Jump to content

వికీపీడియా:రచ్చబండ

వికీపీడియా నుండి
(వికీపీడియా:Village pump నుండి దారిమార్పు చెందింది)
అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

వికీ లవ్స్ మాన్యుమెంట్స్ గురించి యూజర్ గ్రూప్ చర్చా వేదికలో ప్రస్తావన

సభ్యులకు నమస్కారం, ఈ సంవత్సరం మన వద్ద ఫోటోగ్రాఫర్ల సంఖ్య పెరగడంతో, మనం కూడా ఈ పోటీ నిర్వాక బాధ్యతలలో West Bengal User Groupతో పాలుపంచుకుంటే బాగుంటుందని పవన్ సంతోష్ గారూ, నేనూ భావిస్తున్నాం. దీనికి సంబంధించిన విషయాలను ఇక్కడ చెర్చించవలసినదిగా మనవి.--IM3847 (చర్చ) 07:10, 20 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

A2K Monthly Report for June 2024

Dear Wikimedians,

We are excited to share our June newsletter, highlighting the impactful initiatives undertaken by CIS-A2K over the past month. This edition provides a detailed overview of our events and activities, offering insights into our collaborative efforts and community engagements and a brief regarding upcoming initiatives for next month.

In the Limelight- Book Review
Geographies of Digital Exclusion
Monthly Recap
Dispatches from A2K
  • Future of Commons
Coming Soon - Upcoming Activities
  • Gearing up for Wikimania 2024
  • Commons workshop and photo walk in Hyderabad
Comic

You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.

Regards MediaWiki message delivery (చర్చ) 06:23, 26 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Vote now to fill vacancies of the first U4C

You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language

Dear all,

I am writing to you to let you know the voting period for the Universal Code of Conduct Coordinating Committee (U4C) is open now through August 10, 2024. Read the information on the voting page on Meta-wiki to learn more about voting and voter eligibility.

The Universal Code of Conduct Coordinating Committee (U4C) is a global group dedicated to providing an equitable and consistent implementation of the UCoC. Community members were invited to submit their applications for the U4C. For more information and the responsibilities of the U4C, please review the U4C Charter.

Please share this message with members of your community so they can participate as well.

In cooperation with the U4C,

RamzyM (WMF) 02:48, 27 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

20 ఏళ్ళు, లక్ష మెట్లు - పండగ చేద్దాం రండి

లక్ష వ్యాసాల లక్ష్యం దగ్గరపడుతోంది. ఇంకో 18 వందల వ్యాసాలు రాసేస్తే లక్షకు చేరినట్టే. ఈ వేగం ఇలాగే కొనసాగితే సెప్టెంబరు మధ్య కల్లా లక్షకు చేరతాం. ఇదొక మైలురాయి లాంటి సందర్భం. ఆ వెంటనే డిసెంబరులో తెవికీ 21 వ పుట్టినరోజు వస్తోంది. నిరుడు జరిపినట్లుగానే ఈసారి కూడా ఘనంగా జరుపుకుందాం అని వికీమీడియన్లు అంటున్నారు. ఎలా జరపాలి, ఎక్కడ జరపాలి, ఎప్పుడు జరపాలి, అనే విషయమై జూలై 31 న ఒక సమావేశం ఏర్పాటు చేసాం. ఈ సమావేశానికి అందరూ వచ్చి ఈ విషయాలపై తగు నిర్ణయాలు తీసుకోవలసినది. సమావేశం అజెండా, వేదిక వగైరాల గురించి వికీపీడియా:తెవికీ పండగ-25/సన్నాహక సమావేశాలు పేజీలో చూడవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 12:48, 28 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు చదువరి గారు, గతంలో రచ్చబండలో తెవికీ 21వ వార్షికోత్సవం-తెవికీ పండగ 2025 నిర్వహణ గురించి కొంత చర్చకూడా జరిగింది. ఇక కార్యక్రమ నిర్వహణ పనులు ప్రారంభించాల్సిన సమయం వచ్చేసింది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:16, 28 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. సమావేశంలో పాల్గొంటాను --V.J.Suseela (చర్చ) 06:20, 29 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా వ్యాస రచనలలో "మరియు" వాడకం - చర్చ

క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి. ముగింపు అభిప్రాయాల సారాంశం(సందర్భాన్ని బట్టి), చర్చ ముగింపు కారణం క్రింద ఇవ్వబడింది..
ఈ చర్చను వికీపీడియా:వికీపీడియాలో "మరియు" వాడుక పేజీకి తరలించాం. చర్చను అక్కడ కొనసాగించవలసినది

తెలుగు వికీపీడియాలో భాషా శైలికి సంబంధించిన మార్గదర్శకంలో "మరియు" ఉండకూడదన్న నియమం ఉన్నది, దానిని సూచన గా మార్చాలని నేను కోరుతున్నాను, మన చర్చలలో కూడా చాలా సార్లు వాడాము, అవి ఇక్కడ చూడవచ్చు, ఈ పదం రెండు వాక్యాలు లేదా పదబంధాలను కలపడానికి ఉపయోగించే సమాసంజనం. ఇది వాక్యాల మధ్య సంబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.ఎప్పటి నుండో తెలుగు లో మరియు వాడకం ఉన్నట్లు 1951 లో ఒక పుస్తక శీర్షిక లో కూడా ఉన్నట్లు ఇక్కడ తెలుస్తున్నది. కొంత మంది రచనలలో శైలికి ఉదాహరణగా పేర్కొనే ఈనాడు పత్రిక లో కూడా ఈ పద వాడకం చూడవచ్చు . అన్ని సందర్భాల్లోనూ ఒకే విధంగా ఉపయోగించబడదు, ముఖ్యంగా తెలుగు నుండి ఇంగ్లీష్ వంటి భాషలలో అనువాదం చేసేటప్పుడు పదబంధాల మధ్య సంబంధాన్ని స్పష్టంగా తెలియజేయడానికి "మరియు" ఆవసరం అయితే, ప్రతి సందర్భంలోనూ "మరియు" అనే పదం అవసరమా అనేది వాక్య నిర్మాణం, అర్థం మరియు రచయిత శైలిపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి అది ఎంచుకొనే స్వేఛ్చ ఆ రచయితకు ఉండాలి. ఎక్కువ శాతం రచయితలు విరివిరిగా "మరియు" వాడుతూ వాక్య నిర్మాణాలు చేయరు అని నేను భావిస్తున్నాను,ఇంకా కృత్రిమ మేధ, యాంత్రిక (ఏఐ) అనువాదం కూడా కృతకం గా ఉండదు, .కాబట్టి తెలుగులో మరియు అసహజం ఏమీకాదు కాబట్టి ఈ పదము నిర్బంధం కాకూడదు. ఈ విషయం మీద అనేక సార్లు చర్చ జరిగినది , అయితే మరింత చర్చ జరగవలసిన అవసరం ఉన్నది, కావున దయచేసి మీ అభిప్రాయాలు తెలియచేయగలరు. Kasyap (చర్చ) 13:35, 28 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

  • తరచుగా కాకపోయినా, వాడక తప్పనిసరి అయిన చోట అంటే వాడకపొతే సరిఅయిన అర్ధం అందచేయక పొతే వాడవచ్చని నాఅభిప్రాయం' ఆంగ్లం లో కూడా 'and' ఒకే వాక్యం లో పదే పదే వాదము. V.J.Suseela (చర్చ) 06:18, 29 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • "మరియు" అనేది అతి తక్కువ చోట్ల వాడవచ్చు అని నా అభిప్రాయం. వద్దు అని చర్చ జరిగి ఎక్కువ మంది సభ్యులు తెలుగు వికీపీడియా వాడకూడదు అనే అభిప్రాయం తీర్మానం చేశాక పొరపాటున అక్కడక్కడ వాడిన బాటు తోటి తొలగింపు చేస్తూ ఉంటే ఎందుకొగొడవన గొడవ మరియు వాడవలసిన చోట ఓ కామా పెడితే సరిపోతుందిగా అని సర్దుకుపోవడమే విశేష అనుభవిజ్ఞులు చదువరి గారు వారి వాడుకరి పేజీలో మొదటి పదం మరియు వాడకూడదు. అని ఉండడంతో ఇక మరియూను వదిలేయడం జరిగింది. కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు రెండు మూడు మంత్రుత్వ శాఖలు కేటాయింపులు జరిగినప్పుడు తప్పకుండా మరియు అనే పదము ప్రతి పత్రిక వాడటం నేను చాలా సార్లు గమనించాను. ఆంగ్లంలో అండ్ ఉన్నప్పుడు తెలుగులో మరియు ఎప్పుడో ఒకచోట వాడటంలో తప్పులేదు. ఎందుకంటే అది ఏమి "జిహాద్" పదం కాదు కదా. ధన్యవాదాలు.ప్రభాకర్ గౌడ్చర్చ 15:41, 28 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • @Kasyap గారూ, మీరు ఈనాడు పేరు ఎత్తారు కాబట్టి, ఏమో ఈమధ్య ఏమైనా ఈనాడు పాలసీ మారిందేమో మరియు విషయంలో ఎందుకైనా మంచిదని ఒకసారి ఈనాడు పత్రిక పోర్టల్ తెరిచి నాకు కనిపించిన వార్తలు (ర్యాండమ్ గా) ఎన్నుకుని తెరిచి చూశాను.
    1. "సివిల్స్ కలని చిదిమేసిన నిర్లక్ష్యం" అన్న మొదటి పేజీ వార్త అది. అందులో కొన్ని వాక్యాలు చూస్తే:
    2. తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25), నవీన్ డాల్విన్ (24)గా గుర్తించారు అని రాశారే తప్ప ఆంగ్ల ధోరణిలో తాన్యా సోని (25), శ్రేయా యాదవ్ (25) "మరియు" నవీన్ డాల్విన్ (24)గా గుర్తించారు అని రాయలేదు.
    3. విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భారాస నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తదితరులు సంతాపం తెలిపారు. - ఈ వాక్యంలో కూడా మరియు లేకుండానే కానిచ్చేశారు.
    4. సుప్రీం కోర్టులో నితీశ్‌కు ఎదురుదెబ్బ అన్న వార్త తెరిచాను: ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ కోటా అని రాశారు తప్ప ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అని రాయలేదు.
    5. ఎన్నికల్లో గెలిపించి కేజ్రీవాల్ అవమానానికి గుణపాఠం చెప్పండి అన్న మరో వార్తలో "దిల్లీ, పంజాబ్‌లలో" అని, "విద్య, వైద్య సౌకర్యాల్లేవు" అని రాశారు. దిల్లీ మరియు పంజాబ్, విద్య మరియు వైద్య అని రాయలేదు.
    6. 300 ఇళ్లు... ఒక్కటే కరెంటు మీటరు! అన్న వార్తలో "కర్రలు, చెట్లకొమ్మలే ఊతంగా సర్వీసు తీగల నుంచి వైర్లు" అన్నప్పుడూ కర్రలు మరియు చెట్లకొమ్మలే ఊతంగా అని రాయలేదు.
    7. మను మాణిక్యం అన్న వార్తలో ఫైనల్లో రమిత, బబుత అన్నారు, రమిత మరియు బబుత కాదు. వార్తలో పలుచోట్ల మను, జస్పాల్ అని ఉంది, మను మరియు జస్పాల్ కాదు. అట్లానే, "రమిత జిందాల్, అర్జున్ బబుత", "మను నైపుణ్యం, ప్రతిభ", "తండ్రి సమానుడు, మంచి స్నేహితుడు" వంటి పదాల విషయంలో కూడా మధ్యలో మరియు లేదు.
ఇలా ఈనాడు పత్రికలో వారానికి వందలు, వేలాది ఉదాహరణలు సామాన్యంగా యాంత్రికానువాదంలో మరియు వచ్చేచోట కామాతో పెట్టి వాడేవి చెప్పుకుంటూ పోవచ్చు. (నేను క్రమంతప్పకుండా శ్రద్ధగా ఈనాడు చదివే పాఠకుణ్ణి కాబట్టి నాకు తెలుసు) ఆ విధంగా చూస్తే ఈనాడు పత్రికలో కూడా ఉన్నాయని మీరిచ్చిన ఉదాహరణలు ఎప్పుడో, ఎక్కడో ఉప సంపాదకుల కన్నుగప్పి ప్రచురితమైనవే తప్పించి ఈనాడు పత్రికల ప్రామాణిక భాషలోనివి కావని నిస్సంశయంగా చెప్పవచ్చు. పవన్ సంతోష్ (చర్చ) 09:44, 29 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • భాష మౌలికత విషయంలో మనం వికీపీడియాలో ప్రత్యేకంగా నియమాలు రాసుకోవాల్సిన అచసరం లేదన్న సంగతి మనకు తెలిసిందే. అంటే అతడు బెంగళూరు వెళ్ళింది, ఆ పదిమందీ పోటీలో పాల్గొన్నాడు, నేను రేపు అన్నం తిన్నాను అనేవి తప్పు వాక్యాలు, అలాంటివి రాయకూడదు అని మనం ప్రత్యేకంగా నియమాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అవి తప్పు వాక్యాలేనని మనందరికీ తెలుసు. అలాంటి వాటిపై చర్చ చెయ్యాల్సిన అవసరమే లేదు. కానీ, "మరియు" విషయమై ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే అది ఒప్పో తప్పో మనకు ఇదమిత్థంగా తెలీదు. అంచేత దానిపై మనకు భిన్నాభిప్రాయాలున్నాయి. భాష లోని ఒక మౌలిక విషయంపై మన అభిప్రాయాల అవసరం ఏర్పడడం శోచనీయమే. కానీ, దానికి మనం చేయగలిగినదేమీలేదు. ఎందుకంటే, భాషావేత్తలు, పండితులు, ప్రామాణికమైన పత్రికలు వగైరాలు చెప్పినదాన్ని పాటించేవాళ్లమే తప్ప, మనమేమీ భాషావేత్తలం కాదు. వాళ్ళు ఏం చెప్పారు, ఏం చెబుతున్నారు అనేది తెలుసుకుంటే మన సమస్య పరిష్కారమౌతుంది. అంచేత మనందరం, మనమన అభిప్రాయాలు చెప్పడం కాకుండా ఈ కోణంలో కృషి చేద్దాం అని నా అభిప్రాయం. ఇక్కడ, ఈనాడులో ఎలా రాస్తున్నారు అనే విషయమై ఇద్దరు రాసారు. అలాగే ఇంకా ఇతరులు ఏం చెబుతున్నారు అనేది కూడా అందరం వెతుకుదాం, పరిశీలిద్దాం.
నేను వాటి గురించి వెతికాను. మన వికీసోర్సు లోనే చేకూరి రామారావు గారి "తెలుగు వాక్యం" పుస్తకం దొరికింది. దయచేసి ఈ అధ్యాయం చదవండి. __చదువరి (చర్చరచనలు) 11:46, 29 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • "మరియు" వాడకం అన్నమాచార్య కృతి మనసిజ గురుడితడో "" లాంటి అనేక కీర్తనలలో , మొదటి తెలుగు అనువాదాలలో ఒకటి అయిన బైబిల్  , మరియు ప్రభుత్వ  చట్టము లో,  అనేక పదనిఘంటువు లలో  పదకోశములలో,  ఆధునికవ్యవహారకోశం  తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978 , ఉర్దూ - తెలుగు నిఘంటువు (బి.రామరాజు) 1962 అర్ధ వివరణలలోనూ,ఉదాహరణలలోనూ, అమ్మనుడి ,వంటి తెలుగు భాష కోసం పనిచేసే పత్రికలతో సహా ఇతర పాత రచనలలో కనుగొనబడింది  , [పుస్తక శీర్షికలతో] వాడుకలో వున్నది, ఇది సోషల్ మీడియాలో, లక్షలసార్లు ఇంటర్నెట్‌ ఇంకా ఈనాడు నెట్ లో సుమారు ( 24000 సార్లు ) ఆంధ్రజ్యోతి వెబ్ లో [14 వేల సార్లు ] ) , ఇంకా [| 1965 నాటి   ] ) గోల్కొండ, ఆంధ్రపత్రిక, ఇతర పత్రికలు మరియు పుస్తకాలలోనూ, ప్రస్తుతము వున్న అనేక వార్తా పత్రికలలో , లక్షల సార్లు మరియు విస్తృతంగా ఉపయోగించబడుతున్నది. కాబట్టి ఈ పద వాడకం వ్యవహారిక భాషతోపాటూ, ప్రామాణిక భాషలో ఉన్నదని చెప్పవచ్చు.. Kasyap (చర్చ) 05:23, 31 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
    @Kasyap గారూ, అన్నమాచార్యల కృతిలోనూ, బైబిల్ అనువాదంలోనూ మరియు అన్న పదం "And" ప్రధానంగా వాడేట్టుగా ( used to connect words of the same part of speech, clauses, or sentences, that are to be taken jointly.) వాడలేదు. అలా వాడరు కూడా. ఎలా వాడతారంటే - ఇప్పుడు మనం "మరి" అని ఎక్కడైతే వాడుతున్నామో అక్కడ వాడతారు.
    "మనసిజ గురుడితడో
    మరియు గలడో వేదవినుతుడు డితడుగాక వేరొకడు గలడో" అని మీరు తెచ్చిన ఉదాహరణలో మరి పెట్టి చూడండి.
    "మనసిజ గురుడితడో
    మరి గలడో వేదవినుతు డితడుగాక వేరొకడు గలడో" అన్నప్పుడు మీకు అర్థం అదే వస్తుంది. అంటే - used to introduce an additional comment or interjection అన్న అర్థంలో మరియు వాడేవారు. భాష అభివృద్ధి చెందే కొద్దీ "యు" లుప్తమైంది.
    బైబిల్ ఉదాహరణ తీసుకుందాం:
    "కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.
    మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే."
    అన్న వాక్యాల్లో మరియు బదులు మరి పెట్టండి.
    "కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.
    మరి పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే." అని వస్తుంది.
    ఇది ప్రాచీన తెలుగులో మరియు వాడిన విధానం. కాబట్టి, అన్నమయ్య సంకీర్తనల్లో ఉన్న మరియు, తొలి బైబిల్ ప్రతుల్లో ఉన్న మరియు మీరు చెప్పే వాడకం కానే కాదు.
    మీరిచ్చిన బైబిల్లోనే ఈ కింది విధంగా ఉన్న వాక్యం చూడండి:
    "కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే." మరి, మీ లెక్క ప్రకారం మరియు బైబిల్ అనువాదకులు వాడి ఉంటే - విశ్వాసము, నిరీక్షణ, మరియు ప్రేమ అని వాడాలి. ఎందుకు వాడలేదు? సమాధానం ఆలోచించి చెప్పండి. పవన్ సంతోష్ (చర్చ) 12:40, 1 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  • బూదరాజు రాధాకృష్ణ గారి గురించి ఇక్కడ పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. అగ్రగణ్యులైన భాషావేత్తల్లో ఆయనొకరు. భాషపై అనేక పుస్తకాలు రాసారాయన. ఆయన రాసిన తెలుగుభాషా స్వరూపం పుస్తకంలో (ఈ లింకులో ఆ పుస్త్యకాన్ని చదవవచ్చు) "మరియు" గురించి ఇలా రాసారు:
  1. పిదప, కనుక, మరియు, దనుక-వంటి పాతకాలపు మాటలను వాడుక చేయవద్దు. మారుమూల అవ్యయీభావ సమాసాల వాడుక మంచిది కాదు. ఉదా. యథాసంభవం. అయితే 'వృథాప్రయాస, ప్రయాస వృథా' వంటివి వాడవచ్చు (35 వ పేజీలో)
  2. 'మరియు' మొదలైన అవ్యయాల స్థానంలో మాటల చివరి అచ్చులకు దీర్హం వాడి రెండుమాటలు కలపవచ్చు. ఉదా. వాడూ వీడూ, అదీ ఇదీ (35 వ పేజీలో)
  3. హిందీ ఇంగ్లీషుల్లోలాగా 'ప్రత్యేకశబ్దాలు ("ఔర్", "అండ్"- వంటి సముచ్చయార్ధకాలనూ, "యా", "ఆర్" -వంటి వికల్పార్థకాలనూ) వాడకుండానే 'కానీ, కాబట్టి, అయినా, అయితే” వంటి అవ్యయాలతో రెండు వాక్యాలను కలవవచ్చు. ఉదా. ఆమె చక్కనిది, కాని గర్వంలేదు; ఆయన పెద్దమనిషి కాబట్టి అబద్దం చెప్పడు; వాడు దొంగ, అయినా మర్యాదస్థుడే; ఆమె పనికత్తె, అయితే ఒళ్లు దాచుకుంటుంది (36 వ పేజీలో)
__చదువరి (చర్చరచనలు) 11:49, 1 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.

