Jump to content

రాజేశ్వరీ ఛటర్జీ

వికీపీడియా నుండి
(రాజేశ్వరి ఛటర్జీ నుండి దారిమార్పు చెందింది)
రాజేశ్వరీ చటర్జీ
Rajeswari Chatterjee
దస్త్రం:Rajeshwari Chatterjee image.jpg
జననం(1922-01-24)1922 జనవరి 24
మరణం2010 సెప్టెంబరు 3(2010-09-03) (వయసు 88)
పౌరసత్వంభారతీయురాలు
జాతీయత Indian
రంగములుమైక్రోవేవ్ ఇంజినీరింగ్
వృత్తిసంస్థలుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
చదువుకున్న సంస్థలుమైసూర్ విశ్వవిద్యాలయం
మిచిగన్ విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)విలియం జి. దోవ్‌
ముఖ్యమైన పురస్కారాలుముమ్మడి కృష్ణరాజాయ్యర్ అవార్డు

ప్రొఫెసర్ రాజేశ్వరీ చటర్జీ M.Sc., Ph.D. (ఆంగ్లం: Rajeswari Chatterjee) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేసిన ఒకేఒక్క మహిళా ప్రొఫెసర్.

బాల్యం, విద్య

[మార్చు]

ఛటర్జీ 1922 జనవరి 24 న కర్ణాటకలో జన్మించింది. మైసూరు నుండి గ్రాడ్యుయేట్ అయిన తొలి మహిళా గ్రాడ్యుయేట్లలో ఒకరైన కమలమ్మ దాసప్ప (రాజేశ్వరి ఛటర్జీ అమ్మమ్మ) స్థాపించిన "స్పెషల్ ఇంగ్లీష్ స్కూల్ "లో ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఆమె అమ్మమ్మ అప్పట్లో మైసూర్ రాష్ట్రంలో డిగ్రీ చదవడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేది. రాజేశ్వరిపై ఆమె ప్రభావం చాలా ఉండేది. ఆమె తన బి.ఎస్సి డిగ్రీని సెంట్రల్ కాలేజ్, బెంగళూర్ నుండి 1939లో పొందినది. ఎం.ఎస్సి మైసూర్ యూనివర్సిటీ ద్వారా పొందినది. ఈమె బి.ఎస్సిలో పస్ట్ ర్యాంకుకు గాను ముమ్మడి కృష్ణరాజాయ్యర్ అవార్డు పొందినది. ఎం.ఎస్సిలో పస్ట్ ర్యాంకుకు గాను నారాయణ అయ్యంగార్ అవార్డు పొందినది. 1945, 1947 మద్య కాలంలో బ్రిటిష్ గవర్నమెంట్ నుండి డిల్లీ గవర్నమెంట్ బాగా చదివే విద్యార్థుల కొరకు విదేశాలకు వెళ్ళి చదువుకొనేందుకు ఉద్దేశించిన స్కాలర్షిప్ హక్కులు పొందినది. దని ద్వారా ఆమె ఎలక్ట్రానిక్స్, దాని అనుభందకాలు అనే దానిపై ఆ స్కాలర్ షిప్ పొంది మిచిగాన్ యూనివర్సిటీలో ప్రవేశం పొందినది. అప్పటి పరిస్థితులలో మహిళకు చదువుకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతుండేవి. ఆమె తన అమెరికా ప్రయాణం కొరకు 30 రోజులు సింగపూర్ మీదుగా సముద్రం మీద ప్రయాణం చేసి మిచిగాన్ చేరినది. ఆమె తన మాస్టర్ డిగ్రీని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 1947లో పొందినది. తదనంతరం ఆమె భారతీయ ప్రభుత్వ అదేశానుసారం తన ట్రైనింగ్ నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్, వాషింగ్‌టన్ డి.సి.లోని రెడియో ప్రీక్వెన్‌సీ కొలతల విభాగంలో 1949లో ఎనిమిది నెలలు పనిచేసింది. తరువాత ఆమె తిరిగి మిచిగాన్ వచ్చి తన పి.హెచ్.డి. కొరకు ప్రొఫెసర్ విలియం జి. దోవ్‌తో కలసి పనిచేసి 1953లో పి.హెచ్.డి. సాధించింది.

