తాలూకు సారాంశాన్ని ఇక్కడ క్లుప్తంగా రాశాను, అలానే అదే సమావేశంలో జరిగిన చర్చను సాధ్యమైనంత సవివరంగా అక్కడే రాశాను. కాబట్టి, దీన్ని పరిశీలించి ఈ చర్చలోని అంశాలపై మీ అభిప్రాయాలు ఆ చర్చాపేజీలో తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 02:18, 26 నవంబరు 2023 (UTC)
- అలాగేనండీ @Pavan (CIS-A2K) గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:56, 26 నవంబరు 2023 (UTC)
విశాఖపట్నంపై ఒక ప్రాజెక్టు
[మార్చు]మనం తెవికీ 20 వ వార్షికోత్సవాన్ని విశాఖలో జరపాలని తలపెట్టాం. ఈ సందర్భ్జంగా నగరానికి సంబంధించి కొత్త పేజీలను సృష్టించడం, ఉన్న పేజీలను విస్తరించడం చేస్తే బాగుంటుంది. దీనికోసం ఒక చిన్న ప్రాజెక్టు పెట్టుకుందామా? డిసెంబరు నెలను ఈ ప్రాజెక్టుకు కేటయించుదామా? __ చదువరి (చర్చ • రచనలు) 11:48, 29 నవంబరు 2023 (UTC)
- మీ ఆలోచన చాల బాగుంది. అలాగే చేద్దాం --Tmamatha (చర్చ) 05:45, 1 డిసెంబరు 2023 (UTC)
- తెవికీ 20 వ వార్షికోత్సవ కమిటీలలో అందరూ భాగస్వామ్యం అయి, తరుచూ ఆపనులలో ఉండవచ్చు.గతంలో విశాఖపట్నం పరిసరాలు అనే మూసలో అన్నీ ఎర్ర లింకులతో ఉన్న దాదాపు 100 వ్యాసాలకు పైగా ఉన్న వ్యాసాల పేజీలు నేను, ప్రణయ్ రాజ్ గారూ, జీవన్ నాయుడు గారూ సృష్టించి విస్తరించాం.ఒకవేళ ప్రాజెక్టు రూపొందించిన పక్షంలో ఈ వ్యాసాలను తాజాగా ఆంగ్ల వికీపీడియా వ్యాసాలతో దీటుగా విస్తరించాలని నా అభిప్రాయం.వాటితో పాటు మూస:విశాఖపట్నం పరిసరాలు ఈ మూసలోనికి రానివి ఉంటే చేర్చి విస్తరించవచ్చు. యర్రా రామారావు (చర్చ) 06:51, 1 డిసెంబరు 2023 (UTC)
ప్రాజెక్టు పేజీ సృష్టించాను. పరిశీలించండి.__చదువరి (చర్చ • రచనలు) 04:54, 2 డిసెంబరు 2023 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:18, 2 డిసెంబరు 2023 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు - --VJS (చర్చ) 07:24, 2 డిసెంబరు 2023 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు - --V Bhavya (చర్చ) 07:45, 3 డిసెంబరు 2023 (UTC)
A2K Community Needs Assessment Form
[మార్చు]In late November, A2K hosted a significant call as part of WikiConverse India discussions, aiming to understand the diverse needs of Indian Communities! We deeply appreciate the active participation of every community member, as your valuable suggestions and opinions will be instrumental in shaping A2K's future initiatives.
To enrich this collaborative effort, we've crafted a form. Your responses will provide key components for a broader needs assessment, offering profound insights into the community's suggestions and guiding A2K’s future plans. We invite you to invest just a few precious minutes in sharing your thoughts, ideas, efforts, and impactful initiatives! If you have any doubts or queries, feel free to reach out to nitesh@cis-india.org.
Thank you for being an integral part of our vibrant community! Regards MediaWiki message delivery (చర్చ) 08:44, 5 డిసెంబరు 2023 (UTC)
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ - ఆన్లైన్ శిక్షణా తరగతులు
[మార్చు]సభ్యులకు నమస్కారం,
తెలుగు వికీపీడియన్లకు వ్యాస రచన విషయంలోనూ, వికీ నిర్వహణలోనూ నైపుణ్యాలను పెంచేలా శిక్షణ అవసరమనీ, ఇది నేర్చుకునేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తే బావుంటుందని వివిధ సందర్భాలలో పలువురు సభ్యులు కోరారు.
