వికీపీడియా:రచ్చబండ

వికీపీడియా నుండి
(వికీపీడియా:Village pump నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అడ్డదారి:
WP:VP
రచ్చబండ
వార్తలు | పాలసీలు | ప్రతిపాదనలు | సాంకేతికము | ఆలోచనలు | పత్రికా సంబంధాలు | ఇతరత్రా..

Feminism and Folklore 2023[మార్చు]

Feminism and Folklore 2023 logo.svg
Please help translate to your language

Dear Wiki Community,

Christmas Greetings and a Happy New Year 2023,

You are humbly invited to organize the Feminism and Folklore 2023 writing competition from February 1, 2023, to March 31, 2023 on your local Wikipedia. This year, Feminism and Folklore will focus on feminism, women's issues, and gender-focused topics for the project, with a Wiki Loves Folklore gender gap focus and a folk culture theme on Wikipedia.

You can help Wikipedia's coverage of folklore from your area by writing or improving articles about things like folk festivals, folk dances, folk music, women and queer folklore figures, folk game athletes, women in mythology, women warriors in folklore, witches and witch hunting, fairy tales, and more. Users can help create new articles, expand or translate from a list of suggested articles.

Organisers are requested to work on the following action items to sign up their communities for the project:

 1. Create a page for the contest on the local wiki.
 2. Set up a fountain tool or dashboard.
 3. Create the local list and mention the timeline and local and international prizes.
 4. Request local admins for site notice.
 5. Link the local page and the fountain/dashboard link on the meta project page.

This year we would be supporting the community's financial aid for Internet and childcare support. This would be provided for the local team including their jury and coordinator team. This support is opt-in and non mandatory. Kindly fill in this Google form and mark a mail to support@wikilovesfolklore.org with the subject line starting as [Stipend] Name or Username/Language. The last date to sign up for internet and childcare aid from our team is 20th of January 2023, We encourage the language coordinators to sign up their community on this link by the 25th of January 2023.

Learn more about the contest and prizes on our project page. Feel free to contact us on our meta talk page or by email us if you need any assistance.

We look forward to your immense coordination.

Thank you and Best wishes,

Feminism and Folklore 2023 International Team

Stay connected B&W Facebook icon.png  B&W Twitter icon.png

--MediaWiki message delivery (చర్చ) 10:24, 24 డిసెంబరు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023 ప్రాజెక్టు పేజీ[మార్చు]

సముదాయ సభ్యులకు నమస్కారం,

ఫెమినిజం, ఫోక్‌లోర్ అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక ఆంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, క్వీర్ జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు. దీనికి సంబంధించి వికీపీడియా:వికీప్రాజెక్టు/ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023కి సంబంధించి పేజీ సృష్టించాను. కావున సముదాయ సభ్యులందరూ పేజిని సందర్శించి తగు మార్పులను సూచించాలని అభ్యర్తిస్తున్నాను.--Nagarani Bethi (చర్చ) 09:45, 26 డిసెంబరు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్[మార్చు]

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అన్నది ఏర్పాటుచేసుకోవాలని 2019-20ల్లో జరిగిన చర్చల్లో తేలిన అంశం. ఇటీవల జరిగిన తెలుగు వికీపీడియా వార్షికోత్సవంలో దీని సంగతి మళ్ళీ చర్చకు వచ్చినప్పుడు ఆనాటి ప్రతిపాదన మేరకు దీన్ని ఏర్పాటుచేయాలని మళ్ళీ అనుకున్నాము. గత చర్చలోనూ, ఇప్పుడూ దీనికి పేరు తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అని ఉండాలని కూడా అనుకున్నాము.

అయితే, ఈ యూజర్ గ్రూప్ లక్ష్యాలు, ఆశయాలు ఏమై ఉండాలి? దీనిలో ఎవరెవరు ఉంటారు? బాధ్యతలకు వ్యక్తులను ఎలా ఎన్నుకోవాలి? సముదాయానికి, దీనికి మధ్య ఉండే సంబంధమూ, భేదాలు ఏమిటి? అసలు ఏమేం పనులు చేస్తుంది? ఏమేం చేయదు? చర్చలు ఎక్కడ జరుగుతాయి? ఎలా జరుగుతాయి? ఇలా లక్ష్యాలు, ఆశయాలు, నియమ-నిబంధనలకు సంబంధించిన వివిధ విషయాలను ఆన్‌వికీ చర్చించుకుని నిర్ణయించుకోవాలన్న ఆలోచనతో ఈ చర్చను లేవనెత్తుతున్నాను.