Train-the-Trainer (TTT) 2024: Call for Applications

Apologies for writing in English, please feel free to post this into your language.

Dear Wikimedians,

We are thrilled to announce the 9ninth iteration of the Train-the-Trainer (TTT) program, co-hosted by CIS-A2K and the Odia Wikimedians User Group. TTT 2024 will be held from October 18-20, 2024, in Odisha.

This event aims to enhance leadership and training skills among active Indian Wikimedians, with a focus on innovative approaches to foster deeper engagement and learning.

Key Details
  • Event Dates: October 18-20, 2024
  • Location: Odisha, India
  • Eligibility: Open to active Indian Wikimedians
  • Scholarship Application Deadline: Thursday, August 15, 2024

We encourage all interested community members to apply for scholarships. Please review the event details and application guidelines on the Meta page before submitting your application. Apply Here: Scholarship Application Form For any questions, please post on the Event talk page or email nitesh@cis-india.org.

We look forward to your participation and contributions!

Regards MediaWiki message delivery (చర్చ) 10:45, 31 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

లక్ష వ్యాసాలు, పుట్టినరోజు పండగలపై జరిగిన సమావేశ నివేదిక

లక్ష వ్యాసాల ఉత్సవం, తెవికీ పుట్టినరోజు పండగ - ఈ రెంటి విషయమై సమావేశం అనుకున్న విధంగా జూలై 31 సాయంత్రం 7 గంటలకు జరిగింది. నివేదికను వికీపీడియా:తెవికీ పండగ-25/సన్నాహక సమావేశాలు పేజీలో చూడవచ్చు. తదుపరి చర్యల విషయమై మీమీ అభిప్రాయాలు కూడా ఆ పేజీలోనే చెబితే నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగవచ్చు. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 06:47, 1 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:39, 1 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

కాలేజి విద్యార్ధులకు వికీ శిక్షణ, ఫలితాలు.

జూన్, జులై నెలలలో, కె ఎల్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న కొంత మంది విద్యార్ధులకు వికీపీడియా, కామన్స్, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్స్, వికీడాటా వంటి ప్రాజెక్టులను పరిచయం చేసి, వారి సొంత ఊర్ల (వేసవి సెలవులు!) సమాచారం, ఫోటోలు, ఇతర వివరాలు సేకరించమని చెప్పాము. దీనికి సుమారు ఒక తొంబై మంది నమోదుచేసుకోగా, ముప్పై మంది చురుకుగా పాల్గొని, కామన్స్ లో 450 ఫోటోలు, తెలుగు, ఆంగ్లం, ఒడియా, హిందీ వికీలలో వందకు పైగా మార్పులు, మ్యాపిలెరీలో 18,000 వీధి చిత్రాలు, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో గ్రామం మ్యాప్, చేర్చారు. (పూర్తి వివరాలకు ఈ వికీ డాష్ బోర్డ్ చూడండి) ఇది కాకుండా, వారి ఊర్లలో ఉన్న ప్రాధమిక పాఠశాలల్లో, మూడు రోజుల పాటు కంప్యూటర్ పాఠాలు బోధించారు. ఇదంతా నిర్వహించింది, కె ఎల్ యూనివర్సిటీ లీనక్స్ గ్రూప్ వాలంటీర్లు, స్వేఛ్ఛా ఆంధ్ర ప్రదేశ్ స్వచ్చంధ సంస్ధ. ఈ అనుభవంతో, ఇందులో చురుకుగా పాల్గొన్న కొంత మంది విద్యార్ధులతో కాలేజీలో వికీ క్లబ్ ను మొదలుపెట్టాలని నిర్నయించారు. దీనినే మరిన్ని కాలేజీలకు విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. Saiphani02 (చర్చ) 16:00, 1 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మీ కార్యక్రమం ప్రణాళిక బాగుంది. ఫోటోలు చూశాను, ఆయా గ్రామానికి చెందిన, విషయానికి చెందిన వాటితో లింకు చేస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటాయి. నేను కొన్ని బొమ్మలకు చేర్చాను. ఒకసారి చూడండి. నేను మీకు నేర్పించగలను. గమనించండి. మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతారని ధన్యవాదాలతో.--Rajasekhar1961 (చర్చ) 17:39, 1 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
విద్యార్ధులకు వికీపీడియా శిక్షణ నిర్వహించడంతోపాటు, వారినుండి ఫోటోల ఎక్కింపు-వికీల్లో దిద్దుబాట్లు వంటివి చేయడంలో మీ కృషికి ధన్యవాదాలు @Saiphani02 గారు. కాలేజీలో వికీ క్లబ్ ను మొదలుపెట్టాలన్న మీ ఆలోచన కూడా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండీ.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:45, 1 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Saiphani02 గారూ. మంచి కార్యక్రమం. నిర్వహించిన మీకు, పాల్గొన్నవారికీ అభినందనలు. ఒకప్పుడు వివిఐటిలో ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు చురుగ్గా ఉన్నారో లేదో తెలియదు. అప్పుడప్పుడూ మ్యాపథాన్, ఎడిటథాన్ లాంటి సామూహిక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఉత్సాహాన్నీ, ఊపునూ నిలిపి ఉంచవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 01:02, 2 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Saiphani02 గారూ మంచి కార్యక్రమాలు చేపట్టారు.ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టే సత్తా మీదగ్గరఉందని నేను నమ్ముతున్నాను.ఫొటోలు లింకు చూసాను.బాగున్నాయి. కార్యక్రమం నిర్వహించిన మీకు, పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 01:45, 2 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Saiphani02 గారూ మీ కార్యక్రమం బావుంది. ఫోటోలు వికీ ప్రాజెక్టులకి పనికి వస్తాయి. అభినందనలు. --V.J.Suseela (చర్చ) 06:03, 3 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

పుట్టినరోజు/లక్ష వ్యాసాల ఉత్సవంలో ఏర్పాట్ల కోసం

పుట్టినరోజు/లక్ష వ్యాసాల ఉత్సవాల కోసం ఒక పేజీని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల ఏర్పాట్లలో చురుగ్గా పాలుపంచుకునేవారిని తమ పేరు చేర్చవలసినదిగా వికీపీడియా:తెవికీ పండగ-25/సన్నాహక సమావేశాలు విభాగంలో అడగ్గా, దానికి స్పందన తక్కువగా ఉంది. ఆ పేజీని అందరూ చూడలేదేమోనని భావిస్తూ, దాని గురించి ఒకసారి జ్ఞాపకం చేద్దామని ఇక్కడ రాస్తున్నాను. ఆ పేజీని చూసి ఏర్పాట్లలో పాలుపంచుకునేవారు అక్కడ సంతకం చేయవలసినదిగా కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 05:03, 6 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Reminder! Vote closing soon to fill vacancies of the first U4C

You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language

Dear all,

The voting period for the Universal Code of Conduct Coordinating Committee (U4C) is closing soon. It is open through 10 August 2024. Read the information on the voting page on Meta-wiki to learn more about voting and voter eligibility. If you are eligible to vote and have not voted in this special election, it is important that you vote now.

Why should you vote? The U4C is a global group dedicated to providing an equitable and consistent implementation of the UCoC. Community input into the committee membership is critical to the success of the UCoC.

Please share this message with members of your community so they can participate as well.

In cooperation with the U4C,

-- Keegan (WMF) (talk) 15:31, 6 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

10 వేల వ్యాసాలు - నాలుగే అనాథలు

@బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారు ఇప్పటి దాకా 10,500 పైచిలుకు వ్యాసాలు సృష్టించారు. ఈ విషయంలో తెవికీ #1 ఆయనే. వాటిలో అనాథ వ్యాసాలు మాత్రం కేవలం 4. అంటే 0.04% కంటే తక్కువ. నాణ్యత విషయంలో ఇదొక బెంచిమార్కుగా భావించి సముదాయం దృష్టికి తెస్తున్నాను.

అనాథ వ్యాసాల జాబితాలు ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి. __ చదువరి (చర్చరచనలు) 04:56, 8 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు @బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారు. ఈ విషయాన్ని సముదాయం దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:09, 8 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 గారు ధన్యవాదాలు ! Batthini Vinay Kumar Goud (చర్చ) 07:21, 8 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
__చదువరి గారు అనాథ వ్యాసాల జాబితాను పూర్తి చేశాను. ధన్యవాదాలు Batthini Vinay Kumar Goud (చర్చ) 07:20, 8 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
చప్పట్లు__ చదువరి (చర్చరచనలు) 03:02, 9 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@అభినందనలు..! బత్తిని వినయ్ కుమార్ గౌడ్ గారు..!Muralikrishna m (చర్చ) 05:18, 8 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Muralikrishna m గారు ధన్యవాదాలు! Batthini Vinay Kumar Goud (చర్చ) 07:21, 8 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి, నేను కనీసం నా వ్యాసాలు చేస్తాను. ధన్యవాదాలు. --V.J.Suseela (చర్చ) 06:48, 11 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
నా వ్యాసాలు 20 ఉన్నట్లు తెలుస్తుంది.వాటిని పరిశీలించి సవరిస్తాను@Chaduvari గారు వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు . యర్రా రామారావు (చర్చ) 06:59, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

కాలదోషం పట్టినా వాక్యదోషం ఏర్పడకుండా రాయడం

తెలుగు వికీపీడియాలో సమాచార తాజాకరణ అనేది పెద్ద సవాలు. వ్యాసం లోని సమాచారానికి కాలదోషం పట్టినప్పటికీ, వాక్యంలో దోషం ఏర్పడకుండా ఉండేలా ఎలా రాయాలో వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో కాలదోషం పట్టినా వాక్యదోషం ఏర్పడకుండా రాయడం అనే విభాగంలో చూడవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 01:21, 11 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:40, 11 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ నాణ్యతకు సమాచార తాజాకరణ చాలా ముఖ్యం. ఇలాంటివి వ్యాసాలలో గమనించినప్పుడు చూసినవారు అప్పుడే వాటిని సవరిస్తే బాగుంటుంది.ఒకవేళ ఇతర కారణాలవలన అప్పుడు అవకాశ లేకపోతే, అక్కడ అవసరాన్నిబట్టి UPDATE, UPDATE After, UPDATE Section, ఈ మూసలలో దానికి తగిన మూస అయినా పెట్టాలి. యర్రా రామారావు (చర్చ) 06:57, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

పద్మశ్రీ పురస్కార గ్రహీతల వ్యాసాల్లో అనాథలు

వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు వర్గంలో 570 దాకా వ్యాసాలున్నై. వీటిలో దాదాపు 377 వ్యాసాలకు పద్మశ్రీ పురస్కార గ్రహీతల జాబితా పేజీల (పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2016, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1954-1959), పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1960-1969), పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1970-1979), పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1980-1989), పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1990-1999), పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (2000-2009), పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (2010-2019), పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (2020-2029), పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు - వగైరా పేజీలు) నుండి లింకులు లేవు. ఈ 377 వ్యాసాల్లో సింహభాగం అనాథలై ఉండే అవకాశం ఉంది. ఈ 377 వ్యాసాలకు ఆయా జాబితా పేజీల నుండి లింకులిస్తే అనాథ వ్యాసాలు వందకు పైనే తగ్గే అవకాశాలున్నై. పరిశీలించండి.

ఒక్కో వ్యాసాన్ని తెరిస్తే అందులో ఏ సంవత్సరంలో పద్మశ్రీ వచ్చిందో తెలుస్తుంది. సంబంధిత జాబితా పేజీకి వెళ్ళి అక్కడ లింకు కలపవచ్చు. పేరు తప్పుగా రాసి ఉండవచ్చు, ఇంగ్లీషులో ఉండవచ్చు.. పరిశీలించి లింకు ఇవ్వాలి. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 05:49, 11 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:46, 11 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అవకాశం చూసుకుని పరిశీలించి లింకులుకలపటానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.వాటిని గుర్తించినందుకు @Chaduvari గార్కి ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 06:49, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
377 వ్యాసాల సంఖ్యను 29కి తగ్గించగలిగాను--స్వరలాసిక (చర్చ) 15:53, 15 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మాడ్యూల్లో లోపం

ఈ రోజు నేను ఈ మార్పు చేసాను. అందులో చేసిన అనువాదం వల సమస్యేమీ లేదు. కానీ ఈ మార్పు వలన అనేక పేజీల్లో దోషం కనబడింది. అపుడు ఆ మార్పును వెనక్కి తిప్పాను, అయినా ఆ లోపం అలాగే ఉండిపోయింది. అనేక ప్రయత్నాలు చేసిన తరువాత, వేరే మోడ్యూల్లో ఈ మార్పుల రివర్టు చేసాను. అప్పుడు సమస్య తీరిపోయింది. రివర్టు చేసిన మార్పుల వలన కూడా ఇబ్బందులేమీ లేనప్పటికీ సమస్య మాత్రం తీరిపోయింది. అసలు సమస్య ఏమిటో ఎందుకు ఏర్పడిందో ఎవరైనా చూడగలరు. __ చదువరి (చర్చరచనలు) 12:30, 11 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

బాట్ అభ్యర్థన చూడండి

మనకు వర్గం:CS1 errors: archive-url అనే వర్గం ఉంది. మూలాల్లో, archive-url లోని టైమ్‌స్టాంపుకూ, archive-date లో ఇచ్చిన తేదీకీ మధ్య తేడా ఉన్నపుడు, సాఫ్టువేరు లోపాన్ని పట్టుకుని ఆ పేజీని ఈ వర్గంలో వేస్తుంది. (archive-url లో ఇతర లోపాలున్న పేజీలు కూడా ఈ వర్గంలో చేరతాయి). ప్రస్తుతం ఈ వర్గంలో 10,400 పేజీలుండగా వాటిలో దాదాపు 9 వేల దాకా ఈ తేదీ తేడా ఉన్నవే.

ఇలాంటి మూలాల లోపాల వర్గాలు దాదాపు 50 దాకా ఉన్నాయి. ఇవన్నీ వర్గం:CS1 errors అనే మాతృవర్గంలో ఉంటాయి. ఈ మాతృవర్గంలో ఇప్పుడు 14 వేల పైచిలుకు పేజీలున్నాయి. ఈ లోపాలను సవరించే బాట్‌లు ఉన్నాయా అని చూస్తే, వర్గం:CS1 errors: archive-url వర్గానికి సంబంధించిన లోపాలను సవరించే బాటొకటి ఎన్వికీలో కనిపించింది. ఆ బాటును ఇక్కడ కూడా నడపమని ఆ వాడుకరిని అభ్యర్థించగా, వారు సరేనని బాట్ అనుమతి కోసం తెవికీలో అభ్యర్థన పెట్టారు. దానికి మీ సమ్మతి తెలియజేయవలసినదిగా అందరికీ నా అభ్యర్థన. __ చదువరి (చర్చరచనలు) 03:06, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

బాట్ అభ్యర్థన పేజీలో స్పందించాను యర్రా రామారావు (చర్చ) 03:48, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మూలంలో ఈ సమస్య వల్ల పేజీలోని మూలాల విభాగంలో లోపాలు చూపిస్తున్నాయి. అలాంటి వాటిని చూసినపుడు నేను మానవికంగా సరిచేస్తూ వస్తున్నాను. దీన్ని సరిచేయడానికి ఒక బాటు ఉంటే బాగుండేది అనిపించింది. ఎన్వికీలో బాటును చూసి తెవికీలో నడపాలని అభ్యర్థించినందుకు ధన్యవాదాలుచదువరి గారు. బాట్ అభ్యర్థన పేజీలో నా స్పందన తెలియజేశాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:50, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Batthini Vinay Kumar Goud, @రవిచంద్ర, @Vjsuseela, @Kasyap, @Prasharma681,@RATHOD SRAVAN, @Muralikrishna m గార్లకు.. ఈ సందేశం చూసి, బాటు అభ్యర్థన వద్ద మీ అభిప్రాయం రాయవలసినది. __ చదువరి (చర్చరచనలు) 10:27, 14 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మన అభ్యర్థన మేరకు GreenC, బాటును నడిపి, వర్గం:CS1 errors: archive-url వర్గం లోని వ్యాసాల్లో దోషాలను సవరించగా, ఆ వర్గం లోని వ్యాసాల సంఖ్య 10456 నుండి 596 కు తగ్గిపోయాయి. సముదాయం తరఫున వారికి మన ధన్యవాదాలు.__ చదువరి (చర్చరచనలు) 05:10, 2 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
బాటు నిర్వాహకునికి ధన్యవాదాలు. ఆ 596 ఎందుకు తగ్గిపోలేదో ఏమైనా సమాచారం ఉంటే వివరించగలరు. యర్రా రామారావు (చర్చ) 05:31, 2 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ బాటు సరిచెయ్యలేని దోషాలు ఆ పేజీల్లో ఉండి ఉంటాయి సార్. వాటిని మానవికంగా సరిచేసుకోవాలి __ చదువరి (చర్చరచనలు) 06:19, 2 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

archive-url, archive-date ల సారూప్యత

archive-url లోని టైమ్‌స్టాంపు, archive-date ల మధ్య తేడా ఉంటే ఏం జరుగుతుంది. archive-date ఎక్కడ ఉంటుంది అనే సంగతులను వాడుకరులకు సూచనలు పేజీలో రాసాను. పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 04:03, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:38, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరులకు ఇది మంచి సమాచారం. యర్రా రామారావు (చర్చ) 06:47, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

