Jump to content

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు

వికీపీడియా నుండి
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు is located in India
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు
India లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు స్థానం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు is located in Telangana
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు (Telangana)
ప్రదేశంతెలంగాణ, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు15°57′49″N 78°8′47″E / 15.96361°N 78.14639°E / 15.96361; 78.14639
ఆవశ్యకతనీటిపారుదల, విద్యుత్, రవాణా
స్థితిపూర్తయింది/ప్రారంభించబడింది
నిర్మాణం ప్రారంభం2015
ప్రారంభ తేదీ2023 సెప్టెంబరు 16
నిర్మాణ వ్యయం₹ 35,000 కోట్లు
నిర్వాహకులుతెలంగాణ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుకృష్ణానది
Heightup to top of earth dam above the lowest river bed.
Spillway typeచూట్ స్పిల్‌వే

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీనికి 2015, జూన్ 11న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశాడు.[1] జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది.[2] 2023 సెప్టెంబరు 16న నాగర్‌కర్నూల్‌ జిల్లా, కొల్లాపూర్‌ మండలం, నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి, జాతికి అంకితం చేశాడు.[3][4]

ప్రాజెక్టు వివరాలు

[మార్చు]

హైదరాబాదు నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. నాగర్‌కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలం లోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుండి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ మండలం, లక్ష్మీదేవిపల్లి వరకూ పంపిస్తారు. వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టి.ఎమ్‌సి చొప్పున మొత్తం 90 టిఎమ్‌సి నీటిని ఎత్తిపోయాలనేది ప్రాజెక్టు లక్ష్యం.

సముద్ర మట్టం నుండి 269.735 మీ. ఎత్తున ఉన్న శ్రీశైలం జలాశయం నుండి 5 అంచెల్లో ఎత్తిపోసి 670 మీ. ఎత్తున ఉన్న లక్ష్మీదేవిపల్లి జలాశయానికి నీటిని చేరుస్తారు. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 లిఫ్టులు, 6 జలాశయాలూ నిర్మిస్తారు.

రూ. 35,200 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 10 న తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.[5]

ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిస్తారు. మొదటి దశలో - మొత్తం నీటిని తరలించడానికి పంపుహౌసులు, జలాశయాలు, పైపులైన్లు, కాలువలు, సొరంగాలు నిర్మించి, తాగునీటి అవసరాలూ, పారిశ్రామిక అవసరాలూ తీర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తారు. రెండవదశలో సాగునీటిని అందించేందుకు అవసరమైన కాలువలు ఇతర సదుపాయాలను నిర్మిస్తారు.

పర్యావరణ అనుమతులు

[మార్చు]

ఈ పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చాలాకాలంపాటు ప్రయత్నాలు చేసింది. ఈఏసీ సభ్యులు రకరకాల సందేహాల కారణంగా అనుమతుల్ని వాయిదా వేస్తూ వచ్చారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను తిరస్కరించిన ఈఏసీ, ప్రాజెక్టు ప్రతిపాదనలను పక్కన పెట్టింది. అప్పుడు ఈఏసీ కోరిన విధంగా సమగ్రంగా ప్రాజెక్టు వివరాలను సమర్పించడంతోపాటు ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను తెలియపరుస్తూ, పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.[6]

2023, జూన్‌ 27న నిర్వహించిన ఈఏసీ 48వ సమావేశంలోనే పాలమూరు ప్రాజెక్టు ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఈఏసీ సభ్యులు పలు అంశాలపై పూర్తి వివరాలను ఇవ్వాలని కోరుతూ అనుమతుల మంజూరును పెండింగ్‌లో పెట్టారు. 2023, జూన్ 24న నిర్వహించిన 49వ ఈఏసీలో మరోసారి ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ వాదనలు వినిపించడంతోపాటు పర్యావరణ ప్రభావానికి సంబంధించిన నివేదికలను ఈఏసీకి అందజేశారు. అందులో రెండో దశ అనుమతులు తీసుకోకుండా పనులు చేయడం వల్ల పర్యావరణానికి 153.69 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు, అందుకు నష్ట నివారణ ప్రణాళికతోపాటు సహజ వనరుల పెంపుదల ప్రణాళికల వివరాలును ప్రభుత్వం తెలిపింది.[7] ఆ నివేదికతో ఏకీభవించిన ఈఏసీ, 153.70 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారెంటీని జమచేయడంతోపాటు రూ.106 కోట్ల మేర పెనాల్టీని కట్టాలని షరతులు విధిస్తూ, ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసినట్టు 2023, ఆగస్టు 10న విడుదల చేసిన 49వ ఈఏసీ మినట్స్ లో వెల్లడించింది.[8]