దీనికోసం వివిధ పేజీల్లో ప్రతిపాదనలు చేసి వాటన్నిటినీ వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ పేజీలో లింక్ చేశాను. ప్రతీ ప్రతిపాదన పేజీలోనూ ఎక్కడ చర్చించాలన్నది స్పష్టంగా రాశాను. కాబట్టి, దయచేసి మీ మీ ఆలోచనలను ఆ ప్రకారం అక్కడ పంచుకోండి. ధన్యవాదాలతో పవన్ సంతోష్ (చర్చ) 08:00, 28 డిసెంబరు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అలాగేనండీ పవన్ సంతోష్ గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:04, 30 డిసెంబరు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ వారపు బొమ్మల జాబితా[మార్చు]

నమస్కారం..! తెవికి లో లేని బొమ్మ(దస్త్రం)లను వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా కోసం ప్రతిపాదించడం ఎలా.. ఉదాహరణకు.. 1) https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%82%E0%B0%9C%E0%B0%82%E0%B0%97%E0%B0%BF_%E0%B0%AE%E0%B1%87%E0%B0%98%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%95%E0%B1%8A%E0%B0%82%E0%B0%A1#/media/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Vanjangi_hills_-_paderu_-_andhrapradesh_(4).jpg

2) https://commons.wikimedia.org/wiki/File:Rehahn_-_French_photographer_-_The_Precious_Heritage_Art_Gallery_and_Cultural_Museum_is_a_museum_-_Hoi_An_-_Vietnam.jpg

3) https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A_%E0%B0%A4%E0%B0%BE%E0%B0%AC%E0%B1%87%E0%B0%B2%E0%B1%81_%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82#/media/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:May_23_-_World_Turtle_Day.jpg

ధన్యవాదాలు.. Muralikrishna m (చర్చ) 03:55, 29 డిసెంబరు 2022 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా ను పరిశీలించండి. బొమ్మను ఎలా ప్రతిపాదించాలో తెలుస్తుంది.➤ కె.వెంకటరమణచర్చ 16:01, 3 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు గురువుగారు. వికీపీడియా:ఈ వారపు బొమ్మల జాబితా వ్యాసం చదివినాక నాకు వచ్చిన సందేహమే ఇది.
తెవికి లో బొమ్మ ఉన్నవి.. ఆయా చర్చా పేజీల్లో ఈ వారం బొమ్మ పరిగణన అనే మూస చేరుస్తాం.. కానీ Wikimedia Commons ఉన్న బొమ్మలను ప్రతిపాదించడమెలా? Muralikrishna m (చర్చ) 04:58, 6 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
మురళీకృష్ణ గారూ, కామన్స్ లో గల చిత్రం పేరును తెవికీలో శోధిస్తే ఈ లింకులో వలె వస్తుంది. దాని చర్చా పేజీలో మూసను చేర్చవచ్చు.➤ కె.వెంకటరమణచర్చ 05:29, 6 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చాలా చాలా ధన్యవాదాలు..! నేను ప్రయత్నిస్తాను.. Muralikrishna m (చర్చ) 08:15, 6 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

చదువరి నిర్వాహకత్వ కృషిపై 7 వ సమీక్ష[మార్చు]

ఆర్నెల్లకోసారి నిర్వాహకుల కార్యకలాపాల సమీక్ష జరగాలని, ప్రమాణాలకు అనుగుణంగా లేని వారు స్వచ్ఛందంగా తప్పుకోవడం గాని, సముదాయం తప్పించడం గానీ జరగవచ్చని వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ మార్గదర్శకం చెబుతోంది. తదనుగుణంగా ఇప్పటి వరకు మొత్తం 6 సార్లు స్వీయ సమీక్ష చేసుకుని సముదాయానికి నివేదించాను. 7 వ సమీక్ష ను తయారు చేసి సముదాయం పరిశీలన కోసం పెట్టాను. __ చదువరి (చర్చరచనలు) 09:46, 6 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:30, 10 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter December 2022[మార్చు]


Please feel free to translate it into your language.