శాసనసభ నియోజకవర్గాల పేజీల్లో కొన్ని అంశాలు

శాసనసభ నియోజకవర్గాల పేజీల్లో కింది అంశాలను గమనించాను. వాటిలో ముఖ్యమైనవి ఇక్కడ:

  • చాలా పేజీల్లో సమాచార పెట్టె Infox settlement ఉంది. ఈ పేజీల్లో Infobox Indian constituency వాడాలి. లోక్‌సభ నియోజకవర్గాల్లో కూడా ఇదే వాడాలి
  • కొన్ని పేజీల్లో - ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నివర్గాల్లో databox వాడారు (ఉదా:అద్దంకి శాసనసభ నియోజకవర్గం). దానిలో సరైన డేటాలేదు. దాని స్థానంలో Infobox Indian constituency వాడితేనే బాగుంటుంది
  • కొన్ని పేజీల్లో Openstreetmap మ్యాపు వాడారు. అందులో నియోజకవర్గాన్ని ఒక బిందువుగా చూపించి ఉంది. దాన్ని ఏరియా గా చూపించాలి.
  • "రాష్ట్రం లోని నియోజకవర్గాలు" అనే నేవిగేషను మూసలో ప్రస్తుత, మాజీ నివర్గాలు రెంటినీ చేర్చారు. మూసలో ఒక వర్గం కూడా ఉంది. దాంతో మాజీ, ప్రస్తుత నివర్గాలన్నీ ఒకే వర్గం లోకి చేరుతున్నై. దాన్ని నివారించాలి. అంచేత మూసలో వర్గాన్ని తీసేసి, పేజీల్లో నేరుగా వర్గాన్ని చేర్చాలి (నేను రెండు మూసల్లో తీసివేసాను) లేదా మాజీ నివర్గాలను వేరే మూసలో వెయ్యాలి (అలా కొన్నింటిలో ఉంది)
  • తాజా ఎన్నికల ఫలితాలు ఇంకా చేర్చలేదు, అవి చేర్చాలి. సమాచారపెట్టెలో కూడా ప్రస్తుత ఎమ్మెల్యే పేరు చేర్చాలి. సపెలో ఎమ్మెల్యే పేరు చేర్చితేనే ఆ నియోజకవర్గం ఫలానా రాష్ట్రం లోని నియోజకవర్గం అని చూపిస్తోంది (దాన్ని సరిచెయ్యాలి)

పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 12:32, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నియోజకవర్గాల పేజీల్లో కింది నాలుగు రకాల మూసలు వాడారు:
వీటన్నిటినీ ప్రామాణికరించి ఒకే సమాచారపెట్టెను పెట్టాలని, Infobox Indian constituency ను వాడాలనీ నా అభిప్రాయం. అయితే databox లో డేటా అంతా చూపించే విధంగా వికీడేటాలో డేటాను చేరిస్తే దాన్నైనా వాడవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 13:04, 13 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

లక్ష వ్యాసాలు, పుట్టినరోజు పండగలపై జరిగిన రెండవ సమావేశ నివేదిక

లక్ష వ్యాసాల ఉత్సవం, తెవికీ పుట్టినరోజు పండగ నిర్వాహణ, కమిటీల ఏర్పాటు - విషయమై ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకు రెండవ సమావేశం జరిగింది. నివేదికను తెవికీ పండగ-25/సన్నాహక సమావేశాలు పేజీలోని రెండవ సమావేశం విభాగంలో చూడవచ్చు. సముదాయ సభ్యులు పరిశీలించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:53, 15 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పండగ-2025 నిర్వహణ కమిటీల్లో భాగస్వామ్యులు కావాలనుకున్నవారు, ఏ కమిటీలో ఉండాలనుకుంటున్నారో తెవికీ పండగ-2025/కమిటీలు చర్చాపేజీలో మీ ఆసక్తిని తెలియజేయగలరు. ఆయా కమిటీల సభ్యులు మిమ్మల్ని సంప్రదిస్తారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:47, 18 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Coming soon: A new sub-referencing feature – try it!

Hello. For many years, community members have requested an easy way to re-use references with different details. Now, a MediaWiki solution is coming: The new sub-referencing feature will work for wikitext and Visual Editor and will enhance the existing reference system. You can continue to use different ways of referencing, but you will probably encounter sub-references in articles written by other users. More information on the project page.

We want your feedback to make sure this feature works well for you:

Wikimedia Deutschland’s Technical Wishes team is planning to bring this feature to Wikimedia wikis later this year. We will reach out to creators/maintainers of tools and templates related to references beforehand.

Please help us spread the message. --Johannes Richter (WMDE) (talk) 10:36, 19 August 2024 (UTC)

Reminder: Apply for TTT 2024 Scholarships by August 22

Dear Wikimedians,

Important Reminder: The scholarship application deadline has been extended till Thursday, August 22, 2024. We encourage active Wikimedians to submit their applications before the deadline.

Please ensure you review the essential details on Meta page regarding this event.

Scholarship Application form

For any questions, please reach out on the Event talk page or via email at nitesh@cis-india.org or Chinmayee at chinumishra70@gmail.com.

Regards,

TTT 2024 Organising team

MediaWiki message delivery (చర్చ) 20:15, 20 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Sign up for the language community meeting on August 30th, 15:00 UTC

Hi all,

The next language community meeting is scheduled in a few weeks—on August 30th at 15:00 UTC. If you're interested in joining, you can sign up on this wiki page.

This participant-driven meeting will focus on sharing language-specific updates related to various projects, discussing technical issues related to language wikis, and working together to find possible solutions. For example, in the last meeting, topics included the Language Converter, the state of language research, updates on the Incubator conversations, and technical challenges around external links not working with special characters on Bengali sites.

Do you have any ideas for topics to share technical updates or discuss challenges? Please add agenda items to the document here and reach out to ssethi(__AT__)wikimedia.org. We look forward to your participation!

MediaWiki message delivery (చర్చ) 23:19, 22 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

"మరియు" వాడుకపై చర్చ

తెలుగులో "మరియు" వాడకూడదనేది తెలిసినదే. దానికి అనుగుణంగా తెవికీలోనూ ఆ భాషా నియమాన్నే పాటిస్తున్నాం. అయితే ఈ విషయాన్ని సమీక్షించేందుకు ఈమధ్య ఒక ప్రతిపాదన రాగా దానిపై చర్చ జరిగింది. ఆ చర్చలో చివరి అభిప్రాయం వచ్చి 20 రోజులౌతోంది. ఇక దీనిపై ఒక నిర్ణయాన్ని ప్రకటించి, ఒక అర్థవంతమైన ముగింపు నిస్తే బాగుంటుంది. ఆ చర్చలో పాల్గొనని అనుభవజ్ఞులు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 12:05, 25 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

జంతుబలి నిషేధం

చట్టవిరుద్ధమైన, అనైతిక ఆచారాలు జరగకుండా కఠిన చట్టాలు అమలు అవుతున్న సమయంలో, జంతుబలి ప్రస్తుతం జరుగుతున్నట్టు ఆధారాలు లేకుండా వ్యాసాలు ఉండకూడదని నా అభిప్రాయం. ఉదా. 1: పొలాల (అమావాస్య) పండుగ, ఉదా. 2: బలి వ్యాసంలో చిత్రం ఇబ్బందిగా తోస్తోంది. అయినప్పటికి, అది కచ్చితంగా ఎక్కడ, ఎప్పుడు జరిగిందో వివరాలు లేవు. ఈ వ్యాసం చర్చ పేజీలో చర్చ ముగిసిన కారణంగా రచ్చబండలో ప్రస్తావిస్తున్నాను. - Muralikrishna m (చర్చ) 12:33, 25 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మురళీకృష్ణ గారూ, ఆధారాలు అవసరమైన చోట, అవి లేకపోతే వెంటనే చర్య తీసుకోవచ్చు.
1. ఏ వాక్యం దగ్గర ఆధారం అవసరమో అక్కడే, ఆ వాక్యం పక్కనే {{మూలాలు అవసరం}} అనే మూస పెట్టవచ్చు. చాలాచోట్ల మూలాలు అవసరమైతే అన్ని చోట్లా ఈ మూసను పెట్టవచ్చు. పేజీలో పైన కూడా {{మూలములు కావలెను}} ను గానీ, {{మౌలిక పరిశోధన}} ను గానీ పెట్టవచ్చు. కొంత కాలం చూసాక, మూలాలు అప్పటికీ చేర్చకపోతే సంబంధిత పాఠ్యాన్ని తీసెయ్యవచ్చు.
2. విషయం తీవ్రమైనదై, మూలం లేనంతవరకూ ఆ సమాచారం ఉండరానిదైతే, ఆ సమాచారాన్ని ఏ మూసా, ఏ చర్చా లేకుండా తక్షణమే తీసెయ్యవచ్చు. కారణాన్ని దిద్దుబాటు సారాంశంలో క్లుప్తంగా, చర్చ పేజీలో వివరంగా రాయవచ్చు. __చదువరి (చర్చరచనలు) 02:56, 26 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 06:26, 26 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పండగ 2025 - సర్వే

నమస్కారం!

తెవికీ 21వ పుట్టిన రోజు, లక్ష వ్యాసాల మైలురాయిని చేరుకోబోతున్న సందర్భంగా, తెవికీ పండగ 2025 జరుపుకోవాలని తెలుగు వికీపీడియా సముదాయం యోచిస్తోంది. దీనిని ఎలా జరపాలి, ఎలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, వంటి ప్రశ్నలకు మీ అందరి అభిప్రాయాలు, సూచనలు ఎంతో ముఖ్యం. మీ అభిప్రాయలు, ఆలోచనలను ఈ ఫారంను నింపి తెలియజేయాసి, నిర్వాహకులకు సహాయపడతారు అని అభ్యర్థిస్తున్నాము.

ధన్యవాదాలు 🙏 Saiphani02 (చర్చ) 18:57, 25 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Saiphani02 గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:27, 26 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
సర్వే ఫామ్ పూర్తిచేసాను. ధన్యవాదాలు -Muralikrishna m (చర్చ) 08:50, 26 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

లక్ష కోసం ఇక రాయాల్సింది వెయ్యే!

దాదాపు 99 వేల వ్యాసాలయ్యాయి (నిజానికి దాటేసాం. కానీ 13 వ్యాసాల దాకా అగాథ వ్యాసాలున్నందున సంఖ్య ఆ మేరకు తక్కువ చూపిస్తోంది) లక్ష కోసం ఇక రాయాల్సింది వెయ్యే! దీనిలో అందరూ పాలు పంచుకుంటే బాగుంటుంది. అందరూ తలా ఒకటో రెండో పదో పద్నాలుగో వ్యాసాలు రాద్దాం. 99999 వ వ్యాసం నాది, లక్షవది నాది, 99000 వది నాది, 99099 వది నాది,.. ఇలా చెప్పుకుందాం. మన పాత తెవికీయులందరినీ పిలుచుకుందాం. లక్ష దగ్గర పడింది. ఇక నెల రోజులే! వెయ్యి వ్యాసాలే మిగిలున్నై!! రండి!!! అని పిలుద్దాం. మనమూ రాద్దాం __ చదువరి (చర్చరచనలు) 02:43, 26 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @Chaduvari గారు. లక్ష వ్యాసాల ఉద్యమంలో మనందరం పాల్గొందామని సముదాయ సభ్యులను కోరుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:03, 26 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

A2K Monthly Report for July 2024

Dear Wikimedians,

We are excited to share our July newsletter, highlighting the impactful initiatives undertaken by CIS-A2K over the past month. This edition provides a detailed overview of our events and activities, offering insights into our collaborative efforts and community engagements and a brief regarding upcoming initiatives for next month.

In the Limelight- NEP Study Report
Monthly Recap
Coming Soon - Upcoming Activities

You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.

Regards MediaWiki message delivery (చర్చ) 09:05, 28 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

లక్షను పట్టుకు కిందకు లాగేవి

లక్ష వ్యాసాలను చేరుకునే క్రమంలో మనం, వ్యాసాల సంఖ్యను తగ్గించే అవకాశమున్న అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కింది వర్గాల్లో ఉన్న వ్యాసాలపై తగు చర్యలు తీసుకుంటే వ్యాసాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

ఇలాంటి వర్గాలు ఇంకా ఉన్నాయేంఓ గమనించాలి. లక్ష చేరేలోపు ఈ వర్గాల్లోని వ్యాసాలపై తగు చర్యలు తీసుకుందాం. తద్వారా మన లక్షకు మరింత స్థిరత్వం ఉంటుంది. __ చదువరి (చర్చరచనలు) 00:11, 31 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:09, 31 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Announcing the Universal Code of Conduct Coordinating Committee

Original message at wikimedia-l. You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language

Hello all,

The scrutineers have finished reviewing the vote and the Elections Committee have certified the results for the Universal Code of Conduct Coordinating Committee (U4C) special election.

I am pleased to announce the following individual as regional members of the U4C, who will fulfill a term until 15 June 2026:

  • North America (USA and Canada)
    • Ajraddatz

The following seats were not filled during this special election:

  • Latin America and Caribbean
  • Central and East Europe (CEE)
  • Sub-Saharan Africa
  • South Asia
  • The four remaining Community-At-Large seats

Thank you again to everyone who participated in this process and much appreciation to the candidates for your leadership and dedication to the Wikimedia movement and community.

Over the next few weeks, the U4C will begin meeting and planning the 2024-25 year in supporting the implementation and review of the UCoC and Enforcement Guidelines. You can follow their work on Meta-Wiki.

On behalf of the U4C and the Elections Committee,

RamzyM (WMF) 14:06, 2 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Have your say: Vote for the 2024 Board of Trustees!

Hello all,

The voting period for the 2024 Board of Trustees election is now open. There are twelve (12) candidates running for four (4) seats on the Board.

Learn more about the candidates by reading their statements and their answers to community questions.

When you are ready, go to the SecurePoll voting page to vote. The vote is open from September 3rd at 00:00 UTC to September 17th at 23:59 UTC.

To check your voter eligibility, please visit the voter eligibility page.

Best regards,

The Elections Committee and Board Selection Working Group

MediaWiki message delivery (చర్చ) 12:14, 3 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదాల్లో అగ్రగామి

వాడుకరి:Pranayraj1985 గారు అనువాద పరికరం వాడి, ఇప్పటి దాకా 5077 అనువాదాలు చేసారు. తెవికీ లోనే అత్యధికం అది. మొత్తం అనువాదాల్లో దాదాపు 40%. గత 20 నెలల్లోనే దాదాపు 3500 అనువాదాలు చేసారాయన. భారతీయ భాషా వికీల్లో 5 వేలకు పైగా అనువాదాలు చేసిన ఐదుగురిలో ప్రణయ్ గారొకరు. తెవికీలో అయన సృష్టించిన బెంచిమార్కుల్లో ఇదొకటి. మనందరి అభినందనలకు అర్హుడాయన. __ చదువరి (చర్చరచనలు) 02:00, 4 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్ రాజ్ గార్కి ఈ సందర్బంగా శుభాకాంక్షలు. ఇంకోరకంగా చెప్పాలంటే తెలుగు వికీపీడియాకు లబించిన ఒక గిప్ట్ అని చెప్పవచ్చు. యర్రా రామారావు (చర్చ) 03:17, 4 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్ గారి నిరంతర కృషికి నా అభినందనలు 🙏 Saiphani02 (చర్చ) 17:17, 5 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి, యర్రా రామారావు, Saiphani02 గార్లకు ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:23, 11 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 గారూ, మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పవన్ సంతోష్ (చర్చ) 04:46, 23 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Pranayraj1985 గారు - మీ ఈ విశేష గణనీయమైన కృషికి నా జోహార్లు 🙏 --వైజాసత్య (చర్చ) 13:32, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయి.

ధన్యవాదాలు! KCVelaga (talk) 06:58, 9 సెప్టెంబరు 2024 (UTC) ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]

అభిజ్ఞ వర్గాల భోగట్టా!

కొందరు వాడుకరులు వ్యాసాలను సిద్ధం చేసుకుని ప్రచురించకుండా దాచిపెడుతున్నారని "లక్షాదేవి" గుసగుసగా అరిచినట్టు తెలుస్తోంది. వ్యాసాల సంఖ్య 99900 దాటాక, ఏ క్షణాన్నైనా, ఒక్కుమ్మడిగా, 50 నుండి వంద దాకా వ్యాసాల వరద పారించేసి, ప్రచురించేసి, లక్షవ వ్యాసం, లక్షన్నొకటవ వ్యాసం, లక్షా తొంభయ్యో వ్యాసం, ఒకటి తక్కువ లక్షవ వ్యాసం, పది తక్కువ లక్షవ వ్యాసం.. ఇలా అన్నిటినీ తమ ఖాతాలో వేసుకోవాలని పెద్దయెత్తున వ్యూహరచన జరుగుతోందం'ట'. కొన్ని అగాధ వ్యాసాలు వ్యాస జీవన స్రవంతిలో కలిసి మొత్తం వ్యాసాల సంఖ్య పెరిగినా, వేరే కొన్ని వ్యాసాలు తొలగింపుకు గురై మొత్తం వ్యాసాల సంఖ్య తగ్గినా.. లక్షవ వ్యాసం మాత్రం తమ పేరిటే ఉండాలనేది దీని వెనకున్న అసలు కారణంగా తెలుస్తోంది. వాడుకరులందరూ ఈ విషయమై జాగరూకతతో ఉండాలనీ, అందరూ అలాగే వ్యాసాలను సిద్ధం చేసుకుని దాచిపెట్టుకోవాలనీ సెప్టెంబరు 25 నుండీ అప్రమత్తంగా ఉంటూ లక్షవ వ్యాసాన్ని ఎగరేసుకు పోయేందుకు సిద్ధమవ్వాలనీ లక్షాదేవి చెబుతోంది. అంతేకాదు, "రోజూ పది రాసేవాళ్ళు 15 రాసి 5 దాచిపెట్టుకోండి, 5 రాసేవాళ్ళు పది రాసి ఐదింటిని దాచిపెట్టుకోండి. 1 రాసేవాళ్ళు 6 రాసి ఐదు దాచండి. ఇంకా తక్కువ రాసేవాళ్ళు కూడా కాసిని వ్యాసాలను వెనకేసుకోండి. సెప్టెంబరు చివరి నాటికి చేతిలో కనీసం వందైనా వ్యాసాలు లేకపోతే నెగ్గడం కష్టమ"ని కూడా లక్షాదేవి చెప్పిందంట. ముఖ్యంగా ఈ నెలాఖరులో, రాత్రిపూట, సాధారణంగా ఎవరూ పెద్దగా రాయని ఘడియల్లో లక్షకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందనీ, ఆ రోజుల్లో రాత్రిళ్ళు మేలుకుని, వ్యాసాలను ప్రచురించేందుకు కాసుకుని ఉండాలనీ కూడా లక్షార్హులనూ, లక్షార్తులనూ దేవి హెచ్చరిస్తోంది.

ఇతి వార్తాహ! ఇక మీ ఇష్టహ! __ చదువరి (చర్చరచనలు) 09:52, 11 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari గారూ, ఆ ఆలోచన లేని వార్కి ఒక మంచి ఐడియా ఇచ్చ్చారు. ఇక ఏవరెవరి అదృష్టం, సత్తా చూపించుకోవచ్చు.భలే మంచి చౌకబేరం. యర్రా రామారావు (చర్చ) 11:31, 11 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
రామారావు గారు చెప్పినట్టు మంచి ఐడియానే ఇచ్చారు 😂 Saiphani02 (చర్చ) 16:48, 11 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
😂😂 --వైజాసత్య (చర్చ) 04:25, 12 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
బెస్ట్ ఆఫ్ లక్..! Muralikrishna m (చర్చ) 04:33, 12 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రస్తుతానికి నేను అదే పనిగా సంఖ్య గమనించడం లేదు కానీ, సంఖ్య చివరికి దగ్గరయ్యే కొద్దీ, నేను ఓ కర్చీఫ్ వేయడానికి మాత్రం ప్రయత్నిస్తాను. 😂 రవిచంద్ర (చర్చ) 13:43, 23 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@సార్, కర్చీఫ్ వేసుకునే టైమొచ్చేసింది.😂__ చదువరి (చర్చరచనలు) 09:26, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అనుకున్నట్టే ఓ చెయ్యేశాను. చూడాలి అందరితో పోటీ పడ్డానో లేదో మరి. రిజల్ట్ కోసం వెయిటింగ్... రవిచంద్ర (చర్చ) 14:51, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారూ... మీరు రాసిన అంతర్యుద్ధం వ్యాసం లక్షవ వ్యాసం అయుంటుంది అనుకుంటున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:58, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు రాసిన ఫ్రాన్సిస్ టూమీ లక్షవ వ్యాసం అనుకుంటాను, చూడండి.__ చదువరి (చర్చరచనలు) 15:17, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
రెండూ కాదు, రతీంద్రనాథ్ ఠాగూర్ __ చదువరి (చర్చరచనలు) 15:25, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
శుభాకాంక్షలు @రవిచంద్ర గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:34, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారూ శుభాకాంక్షలు యర్రా రామారావు (చర్చ) 16:48, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ లక్ష-ఎడిటథాన్

సభ్యులకు నమస్కారం, మరికొద్ది రోజులలో తెవికీ లక్ష వ్యాసాల మైలురాయిని దాటబోతోంది. ఈ లక్ష వ్యాసాల సంరంభంలో సముదాయంలో అందరం పాలుపంచుకొని, లక్షలో అందరం ఒక చెయ్యేసేందుకు రెండురోజుల ఎడిటథాన్ నిర్వహించుకొని 'తెవికీ లక్ష'ను పూర్తిచేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ విషయంపై సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:55, 21 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ నెల 30 నాటికి లక్షారోహణ జరగాలనేది మన తొలి సంకల్పం. ఇప్పటి ట్రెండు అందు కనుగుణంగానే ఉంది. అయితే ఒకట్రెండు, మూణ్ణాలుగు రోజులు ముందే ఈ లక్ష్యాన్ని చేరుకునేలా ఉంది ప్రణయ్ గారి ప్లాను. ఈ ఎడిటథాన్లోనే లక్ష ఉట్టి కొట్టెయ్యాలనే సబ్‌ప్లాను కూడా ఆయన ప్లానులో భాగం లాగా ఉంది. చూద్దాం..
అలాగే చేద్దాం. 24 మంగళవారం, 25 బుధవారం - ఈ రెండు రోజులూ ఎడిటథాన్ పెట్టుకుందాం. ఇప్పటి దాకా మిస్సయ్యామే అని అనుకునేవాళ్లకి లక్ష పరుగులో పాల్గొనే సదవకాశం, 'తుద'వకాశం ఇది. రండి.__ చదువరి (చర్చరచనలు) 01:10, 22 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన నేను కూడా ఈమధ్య తరచుగా రాయలేకపోతున్నాను ఎడిట్ ధాన్ లో పాల్గొంటాను. అయితే సెప్టెంబర్ 25 బుధవారం 15:00 UTC కి సర్వర్ మార్పు వలన (https://meta.wikimedia.org/wiki/Tech/Server_switch) అన్ని వికీలు కొన్ని నిమిషాల పాటు చదవడానికి మాత్రమే ఉంటాయి . వికీలను చదవడం అంతరాయం కలిగించదు, కానీ ఎడిటింగ్ పాజ్ చేయబడుతుంది అన్న విషయం పరిగణించగలరు. Kasyap (చర్చ) 08:52, 22 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

"మరియు" గురించిన చర్చ నిర్ణయం కోసం వేచిచూస్తోంది

గత నెలలో @Kasyap గారు వికీపీడియాలో "మరియు" వాడుక గురించిన లేవనెత్తారు. ఆయన ప్రారంభించిన చర్చలో @Chaduvari గారు, నేనూ చురుకుగా పాల్గొనగా, @Prabhakar Goud Nomula గారు, @యర్రా రామారావు గారు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చపై ఇంకా ఎవ్వరూ నిర్ణయం ప్రకటించలేదు. చర్చను పూర్తిగా పరిశీలించి చర్చ ఫలితాన్ని ప్రకటించవలసిందిగా అనుభవజ్ఞులైన వాడుకరులను కోరుతున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 04:44, 23 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నేను నిర్ణయ ప్రక్రియ ప్రారంభిస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 13:34, 23 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారూ, ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 08:39, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

లక్షారోహణం సంపూర్ణం

లక్ష వ్యాసాల మైలురాయిని చేరుకున్నాం. చప్పట్లు. అందరికీ - నాతో సహా - అభినందనలు!__ చదువరి (చర్చరచనలు) 15:02, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

లక్ష వ్యాసాల మైలురాయిని చేరుకున్నాం. 👏👏👏👏 చప్పట్లు ఈ రోజు తెవికీలో గుర్తుంచుకోవాలిసిన రోజు.ఈ సందర్బంగా అందరికీ - అభినందనలు యర్రా రామారావు (చర్చ) 15:19, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
'తెవికీ లక్ష' దాటిన సందర్భంగా తెవికీ సముదాయ సభ్యులందరికి శుభాకాంక్షలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:35, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సందర్భంలో తెవికీ సభ్యులందరికి అభినందనలు.--V.J.Suseela (చర్చ) 15:48, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అందరికీ జే జేలు, ముఖ్యంగా శతక వీరులకు 🎉..Kasyap (చర్చ) 16:15, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

లక్షారోహణంలో పాల్గొని విజయవంతం చేసిన తెవికీ సభ్యులందరికీ లక్ష ధన్యవాదాలు. ముందుండి నడిపించిన @చదువరి గారికి వీరతాళ్ళు 👏👏. లక్షో వ్యాసం రాసిన @రవిచంద్ర గారికి శుభాకాంక్షలు 👏👏 --వైజాసత్య (చర్చ) 08:14, 27 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర గారికి అభినందనలు. @వైజాసత్య గారూ, ధన్యవాదాలు. అంతా వాడుకరుల చలవ.__ చదువరి (చర్చరచనలు) 14:23, 27 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అందరికీ శుభాకాంక్షలు. మొత్తానికి లక్ష కొట్టేశాం. అభినందనలు. పవన్ సంతోష్ (చర్చ) 11:16, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

A2K Monthly Report for August 2024

Dear Wikimedians,

We are excited to present our August newsletter, showcasing the impactful initiatives led by CIS-A2K throughout the month. In this edition, you'll find a comprehensive overview of our events and activities, highlighting our collaborative efforts, community engagements, and a sneak peek into the exciting initiatives planned for the coming month.

In the Limelight- Doing good as a creative person
Monthly Recap
  • Wiki Women Collective - South Asia Call
  • Digitizing the Literary Legacy of Sane Guruji
  • A2K at Wikimania
  • Multilingual Wikisource
Coming Soon - Upcoming Activities
  • Tamil Content Enrichment Meet
  • Santali Wiki Conference
  • TTT 2024

You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.

Regards MediaWiki message delivery (చర్చ) 16:55, 26 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

లక్షారోహణ సందర్భంగా

లక్ష వ్యాసాల సంఖ్యకు చేరుకున్న సందర్భంగా కొన్ని పనులు చేద్దామని నా ప్రతిపాదన -

  • పత్రికలలో వార్త లాగా రావాలి. అందుకోసం ఒక ప్రెస్ నోట్ తయారు చెయ్యాలి
  • వికిమీడియా బ్లాగు "డిఫ్" లో ఒక వ్యాసం రాయాలి.
  • మెటాలో ఒక వ్యాసం రాయాలి
  • ఎన్వికీలో తెలుగు వికీపీడియా వ్యాసంలో ఈ సంగతిని చేర్చాలి. అసలు ఈ వ్యాసం మొత్తాన్నీ సంస్కరించాలి.
  • మన వ్యాసాల్లోని మంచిచెడులను చర్చించుకుంటూ చెయ్యాల్సిన పనుల జాబితాను తయారుచేసుకోవాలి. దీని కోసం ఒక పేజీ పెట్టాలి. ఇలాంటి సూచనలను ఆ పేజీలో చేర్చాలి

పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 02:22, 27 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

పై వాటిలో చివరి పాయింటు "మన వ్యాసాల్లోని మంచిచెడులను చర్చించుకుంటూ చెయ్యాల్సిన పనుల జాబితాను తయారుచేసుకోవాలి. దీని కోసం ఒక పేజీ పెట్టాలి. ఇలాంటి సూచనలను ఆ పేజీలో చేర్చాలి." నా దృష్టిలో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. విషయాల వారిగా ఒక్కోదానికి ఒక్కో పేజీ పెట్టి, దానిలో లోపాలు గుర్తించి, వాటిని ఎలా రెక్టిపై చేయాలి అనే దానిపై చర్యలు చేపట్టాలి. నాదృష్టిలో వికీపీడియాలో ఇది ముఖ్యమైనది, అది ముఖ్యమైనది అనేది ఏమీ లేదు. దేని ముఖ్య దానిదే అని నా అభిప్రాయం.అన్ని ముఖ్యాలు కలిస్తేనే వికీపీడియా నిజంగా అబివృద్ధి పయనంలో పయనిస్తుందని నేను భావిస్తాను. యర్రా రామారావు (చర్చ) 15:10, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, మీరు ప్రతిపాదించిన అంశాలతో నేను ఏకీభవిస్తున్నాను. ఒక్కో అంశానికి తుది గడువు పెట్టుకొని చేద్దామని నా అలోచన.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:38, 27 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రెస్ నోట్ ఇందులో రాద్దాము. అందరికీ అందుబాటులో ఉంటుంది.
డిఫ్ వ్యాసం మెటాలో పెడితే? రెండూ వేరేగా ఉండాలా? డిఫ్ వ్యాసం పూర్తయ్యాక ప్రెస్ నోట్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.
ఎన్వికీలో చేర్చాను. సంస్కరించాల్సి ఉంది.
తదుపరి పనులకు పేజీ లేక ప్రాజెక్టు మొదలుపెట్టండి! Saiphani02 (చర్చ) 14:26, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
గతంలో ప్రెస్‌నోట్లు వికీపీడియా:రచ్చబండ (పత్రికా సంబంధాలు) పేజీలో రాసేవాళ్ళం. __ చదువరి (చర్చరచనలు) 14:10, 29 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాస మహర్షుల కోసం

రోజుకో వ్యాసం అనేది తెవికీయులకు రోజుకో 5 వ్యాసాలు, రోజుకో పది వ్యాసాలుగా మారిపోయింది. ఇప్పుడు దాన్ని రోజుకో వ్యాసం అని కాకుండా, అన్నిటికీ వర్తించేలా రోజుకు కనీసం ఒక వ్యాసం అనాల్సి వస్తోంది. ఇలా వ్యాసతపస్సు చేస్తున్న వ్యాసమహర్షులందరికీ పనికొచ్చేలా ఒక మూస తయారైంది. {{వ్యాసాల మహర్షి}}అనే ఈ మూసలో మనం తపస్సు మొదలుపెట్టిన సంవత్సరం (year=), నెల (month=), రోజు (day=) ఇచ్చి, మన వాడుకరిపేజీలో చేర్చుకుంటే ఇప్పటివరకూ ఎన్నిరోజుల నుండి ఇలా రాస్తున్నామో లెక్కేసి చూపిస్తూంటుంది. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 13:34, 27 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:41, 4 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
Apologies for cross-posting in English. Please consider translating this message.

Hello everyone, a small change will soon be coming to the user-interface of your Wikimedia project. The Wikidata item sitelink currently found under the General section of the Tools sidebar menu will move into the In Other Projects section.

We would like the Wiki communities feedback so please let us know or ask questions on the Discussion page before we enable the change which can take place October 4 2024, circa 15:00 UTC+2. More information can be found on the project page.

We welcome your feedback and questions.
MediaWiki message delivery (చర్చ) 18:58, 27 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

సారాంశం:
వికీ పేజీలలో ప్రస్తుతం "పరికరాల పెట్టె" జాబితాలో ఆ పేజీ వికీడాటా లింకు ఉంటుంది. దానిని "ఇతర ప్రాజెక్టులలో" జాబితాలోకి మారుస్తారు.
అభ్యంతరాలు ఈ చర్చా పేజీలో పెట్టాలి. (ఫోనులో వికీడాటా లింకు ఇకపై కనిపించదు అని కొంత మంది వాడుకరులు ప్రస్తావించారు) Saiphani02 (చర్చ) 14:35, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నెక్స్ట్ ఏంటి?

లక్ష ఉట్టి కొట్టేశాం. మరేంటి తర్వాత? అంకెలా? లోతా? ఇంకేమైనానా? ఏం చేద్దామంటారు? పవన్ సంతోష్ (చర్చ) 11:15, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:రచ్చబండ#లక్షారోహణ సందర్భంగా ఇందులో చివరి పాయింట్ Saiphani02 (చర్చ) 14:27, 28 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
రెండేళ్లలో రెండో లక్ష హహ్హహ్హా --వైజాసత్య (చర్చ) 00:44, 2 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@వైజాసత్య గారూ, హైహై నాయకా! సిద్ధం, సంసిద్ధం! పవన్ సంతోష్ (చర్చ) 04:50, 4 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Saiphani02 గారూ, థాంక్యూ! పవన్ సంతోష్ (చర్చ) 04:51, 4 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
లోతును చూస్తూనే అంకెలను పెంచుకుందాం.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:38, 4 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వెడల్పు. వెడల్పు కావాలని నా అభిప్రాయం. ఒకప్పుడు మన వ్యాసాల్లో సుమారు 40% వరకు ఆంధ్ర తెలంగాణ గ్రామ వ్యాసాలే (వాటిని విస్తరించిన తరువాత సంగతే ఇది) ఉండేవి. ఇప్పుడది సుమారు 27% స్థాయికి తగ్గింది. అంటే తెవికీ విస్తృతి పెరిగిందన్నమాట. ఈ విస్తృతి మరింత పెరిగి వాటి శాతం ఇంకా తగ్గాలి అనేది నా ఉద్దేశం. ఇంతకూ ఏంటయ్యా అంటే..
పైన వైజాసత్య గారు నాలుగు మాటల్లో చెప్పేసిన దాన్నే మళ్ళీ చెప్పటానికి నాకు ఒక పేరా పట్టిందన్నమాట! _ చదువరి (చర్చరచనలు) 10:11, 4 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

లక్షపై సమీక్ష

లక్ష వ్యాసాలను చేరుకున్న సందర్భంగా మన లోటుపాట్లను సమీక్షించుకుని చెయ్యాల్సిన పనుల జాబితాను తయారుచెయ్యాలనే లక్ష్యంతో ఒక పేజీ తయారైంది. పరిశీలించండి.__ చదువరి (చర్చరచనలు) 07:29, 29 సెప్టెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:40, 4 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాల్లోని దోషాలు

మూలాల్లో దొర్లే పలు దోషాలను మీడియావికీ సాఫ్టువేరు పట్టి, సంబంధిత పేజీలను వివిధ వర్గాల్లో చేరుస్తుంది. ఈ వర్గాలన్నీ వర్గం:CS1 errors అనే మాతృవర్గంలో ఉంటాయి. వీటిలో కొన్ని దోషాలను బాట్, AWB వంటి ఆటోమాటిక్, సెమీ ఆటోమాటిక్ పద్ధతుల్లో సరిచెయ్యవచ్చు. మిగతావి మానవికం గానే చెయ్యాలి. వాడుకరులు ఆయా దోషాలను గమనించినపుదు తగు చర్య తీసుకోవలసినదిగా మనవి. __ చదువరి (చర్చరచనలు) 05:29, 2 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

GreenC bot ను ప్రతినెలా 2 వ తేదీన నడుపుతారు. ఇది వర్గం:CS1 errors: archive-url లోని పేజీల్లో ఆర్కైవు తేదీ లోపాలను సరిచేస్తుంది. __ చదువరి (చర్చరచనలు) 06:16, 3 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఆటోవికీబ్రౌజరు ద్వారా వర్గం:CS1 errors: dates లోని పేజీల్లో దోషాలను సవరించాను. వెయ్యికి పైగా పేజీల్లో దోషాలను అది సవరించింది.__ చదువరి (చర్చరచనలు) 06:22, 3 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాల్లో ఏ దోషాలు కనిపించినా, ఇవి వ్యాస పాఠ్యంలో కొట్టొచ్చినట్టు కనిపించకపోయినా మిగతా మార్పులతో పాటు ఇవి కూడా సవరిస్తుంటాను. రవిచంద్ర (చర్చ) 17:32, 3 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:38, 4 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అనాథ వ్యాసాలకు లింకులు కనుగొనడం

మనకు 6 వేలకు పైగా అనాథ వ్యాసాలున్నాయి. వీటికి ఇన్‌కమింగు లింకులు ఎక్కడి నుండి ఇవ్వాలి అనేది మనకొక సవాలు. ఈ అనాథల్లో కొన్ని నిజంగా అనాథ వ్యాసాలు కావడం (అంటే తెవికీలో వీటికి సంబంధించి అసలు వ్యాసాలేమీ లేకపోవడం) ఒక కారణం కాగా, కొన్నిటికి పరిచయస్తులున్నా ఆ వ్యాసాలేవో మనకు తెలియకపోవడం (అజ్ఞాత వ్యాసాలు) వలన అనాథలుగా ఉండడం వంటివి కొన్ని కారణాలు. ఈ అజ్ఞాత వ్యాసాలేవో తెలుసుకోవడం పెద్ద పని. ఇది తెలుసుకునేందుకు ఒక బాటు ఉంటే బాగుంటుంది. దాని గురించి ఇక్కడ రాసాను. కానీ అసలు లింకు ఇవ్వదగ్గ వ్యాసాలే లేకపోతే, అప్పుడేం చెయ్యాలి? లింకు ఇవ్వదగ్గ వ్యాసాన్ని రాయడమే దానికి మార్గం. ఒక్కో వ్యాసానికి ఒక్కో లింకు వ్యాసం రాస్తే చాలా సమయం పడుతుంది. మళ్ళీ ఆ వ్యాసానికి లింకు వెతకాలి. అలా రాసుకుంటూ పోతే మంచిదే.

దాని బదులు, జాబితా వ్యాసాలు రాస్తే ఆ జాబితా నుండి పలు పేజీలకు లింకులు ఇచ్చే వీలుంటుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు అంటూ మనకు అలాంటి జాబితాలు ఉన్నాయి. వాటి నుండి లింకులు ఇవ్వడంతో, అనేక అనాథ వ్యాసాలు ప్రధాన స్రవంతి లోకి వచ్చాయి, వస్తున్నాయి. ప్రస్తుతం స్వరలాసిక గారు ఈ పని చేస్తున్నారు. అలా ఇతర అనాథలకు కూడా జాబితాలు తయారు చెయ్యవచ్చునేమో చూడాలి. ప్రణయ్ రాజ్ గారు గతంలో ఇలాంటి జాబితాలు తయారు చేయడం గమనించాన్నేను. జాబితాలే కాకుండా, నేవిగేషను మూసలను తయారుచేసి కూడా అనాథలను కాపాడవచ్చు. ఫలానా జిల్లా లోని మండలాలు, ఫలానా మండలం లోని గ్రామాలు, మానవ పరిణామం వంటి మూసలు ఈ కోవ లోకి వస్తాయి.

పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 10:00, 4 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, అనాథ వ్యాసాలకు తోడును వెతికే బాటును తయారుచేసే పని నేను చేపడతాను --వైజాసత్య (చర్చ) 11:59, 4 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పనిలో నాకు కూడా ఆసక్తి ఉంది సార్. ఒకప్పుడంటే బాట్లు రాయడం కష్టమయ్యేది కానీ, ప్రస్తుతం జనరేటివ్ ఏఐ పరికరాల సాయంతో వేగంగా బాట్లు సృష్టించవచ్చని అనుకుంటున్నాను. రవిచంద్ర (చర్చ) 12:57, 4 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, బావుంది సార్. ఈ విధంగా బాట్లు రాసుకుంటే పలు పాట్లు తప్పుతాయి మనకు. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 02:41, 5 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, అవును మంచి ఐడియా! నేను కూడా అలా ప్రయత్నిస్తాను --వైజాసత్య (చర్చ) 14:42, 5 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ, సూపర్. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 02:39, 5 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరి, @రవిచంద్ర ఇదిగో తొలిప్రయత్న ఫలితం. కేవలం తెవికీ వ్యాసాలే కాకుండా అంతర్వికీలు పట్టుకొని ఇతర భాషల్లోనూ వెతికేట్లు, అంతేకాకుండా గూగుల్లో కూడా వెతికేట్టు చేయాలి. చివరగా దానంతకదే లింకులిచ్చేట్టు చేయాలి --వైజాసత్య (చర్చ) 15:37, 5 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ, వెనువెంటనే పని మొదలు పెట్టినందుకు ధన్యవాదాలు. కొన్ని లింకులను పరిశీలించానండి. కిందివి నా దృష్టికి వచ్చాయి
పై మూడవ పాయింటు లోని పేజీల ఇంగ్లీషు పేజీల్లో కూడా లింకులు కనిపించలేదు. ఉదాహరణకు, "ఆదిత్య (నటుడు)" కు సంబంధించిన ఇంగ్లీషు పేజీ - "Aditya (actor)" పేజీకి చెందిన ఇక్కడికి లింకున్న పేజీల్లో దానికి ఇచ్చిన బంధుపేజీల పేర్లు లేవు. ఆ పేజీలన్నీ en:Aditya (name) అనే అయోమయ నివృత్తి పేజీలో ఉన్నాయి. అయోమయ నివృత్తి పేజీలోను, ఇతర "ఆదిత్య" పేజీల్లోనూ లింకు ఇవ్వడం అనేది ఒక పద్ధతే. అయితే, మనం నేరుగా వ్యాసాల్లోంచి లింకుల కోసం మాత్రమే వెతుకుదాం అనేది నా అభిప్రాయం. పరిశీలించండి.
మరొక సంగతి ఏంటంటే, కొన్ని పేజీలకు అంతర్వికీ లింకులు లేనప్పటికీ, జాబితాలో చూపించింది. ఉదాహరణకు బానోత్ జాలం సింగ్ (2021 ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ ఎన్నికలు పేజీ కోసం), యష్ టెక్నాలజీస్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టం కోసం) - ఈ రెండు పేజీలకూ అంతర్వికీ లింకులు లేవు. బాటు వీటిని ఎలా పట్టుకుందో అర్థం కాలేదు. పరిశీలించవలసినది.
ఇక్కడి అనాథ పేజీ, దాని ఎన్వికీ పేజీ, దానికి లింకున్న ఎన్వికీ పేజీలు, ఆ పేజీల తెలుగు పేజీలు - వీటన్నిటినీ ఉదహరించడంలో ఇక్కడ నేను వివరంగా అర్థమయ్యేలా రాసి ఉండక పోవచ్చు. మరింత వివరంగా చెప్పాలంటే, ఏం పర్లేద్సార్, మళ్ళీ రాస్తాను.__ చదువరి (చర్చరచనలు) 11:38, 6 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, మీరు చెప్పింది చక్కగా అర్ధమైందండి. ఈ మెదటి వర్షన్లో కేవలం తెవికీలోనే వెతికించాను. అంతర్వికీలో, గూగూల్లో వెతకడం ఇంకా పరిశీలనలో ఉన్నది. దీని పరిమితి తెవికీలోని "వెతుకు" శోధనా సామర్ధ్యంలాంటిదని నా అంచనా. నేరుగా పేజీలుంటే చూపిస్తుంది, ఆ తర్వాత ప్రస్తావనలను చూపిస్తుంది. అవీ దొరక్కపోతే "ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్" లాంటి వాక్యాన్ని విడివిడి పదాలుగా వెతుకుంది. అందువలన చాలా సంబంధంలేని పేజీలు ప్రస్తావనలు ఉన్నట్టుగా చూపిస్తుంది. "అదితి గుప్తా (రచయిత్రి)" విషయంలో అలాగే మూడు పదాలను విడివిడిగా వెతికి తెచ్చినట్టున్నది. అంటే ప్రస్తుతం ఈ స్క్రిప్టు అన్ని అనాథ పేజీల శీర్షికలను వెతికి వాటి ఫలితాలు, ఒకేచోట చేర్చుతుంది. బాటును పైన చెప్పిన విధంగా మరింత మెరుగుపరచవలసి ఉన్నది. అయోమయనివృత్తి పేజీల్లోని లింకులు పరిగణించకుండా వెతకండి అని మీరు చేసిన సూచన బాగుంది. అది అమలుచేస్తాను. అంతర్వికీల్లో వెతికించి తెచ్చిన ఫలితాలను కూడా తెవికీలో చేరుస్తాను పరిశీలించండి --వైజాసత్య (చర్చ) 13:40, 6 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అంతర్వికీల్లో వెతికించి తెచ్చిన ఫలితాలు చూడండి --వైజాసత్య (చర్చ) 15:55, 6 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ, స్థానికంగా వెతికి తెచ్చిన ఫలితాలను, ఎన్వికీ లింకుల ద్వారా తెచ్చిన ఫలితాలనూ విడివిడిగా చూపించే వీలుందేమో పరిశీలించండి. స్థానిక వెతుకులాట ఫలితాల్లో "సుమారు" ఫలితాలను కూడా చూపిస్తోంది.__ చదువరి (చర్చరచనలు) 05:59, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాలో ముఖ్యమైన వ్యాసాల జాబితా తయారుచేయడం

తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాలను దాటినందున, అందరికీ కృతజ్ణతలు. చాలా రోజులుగా మనం తెలుగు వికీపీడియాలో మంచి వ్యాసాలను చేయాలనుకుంటున్న విషయం అందరికీ తెలిసినదే. కానీ కొన్ని కారణాల వలన అత్యంత ముఖ్యమైన తెలుగు, తెలంగాణ, విశాఖపట్నం వంటి వ్యాసాలలో కూడా ఇంకా ఎర్ర లింకులు, ఆంగ్ల పదాలు ఉన్నాయి. ఆంగ్ల వికీపీడియాలో కూడా ఇటువంటి నాణ్యత సమస్య వచ్చినప్పుడు, వారు Wikipedia:Vital articles అనే పట్టికను తయారు చేశారు. దానిలో మొదటి స్థాయి నుంచి క్రమంగా 10, 100, 1000, 10000, 50000 వ్యాసాలను గుర్తించి, అదే క్రమంలో అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. మనం కూడా తెలుగు వికీపీడియాలో ఇటువంటి ఒక క్రమాన్ని పాటించి, స్థాయిలను తయారుచేసి, అభివృద్ధి (ఎటువంటి ఆంగ్ల పదాలు, ఎర్ర లింకులు లేకుండా) చేస్తే బాగుంటుంది. మనం ఎలాగూ లక్ష వ్యాసాల మైలురాయిని చేరుకున్నాం కాబట్టి, నాణ్యతపై దృష్టి పెడితే బాగుంటుందని నేనూ, Pranayraj1985 గారూ, Pavan santhosh.s గారూ, Saiphani02 గారూ చర్చించడం జరిగింది. I.Mahesh (చర్చ) 05:49, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@I.Mahesh గారూ, ఆలోచన బాగుందండి. ప్రతిపాదన మొదలుపెట్టండి.__ చదువరి (చర్చరచనలు) 06:00, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారూ, నేను అయితే మొదటి 10 వ్యాసాలుగా:
  1. తెలుగు
  2. తెలుగు సాహిత్యం
  3. తెలుగు నాటకరంగం
  4. తెలుగునాట జానపద కళలు
  5. భారతదేశం
  6. ఆంధ్రప్రదేశ్
  7. తెలంగాణ
  8. శాతవాహనులు
  9. కాకతీయులు
  10. విజయనగర సామ్రాజ్యం
ఉంటే బాగుంటుంది అనుకున్నాను, తరువాత స్థాయి వ్యాసాలను, మనం జాబితాల వారీగా ఎన్నుకోవచ్చు. ఈ స్థాయిలకు, నేను పైన ఇచ్చిన జాబితాకు మార్పులుచేర్పుల పిమ్మట సభ్యుల అంగీకారం తెలిపితే, ఒక ఆదివారం మనం ఆన్-లైను పద్దతిలో వ్యాసాలను ఏ విధంగా మెరుగుపరచగలమో చర్చిద్దాం. I.Mahesh (చర్చ) 06:34, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@I.Mahesh గారూ, మనం ప్రమాణాలను, పద్ధతులనూ కూడా నిశ్చయించుకుంటే బాగుంటుంది. ఉదాహరణకు, వికీపీడియా:మంచి వ్యాసాలు, వికీపీడియా:మెరుగైన వ్యాసాలు చూడండి. మంచి వ్యాసాలు ప్రమాణాల ప్రకారం ఒకటి రెండు వ్యాసాలను సమీక్షించాం కూడా. అయితే పూర్తి కాలేదు. ఈ ప్రమాణాలనే వాడాలనేమీ లేదు, ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించుకోవచ్చు. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 09:00, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
నేనూ ఎప్పటి నుంచో మనసులో అనుకుంటున్న పని ఇది. ఇప్పటికే కొంత చేస్తున్నాను కూడా. మీ ప్రయత్నానికి నా మద్ధతు ఉంటుంది. నా వంతుగా కొన్ని వ్యాసాలు మెరుగు పరచగలను. - రవిచంద్ర (చర్చ) 07:44, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
దీని మీద చర్చించటానికి సలహాలు, సూచనలు అందజేయటానికి వికీపీడియా: తెలుగు వికీపీడియాలో ముఖ్యమైన వ్యాసాల జాబితా తయారుచేయడం అనే పేజీ నొకదానిని పెట్టి అక్కడ చర్చలు సాగిస్తే అవి మున్ముందు ఉపయోగకరంగా ఉంటుంది.మరలా అవసరమైనప్పుడు ఈ చర్చను తిరగదోడాలంటే చాలా కష్ట్టమైన పని. అక్కడ సాగించండి.ఆ పేజీలో స్పందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 09:01, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి ఆలోచన @I.Mahesh గారు, నేను కూడా ఇందులో పాల్గొంటాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:05, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
I.Mahesh గారూ, మంచి ప్రతిపాదన. ఇది వరకు చేసిన జాబితా చూడండి వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు --వైజాసత్య (చర్చ) 11:19, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:విశేష వ్యాసాలు కూడా చూడండి. 2014 నుండి జాబితా మారలేదు. Saiphani02 (చర్చ) 20:20, 24 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఆలోచన బావుందండి. కనీసం నేను చేసినవి మళ్ళీ ఒకసారి చూస్తాను.--V.J.Suseela (చర్చ) 18:31, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వికీప్రాజెక్టుల ఆలోచనలు

మనం కొత్తగా ఏయే అంశాలపై వికీప్రాజెక్టులు చేపట్టవచ్చో మన ఆలోచనలను ఇక్కడ చెప్పుకుందాం. పైన వాడుకరి:I.Mahesh గారు ఒక గొప్ప వికీప్రాజెక్టు ఐడియా తెచ్చారు. అలాగే నాకు తట్టినవి కొన్ని ఇక్కడ రాస్తున్నాను. ఈ ప్రాజెక్టులలో కొన్ని, ఈ పాటికే ఏదో ఒకరూపంలో ఉండి ఉండవచ్చు:

  • తెలుగు పత్రికలు (ఒక ఐదారొందల కొత్త వ్యాసాలు రావచ్చని నా అంచనా)
  • తెలుగు పుస్తకాలు (ఎలాంటి పుస్తకాలకు వ్యాసాలు రాయొచ్చో ప్రమాణాలున్నాయి మనకు) వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు అనే ప్రాజెక్టు ఈసరికే ఉంది. దానిలోనే కొనసాగించవచ్చు.
  • భారతదేశంలో ప్రచురణ సంస్థలు. వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రచురణ రంగం అనే ప్రాజెక్టు ఈసరికే ఉంది. దాన్నే కొనసాగించవచ్చు.
  • భారతదేశంలో వ్యాపార సంస్థలు
  • భారతదేశంలో ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు, విభాగాలు, శాఖలు, అధికారులు
  • భారతదేశంలో విద్యాసంస్థలు (కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత సాంకేతిక సంస్థలు వగైరా), సంబంధిత వ్యక్తులు. వికీపీడియా:వికీప్రాజెక్టు/విద్య, ఉపాధి అనే ప్రాజెక్టు ఈసరికే ఉంది. దాన్నే కొనసాగించవచ్చు.
  • తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు పట్టణాల్లోని పేటలు (ప్రస్తుతం హై. విశాఖ, విజయవాడల్లో కొన్నీటికి పేజీలున్నాయంతే.)
  • కైఫియత్తుల నుండి సమాచారాన్ని ఆయా గ్రామాల్లో చేర్చడం. (కొంత చేర్చారు. అన్నిటికీ చేర్చారో లేదో చూడాలి)
  • భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి మరింత సమగ్రంగా సమాచారముండాలి. కొత్త వ్యాసాలు రాయడం, ఉన్నవాటిని విస్తరించడం చెయ్యాలి. ఉద్యమాలు, వ్యక్తులు, సంఘటనలు, వగైరా పేజీలు ఇందులో భాగం
  • పలు వ్యాసాల్లో సమాచారాన్ని తాజాకరించడం. అనేక వ్యాసాల్లో సమాచారాన్ని తాజాకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వివిధ వ్యాసాల్లో ఉండే గణాంకాలు, దేశాధ్యక్షులు, ప్రధానుల, ముఖ్యమంత్రుల వంటి సమాచారం, ఇటీవలి ఎన్నికల తరువాత వచ్చిన సమాచారాన్ని సంబంధిత పేజీల్లో చేర్చడం వగైరాలను లక్ష్యంగా పెట్టుకోవాలి. ఒక ప్రణాళిక వేసుకుని చెయ్యాల్సిన పని.
  • భాషా నాణ్యతను మెరుగుపరచడం. మనం చేసిన తప్పులను మనమే దిద్దుకోవాలి, తప్పదు. ఒక పద్ధతి ప్రకారం వ్యాసాలను ఎంచుకుని ఈ పని మొదలెడదాం. ఉదాహరణకు, దేశాల వ్యాసాలు, రాష్ట్రాల వ్యాసాలు, జిల్లాల వ్యాసాలు, చరిత్ర వ్యాసాలు, వ్యక్తుల వ్యాసాలు,.. ఇలా చేసుకుంటూ వెళ్దాం.

