Coordinates: 13°12′00″N 79°07′00″E / 13.2000°N 79.1167°E / 13.2000; 79.1167

చిత్తూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 181: పంక్తి 181:
|5
|5
|ఉన్నత కళాశాలలు
|ఉన్నత కళాశాలలు
|పి.వి.కే.న్.డిగ్రీ&పి.జి.కళాశాల,
|
|
|
|- bgcolor=#DDEECE
|- bgcolor=#DDEECE
పంక్తి 202: పంక్తి 202:
జిల్లాకు పశ్చిమ భాగమున ఉన్న '''[[గుర్రంకొండ]]''' ఒక చారిత్రక ప్రదేశము. ఇక్కడ ఒక పాత కోట మరియు రంగిన్ మహల్ అనబడే సుల్తాన్ యొక్క ప్యాలెస్ ఉన్నాయి. [[ఆర్ధ్రగిరి]] మరియు [[చంద్రగిరి]] జిల్లాలోని ఇతర చెప్పుకోదగిన ప్రదేశములు.
జిల్లాకు పశ్చిమ భాగమున ఉన్న '''[[గుర్రంకొండ]]''' ఒక చారిత్రక ప్రదేశము. ఇక్కడ ఒక పాత కోట మరియు రంగిన్ మహల్ అనబడే సుల్తాన్ యొక్క ప్యాలెస్ ఉన్నాయి. [[ఆర్ధ్రగిరి]] మరియు [[చంద్రగిరి]] జిల్లాలోని ఇతర చెప్పుకోదగిన ప్రదేశములు.
|- bgcolor=#DDEECE
|- bgcolor=#DDEECE
|909:23, 17 ఆగష్టు 2014 (UTC)~~
|9
|వైద్య కళాశాలలు
|వైద్య కళాశాలలు
|బి టి కళాశాల, కృష్ణతేజ డెంటల్ కాలేజ్
|బి టి కళాశాల, కృష్ణతేజ డెంటల్ కాలేజ్

09:23, 17 ఆగస్టు 2014 నాటి కూర్పు

  ?చిత్తూరు జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
View of చిత్తూరు జిల్లా, India
View of చిత్తూరు జిల్లా, India
అక్షాంశరేఖాంశాలు: 13°12′00″N 79°07′00″E / 13.2000°N 79.1167°E / 13.2000; 79.1167
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 15,152 కి.మీ² (5,850 చ.మై)
ముఖ్య పట్టణం చిత్తూరు
ప్రాంతం రాయలసీమ
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
41,70,468 (2011 నాటికి)
• 275/కి.మీ² (712/చ.మై)
• 2083505
• 2086963
• 67.46 (2001)
• 78.29
• 56.48


చిత్తూరు భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక పట్టణము మరియు జిల్లాకేంద్రం. చిత్తూరుజిల్లా రాయలసీమలో ఒక భాగం. చిత్తూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌కు దక్షిణాన తమిళనాడు సరిహద్దులలో ఉంది. చిత్తూరుకు పశ్చిమాన తమిళనాడు జిల్లాలైన అయిన ఆర్కాట్ మరియు ధర్మపురి,కర్ణాటక జిల్లా అయిన కోలార్ జిల్లా, తూర్పున తమిళ నాడు జిల్లాలైన అణ్ణా మరియు చెంగై జిల్లాలు, ఉత్తరాన వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల మధ్య ఉన్నది. జిల్లాను రెండు సహజ విభాగాలుగా విభజించ వచ్చు. ఒకటి కొండలు లోయలతో కూడిన మదనపల్లి విభాగం, రెండవది మైదాన ప్రాంత మండలాలతో కూడిన పుత్తూరు విభాగం.తిరుపతి, కాణిపాకం మరియు శ్రీ కాళహస్తి దేవాలయాలకు ప్రసిద్ధి. ఇది ధాన్యములు, చెరకు, మామిడి, మరియు వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనె గింజలు మరియు బియ్యం మిల్లింగ్‌ పరిశ్రమలు కలవు.

ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ మండలాలు మరియు గ్రామాలు గలిగిన జిల్లా చిత్తూరు జిల్లా.