Centre for Internet And Society logo.svg

Dear Wikimedians,

Hope everything is well. CIS-A2K's monthly Newsletter is here which is for the month of December. A few conducted events are updated in the Newsletter. Through this message, A2K wants your attention towards its December 2022 work. In this newsletter, we have mentioned A2K's conducted and upcoming events/activities.

Conducted events
Upcoming event
 • Mid-term Report 2022-2023

Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscibe this newsletter, click here.

Thank you MediaWiki message delivery (చర్చ) 16:43, 7 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

On behalf of User:Nitesh (CIS-A2K)

Upcoming vote on the revised Enforcement Guidelines for the Universal Code of Conduct[మార్చు]

You can find this message translated into additional languages on Meta-wiki.

Hello all,

In mid-January 2023, the Enforcement Guidelines for the Universal Code of Conduct will undergo a second community-wide ratification vote. This follows the March 2022 vote, which resulted in a majority of voters supporting the Enforcement Guidelines. During the vote, participants helped highlight important community concerns. The Board’s Community Affairs Committee requested that these areas of concern be reviewed.

The volunteer-led Revisions Committee worked hard reviewing community input and making changes. They updated areas of concern, such as training and affirmation requirements, privacy and transparency in the process, and readability and translatability of the document itself.

The revised Enforcement Guidelines can be viewed here, and a comparison of changes can be found here.

How to vote?

Beginning January 17, 2023, voting will be open. This page on Meta-wiki outlines information on how to vote using SecurePoll.

Who can vote?

The eligibility requirements for this vote are the same as for the Wikimedia Board of Trustees elections. See the voter information page for more details about voter eligibility. If you are an eligible voter, you can use your Wikimedia account to access the voting server.

What happens after the vote?

Votes will be scrutinized by an independent group of volunteers, and the results will be published on Wikimedia-l, the Movement Strategy Forum, Diff and on Meta-wiki. Voters will again be able to vote and share concerns they have about the guidelines. The Board of Trustees will look at the levels of support and concerns raised as they look at how the Enforcement Guidelines should be ratified or developed further.

On behalf of the UCoC Project Team,

CSinha (WMF) (చర్చ) 10:40, 8 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మూలాల్లో లోపాల సవరణ ప్రాజెక్టు[మార్చు]

మూలాల్లో దొర్లుతున్న లోపాలను సవరించడం కోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/మూలాల్లో లోపాల సవరణ అనే ప్రాజెక్టును మొదలుపెట్టాను. ఆసక్తి ఉన్నవారు అందులో పాల్గొనవలసినది. __చదువరి (చర్చరచనలు) 06:40, 10 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వ్యాసాల నాణ్యతకు, వ్యాసాలు పరిపూర్ణముగా ఉండటానికి దోహదం కలిగించే మంచి ప్రాజెక్టు.ఎన్నో సంవత్సరాల నుండి పేరుకుపోయిన మూలాల లోపాలను సవరించే ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టును గురించి తరుచూ అలోచించే సమయంలో చదువరి గారు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినందుకు అభినందనలు.ఈ ప్రాజెక్టులో నా శాయశక్తులా కృషి చేస్తాను.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:17, 10 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
అలాగేనండీ @Chaduvari గారు, నేనుకూడా ఈ ప్రాజెక్టులో పాల్గొంటాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:31, 10 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కొత్త వెక్టర్ 2022 రూపులో ఒక లోపం[మార్చు]

సహాయం, వికీపీడియా, వర్గం, మూస పేరుబరుల్లోని పేజీల్లో నిన్నటి నుండీ ఒక లోపాన్ని గమనించాను. Vector 2022 రూపులో మాత్రమే ఈ లోపం కనిపిస్తోంది, అప్రమేయ వెక్టర్‌లో బానే ఉంది:

