పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు | |
---|---|
ప్రదేశం | తెలంగాణ, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 15°57′49″N 78°8′47″E / 15.96361°N 78.14639°E |
ఆవశ్యకత | నీటిపారుదల, విద్యుత్, రవాణా |
స్థితి | పూర్తయింది/ప్రారంభించబడింది |
నిర్మాణం ప్రారంభం | 2015 |
ప్రారంభ తేదీ | 2023 సెప్టెంబరు 16 |
నిర్మాణ వ్యయం | ₹ 35,000 కోట్లు |
నిర్వాహకులు | తెలంగాణ నీటిపారుదల శాఖ |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | కృష్ణానది |
Height | up to top of earth dam above the lowest river bed. |
Spillway type | చూట్ స్పిల్‌వే |
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీనికి 2015, జూన్ 11న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశాడు.[1] జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది.[2] 2023 సెప్టెంబరు 16న నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి, జాతికి అంకితం చేశాడు.[3][4]
ప్రాజెక్టు వివరాలు
[మార్చు]హైదరాబాదు నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. నాగర్‌కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలం లోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుండి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ మండలం, లక్ష్మీదేవిపల్లి వరకూ పంపిస్తారు. వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టి.ఎమ్‌సి చొప్పున మొత్తం 90 టిఎమ్‌సి నీటిని ఎత్తిపోయాలనేది ప్రాజెక్టు లక్ష్యం.
సముద్ర మట్టం నుండి 269.735 మీ. ఎత్తున ఉన్న శ్రీశైలం జలాశయం నుండి 5 అంచెల్లో ఎత్తిపోసి 670 మీ. ఎత్తున ఉన్న లక్ష్మీదేవిపల్లి జలాశయానికి నీటిని చేరుస్తారు. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 లిఫ్టులు, 6 జలాశయాలూ నిర్మిస్తారు.
రూ. 35,200 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 10 న తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.[5]
ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో - మొత్తం నీటిని తరలించడానికి పంపుహౌసులు, జలాశయాలు, పైపులైన్లు, కాలువలు, సొరంగాలు నిర్మించి, తాగునీటి అవసరాలూ, పారిశ్రామిక అవసరాలూ తీర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తారు. రెండవదశలో సాగునీటిని అందించేందుకు అవసరమైన కాలువలు ఇతర సదుపాయాలను నిర్మిస్తారు.
పర్యావరణ అనుమతులు
[మార్చు]ఈ పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలాకాలంపాటు ప్రయత్నాలు చేసింది. ఈఏసీ సభ్యులు రకరకాల సందేహాల కారణంగా అనుమతుల్ని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను తిరస్కరించిన ఈఏసీ, ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కన పెట్టింది. అప్పుడు ఈఏసీ కోరిన విధంగా సమగ్రంగా ప్రాజెక్టు వివరాలను సమర్పించడంతోపాటు ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను తెలియపరుస్తూ, పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.[6]
2023, జూన్ 27న నిర్వహించిన ఈఏసీ 48వ సమావేశంలోనే పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఈఏసీ సభ్యులు పలు అంశాలపై పూర్తి వివరాలను ఇవ్వాలని కోరుతూ అనుమతుల మంజూరును పెండింగ్‌లో పెట్టారు. 2023, జూన్ 24న నిర్వహించిన 49వ ఈఏసీలో మరోసారి ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వాదనలు వినిపించడంతోపాటు పర్యావరణ ప్రభావానికి సంబంధించిన నివేదికలను ఈఏసీకి అందజేశారు. అందులో రెండో దశ అనుమతులు తీసుకోకుండా పనులు చేయడం వల్ల పర్యావరణానికి 153.69 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు, అందుకు నష్ట నివారణ ప్రణాళికతోపాటు సహజ వనరుల పెంపుదల ప్రణాళికల వివరాలును ప్రభుత్వం తెలిపింది.[7] ఆ నివేదికతో ఏకీభవించిన ఈఏసీ, 153.70 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారెంటీని జమచేయడంతోపాటు రూ.106 కోట్ల మేర పెనాల్టీని కట్టాలని షరతులు విధిస్తూ, ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసినట్టు 2023, ఆగస్టు 10న విడుదల చేసిన 49వ ఈఏసీ మినట్స్ లో వెల్లడించింది.[8]