అందుచేత, ఇప్పుడు చురుగ్గా పనిచేస్తున్న సభ్యులకు, నిర్వాహకులకు ఇంకా మెరుగ్గా పనిచేయడంపై శిక్షణ అవసరమని గ్రహించిన మీదట దాన్ని ఇప్పించడానికి తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ తరఫున ప్రతి ఆదివారం మధ్యాహ్న సమయంలో ఒక అంశంపై ఒక గంటసేవు ఆన్లైన్ శిక్షణా తరగతులు ఏర్పాటుచేయవచ్చని గత సమావేశాలలో ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనకు ఆయా సమావేశాలలో పాల్గొన్న సభ్యులు అంగీకారాన్ని తెలిపారు. ఇందుకు అవసరమైన శిక్షణను అందించడానికి చదువరి వంటివారు ముందుకు రావడంతోపాటు, ఎవరెవరికి ఏఏ అంశాలపై శిక్షణ అవసరమో వాటిని కనుక్కొని ఆయా అంశాలపైన శిక్షణ అందిస్తే బాగుంటుందని సూచించారు. వారి సూచనలను అనుసరించి, ఆన్లైన్ శిక్షణా తరగతుల కోసం త్వరలోనే వికీలో ఒక పేజీని ఏర్పాటుచేసి సముదాయ సభ్యులకు తెలియజేస్తాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:40, 6 డిసెంబరు 2023 (UTC)
- అలాగేనండీ. ఇలాంటి కార్యక్రమం చాల ఉపయోగకరం @Pranayraj1985 గారు. V Bhavya (చర్చ) 09:22, 6 డిసెంబరు 2023 (UTC)
- మంచిదండి. నేను కూడా జాయిన్ అవుతాను. ధన్యవాదాలు VJS (చర్చ) 13:33, 6 డిసెంబరు 2023 (UTC)
Enhancing Your Wikimania 2024 Scholarship Application: Community Call and Volunteer Support
[మార్చు]Dear Wikimedians,
I hope this message finds you well. A2K is excited to share news about an upcoming A2K initiative to support Indian Wikimedians in the Wikimania 2024 scholarship process.
- Community Call with Experienced Wikimedians
Join the community call on December 9, 2023, featuring experienced Indian Wikimedians. Gain insights into the Wikimania scholarship process, key application elements, and participate in a Q&A session.
- Volunteer Committee
A dedicated volunteer committee will assist applicants through Zoom Room Support Sessions, offering one-on-one discussions, personalized feedback, and application enhancement strategies.
For more details and to register:
- Community Call Meta page: link
- Date: 9 December 2023
- Time: 6:00 PM to 7:30 PM IST
We invite your active participation and look forward to your engagement in this community call. Regards MediaWiki message delivery (చర్చ) 06:50, 7 డిసెంబరు 2023 (UTC)
తెవికీ - రెండు దశాబ్దాల ప్రస్థానం పూర్తి
[మార్చు]- నాటి వెన్న నాగార్జున గారి నుండి నేటి తెలుగు వికీపీడియా యూజర్ వరకు ఎందరో మహానుభావులు..! అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. మీకు అభినందనలు.! Muralikrishna m (చర్చ) 01:22, 10 డిసెంబరు 2023 (UTC)
- తెవికీ కి ముఖ్యమైన మైలు రాయి. చాల సంతోషకరమైన విషయం. ఇందులో భాగస్వామ్యులైన అందరికి అభినందనలు. VJS (చర్చ) 13:31, 10 డిసెంబరు 2023 (UTC)
- అందరికీ తెవికీ 20 శుభాకాంక్షలు. __చదువరి (చర్చ • రచనలు) 13:39, 10 డిసెంబరు 2023 (UTC)
- అందరికీ శుభాకాంక్షలు యర్రా రామారావు (చర్చ) 14:42, 10 డిసెంబరు 2023 (UTC)
తెవికీ 20 వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]తెవికీ 20 వ వార్షికోత్సవానికి హాజరయ్యే వారికి ఉపకారవేతనం పొందే మంచి అవకాశం. ఈ పేజీ లో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాను. ఆసక్తి ఉన్న సభ్యులందరూ (కమిటీ మెంబర్స్ తో సహా) అప్లై చేసుకోండి. - రవిచంద్ర (చర్చ) 19:08, 10 డిసెంబరు 2023 (UTC)
- అలాగేనండీ @రవిచంద్ర గారు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:20, 12 డిసెంబరు 2023 (UTC)
A2K Monthly Report for November 2023
[మార్చు]
Please feel free to translate it into your language.
Dear Wikimedians,
CIS-A2K wrapped up several initiatives in November, and we've compiled a detailed monthly newsletter highlighting the events and activities from the past month. This newsletter provides a comprehensive overview of key information regarding our diverse endeavors.
