ఆర్మూరు పురపాలకసంఘం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఆర్మూరు పురపాలక సంఘం, నిజామాబాదు జిల్లాకు చెందిన పురపాలక సంఘం. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆర్మూరు పాలక సంస్థను 2006లో పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేసారు.. ఈ పురపాలక సంఘం పరిధి 18.82 చ.కి.మీ. 2001లో 40836 జనాభా ఉండగా 2011 నాటికి అది 43902కు పెరిగింది.
చరిత్ర
[మార్చు]1956 నుంచి 1962 కాలంలో ఆర్మూరు పురపాలక సంఘంగా ఉండేది. ఆ కాలంలో కెవి నరసింహారెడ్డి చైర్మెన్‌గా పనిచేశారు. 1962లో దీనిని మేజర్ పంచాయతీగా మార్చారు. 2006లో మళ్ళీ హోదా పెంచి పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేశారు. 2008లో ఈ పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించగా ఒప్పందం ప్రకారం త్రివేణి గంగాధర్, కంచెట్టి గంగాధర్‌లు చెరో రెండున్నర సంవత్సరాలు చైర్మెన్ పదవిని నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి 2014, మార్చి 30న రెండో సారి ఎన్నికలు జరిగాయి
ఆదాయ వనరులు
[మార్చు]పురపాలక సంఘానికి ముఖ్య ఆదాయం ఆస్తిపన్నులు. 2010-11లో మొత్తం పన్ను, పన్నేతర వసూళ్ళు 52.49 కోట్ల రూపాయలు కాగా ఇందులో ఆస్తిపన్ను వాటా 47.39 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ప్రకటనల వల్ల, దుకాణాల అద్దె ద్వారా, నీటి పన్నులు తదితర వసూళ్ళ ద్వారా ఆదాయం రాబట్టుకుంటుంది.