డ్రైరన్
[మార్చు]పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 2023 సెప్టెంబరు 3న నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద చేపట్టిన మొదటి పంపు డ్రైరన్ విజయవంతమైంది. తొమ్మిది మోటర్లలో మొదటి మోటర్ డ్రైరన్‌ను ఇంజినీర్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్ రావు దగ్గరుండి పర్యవేక్షించారు.[9] మరికొద్దిరోజుల్లో ఒక పంపు ద్వారా నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభించి, నిబంధనల ప్రకారం ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్‌ను నింపుతారు.[10]
ప్రారంభం
[మార్చు]2023 సెప్టెంబరు 16న నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ కంప్యూటర్ ద్వారా స్విచ్ ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించాడు. నార్లాపూర్ రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్స్ నుంచి అంజనగిరి రిజర్వాయర్‌లోకి వదిలిన కృష్ణమ్మ జలాలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించాడు.[11][12] ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, పి.రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, జి. రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్ లతోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ల ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.[13]
జలాశయాలు, వాటి సామర్థ్యాలు
[మార్చు]గుట్టలను కలుపుతూ మట్టి కట్టలతో నాడు కాకతీయులు చెరువులను నిర్మించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ జలాశయాలను నిర్మించింది. ఆయా జలాశమాలకు స్థానికంగా గుట్టలపై కొలువైన దేవుళ్ళ పేర్లు పెట్టబడ్డాయి.[14]
ప్రాజెక్టులో భాగంగా నిర్మించే జలాశయాల వివరాలు ఇలా ఉన్నాయి:[15]
క్ర.సం. | జలాశయం పేరు | స్థలం | కట్ట పొడవు (కి.మీ.) | పూర్తి స్థాయి మట్టం | పూర్తి స్థాయి
సామర్థ్యం (టిఎమ్‌సి) |
వాడుకోగలిగే
నీరు (టిఎమ్‌సి) |
ఆయకట్టు (ఎకరాల్లో) |
---|---|---|---|---|---|---|---|
1 | అంజనగిరి జలాశయం | నార్లాపూర్ | 6.647 | +345.000 మీ. | 8.51 | 7.95 | 0 |
2 | వీరాంజనేయ జలాశయం | ఏదుల | 7.716 | +445.000 మీ. | 6.55 | 5.91 | 0 |
3 | వెంకటాద్రి జలాశయం | వట్టెం | 14.75 | +542.000 మీ. | 16.74 | 14.47 | 1,39,000 |
4 | కురుమూర్తిరాయ జలాశయం | కరివెన | 13.185 | +531.000 మీ. | 17.34 | 16.9 | 1,90,000 |
5 | ఉద్దండాపూర్ జలాశయం | ఉద్దండాపూర్ | 15.875 | +629.000 మీ. | 16.03 | 15.61 | 4,88,000 |
6 | లక్ష్మీదేవిపల్లి జలాశయం | రంగారెడ్డి జిల్లా, లక్ష్మీదేవిపల్లి | 6.05 | +670.000 మీ. | 2.8 | 2.5 | 4,13,000 |
మొత్తం | 64.223 | 67.97 | 63.34 | 12,30,000 |
ప్రయోజనం పొందే ప్రాంతాలు
[మార్చు]తాగునీరు, పరిశ్రమలు
[మార్చు]పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వలన జంటనగరాలకు తాగునీరు లభిస్తుంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 70 మండలాలకు చెందిన 1226 గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని పరిశ్రమలకు నీరు అందిస్తారు.