- Conducted events
- Heritage Walk in 175 year old Pune Nagar Vachan Mandir library
- 2023 A2K Needs Assessment Event
- Train The Trainer Report
Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscribe to this newsletter, click here. Regards MediaWiki message delivery (చర్చ) 05:54, 11 డిసెంబరు 2023 (UTC)
ఆంధ్రజ్యోతి పేజీవ్యూలు
[మార్చు]ఆంధ్రజ్యోతి పేజీలో ఒక ఆసక్తికర విశేషాన్ని గమనించాను. ఈ మధ్య కాలంలో ఈ పేజీని చూసే పాఠకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2023 ఏప్రిల్ 24 నుండి అకస్మాత్తుగా దాని పేజీవ్యూల సంఖ్య పెరిగిపోయింది. ఆ రోజునుండి దాని సగటు వీక్షకుల సంఖ్య రోజుకు 2,200 గా ఉంది. దానికంటే ముందు ఒక సంవత్సరం పాటు చూస్తే ఆ సంఖ్య రోజుకు కేవలం 66 - అంతే! ఏప్రిల్ 23 న దాని వీక్షకుల సంఖ్య 126. ఏప్రిల్ 24 న 512, 25 న 1800+ ! ఇక ఆ తరువాత ఏనాడూ అది 700 కి తగ్గలేదు - ఏవో రెండు మూడు రోజులు తప్పించి. ఇదే కాలంలో మొత్తం తెలుగు వికీపీడియా పేజీవ్యూల్లో వచ్చిన మార్పు పెద్దగా ఏమీ లేదు. ఎందుకిలా జరిగింది!? ఆ పేజీ చరిత్రలో చూస్తే మార్చి ఏప్రిల్ నెలల్లో కొత్తగా జరిగిన మార్పులేమీ లేవు. ఎవరైనా కావాలని దానికి వ్యూలు పెంచుతున్నారా అనే సందేహం వస్తోంది. ఈ పెరుగుదలకు అసలు కారణమేంటో తెలిస్తే అది మనకు పనికివస్తుందేమో చూడొచ్చు. పరిశీలించండి. __ చదువరి (చర్చ • రచనలు) 13:55, 12 డిసెంబరు 2023 (UTC)
(New) Feature on Kartographer: Adding geopoints via QID
[మార్చు]Since September 2022, it is possible to create geopoints using a QID. Many wiki contributors have asked for this feature, but it is not being used much. Therefore, we would like to remind you about it. More information can be found on the project page. If you have any comments, please let us know on the talk page. – Best regards, the team of Technical Wishes at Wikimedia Deutschland
Thereza Mengs (WMDE) 12:31, 13 డిసెంబరు 2023 (UTC)
భారత సార్వత్రిక ఎన్నికల వ్యాసాల ప్రాజెక్టు - 2024
[మార్చు]భారత సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్- మే లో జరుగునున్నవి. అలాగే కొన్ని రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలుకూడా జరుగనున్నవి. తెవికీనందు గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం శాసనసభ నియోజకవర్గాలకు, లోకసభ నియోజకవర్గాలుకు మాత్రమే వ్యాసాలు ఉన్నవి.వినయ్ కుమార్ గౌడ్ గారు దాదాపుగా అన్ని రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాలకు, లోకసభ నియోజకవర్గాలకు పేజీలు సృష్టించే పనిలో ఉన్నారు.ఈ సందర్బంగా గౌడ్ గారిని అభినందిస్తున్నాను. అయితే ఇంకా భారత ఎన్నికల వ్యవస్థకింద తెవికీలో ఉండాలిసిన అనేక వ్యాసాలుకు పేజీలు సృష్టించాల్సిఉంది.అలాంటి ముఖ్యమైన అన్ని వ్యాసాలును గుర్తించి, తెవికీలో పేజీలు సృష్టించటానికి ఒక ప్రాజెక్టును రూపొందించాలనే అభిప్రాయంతో సముదాయ సభ్యుల సూచనలు, అభిప్రాయాల కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 04:57, 21 డిసెంబరు 2023 (UTC)
- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు అనే వికీప్రాజెక్టు ఈ సరికే ఉంది. దీనిలో భాగంగా చెయ్యవచ్చేమో కదా.. ప్రత్యేకంగా ప్రాజెక్టు పెట్టాలంటారా? __ చదువరి (చర్చ • రచనలు) 06:12, 21 డిసెంబరు 2023 (UTC)
- @చదువరి గారూ ఆ ప్రాజెక్టు పేజీ పరిశీలించాను.ప్రత్వేకంగా ప్రాజెక్టు పేజీ పెట్టాలని లేదు.కాకపోతే ఆ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకే పరిమితమై కేవలం రెండు రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాలు, శాసనసభ సభ్యులు వ్యాసాలుకు పరిమితమైనట్లుగా అనిపించింది. మీరు సూచించేది, అంటే దానికి ఉపపేజీ పెట్టమంటారా అనేది వివరించగలరు.ఇంకా ఏమైనా సూచనలు ఉంటే వివరించగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 07:31, 21 డిసెంబరు 2023 (UTC)
- యర్రా రామారావు గారూ, మీరు చాలా మంచి ప్రతిపాదన చేశారు. ఎన్నికలకు సంబంధించిన వికీప్రాజెక్టును ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టులో నేను కూడా పాల్గొంటాను.--Batthini Vinay Kumar Goud (చర్చ) 12:34, 22 డిసెంబరు 2023 (UTC)
