పరిశోధన (పత్రిక)
పరిశోధన పత్రిక తిరుమల రామచంద్ర సంపాదకత్వంలో వెలువడిన ద్వైమాస పత్రిక[1]. మద్రాసు నుండి వెలువడింది. తొలి సంచిక ఏప్రిల్, 1954న వెలువడింది. సుమారు 20 సంచికలు ప్రచురితమైంది. తెలుగు సాహిత్యంలో ఉన్నత ప్రమాణాలకు ఆదర్శంగా, నిస్పక్షపాతం, నిర్భీతి సాధనాలుగా ఈ పత్రిక వెలువడింది. ప్రభాకర సంస్మరణ సంచిక, సోమనాథ సంచిక, ఆంధ్ర నాటక పితామహ సంచిక, గురజాడ అప్పారావు సంస్మరణ సంచిక, బుద్ధ సంచిక మొదలైన ప్రత్యేక సంచికల ద్వారా దేశంలోని ప్రముఖ పరిశోధకుల వ్యాసాలను ఆంధ్ర పాఠకలోకానికి అందించారు. ఈ పత్రికద్వారా కుంటిమద్ది శేషశర్మ అలంకార సర్వస్వం, బులుసు వేంకటరమణయ్య అలంకార చరిత్ర మొదలైన గ్రంథాలను ప్రకటించబడ్డాయి.
రచయితలు
[మార్చు]ఈ పత్రికలో విద్వాన్ విశ్వం, దేవరపల్లి వెంకటకృష్ణారెడ్డి, బాణగిరి రాజమ్మ, కఱ్ఱి సాంబమూర్తి శాస్త్రి, నార్ల వేంకటేశ్వరరావు, నిడదవోలు వేంకటరావు, వేటూరి ఆనందమూర్తి, కోరాడ రామకృష్ణయ్య, దివాకర్ల వేంకటావధాని, పుట్టపర్తి నారాయణాచార్యులు, పాల్కురికి సోమనాథుడు, బులుసు వేంకటరమణయ్య, రావూరి దొరస్వామిశర్మ, తాపీ ధర్మారావు, శ్రీరంగం శ్రీనివాసరావు, టేకుమళ్ల కామేశ్వరరావు, సంధ్యావందనం శ్రీనివాసరావు, ఎం.ఆదిలక్ష్మి, బండారు తమ్మయ్య, చల్లా రాధాకృష్ణశర్మ, కుంటిమద్ది శేషశర్మ, తిమ్మావజ్ఝల కోదండరామయ్య, బాలాంత్రపు రజనీకాంతరావు, కప్పగల్లు సంజీవమూర్తి, ధర్మవరము వేణుగోపాలాచార్యులు, శ్రీనివాస చక్రవర్తి, ఖండవల్లి లక్ష్మీరంజనము, కంఠీరవ నరసరాజు, ఆలూరి బైరాగి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, బిరుదురాజు రామరాజు, పోణంగి శ్రీరామ అప్పారావు, గిడుగు వేంకట సీతాపతి, గుత్తి రామకృష్ణ, స్థానం నరసింహారావు, నీలంరాజు వేంకటశేషయ్య, రాంభట్ల కృష్ణమూర్తి, ఆరుద్ర, సెట్టి ఈశ్వరరావు తదితరులు రచనలు చేశారు.