 • ఈ పేజీలకు ఇతర భాషల లింకులు చూపించడం లేదు. Wikipedia:Disambiguation pages with links అనే సందేశాన్ని చూపిస్తోంది (దీన్ని నేను అనువదించాను, త్వరలో వర్తింపజేస్తారు). పేజీలకు వికీడేటా లింకు ఉండి, అక్కడి సైట్‌లింకుల్లో ఇతర భాషల పేజీలు ఉన్నప్పటికీ, ఈ సందేశాన్ని చూపిస్తోంది.
 • పేజీని కిందికి స్క్రాల్ చేసినపుడు ఈ రూపులో, భాషా లింకుల ట్యాబు పేజీలో అన్నిటికంటే పైన తేలుతూ కనిపిస్తుంది. అక్కడ మాత్రం ఇతర భాషా లింకుల సంఖ్య చూపిస్తోంది. దాన్ని నొక్కినపుడు మాత్రం మళ్ళీ లింకులు లేనట్లే చూపిస్తోంది. ఈ లోపం ప్రధానబరి లోని పేజీల్లో లేదు.

ఒకటి రెండు రోజుల్లో ఈ లోపాని సరిచెయ్యకపోతే, మరెవరూ రిపోర్టు చెయ్యకపోతే, రిపోర్టు చేస్తాను. __చదువరి (చర్చరచనలు) 05:36, 15 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @Chaduvari గారు, మరికొద్దిరోజుల్లోనే వెక్టర్ 2022 రూపును డిఫాల్ట్ గా రూపుగా చేయబోతున్నారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:50, 15 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
రిపోర్టు చేసాను. __ చదువరి (చర్చరచనలు) 15:32, 15 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
వాళ్ళు వెంటనే దీన్ని పరిష్కరించారు. ఇప్పుడు ఆయా పేరుబరుల్లో కూడా భాషల లింకులు బాగానే కనిపిస్తున్నాయి. __ చదువరి (చర్చరచనలు) 07:06, 17 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Cleaning up files - update[మార్చు]

Hi! In వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_85#Cleaning_up_files_and_moving_to_Commons I raised the question if we could clean up files and if possible move those to Commons. Per వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_86#ఆంధ్రప్రదేశ్,_తెలంగాణ_మండలాల_పాత_మ్యాపుల_తొలగింపు about 1,000 files were deleted or moved to Commons.

We need admins to help delete files in:

We need everyone to

When I made this post there were 5,110 free files in (Category:All free media): (This number is updated live: 5,111 files). Let's see if we can get this number down a bit :-) I made suggestions abowe but any help is welcome. --MGA73 (చర్చ) 19:21, 15 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కొత్త Vector 2022 రూపుకు సంబంధించి పెండింగులో ఉన్న సాంకేతిక సమస్యలు[మార్చు]

కొత్త రూపుకు సంబంధించి ఇప్పటి వరకు మనం మొత్తం మూడు సమస్యలను సాంకేతిక బృందానికి నివేదించగా వాటిలో ఒకటి పైన చెప్పినట్టుగా పరిష్కారమైంది. కింది రెండు ఇంకా పెండింగులో ఉన్నాయి.

 1. వెతుకు పెట్టెలో ఉన్న తీవ్రమైన సమస్యను 2022 అక్టోబరు 2 న రాసాను. అయితే దానిపై వాళ్ళు చర్య ఏమీ తీసుకోలేదు. మొన్న దాని గురించి గుర్తు చేసాను. ఆ తరువాత వాళ్ళు దాని పరిష్కారం కోసం ఫ్యాబ్రికేటరులో ఒక టికెట్టు తెరిచారు. బహుశా కొద్ది రోజుల్లో ఇది పరిష్కారం కావచ్చు.
 2. వాడుకరి మెనూ డ్రాప్ డౌన్ లిస్టుకు సంబంధించి మరొక సమస్యను కూడా మొన్న అక్కడ నివేదించాను. దాని గురించి వాళ్ళు వివరణ అడిగారు. అది చెప్పాను. దాని గురించి కూడా ఒకటి రెండు రోజుల్లో తెలియవచ్చు.