- యర్రా రామారావు గారూ, "ఎన్నికల ప్రాజెక్టు"లో అన్ని రకాల ఎన్నికలు కవరౌతాయని అనుకుంటున్నాను. ఆ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు మనం రాసింది రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన వ్యాసాలే కావచ్చు. కానీ, అన్ని ఎన్నికలకూ దీని కిందనే వ్యాసాలు రాయవచ్చని నా ఉద్దేశం. అయితే, విడిగా ప్రాజెక్టు పెట్టకూడదని కూడా ఏమీ లేద్సార్, పెట్టవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 15:53, 23 డిసెంబరు 2023 (UTC)
- @చదువరి గారూ ఆ ప్రాజెక్టు పేజీ పరిశీలించాను.ప్రత్వేకంగా ప్రాజెక్టు పేజీ పెట్టాలని లేదు.కాకపోతే ఆ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకే పరిమితమై కేవలం రెండు రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాలు, శాసనసభ సభ్యులు వ్యాసాలుకు పరిమితమైనట్లుగా అనిపించింది. మీరు సూచించేది, అంటే దానికి ఉపపేజీ పెట్టమంటారా అనేది వివరించగలరు.ఇంకా ఏమైనా సూచనలు ఉంటే వివరించగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 07:31, 21 డిసెంబరు 2023 (UTC)
Remember to check copyright
[మార్చు]Hi! I have fixed some license templates so now most files in వర్గం:Files with no machine-readable license are files that do not have a valid license template. All files need a license or have to be deleted. --MGA73 (చర్చ) 11:51, 21 డిసెంబరు 2023 (UTC)
అనాథ పేజీలు
[మార్చు]వికీపీడియా వ్యాసాలకు అంతర్గతంగా ఉండాల్సిన ఇన్‌కమింగు లింకుల ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందే. మనకున్న 90 వేల వ్యాసాల్లో 4,600 వ్యాసాలు (సుమారు 5%) ఒక్క ఇన్‌కమింగు లింకు కూడా లేక అనాథ వ్యాసాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ దానికి సంబంధం ఉన్న ఇతర పేజీల నుండి కనీసం ఒక లింకు ఇచ్చి (మూడు అంతకంటే ఎక్కువ పేజీల నుండి ఇస్తే మంచిది) వీటిని విజ్ఞాన స్రవంతిలో కలపాలని వాడుకేరులందరికీ అభ్యర్థన. ఈ వ్యాసాల జాబితాను ఇక్కడ చూడవచ్చు. అనాథ పేజీలను ఎలా సంస్కరించాలి అనే విషయాన్ని సోదాహరణంగా వికీపీడియా:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం అనే ప్రాజెక్టు పేజీలో చూడవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 04:15, 26 డిసెంబరు 2023 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు. ప్రస్తుం నేను రాసిన వ్యాసాలలోని అనాథ వ్యాసాలను సరిచేస్తున్నాను, అవి పూర్తయిన తరువాత ఇతర అనాథ వ్యాసాలను సరిచేస్తాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:51, 26 డిసెంబరు 2023 (UTC)
- సరేనండి.@Chaduvariగారు.ధన్యవాదాలు.--VJS (చర్చ) 16:45, 26 డిసెంబరు 2023 (UTC)
- చదువరి గారూ ఈ జాబితాను ఇక్కడ పరిశీలించి సవరణలు చేపట్టాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చేయాలనుకుంటే ఇక్కడనుండి ఇక్కడదాకా చేస్తాను అని రాయటానికి కూడా అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే వికీపీడియా:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం అనే ప్రాజెక్టు పేజీకి ఉప పేజీ తయారు చేయగలరు.ఈ ప్రాజెక్టులో నేనూ పాల్గొంటాను. యర్రా రామారావు (చర్చ) 17:05, 26 డిసెంబరు 2023 (UTC)
- అన్ని అనాథ పేజీలు వర్గంలో కేవలం 595 పేజీలు మాత్రమే ఉన్నవి.అలాగే ప్రత్వేక పేజీలలోని అనాథ పేజీలు పేజీలో 326 వ్యాసాలు మాత్రమే చూపిస్తుంది. ఈ తేడాలు ఎందుకు చూపిస్తుందో అర్థమగుటలేదు. యర్రా రామారావు (చర్చ) 17:14, 26 డిసెంబరు 2023 (UTC)
- అది సరిగ్గా చూపించడం లేదనే ఆ క్వెరీ రాసాను. ఎందుకు చూపించడం లేదో చూడాలి. బహుశా ఇన్‌కమింగు లింకు ఏ పేరుబరి నుండి వచ్చినా అది ఒప్పుకుంటుందేమో తెలీదు. మన క్వెరీ మాత్రం ప్రధానబరి నుండి వచ్చే లింకును మాత్రమే పరిగణిస్తుంది.__ చదువరి (చర్చ • రచనలు) 17:21, 26 డిసెంబరు 2023 (UTC)
