2023 క్రికెట్ ప్రపంచ కప్

వికీపీడియా నుండి
(క్రికెట్ ప్రపంచ కప్ 2023 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
2023 ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్
అధికారిక లోగో
తేదీలుఅక్టోబరు 5 – నవంబరు 19
నిర్వాహకులుఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్ డే ఇంటర్నేషనల్ (ODI)
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ రాబిన్, నాకౌట్
ఆతిథ్యం ఇచ్చేవారుఇండియా
ఛాంపియన్లు ఆస్ట్రేలియా (6th title)
పాల్గొన్నవారు10
ఆడిన మ్యాచ్‌లు48
మ్యాన్ ఆఫ్ ది సీరీస్భారతదేశం విరాట్ కోహ్లి
అత్యధిక పరుగులుభారతదేశం విరాట్ కోహ్లి (765)
అత్యధిక వికెట్లుభారతదేశం మొహమ్మద్ షమీ (24)
అధికారిక వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైటు
2019
2027

2023 ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్, క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో 13వది. ఇది, నాలుగేళ్ళ కోసారి పురుషుల జాతీయ జట్లు పోటీ పడే వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్ టోర్నమెంటు. దీన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిర్వహిస్తుంది. 2023 అక్టోబరు 5 నుండి 2023 నవంబరు 19 వరకు జరిగిన ఈ టోర్నమెంటుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది.

ఈ టోర్నమెంటులో 10 జట్లు పోటీపడ్డాయి. 2019 కప్పును గెలుచుకున్న ఇంగ్లాండు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. 1987, 1996, 2011 లలో ఉపఖండంలోని ఇతర దేశాలతో కలిసి టోర్నమెంట్లను నిర్వహించిన తర్వాత భారతదేశం, తానొక్కటే ఆతిథ్యమిచ్చిన మొదటి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్పు ఇది.

2023 నవంబరు 19న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ను ఓడించి కప్పు గెలుచుకుంది. సెమీఫైనల్స్‌ రెండూ ముంబై లోని వాంఖెడే స్టేడియం లోను, కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ లోనూ జరిగాయి.

నేపథ్యం

[మార్చు]

వాస్తవానికి, ఈ టోర్నమెంటును 2023 ఫిబ్రవరి 9 నుండి మార్చి 26 వరకు జరపాలని తొలుత నిర్ణయించారు.[1][2] అయితే, COVID-19 మహమ్మారి కారణంగా అర్హత పోటీల నిర్వహణకు అంతరాయం ఏర్పడినందున, టోర్నమెంటును 2023 అక్టోబరు-నవంబరు లకు మారుస్తున్నట్లు 2020 జూలైలో ప్రకటించారు.[3][4][3] టోర్నమెంటును 2023 అక్టోబరు 5 నుండి నవంబరు 19 వరకు జరపాలని భావిస్తున్నట్లు 2023 మార్చిలో ఇయెస్‌పియెన్‌క్రిక్‌ఇన్ఫో రాసింది.[5] జూన్ 27న ఐసీసీ, టోర్నమెంటు షెడ్యూల్‌ను విడుదల చేసింది.[6][7]

2023లో పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్‌కు తమ జట్టును పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరాకరించడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తామని బెదిరించింది.[8][9] 2023 జూన్ 15న, ఆసియా క్రికెట్ కౌన్సిల్ 2023 ఆసియా కప్‌ను PCB ప్రతిపాదించిన విధంగా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.[10][11] అయితే, 2023 ఆసియా కప్ షెడ్యూల్‌ను ప్రకటించకముందే, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు ఆడేందుకు తాము ఇష్టపడటం లేదని, అక్కడ నాకౌట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడతామని, అది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం నుండి అనుమతి ఉంటేనే ఆడతామనీ, పిసిబి మాజీ ఛైర్మన్ నజామ్ సేథీ చెప్పాడు. తమ ఆటలన్నీ బెంగుళూరు, చెన్నై లేదా కోల్‌కతాల్లో జరపాలని కూడా అతను కోరుకున్నాడు. [12]

అర్హత

[మార్చు]

గతంలో లాగానే ఈ టోర్నమెంటులో కూడా పది జట్లు పాల్గొంటాయి. అర్హత పొందే మార్గం 2020–2023 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్ టోర్నమెంట్. [13]

సూపర్ లీగ్‌లోని పదమూడు మంది పోటీదారులలో అగ్రస్థానంలో నిలిచిన ఏడు జట్లు, ఆతిథ్య దేశం (భారతదేశం) ఈ ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి. ఐదు అసోసియేట్ జట్లతో పాటు మిగిలిన ఐదు జట్లు 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో ఆడాయి. వీటి నుండి శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు టోర్నమెంటుకు వెళ్ళాయి.[14][15]

2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ పోటీలో స్కాట్లాండ్‌తో ఓటమి పాలైన తరువాత వెస్టిండీస్‌, ప్రపంచ కప్ టోర్నమెంటుకు అర్హత పొందలేక పోయింది. ఆ జట్టు అర్హత పొందని మొదటి ప్రపంచ కప్ ఇదే.

అర్హత పొందిన విధం తేదీ వేదిక బెర్త్‌లు అర్హత సాధించారు
ఆతిథ్య దేశం - - 1  భారతదేశం
2020–2023 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్ 2020 జూలై 30 - 2023 మే 14 వివిధ వేదికలు 7  ఆఫ్ఘనిస్తాన్
 ఆస్ట్రేలియా
 బంగ్లాదేశ్
 ఇంగ్లాండు
 న్యూజీలాండ్
 పాకిస్తాన్
 దక్షిణాఫ్రికా
2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ 18 జూన్ - 2023 జూలై 9  Zimbabwe 2  శ్రీలంక
 నెదర్లాండ్స్
మొత్తం 10

వేదికలు

[మార్చు]

ఈ టోర్నమెంటు భారతదేశంలో, 10 నగరాల్లోని 10 స్టేడియంలలో జరిగింది. 1వ, 2వ సెమీ-ఫైనల్స్‌కు వేదికలు ముంబైలోని వాంఖెడే స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కాగా, ఫైనల్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది.[6]

అహ్మదాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ
నరేంద్ర మోదీ స్టేడియం ఎం. చిన్నస్వామి స్టేడియం MA చిదంబరం స్టేడియం అరుణ్ జైట్లీ స్టేడియం
సామర్థ్యం: 132,000[16] సామర్థ్యం: 40,000 [17] సామర్థ్యం: 50,000 [18] సామర్థ్యం: 41,842 [19]
మ్యాచ్‌లు: 5 (ఫైనల్‌తో సహా) మ్యాచ్‌లు: 5 మ్యాచ్‌లు: 5 మ్యాచ్‌లు: 5
Narendra Modi Stadium
M. A. Chidambaram Stadium
Arun Jaitley Stadium
ధర్మశాల
2023 క్రికెట్ ప్రపంచ కప్ is located in India
ముంబై
ముంబై
కోల్‌కతా
కోల్‌కతా
బెంగళూరు
బెంగళూరు
పుణే
పుణే
చెన్నై
చెన్నై
ధర్మశాల
ధర్మశాల
లక్నో
లక్నో
2023 క్రికెట్ ప్రపంచ కప్ వేదికలు
హైదరాబాద్
HPCA స్టేడియం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
సామర్థ్యం: 23,000 [20] సామర్థ్యం: 55,000 [21]
మ్యాచ్‌లు: 5 మ్యాచ్‌లు: 3
కోల్‌కతా లక్నో ముంబై పూణే
ఈడెన్ గార్డెన్స్ బిఆర్‌ఎస్‌ఎబివి ఏకానా క్రికెట్ స్టేడియం వాంఖెడే స్టేడియం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం
సామర్థ్యం: 66,000 [22] సామర్థ్యం: 50,000 [23] సామర్థ్యం: 32,000 [24] సామర్థ్యం: 37,406
మ్యాచ్‌లు: 5 (సెమీ-ఫైనల్‌తో సహా) మ్యాచ్‌లు: 5 మ్యాచ్‌లు: 5 (సెమీ-ఫైనల్‌తో సహా) మ్యాచ్‌లు: 5
Eden Gardens

ప్రపంచ కప్ స్టేడియాలను అభివృద్ధి చేయడం

[మార్చు]