__చదువరి (చర్చరచనలు) 07:18, 17 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:33, 17 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

బుక్ ఫెయిర్ ఔత్సాహికులకు తెవికీ శిక్షణ[మార్చు]

సభ్యులకు సమస్కారం, హైదరాబాదు బుక్ ఫెయిర్ లో తెలుగు వికీపీడియా స్టాల్ నిర్వహించిన నేపథ్యంలో దాదాపు 200మంది ఔత్సాహికులు తెవికీ శిక్షణకు రిజిస్టర్ చేసుకున్నారు. వారందరికి జనవరి 23 నుండి వారం రోజులపాటు ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ఆన్లైన్ వేదికగా తెవికీ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఆసక్తిగల సభ్యులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ఔత్సాహిక రచయితలకు శిక్షణ అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభ్యులు తమ స్పందనలను తెలియజేయగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:40, 17 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నేను 23, 24 తేదీల్లో ఏదో ఒక రోజు పాల్గొనగలను. __ చదువరి (చర్చరచనలు) 14:37, 17 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకోవడానికి పోస్టరు నేను తయారు చేయగలను, తద్వారా మరింత మందికి చేరవేయవచ్చు. అలాగే జనవరి 25,26,27 తేదీల్లో నేను ఈ సమావేశంలో పాల్గొనగలను. ధన్యవాదాలు. NskJnv 16:41, 17 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నేను వారంరోజులూ అందుబాటులో ఉంటాను.-అభిలాష్ మ్యాడం (చర్చ) 17:59, 17 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు పేజీ సందర్శన గణాంకాల ప్రకారం ఈసారి శిక్షణా తరగతులు మొబైల్ లో తెలుగు వికీ ఉపయోగించడం,సవరించడం ప్రాధాన్యంగా సాగుతుంది, జనవరి 23 సోమవారం నుండి శనివారం 26 జనవరి 2023 వరకు ఆరు రోజుల పాటు సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు zoom app ద్వారా ఆన్లైన్ లో జరుగుతాయి. ఈ అవగాహన ప్రాధమిక శిక్షణా వ్యవధి కొంచెం తక్కువ అయినా ప్రతి తరగతి తరువాత ఒక అభ్యసము తో పాటు, జరిగిన తరగతి రికార్డింగ్, గైడ్ ప్రజంటేషన్ నమోదు చేసుకొన్న వారందరికీ పంపటం జరుగుతుంది.శిక్షణ అందించే వారు ఈ ప్రణాళిక మీద సూచనలు, మీకు ఆసక్తి గల అంశం తెలియచేయగలరు.

మొదటి రోజు :
01. తెలుగు వికీపీడియా పరిచయం ,02. మూల స్తంభాలు ,03. మొబైల్ లో వికీపీడియా అప్
రెండవ రోజు  :
04. వికీపీడియా అంతర్వరి అవగాహన, చర్చా పేజీలు మరియు వీక్షణ జాబితాలు 05. వికీపీడియాలో వ్యాసం అన్వేషణ 06. వికీపీడియా విధానాలు
మూడవ రోజు :
07.వాడుకరి ప్రయోగశాల పరిచయం, 08. మొబైల్ లో ఎలా సవరించాలి 09. డెస్కుటాప్ విజువల్ ఎడిటర్ 10.వికీకోడ్
నాలుగవ రోజు :
11. ప్రయోగశాలలో నమూనా వ్యాసం రాయటం 12.మూలాలు వర్గాలు చేర్చటం , మూల్యాంకనం చేయడం
ఐదవరోజు :
13.వ్యాసాన్ని మెరుగుపరచటం సమాచార పెట్టె 14.కొత్త పేజీలకై మార్గదర్శకాలు
ఆరవ రోజు :
15.వ్యాసాలను అనువదించడం 16.తదుపరి కార్యాచరణ పరిచయం

ఈ ప్రణాళిక మీద ఈ శనివారం 21 జనవరి సాయంత్రం 7 ఆన్లైన్ మీటింగ్ లో చర్చిద్దాము, అలాగే ఒక ప్రెజెంటేషన్ టెంప్లేట్ తయారుచేసుకొందాము --Kasyap (చర్చ) 05:20, 18 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సభ్యులు దయచేసి నేడు శనివారం 21 జనవరి సాయంత్రం 7 జరిగే మీటింగ్ కు హాజరు కాగలరు తమ సూచనలు, మీరు శిక్షణ ఇవ్వదలచుకొన్న అంశం తెలియచేయగలరు లింకు : https://meet.google.com/fvv-ryqb-gni Kasyap (చర్చ) 05:21, 21 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Voting Opens on the Revised Universal Code of Conduct (UCoC) Enforcement Guidelines[మార్చు]

You can find this message translated into additional languages on Meta-wiki.
{{subst:more languages}}

Hello all,

The voting period for the revised Universal Code of Conduct Enforcement Guidelines is now open! Voting will remain open for two weeks and will close at 23:59 UTC on January 31, 2023. Please visit the voter information page for voter eligibility information and details on how to vote.