ప్రయోగాలు, ఉద్యోగాలు

[మార్చు]

ఆమె తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఐ.ఐ.సి.ఎస్.) లో ఫేకల్టీగా చేరింది. చాలా సంవత్సరాలుగా పరిచయం ఉండి అక్కడే ఫేకల్టీగా పనిచేస్తున్న శిశిర్‌కుమర్‌ చటర్జీను పెళ్ళిచేసుకొన్నది. అలా ఆమె రాజేశ్వరీ చటర్జీగా మారినది. ఐ.ఐ.సి.ఎస్.లో పనిచేసిన ఒకే ఒక్కస్త్రీ ఆమె మాత్రమే. మైక్రోవేవ్ ఇంజనెరింగ్ విభాగంలో ఆమె భర్తతో కలసి ప్రప్రథమంగా భారతదేశంలో రీసెర్ఛ్, బోధన ప్రారంభించింది. ఆ కాలంలో వారు రీసెర్చ్ కోసం ఒక లాబొరేటరీ కూడా స్థాపించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 20 మంది విద్యార్థులకు పి.హెచ్డి పట్టాలు వచ్చేందుకు శిక్షణైచ్చారు.

విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని బోధిస్తూ, ఎలక్ట్రాన్ ట్యూబ్ సర్క్యూట్లు, మైక్రోవేవ్ టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తూ, ఆమె 20 మంది పిహెచ్డి విద్యార్థులకు మార్గనిర్దేశం చేసింది, 120 కి పైగా పరిశోధనా పత్రాలను, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, యాంటెన్నాస్పై ఏడు పుస్తకాలను ప్రచురించింది. ఆమె చేసిన సేవలకు గాను ఆమె అనేక అవార్డులను గెలుచుకుంది. 1982 లో పదవీ విరమణ చేసిన తరువాత, ఆమె ఇండియన్ అసోసియేషన్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ లో సామాజిక కార్యక్రమాలలో పాల్గొంది.[1]

రాజేశ్వరి ఛటర్జీ 2010 సెప్టెంబరు 3 న మరణించింది.

అవార్డులు

[మార్చు]

మైక్రోవేవ్ ఇంజనీరింగ్ రంగంలో ఛటర్జీ అందించిన సేవలకు అనేక అవార్డులు, గుర్తింపు లభించాయి.[2]

  • ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ద్వారా బెస్ట్ రీసెర్చ్ పేపర్‌కు గాను లార్డ్ మౌంట్‌బాటన్ బహుమతి.
  • * ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ద్వారా బెస్ట్ రీసెర్చ్ పేపర్‌కు గాను జె.సి.బోస్ మొమొరియల్ బహుమతి.
  • రీసెర్చ్, శిక్షణ కొరకు రాం లాల్ వాద్వా అవార్డు.

రచనలు

[మార్చు]

రాజేశ్వరీ ఛటర్జీ రాసిన పుస్తకాలు.[3]

  • ఎలెమెంట్స్ ఆఫ్ మైక్రోవేవింగ్ ఇంజనీరింగ్.
  • యాంటెనా థియరీ, ప్రాక్టీస్
  • ఏ థౌసండ్ స్ట్రీమ్స్: ఎ పర్సనల్ హిస్టరీ
  • డైఎలెక్ట్రిక్ అండ్ డై ఎలక్ట్రిక్ లోడెడ్ యాంటెనాస్
  • అడ్వాన్స్డ్ మైక్రోవేవ్ ఇంజినీరింగ్: స్పెషల్ అడ్వాన్స్డ్ టాపిక్స్
  • వసుధైవ కుటుంబకం: ది హోల్ వరల్డ్ ఈజ్ బట్ వన్ ఫ్యామిలీ: రియల్ స్టోరీస్ ఆఫ్ సమ్ ఉమెన్ అండ్ మెన్ ఆఫ్ ఇండియా
  • యాంటెన్నాస్ ఫర్ ఇన్ఫర్మేషన్ సూపర్ స్కైవేస్: యాన్ ఎక్స్పోజిషన్ ఆన్ అవుట్ డోర్ అండ్ ఇండోర్ వైర్ లెస్ యాంటెన్నా, పెరంబూర్ ఎస్. నీలకంఠ సహ-రచయిత.

ఇతర విశేషాలు

[మార్చు]
  • రాజెశ్వరీ చటర్జీకి ఇందిరాచటర్జీ అనే కుమార్తె ఉంది. ఈమె నోయిడా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
  1. Aiyer, Chitra. "Karnataka's First Woman Engineer: Remembering Her Remarkable Life And Work". Swarajyamag (in ఇంగ్లీష్). Retrieved 2022-04-16.
  2. "All You Need to Know About Late Rajeshwari Chatterjee, One of India's First Women Engineers". The Better India (in ఇంగ్లీష్). 2017-07-27. Retrieved 2022-04-16.
  3. Bahukhandi, Shivani (2017-09-12). "Rajeshwari Chatterjee: First Woman Engineer From Karnataka | #IndianWomenInHistory". Feminism In India (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-04-16.