- మొత్తం 4600 పేజీలున్నై సార్. వాటిని పెట్టడం కష్టం. దాని బదులు ఈ క్వెరీ చూడండి. దీన్ని ఫోర్కు చేసుకుని క్వెరీ మొదటి లైనులో ఉన్న వాడుకరి పేరు స్థానంలో మీ పేరు పెట్టుకుని చూడండి. మీ అనాథల జాబితా మాత్రమే వస్తుంది.__ చదువరి (చర్చ • రచనలు) 17:19, 26 డిసెంబరు 2023 (UTC)
- సరే నండీ.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 17:28, 26 డిసెంబరు 2023 (UTC)
- అన్ని అనాథ పేజీలు వర్గంలో కేవలం 595 పేజీలు మాత్రమే ఉన్నవి.అలాగే ప్రత్వేక పేజీలలోని అనాథ పేజీలు పేజీలో 326 వ్యాసాలు మాత్రమే చూపిస్తుంది. ఈ తేడాలు ఎందుకు చూపిస్తుందో అర్థమగుటలేదు. యర్రా రామారావు (చర్చ) 17:14, 26 డిసెంబరు 2023 (UTC)
- చదువరి గారూ ఈ జాబితాను ఇక్కడ పరిశీలించి సవరణలు చేపట్టాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చేయాలనుకుంటే ఇక్కడనుండి ఇక్కడదాకా చేస్తాను అని రాయటానికి కూడా అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే వికీపీడియా:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం అనే ప్రాజెక్టు పేజీకి ఉప పేజీ తయారు చేయగలరు.ఈ ప్రాజెక్టులో నేనూ పాల్గొంటాను. యర్రా రామారావు (చర్చ) 17:05, 26 డిసెంబరు 2023 (UTC)
- కొత్త విషయాలు, మొదటిసారి సృష్టించిన వ్యాసాలకు ఇతర వ్యాసాలనుంచి ప్రస్తుతానికి లింకులు ఉండటం లేవండి. భవిష్యత్తులో ఉండచ్చేమో. ఇలాంటి వ్యాసాల విషయం లో ఏమి చేయవచ్చో తెలియచేయండి. --VJS (చర్చ) 17:22, 27 డిసెంబరు 2023 (UTC)
- Vjsuseela గారూ, ముందే లింకులు ఉండని పక్షంలో లింకులు మనం ఇవ్వాల్సి ఉంటుందండి. కొత్త వ్యాసానికి లింకులు ఏయే పేజీల నుండి ఇచ్చే అవకాశం ఉందో గ్రహించి, ఆ పేజీలకు వెళ్ళి లింకులు ఇవ్వాలి. దీనిపై మరిన్ని వివరాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/అనాథాశ్రమం పేజీలో చూడవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 03:53, 30 డిసెంబరు 2023 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం-స్కాలర్‌షిప్స్ పొందుటకు అర్హులైన వారి జాబితా
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా విశాఖపట్నంలో 2024 జనవరి 26 నుండి 28 వరకు జరుగు వేడుకలో పాల్గొనుటకు ఉపకారవేతనాలు (స్కాలర్‌షిప్) పొందుటకు అర్హులైన వారి జాబితాను స్కాలర్స్ జాబితాలో ప్రచురించాము. సభ్యులు గమనించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:50, 31 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024
[మార్చు]మురళీగారు, ఆదిత్యగారు, అజయ్ గారు, విశ్వనాథ్ గారు, వినయ్ కుమార్ గారు, మహేశ్వరరాజుగారు, చదువరిగారు, దివ్యగారు, కశ్యప్ గారు, జనార్దన్ గారు, మోతీరామ్ గారు, అభిలాష్ గారు, నాగరాణిగారు , సాయి కిరణ్ గారు, రామకృష్ణారెడ్డిగారు, నాగరాజుగారు, పవన్ సంతోష్ గారు, ప్రణయ్ రాజ్ గారు, ప్రవల్లికగారు, రాజశేఖర్ గారు, రమేశ్ గారు, T.సుజాతగారు, తిరుమల్ గారు, మమతగారు, భవ్యగారు, భాస్కర్ గారు, సుశీలగారు, ప్రభాకర్ గారు, యర్రా రామారావుగారు, రవిచంద్రగారు, రహ్మానుద్దీన్ గారు,శ్రీరామమూర్తిగారు.. మీకు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.Muralikrishna m (చర్చ) 07:50, 1 జనవరి 2024 (UTC)
- @Muralikrishna m గారూ, మీకూ, మన వికీపీడియన్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండీ. పవన్ సంతోష్ (చర్చ) 10:29, 1 జనవరి 2024 (UTC)
- @Muralikrishna m గారూ ధన్యవాదాలు. మీకు, వికీపీడియన్లు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.--VJS (చర్చ) 16:13, 1 జనవరి 2024 (UTC)
భారతీయ భాషా వికీపీడియాల తాజా గణాంకాలు
[మార్చు]వివిధ భారతీయ భాషా వికీపీడియాల తాజా స్థూల గణాంకాలను వికీపీడియా:భారతీయ భాషా వికీపీడియాల గణాంకాలు పేజీలో ప్రచురించాను. పరిశీలించండి.__ చదువరి (చర్చ • రచనలు) 16:43, 1 జనవరి 2024 (UTC)
- ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:40, 3 జనవరి 2024 (UTC)
బాటు కొరకు అభ్యర్ధనలు
[మార్చు]వికీపీడియాలో ఆటోమాటిగ్గా చేసేందుకు వీలైన పనులు కొన్ని ఉన్నాయి. వాటి కోసం బాట్‌లు ఉంటే మానవికంగా చేసే శ్రమ సమయం ఆదా అవుతాయి. అలాంటి పనులేమైనా మన దృష్టికి వచ్చినపుడు వికీపీడియా:బాటు సహాయానికి అభ్యర్ధనలు పేజీలో రాయాలి. బాట్ తయారుచెయ్యగలిగే సామర్థ్యం, ఆసక్తీ ఉన్నవారు వాటిని చూసినపుడు తమకు నచ్చినవాటిపై పనిచేస్తారు. ఈ పాటికే కొందరు అక్కడ కొన్ని బాట్ ఆవశ్యకతలను రాసారు. ఇంకా ఏమైనా అవసరం అనిపిస్తే అక్కడ రాయండి. __ చదువరి (చర్చ • రచనలు) 01:48, 3 జనవరి 2024 (UTC)