జిల్లా చరిత్ర

చిత్తూరు జిల్లా ఏప్రిల్ 1, 1911 సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పటి ఉత్తర ఆర్కాట్ లో తెలుగు మాట్లాడే కొన్ని తాలూకాలు, కడప జిల్లా నుంచి మరి కొన్ని తాలూకాలు, నెల్లూరు జిల్లా నుంచి మరికొన్ని తాలూకాలు కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. 2011 ఏప్రిల్ 1 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 19వ శతాబ్దపు ప్రారంభం నుంచి ఉత్తర ఆర్కాట్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఒక వైపు కర్ణాటక కు, మరో వైపు తమిళనాడుకు దగ్గరగా ఉండటంతో తెలుగుతో బాటు, తమిళం, కన్నడ భాషలు కూడా విస్తృతంగా వాడుతుంటారు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలైన వారు దీన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విజయనగర సామ్రాజ్యం కాలంలో చంద్రగిరి కేవలం ప్రధాన కేంద్రంగానే కాక కొన్నాళ్ళు రాజధానిగా కూడా విలసిల్లింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇది పాలెగాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. చిత్తూరు, చంద్రగిరి ప్రాంతాల్లోనే పదిమంది పాళెగాళ్ళు అధికారం చెలాయించే వాళ్ళు. ఆర్కాటు నవాబు ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి చూసినపుడు మైసూరు నవాబులు హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ చిత్తూరును తమ వశం చేసుకోవడానికి ప్రయత్నించారు. హైదరాలీ గుర్రంకొండ నవాబు కుమార్తె అయిన ఫకృన్నిసాను వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ జన్మించిన వాడే టిప్పు సుల్తాన్. రెండవ మైసూరు యుద్ధం జరుగుతుండగా చిత్తూరు దగ్గర్లోని నరసింగరాయనిపేట దగ్గర హైదరాలీ డిసెంబరు 6, 1782 లో క్యాన్సర్ సోకి మరణించాడు. ఆర్కాటు నవాబుల పరిపాలనలో చిత్తూరు ఖిల్లా గానూ, దానికి మొహమ్మద్ అలీ సోదరుడు అబ్దుల్ వహాబ్ ఖిల్లాదారు గానూ ఉండేవాడు. అతని దగ్గర సైనికుడుగా చేరిన హైదరాలీ తర్వాత అతన్నే ఓడించి మైసూరుకు బందీగా తీసుకుని వెళ్ళాడు.

చిత్తూరు జిల్లా ప్రముఖులు

ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి ఉద్భవించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేసిన పి. ఆనందాచార్యులు ఈ జిల్లాకు చెందిన వాడే. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లె లో జన్మించాడు. ప్రముఖ విద్యావేత్త, పండితుడు, కవి, సాహిత్య విమర్శకుడు, చక్కటి నిర్వహకుడు, వోల్టేర్ తో పోల్చదగిన సర్ సీఆర్ రెడ్డి చిత్తూరు వాసే. 18 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ చిత్తూరు జిల్లా వాసి. మా తెలుగు తల్లికి గేయం రచించిన శంకరంబాడి సుందరాచారి ఈ జిల్లాకు చెందిన వాడే. మాజీ లోక్‌సభ స్పీకర్, బీహార్ మాజీ గవర్నర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమరయోధులు పార్థసారథి అయ్యంగార్, పాపన్న గుప్తా, నూతి రాధాకృష్ణ మొదలైన వారు చిత్తూరు జిల్లాకు చెందిన ఆణిముత్యాలు.

చారిత్రిక/పర్యాటక ప్రదేశములు

చిత్తూరు జిల్లాకి చెందిన చంద్రగిరి కోట, గుర్రంకొండ, ఆవులకొండ, పుంగనూరు కోట లు చారిత్రక ప్రసిద్ధి గాంచినవి. ప్రసిద్ధి గాంచిన ఋషీ వ్యాలీ పాఠశాల, ఆసియాలోనే అతిపెద్ద చికిత్సా కేంద్రమైన మదనపల్లె కు సమీపంలో ఉన్న ఆరోగ్యవరం జిల్లాకు తలమానికం. దక్షిణాదికి చెందిన శాంతినికేతన్ గా పిలవబడే థియసోఫికల్ కళాశాల మదనపల్లె లో ఉంది. ఇది రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటి కళాశాల గా పేరు గాంచింది. 1919 లో ఈ కళాశాల సందర్శనకు వచ్చిన రవీంద్ర నాథ్ ఠాగూర్ జనగణమణ గీతాన్ని ఇక్కడే ఆంగ్లంలోకి అనువదించాడు. ప్రస్తుతం జనగణమణ పాడుతున్న రాగాన్ని ఇక్కడే కూర్చడం జరిగింది. అలా జాతీయగీతానికి తుదిరూపునిచ్చిన ప్రాంతంగా ఈ ప్రాంతం చరిత్ర ప్రసిద్ధి గాంచింది. ఆంధ్రప్రదేశ్ లో వేసవి విడిది ఉన్న ఏకైక ప్రాంతం చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్. ఇది ఆంధ్ర రాష్ట్ర గవర్నరుకు అధికారిక వేసవి విడిది కేంద్రం కూడా.[1]