సాగునీరు
[మార్చు]మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12,30,000 ఎకరాలకు నీరందించే ప్రణాళిక ప్రాజెక్టు రెండవ దశలో ఉంది. మండలాల వారీగా ఆయకట్టు ఇలా ఉంటుంది:[15]
జిల్లా | నియోజకవర్గం | మండలం | ఆయకట్టు (ఎకరాల్లో) |
---|---|---|---|
మహబూబ్‌నగర్ | దేవరకద్ర | అడ్డకల్ | 18,692 |
భూత్‌పూర్ | 13,105 | ||
మూసాపేట్ | 6,000 | ||
దేవరకద్ర | 20,655 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 58,452 | ||
జడ్చర్ల | బాలానగర్ | 30,311 | |
రాజాపూర్ | 10,000 | ||
జడ్చర్ల | 38,585 | ||
మిడ్జిల్ | 32,097 | ||
నవాబ్‌పేట | 25,576 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 1,36,569 | ||
మహబూబ్‌నగర్ | మహబూబ్‌నగర్ (గ్రామీణ) | 9,692 | |
హన్వాడ | 12,527 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 22,219 | ||
మక్తల్ | మాగనూరు | 264 | |
మక్తల్ | 17,549 | ||
నర్వ | 5,918 | ||
ఊటుకూరు | 34,281 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 58,012 | ||
నారాయణపేట | దామరగిద్ద | 1,207 | |
ధన్వాడ | 15,734 | ||
కోయిలకొండ | 25,794 | ||
నారాయణపేట | 16,056 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 58,791 | ||
*పర్గి | గండీడ్ | 24,414 | |
నియోజక వర్గంలో మొత్తం భూమి | 24,414 | ||
*KODANGAL | కోస్గి | 26,023 | |
మద్దూరు | 28,687 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 54,710 | ||
మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం భూమి | 4,13,167 | ||
వికారాబాదు | *పరిగి | దోమ | 20,473 |
కుల్కచర్ల | 10,412 | ||
పూదూరు | 11,750 | ||
పర్గి | 18,587 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 61,222 | ||
తాండూరు | బషీరాబాద్ | 26,982 | |
పెద్దేముల్ | 19,958 | ||
తాండూరు | 29,040 | ||
యాలాల | 22,112 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 98,092 | ||
వికారాబాదు | కోటేపల్లి | 11,622 | |
బంట్వారం | 5,985 | ||
ధరూర్ | 21,357 | ||
మర్పల్లి | 28,049 | ||
మోమిన్‌పేట్ | 18,753 | ||
వికారాబాద్ | 9,286 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 95,052 | ||
*కోడంగల్ | బొంరాస్‌పేట | 29,063 | |
కోడంగల్ | 18,003 | ||
దౌలతాబాద్ | 8,667 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 55,733 | ||
చేవెళ్ళ | నవాబ్‌పేట | 12,276 | |
నియోజక వర్గంలో మొత్తం భూమి | 12,276 | ||
వికారాబాదు జిల్లాలో మొత్తం భూమి | 3,22,375 | ||
నాగర్‌కర్నూలు | అచ్చంపేట | వంగూరు | 1,357 |
చారకొండ | 1,000 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 2,357 | ||
నగర్‌కర్నూల్ | బిజినపల్లి | 7,712 | |
తిమ్మాజీపేట | 23,263 | ||
తాడూరు | 4,082 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 35,057 | ||
*కల్వకుర్తి | ఊరుకొండ | 4,482 | |
కల్వకుర్తి | 18,957 | ||
వెల్దండ | 39,705 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 63,144 | ||
నాగర్‌కర్నూలు జిల్లాలో మొత్తం భూమి | 1,00,558 | ||
రంగారెడ్డి | *కల్వకుర్తి | ఆమనగల్లు | 11,261 |
కడ్తాల్ | 4,922 | ||
మాడ్గుల్ | 30,609 | ||
తలకొండపల్లి | 24,104 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 70,896 | ||
చేవెళ్ళ | చేవెళ్ళ | 24,028 | |
షాబాద్ | 25,369 | ||
మొయినాబాద్ | 28,535 | ||
శంకరపల్లి | 19,331 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 97,263 | ||
షాద్‌నగర్ | ఫరూక్‌నగర్ | 21,345 | |
కొందుర్గ్ | 18,395 | ||
చౌదర్‌గూడెం | 13,500 | ||
కొత్తూరు | 18,852 | ||
నందిగామ | 10,000 | ||
కేశంపేట | 1,969 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 84,061 | ||
ఇబ్రహీంపట్నం | మంచాల | 15,621 | |
