బిందు ఎ బంబాహ్
బిందు ఎ బంబాహ్ | |
---|---|
జననం | బిందు ఎ బంబాహ్ డిసెంబరు 19 1956 |
ఇతర పేర్లు | బిందు ఎ బంబాహ్ |
వృత్తి | ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాదు విశ్వవిద్యాలయం. |
ప్రసిద్ధి | భౌతిక శాస్త్రవేత్త |
వెబ్‌సైటు | |
http://sop.uohyd.ernet.in/~bindu/ |
బిందు అనుభా బంబాహ్ భారత డేసానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఈమె చికాగోలో 1983 న పి.హెచ్.డిని పూర్తి చేశారు. ప్రస్తుతం స్కూల్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఈమె UNESCO వారి ద్వారా యంగ్ సైంటిస్ట్ అవార్డును పొందారు. ఆమె పి.ఎం.ఎస్.బ్లాకెట్ట్ స్కాలషిప్ ను కూడా పొందుతున్నారు. ఈమె థియరీటికల్ హై ఎనర్జీ ఫిజిక్స్, డైనకిక్స్ సిస్టమ్స్ రంఆలలో పరిశోధనలు చేస్తున్నారు.
ఈమె డిసెంబరు 19 1956 న జన్మించారు.ఆమెకు బాల్యంలో విజ్ఞాన శాస్త్రం పై అభిరుచి కలగడానికి వివిధ సంఘటనలు దోహదపడ్డాయి.10 సంవత్సరాల వయస్సులో అనగా 1967 లో డా.క్రిస్టియన్ బెర్నాడ్ గుండె మార్పిడి చేయు విషయాన్ని తెలుసుకొన్నప్పుడు ఆమెకు మొదటి సారి శాస్త్రీయ పద్ధతి గూర్చి అనుభవం ఏర్పడింది. అపుదు తన తరగతిలో వారి జీవశాస్త్ర ఉపాధ్యాయులు సెస్సికా కెల్లర్ పంది గుండెను తెచ్చి అందలి భాగాలు పనిచేయు విధానము గూర్చి తెలియజేయుటను చూసి ఆమెకు విజ్ఞాన శాస్త్రం పై అద్భుత భావన కలిగింది. 1969 లో చంద్రునిపై మొట్టమొదట మానవుడు అడుగుపెట్టే సంఘటన ఆమెకు ప్రకృతిలో భౌతిక శాస్త్ర ప్రభావము పై ప్రేరణ కలిగింది. ఉన్నత పాఠశాల అనంతరం వారి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులైన సిస్టర్ విన్‌సెంట్ క్వాంటం మెకానిక్స్ ను శాస్త్రీయ దృక్పధంతో వివరించుటం, వారి రసాయన శాస్త్రోపాధ్యాయులు ప్యారా సింగ్ బెంజీన్ అణునిర్మాణంలో కెలులే వివరించిన పాముల కథ వంటివి ఆమెలో విజ్ఞాన తృష్ణను పెంచాయి.
విద్య
[మార్చు]పాఠశాల విద్యానంతరం ఆమె ఉన్నత విద్యకు సైన్స్ కోర్సు ఎంచుకుంది. తర్వాత ఆమె స్వంత పట్టణంలో గల పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్ చేయాలనుకుంది. ఆమెకు నేషనల్ టాలెంట్ సెర్చే పరీక్షలలో విజయం సాధించిన అనంతరం బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (బిట్స్), పిలానీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ లలో ఇంటెగ్రేటెడ్ ప్రోగ్రాములలో పాల్గొనుటకు అవకాశాలు వచ్చినవి.
- 1977 : బి.యస్సీ ఆనర్స్, పంజాబ్ విశ్వవిద్యాలయం, చంఢీగర్ . (ఫస్ట్ క్లాస్ గోల్డ్ మెడల్)
- 1978 : ఎం.యస్సీ ఆనర్స్, పంజాబ్ విశ్వవిద్యాలయం, చంఢీగర్ (ఫస్ట్ క్లాస్ గోల్డ్ మెడల్)
- 1983 : పి.హెచ్.డి, ఎన్రికో ఫెర్మి ఇనిస్టిట్యూట్, చికాగో విశ్వవిద్యాలయం. (2008 నోబెల్ బహుమతి విజేత యోచిరో నంబూ గారి అధ్వర్యంలో)
ఉద్యోగాలు
[మార్చు]- 1983 : పోస్ట్ డాక్టరల్ ఫెలో (జూలై 83 నుండి నవంబరు 83)
- 1984 - 85 : విసిటింగ్ శాస్త్రవేత్త, ICTP, ట్రిస్టే, ఇటలీ
- 1985 - 86 :మద్రాసు విశ్వవిద్యాలయంలో యు.జి.ఓ సైంటింస్ట్ ఎ (లెక్చర్)
- 1986 - 89 : చంఢీగర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో యు.జి.ఓ సైంటింస్ట్ ఎ (లెక్చర్)
- 1989 - 90 : జెనీవా లోని CERN లో సైంటిఫిక్ అసోసియేట్.
- 1990 - 91 : చంఢీగర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో యు.జి.ఓ సైంటింస్ట్ బి (రీడర్)
- 1991 - 93 : హైదరాబాదు విశ్వవిద్యాలయంలో యు.జి.ఓ సైంటింస్ట్ ఎ (లెక్చర్)
- 1993 - 98 : హైదరాబాదు విశ్వవిద్యాలయంలో రీడర్.
- 1998 - 99 : చంఢీగర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఆఫ్ అప్లైడ్ మాధమెటిక్స్.
- 1999 నుండి : హైదరాబాదు విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో ప్రొఫెసర్.
- 2008 నుండి : సెంటర్ ఫర్ వుమెన్ స్టడీస్ కు జాయింట్ ప్రొఫెసర్
- అధిక శక్తి భౌతిక శాస్త్రము
- గ్రూప్ థియరీ
- విజ్ఞాన శాస్త్ర తత్వ చరిత్ర
- శాస్త్రరంగలలో మహిలలు
- డైనకికల్ సిస్టమ్స్
- కృష్ణ బిలం ఎనలాగస్ ఇన్ లాబ్
అవార్డులు
[మార్చు]- 1973 : నేషనల్ సైన్స్ టాలెంట్ స్కాలర్‌షిప్-1973, జాతీయ ర్యాంకు 10
- 1978 : రోడ్స్ ఇన్‌లాక్స్ ఫెలోషిప్.
- 1989 : ఎనిస్, ఇటలీ వారిచే "పి.ఎ.ఎస్.బ్లాకెట్ట్ స్కాలర్‌షిప్"
- 1990 : UNESCO, ROSTCA, వారు యంగ్ సైంటిష్ట్ అవార్డు.
గౌరవాలు
[మార్చు]సూచికలు
[మార్చు]- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా
వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు.
- ↑ ఆమె జీవిత విశేషాలు
- ↑ "ఆమె పనిచేసే రంగాలు". Archived from the original on 2014-03-03. Retrieved 2013-09-04.