- అలాగేనండి @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:40, 3 జనవరి 2024 (UTC)
- మన తెవికి 20వ వార్షికోత్సవాలు అయినా తరువాత ఈ బాటు గురించిన పరిచయం, శిక్షణా కార్యక్రమం/లు నిర్వహించండి. ధన్యవాదాలు VJS (చర్చ) 11:28, 4 జనవరి 2024 (UTC)
కొత్త వ్యాసాలు రాసేందుకు
[మార్చు]ఇంగ్లీషు వికీపీడియా నుండి అనువదిస్తూ కొత్త వ్యాసాలు రాసేవారు కింది జాబితాలను పరిశీలించవచ్చు.
ఇంగ్లీషు వికీపీడియా వర్గం | తెవికీలో వ్యాసం లేని
పేజీల సంఖ్య | |
---|---|---|
1 | భారతీయ మహిళా క్రీడాకారుల జాబితా | 913 |
2 | భారతీయ పురుష క్రీడాకారుల జాబితా | 2739 |
3 | భారతీయ పురుష కళాకారులు | 335 |
4 | భారతీయ రచయితలు | 3144 |
5 | భారతీయ రచయిత్రులు | 1235 |
6 | భారతీయ మహిళా కార్యకర్తలు | 262 |
7 | భారతీయ మహిళా కళాకారులు | 958 |
మొత్తం | 9,586 |
__ చదువరి (చర్చ • రచనలు) 15:51, 3 జనవరి 2024 (UTC)
- ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:57, 3 జనవరి 2024 (UTC)
- ధన్యవాదాలు అండీ @Chaduvari గారు. V Bhavya (చర్చ) 06:31, 4 జనవరి 2024 (UTC)
- సరేనండి . ధన్యవాదాలు VJS (చర్చ) 11:12, 4 జనవరి 2024 (UTC)
Reusing references: Can we look over your shoulder?
[మార్చు]Apologies for writing in English.
The Technical Wishes team at Wikimedia Deutschland is planning to make reusing references easier. For our research, we are looking for wiki contributors willing to show us how they are interacting with references.
- The format will be a 1-hour video call, where you would share your screen. More information here.
- Interviews can be conducted in English, German or Dutch.
- Compensation is available.
- Sessions will be held in January and February.
- Sign up here if you are interested.
- Please note that we probably won’t be able to have sessions with everyone who is interested. Our UX researcher will try to create a good balance of wiki contributors, e.g. in terms of wiki experience, tech experience, editing preferences, gender, disability and more. If you’re a fit, she will reach out to you to schedule an appointment.
We’re looking forward to seeing you, Thereza Mengs (WMDE)
Looking for your Input: Invitation to interview on using Wikidata in other projects
[మార్చు]Note: Apologies for cross-posting and sending in English.
Hello, the Wikidata for Wikimedia Projects team at Wikimedia Deutschland would like to hear about your experiences using Wikidata in the sibling projects. If you are interested in sharing your opinion and insights, please consider signing up for an interview with us in this Registration form.
Currently, we are only able to conduct interviews in English.
The front page of the form has more details about what the conversation will be like, including how we would compensate you for your time.
For more information, visit our project issue page where you can also share your experiences in written form, without an interview.
We look forward to speaking with you, Danny Benjafield (WMDE) (talk) 08:53, 5 January 2024 (UTC)
A2K Monthly Report for December 2023
[మార్చు]
Please feel free to translate it into your language.
Dear Wikimedians,
In December, CIS-A2K successfully concluded various initiatives, and we have curated an in-depth monthly newsletter summarizing the events and activities of the past month. This newsletter offers a comprehensive overview of key information, showcasing our diverse endeavors.
