సుధేష్ణ సిన్హా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వృత్తిమహిళా శాస్త్రవేత్త

సుధేష్ణ సిన్హా తల్లితండ్రులు ఆడపిల్లలను మగపిల్లలతో సనానంగా భావించారు. ఆమె తల్లితండ్రులు ఆమెకు తగిన స్వతంత్రం ఇస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం నేర్పారు. చిన్న వయసులోనే ఆమె తన అవకాశాలను సద్వినియోగపరచడం ఎలాగో నేర్చుకున్నది.

కాలేజ్[మార్చు]

ఐ.ఐ.టిలో అవకాశం లభించగానే సుధేష్ణ సిన్హా ఉద్వేగభరితమైన ఆనందానికి లోనైంది. ఐ.ఐ.టిలో సుధేష్ణ సిన్హా సెక్షన్లో 40 మంది విద్యార్థులలో ఆమె ఒక్కటే మహిళా విద్యార్థిని. ఇది ఆమెను కాలేజ్ సమయంలో ఒంటరితనం, స్వల్పంగా కఠినత్వం అలవడేలాచేసింది. ఆమె అధ్యయనంలో తన స్వంత వనరుల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఎదురైంది.అందువలన కొన్ని సమస్యలు ఎదురైయాయి.

వివాహం[మార్చు]

సుధేష్ణ సిన్హా " టి.ఐ.ఎఫ్.ఆర్ "లో ఉన్నప్పుడు ఆమె తన భర్తను కలుసుకున్నది. ఆమె భర్త ఆమెను చక్కగా అర్ధం చేదుకున్నాడు. వృత్తిరీత్యా ఆమె లక్ష్యం నెరవేరక పోచడం కొంత అసంతృప్తికి గురిచేసినా భర్త మాత్రం పూర్తి సహకారం అందించాడు. సుధేష్ణ సిన్హాను ఆమె భర్త ఎప్పుడూ ఉత్సాహపరిస్తూ వృత్తిరీత్యా సహకారం అందిస్తూ వచ్చాడు. కుమార్తె పుట్టిన తరువాత సుధేష్ణ సిన్హా 4 సంవత్సరాలకాలం కుమార్తె పెంపకం పైన దృష్టికేంద్రీకరించింది. మొదటి 8 మాసాల కాలం ఉద్యోగానికి శలవు పెట్టి తరువాత ఆమె తన ఉద్యోగంలో తిరిగి ప్రవేశించింది. అయినప్పటికీ ఆమె మనసు కుమార్తె చుట్టూ తిరగడంతో అధ్యయనం, వృత్తిబాధ్యతలలో పైకి కనిపించని అడ్డంకి ఉండిపోయింది. అయినప్పటికీ ఆమె సమయం విలువతెలుసుకుని వృత్తి, విద్యలలో ముందుకుపోవడానికి ఆమె ప్రయత్నం కొనసాగించింది.

రీసెర్చ్[మార్చు]

కుటుంబాధ్యతలు ఒంటరిగా అధ్యయనం కొనాసాగించడం కారణంగా సుధేష్ణ సిన్హా వృత్తిపరంగా కొన్ని విమర్శలను ఎదుర్కొనవససిన పరిస్థితులకు దారితీసింది.ఆమెలో నిర్మాణాత్మకమైన సహాధ్యాయులు ఆమెను సరైనపోటీగా భావించక పోవడాన్ని ఆమె తేలికగా తీసుకున్నది. మహిళా పోటీతతత్వం, నిర్వహణా సామర్థ్యం, కఠినశ్రమ గుర్తించబడినా వారి మేధాశక్తికి మాత్రం గుర్తింపు తక్కువేనన్నది ఆమె భవన. .

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.