యాచారం | 28,612 | ||
ఇబ్రహీంపట్నం | 29,185 | ||
హయత్‌నగర్ | 12,496 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 85,914 | ||
రాజేంద్రనగర్ | శంషాబాద్ | 6,601 | |
నియోజక వర్గంలో మొత్తం భూమి | 6,601 | ||
మహేశ్వరం | మహేశ్వరం | 8,251 | |
కందుకూరు | 10,914 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 19,165 | ||
రంగారెడ్డి జిల్లాలో మొత్తం భూమి | 3,63,900 | ||
నల్గొండ | దేవరకొండ | చింతపల్లి | 10,454 |
చందంపేట | 75 | ||
గుండ్లపల్లె | 3,682 | ||
దేవరకొండ | 11,773 | ||
నియోజక వర్గంలో మొత్తం భూమి | 25,984 | ||
మునుగోడు | మర్రిగూడ | 4,016 | |
నియోజక వర్గంలో మొత్తం భూమి | 4,016 | ||
నల్గొండ జిల్లాలో మొత్తం భూమి | 30,000 | ||
ప్రాజెక్టు మొత్తం | 12,30,000 |
మూలాలు
[మార్చు]- ↑ "పాలమూరు పనుల్లో వేగం.. బీడు భూములకు సాగునీరు". Prabha News. 2022-11-05. Archived from the original on 2022-11-05. Retrieved 2023-05-27.
- ↑ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
- ↑ "CM KCR: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్". EENADU. 2023-09-16. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.
- ↑ V Kurmanath, K. (2023-09-16). "Telangana CM unveils Phase-I of ₹50,000 crore Palamuru-Rangareddy lift irrigation scheme". BusinessLine (in ఇంగ్లీష్). Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.
- ↑ telugu, NT News (2023-08-12). "CM KCR | 70 ఏండ్ల పాలమూరు తండ్లాటకు మోక్షం.. ఇక కృష్ణానదిని కరువునేలపై వంపనున్న జలవిధాత". www.ntnews.com. Archived from the original on 2023-08-12. Retrieved 2023-08-12.
- ↑ Desk, HT Telugu (2023-08-11). "Palamur Rangareddy Lift: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు.. కేసీఆర్ హర్షం". Hindustantimes Telugu. Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ ABN (2023-08-11). "PALAMURU : 'పాలమూరు'కు పర్యావరణ అనుమతి లాంఛనమే!". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ "పాలమూరుకు పర్యావరణ అనుమతులు". EENADU. 2023-08-11. Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
- ↑ telugu, NT News (2023-09-03). "Palamuru dry run | పాలమూరు డ్రైరన్ సక్సెస్..సంబురాలు చేసుకున్న ఇంజినీర్లు". www.ntnews.com. Archived from the original on 2023-09-03. Retrieved 2023-09-03.
- ↑ "పాలమూరు - రంగారెడ్డి మొదటి మోటార్ డ్రైరన్ విజయవంతం". EENADU. 2023-09-03. Archived from the original on 2023-09-03. Retrieved 2023-09-03.
- ↑ telugu, NT News (2023-09-16). "Paalamuru | 70 ఏండ్ల కల సాకారం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్పెషల్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.
- ↑ "Telangana CM KCR inaugurates lift irrigation project to fill Anjanagiri reservoir with water from Krishna River". The Indian Express (in ఇంగ్లీష్). 2023-09-16. Archived from the original on 2023-09-16. Retrieved 2023-09-17.
- ↑ Chandrashekhar, B. (2023-09-16). "KCR commissions first pump of Palamuru-Rangareddy project". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.
- ↑ telugu, NT News (2023-05-15). "Telangana | అడుగు దూరంలో అరవై ఏండ్ల కల.. శరవేగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు". www.ntnews.com. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-28.
- ↑ 15.0 15.1 "పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్" (PDF). తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ. Retrieved 2020-07-15.
{{cite web}}
: CS1 maint: url-status (link)