మీమీ ఆలోచనలు రాయండి. ఇన్ని ప్రాజెక్టుల్లో పని ఎల్కా జరుగుతుంది అనుకోవద్దు. ఎవరికి ఇష్టమైన ప్రాజెక్టును వాళ్ళు మొదలెట్టి, నిర్వహిస్తారు. ఎవరికి ఇష్టమైన ప్రాజెక్టులో వాళ్ళు పనిచేస్తారు. పరిశీలించండి.__ చదువరి (చర్చరచనలు) 10:26, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @Chaduvari గారు. పైన మీరు ప్రస్తావించిన ప్రాజెక్టుల వివరాలు చదువుతున్నపుడు, ఇవన్నీ ఎవరు చేయాలి?, రోజూవారి వికీలో రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?, ఆ కొద్దిమందితో ఈ ప్రాజెక్టులకు ఎంత సమయం పడుతుంది? అన్న సందేహం కలిగింది. అయితే, నా సందేహానికి చివరి వాక్యంలో సమాధానం కూడా దొరికింది. విద్య, ఉపాధి పాజెక్టులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల వ్యాసాల రచనను ముందుగా తీసుకుందామని నా అభిప్రాయం. వాటికి సంబంధించి https://schools.org.in వెబ్సైటులో సమాచారం ఉంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:02, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల వ్యాసాల అవసరం నాకు కనిపించటంలేదు. ఉన్న గ్రామ వ్యాసాలలో వ్రాయవచ్చు. Saiphani02 (చర్చ) 14:02, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు పెట్టిన ఆలోచనలు బాగున్నాయి. ఉన్న వ్యాసాల నాణ్యతను మెరుగుపరచకుండా విస్మరించి, నాణ్యత, వర్గీకరణ సరిగ్గలేని వేలకొద్దీ వ్యాసాలను రాయడం కొనసాగిస్తే, నిర్వహణ చాలా కష్టమవుతుంది. దీని గురించి మరింత మంది అలోచించి వారి సమయాన్ని, శ్రమను సరైన రీతిలో వినియోగించుకోవాలి. నేను వర్గీకరణ, వికీడాటా సవరింపులు చేస్తున్నాను. Saiphani02 (చర్చ) 14:19, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
పత్రికలూ, పుస్తకాలు, ప్రచురణకర్తలు గురించిన సమాచారం నాకు కొంత దొరికే అవకాశం ఉంది. నేను ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు . --V.J.Suseela (చర్చ) 18:38, 7 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వికీలో విహరిస్తున్నప్పుడు కొన్ని కొన్ని వ్యాసాలు తారసపడతాయి. అవి చూసి, ఇంత ప్రాముఖ్యమైన విషయంపైన, వ్యక్తిపైన వ్యాసంలో సమాచారం ఇంతే ఉందేంటి అని అనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా "చదువరులు అభిలషించిన జాబితా" (రీడర్స్ ఛాయిస్) అని ఒక జాబితా తయారుచేసి, అందులో అందరూ తమకు తారసపడిన వ్యాసాలు జతచేస్తుంటే, కొన్ని కొన్ని కేటాయించుకొని అందరూ తలా ఒక వ్యాసాన్ని అభివృద్ధి చేయవచ్చు --వైజాసత్య (చర్చ) 03:27, 8 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అవును. అలాంటి ఎన్నో వ్యాసాలు ఉన్నాయి. చాలా వరకూ ఆంగ్ల అనువాదాలు 10 పేరాలు ఉన్న వ్యాసాన్ని అరపేరాకు కుదించి రాసినవి ఉన్నయి. ఆర్టికల్ కౌంట్ కోసం అలాంటి వ్యాసాలు వేలకు వేలు వచ్చేసాయి. ఇప్పటికీ వస్తున్నాయి, వస్తాయి. నాణ్యత, పూర్తి సమాచారం చేర్చడం కంటే ఎక్కువ వ్యాసాలు రాసాం అని చెప్పుకోవడం ఇప్పటి ట్రెండ్. B.K.Viswanadh (చర్చ) 01:48, 10 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ, ఒక పని చెయ్యవచ్చు. ముఖ్యమైన వెయ్యి లేదా 10 వేల జాబితాల్లోని వ్యాసాల్లో ఫలానా పరిమాణం కంటే తక్కువ (ఉదాహరణకు 10 కిలోబైట్లు) ఉన్న పేజీలను చేర్చి ఈ జాబితాను తయారు చేసుకోవచ్చు. __చదువరి (చర్చరచనలు) 14:00, 12 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@B.K.Viswanadh గారు పైన వెలిబుచ్చిన అభిప్రాయంతో కొంతవరకు నేనూ ఏకీభవిస్తున్నాను. నా అనుభవ రీత్యా నా పరిశీలనలో నేను గమనించింది, అయితే నాణ్యత, పూర్తి సమాచారం చేర్చడం కంటే ఎక్కువ వ్యాసాలు రాసాం అని చెప్పుకోవడం ఇప్పటి ట్రెండ్ అనే దానితో నేను ఏకీభవించను.ఇప్పటి ట్రెండ్ అప్పటి ట్రెండ్ అనేది ఏమీ లేదు.ఇది ఎప్పుడూ నడుస్తానే ఉంది. ఇది తెలియాలంటే ఎవరికి వారు మనం సృష్టించిన వ్యాసాలు ఎలా ఉన్నవి అని పరిశీలించుకుంటే తెలుస్తుంది.ఒక వేళ ఏవైనా 10 వ్యాసాలు ఉదాహరణ చూపిద్దామంటే ఆ వాడకరులను వేలెత్తి చూపినట్లుగా ఉంటుంది.నావరకు నేను నాణ్యత, ఖచ్చితత్వం, తాజావివరాలు, మూలాలుతో అవకాశం ఉన్నంతవరకు వ్యాసాలు ఇప్పటి ఆంగ్ల వ్యాసాలకు అనుగుణంగా విస్తరించటమే నాపని.(నా వ్యాసాలు, ఇతరుల వ్యాసాలు అని కాదు) కనీసం ఇతరుల వ్యాసాలు విస్తరించకపోయినా ఎవరికి వారు సృష్టించిన వ్యాసాలు వారు విస్తరించినా కొంతవరకు మేలు అని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 05:02, 31 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

A2K Monthly Report for September 2024

Dear Wikimedians,

We are thrilled to share our September newsletter, packed with highlights of the key initiatives driven by CIS-A2K over the past month. This edition features a detailed recap of our events, collaborative projects, and community outreach efforts. You'll also get an exclusive look at the exciting plans and initiatives we have in store for the upcoming month. Stay connected with our vibrant community and join us in celebrating the progress we’ve made together!

In the Limelight- Santali Wiki Regional Conference 2024
Dispatches from A2K
Monthly Recap
  • Book Lover’s Club in Belagavi
  • CIS-A2K’s Multi-Year Grant Proposal
  • Supporting the volunteer-led committee on WikiConference India 2025
  • Tamil Content Enrichment Meet
  • Experience of CIS-A2K's Wikimania Scholarship recipients
Coming Soon - Upcoming Activities
  • Train-the-trainer 2024
  • Indic Community Engagement Call
  • A2K at Wikimedia Technology Summit 2024

You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.

Regards MediaWiki message delivery (చర్చ) 15:13, 10 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Preliminary results of the 2024 Wikimedia Foundation Board of Trustees elections

Hello all,

Thank you to everyone who participated in the 2024 Wikimedia Foundation Board of Trustees election. Close to 6000 community members from more than 180 wiki projects have voted.

The following four candidates were the most voted:

  1. Christel Steigenberger
  2. Maciej Artur Nadzikiewicz
  3. Victoria Doronina
  4. Lorenzo Losa

While these candidates have been ranked through the vote, they still need to be appointed to the Board of Trustees. They need to pass a successful background check and meet the qualifications outlined in the Bylaws. New trustees will be appointed at the next Board meeting in December 2024.

Learn more about the results on Meta-Wiki.

Best regards,

The Elections Committee and Board Selection Working Group


MPossoupe_(WMF) 08:26, 14 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ మెడ్ ప్రాజెక్ట్ తెలుగు అనువాద వ్యాసాలు

వికీ మెడ్ అనువాద వ్యాసాలు ప్రాజెక్ట్ లో తెలుగు 12నుంచి 2వ స్థానంలోకి ప్రవేశించింది.
ఆంగ్లంలో విస్తృతంగా చాలా లోతుగా వ్రాయబడిన వైద్య సంబంధిత విషయం నుంచి తీసుకున్న కనీస ఆరోగ్య సమాచారాన్ని అందిచ్చే ఉద్దేశ్యముతో ఒక యాప్ అభివృద్ధి పరచి ఇంకా ఇతర భాషల వారికీ ఈ సమాచారం అందించడానికి కొంత మంది వైద్యులు ఈ ప్రాజెక్ట్ తయారుచేసారు. వివరాలు ఇక్కడ చూడవచ్చు. వీలు వెంబడి మిగిలిన వైద్య సమాచారాన్ని ఆంగ్ల వ్యాసాల నుండి ఇంకా ఇతర మూలాలనుండి కూడా చేర్చి మన వ్యాసాన్ని అభివృద్ధి చేయవచ్చు.
ఇందులో 10 స్థానాలు ముందుకు తీసుకు వెళ్లిన ప్రణయ్‌రాజ్ వంగరిగారికి అభినందనలు. ఇంకా కొంత మంది రాస్తే అందరి ఆరోగ్యానికి అవసరమైన సమాచారం చేర్చే విషయంలో మొదటి స్థానానికి కూడా చేరుకోవచ్చు. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 03:35, 15 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు @Vjsuseela గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:22, 16 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]


మన కృషిని ఇంకా గుర్తించని ఇంగ్లీష్ వికీపీడియా

మనం లక్ష వ్యాసాలను మించి సృష్టించి సంబరాలు చేసుకుంటున్నా మన కృషిని ఇంకా ఇతర భాషల వికీపీడియాలు గుర్తించినట్లు కనిపించడం లేదు. ఎన్వికీ మొదటి పేజీలో Wikipedia languages అనే శీర్షిక క్రింద మన తెలుగు వికీని ఇంకా 50,000+ articles విభాగం క్రిందనే చూపిస్తున్నారు. --స్వరలాసిక (చర్చ) 02:25, 16 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక గారూ, దాని తరువాతి విభాగం 2,50,000 వ్యాసాలు కదా.. అంచేత మార్చలేదు. ఒకవేళ మార్చాల్సిన అవసరం ఉన్నా, వాళ్ళంతట వాళ్ళే మార్చరు, మనం అడగాలి. ఈ చర్చాపేజీలో మన అభ్యర్థన రాయాలి. __ చదువరి (చర్చరచనలు) 02:53, 16 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఓహ్.. నేను పొరబడ్డాను. 10 లక్షల వ్యాసాల విభాగాన్ని లక్ష వ్యాసాల విభాగం అనుకున్నాను. స్వరలాసిక (చర్చ) 06:08, 16 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ లక్షారోహణ సందర్భంగా - డిఫ్ ద్వారా సమాచారం

తెవికీ లక్షారోహణ సందర్భంగా సూచించిన అంశాలలో 'డిఫ్' ద్వారా మిగిలిన వికీ ప్రపంచానికి ఈ వార్త అందించడం. ఈరోజు ఆవార్త డిఫ్ లో ప్రచురించబడింది. డిఫ్ ఎడిటర్ Chris Koerner (నా ఇమెయిల్ ద్వారా అందించిన) వ్యాఖ్య చేరుస్తున్నాను "Congratulations on an important milestone! Here's to one million more. :)-Chris K."
ఈ విషయంలో సలహా ఇచ్చి, సహకరించిన చదువరి గారికి ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 02:49, 16 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Vjsuseela గారూ ధన్యవాదాలు. ఆ క్రిస్ గారు, మన లక్షను మిలియన్ అనుకుంటున్నారు. :-) (ఎక్కువగా జరుగుతూనే ఉంటుందలా) __ చదువరి (చర్చరచనలు) 02:56, 16 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఆవిడ మనకు 20 లక్షల టార్గెట్ సూచించింది. V.J.Suseela (చర్చ) 04:56, 16 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ధణ్యవాదాలు Vjsuseela గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:21, 16 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Seeking volunteers to join several of the movement’s committees

Each year, typically from October through December, several of the movement’s committees seek new volunteers.

Read more about the committees on their Meta-wiki pages:

Applications for the committees open on 16 October 2024. Applications for the Affiliations Committee close on 18 November 2024, and applications for the Ombuds commission and the Case Review Committee close on 2 December 2024. Learn how to apply by visiting the appointment page on Meta-wiki. Post to the talk page or email cst@wikimedia.org with any questions you may have.

For the Committee Support team,

-- Keegan (WMF) (talk) 23:08, 16 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Announcing Indic Wikimedia Hackathon Bhubaneswar 2024 & scholarship applications

Dear Wikimedians,

We hope you are well.

We are thrilled to announce the upcoming Indic Wikimedia Hackathon Bhubaneswar 2024, hosted by the Indic MediaWiki Developers UG (aka Indic-TechCom) in collaboration with the Odia Wikimedians UG. The event will take place in Bhubaneswar during 20-22 December 2024.

Wikimedia hackathons are spaces for developers, designers, content editors, and other community stakeholders to collaborate on building technical solutions that help improve the experience of contributors and consumers of Wikimedia projects. The event is intended for:

  • Technical contributors active in the Wikimedia technical ecosystem, which includes developers, maintainers (admins/interface admins), translators, designers, researchers, documentation writers etc.
  • Content contributors having in-depth understanding of technical issues in their home Wikimedia projects like Wikipedia, Wikisource, Wiktionary, etc.
  • Contributors to any other FOSS community or have participated in Wikimedia events in the past, and would like to get started with contributing to Wikimedia technical spaces.

We encourage you to follow the essential details & updates on Meta-Wiki regarding this event.

Event Meta-Wiki page: https://meta.wikimedia.org/wiki/Indic_Wikimedia_Hackathon_Bhubaneswar_2024

Scholarship application form: Click here to apply

(Scholarships are available to assist with your attendance, covering travel, accommodation, food, and related expenses.)

Please read the application guidance on the Meta-Wiki page before applying.

The scholarship application is open until the end of the day 2 November 2024 (Saturday).

If you have any questions, concerns or need any support with the application, please start a discussion on the event talk page or reach out to us contact@indicmediawikidev.org via email.

Best,

MediaWiki message delivery (చర్చ) 09:35, 19 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్కైవ్.ఆర్గ్

archive.org పని చెయ్యడం లేదు. హ్యాక్ చేసారంట. వేబ్యాక్‌మెషీన్ కోలుకుంది గానీ, పూర్తిగా కాదు. ఈసరికే ఆర్కైవు చేసిన యూఆరెళ్ళను చూపిస్తోంది గానీ, కొత్తగా ఆర్కైవు చెయ్యడం లేదు. ఇది అక్టోబరు 20 ఉదయం 5:00 గంటలప్పటి సంగతి. __ చదువరి (చర్చరచనలు) 00:08, 20 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అవునండి. దాదాపు ఒక నెల రోజుల నుండి ఇదే పరిస్థితి. V.J.Suseela (చర్చ) 13:14, 21 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతానికి పని చేస్తున్నది వీలును బట్టీ కావలసిన తెలుగు పుస్తకాలు డౌన్లోడ్ చేసి పెట్టుకొంటే మేలు , ఏ రోజు ఎలా వుంటుందో తెలవటం లేదు ! --Kasyap (చర్చ) 06:28, 22 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మందుల పేజీలు

మందుల పేజీల గురించి విస్తృతంగా వ్యాసాలు రాస్తున్నారు. ఆ పేజీల్లో మొదటి వాక్యంలో, ఇది ఫలనా "బ్రాండ్ పేరుతో విక్రయించబడింది" అని రాస్తున్నారు. బ్రాండు పేరు రాయడం - అందునా ఒకే ఒక్క బ్రాండు పేరు - రాయడం సరైన పద్దతేనా అని సందేహం కలిగింది. బ్రాండంటే ఒక కంపెనీ తయారుచేసిన ఉత్పత్తి కదా, అలా రాయడం తగదేమో అనేది నా సందేహం. పరిశీలించవలసినది.

@Pranayraj1985, @Vjsuseela మీ పరిశీలన కోసం__ చదువరి (చర్చరచనలు) 03:03, 21 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అవునండి.ఒక జెనెరిక్ మందు అనేక బ్రాండ్లలో తయారు చేస్తున్నారు. ఇతర మందులతో సమ్మేళనాలుగా కూడా వస్తుంటాయి. వీటన్నిటి సమాచారం దొరికితే చేర్చవచ్చు అనుకుంటున్నాను. బ్రాండ్లు, సమ్మేళనాల గురించి వ్రాయకూడదనే నిర్ణయం ఉంటే తెలియచేయవలసినది. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 13:22, 21 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు @Chaduvari గారు. మెడికల్ వికీ ప్రాజెక్టులోని వ్యాసాలలో బ్రాండు పేర్ల గురించి ఉండడం వల్ల దానిని తెవికీ వ్యాసాలలో రాశాను. అలా వద్దు అనుకుంటే ఆయా వ్యాసాలలో బ్రాండు పేర్ల వివరాలను తీసేస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:11, 22 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Announcement message for Translation suggestion project

Dear Wikimedians,

The Language and Product Localisation team will host an office hour for Wikimedians to discuss the Translation Suggestions: Topic-based & Community-defined Lists project [1] on October 26 2024. Below is background information about the project and details of the office hour.


Background information

Partnering with the Community Growth team, the Language and Product Localization team wants to test whether contributors can self-discover content to translate by selecting their preferred topic or from a campaign (like Wikipedia Asian Month). The above has been made possible by providing an improved article suggestion lists in the Content translation tool for contributors.

Details of the office hour

The team will host a virtual office hour to present their approach and updates, and get feedback from event/campaign organisers and contributors who use the Content translation tool. The office hours will be on:

You can indicate your interest in attending by signing your username on this page [3]; this is optional.


Thank you for making time for this meeting.

On behalf of the Language and Product Localization team.


[1] https://www.mediawiki.org/wiki/Translation_suggestions:_Topic-based_%26_Community-defined_lists

[2] https://zonestamp.toolforge.org/1729953000

[3] https://www.mediawiki.org/wiki/Translation_suggestions:_Topic-based_%26_Community-defined_lists/Community_space/Conversations#Sign_up_(optional) Kalli navya (చర్చ) 09:52, 22 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Hello everyone, I previously wrote on the 27th September to advise that the Wikidata item sitelink will change places in the sidebar menu, moving from the General section into the In Other Projects section. The scheduled rollout date of 04.10.2024 was delayed due to a necessary request for Mobile/MinervaNeue skin. I am happy to inform that the global rollout can now proceed and will occur later today, 22.10.2024 at 15:00 UTC-2. Please let us know if you notice any problems or bugs after this change. There should be no need for null-edits or purging cache for the changes to occur. Kind regards, -Danny Benjafield (WMDE) 11:29, 22 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ ఆర్కైవులు

తెవికీ మొదటిపేజీ, గణాంకాల పేజీ - ఈ రెంటినీ ప్రతినెలా మొదటి తేదీన archive.org లో ఆర్కైవు చేద్దాం. వైజాసత్య గారూ, దీన్ని బాటు ద్వారా చేసే వీలుందేమో చూస్తారా? __ చదువరి (చర్చరచనలు) 13:08, 23 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@చదువరిగారు! అలాగేనండి. ప్రయత్నించి చూస్తాను --వైజాసత్య (చర్చ) 00:07, 24 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీ-2024

సభ్యులకు నమస్కారం,

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, వికీమీడియా ఫౌండేషన్ లు సంస్థాగత భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి, తెలంగాణలో సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటలైజ్ చేయడంలో, ఉచిత విజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో క్రియాశీల సహకారాన్ని ప్రారంభించేందుకు తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని అనే ప్రాజెక్టు రూపొందించబడింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా 2014 నుండి 2024 వరకు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి భాషా సాంస్కృతిక శాఖ విడుదల చేసిన ఫోటోలలో 6,800 ఫోటోలను తగిన పేరు, తెలుగు వివరణ, వర్గీకరణ, ఇతర అవసరమైన మెటాడేటాతో కలిపి వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ చేత వికీమీడియా కామన్స్ లోకి ఎక్కించడం జరిగింది. వికీ కామన్స్ లో ఎక్కించిన ఆ ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ పోటీ ఉద్దేశం. ప్రస్తుతం వికీలో చురుగ్గా రాస్తున్న వాడుకరులతో సహా పాత, కొత్త వాడుకరులు అందరూ ఈ ప్రాజెక్టులో పాల్గొని తెవికీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి.