- Conducted events
- Digital Governance Roundtable
- Indic Community Monthly Engagement Calls: Wikimania Scholarship Call
- Indic Wikimedia Hackathon 2023
- A2K Meghalaya Visit Highlights: Digitization and Collaboration
- Building Bridges: New Hiring in CIS-A2K
- Upcoming Events
- Upcoming Call: Disinformation and Misinformation in Wikimedia projects
Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 06:54, 12 జనవరి 2024 (UTC)
Making MinT a default Machine Translation for your Wikipedia
[మార్చు]నమస్తే Telugu Wikipedians!
Apologies as this message is not in your native language, Please help translate to your language.
The WMF Language team wants to make MinT the default machine translation support in Telugu Wikipedia Content Translation. MinT uses the IndicTrans2 machine translation model, which recently has a new version.
Our proposal to set MinT as the default machine translation service in this Wikipedia will expose contributors to open source service by default and allow them to switch to other services if they prefer those services. Contributors can decide to switch to another translation service that is not default if they prefer the service, which will be helpful in analysing user preferences in the future.
The WMF Language team is requesting feedback from members of this community in this thread if making the MinT the default translation service is okay in Telugu Wikipedia. If there are no objections to the above proposal. In that case, MinT will become the default machine translation in this Wikipedia by the 6th of February 2024.
Thank you for your feedback.
తెలుగు అనువాదం
[మార్చు]WMF భాషా బృందం MinTని తెలుగు వికీపీడియా కంటెంట్ అనువాదంలో డిఫాల్ట్ మెషిన్ అనువాద మద్దతుగా చేయాలనుకుంటోంది. MinT IndicTrans2 మెషిన్ ట్రాన్స్‌లేషన్ మోడల్‌ని ఉపయోగిస్తుంది, ఇది ఇటీవల కొత్త వెర్షన్‌ను కలిగి ఉంది.
ఈ వికీపీడియాలో MinTని డిఫాల్ట్ మెషీన్ అనువాద సేవగా సెట్ చేయాలనే మా ప్రతిపాదన డిఫాల్ట్‌గా ఓపెన్ సోర్స్ సేవకు సహకారులను బహిర్గతం చేస్తుంది. వారు ఆ సేవలను ఇష్టపడితే ఇతర సేవలకు మారడానికి వారిని అనుమతిస్తుంది. కంట్రిబ్యూటర్‌లు సేవను ఇష్టపడితే డిఫాల్ట్ కాని మరొక అనువాద సేవకు మారాలని నిర్ణయించుకోవచ్చు, ఇది భవిష్యత్తులో వినియోగదారు ప్రాధాన్యతలను విశ్లేషించడంలో సహాయపడుతుంది.
తెలుగు వికీపీడియాలో MinTని డిఫాల్ట్ అనువాద సేవగా చేస్తే WMF భాషా బృందం ఈ థ్రెడ్‌లో ఈ సంఘం సభ్యుల నుండి అభిప్రాయాన్ని అభ్యర్థిస్తోంది. పై ప్రతిపాదనపై అభ్యంతరాలు లేకుంటే. అలాంటప్పుడు, ఫిబ్రవరి 6, 2024 నాటికి ఈ వికీపీడియాలో MinT డిఫాల్ట్ మెషీన్ అనువాదం అవుతుంది.
UOzurumba (WMF) (చర్చ) 04:25, 17 జనవరి 2024 (UTC) On behalf of the WMF Language team.
- @UOzurumba (WMF) Thanks for your proposal for adding MinT as the default machine translation in Wikipedia translation tool,I believe that MinT's open-source architecture and focus on underserved languages will significantly contribute to improving the accuracy and inclusivity of translated content Indic languagees on Wikipedia. I wholeheartedly endorse this proposal and would be happy to provide further feedback if needed. Kasyap (చర్చ) 09:47, 17 జనవరి 2024 (UTC)
"వికీ లవ్స్ వైజాగ్" ఫోటోగ్రఫీ పోటీ
[మార్చు]అందరికి శుభోదయం! మీరందరూ బాగానే ఉన్నారని నేను నమ్ముతున్నాను. విశాఖపట్నం ప్రకృతి, భవనాలు, వారసత్వాన్ని సంగ్రహించే లక్ష్యంతో రాబోయే "వికీ లవ్స్ వైజాగ్" ఫోటోగ్రఫీ పోటీ గురించి ఉత్తేజకరమైన వార్తను పంచుకుంటున్నాను. మీరు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చు: ముందుగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పోటీని ప్రారంభించాలని అనుకున్నాం. అయితే, హైదరాబాద్ తరహాలో వైజాగ్ లో కూడా వీధులు ఖాళీగా ఉన్నాయి, చాలా మంది విద్యార్థులు మరియు నివాసితులు వారి స్వస్థలాలకు వెళ్ళినందువలన, నేను ఈ ప్రాజెక్టును జనవరి 19 తరువాత ప్రారంభిస్తే మంచిది అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రచారం ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్ లో చేయవచ్చు. కామన్స్ కోసం చిత్రాలను సోర్సింగ్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ అత్యంత ప్రభావవంతమైన వేదికగా నిరూపించబడింది. 2020 లో కేవలం ఒక నెలలో, ఇన్‌స్టాగ్రామ్‌లో వివిధ ఫోటోగ్రాఫర్‌లతో ఎంగేజ్ అవ్వడం వల్ల VRT ప్రక్రియ ద్వారా కామన్స్‌కి విభిన్న చిత్రాలను విజయవంతంగా జోడించడం జరిగింది. మీరు వాటిని ఇక్కడ చూడవచ్చు. వికీపీడియా 20వ వార్షికోత్సవ వేడుకలు వైజాగులో జరుగుతున్నాయి కాబట్టి, మనం వైజాగ్‌లో ఫోటో-వాక్ కూడా నిర్వహించొచ్చు అనుకుంటున్నాను. దయచేసి మీ సూచనలు, ఆలోచనలు పంచుకోగలరు. -- IM3847 (చర్చ) 06:20, 17 జనవరి 2024 (UTC)