ప్రపంచకప్ వేదికల సౌకర్యాలను మెరుగుపరచడానికి బీసీసీఐ, ఒక్కొక్కదానికి 50 కోట్లు మంజూరు చేస్తుంది. మంజూరుకు ముందే కొన్ని స్టేడియాల్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. HPCA స్టేడియంలో, గడ్డి స్థానంలో దిగుమతి చేసుకున్న రైగ్రాస్ - పాస్పలమ్ గడ్డిని పరచడం, మైదానం లోని డ్రైనేజీ సౌకర్యాలను మెరుగుపరచడం, స్టేడియంకు రంగులు వేయడం జరిగింది. వాంఖడే స్టేడియంలో అవుట్‌ఫీల్డ్‌ను తిరిగి పరచారు. LED ఫ్లడ్‌లైట్లు, కార్పొరేట్ బాక్స్‌లు, టాయిలెట్లను మెరుగుపరచారు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహిత్ పవార్ మాట్లాడుతూ, దెబ్బతిన్న సీట్లను మార్చి తమ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంను అభివృద్ధి చేస్తామని, రోడ్లు, పార్కింగ్, టాయిలెట్లను మెరుగుపరుస్తామని, అలాగే స్టేడియంలో మూడు వంతులు భాగానికి కప్పు లేనందున కొన్ని స్టాండ్‌లకు పైకప్పు వేసే విషయమై చర్చిస్తామనీ అన్నాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కొత్త ఫ్లడ్‌లైట్లను అమర్చారు. రెండు ఎర్ర మట్టి వికెట్లు వేసారు. అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో వికెట్లను మళ్లీ వేసారు. [25]

మ్యాచ్ అధికారులు

[మార్చు]

అంపైర్లు

[మార్చు]

రిఫరీలు

[మార్చు]

జట్లు

[మార్చు]

కప్‌లో పాల్గొనే జట్లన్నీ 15-ఆటగాళ్ళతో కూడిన తమ స్క్వాడ్‌లను సెప్టెంబరు 28 నాటికి ఖరారు చేసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు ఇవ్వాలి. ఈ తేదీ తర్వాత మార్పులేమైనా చెయ్యాలంటే ఐసిసి ఆమోదం అవసరం.[26]

బహుమతులు

[మార్చు]

ప్రపంచ కప్ విజేతకు $ 4 మిలియన్లు, రన్నరప్‌కు $2 మిలియన్లూ బహుమతిగా ఇస్తామని ఐసిసి ప్రకటించింది. సెమీఫైనల్లో ఓడిపోయిన జట్లకు చెరి $8,00,000 లభిస్తాయి.[27] 2019లో ఇచ్చిన బహుమతులు కూడా ఇవే. మొత్తం టోర్నమెంటులో ఇచ్చే బహుమతులన్నిటి మొత్తం విలువ $10 మిలియన్లు. జట్లు, టోర్నమెంటులో చూపిన ఆటను బట్టి కిందివిధంగా బహుమతులందుకుంటాయి:[28]

దశ జట్లు బహుమతి మొత్తం (US$) మొత్తం (US$)
విజేత 1 $4,000,000 $4,000,000
రన్నరప్ 1 $2,000,000 $2,000,000
సెమీఫైనల్లో ఓడిన జట్టు 2 $800,000 $1,600,000
లీగ్ మ్యాచ్‌లలో సాధించిన ప్రతీ గెలుపుకు 45 $40,000 $1,800,000
లీగ దశ దాటని జట్లకు 6 $100,000 $600,000
మొత్తం $10,000,000

సన్నాహక మ్యాచ్‌లు

[మార్చు]

సన్నాహక మ్యాచ్‌లు 2023 సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 3 వరకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, గౌహతిలోని అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలలో జరుగుతాయి. [6] జూన్ 27న భారత వార్మప్ మ్యాచ్‌లను ప్రకటించారు. మొత్తం షెడ్యూల్‌ను ఆగస్టు 23 న ప్రకటించారు. మ్యాచ్‌లను టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. [29] [30] భద్రతా కారణాల రీత్యా హైదరాబాదులో జరిగే పాకిస్తాన్, న్యూజీలాండ్‌ల మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించ లేదు.[31]

సన్నాహక మ్యాచ్‌లు
2023 సెప్టెంబరు 29
14:00
స్కోరు
శ్రీలంక 
263 (49.1 ఓవర్లు)
v
 బంగ్లాదేశ్
264/3 (42 ఓవర్లు)
బంగ్లాదేశ్ 7 వికెట్లతో గెలిచింది
అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, గౌహతి
అంపైర్లు: సయ్యద్ ఖాలిద్ (భారత్), వినోద్ శేషన్ (భారత్)
  • శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
2023 సెప్టెంబరు 29
14:00
స్కోరు
v
ఆట రద్దైంది
గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
అంపైర్లు: పరాశర్ జోషి (భారత్), అక్షయ్ తోత్రే (భారత్)
  • టాస్ వెయ్యలేదు
  • వర్షం కారణంగా ఆట జరగలేదు
2023 సెప్టెంబరు 29
14:00
స్కోరు
పాకిస్తాన్ 
345/5 (50 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
346/5 (43.4 ఓవర్లు)
న్యూజీలాండ్ 5 వికెట్లతో గెలిచింది
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హైదరాబాదు
అంపైర్లు: అనిల్ చౌధరి (భారత్), రోహన్ పండిట్ (భారత్)
  • పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
2023 సెప్టెంబరు 30
14:00
స్కోరు
v
ఆట రద్దైంది
అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, గౌహతి
అంపైర్లు: సయ్యద్ ఖాలిద్ (భారత్), సాయిదర్శన్ కుమార్ (భారత్)
  • భారత్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • వర్షం కారణంగా ఆట జరగలేదు
2023 సెప్టెంబరు 30
14:00
స్కోరు
ఆస్ట్రేలియా 
166/7 (23 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
84/6 (14.2 ఓవర్లు)
ఫలితం తేలలేదు
గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
అంపైర్లు: రోహన్ పండిట్ (భారత్), వీరేందర్ శర్మ (భారత్)
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • వర్షం కారణంగా మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు
  • వర్షం వలన నెదర్లాండ్స్ బ్యాటింగు మధ్యలో ఆగిపోయింది
2023 అక్టోబరు 2
14:00
స్కోరు
బంగ్లాదేశ్ 
188/9 (37 ఓవర్లు)
v
 ఇంగ్లాండు
197/6 (24.1 ఓవర్లు)
ఇంగ్లాండ్ 4 వికెట్లతో గెలిచింది (డలూ పద్ధతి)
అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, గౌహతి
అంపైర్లు: షర్ఫుద్దౌలా (బంగ్లా), పాల్ విల్సన్ (ఆస్ట్రే)
  • బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • వర్షం కారణంగా ఒక్కో జట్టు 37 ఓవర్లు ఆడేలా కుదించారు
  • వర్షం కారణంగా ఇంగ్లాండ్ లక్ష్యాన్ని 37 ఓవర్లలో 197 గా సవరించారు
2023 అక్టోబరు 2
14:00
స్కోరు
న్యూజీలాండ్ 
321/6 (50 ఓవర్లు)
v
 దక్షిణాఫ్రికా
211/4 (37 ఓవర్లు)
న్యూజీలాండ్ 7 పరుగులతో గెలిచింది (డలూ పద్ధతి)
గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
అంపైర్లు: క్రిస్ గఫానీ (న్యూ), రిచర్డ్ కెటిల్‌బరో (ఇం)
  • న్యూజీలాండ్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • వర్షం కారణంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్సును 37 ఓవర్లకు కిఉదించారు; డలూ పద్ధతిలో దీనికి సమానమైన స్కోరు 219.
2023 అక్టోబరు 3
14:00
స్కోరు
శ్రీలంక 
294 (46.2 ఓవర్లు)
v
 ఆఫ్ఘనిస్తాన్
261/4 (38.1 ఓవర్లు)
ఆఫ్ఘనిస్తాన్ 6 పేరుగులతో గెలిచింది (డలూ పద్ధతి)
అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, గౌహతి
అంపైర్లు: అహసాన్ రజా (పాక్), జోయెల్ విల్సన్ (వెస్టిం)
  • ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
  • వర్షం కారణాంగా ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యాన్ని 42 ఓవర్లలో 257 పేరుగులుగా నిర్థారించారు.
2023 అక్టోబరు 3
14:00
స్కోరు
v
మ్యాచ్ రద్దైంది
గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
అంపైర్లు: మైకెల్ గాఫ్ (ఇంగ్లా) అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లా)
  • టాస్ వేయలేదు
  • వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు
2023 అక్టోబరు 3
14:00
స్కోరు
ఆస్ట్రేలియా 
351/7 (50 ఓవర్లు)
v
 పాకిస్తాన్
337 (47.4 ఓవర్లు)
ఆస్ట్రేలియా 14 పరుగులతో గెలిచింది
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హైదరాబాదు
అంపైర్లు: పాల్ రీఫెల్ (ఆస్ట్రే), రాడ్ టకర్ (ఆస్ట్రే)
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది

గ్రూప్ స్థాయి

[మార్చు]

కప్ ప్రారంభోత్సవం 2023 అక్టోబరు 4 న నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుందని తొలుత ప్రకటించారు.[32] అయితే, నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి పది జట్ల కెప్టెన్లతో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు.[33] ఐసిసి ప్రపంచ కప్ షెడ్యూల్‌ను 2023 జూన్ 27 న ముంబైలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. అక్టోబరు 5న జరిగే ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌కి 100 రోజుల కౌంట్‌డౌన్‌తో ఈ ప్రకటన చేసారు.