భౌగోళిక స్వరూపం

జిల్లాకు వాయవ్యమున అనంతపురం జిల్లా, ఉత్తరాన వైఎస్ఆర్ జిల్లా, ఈశాన్యమున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా , దక్షిణమున తమిళనాడు రాష్ట్రము మరియు నైఋతి దిక్కున కర్ణాటక రాష్ట్రము సరిహద్దులుగా కలవు. రాష్ట్రములో బాగా వెనుకబడి ఉన్న ప్రాంతములలో ఈ జిల్లా ఒకటి. చిత్తూరు పట్టణము చుట్టుపక్కల మామిడి తోటలు మరియు చింత తోపులు విస్తారముగా కలవు. జిల్లా, పశుసంపదకు కూడా ప్రసిద్ధి చెందినది.


నదులు

ఆర్ధిక స్థితిగతులు

పరిశ్రమలు

చిత్తూరు జిల్లాలో మ్యాంగో పల్ప్ పరిశ్రమ ప్రధానంగా ఉంది. చిత్తూరు జిల్లా వేరుశనగ, మామిడి, చెఱకు పంటలు విశేషంగా పండుతాయి, గ్రానైట్ పరిశ్రమ వేళ్ళూనుకుంది. రేణిగుంటలో ఎలాయ్ కాస్టింగ్, ఎస్వి షుగర్స్, అశ్వినీ ఫార్మసీ, సెమీ గవర్నమెంట్ మింటు ఫ్యాక్టరీ ఉన్నాయి. చిత్తూరులో విజయా మరియు గోపిక మిల్క్ డైరీ, శ్రీనివాస డిస్టిల్లరీస్, కోపరేటివ్ షుగర్స్, న్యూట్రిన్ చాక్ లెట్ కంపనీతహ ఉన్నాయి. చిత్తూరు జిల్లా 21148 కుటీర పరిశ్రమలు ఉన్నాయి. అమరరాజా బయాటరీ కంపనీ ఉంది. చిత్తూరు జిల్లాలో 101 కంపనీలు ఉన్నాయి. బంగారుపాలెంలో ఫుడ్ ప్రొసెసింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తి కేంద్ర ఏర్పాటు జరుగుతుంది. నాలుగు సహకార చక్కెర మిల్లులు, రెండు యాజమాన్య చక్కెర మిల్లులు ఉన్నాయి. లాంకో ఇండస్ట్రీలు, స్పాంజ్ ఐరన్, జైన్ ఇరిగేషన్, ఐదు డైరీలు ఉన్నాయి. రహదారి, రైలు, విమాన రవాణా సదుపాయాలు ఉన్న కారణంగా చిత్తూరు జిల్లా పరిశ్రమలకు అనుకూలంగా ఉంది.

డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు

పాలనా విభాగాలు

రెవెన్యూ డివిజన్లు
  1. చిత్తూరు.
  2. తిరుపతి.
  3. మదనపల్లె.
విద్యారంగ డివిజన్లు

1. చిత్తూరు. 2. తిరుపతి. 3. మదనపల్లె. 4. పుత్తూరు.

నగరపాలక సంఘాలు (కార్పోరేషన్)

1. తిరుపతి. 2 చిత్తూరు.

పురపాలక సంఘాలు (మునిసిపాలిటీలు)

1. మదనపల్లె. 2. శ్రీకాళహస్తి. 3. పుంగనూరు. 4. పలమనేరు. 5. పుత్తూరు. 6. నగరి

  • మండలాల సంఖ్య: 66
  • గ్రామాల సంఖ్య 1399

భౌగోళికంగా చిత్తూరు జిల్లాను 66 రెవిన్యూ మండలములుగా విభజించినారు[2].