For more details on the Enforcement Guidelines and the voting process, see our previous message.

On behalf of the UCoC Project Team,

CSinha (WMF) (చర్చ) 12:39, 17 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వ్యాసపు చర్చా పేజీలలో అక్షర దోషాలు[మార్చు]

వికీపీడియా లోని వ్యాసాలను అత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. అని వుంది. అత్తమంగా అనే చోట ఉత్తమంగా అని ఉండాలి. సరిచేయగలరు. YVSREDDY (చర్చ) 02:21, 19 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
@YVSREDDY గారూ, దీనిపై నా అభిప్రాయాలు -
 1. వికీలో దోషాలను గమనించినపుడు "వెనకాడకుండా సరిచేయండి" అనేది అందరూ పాటిస్తారు. వికీ మెరుగుపడడానికి అది రాచబాట.
 2. ఇలాంటి దోషాలు వికీలో కోకొల్లలు. వాడుకరులు తాము చూసిన చిన్నాచితకా దోషాల గురించి రచ్చబండలో రాసుకూంటూ పోతూంటే అనవసరమైన శ్రమ. చూసిన వెంటనే సరిచేస్తే బాగుంటుంది.
 3. మీరు ఆ దోషం ఏ పేజీలో ఉందో రాయలేదు. ఇప్పుడూ మరొకరెవరైనా దాన్ని సరిచెయ్యాలంటే.. ఆ దోషం ఎక్కడ ఉందో వెతకాలి, దొరక్కపోతే మళ్ళీ మిమ్మల్ని అడగాలి, మీరు చెప్పాలి. అప్పుడు దాన్ని సరిచెయ్యాలి.. ఇదంతా వృథా శ్రమ అని నా అభిప్రాయం.
 4. అయినా సరే, మీరు చెప్పారు గదా అని సరిచేద్దామని నేను దాని కోసం వికీలో వెతికాను. కానీ ఈ దోషం ఎక్కడ ఉందో నాకు కనబడలేదు. ఈ లింకు చూడండి. మీరు ఎక్కడ చూసారో తెలీడం లేదు., ఒకవేళ వేరెవరైనా ఈసరికే దాన్ని సరిచేసారేమో తెలీదు.
 5. ఒకవేళ పేజీల్లో ఉన్న దోషాలను సరిచెయ్యలేని పరిస్థితి ఉంటే, ఆ దోషాలకు సంబంధించిన మూసను అక్కడే, ఆ పేజీ లోనే పెట్టెయ్యాలి. లేదా ఆ సంగతిని దాని చర్చ పేజీలోనే రాసెయ్యాలి. రచ్చబండలో రాయకుండా ఉంటే మంచిది.
గమనించవలసినది. __చదువరి (చర్చరచనలు) 06:50, 22 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
దొరికేసింది. ఇంకా సృష్టించని చర్చ పేజీల్లో ఉండే సందేశంలో ఉంది ఆ దోషం. ట్రాన్స్‌లేట్‌వికీలో దాన్ని సవరించాను. @YVSREDDY గారూ, ఇక్కడ ఎందుకు రాసారో ఇప్పుడు అర్థమైంది. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 07:19, 22 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చదువరి గారూ అత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే అనే వాక్యం చర్చా పేజీలు సృష్టించని, చర్చ:చిత్రం (గ్రామం),
చర్చ:వై.యస్.భారతి, చర్చ:తమిళనాడు గవర్నర్ల జాబితా, చర్చ:కనగల్ మండలం ఇలా అన్ని పేజీలలో ఉన్నట్లుంది. గమనించగలరు.అలాగే వికీ సోర్సు చర్చా పేజీలలో కూడా ఉంది. యర్రా రామారావు (చర్చ) 14:48, 22 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

మొదటి పేజీలో ‘చరిత్రలో ఈ రోజు’ విభాగంలో తేదీ మార్పు[మార్చు]