- ధన్యవాదములు @IM3847 గారు, ఇందులో ఏ టైం పీరియడ్ లో తీసిన ఫోటోలు అప్లోడ్ చేయవచ్చో తెలియజేయగలరా, పాత ఫొటోలు ( 2019 లో తీసినవి) అప్లోడ్ చేయవచ్చా తెలపగలరు. Kasyap (చర్చ) 09:40, 17 జనవరి 2024 (UTC)
- @Kasyap: గారు, ఎప్పుడు తీసిన ఫోటోలు అయినా అప్లోడ్ చేయవచ్చు. పోటీ సమయంలో కామన్సులో వాటిని అప్లోడ్ చేస్తే చాలు. ఈ విషయాన్ని నేను ప్రాజెక్టు పేజీలో చేరుస్తున్నాను.-- IM3847 (చర్చ) 05:54, 18 జనవరి 2024 (UTC)
- @IM3847 గారూ వైజాగ్‌లో ఫోటో-వాక్ మంచి కార్యక్రమం.మీ వెనుకే మేము కూడా యర్రా రామారావు (చర్చ) 10:02, 17 జనవరి 2024 (UTC)
IM3847 ధన్యవాదాలు: Kasyap (చర్చ) 13:37, 18 జనవరి 2024 (UTC)
Feminism and Folklore 2024
[మార్చు]Dear Wiki Community,
You are humbly invited to organize the Feminism and Folklore 2024 writing competition from February 1, 2024, to March 31, 2024 on your local Wikipedia. This year, Feminism and Folklore will focus on feminism, women's issues, and gender-focused topics for the project, with a Wiki Loves Folklore gender gap focus and a folk culture theme on Wikipedia.
You can help Wikipedia's coverage of folklore from your area by writing or improving articles about things like folk festivals, folk dances, folk music, women and queer folklore figures, folk game athletes, women in mythology, women warriors in folklore, witches and witch hunting, fairy tales, and more. Users can help create new articles, expand or translate from a generated list of suggested articles.
Organisers are requested to work on the following action items to sign up their communities for the project:
- Create a page for the contest on the local wiki.
- Set up a campaign on CampWiz tool.
- Create the local list and mention the timeline and local and international prizes.
- Request local admins for site notice.
- Link the local page and the CampWiz link on the meta project page.
This year, the Wiki Loves Folklore Tech Team has introduced two new tools to enhance support for the campaign. These tools include the Article List Generator by Topic and CampWiz. The Article List Generator by Topic enables users to identify articles on the English Wikipedia that are not present in their native language Wikipedia. Users can customize their selection criteria, and the tool will present a table showcasing the missing articles along with suggested titles. Additionally, users have the option to download the list in both CSV and wikitable formats. Notably, the CampWiz tool will be employed for the project for the first time, empowering users to effectively host the project with a jury. Both tools are now available for use in the campaign. Click here to access these tools
Learn more about the contest and prizes on our project page. Feel free to contact us on our meta talk page or by email us if you need any assistance.
We look forward to your immense coordination.
Thank you and Best wishes,
--MediaWiki message delivery (చర్చ) 07:26, 18 జనవరి 2024 (UTC)
Wiki Loves Folklore is back!
[మార్చు]Please help translate to your language
Dear Wiki Community, You are humbly invited to participate in the Wiki Loves Folklore 2024 an international photography contest organized on Wikimedia Commons to document folklore and intangible cultural heritage from different regions, including, folk creative activities and many more. It is held every year from the 1st till the 31st of March.
You can help in enriching the folklore documentation on Commons from your region by taking photos, audios, videos, and submitting them in this commons contest.
You can also organize a local contest in your country and support us in translating the project pages to help us spread the word in your native language.
Feel free to contact us on our project Talk page if you need any assistance.
Kind regards,
Wiki loves Folklore International Team
-- MediaWiki message delivery (చర్చ) 07:26, 18 జనవరి 2024 (UTC)