కాలక్రమ వివరాలు

  • పోటీ ప్రారంభం: 2024 అక్టోబరు 26
  • పోటీ చివరి తేదీ: 2024 నవంబరు 4
  • ఫలితాల ప్రకటన: 2024 నవంబరు 8

బహుమతుల వివరాలు ఫొటోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన మొదటి ముగ్గురు వాడుకరులకు బహుమతులు:

  1. మొదటి బహుమతి ― ₹5000 గిఫ్ట్ కార్డు + సర్టిఫికెట్
  2. రెండవ బహుమతి ― ₹3000 గిఫ్ట్ కార్డు +సర్టిఫికెట్
  3. మూడవ బహుమతి ― ₹2000 గిఫ్ట్ కార్డు + సర్టిఫికెట్

ప్రాజెక్టు లింకులు

Pranayraj (Wikimedian in Residence) (చర్చ) 06:48, 24 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన - డిసెంబరు 19-29, 2024

సభ్యులకు నమస్కారం
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఈ సంవత్సరం (2024) డిసెంబరు నెలలో 19 నుండి 29 వరకు జరగనుంది. దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు వికీపీడియా ప్రతి సంవత్సరం మన తెలుగు వికీపీడియా సభ్యులు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు స్వచ్చందంగా నిర్వహిస్తున్న విషయం అందరకు తెలిసినదే. ఈ సంవత్సరం తెలుగు వికీపీడియాకు విస్తృత ప్రచారం, అవగాహన, కొత్త సభ్యులను మరింత విస్తృతం చేయడం కొరకు ఫౌండేషన్ నుండి గ్రాంట్ కు దరఖాస్తు చేయడం, దానికి అనుమతి లభించడం జరిగింది.
అయితే ప్రస్తుతం వికీపీడియా అంతర్జాతీయంగా ఎదుర్కుంటున్న కొన్ని సవాళ్లు సామజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి అనేక వర్గాల వారి భిన్నాభిప్రాయలకు, వ్యాఖ్యానాలకు గురి అవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలుగు వికీపీడియా హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలవంటి జనబాహుళ్య ప్రదేశాలలో మన తెవికీ సభ్యులు వీటికి నేరుగా ఎదురుపడే సంభావ్యత ఉంది.
ఈ స్టాల్ నిర్వహణ, ప్రణాళిక విషయంలో తెవికి సముదాయ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియచేయవలసినదిగా కోరుతున్నాను. ఎక్కువ సమయం లేనందున 2-3 రోజులలో (నవంబరు 3)తమ స్పందన తెలియచేయమని కోరుతున్నాను. ధన్యవాదాలు V.J.Suseela (చర్చ) 13:00, 30 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

దేశీయంగా కోర్టు విషయాలు చూసాను కానీ "వికీపీడియా అంతర్జాతీయంగా ఎదుర్కుంటున్న కొన్ని సవాళ్లు" ఏంటో అర్ధం కాలేదు. విషయం ఏదైనా, ఇలాంటి పరిస్థితులలో మనం ప్రజలలో ఉండే సందేహాలు, ప్రశ్నలను ఎదుర్కొని ముందడుగు వేయాలన్నది నా అభిప్రాయం. దీనికి సన్నాహక సమావేశాలు పెట్టుకుంటే ఇంకా మంచిది. Saiphani02 (చర్చ) 17:58, 31 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఈసారి స్టాలు నిర్వహణలో కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని భావించడం సబబే. ఈ విషయమై నా అభిప్రాయాలివి:
  • స్టాలు నిర్వహణ అనుకున్న ప్రకారమే చేద్దాం.
  • స్టాలు ఎలా నిర్వహించాలన్న విషయమై మాట్లాడుకుందాం
  • నిర్వాహకులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తే, దానికి అనుగుణంగా స్టాలు నిర్వహణలో ఎదురౌతాయని మనం భావిస్తున్న ప్రశ్నలకు ముందే సిద్ధమవడానికి వీలుంటుంది.
వీటికి అవసరమైన విధంగా ప్రణాళిక తయారుచేసుకుందాం. ఇందుకోసం సాయిఫణి గారన్నట్లు సన్నాహక సమావేశాలు పెట్టుకోవాలి. __ చదువరి (చర్చరచనలు) 05:56, 2 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అంతర్జాతీయంగా వికీపీడియా ఎదుర్కుంటున్న ఆరోపణలు  నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాలలో పెద్దగా ఎవరు పట్టించుకోరని నేను అనుకుంటున్నాను .ఇక దేశీయంగా ఎదుర్కొటున్న కోర్ట్ సమస్య అది ఎవరు ఎందుకు ఎపించారో అందరికి తెలుసు. వాటి గురించి మనల్ని ఎవరు అడగరు అని నా అభిప్రాయం . ఒకవేళ వాటి వాళ్ళ ఎవరైనా మనలని ప్రశ్నిస్తారు అనే సందేహం ఉంటె అవి తప్పు అని చెప్పే కరపత్రాలు ముద్రించవచ్చు . కానీ దాని వలన తెలియని వాళ్ళకి కూడా మనమే తెలియజేసినట్టు వాళ్ళం అవుతాం . బూరుగుపల్లి మఠం అఖిల్ (చర్చ) 08:27, 2 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా స్టాలు నిర్వహించుకోవడం సంతోసకరమే. మీరన్నట్టుగానే వికీపీడియా అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణలోకి తీసుకొని ముందస్తుగానే ప్రణాళిక వేసుకోవాడమే మంచిది. దీనిని ఎవరు పట్టించుకోరులే అని అనుకోవడం కొంత నిర్లక్ష్యమే. ఎందుకంటే నేను ఇదివరకే ఈ అనుభవాన్ని ఎదురుకొన్నాను. "వికీపీడియా - తెలుగు సాహిత్య వినియోగం" అనే అంశంపై ప్రాజెక్టు నిర్వహించేటపుడు అనేకరకాల ప్రశ్నలు నేను ఎదుర్కొన్నాను. కొన్నింటికి మాత్రమే సమాధానం ఇవ్వగలిగాను. కాబట్టి ఈ పరిస్థితి మనం సమిష్టిగా నిర్వహించుకునే స్టాలు నిర్వహణలో రాకుండా ఉండుటకు ఆ సమస్యలపై మనకు కొంత అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది నా అభిప్రాయం. -- అభిలాష్ మ్యాడం (చర్చ) 08:06, 4 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

స్త్రీ వాదము - జానపదం 2024 ప్రాజెక్టు ఫలితాలు

మహిళా సాధికారతను సాధిస్తూ జానపద విజ్ఞానాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో “ఫెమినిజం అండ్ ఫోక్లోర్” అన్న పేరుతో ఒక ప్రాజెక్టు జరిగింది. అదే విధంగా తెవికీలో “స్త్రీ వాదం - జానపదం” అనే పేరుతో 2024 ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 వరకు ప్రాజెక్టు నిర్వహించుకొని స్త్రీల సాధికారతకు మనవంతు సహకారం చేశాము.

ఈ ప్రాజెక్టును 2015 లో మొదటిసారి రాజశేఖర్ గారు తెవికీలో నిర్వహించారు ( https://w.wiki/8c7K ) ఈ పేజీ ప్రకారం ఆ తరువాత 2024లో మళ్ళీ ఈ ప్రాజెక్టుని మమత గారు నిర్వహించడం విశేషం….

2024 సంవత్సరంలో ప్రపంవ్యాప్తంగా 43 భాషా సముదాయాలు పాల్గొంటే వాటిల్లో తెలుగు వికీపీడియా 1742 వ్యాసాలు పొందుపరిచి మొదటి స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. నాకు తెలిసి ప్రపంచంలోనే అత్యధిక వ్యాసాలు పొందుపరిచి తెలుగు వికీపీడియా మొదటి స్థానంలో నిలవడం ఇదే మొదటి సారి కూడాను.... ఈ ప్రాజెక్టు తెలుగు వికీ చరిత్రలో అంతర్జాతీయ కీర్తిని జోడిస్తూ, మరో మైలు రాయిని చేర్చింది అని తెలియజేయటానికి గర్వపడుతున్నాను.

ఈ పోటీలో చురుకుగా పాల్గొని మొదటి మూడు స్థానాల్లో నిలిచి స్థానిక బహుమతులు అందుకోవడానికి ఎంపికైన వికీపీడియన్ల వివరాలు క్రింద ప్రకటించడం జరిగింది.

మొదటి బహుమతి: దివ్య గారు (801 వ్యాసాలతో స్థానిక వికీపీడియాలో మొదటి స్థానం, అంతర్జాతీయ స్థాయిలో మూడోస్థానం.) రెండవ బహుమతి: ప్రవల్లికగారు (515 వ్యాసాలతో స్థానిక వికీపీడియాలో రెండో స్థానం, అంతర్జాతీయ స్థాయిలో ఐదో స్థానం) మూడవ బహుమతి: ముక్తేశ్వరి గారు. (ఒక కొత్త వికీపీడియన్ గా 167 వ్యాసాలతో స్థానిక వికీపీడియాలో మూడో స్థానం)

అంతే కాకుండా ఈ పోటీలో దివ్య గారు ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచారు , అలాగే ప్రవల్లిక గారు ప్రపంచ వ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచారు.

బహుమతులు గెలుచుకున్న ఈ ముగ్గురు వాడుకరులు మహిళలే అయి ఉండటం ఒక విశేషం అయితే అందులో ఒకరు కొత్త వికీపీడియన్ కావడం మరో విశేషం. ప్రాజెక్టు పేరుకు తగ్గట్టుగా మహిళా సాధికారతను నిలబెట్టుకోవడం తెవికీకి గర్వకారణం. విజేతలకు అభినందనలు.

అదే విధంగా పోటీలో చురుగ్గా పాల్గొన్నవాడుకరి:Muralikrishna m, వాడుకరి:Palagiri, వాడుకరి:v Bhavya, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:KINNERA ARAVIND, వాడుకరి:Edla praveen, వాడుకరి:స్వరలాసిక, వాడుకరి:Thirumalgoud, వాడుకరి:Vjsuseela, వాడుకరి:Tmamatha, వాడుకరి:Kasyap, వాడుకరి:Batthini Vinay Kumar Goud, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:RATHOD SRAVAN, వాడుకరి:MYADAM ABHILASH, వాడుకరి:Meena gayathri.s వాడుకరులు అందరికి అభినందనలు, శుభాకాంక్షలు.

ఇట్లు నేతి సాయి కిరణ్ (చర్చ) 04:33, 2 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్

వికీపీడియాలో ఉన్న చూరుకుదనాన్ని దాని సోదర ప్రాజెక్టులలోకి సైతం తీసుకువెళ్లడానికి ఈ నవంబర్ 1న తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన భావకవి అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికీసోర్సులో ప్రూఫ్ రీడథాన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పేజీ ని గమనించి ఆసక్తి గల సభ్యులు పాల్గొనగలరు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 05:19, 6 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Switching to the Vector 2022 skin: the final date

A two minute-long video about Vector 2022

Hello everyone, I'm reaching out on behalf of the Wikimedia Foundation Web team responsible for the MediaWiki skins. I'd like to revisit the topic of making Vector 2022 the default here on Telugu Wikipedia. I did post a message about this two years ago, but we didn't finalize it back then.

What happened in the meantime? We built dark mode and different options for font sizes, and made Vector 2022 the default on most wikis. With the not-so-new V22 skin being the default, existing and coming features, like dark mode and temporary accounts respectively, will become available for logged-out users here.

If you're curious about the details on why we need to deploy the skin soon, here's more information
  • Due to releases of new features only available in the Vector 2022 skin, our technical ability to support both skins as the default is coming to an end. Keeping more than one skin as the default across different wikis indefinitely is impossible. This is about the architecture of our skins. As the Foundation or the movement in general, we don't have the capability to develop and maintain software working with different skins as default. This means that the longer we keep multiple skins as the default, the higher the likelihood of bugs, regressions, and other things breaking that we do not have the resources to support or fix.  
  • Vector 2022 has been the default on almost all wikis for more than a year. In this time, the skin was proven to provide improvements to readers while also evolving. After we built and deployed on most wikis, we added new features, such as the Appearance menu with the dark mode functionality. We will keep working on this skin, and deployment doesn't mean that existing issues will not be addressed. For example, as part of our work on the Accessibility for Reading project, we built out dark mode, changed the width of the main page back to full (T357706), and solved issues of wide tables overlapping the right-column menus (T330527).
  • Vector legacy's code is not compatible with some of the existing, coming, or future software. Keeping this skin as the default would exclude most users from these improvements. Important examples of features not supported by Vector legacy are: the enriched table of contents on talk pages, dark mode, and also temporary account holder experience which, due to legal reasons, we will have to enable. In other words, the only skin supporting features for temporary account holders (like banners informing "hey, you're using a temp account") is Vector 2022. If you are curious about temporary accounts, read our latest blog post.

So, we will deploy Vector 2022 here in three weeks, in the week of November 25. If you think there are any remaining significant technical issues, let us know. We will talk and may make some changes, most likely after the deployment. Thank you! SGrabarczuk (WMF) (చర్చ) 23:37, 6 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@SGrabarczuk (WMF), there is an outstanding issue with respect to the Search box. This needs to be addressed immediately. Thanks.__ చదువరి (చర్చరచనలు) 00:08, 7 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

A2K Monthly Report for October 2024

Dear Wikimedians,

We’re thrilled to share our October newsletter, featuring the impactful work led or support by CIS-A2K over the past month. In this edition, you’ll discover a detailed summary of our events and initiatives, emphasizing our collaborative projects, community interactions, and a preview of the exciting plans on the horizon for next month.

In the Limelight
TTT
Dispatches from A2K
Monthly Recap
  • Wikimedia Technology Summit
Coming Soon - Upcoming Activities
  • TTT follow-ups

You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.

Regards MediaWiki message delivery (చర్చ) 12:09, 8 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీ-2024లో ఫలితాల ప్రకటన

సభ్యులకు నమస్కారం,

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, వికీమీడియా ఫౌండేషన్ లు సంస్థాగత భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి, తెలంగాణలో సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటలైజ్ చేయడంలో, ఉచిత విజ్ఞానాన్ని ప్రోత్సహించడంలో క్రియాశీల సహకారాన్ని ప్రారంభించేందుకు రూపొందించబడిన తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని అనే ప్రాజెక్టులో భాగంగా వికీ కామన్స్ లో ఎక్కించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడంకోసం 2024 అక్టోబరు 26 నుండి నవంబరు 4 వరకు తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీ-2024 విజయవంతంగా నిర్వహించబడిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ముందుగా తెలిపినట్లుగా ఈ రోజు (నవంబరు 8) పోటీ ఫలితాలు ప్రకటించాం.

  • ఈ పోటీకి 16మంది వాడుకరులు సంతకాలు చేయగా, 12మంది వాడుకరులు పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో భాగంగా 10 రోజులలో తెవికీలోని 531 పేజీలలో 841 ఫోటోలు చేర్చబడ్డాయి. ఈ పోటీ ద్వారా 28 కొత్త వ్యాసాలు కూడా సృష్టించబడ్డాయి.
  • ఈ పోటీలో చురుకుగా పాల్గొని మొదటి మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకోవడానికి ఎంపికైన వికీపీడియన్లు
  1. మొదటి బహుమతి: Pinkypun (202 దిద్దుబాట్లు, 317 మార్కులు)
  2. ద్వితీయ బహుమతి: Muralikrishna m (189 దిద్దుబాట్లు, 244 మార్కులు)
  3. తృతీయ బహుమతి: Pravallika16 (171 దిద్దుబాట్లు, 203 మార్కులు)

విజేతలకు అభినందనలు. అదేవిధంగా పోటీలో పాల్గొన్న స్వరలాసిక, K.Venkataramana, Saiphani02, Divya4232, Vjsuseela, Kasyap, Batthini Vinay Kumar Goud, Chaduvari, KINNERA ARAVIND గార్లకు ధన్యవాదాలు. అలాగే ఈ పోటీ ద్వారా కొత్త వ్యాసాలు సృష్టించిన స్వరలాసిక (15 వ్యాసాలు) గారికి, Muralikrishna m (13 వ్యాసాలు) గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

  • ఫలితాలు, ఇతర వివరాల కోసం ఫోటోల పోటీ పేజీలోని ఫలితాలు విభాగాన్ని చూడగలరు. ధన్యవాదాలు.

--Pranayraj (Wikimedian in Residence) (చర్చ) 16:36, 8 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రణయ్ రాజ్ గార్కి విజేతలు పింకీ, మురళీకృష్ణ, ప్రవళిక లకు నా అభినందలనలు.--Rajasekhar1961 (చర్చ) 07:31, 15 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తక ప్రదర్శనలో తెవికీ స్టాలు, దాని కోసం మన సన్నాహకాలు

డిసెంబరులో జరిగే పుస్తక ప్రదర్శనలో యూజర్‌గ్రూపు తరపున స్టాలు పెట్టబోతున్నామన్న సంగతి తెలిసిందే. దీనికోసం ఈసరికే మనం గ్రాంటు రాసాం, దానికి ఆమోదం కూడా వచ్చేసింది. పుస్తక ప్రదర్శన ఇక 40 రోజుల్లోకి వచ్చేసింది. ఇక మనం సన్నాహకాలను మొదలుపెట్టాలి. గతంలో జరిగిన పుస్తక ప్రదర్శనల్లో అనేకసార్లు స్టాళ్ళు పెట్టి విజయవంతంగా నిర్వహించిన అనుభవజ్ఞులు మనకున్నారు. స్టాలు ఏర్పాటు గురించీ, దాని సన్నాహకాల గురించీ వారు ఈసరికే ఆలోచించుకుని ఉంటారు.

ఈసారి కొత్త అంశం - తెవికీ గురించిన పరిచయ పుస్తకం. వికీమీడియా ప్రాజెక్టులను పరిచయం చేసే పుస్తకాన్ని రూపొందించి, మన శక్తిమేరకు కాపీలను ముద్రించి ఉచితంగా పంచాలనేది మన సంకల్పం. ఈ పుస్తక రూపకల్పన గురించి గతంలో రచ్చబండలో రాసాను. ఈ పుస్తకపు ముందు వెనుక అట్టల రూపకల్పన గురించి చర్చించేందుకు ఇపుడు మరొక పేజీని తయారుచేసాను. వాడుకరులందరూ దాన్ని పరిశీలించి తమ తమ సూచనలు అభిప్రాయాలూ అక్కడే చెప్పవలసినదిగా అభ్యర్థన. __ చదువరి (చర్చరచనలు) 17:43, 9 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:14, 10 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వేరే వికీపీడియా నుండి బొమ్మలను తెచ్చే పరికరం

వేరే వికీపీడియాలో ఉన్న ఉచితం-కాని బొమ్మలను మనం వాడుకోవాలంటే, ముందు అక్కడి బొమ్మను మన కంప్యూటర్లోకి దింపుకుని ఆపై దాన్ని తెవికీలో ఎక్కించుకుని, తగు లైసెన్సును చేర్చి.. ఈ తతంగం చెయ్యాల్సి ఉంది. దీన్ని సులభతరం చేసే పరికరం ఒకదాన్ని తయారుచేసారు, దాని గురించి రచ్చబండ వార్తలులో ఒక సందేశం పెట్టారు, చూడవలసినది. నేను దాన్ని వాడి ఒక బొమ్మను ఎన్వికీ నుండి ఇక్కడికి తెచ్చాను. పని సులువుగా అయిపోయింది. పరిశీలించి చూదవలసినది. ఇలాంటి పరికరం ఒకదాన్ని గతంలో ఎక్కడో చూసినట్టు గుర్తు. దాని పనితీరు గురించి మనం గమనించినవాటిని ఆ సందేశం దగ్గరే రాద్దాం. __ చదువరి (చర్చరచనలు) 13:56, 10 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari గారూ నేను ఆన్లైను మీటింగులో పాల్గొన్నాను.అది పనిచేసే తీరును గురించి డెమో చూపించారు.ఇది మంచి టూల్. అన్ని భాషల వికీపీడియాలకు అందుబాటులోకి ఇంటర్ ఫేస్ ద్వారా తీసుకువస్తాం అని చెప్పారు, నేను Very good Tool అని చెప్పాను.తెలుగు వికీపీడియా నుండి పాల్గొన్నందుకు Thanks చెప్పారు. Tool కు మద్దతు కోరారు.పనిచేసే తీరు మాత్రం అర్థమైంది. అయితే నాకు ఇంకా పూర్తిగా అర్ధమయి ఉండకపోవచ్చు. యర్రా రామారావు (చర్చ) 14:20, 10 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari గారు, ఈ టూల్ మనకు చాలా ఉపయోగపడుతుందనుకుంటున్నాను. పరిశీలిస్తాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:13, 10 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదివరలో పవన్ గారు దీని గురించి ప్రస్తావించారు. * Wiki File Transfer -  https://wikifile-transfer.toolforge.org/ ఒకసారి ప్రయత్నం చేశాను. ఈ మధ్య గుర్తుకు రాలేదు. ఇది అనువాద వ్యాసాలలో ఫెయిర్ యూజ్ దస్తాలవిషయంలో ఉపయోగిస్తుంది అనుకుంటున్నాను. V.J.Suseela (చర్చ) 17:23, 12 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వికీవ్యాఖ్య లో సమస్యలు

వికీవ్యాఖ్య రచ్చబండ లో ఈ విషయాలు రాసాను కానీ అక్కడ ఎవరూ చూస్తున్నట్లు లేదు అందుకు ఇక్కడ రాయవలసి వచ్చింది . ధన్యవాదాలు V.J.Suseela (చర్చ) 09:06, 15 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Quick index వంటివి తయారు చేయాలి, ఇంకా ఒక అధికారి ఉంటే మొదటి పేజీ వంటివి సంరక్షించుకోగలము, దయచేసి అసక్తి గలవారు ఆ బాద్యత తీసుకొవలసినదిగా విన్నపం అలాగే వికి బుక్స్ కి కూడా ! . Kasyap (చర్చ) 15:02, 17 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. ఇది పరిశీలించవలసిన అంశం. --V.J.Suseela (చర్చ) 11:48, 21 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే తెలుగు విక్షనరీలో, సుమారు పదేళ్లుగా, ప్రతి "మార్చు" లింకు దగ్గర,  <small>  అని చూపుతోంది. ఉదా https://phabricator.wikimedia.org/T373879 Saiphani02 (చర్చ) 15:40, 21 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Saiphani02 గారూ, మీడియావికీ:Editsection పేజీలో ఉన్న <small>, </small> అనే ట్యాగులను తీసివేయాలి (ఇవి దిద్దుబాటు మోడ్‌లో కనిపిస్తాయి). దిద్దుబాటు అనుమతులున్నవారు ఆ పనిని చెయ్యాలి. __ చదువరి (చర్చరచనలు) 04:52, 22 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Sign up for the language community meeting on November 29th, 16:00 UTC

Hello everyone,

The next language community meeting is coming up next week, on November 29th, at 16:00 UTC (Zonestamp! For your timezone <https://zonestamp.toolforge.org/1732896000>). If you're interested in joining, you can sign up on this wiki page: <https://www.mediawiki.org/wiki/Wikimedia_Language_and_Product_Localization/Community_meetings#29_November_2024>.

This participant-driven meeting will be organized by the Wikimedia Foundation’s Language Product Localization team and the Language Diversity Hub. There will be presentations on topics like developing language keyboards, the creation of the Moore Wikipedia, and the language support track at Wiki Indaba. We will also have members from the Wayuunaiki community joining us to share their experiences with the Incubator and as a new community within our movement. This meeting will have a Spanish interpretation.

Looking forward to seeing you at the language community meeting! Cheers, Srishti 19:54, 21 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ అభివృద్ధి కోసం ఒక ప్రోగ్రామ్ అవకాశం - చర్చ

తెవికీ అభివృద్ధి కోసం ఉపయోగపడే ఒక ప్రోగ్రామ్ రూపకల్పన చేసి నిర్వహించేందుకు ఒక అవకాశం వచ్చింది. వికీమీడియా ఫౌండేషన్ వారి భాగస్వామ్యంతో గూగుల్ స్పాన్సర్ షిప్ ఉపయోగించి పనిచేయడానికి వీలున్న ఈ ప్రోగ్రామ్ విషయమై యూజర్ గ్రూపు చర్చా వేదికలో చర్చకు పెట్టాను. మీ మీ అభిప్రాయాలు తెలుపగలరు. పవన్ సంతోష్ (చర్చ) 09:05, 27 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Proposal to enable the "Contribute" entry point in Telugu Wikipedia

నమస్తే Telugu Wikipedians,

Apologies as this message is not in your language. Please help translate to your language.

The WMF Language and Product Localization team proposes enabling an entry point called "Contribute" to your Wikipedia.

The Contribute entry point is based on collaborative work with other product teams in the Wikimedia Foundation on Edit discovery, which validated the entry point as a persistent and constant path that contributors took to discover ways to contribute content in Wikipedia.

Therefore, enabling this entry point in your Wikipedia will help contributors quickly discover available tools and immediately click to start using them. This entry point is designed to be a central point for discovering contribution tools in TeluguWikipedia.

Who can access it

Once it is enabled in your Wikipedia, newcomers can access the entry point automatically by just logging into their account, click on the User drop-down menu and choose the "Contribute" icon, which takes you to another menu where you will find a self-guided description of what you can do to contribute content, as shown in the image below. An option to "view contributions" is also available to access the list of your contributions.

Mobile Contribute Page Mobile contribute menu (detailed)

For experienced contributors, the Contribute icon is not automatically shown in their User drop-down menu. They will still see the "Contributions" option unless they change it to the "Contribute" manually.

This feature is available in four Wikipedia (Albanian, Malayalam, Mongolian, and Tagalog). We have gotten valuable feedback that helped us improve its discoverability. Now, it is ready to be enabled in other Wikis. One major improvement was to make the entry point optional for experienced contributors who still want to have the "Contributions" entry point as default.          

We plan to enable it on mobile for Wikis, where the Section translation tool is enabled. In this way, we will provide a main entry point to the mobile translation dashboard, and the exposure can still be limited by targeting only the mobile platform for now. If there are no objections to having the entry point for mobile users from your community, we will enable it by 10th December 2024.

We welcome your feedback and questions in this thread on our proposal to enable it here. Suppose there are no objections, we will deploy the "Contribute" entry point in your Wikipedia.

We look forward to your response soon.

Thank you!

On behalf of the WMF Language and Product Localization team. UOzurumba (WMF) (చర్చ) 03:48, 28 నవంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన (2024-25), తెవికీ ప్రచారం

హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఈ సంవత్సరం 2024 డిసెంబర్, 19 నుండి 29 వరకు జరగనుంది. ప్రతిసంవత్సరం చేసినట్లుగానే తెలుగు వికీపీడియా సభ్యులు బుక్ ఫెయిర్ లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించనున్నారు. అయితే తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఈ ప్రచారం కొంత విస్తృతంగా నిర్వహించాలని, ఇంకా తెవికీ లక్ష వ్యాసాలు, వికీసోర్స్ 20000 వ్యాసాల మైలురాళ్లను దాటిన సందర్భంలో అభినందన కార్యక్రమం బుక్ ఫెయిర్ కేంద్ర వేదిక మీద నిర్వహించాలని ఉద్దేశ్యంతో సముదాయం నిర్ణయించినట్లుగా ఫౌండేషన్ నుంచి ఆర్ధిక సహకారం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము. ఈ ప్రాజెక్ట్ పేజి పరిశీలించి అక్కడ మీ సహకారాన్ని నమోదు చేయవలసినదిగా విన్నపం. (మెటాపేజీ)ఇక్కడ చూడవచ్చు. ధన్యవాదాలు.

V.J.Suseela (చర్చ) 07:24, 2 డిసెంబరు 2024 (UTC) (తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్)[ప్రత్యుత్తరం]

ఈ సంవత్సరం 2024 డిసెంబర్, 19 నుండి 29 వరకు జరిగే హైదరాబాద్ పుస్తక ప్రదర్శన లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించే కార్యక్రమం గురించి ఇంతకుముందే (2 డిసెంబరు 2024న) సముదాయానికి తెలియచేయడం జరిగింది. దీంట్లో భాగంగా తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాలు మైలు రాయి అధిగమించడం ఇంకా ఇతర ప్రాజెక్టుల ప్రచారం గురించి ఒక 45 నిముషాల పాటు (మనకు అంతే అవకాశం ఉంటుంది) సభను 26.12.2024 తేదీన సాయంత్రం 5.00 నుండి 5.45 వరకు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము.
పాల్గొనదలచిన వారు 15.12.2024 తేదీ లోపల ఇక్కడ సంతకం చేసి పాల్గొనగల రోజులు పేర్కొనవలసినది.
ధన్యవాదాలు. --V.J.Suseela (చర్చ) 09:44, 11 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు మేడం

చాలా మంచి ఆలోచన RATHOD SRAVAN (చర్చ) 07:45, 2 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 21వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

తెలుగు వికీమీడియా యూజర్ గ్రూప్ ఆధ్వర్యంలో వికీమీడియా ఫౌండేషన్, సిఐఎస్-ఎ2కె ల సహకారంతో 2025 ఫిబ్రవరి 14, 15, 16 తేదీలలో తిరుపతి లో తెవికీ పండగ-2025 (తెలుగు వికీపీడియా 21వ వార్షికోత్సవం) జరగబోతుంది. తెవికీ 21వ వార్షికోత్సవానికి హాజరయ్యే వారికి స్కాలర్‌షిప్ పొందే మంచి అవకాశం. ఈ పేజీ లో దరఖాస్తు ఫారానికి లింకు ఇవ్వబడింది. ఈ దరఖాస్తు 10 రోజుల పాటు (అంటే డిసెంబరు 13, 2024 దాకా) అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించాలి. ఆసక్తి ఉన్న సభ్యులందరూ (కమిటీ మెంబర్స్ తో సహా) అప్లై చేసుకోగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:35, 3 డిసెంబరు 2024 (UTC) (తెవికీ పండగ-2025-కమ్యూనికేషన్ & స్కాలర్ షిప్ కమిటీ నుండి)[ప్రత్యుత్తరం]

Please help translate to your language

Dear Wikimedians,

We are excited to Initiate the discussions about India’s potential bid to host Wikimania 2027, the annual international conference of the Wikimedia movement. This is a call to the community to express interest and share ideas for organizing this flagship event in India.

Having a consortium of a good number of country groups, recognised affiliates, thematic groups or regional leaders primarily from Asia for this purpose will ultimately strengthen our proposal from the region. This is the first step in a collaborative journey. We invite all interested community members to contribute to the discussion, share your thoughts, and help shape the vision for hosting Wikimania 2027 in India.

Your participation will ensure this effort reflects the strength and diversity of the Indian Wikimedia community. Please join the conversation on Meta page and help make this vision a reality!

Regards,
Wikimedians of Kerala User Group and Odia Wikimedians User Group
This message was sent with MediaWiki message delivery (చర్చ) by Gnoeee (talk) 15:14, 4 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

A2K Monthly Report – November 2024

Dear Wikimedians,

We’re excited to bring you the November edition of the CIS-A2K newsletter, highlighting our impactful initiatives and accomplishments over the past month. This issue offers a comprehensive recap of our events, collaborative projects, and community engagement efforts. It also provides a glimpse into the exciting plans we have lined up for the coming month. Stay connected with our vibrant community as we celebrate the progress we’ve made together!

In the Limelight
Tulu Wikisource
Dispatches from A2K
Monthly Recap
  • Learning hours Call
  • Dandari-Gussadi Festival Documentation, Commons Education Project: Adilabad
  • Executive Directors meeting at Oslo
Coming Soon - Upcoming Activities
  • Indic Wikimedia Hackathon 2024
  • Learning Hours

You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.

Warm regards, CIS-A2K Team MediaWiki message delivery (చర్చ) 16:46, 10 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలలో అసందర్భ తికమక పదాలు

కొత్త వ్యాసాలు సృష్టింపు నాకు తెలిసినంతవరకు తెవికీలో మూడు రకాలుగా జరుగుతుంది.మొదటిది తెవికీ అనువాద యంత్రం ద్వారా, ఆంగ్ల వ్యాసాలనుండి విజువల్ ఎడిటరులో పాఠ్యం కాపీచేసి, దానిని గూగుల్ ట్రాన్సులేట్ లో పేస్ట్ చేసి, అనువాదం అయిన పాఠ్యం మరలా కాపీ చేసి, వ్యాసంలో పేస్ట్ చేయటం రెండోపద్దతి అయితే, ఇక మూడవ పద్దతి పుస్తకాలలో, లేదా ఏదేని దిపత్రికలలలో సేకరించిన సమాచారం ద్వారా వ్యాసాలు సృష్టించటం.

నేను వ్యాసాలలో సవరణలు చేసేటప్పుడు కొన్ని వ్యాసాలలో అక్కడ వాక్యానికి తగిన పదాలు కాకుండా, అసందర్భ పదాలు, అర్ధం లేని తికమక పదాలు కొన్నిటిని గమనించుట జరిగింది. అయితే వాటిన్నిటిని నేను సరియైన పదాలకు సవరించాననుకోండి. అలాగే మరికొన్ని వ్యాసాలలో ఈ దిగువ వివరించిన పదాలు లేదా ఇతరత్రాపదాలు ఉండవచ్చు. ఈ పదాలు పూర్తిగా అనువాదయంత్రంద్వారా వచ్చినవా లేదా గూగుల్ ట్రాన్సులేట్ ద్వారా వచ్చినవా, లేదా ఏ వ్యాసాలలో వచ్చినవి అనే విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. రెండు విషయాలు చెప్పగలను.ఇవి ఎక్కువుగా పట్టికలలో వచ్చినవి. అలాగే ఏ ఆంగ్ల పదానికి ఈ తికమక పదాలు వచ్చినవి అనేది వివరించగలను. ఇంకొక సందర్భంలో ఆ పదాలు సరియైనవే కావచ్చు,కానీ అక్కడ ఆ వ్యాసంలో ఆ వాక్యం సందర్భానికి తగిన సరియైన పదం ఉంటేనే బాగుంటుంది.

ఆంగ్లపదం అనువాద పదం ఉండాలిసిన పదం వివరం
Adoor తలుపు ఆదూర్ కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని ఒక పట్టణం
Praful Patel డస్ట్ పటేల్ ప్రఫుల్ పటేల్ రాజకీయ నాయకుడు
Showaless K Shilla ప్రదర్శన లేని కె షిల్లా షోవేలెస్ కె షిల్లా ఒక రాజ్యసభ సభ్యుడు
Jagadambi Mandal జగదాంబి మండలం జగదాంబి మండల్ ఒక రాజ్యసభ సభ్యుడు (పేరు సందర్భంలో మండల్ అని ఉండాలి)
votes swing ఓట్లు ఊపుతాయి ఓట్స్ స్వింగ్ లేదా స్వింగ్ ఓట్స్ ఇలాంటి సందర్భంలో అలా రాస్తేనే బాగుంటుంది
Disqua (Disqualified) డిస్క్వల్ అనర్హత లేదా అనర్హుడు
Dissolved కరిగిపోయింది రద్దుఅయింది లేదా రద్దైంది
Incumbent నిటారుగా పదవిలో ఉన్న వ్యక్తి లేదా అధికారంలో ఉన్న వ్యక్తి లేదా ప్రస్తుతం
Acting నటన తాత్కాలిక లేదా తాత్కాలికం, ఆక్టింగ్ అనువదించిన పదం సరియైనదే కావచ్చు.అక్కడ సందర్భాన్ని బట్టి రాయాలి
14th ,15th 14వ, 15వ 14వ తేదీ, 15వ తేదీ
Akola చేసాడు అకోలా ఇది ఒక జిల్లా
Raigad కిరణాలు రాయిగఢ్ ఇది ఒక జిల్లా
Beed మంచం బీడ్ ఇది ఒక జిల్లా
Latur సోమరితనం లాతూర్ ఇది ఒక జిల్లా
రోమన్ అంకెలు వరస సంఖ్యలుగా ఉన్నచోట I ,  నేను గాను V ,  వి గానూ అనువదిస్తుంది.
res (సింపుల్ గా రాసారు) రెస్ రాజీనామా అని ఉండాలి resignation సందర్బంలో అలా రాసారు
bye (సింపుల్ గా రాసారు) బై ఉప ఎన్నిక అని ఉండాలి bye election సందర్భంలో అలా రాసారు

నాకు తెలిసినంతవరకు దీనికి ప్రధాన కారణం వ్యాసం సృష్ట్టించిన తరువాత ఒకసారి పరిశీలనాదృష్టితో చదివి సవరించకపోవటం అని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 02:29, 14 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలాంటివి చాల గమనించాను, రాసి పెట్టుకోలేక పోయాను. కనీసం నావ్యాసాలు పరీక్షించుదామని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంతకూ ముందే వాటిని సరిదిద్దుతే వారికీ ధన్యవాదాలు . V.J.Suseela (చర్చ) 08:35, 15 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@Vjsuseela గారూ కనీసం ఎవరు సృష్టించిన వ్యాసాలు ఒకసారి పరిశీలాదృష్టితో చూస్తే ఇలాంటి పదాలు చూద్దామన్నా కనపడవు. యర్రా రామారావు (చర్చ) 08:41, 15 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

37వ హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో తెవికీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

సభ్యులందరికి నమస్కారం. ఈనెల (డిసెంబర్ 2024) 19వతేదీ సాయంత్రం 4 గంటలకు 37వ హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో తెవికీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. (పుస్తకప్రదర్శన స్థలం - కాళోజీ కళాక్షేత్రం, NTR స్టేడియం, లోయర్ ట్యాంక్ బండ్, హైదారాబాద్). అందరూ పాల్గొనాల్సిందిగా  ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు.
తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్-- V.J.Suseela (చర్చ) 07:46, 18 డిసెంబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]