సభ్యులకు నమస్కారం... తెవికీలో లాగిన్ అయిన వారికి మాత్రమే తెవికీ మొదటి పేజీలోని ‘చరిత్రలో ఈ రోజు’ విభాగంలో ఆరోజు తేదీ వివరాలు కనిపిస్తున్నాయికానీ, లాగిన్ కానివారికి మాత్రం పాత తేదీల వివరాలను చూపిస్తోంది. కానీ ఆంగ్ల వికీలో మాత్రం లాగిన్ కానివారికి కూడా ఆ రోజు తేదీల వివరాలనే చూపిస్తోంది. దీనికి పరిష్కారం ఉంటే సభ్యులు సూచించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:06, 23 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దీన్ని పరిష్కరించేందుకు ఈ లింకును ఒకసారి నొక్కితే, కాషెలో ఉన్న సమాచారం తొలగిపోయి తాజా సమాచారం కనిపిస్తుంది. రోజుకొక్క సారి ఈ లింకును నొక్కితే సరిపోతుంది. __చదువరి (చర్చరచనలు) 11:03, 31 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు @Chaduvari గారు. మొదటి పేజీలో తాజా సమాచారం కనిపించడంకోసం ప్రతిరోజూ కాషెలో ఉన్న సమాచారాన్ని తొలగించాలి కాబట్టి, మీరు పైన ఇచ్చిన లింకును మొదటి పేజీలో ఎక్కడన్నా ఒకచోట పెడితే మనకు అందుబాటులో ఉంటుందని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:16, 31 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఆడియో రికార్డింగ్ పరికరం కోసం అభ్యర్థనకు సముదాయ ఆమోదం కోరుకుంటున్నాను.[మార్చు]

