మార్చి 14
స్వరూపం
(14 మార్చి నుండి దారిమార్పు చెందింది)
మార్చి 14, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 73వ రోజు (లీపు సంవత్సరములో 74వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 292 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 | |||||
2025 |
సంఘటనలు
[మార్చు]- 1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.
- 1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది
- 2008: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.
జననాలు
[మార్చు]- 1842: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (మ.1915)
- 1879: ఆల్బర్ట్ ఐన్స్టీన్, భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1955)
- 1918 కె.వి.మహదేవన్, తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)
- 1930: నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (మ.2016)
- 1937: జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.
- 1947: మౌళి , చలన చిత్ర దర్శకుడు,నటుడు.
- 1965: సర్వదమన్ బెనర్జీ , చలనచిత్ర నటుడు.
మరణాలు
[మార్చు]- 1664: గురు హర్కిషన్, సిక్కుల ఎనిమిదవ గురువు.
- 1883: కారల్ మార్క్స్, తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త, విప్లవ కారుడు.
- 2013: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936)
- 2022: అనిల్ జోషియార గుజరాత్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు. మాజీమంత్రి. (జ.1953)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- పై డే : గణితంలో వాడే ఒక గుర్తు పేరు 'పై' (22/7). పై యొక్క విలువ 3.14159.... దానిని పురస్కరించుకకుని, గణిత మేధావులు ఈ రోజును పై డేగా జరుపుకుంటున్నారు.
- అంతర్జాతీయ గణిత దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2007-03-03 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-01-12 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 14
మార్చి 13 - మార్చి 15 - ఫిబ్రవరి 14 - ఏప్రిల్ 14 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |