కుద్సియా తహ్సీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుద్సియా తహ్సీన్
Qudsia Tahseen
కుద్సియా తహ్సీన్
వృత్తిమహిళా శాస్త్రవేత్త

కుద్సియా తహ్సీన్  : Qudsia Tahseen లేదా "ఖుద్సియా తెహ్సీన్. జననం ఉత్తర ప్రదేశ్ లోని ఆజం గఢ్.

విద్యావంతులైన తల్లిదండ్రులు లభించడం ఈమె అదృష్ట్రం. చిన్నప్పట్నుంచీ సైన్స్ అంటే వల్లమాలిన అభిమానం. ఈ అభిమానమే ఈమెను తన ఇష్టమైన రంగంలో నిష్ణాతురాలిని చేసింది.

బాల్యం , విద్య

[మార్చు]

ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో విద్యాభ్యాసం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఉన్నత విద్య మెరిట్ స్కాలర్ షిప్ పొందినది. ఆ తరువాత ఉన్నత విద్యాభ్యాసం కొరకు ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం లో జంతుశాస్త్రం ప్రత్యేక విషయం గా తీసుకుని అభ్యసించింది.

రీసెర్చ్ కొరకు "నెమటాలజీ"ని మాస్టర్ లెవల్ లో ఎంచుకున్నారు. NET పరీక్షలు అపుడే ప్రారంభించ బడ్డాయి. జూనియర్ రీసర్చ్ ఫెల్లోషిప్ కొరకు క్వాలిఫై అయినారు.

రీసర్చ్ యందు వీరి గైడ్ ప్రో.శమీం జయరాజ్ పురి, రీసర్చ్ లో ఎంతో సహాయసహకారాలు అందించారు. తన భర్త కూడా పూర్తి సహకారాన్ని అందించారు.

వీరి మొదటి అపాయింట్మెంట్ అ.ము.యూ. లోని మహిళా కళాశాలలో 1989 లో జరిగింది. మహిళా కళాశాలలో రీసర్చ్ కొరకు వసతులు సదుపాయాలూ లేకున్ననూ, తన రీసర్చ్ ను కొనసాగించారు.

అవార్డులు

[మార్చు]

ఇటు అధ్యాపకురాలిగానూ, అటు రీసెర్చ్ ఫెలో గానూ కష్ట పడి ముందుకు సాగినందువల్ల, నాలుగు "యంగ్ సైంటిస్ట్ అవార్డులు" లభించాయి, ఇందులో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అవార్డ్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అవార్డులు ఉన్నాయి. ఒకవైపు అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆమె పేపర్లు ప్రచురితమయ్యాయి. కుద్సియా తహ్సీన్1997లో ఎ.ఎం.యు, " డిపార్ట్‌మెంట్ ఆఫ్ జువాలజీ "కు బదిలీ అయింది.

గుర్తింపులు

[మార్చు]

ఆతరువాత కుద్సియా తహ్సీన్ తన సమయాన్ని అత్యధికంగా రిసెర్చ్ చేయడానికి కేటాయించింది. రీసెర్చ్ నిమిత్తం రోథంస్టెడ్, సి.ఎ.బి.ఐ, యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్, బ్రిటిష్ నేషనల్ హిస్టరీ మ్యూజియం (ఇంగ్లాండ్) , స్కాటిష్ క్రాప్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ (స్కాట్‌లాండ్) , యూనివర్శిటీ ఆఫ్ ఘెంట్ (బెల్జియం) , యూనివర్శిటీ ఆఫ్ కలిఫోర్నియా లకు కొలాబరేషన్ విధానంలో పనిచేయడానికి వెళ్ళింది. ఆతరువాత ఐ.ఎన్.ఎస్.ఎ బైలేటరల్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాం విధానంలో రోథెమ్‌స్టెడ్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ , డి.బి.టి ఓవర్‌సీస్ అసోసియేట్‌షిప్ ఈ కొలాబరేషన్‌ను ప్రోత్సహించింది. అమె రీసెర్చ్ ఉపకరణాల కొరకు నిధిసహాయానికి అభ్యర్ధించింది. దీర్ఘకాల ఉద్యోగ బాధ్యతలలో ఆమె పలు విద్యార్ధులకు రీసెర్చ్ మార్గదర్శిగా ఉండడానికి అంగీకరించింది. వారికి అవసరమైన ప్రయోగశాల వసతి లేని కారణంగా ఆమె ప్రయోగశాల ఏర్పాటుకు అభ్యర్ధించింది. ఫలితంగా ఉద్యోగంలో చేరిన 14 సంవత్సరాల తరువాత 2003 నాటికి ఆమెకు స్వతంత్రగా పనిచేయగలిగిన ప్రయోగశాల ఏర్పాటుచేసుకోవడానికి సాధ్యపడింది. తరువాత ఆమె " నెమటోడ్ టాక్సోనమీ " ప్రధానాంశంగా పలు ప్రచురించిన పలు పేపర్లు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చాయి. ఒ.ఎన్.టి.ఎ అందుకున్న ప్రథమ మహిళగా ఆమె గుర్తించబడింది. నెమోటాలజీలో ఉన్నతస్థాయిలో నిలిచినందుకు ఆమె 2005లో స్పెషల్ అవార్డును అందుకున్నది. ఆమె వృత్తిరీత్యా ఎదగడానికి ఆమెకు తల్లితండ్రులు పూర్తి సహకారం అందించారు.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.