అదితి పంత్
అదితి పంత్ Aditi Pant | |
---|---|
జననం | నాగపూర్, బొంబాయి రాష్ట్రం | 1943 జూలై 5
వృత్తి | మహిళా శాస్త్రవేత్త |
రీసెర్చ్
[మార్చు]అదితి పంత్ (జననం:5 జూలై 1943) పునా యూనివర్శిటీలో బి.ఎస్.సి పూర్తిచేసిన సమయంలో ఆమె తండ్రి స్నేహితుడు ఆమెకు ఒక పుస్తకం ఇచ్చాడు. అది కేంబ్రిడ్జ్ బయాలిజిస్ట్ అయిన సర్ అలిస్టైర్ హార్డీ వ్రాదిన " ది ఓపెన్ సీ " అనే పుస్తకం. ఆ పుస్తకంలో సముద్రపు పాచి గురించి వివరించబడింది. అదితి పంత్ ఆపుస్తకం చేత ఆకర్షించబడింది. మద్యతరగతి కుటుంబంలో జన్మించిన అదితి పంత్‌కు విదేశీలాలో పరిశోధనలు సాగించడం ఖర్చుతో కూడుకున్నది. అదితి పంత్ ప్రయత్నించి " యూనివర్శిటీ ఆఫ్ హవాయ్ "లో ఎం.ఎస్ కొనసాగించడానికి యు.ఎస్ ప్రభుత్వ స్కాలర్ షిప్ సంపాదించింది. ఆమె ఎం.ఎస్ చేయడానికి ఓపెన్ సీ పుస్తకంలో వివరించిన సముద్రపు పాచిని ప్రధానాంశంగా ఎంచుకున్నది. ప్లాంటన్ కమ్యూనిటీలలో ఫోటో సింథసిస్ ప్రభావం గురినించి అధ్యయనం చేసింది.
అదితి పంత్ ఫోటోసొంథసిస్ మీద ట్రాపికల్ లైట్ ప్రభావం ప్రధానంశంగా తీసుకుంది.
భారతదేశం తిరిగి రాక
[మార్చు]అదితి పంత్ ఎం.ఎస్ , రీసెర్చ్ పూర్తిచేసిన తరువాత ఏమి చేయాలి అన్న ప్రధాన ప్రశ్న ఉదయించింది. తరువాత ఆమె తాను పనిచేయాలని కోరుకున పలు లాబరేటరీలను సందర్శించింది. ఆసమయంలో ఆమె ప్రొఫెసర్ ఎన్.కె పణికర్‌ను కలుసుకుంది. పణికర్ సి.ఎస్.ఐ.ఆర్ సీనియర్ సైంటిస్ట్ , గోవాలోని " నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్.ఐ.ఒ) వ్యవస్థాపకుడు, డైరెక్టర్. ఆయనతో పలుమార్లు విస్తారంగా చర్చలు జరిపిన తరువాత గురించిన చర్చతలెత్తింది. ఇండియాకు ఓషనోగ్రఫీ ప్రొఫెసర్లు కావాలా ? అన్న ప్రశ్న కూడా తలెత్తింది. వాస్తవానికి 1971-1972 నాటి పరిస్థితిని అనుసరించి వారిలో ఇండియా తన యువత గురించి పట్టించుకోదన్న అభిప్రాయం ఉండేది. ఉద్యోగావకాశాలు కూడా అరుదుగా లభించేవి. అయితే డాక్టర్ పణికర్ " నాకు తెలిసినంతలో విస్తారమైన ఉద్యోగావకాశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటిని స్వంతం చేసుకోవడానికి మాత్రం ధైర్యం కావాలి. అయినప్పటికీ వెలుపల ఇంతకంటే మంచి జీతం లభించవచ్చు " అన్నాడు. ఆమాటలను సవాలుగా తీసుకుని అదితి పంత్ సవాలుగా తీసుకుని " పూల్ ఆఫీసర్ షిప్ "కు అభ్యర్థించి 1973 lలో భారతదేశానికి తిరిగి వచ్చి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించింది.
ఉద్యోగ బాధ్యతలు
[మార్చు]1973-1976 ల మద్య వారు భారతదేశ పశ్చిమతీరమంతా పరిశోధనల నిమిత్తం శోధించారు. ఇది చేసేసమయంలో ఒక్కోసారి రాత్రుళ్ళు బృందానికి విశ్రమినడానికి అవసరమైనంత జాగా లభించక వంతులువారిగా నిద్రపోయే అంతగా శ్రమించారు. ఒక్కోసారి వాహనాలు ఒక్కోసారి చేపల పడవలలో ప్రయాణిచారు. ఒక్కోసారి బీచ్‌లో నిద్రించే వారు. ప్రణాళిక పూర్తిచేయడానికి వెదర్ మేనే సైంటిస్ట్, డ్రైవర్ , విద్యార్థులు కలిసి కట్టుగా శ్రమించారు. వారు ఆహారం, నీరు , ఏకాంతం గురించి కలత పడలేదు. ప్రాంతీయ టీషాపులలో లభించింది తిని వారి పనిని కొనసాగించారు. అధికంగా బజ్జీలు , బెల్లంటీ వంటివి యీసుకున్నారు. వారి బృందంలో ఆమె మాత్రమే మహిళ. గ్రామంలోని స్త్రీలు వారివారి భర్తలను, సోదరులను బృందం అవసరాలు తీర్చడానికి పంపేవారు. ఆమె సహశాస్త్రవేత్తలకు మహిళాశాద్త్రవేత్తల పట్ల ఉన్న దృష్టికోణం మారింది.
అట్లాంటిక్
[మార్చు]ప్రతి ఓషనోగ్రాఫర్ కలలు కనే ఆట్లాంటిక్ సముద్రంలో పరిశోధనలు చేపట్టే అవకాశం అదితి పంత్‌కు కూడా లభించింది. ఆవకాశాన్ని ఆమె సంతోషంగా అందుకున్నది. ఎన్.ఐ.ఒ 10 సంవత్సారాల కాలం ఫుడ్‌చైన్ ఫిజిక్స్, కీస్ట్రీ , బయాలజీ గురించి ఆట్లాంటిక్ సముద్రంలో పరిశోధనలు చేపట్టింది.అదితి పంత్ 1990లో ఎన్.ఐ.ఒ నుండి వైతొలగి పూనాలో ఉన్న " నేషనల్ కెమికల్ లాబరేటరీ "లో పనిచేసింది. అలాగే 15 సంవత్సరాల కాలం " ఎంజిమోలజీ ఆఫ్ సాల్ట్-టాలరెంట్ " , " సాల్ట్- లవింగ్ మైక్రోబ్స్ ఇంవాల్వ్డ్ ఇన్ ఫుడ్ చైన్ గురించి అధ్యయనం కొనసాగించింది.
ప్రేరణ
[మార్చు]అదితి పంత్ మద్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి ఆమెకు 10 సంవత్సరాల వయసులోనే వంటచేయడం నేర్పింది. కచ్చితమైన కొలతలతో వంటచేయడం ఒక విధంగా సైన్సు ప్రయోగాలు చేయడానికి ఉపకరించిందని ఆమె అభిప్రాయపడింది. ఆమె తండ్రికి ప్రతి ఒక్క విషయం గురించి శోధించి తెలుసుకోవాలని ఆరాటం ఉండేది. అదే అలవాటు వారసత్వంగా వచ్చిందన్నది అదితిపంత్ అభిప్రాయపడుతుంది.
వెలుపలి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.