పాయింట్ల పట్టిక

[మార్చు]

గ్రూప్ దశలో ప్రతి జట్టు మిగతా 9 జట్లతో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. మొత్తం 45 మ్యాచ్‌లు.

Pos జట్టు గె ఫతే పా NRR Qualification
1  భారతదేశం 9 9 0 0 18 2.570 సెమీ ఫైనల్స్‌కు వెళ్ళాయి.
2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి.
2  దక్షిణాఫ్రికా 9 7 2 0 14 1.261
3  ఆస్ట్రేలియా 9 7 2 0 14 0.841
4  న్యూజీలాండ్ 9 5 4 0 10 0.743
5  పాకిస్తాన్ 9 4 5 0 8 −0.199 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి
6  ఆఫ్ఘనిస్తాన్ 9 4 5 0 8 −0.336
7  ఇంగ్లాండు 9 3 6 0 6 −0.572
8  బంగ్లాదేశ్ 9 2 7 0 4 −1.087
9  శ్రీలంక 9 2 7 0 4 −1.419
10  నెదర్లాండ్స్ 9 2 7 0 4 −1.825
Source: ICC


టోర్నమెంటు ప్రస్థానం

[మార్చు]
Updated to match(es) played on 2023 అక్టోబరు 22. Source: [1]
W = Win; D = Draw; L = Lose

ఫలితాల సారాంశం

[మార్చు]

అక్టోబరు 5 న అహ్మదాబాదులో నరేంద్ర మోడీ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరిగింది. గత ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆడిన ఇంగ్లాండ్, న్యూజీలాండ్‌లు తలపడిన ఈ మ్యాచ్‌లో న్యూజీలాండ్ 9 వికెట్లతో గెలిచింది. తొలుత బ్యాటింగు చేసిన ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 282 సాధించగా, న్యూజీలాండ్ ఒకే ఒక్క వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. డెవన్ కాన్వే, రచిన్ రవీంద్రలు ఇద్దరూ తమ తొలి ప్రపంచ కప్ మ్యాచ్‌లో శతకాలు సాధించి[34] నాటౌట్‌గా నిలిచారు. 273 పరుగుల అజేయమైన భాగస్వామ్యం నెలకొల్పి, 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టుకు గెలుపు సాధించారు.[35]

పోటీలు

[మార్చు]

ఐసిసి, 2023 జూన్ 27 న పోటీల వివరాలను విడుదల చేసింది [36]

2023 అక్టోబరు 5
14:00 (D/N)
స్కోరు
ఇంగ్లాండు 
282/9 (50 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
283/1 (36.2 ఓవర్లు)
జో రూట్ 77 (86 బంతులు)
మాట్ హెన్రీ 3/48 (10 ఓవర్లు)
న్యూజీలాండ్ 9 వికెట్లతో గెలిచింది
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాదు
అంపైర్లు: కుమార్ ధర్మసేన (శ్రీ), నితిన్ మీనన్ (భా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రచిన్ రవీంద్ర (న్యూ)
  • న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • ఇంగ్లాండ్ బ్యాటర్లందరూ, మొత్తం 11 మందీ, డబుల్ ఫిగర్ స్కోరు చేసారు. వన్‌డేల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి.[37]
  • రచిన్ రవీంద్ర (న్యూ) వన్‌డేల్లో తన తొలి సెంచరీ చేసాడు.[38]
  • డెవన్ కాన్వే, రచిన్ రవీంద్రలు వన్‌డేల్లో న్యూజీలాండ్ తరఫున రెండవ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం సాధించారు[39]
2023 అక్టోబరు 6
14:00 (D/N)
స్కోరు
పాకిస్తాన్ 
286 (49 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
205 (41 ఓవర్లు)
పాకిస్తాన్ 81 పరుగులతో గెలిచింది
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హైదరాబాదు
అంపైర్లు: క్రిస్ బ్రౌన్ (న్యూ), అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సౌద్ షకీల్ (పాకి)
  • నెదర్లాండ్స్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 7
10:30
స్కోరు
ఆఫ్ఘనిస్తాన్ 
156 (37.2 ఓవర్లు)
v
 బంగ్లాదేశ్
158/4 (34.4 ఓవర్లు)
బంగ్లాదేశ్ 6 వికెట్లతో గెలిచింది
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
అంపైర్లు: కుమార్ ధర్మసేన (శ్రీ), జోయెల్ విల్సన్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మెహిదీ హసన్ మిరాజ్ (బంగ్లా)
  • బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.
2023 అక్టోబరు 7
14:00 (D/N)
స్కోరు
దక్షిణాఫ్రికా 
428/5 (50 ఓవర్లు)
v
 శ్రీలంక
326 (44.5 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 102 పరుగులతో గెలిచింది
అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, ఢిల్లీ
అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లాం), షర్ఫుద్దౌలా (బం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఐడెన్ మార్క్‌రమ్ (దక్షి)
2023 అక్టోబరు 8
14:00 (D/N)
స్కోరు
ఆస్ట్రేలియా 
199 (49.3 ఓవర్లు)
v
 భారతదేశం
201/4 (41.2 ఓవర్లు)
భారత్ 6 వికెట్లతో గెలిచింది
ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
అంపైర్లు: క్రిస్ గఫానీ (న్యూ), రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లాం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కె.ఎల్. రాహుల్
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 9
14:00 (D/N)
స్కోరు
న్యూజీలాండ్ 
322/7 (50 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
223/10 (46.3 ఓవర్లు)
న్యూజీలాండ్ 99 పరుగులతో గెలిచింది
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హైదరాబాదు
అంపైర్లు: పాల్ రీఫెల్ (ఆస్ట్రే), రాడ్ టకర్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ సాంట్నర్ (న్యూ)
2023 అక్టోబరు 10
10:30
స్కోరు
 ఇంగ్లాండు
364/9 (50 ఓవర్లు)
v
బంగ్లాదేశ్ 
227 (48.2 ఓవర్లు)
ఇంగ్లాండ్ 137 పరుగులతో గెలిచింది
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
అంపైర్లు: అహసాన్ రజా (పాకి), పాల్ విల్సన్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ మలన్ (ఇంగ్లాం)
2023 అక్టోబరు 10
14:00 (D/N)
స్కోరు
 శ్రీలంక
344/9 (50 ఓవర్లు)
v
పాకిస్తాన్ 
345/4 (48.2 ఓవర్లు)
పాకిస్తాన్ 6 వికెట్లతో గెలిచింది
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హైదరాబాదు
అంపైర్లు: క్రిస్ గఫానీ (న్యూ), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లాం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మహమ్మద్ రిజ్వాన్ (పాకి)
  • శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • సదీర సమరవిక్రమ (శ్రీ) వన్‌డేల్లో తన తొలి శతకం చేసాడు.[44]
  • ఇమామ్-ఉల్-హక్ (పాకి) వన్‌డేల్లో 3000 వ పరుగు సాధించాడు.[45]
  • అబ్దుల్లా షఫీక్ (పాకి) వన్‌డేల్లో తన తొలి శతకం చేసాడు.[46]
  • ప్రపంచ కప్ చరిత్రలో విజయవంతంగా ఛేదించిన అత్యధిక లక్ష్యం ఇది.[47]
  • వన్‌డేల్లో ఒకే ఇన్నింగ్సులో ముగ్గురు బ్యాటర్లు శతకాలు చెయ్యడం ఇది మూడోసారి (1998 లో పాకిస్తాన్‌తో ఆడినపుడు ఆస్ట్రేలియా, 2013 లో భారత్‌తో ఆడినపుడు ఆస్ట్రేలియా)[48]
2023 అక్టోబరు 11
14:00 (D/N)
స్కోరు
ఆఫ్ఘనిస్తాన్ 
272/8 (50 ఓవర్లు)
v
 భారతదేశం
273/2 (35 ఓవర్లు)
భారత్ 8 వికెట్లతో గెలిచింది
అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, ఢిల్లీ
అంపైర్లు: మైకెల్ గాఫ్ (ఇంగ్లా), పాల్ రీఫెల్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ (భా)
2023 అక్టోబరు 12
14:00 (D/N)
స్కోరు
 దక్షిణాఫ్రికా
311/7 (50 ఓవర్లు)
v
ఆస్ట్రేలియా 
177 (40.5 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 134 పరుగులతో గెలిచింది
బిఆర్‌ఎస్‌ఎబివి ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లా), జోయెల్ విల్సన్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: క్వింటన్ డికాక్ (దక్షి)
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 13
10:30
స్కోరు
బంగ్లాదేశ్ 
245/9 (50 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
248/2 (42.5 ఓవర్లు)
న్యూజీలాండ్ 8 వికెట్లతో గెలిచింది
ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
అంపైర్లు: కుమార్ ధర్మసేన (శ్రీ), నితిన్ మీనన్ (భా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లాకీ ఫెర్గూసన్ (న్యూ)
  • న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • ట్రెంట్ బోల్ట్ న్యూజీలాండ్ బౌలర్లలో ఆడిన మ్యాచ్‌ల పరంగా (107) అత్యంత వేగంగా 200 వికెట్;లు సాధించిన బౌలరుగా కైల్ మిల్స్ ను అధిగమించాడు. మొత్తమ్మీద మూడవ బౌలరు.[51]
2023 అక్టోబరు 14
14:00 (D/N)
స్కోరు
 పాకిస్తాన్
191 (42.5 ఓవర్లు)
v
భారతదేశం 
192/3 (30.3 ఓవర్లు)
భారత్ 7 వికెట్లతో గెలిచింది
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాదు
అంపైర్లు: మరాయిస్ ఎరాస్మస్ (దక్షి), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్‌ప్రీత్ బుమ్రా (భా)
  • భారత్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 15
14:00 (D/N)
స్కోరు
ఆఫ్ఘనిస్తాన్ 
284 (49.5 ఓవర్లు)
v
 ఇంగ్లాండు
215 (40.3 ఓవర్లు)
ఆఫ్ఘనిస్తాన్ 69 పరుగులతో గెలిచింది
అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, ఢిల్లీ
అంపైర్లు: షర్ఫుద్దౌలా (బంగ్లా), రాడ్ టకర్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముజీబ్ ఉర్ రహమాన్ (ఆఫ్ఘ)
  • ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • మొహమ్మద్ నబీ, రహమత్ షా (ఆఫ్ఘ) లు తమ 150వ, 100వ వన్‌డే ఆడారు.[52]
  • అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఇంగ్లాండ్‌కు ఇది తొలి ఓటమి.[53]
2023 అక్టోబరు 16
14:00
స్కోరు
 శ్రీలంక
209 (43.3 ఓవర్లు)
v
ఆస్ట్రేలియా 
215/5 (35.2 ఓవర్లు)
ఆస్ట్రేలియా 5 వికెట్లతో గెలిచింది
బిఆర్‌ఎస్‌ఎబివి ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అంపైర్లు: క్రిస్ గఫానీ (న్యూ), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆడమ్ జాంపా (ఆస్ట్రే)
  • శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 17
14:00 (D/N)
స్కోరు
 నెదర్లాండ్స్
245/8 (43 ఓవర్లు)
v
దక్షిణాఫ్రికా 
207 (42.5 ఓవర్లు)
నెదర్లాండ్స్ 38 పరుగులతో గెలిచింది (డ-లూ పద్ధతిలో)
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
అంపైర్లు: మైకెల్ గాఫ్ (ఇంగ్లా), రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: స్కాట్ ఎడ్వర్డ్స్ (నెద)
  • దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • వర్షం కారణంగా మ్యాచ్‌ను ఒక్కో జట్టుకు 43 ఓవర్లు ఉండేలా కుదించారు
2023 అక్టోబరు 18
14:00 (D/N)
స్కోరు
న్యూజీలాండ్ 
288/6 (50 ఓవర్లు)
v
ఆఫ్ఘనిస్తాన్ 
139 (34.4 ఓవర్లు)
న్యూజీలాండ్ 149 పరుగులతో గెలిచింది
ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
అంపైర్లు: జోయెల్ విల్సన్ (వెస్టిం), పాల్ విల్సన్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గ్లెన్ ఫిలిప్స్ (న్యూ)
  • ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 19
14:00 (D/N)
స్కోరు
బంగ్లాదేశ్ 
256/8 (50 ఓవర్లు)
v
 భారతదేశం
261/3 (41.3 ఓవర్లు)
భారత్ 7 వికెట్లతో గెలిచింది
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే
అంపైర్లు: అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షి), రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లాం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి (భా)
  • బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 20
14:00 (D/N)
స్కోరు
v
ఆస్ట్రేలియా 62 పరుగులతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
అంపైర్లు: క్రిస్ బ్రౌన్ (న్యూ), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ వార్నర్ (ఆస్ట్రే)
  • పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • ఆడమ్ జాంపా (ఆస్ట్రే) వన్‌డేల్లో తన 150 వ వికెట్ తీసుకున్నాడు.[54]
2023 అక్టోబరు 21
10:30
స్కోరు
నెదర్లాండ్స్ 
262 (49.4 ఓవర్లు)
v
 శ్రీలంక
263/5 (48.2 ఓవర్లు)
శ్రీలంక 5 వికెట్లతో గెలిచింది
బిఆర్‌ఎస్‌ఎబివి ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అంపైర్లు: మరాయిస్ ఎరాస్మస్ (దక్షి), అహసాన్ రజా (పాకి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సదీర సమరవిక్రమ (శ్రీ)
  • నెదర్లాండ్స్, టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 21
14:00 (D/N)
స్కోరు
దక్షిణాఫ్రికా 
399/7 (50 ఓవర్లు)
v
 ఇంగ్లాండు
170 (22 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 229 పరుగులతో గెలిచింది
వాంఖెడే స్టేడియం, ముంబై
అంపైర్లు: కుమార్ ధర్మసేన (శ్రీ), నితిన్ మీనన్ (భా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హైన్రిక్ క్లాసెన్ (దక్షీ)
  • ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 22
14:00
స్కోరు
 న్యూజీలాండ్
273 (50 ఓవర్లు)
v
భారతదేశం 
274/6 (48 ఓవర్లు)
భారత్ 4 వికెట్లతో గెలిచింది
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
అంపైర్లు: మైకెల్ గాఫ్ (ఇంగ్లా), అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షి)[a]
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మొహమ్మద్ షమీ (భా)
  • భారత్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • శుభ్‌మ‌న్ గిల్ (భా) వన్‌డేల్లో తన 2,000 వ పరుగు సాధించాడు. ఆడి ఇన్నింగ్సుల సంఖ్య (38) పరంగా ఇది అత్యంత వేగవంతమైన సాధన.[55]
2023 అక్టోబరు 23
14:00 (D/N)
స్కోరు
 పాకిస్తాన్
282/7 (50 ఓవర్లు)
v
ఆఫ్ఘనిస్తాన్ 
286/2 (49 ఓవర్లు)
బాబర్ ఆజం 74 (92)
నూర్ అహ్మద్ 3/49 (10 ఓవర్లు)
ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్లతో గెలిచింది
ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
అంపైర్లు: పాల్ రీఫెల్ (ఆస్ట్రే), రాడ్ టకర్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘ)
  • పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్‌కు ఆఫ్ఘనిస్తాన్‌పై ఇది తొలి ఓటమి.[56]
2023 అక్టోబరు 24
14:00 (D/N)
స్కోరు
 దక్షిణాఫ్రికా
382/5 (50 ఓవర్లు)
v
బంగ్లాదేశ్ 
233 (46.4 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 149 పరుగులతో గెలిచింది
వాంఖెడే స్టేడియం, ముంబై
అంపైర్లు: అహసాన్ రజా (పాకి)[b], జోయెల్ విల్సన్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: క్వింటన్ డికాక్ (దక్షి)
  • దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 25
14:00
స్కోరు
ఆస్ట్రేలియా 
399/8 (50 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
90 (21 ఓవర్లు)
ఆస్ట్రేలియా 309 పరుగులతో గెలిచింది
అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, ఢిల్లీ
అంపైర్లు: మైకెల్ గాఫ్ (ఇంగ్లా), షర్ఫుద్దౌలా (బంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గ్లెన్ మాక్స్‌వెల్ (Aus)
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • ఐడెన్ మార్క్‌రమ్ సాధించిన అత్యంత వేగవంతమైన ప్రపంచ కప్ శతకం రికార్డును గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రే) బద్దలు కొట్టాడు, [57]
  • బాస్ డి లీడ్ (నెద) తన పది ఓవర్లలో 115 పరుగులు ఇచ్చి, మొత్తం వన్‌డేల్లోనే అత్యంత ఖరీదైన బౌలరు అయ్యాడు.[58]
  • ఆస్ట్రేలియా గెలుపు మార్జిన్ - 309 - ప్రపంచ కప్ చ్రిత్రలో అత్యధికం.[59]
2023 అక్టోబరు 26
14:00 (D/N)
స్కోరు
ఇంగ్లాండు 
156 (33.2 ఓవర్లు)
v
 శ్రీలంక
160/2 (25.4 ఓవర్లు)
శ్రీలంక 8 వికెట్లతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
అంపైర్లు: క్రిస్ బ్రౌన్ (న్యూ), అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లహిరు కుమార (శ్రీ)
  • ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 27
14:00 (D/N)
స్కోరు
పాకిస్తాన్ 
270 (46.4 ఓవర్లు)
v
దక్షిణాఫ్రికా 1 వికెట్‌తో గెలిచింది
ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
అంపైర్లు: పాల్ రీఫెల్ (ఆస్ట్రే), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తబ్రైజ్ షమ్సీ (దక్షి)
  • పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • మ్యాచ్ రెండవ ఇన్నింగ్సులో షాదాబ్ ఖాన్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఉసామా మీర్ వచ్చాడు.[60]
2023 అక్టోబరు 28
10:30
స్కోరు
ఆస్ట్రేలియా 
388 (49.2 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
383/9 (50 ఓవర్లు)
ఆస్ట్రేలియా 5 పరుగులతో గెలిచింది
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
అంపైర్లు: మరాయిస్ ఎరాస్మస్ (దక్షి), షర్ఫుద్దౌలా (బంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (ఆస్ట్రే)
  • న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • ఈ మ్యాచ్‌లో చేసిన మొత్తం 771 పరుగులు ప్రపంచ కప్ రికార్డు. 2023 కప్ లోనే దక్షిణాఫ్రికా, శ్రీలంకల మ్యాచ్‌లో వచ్చిన 754 పరుగుల రికార్డును ఇది బద్దలు కొట్టింది.[61]
  • ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాకు ఇది 100 వ మ్యాచ్
2023 అక్టోబరు 28
14:00 (D/N)
స్కోరు
బంగ్లాదేశ్ 
229 (50 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
142 (42.2 ఓవర్లు)
నెదర్లాండ్స్ 87 పరుగులతో గెలిచింది
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
అంపైర్లు: జోయెల్ విల్సన్ (వెస్టిం), పాల్ విల్సన్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: పాల్ వాన్ మీకెరెన్ (నెద)
  • నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 29
14:00 (D/N)
స్కోరు
 భారతదేశం
229/9 (50 ఓవర్లు)
v
ఇంగ్లాండు 
129 (34.5 ఓవర్లు)
భారత్ 100 పరుగులతో గెలిచింది
బిఆర్‌ఎస్‌ఎబివి ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అంపైర్లు: అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షి), రాడ్ టకర్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ (భా)
  • ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
2023 అక్టోబరు 30
14:00 (D/N)
స్కోరు
 శ్రీలంక
241 (49.3 ఓవర్లు)
v
ఆఫ్ఘనిస్తాన్ 
242/3 (45.2 ఓవర్లు)
ఆఫ్ఘనిస్తాన్ 7 వికెట్లతో గెలిచింది
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే
అంపైర్లు: క్రిస్ గఫానీ (న్యూ), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫజల్‌హక్ ఫారూఖీ (ఆఫ్ఘ)
  • ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • రషీద్ ఖాన్ (ఆఫ్ఘ) తన వందవ వన్‌డే ఆడాడు.[62]
2023 అక్టోబరు 31
14:00 (D/N)
స్కోరు
బంగ్లాదేశ్ 
204 (45.1 ఓవర్లు)
v
 పాకిస్తాన్
205/3 (32.3 ఓవర్లు)
పాకిస్తాన్ 7 వికెట్లతో గెలిచింది
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లా), నితిన్ మీనన్ (భా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫఖర్ జమాన్ (పాకి)
  • బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • షాహీన్ అఫ్రిది (పాకి) వన్‌డేల్లోతన 100 వ వికెట్ తీసుకున్నాడు.[63]
2023 నవంబరు 1
14:00 (D/N)
స్కోరు
 దక్షిణాఫ్రికా
357/4 (50 ఓవర్లు)
v
న్యూజీలాండ్ 
167 (35.3 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 190 పరుగులతో గెలిచింది
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే
అంపైర్లు: కుమార్ ధర్మసేన (శ్రీ), అహసాన్ రజా (పాకి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (దక్షి)
  • న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
2023 నవంబరు 2
14:00 (D/N)
స్కోరు
భారతదేశం 
357/8 (50 ఓవర్లు)
v
 శ్రీలంక
55 (19.4 ఓవర్లు)
భారత్ 302 పరుగులతో గెలిచింది
వాంఖెడే స్టేడియం, ముంబై
అంపైర్లు: క్రిస్ బ్రౌన్ (న్యూ), పాల్ రీఫెల్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మొహమ్మద్ షమీ (భా)
2023 నవంబరు 3
14:00
స్కోరు
 నెదర్లాండ్స్
179 (46.3 ఓవర్లు)
v
ఆఫ్ఘనిస్తాన్ 
181/3 (31.3 ఓవర్లు)
ఆఫ్ఘనిస్తాన్ 7 వికెట్లతో గెలిచింది
బిఆర్‌ఎస్‌ఎబివి ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అంపైర్లు: నితిన్ మీనన్ (భా), షర్ఫుద్దౌలా (బంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మొహమ్మద్ నబీ (ఆఫ్ఘ)
  • నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • ముజీబ్ ఉర్ రహమాన్ (ఆఫ్ఘ) వన్‌డేల్లో తన 100 వ వికెట్ సాధించాడు.[70]
  • ఆఫ్ఘనిస్తాన్ 2025 ఐసిస్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడేందుకు స్ర్హత సాధించింది.[71]
2023 నవంబరు 4
10:30
Scorecard
న్యూజీలాండ్ 
401/6 (50 ఓవర్లు)
v
 పాకిస్తాన్
200/1 (25.3 ఓవర్లు)
ఫఖర్ జమాన్ 126* (81)
టిమ్ సౌథీ 1/27 (5 ఓవర్లు)
పాకిస్తాన్ 21 పరుగులతో గెలిచింది (డలూ పద్ధతి)
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లా), పాల్ విల్సన్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫఖర్ జమాన్ (పాకి)
  • పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • వర్షం కారణంగా ఆట కొనసాగలేదు
  • హసన్ అలీ (పాకి) వన్‌డేల్లో తన 100 వ వికెట్ తీసుకున్నాడు.[72]
  • ఈ మ్యాచ్ ఫలితంతో దక్షిణాఫ్రికా సెలీ ఫైనల్స్‌కు అర్హత పొందింది.[73]
2023 నవంబరు 4
14:00 (D/N)
స్కోరు
ఆస్ట్రేలియా 
286 (49.3 ఓవర్లు)
v
 ఇంగ్లాండు
253 (48.1 ఓవర్లు)
మార్నస్ లబుషేన్ 71 (83)
Chris Woakes 4/54 (9.3 ఓవర్లు)
ఆస్ట్రేలియా 33 పరుగులతో గెలిచింది
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాదు
అంపైర్లు: మరాయిస్ ఎరాస్మస్ (దక్షి), క్రిస్ గఫానీ (న్యూ)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆడమ్ జాంపా (Aus)
  • ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • ఈ మ్యాచ్‌ ఫలితంతో ఇంగ్లాండ్, ప్రపంచ కప్ నుండి నిష్క్రమించింది.[74]
2023 నవంబరు 5
14:00 (D/N)
స్కోరు
భారతదేశం 
326/5 (50 overs)
v
Virat Kohli 101* (121)
కేశవ్ మహారాజ్ 1/30 (10 ఓవర్లు)
భారత్ 243 పరుగులతో గెలిచింది
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
అంపైర్లు: కుమార్ ధర్మసేన (శ్రీ), పాల్ రీఫెల్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి (భా)
  • భారత్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • విరాట్ కోహ్లి (భా) వన్‌డేల్లో 49 వ శతకం చేసి సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేసాడు.[75]
  • ఈ విజయంతో భారత్ లీగ్‌లో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది.
  • దక్షిణాఫ్రికా చేసిన 83 పరుగులు ప్రపంచ కప్ పోటీల్లో అత్యల్పం.[76]
  • 243 పరుగుల ఈ ఓటమి, దక్షిణాఫ్రికా పొందిన అత్యధిక పరుగుల ఓటమి. గతంలో పాకిస్తాన్‌పై పొందిన 182 పరుగుల ఓటమిని ఇది అధిగమించింది.[77]
2023 నవంబరు 6
14:00 (D/N)
స్కోరు
శ్రీలంక 
279 (49.3 ఓవర్లు)
v
 బంగ్లాదేశ్
282/7 (41.1 ఓవర్లు)
బంగ్లాదేశ్ 3 వికెట్లతో గెలిచింది
అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, ఢిల్లీ
అంపైర్లు: మరాయిస్ ఎరాస్మస్ (దక్షి), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షకీబ్ అల్ హసన్ (బంగ్లా)
  • బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • ఏ వన్‌డే మ్యాచ్ లోనైనా టైమౌట్ పద్ధతిలో ఔటైన తొలి బ్యాటరుగా ఏంజెలో మాథ్యూస్ (శ్రీ) నిలిచాడు..[78]
  • ఈ మ్యాచ్ ఫలితంతో ప్రపంచ కప్‌లో శ్రీలంక పోటీ ముగిసింది.[79]
2023 నవంబరు 7
14:00 (D/N)
స్కోరు
ఆఫ్ఘనిస్తాన్ 
291/5 (50 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
293/7 (46.5 ఓవర్లు)
ఆస్ట్రేలియా 3 వికెట్లతో గెలిచింది
వాంఖెడే స్టేడియం, ముంబై
అంపైర్లు: మైకెల్ గాఫ్ (ఇంగ్లా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రే)
  • ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • ఆఫ్ఘనిస్తాన్ తరపున ఇబ్రహీమ్ జద్రాన్ ప్రపంచ కప్‌లో తొలి సెంచరీ చేసాడు.[80]
  • గ్లెన్ మాక్స్‌వెల్ చేసిన 201, వన్‌డేల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్ళలో కెల్లా అత్యధికం. [81] It was also the highest individual score batting second in ODIs.[82]
  • గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమ్మిన్స్ ల 202 పరుగు;ల భాగస్వామ్యం వన్‌డేల్లో 8 వ వికెట్‌కు అత్యధికం.[83]
  • ఈ మ్యాచ్ ఫలితంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.[84]
2023 నవంబరు 8
14:00 (D/N)
స్కోరు
ఇంగ్లాండు 
339/9 (50 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
179 (37.2 ఓవర్లు)
ఇంగ్లాండ్ 160 పరుగులతో గెలిచింది
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే
అంపైర్లు: అహసాన్ రజా (పాకి), రాడ్ టకర్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బెన్ స్టోక్స్ (ఇంగ్లా)
  • ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • ఈ మ్యాచ్ ఫలితంతో నెదర్లాండ్స్ పోటీ నుండి బయటికి పోయింది.[85]
2023 నవంబరు 9
14:00 (D/N)
స్కోరు
శ్రీలంక 
171 (46.4 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
172/5 (23.2 ఓవర్లు)
న్యూజీలాండ్ 5 వికెట్లతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
అంపైర్లు: అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షి), జోయెల్ విల్సన్ (వెస్టిం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రెంట్ బౌల్ట్ (న్యూ)
  • న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
  • న్యూజీలాండ్ తరఫున అన్ని అంతర్జాతీయ క్రికెట్ రూపాల్లోనూ కలిపి 600 వికెట్లు తీసిన 2 వ బౌలరుగా ట్రెంట్ బౌల్ట్ (న్యూ) నిలిచాడు. అతను ప్రపంచ కప్ పోటీల్లో 50 వికెట్లు తీసిన తొలి న్యూజీలాండ్ బౌలరు కూడా అయ్యాడు.[86]
  • న్యూజీలాండ్ తరఫున ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన డేనియెల్ వెట్టోరీ రికార్డును మిచెల్ సాంట్నర్ (న్యూ) సమం చేసాడు.[87]
2023 నవంబరు 10
14:00
స్కోరు
ఆఫ్ఘనిస్తాన్ 
244 (50 ఓవర్లు)
v
 దక్షిణాఫ్రికా
247/5 (47.3 ఓవర్లు)
దక్షిణాఫ్రికా 5 వికెట్లతో గెలిచింది
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాదు
2023 నవంబరు 11
10:30
స్కోరు
బంగ్లాదేశ్ 
306/8 (50 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
307/2 (44.4 ఓవర్లు)
ఆస్ట్రేలియా 8 వికెట్లతో గెలిచింది
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే
అంపైర్లు: మరాయిస్ ఎరాస్మస్ (దక్షి), అహసాన్ రజా (పాకి)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మిచెల్ మార్ష్ (ఆస్ట్రే)
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
2023 నవంబరు 11
14:00 (D/N)
స్కోరు
ఇంగ్లాండు 
337/9 (50 ఓవర్లు)
v
 పాకిస్తాన్
244 (43.3 ఓవర్లు)
ఇంగ్లాండ్ 93 పరుగులతో గెలిచింది
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
అంపైర్లు: రాడ్ టకర్ (ఆస్ట్రే), పాల్ విల్సన్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: డేవిడ్ విల్లీ (ఇంగ్లా)
  • ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • డేవిడ్ విల్లీ (ఇంగ్లా) వన్‌డేల్లో తన 100 వ వికెట్ తీసుకున్నాడు.[90]
  • ఈ మ్యాచ్ ఫలితంతో న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించగా, పాకిస్తాన్ పోటీ నుండి వైదొలగింది.[91]
2023 నవంబరు 12
14:00 (D/N)
స్కోరు
భారతదేశం 
410/4 (50 ఓవర్లు)
v
 నెదర్లాండ్స్
250 (47.5 ఓవర్లు)
భారత్ 160 పరుగులతో గెలిచింది
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
అంపైర్లు: క్రిస్ గఫానీ (న్యూ), మైకెల్ గాఫ్ (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శ్రేయాస్ అయ్యర్ (భా)
  • భారత్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది

నాకౌట్ దశ

[మార్చు]

పాకిస్తాన్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తే, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆడుతుందని, భారత్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తే, భారత్ ప్రత్యర్థి పాకిస్థాన్ అయితే తప్ప ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుందని ఐసిసి పేర్కొంది. భారత పాకిస్తాన్‌లు సెమీ ఫైనల్యుకు వెళ్తే ఆ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగుతుంది. నాకౌట్ గేమ్‌లకు రిజర్వ్ డే ఉంటుంది. [92]

సెమీ ఫైనల్స్ ఫైనల్
               
1   భారతదేశం 397/4 (50 overs)  
4   న్యూజీలాండ్ 327 (48.5 overs)  
    SFW1   భారతదేశం
  SFW2   ఆస్ట్రేలియా
2   దక్షిణాఫ్రికా 212 (49.4 overs)
3   ఆస్ట్రేలియా 215/7 (47.2 overs)  

సెమీ ఫైనల్స్

[మార్చు]
2023 నవంబరు 15
14:00 (D/N)
Scorecard
భారతదేశం 
397/4 (50 ఓవర్లు)
v
 న్యూజీలాండ్
327 (48.5 ఓవర్లు)
భారత్ 70 పరుగులతో గెలిచింది
వాంఖెడే స్టేడియం, ముంబై
అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లా), రాడ్ టకర్ (ఆస్ట్రే)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మొహమ్మద్ షమీ (భా)
  • భారత్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • మొహమ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్ లు తమ 100 వ వన్‌డే ఆడారు.[93]
  • మొహమ్మద్ షమీ సాధించిన 7/57 భారత్ తరఫున వన్‌డేల్లో అత్యుత్తమ బౌలింగు రికార్డు.[94]; అలాగే ఇన్నింగ్సుల పరంగా ప్రపంచ కప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ రికార్డును అధిగమించాడు.[95]
  • విరాట్ కొహ్లి వన్‌డేల్లో 50 శతకాలు, ఈ ప్రపంచకప్‌లో 711 పరుగులు చేసి, సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న 49 శతకాలు, 673 పరుగుల రికార్డులను ఛేదించాడు.[96]
  • భారత్ 397 పరుగులు చేసి, ఇప్పటి వరకు నాకౌట్ దశలో న్యూజిలాండ్ పేరిట ఉన్న 393 పరుగుల రికార్డును (2015 ప్రపంచ కప్) అధిగమించింది.[97]
  • ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ నాలుగోసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు (1983, 2003, 2011) చేరింది.
2023 నవంబరు 16
14:00 (D/N)
Scorecard
దక్షిణాఫ్రికా 
212 (49.4 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
215/7 (47.2 ఓవర్లు)
ఆస్ట్రేలియా 3 వికెట్లతో గెలిచింది
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లా), నితిన్ మీనన్ (భా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (ఆస్ట్రే)
  • దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది
  • డేవిడ్ మిల్లర్ దక్షిణాఫ్రికా తరఫున ప్రపంచ కప్ నాకౌట్ దశలో శతకం సాధించిన తొలి బ్యాటరుగా నిలిచాడు[98]

ఫైనల్

[మార్చు]
2023 నవంబరు 19
14:00 (D/N)
Scorecard
భారతదేశం 
240 (50 ఓవర్లు)
v
 ఆస్ట్రేలియా
241/4 (43 ఓవర్లు)
ఆస్ట్రేలియా 6 వికెట్లతో గెలిచింది
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాదు
అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లా), రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లా)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (ఆస్ట్రే)
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది

గణాంకాలు

[మార్చు]

అగ్రశ్రేణి బ్యాటర్లు

[మార్చు]
పరుగులు ఆటగాడు మ్యా ఇన్నిం నా అత్య సగ స్ట్రై 100 50 0లు 4లు 6లు
765 భారతదేశం విరాట్ కొహ్లి 11 11 3 117 95.62 90.31 3 6 1 68 9
597 భారతదేశం రోహిత్ శర్మ 11 11 0 131 54.27 125.94 1 3 1 66 31
594 దక్షిణాఫ్రికా క్వింటన్ డి కాక్ 10 10 0 174 59.40 107.02 4 0 0 57 21
578 న్యూజీలాండ్ రచిన్ రవీంద్ర 10 10 1 123* 64.22 108.65 3 2 0 51 16
552 న్యూజీలాండ్ డారిల్ మిచెల్ 10 9 1 134 69.00 111.06 2 2 0 48 22
చివరిగా తాజాకరించినది: 2023 నవంబరు 19[99]


అగ్రశ్రేణి బౌలర్లు

[మార్చు]
వికె ఆటగాడు ఇన్నిం సగ పొదు BBI స్ట్రై 5W
24 భారతదేశం మొహమ్మద్ షమీ 7 10.70 5.26 7/57 12.20 3
23 ఆస్ట్రేలియా ఆడమ్ జాంపా 11 22.39 5.36 4/8 25.04 0
21 శ్రీలంక దిల్షాన్ మధుశంక 9 25.00 6.70 5/80 22.38 1
20 భారతదేశం జస్‌ప్రీత్ బుమ్రా 11 18.65 4.06 4/39 27.55 0
దక్షిణాఫ్రికా జెరాల్డ్ కోయెట్జీ 8 19.80 6.23 4/44 19.05 0
చివరిగా తాజాకరించినది: 2023 నవంబరు 19[100]


ప్రసారాలు

[మార్చు]

2023 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల అధికారిక ప్రసారకర్త, స్టార్ స్పోర్ట్స్. టోర్నమెంటు పోటీలన్నిటినీ అది భారతదేశంలో ప్రసారం చేస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్ సేవలో వాటిని ఉచితంగా ప్రసారం చేస్తారు. DD స్పోర్ట్స్ భారతదేశం పాల్గొనే పోటీలనూ, నాకౌట్ పోటీలను, ఫైనల్‌నూ ప్రసారం చేస్తుంది. [29]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. రిచర్డ్ కెటిల్‌బరో స్థానంలో అడ్రియన్ హోల్డ్‌స్టాక్ వచ్చాడు.
  2. అలెక్స్ వార్ఫ్ స్థానంలో అహసాన్ రజా వచ్చాడు