చిత్తూరు జిల్లా మండలాలు
1 పెద్దమండ్యం 23 కె.వీ.పీ.పురం 45 నగరి
2 తంబళ్లపల్లె 24 నారాయణవనం 46 కార్వేటినగరం
3 ములకలచెరువు 25 వడమాలపేట 47 శ్రీరంగరాజపురం
4 పెద్దతిప్ప సముద్రం 26 తిరుపతి గ్రామీణ 48 పాలసముద్రం
5 బీ.కొత్తకోట 27 రామచంద్రాపురం 49 గంగాధర నెల్లూరు
6 కురబలకోట 28 చంద్రగిరి 50 పెనుమూరు
7 గుర్రంకొండ 29 చిన్నగొట్టిగల్లు 51 పూతలపట్టు
8 కలకడ 30 రొంపిచెర్ల 52 ఐరాల
9 కంభంవారిపల్లె 31 పీలేరు 53 తవనంపల్లె
10 యెర్రావారిపాలెం 32 కలికిరి 54 చిత్తూరు
11 తిరుపతి పట్టణ 33 వాయల్పాడు 55 గుడిపాల
12 రేణిగుంట 34 నిమ్మన్నపల్లె 56 యాదమరి
13 యేర్పేడు 35 మదనపల్లె 57 బంగారుపాలెం
14 శ్రీకాళహస్తి 36 రామసముద్రం 58 పలమనేరు
15 తొట్టంబేడు 37 పుంగనూరు 59 గంగవరం
16 బుచ్చినాయుడు ఖండ్రిగ 38 చౌడేపల్లె 60 పెద్దపంజని
17 వరదయ్యపాలెం 39 సోమల 61 బైరెడ్డిపల్లె
18 సత్యవీడు 40 సోదం 62 వెంకటగిరి కోట
19 నాగలాపురం 41 పులిచెర్ల 63 రామకుప్పం
20 పిచ్చాటూరు 42 పాకాల 64 శాంతిపురం
21 విజయపురం 43 వెదురుకుప్పం 65 గుడుపల్లె
22 నింద్ర 44 పుత్తూరు 66 కుప్పం
లోక్‌సభ స్థానాలు (2)
శాసనసభ స్థానాలు (14)

2007 లో జరిగిన డీలిమిటేషన్ వలన క్రొత్తగా విలీనాలు చేయబడిన నియోజక వర్గాలు.

  • గమనిక : క్రింద ఇవ్వబడిన నియోజకవర్గాలను నొక్కినచో, నేరుగా ఆయా అసెంబ్లీవర్గాల పేజీలలో వెళ్ళవచ్చును. ఎడమవైపున ఇవ్వబడిన సంఖ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల క్రమసంఖ్య.

281. తంబళ్ళపల్లె, 282. పీలేరు, 283. మదనపల్లె, 284. పుంగనూరు, 285. చంద్రగిరి, 286. తిరుపతి, 287. శ్రీకాళహస్తి, 288. సత్యవేడు, 289. నగరి, 290. గంగాధరనెల్లూరు, 291. చిత్తూరు, 292. పూతలపట్టు, 293. పలమనేరు, 294. కుప్పం.

రవాణా వ్వవస్థ

చిత్తూరు రోడ్డు మార్గంలో దేశంలోని ప్రధాన నగరాలతో విమాన, రైలు, రహదారి మార్గాలలో అనుసంధానించబడి ఉంది. రైళ్లు నడవడం రాష్ట్రంలోనే ప్ర ప్రధమంగా ఈ జిల్లలోనె ప్రారంభం అయినది. జిల్లాలో ఐదు మార్గాలలో పయనించే రైలు మార్గాలున్నాయి. ఇక్కడి రేణిగుంట అతి పెద్ద రైల్వే కూడలి. ఇక్కడే రైలు పెట్టెల మరమ్మత్తు కర్మాగారం కలదు.

