Coordinates: 17°0′N 81°48′E / 17.000°N 81.800°E / 17.000; 81.800

గోదావరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 183: పంక్తి 183:
* [[గోదావరిఖని]],
* [[గోదావరిఖని]],
* [[మంథని]]
* [[మంథని]]
* [[కాళేశ్వరం]],
* [[కాళేశ్వరం]]
*భద్రాచలం

=== '''[[ఆంధ్ర ప్రదేశ్]]‌ లో''' ===
=== '''[[ఆంధ్ర ప్రదేశ్]]‌ లో''' ===
* [[కొవ్వూరు]],
* [[కొవ్వూరు]]
* [[రాజమండ్రి]],
* [[రాజమండ్రి]]
* [[రావులపాలెం]],
* [[రావులపాలెం]]
* [[నరసాపురం]]
* [[నరసాపురం]]
*[[తాతపూడి (కపిలేశ్వరపురం)|తాతపూడి]]
*[[తాతపూడి (కపిలేశ్వరపురం)|తాతపూడి]]

13:04, 6 సెప్టెంబరు 2019 నాటి కూర్పు

17°0′N 81°48′E / 17.000°N 81.800°E / 17.000; 81.800
godavari
దక్షిణ గంగ
River
The Mouth of the Godavari river (East) emptying into the Bay of Bengal.
దేశం India
రాష్ర్టాలు మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్, పాండిచేరి (యానాం)
Region దక్షిణ , పశ్చిమ భారతదేశం
ఉపనదులు
 - ఎడమ పూర్ణా నది, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, వెయిన్ గంగా, పెంగంగా, వర్ధ, దుధన
 - కుడి ప్రవర, మంజీరా, పెద్దవాగు, మన్నేరు, కిన్నెరసాని
Cities నాసిక్, నాందేడ్, నిజామాబాద్, రాజమండ్రి
Source
 - స్థలం త్రయంబకేశ్వర్,మహారాష్ట్ర, నాసిక్, మహారాష్ట్ర, ఇండియా
 - ఎత్తు 920 m (3,018 ft)
 - అక్షాంశరేఖాంశాలు 19°55′48″N 73°31′39″E / 19.93000°N 73.52750°E / 19.93000; 73.52750
Mouth
 - location అంతర్వేది వద్ద బంగాళాఖాతము, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్, ఇండియా
 - ఎత్తు 0 m (0 ft)
 - coordinates 17°0′N 81°48′E / 17.000°N 81.800°E / 17.000; 81.800 [1]
పొడవు 1,465 km (910 mi)
పరివాహక ప్రాంతం 3,12,812 km2 (1,20,777 sq mi)
Discharge
 - సరాసరి 3,505 m3/s (1,23,778 cu ft/s) [2]
Discharge elsewhere (average)
 - పోలవరం (1901-1979) 3,061.18 m3/s (1,08,105 cu ft/s) [3]
గోదావరి పరీవాహకం


గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీర్లు [4]. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు ఉన్నాయి. భద్రాచలము, రాజమహేంద్రవరం వంటివి కొన్ని. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అది గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ మరియు కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహిని లు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.

గోదావరి నది ఇతిహాసం

రాజమండ్రి వద్ద గోదావరీ మాత విగ్రహం

పూర్వము బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మూడడుగుల స్థలం కావాలని అడుగగా బలి చక్రవర్తి మూడడుగులు ధారపోసాడు. మహావిష్ణువు ఒక అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడంతో చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ ఉదకంతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి, మహావిష్ణువును శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, గోహత్యాపాతకనివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొని వస్తారు.

ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది. గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది. ఆ స్థలమే గోష్పాద క్షేత్రం. ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం.

పుష్కరాలు

దేశంలో ప్రతీ జీవ నదికీ పుష్కరం ఉన్నట్లే, గోదావరికి కూడా పుష్కరం ఉంది. పంచాంగము ప్రకారం గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరం వస్తుంది. 2015, జూలై నెలలో గోదావరికి మహాపుష్కరం వచ్చింది.

(పూర్తి వ్యాసం కొరకు గోదావరి నది పుష్కరము చూడండి)

ఉప నదులు

గోదావరి నదిపై ఖమ్మం జిల్లాలో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన దుమ్ముగూడెం బ్యారేజీ
భద్రాచలం వద్ద వరద గోదావరి
పాపికొండల్లో గోదావరి పదనిసలు

గోదావరి నది యొక్క పరీవాహక ప్రాంతము 3,13,000 చదరపు కిలోమీటర్ల మేర మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ మరియు ఒడిషా రాష్ట్రాలలో వ్యాపించి ఉంది. ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు:

గోదావరి నదిపై ప్రాజెక్టులు

పటం
గోదావరి నదిపై ప్రాజెక్టులు

గోదావరి ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు

రాజమండ్రి వద్ద గోదావరి నదిపై రైల్వే వంతెన

మహారాష్ట్ర లో

తెలంగాణ‌ లో

ఆంధ్ర ప్రదేశ్‌ లో

పాండిచ్చేరి‌ లో

  • యానాం
  • మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామి (నిత్యకల్యాణం-పచ్చతోరణం)

గోదావరి ఒడ్డున వెలసిన పుణ్య క్షేత్రములు

గోదావరి ప్రాంతపు కవులు

తెలుగులో తొలి కావ్యరచన కాలం నుండి గోదావరి ప్రాంతంలో అనేకమంది కవులు చాలా కావ్యాలను రచించారు. వీరిలో ఎక్కువమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు. ప్రాచీనకాలం నుండి 1980 ప్రాంతం వరకు గోదావరి ప్రాంతంలో వెలసిన కవులీ వ్యాసంలో పేర్కొన్నారు:[5]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Godāvari River at GEOnet Names Server
  2. Kumar, Rakesh; Singh, R.D.; Sharma, K.D. (2005-09-10). "Water Resources of India" (PDF). Current Science. Bangalore: Current Science Association. 89 (5): 794–811. Retrieved 2013-10-13.
  3. "Sage River Database". Retrieved 2011-06-16.
  4. Eenadu special edition, 12 July, 2015
  5. గోదావరి ప్రాంతపు కవులు, డా. గల్లా చలపతి, మాతల్లి గోదావరి, పుష్కర ప్రత్యేక సంచిక, 2003, పేజీలు: 52-59.


"https://te.wikipedia.org/w/index.php?title=గోదావరి&oldid=2722078" నుండి వెలికితీశారు