సభ్యులకు నమస్కారం. సీఐఎస్‌ఏ2కే వారు వివిధ రూపాల్లో వికీపీడియన్‌లకు వికీపీడియా తోడ్పాటుకు సహకరించే సహాయం చేస్తున్నారు. వారు ఇస్తున్న ఐటి సపోర్ట్ కింద ఆడియో డివైస్ ఒకటి అభ్యర్థిస్తున్నాను. నేను పాల్గొనే సభలలో, కార్యక్రమాలలో వచ్చే వ్యక్తుల నుంచి వికీపీడియాకు కావాల్సిన సమాచారం ఆడియో(శ్రవ్యక), వీడియో(దృశ్యక) రూపంలో నమోదు చేస్తాను. అయితే ఆడియో రికార్డ్ చేసేప్పుడు ఫోన్ తో ఇబ్బంది కలుగుతోంది. అందుకని, ఆడియో రికార్డింగ్ డివైస్ ఒకటి కొనేందుకు అభ్యర్థనల పేజీలో అభ్య్ర్థన చేయాలి. అందుకు సముదాయ ఆమోదం కావాలి. దయచేసి సభ్యులు ఆమోదం తెలుపగలరు. -- రహ్మానుద్దీన్ (చర్చ) 07:45, 31 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్ గారూ నమస్కారం.మీ అభ్యర్థన మీద నాకు కొన్ని సందేహాలు ఉన్నవి. వాటిపై వివరణ ఇవ్వగలరు.
 1. గతంలో సీఐఎస్‌ఏ2కే వారి ద్వారా వివిధరూపాల్లో ఇలాంటి వాటికి ఏమైనా సహాయం పొందారా? లేక ఇదే మొదటిదా?
 2. ఈ ఆడియో డివైస్ పొందితే తెలుగు వికీపీడియాకు ఏరకంగా దోహదపడుతుంది అనేదానిపై సవివరంగా వివరించగలరు.
 3. మీరు పాల్గొనే సభలలో, కార్యక్రమాలలో వచ్చే వ్యక్తుల నుంచి వికీపీడియాకు కావాల్సిన సమాచారం ఆడియో(శ్రవ్యక), వీడియో(దృశ్యక) రూపంలో నమోదు చేస్తాను. అయితే ఆడియో రికార్డ్ చేసేప్పుడు ఫోన్ తో ఇబ్బంది కలుగుతుందని తెలిపారు.అయితే ఇప్పటివరకు ఫోన్ ద్వారా చేసిన ఆడియో(శ్రవ్యక), వీడియో(దృశ్యక) రూపంలో సమాచారం తెలుగు వికీపీడియాలో ఏమైనా నమోదు చేసారా చేస్తే ఆలింకులు వివరించగలరు.
ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 08:47, 31 జనవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
1. గతంలో చేసిన అభ్యర్థనలు - ఒక కార్యశాలకు బ్యాడ్జిలు, స్టిక్కర్ల కోసాం అభ్యర్థన, తెలుగు వికీపీడియా మహోత్సవం కోసం సముదాయం తరఫున అభ్యర్థన, సముదాయం తరఫున దశాబ్ది వేడుకలకు అభ్యర్థన, meta:CIS-A2K/Requests/Archive_2018_1#Books_for_content_development.
2. ఈ ఆడియో రికార్డింగ్ డివైస్ వెనుకతల శబ్దాలను అరికట్టి స్పష్టంగా వక్త స్వరాన్ని పొందుపరుచగలదు. అలా రాజకీయంగా, సాహిత్యపరంగా పేరున్న వ్యక్తుల నుండి సమాచారం తీసుకొనవచ్చు. ఇది వాడి రెండవ స్థాయి వనరులు తయారు చేసి వాటి ఆధారంగా తిరిగి వికీపీడియాలో సమాచారం ఎక్కించవచ్చు.
౩.
ఫోన్ తో రికార్డ్ చేసిన వీడియో ఉదాహరణ
,
ఆడియో రికార్డర్ తో ఆడియో చేసి అతికించిన వీడియో ఉదాహరణ
.
నా ఎక్కింపులు గమనిస్తే, commons:Special:ListFiles/రహ్మానుద్దీన్, ఈ సమస్య వలన చాలా సభల ఫోటోలే తప్ప ఆడియోలు, వీడియోలు ఎక్కించలేదు. దాదాపుగా నేను సవరించిన జన్మ తేదీలు, చదువు సమాచారం, ఇలా ఆడియోల్లో సేకరించి, పత్రికల్లో ప్రచురింపచేసి, అది వాడి తిరిగి తెలుగు వికీపీడియాలో నా మార్పుల్లో చేర్చినవే. ఉ: గరికిపాటి నరసింహారావు గారి పుట్టిన తేదీ.
ధన్యవాదాలు. రహ్మానుద్దీన్ (చర్చ) 06:36, 1 ఫిబ్రవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Support ' ధన్యవాదాలు యర్రా రామారావు గారు, రహ్మానుద్దీన్ గారు. ఈ ప్రతిపాదనకు నా మద్దతు ఇస్తాను. __చదువరి (చర్చరచనలు) 07:43, 1 ఫిబ్రవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]
Support ' రహ్మానుద్దీన్ గారూ వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు.మీ ప్రతిపాదనకు నా మద్దతు తెలుపుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 08:26, 1 ఫిబ్రవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

విజయవాడ పుస్తక ప్రదర్శన[మార్చు]

విజయవాడ పుస్తక ప్రదర్శన 2023 ఫిబ్రవరి 9 నుండి 19 వరకు విజయవాడలోని పాలిటెక్నిక్ మైదానంలో జరగనుంది. పుస్తక ప్రదర్శనకు అన్ని రంగాల సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు అతిథులుగా వస్తారు. పుస్తక ప్రదర్శనను చూడటానికి వచ్చే జనం కూడా అధిక సంఖ్యలో ఉంటారు(గత ఏడాది దాదాపు లక్ష మంది సందర్శించారని నిర్వాహకుల అంచనా). ఈ పుస్తక ప్రదర్శనలో విజయవాడ ఆ చుట్టు పక్కల ఉండే వికీపీడియన్లు పాల్గొని వివిధ పుస్తకాల అట్టల బొమ్మలను, రచయుతల వివరాలను నేరుగా సేకరించే అవకాశం ఉంది. వికీపీడియాలో ఎక్కించేందుకు నకలు హక్కులు సవరించుకొని క్రియేటివ్ కామన్స్ లో రచయితలు/ప్రచురణకర్తలు విడుదల చేసేలా అభ్యర్థించేందుకు ఇది మంచి అవకాశం. సభ్యులు గమనించగలరు.-- రహ్మానుద్దీన్ (చర్చ) 06:44, 1 ఫిబ్రవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]