జనాభా లెక్కలు

2011 జనగణన ప్రకారం జనాభా 41,70,468, పురుషులు 20,83,505, స్త్రీలు 20,86,963. జనగణన 2001 ప్రకారం అక్షరాస్యత శాతం 67.46 , పురుషులలో 78.29 మరియు స్త్రీలలో 56.48. (1981 జనగణన ప్రకారం జనాబా: 27.37 లక్షలు. స్త్రీ పురుషుల నిష్పత్తి: 966:1000, అక్షరాస్యత: 31.60 శాతం. అనగా గత ముప్పై సంవత్సరాలలో పెరిగిన జనాబ సుమారు 10,33,000, పెరిగిన అక్షరాశ్యత 35.86 శాతం. *మూలం: ఆష్రదేశ్ వార్షికదర్శిని. 1988. పుట.288)

సంస్కృతి

చిత్తూరు జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన పండగలు : సంక్రాంతి పండుగల సందర్భంగా జరుపుకునే పశువుల పండగ దాన్నె జల్లి కట్టు అంటారు. అప్పుడే జరిగే పార్వేట ఉత్సవం గంగ పండగ ఆ సందర్భంలో జరిగే గంగ జాతర, ముక్కోటి ఏకాదసి, కావిళ్లు పండగ, కార్తీక మాసంలో జరిగే సుడ్దుల పండగ, మహాభారత ఉత్సవాలు మొదలగునవి ఈ జిల్లాకే ప్రత్యేకం.

పశుపక్ష్యాదులు

శేషాచల కొండలు, తలకోన వద్ద

తూర్పు కొండలలో భాగమైన శేషాచల కొండలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వృక్ష మరియు జంతు సంరక్షణ చక్కగా జరుగుతుంది. అంతరించి పోతున్న వృక్షాలను పోషించడమే కాక ఇక్కడ ఔషధ మొక్కల పెంపకం కూడా జరుగుతుంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఒక పరిశోధక బృందం ఇక్కడ నిరంతర పరిశోధనలు సాగిస్తుంది. ఇక్కడ ఇలియాన్ షెల్డి టైల్ అనే కొత్త పామును కనుగొన్నారు. స్లెండర్ కోరల్ స్నేక్ అనే విషపూరిత పామును 2009లో కనుగొన్నారు. ఇది దేశంలో మరెక్కడా కనిపించని అరుదైన పాము. బెట్లుడత ఇది ఇండియన్ జైంట్ స్కైరల్ అని పిలువబడే ఈ ఉడుత బరువు 2.5 కిలోలు ఉంటుంది. బంగ్ళాదేశ మరియు శ్రీ లంకలో ఉండే ఈ ఉడుత భారతదోశంలో ఇది తిరుమల కొండలలో మాత్రమే కనిపిస్తుంది అని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. బంగారు బల్లి (గోల్డ్ గెకోగా) పిలువబడే పూర్తి బంగారువర్ణంతో కనిపించే ఈ బల్లి తిరుమల కొండలలో మాత్రమే కనిపిస్తుందని పరిశోధకుల అభిప్రాయం. ఇద్ భారత దేశంలో మరి కొన్ని ప్రదేశాలలో కనిపిస్తుంది. ఇవి తిరుమలలో శిలాతోరణం, కపిల తీర్థం వద్ద కనిపిస్తుంది. దేవాంగ పిల్లి (స్లెండర్ లోరీన్)గా పిలువబడే ఈ జంతువు భారతదోశంలో మరియు శ్రీ లంకలో కనిపిస్తుంది. 1940-1950 కాలంలో ఆఫ్రికాలో కనిపించిన ఈ జంతువు ప్రస్థుతం అంతరించింది. తిరుమలలో మాత్రమే కనిపించే ఇది రాత్రివేళలో సంచరిస్తూ కీటకాలను తింటూ చెట్ల కొమ్మల మీద జీవిస్తుది. బూడిద రంగు అడవి కోళ్ళు. ఇవి ప్రపంచంలో మరెక్కడా లేవని పరిశోధకుల అభిప్రాయం. శ్రీ వెంటేశ్వర జంతుప్రద్శన శాలలో వీటి పునరుత్పత్తి కార్యక్రమాలు ప్రారంభించారు.

విద్యాసంసంస్థలు

జిల్లాకు పశ్చిమ భాగమున ఉన్న గుర్రంకొండ ఒక చారిత్రక ప్రదేశము. ఇక్కడ ఒక పాత కోట మరియు రంగిన్ మహల్ అనబడే సుల్తాన్ యొక్క ప్యాలెస్ ఉన్నాయి. ఆర్ధ్రగిరి మరియు చంద్రగిరి జిల్లాలోని ఇతర చెప్పుకోదగిన ప్రదేశములు.
సంఖ్య విద్యాసంస్థ వివరణ సంఖ్య
1 పాఠశాలలు నవోదయా పాఠశాల 1
2 గురుకులాలు 1
3 జూనియర్ కళాశాలలు పి సి ఆర్ 1
4 కళాశాలలు
5 ఉన్నత కళాశాలలు పి.వి.కే.న్.డిగ్రీ&పి.జి.కళాశాల,
6 ఇంజనీరింగ్ కళాశాలలు రమణమ్మ
7 టెక్నో పాఠశాలలు మదనపల్లె,శ్రీనివాస,కాళహస్థి,రామానుజ 4
8 సంగీత కళాశాల శ్రీవెంకటేశ్వర 1
909:23, 17 ఆగష్టు 2014 (UTC)~~ వైద్య కళాశాలలు బి టి కళాశాల, కృష్ణతేజ డెంటల్ కాలేజ్ 2
10 ఫార్మసీ
11 మేనేజ్మెంట్ స్కూల్స్
12 విశ్వనిద్యాలయాలు పద్మావతి, ద్రవిడ, వేదిక్, సంస్కృత, స్విమ్స్, ఎస్వియు 7
13 ఇతరాలు

ఆకర్షణలు

అంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాలు

పూర్వము ఏనుగు మల్లమ్మకొండ అని పిలవబడిన హార్సిలీ హిల్స్ మదనపల్లె పట్టణానికి సమీపమున ఉన్న ఒక వేసవి విడిది. ఈ ప్రదేశము "ఆంధ్ర ఊటీ" గా పేరు పొందినది. అనేక రకమైన పండ్లు మరియు కూరగాయలు (ప్రత్యేకముగా టమాటాలు) పండించే చుట్టు పక్కల వ్యవసాయ ప్రాంతమునకు మదనపల్లె కేంద్ర స్థానము. హా‌ర్స్లీ హిల్స్ వద్దనున్న రిషి వ్యాలీ గురుకుల విద్యకు ప్రసిద్ధి.

జిల్లాకు పశ్చిమ భాగమున ఉన్న గుర్రంకొండ ఒక చారిత్రక ప్రదేశము. ఇక్కడ ఒక పాత కోట మరియు రాగినీ మహల్ అనబడే సుల్తాన్ యొక్క ప్యాలెస్ ఉన్నాయి. ఆర్ధ్రగిరి మరియు చంద్రగిరి జిల్లాలోని ఇతర చెప్పుకోదగిన ప్రదేశములు.

1 తిరుపతి 10 కాణిపాకం 19 శ్రీకాళహస్తి
2 శ్రీనివాస మంగా పురం 11 శ్రీనివాస మంగా పురం 20 అప్పలాయ గుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం
3 తిరుమల 12 నారాయణవనం 21 నాగలాపురం
4 కార్వేటినగరం 13 కైలాసనాథ కొండ 22 మొగిలి.
5 తిరుచానూరు 14 యాదమరి/ఇంద్రపురి 23 అరగొండ
6 తలకోన 15 బొయ కొండ గంగమ్మ 24 హార్సిలిహిల్స్
7 గుర్రంకొండ 16 జలకంటేస్వర దేవాలయం 25 పులికాట్ సరస్సు
8 చంద్రగిరి 17 ఆరోగ్యవరం 26 కైలాసనాథకోన
9 గుడి మల్లం 18 కైలాసనాథకోన 27 గుర్రంకొండ
28 సురుటుపల్లి 29 వేదనారాయణ స్వామి ఆలయం. నాగలాపురమ్

క్రీడలు

ప్రముఖవ్యక్తులు

సాహితీ కారులు


సినీ రంగ ప్రముఖులు

చిత్రమాలిక

చిత్తూరు జిల్లా - భౌగోళిక సరిహద్దులు

బయటి లింకులు

మూలాలు

  1. http://www.thehindu.com/arts/history-and-culture/article1587813.ece
  2. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో చిత్తూరు జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.
  • గౌరు వాస్తు ప్లానర్స్ వారి 2008 కేలెండర్ లోని సమాచారం