మూలాలు

[మార్చు]
  1. "Outcomes from ICC Annual Conference week in London". International Cricket Council. 13 June 2013. Retrieved 22 June 2017.
  2. "IPL now has window in ICC Future Tours Programme". ESPN Cricinfo. Retrieved 12 December 2017.
  3. 3.0 3.1 "ICC postpones T20 World Cup due to Covid-19 pandemic". ESPNcricinfo. 20 July 2022.
  4. "Men's T20 World Cup postponed". International Cricket Council. Retrieved 20 July 2020.
  5. "World Cup 2023 likely to start on October 5 and end on November 19". ESPN Cricinfo. Retrieved 21 March 2023.
  6. 6.0 6.1 6.2 "Match schedule announced for the ICC Men's Cricket World Cup 2023". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 27 June 2023.
  7. "ICC Cricket World Cup 2023 Schedule Announced: India vs Pakistan on October 15 in Ahmedabad". Latestly. 27 June 2023. Retrieved 27 June 2023.
  8. "Pakistan could boycott 2023 50-over World Cup over India's Asia Cup stance". 19 October 2022.
  9. "India-Pakistan spat threatens Cricket World Cup". 11 April 2023.
  10. "2023 Asia Cup likely in Pakistan and one other overseas venue for India games". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.
  11. "Asia Cup 2023 to be played in Pakistan and Sri Lanka as ACC accepts hybrid model". Hindustan Times (in ఇంగ్లీష్). 15 June 2023. Retrieved 27 June 2023.
  12. "Najam Sethi to ICC bosses: Pakistan don't want to play in Ahmedabad unless they are in WC final". ThePrint. 7 June 2023. Retrieved 9 June 2023.
  13. "ICC launches the road to India 2023". International Cricket Council. Retrieved 12 August 2019.
  14. "New cricket calendar aims to give all formats more context". ESPN Cricinfo. 4 February 2017. Retrieved 20 October 2017.
  15. "The road to World Cup 2023: how teams can secure qualification, from rank No. 1 to 32". ESPN Cricinfo. Retrieved 14 August 2019.
  16. "Narendra Modi Stadium | India | Cricket Grounds | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 27 June 2023.
  17. "M. Chinnaswamy Stadium | India | Cricket Grounds | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 27 June 2023.
  18. "M. A. Chidambaram Stadium | India | Cricket Grounds | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 27 June 2023.
  19. "Arun Jaitley Stadium | Cricket Grounds | BCCI". www.bcci.tv (in ఇంగ్లీష్). Archived from the original on 2023-04-16. Retrieved 2023-06-28.
  20. "Himachal Pradesh Cricket Association Stadium | India | Cricket Grounds | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 27 June 2023.
  21. "Rajiv Gandhi International Cricket Stadium | Cricket Grounds | BCCI". www.bcci.tv (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-10. Retrieved 2023-06-28.
  22. "Eden Gardens | India | Cricket Grounds | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 27 June 2023.
  23. "Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium | India | Cricket Grounds | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 27 June 2023.
  24. "Wankhede Stadium | India | Cricket Grounds | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 27 June 2023.
  25. "Cricket World Cup venues to get an upgrade: Imported grass, new outfields, better floodlights". The Indian Express. Retrieved 30 June 2023.{{cite web}}: CS1 maint: url-status (link)
  26. "ICC World Cup 2023: All the squads for ICC Men's Cricket World Cup 2023". ICC. 7 August 2023. Archived from the original on 8 February 2020. Retrieved 7 August 2023.
  27. Rajput, Tanisha (6 September 2023). "World Cup 2023 Full Squads: Check date, time, teams, venue, schedule and all you need to know". Wi. Retrieved 6 September 2023.
  28. Dutta, Rishab (3 September 2023). "ICC World Cup 2023 Schedule, Teams, Venues, Prize Money, And Broadcast Channel". Sportsganga. Retrieved 6 September 2023.
  29. 29.0 29.1 "2023 ICC WC Full schedule, venues, time, teams and where to stream". The Hindu.
  30. "World Cup 2023 schedule: India to play a warm-up match against England, here are venues for practice games". India TV News. 27 June 2023. Retrieved 27 June 2023.[permanent dead link]
  31. "Pakistan vs New Zealand match to be played behind closed doors". Board of Control for Cricket in India. Retrieved 25 September 2023.
  32. Banerjee, Krishnendu (2023-08-27). "World Cup Opening Ceremony on Oct 4, Motera Stadium to host ICC Captains Day". Inside Sport India (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-28.
  33. Gupta, Sakshi (4 October 2023). "Will there be an opening ceremony for the ICC Cricket World Cup 2023?". The Independent. Retrieved 4 October 2023.
  34. "Hundreds on ODI World Cup debut: Conway, Ravindra join list of batters to record century on WC debut". Sportstar (in ఇంగ్లీష్). 5 October 2023. Retrieved 5 October 2023.
  35. "England routed by New Zealand in World Cup opener". BBC Sport. Retrieved 5 October 2023.[permanent dead link]
  36. "2023 ICC WC Full schedule, venues, time, teams and where to stream". The Hindu. Retrieved 27 June 2023.
  37. "England set unique ODI batting record in World Cup 2023 opener". geo.tv (in ఇంగ్లీష్). Retrieved 5 October 2023.
  38. "ENG v NZ: 23-year-old Rachin Ravindra hits hundred in spectacular World Cup debut". India Today. Retrieved 5 October 2023.
  39. "ENG vs NZ: Conway-Ravindra record fourth-highest World Cup partnership with 273-run stand". Spotstar. Retrieved 5 October 2023.
  40. "Fastest ODI World Cup hundreds: Markram breaks record with 49-ball century in SA vs SL WC 2023 match". SportStar. Retrieved 7 October 2023.
  41. "SA vs SL: South Africa-Sri Lanka records highest aggregate in a World Cup match with 754 runs in Delhi". SportStar. Retrieved 7 October 2023.
  42. "Bairstow, England cricket's 'great servant' who always comes back very strong". ESPNcricinfo (in ఇంగ్లీష్). 9 October 2023. Retrieved 10 October 2023.
  43. "ENG vs BAN: Joe Root becomes England's highest run-scorer in ODI World Cup, surpasses Graham Gooch". Sportstar (in ఇంగ్లీష్). 10 October 2023. Retrieved 10 October 2023.
  44. "SL vs PAK: Sadeera Samarawickrama hits his maiden World Cup hundred to deflate Pakistan". India Today. Retrieved 10 October 2023.
  45. "PAK vs SL, ODI World Cup: Imam-ul-Haq surpasses Babar Azam's record to reach 3000 runs". Spotstar. Retrieved 10 October 2023.
  46. "SL vs PAK: Abdullah Shafique shines on World Cup debut, hits maiden ODI hundred in high pressure chase". India Today. Retrieved 10 October 2023.
  47. "ODI World Cup 2023: Pakistan completes highest run chase in WC history". SportStar. Retrieved 10 October 2023.
  48. "Most hundreds in an innings". ESPN Cricinfo. Retrieved 10 October 2023.
  49. "Rohit Sharma breaks Chris Gayle's record for most sixes in international cricket with 554th maximum". Spotstar. Retrieved 11 October 2023.
  50. "Rohit Sharma breaks Sachin's record for most centuries in World Cup history". Business Standard. Retrieved 11 October 2023.
  51. "World Cup 2023: Trent Boult becomes the 3rd fastest bowler to complete 200 ODI wickets". India Today (in ఇంగ్లీష్). Retrieved 13 October 2023.
  52. "ODI World Cup 2023, Match 13, ENG vs AFG Stats Review: Gurbaz's power-hitting, Rashid's brilliance and other stats". Crictracker. Retrieved 15 October 2023.
  53. "ENG vs AFG: Aghanistan produce biggest upset of World Cup 2023 with 69-run win over defending champions England". India Today. Retrieved 15 October 2023.
  54. "Stoinis, Zampa come up clutch to down Pakistan". Cricket Australia. Retrieved 21 October 2023.
  55. "World Cup 2023: Shubman Gill becomes fastest batter to 2000 ODI runs, breaks Hashim Amla's 12-year-old record". India Today. Retrieved 22 October 2023.
  56. "PAK vs AFG, World Cup 2023: Afghanistan chase down 283 to register first-ever ODI win over Pakistan". India Today. Retrieved 23 October 2023.
  57. "AUS vs NED: Glenn Maxwell breaks Aiden Markram's record for fastest ODI World Cup hundred". India Today. Retrieved 25 October 2023.
  58. "AUS vs NED: Netherlands' Bas de Leede concedes 115 in 10 overs for most expensive ODI spell ever". India Today. Retrieved 25 October 2023.
  59. "AUS vs NED: Australia registers biggest victory in ODI World Cup history, beats Netherlands by 309 runs". SportStar. Retrieved 25 October 2023.
  60. "Pakistan bring in Usama Mir named as concussion sub for Shadab Khan". ESPNcricinfo. Retrieved 27 October 2023.
  61. "AUS vs NZ: Australia vs New Zealand records highest aggregate in World Cup match with 771 runs in Dharamsala". SportStar. Retrieved 28 October 2023.
  62. "AFG vs SL, World Cup 2023: Rashid Khan relishes 'great achievement' of completing 100-ODI landmark". India Today. Retrieved 30 October 2023.
  63. "PAK vs BAN: Shaheen Afridi becomes fastest Pakistan bowler to 100 ODI wickets". Spotstar. Retrieved 31 October 2023.
  64. "India vs Sri Lanka: Dilshan Madushanka becomes 4th Sri Lanka bowler to pick a 5-wicket haul in ODI World Cups". India Today. Retrieved 2 November 2023.
  65. "Mohammed Shami becomes India's leading wicket taker in World Cup history with fifer vs Sri Lanka". The Indian Express (in ఇంగ్లీష్). 2 November 2023. Retrieved 3 November 2023.
  66. "Kohli, Siraj shine as India break record for largest win margin by runs, beat Sri Lanka by 317 in 3rd ODI". Hindustan Times. 15 January 2023. Retrieved 2 November 2023.
  67. "Stats from India's record win: Shami makes history as Kohli climbs all-time list". ICC. Retrieved 3 November 2023.
  68. "Records for ODI Matches". ESPNcricinfo. Retrieved 3 November 2023.
  69. "India become first team to qualify for 2023 World Cup semi-finals with unbeaten 7/7 record". Hindustan Times. 2 November 2023. Retrieved 2 November 2023.
  70. "Mujeeb gets to 100 | CWC23". ICC Cricket World Cup. Retrieved 3 November 2023.
  71. "Afghanistan qualify for the 2025 Champions Trophy". Crictoday. Retrieved 3 November 2023.
  72. "World Cup 2023 PAK vs NZ: Pakistan's Hasan Ali completes 100 ODI wickets". Business Standard. Retrieved 4 November 2023.
  73. "World Cup 2023: South Africa join India as 2nd team to qualify for semi-finals as Pakistan beat New Zealand". Today India. Retrieved 4 November 2023.
  74. "Cricket World Cup 2023: England's defence ended by Australia defeat". BBC Sport. 4 November 2023. Retrieved 4 November 2023.
  75. "Kohli on equalling Tendulkar's record of 49 ODI hundreds: "It's stuff of dreams"". ESPN Cricinfo. 5 November 2023. Retrieved 5 November 2023.
  76. "Virat Kohli's zenith, South Africa's nadir". Cricbuzz (in ఇంగ్లీష్). 5 November 2023. Retrieved 6 November 2023.
  77. "Kohli equals Tendulkar milestone with World Cup ton, India crush South Africa". SuperSport (in ఇంగ్లీష్). Retrieved 6 November 2023.
  78. "Angelo Mathews Becomes First To Be 'Timed Out' In International Cricket". The Times of India. 6 November 2023. Retrieved 25 October 2023.
  79. "Bangladesh vs Sri Lanka, World Cup Highlights: BAN pull off dramatic win, SL knocked out". Hindustan Times. Retrieved 6 November 2023.
  80. "AUS vs AFG: Ibrahim Zadran becomes first Afghanistan batter to hit World Cup hundred". India Today (in ఇంగ్లీష్). Retrieved 7 November 2023.
  81. "ODI World Cup 2023: All records broken during Glenn Maxwell's 201 not out in Australia vs Afghanistan". WION (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 10 November 2023.
  82. "Maxwell records highest individual score in a run chase, slams double century during AUS vs AFG, World Cup 2023 match". SportStar. Retrieved 7 November 2023.
  83. "ICC World Cup 2023: Every Record Glenn Maxwell Made With His 201* vs Afghanistan". TheQuint (in ఇంగ్లీష్). 8 November 2023. Retrieved 10 November 2023.
  84. "Australia vs Afghanistan: Glenn Maxwell's 'Superhuman' innings helps Australia beat Afghanistan by three wickets". Mint. Retrieved 7 November 2023.
  85. "England vs Netherlands Live Score Updates: ENG vs NED, England defeat Netherlands by 160 runs". Mint. Retrieved 8 November 2023.
  86. "Trent Boult becomes New Zealand's first bowler to claim 50 wickets in ODI World Cup". The Hindu. 9 November 2023. Retrieved 11 November 2023.
  87. "NZ vs SL: Boult enters 600 wickets club, Santner equals Daniel Vettori's major World Cup record". India TV. 9 November 2023. Retrieved 11 November 2023.
  88. "World Cup: Afghanistan Opt To Bat Against South Africa". The Times of India. 10 November 2023. Retrieved 10 November 2023.
  89. "Afghanistan crashes out of ICC ODI World Cup 2023". SportStar. Retrieved 10 November 2023.
  90. "England's David Willey retires from international cricket after bowling heroics vs Pakistan: A nice way to finish". India Today. Retrieved 11 November 2023.
  91. "Semi-finalists confirmed for knockout stage of Cricket World Cup". ICC. 11 November 2023. Retrieved 11 November 2023.
  92. "ICC Men's Cricket World Cup 2023 schedule announced". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 27 June 2023.
  93. "World Cup 2023: Mohammed Shami plays 100th ODI in high-voltage semi-final against New Zealand". India Today. 15 November 2023. Retrieved 15 November 2023.
  94. "ODI World Cup 2023: India pacer Mohammed Shami reveals why he felt TERRIBLE despite seven wickets vs NZ". WION (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 16 November 2023.
  95. "Mohammed Shami becomes fastest to 50 wickets in ODI World Cup history". Times of India. 15 November 2023. Retrieved 15 November 2023.
  96. "Sensational Virat Kohli Surpasses Sachin Tendulkar With Record-Breaking 50th ODI Ton". The Times of India. 15 November 2023. Retrieved 15 November 2023.
  97. "Stats - Shami, Kohli and Rohit on a record-breaking spree". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 16 November 2023.
  98. "AUS vs SA: Miller becomes first South African to score hundred in ODI World Cup knockout match". SportStar. Retrieved 16 November 2023.
  99. "2023 World Cup Cricket Batting Records & Stats runs". Cricinfo. Retrieved 19 October 2023.
  100. "2023 World Cup Cricket bowling Records & Stats wickets". ESPNCricinfo. Retrieved 16 November 2023.