డ్రైరన్‌

[మార్చు]

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా 2023 సెప్టెంబరు 3న నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద చేపట్టిన మొదటి పంపు డ్రైరన్‌ విజయవంతమైంది. తొమ్మిది మోటర్లలో మొదటి మోటర్‌ డ్రైరన్‌ను ఇంజినీర్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్ రావు దగ్గరుండి పర్యవేక్షించారు.[9] మరికొద్దిరోజుల్లో ఒక పంపు ద్వారా నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభించి, నిబంధనల ప్రకారం ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్‌ను నింపుతారు.[10]

ప్రారంభం

[మార్చు]

2023 సెప్టెంబరు 16న నాగర్‌కర్నూల్‌ జిల్లా, కొల్లాపూర్‌ మండలం, నార్లాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ కంప్యూటర్ ద్వారా స్విచ్ ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించాడు. నార్లాపూర్ రిజర్వాయర్‌ డెలివరీ సిస్టర్న్స్‌ నుంచి అంజనగిరి రిజర్వాయర్‌లోకి వదిలిన కృష్ణమ్మ జలాలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించాడు.[11][12] ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, పి.రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి, జి. రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్ లతోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ల ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.[13]

జలాశయాలు, వాటి సామర్థ్యాలు

[మార్చు]

గుట్టలను కలుపుతూ మట్టి కట్టలతో నాడు కాకతీయులు చెరువులను నిర్మించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ జలాశయాలను నిర్మించింది. ఆయా జలాశమాలకు స్థానికంగా గుట్టలపై కొలువైన దేవుళ్ళ పేర్లు పెట్టబడ్డాయి.[14]

ప్రాజెక్టులో భాగంగా నిర్మించే జలాశయాల వివరాలు ఇలా ఉన్నాయి:[15]

క్ర.సం. జలాశయం పేరు స్థలం కట్ట పొడవు (కి.మీ.) పూర్తి స్థాయి మట్టం పూర్తి స్థాయి

సామర్థ్యం (టిఎమ్‌సి)

వాడుకోగలిగే

నీరు (టిఎమ్‌సి)

ఆయకట్టు (ఎకరాల్లో)
1 అంజనగిరి జలాశయం నార్లాపూర్ 6.647 +345.000 మీ. 8.51 7.95 0
2 వీరాంజనేయ జలాశయం ఏదుల 7.716 +445.000 మీ. 6.55 5.91 0
3 వెంకటాద్రి జలాశయం వట్టెం 14.75 +542.000 మీ. 16.74 14.47 1,39,000
4 కురుమూర్తిరాయ జలాశయం కరివెన 13.185 +531.000 మీ. 17.34 16.9 1,90,000
5 ఉద్దండాపూర్ జలాశయం ఉద్దండాపూర్ 15.875 +629.000 మీ. 16.03 15.61 4,88,000
6 లక్ష్మీదేవిపల్లి జలాశయం రంగారెడ్డి జిల్లా, లక్ష్మీదేవిపల్లి 6.05 +670.000 మీ. 2.8 2.5 4,13,000
మొత్తం 64.223 67.97 63.34 12,30,000

ప్రయోజనం పొందే ప్రాంతాలు

[మార్చు]

తాగునీరు, పరిశ్రమలు

[మార్చు]

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వలన జంటనగరాలకు తాగునీరు లభిస్తుంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 70 మండలాలకు చెందిన 1226 గ్రామాలకు తాగునీరు లభిస్తుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని పరిశ్రమలకు నీరు అందిస్తారు.

సాగునీరు

[మార్చు]

మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12,30,000 ఎకరాలకు నీరందించే ప్రణాళిక ప్రాజెక్టు రెండవ దశలో ఉంది. మండలాల వారీగా ఆయకట్టు ఇలా ఉంటుంది:[15]

జిల్లా నియోజకవర్గం మండలం ఆయకట్టు (ఎకరాల్లో)
మహబూబ్‌నగర్ దేవరకద్ర అడ్డకల్                  18,692
భూత్‌పూర్                  13,105
మూసాపేట్                    6,000
దేవరకద్ర                  20,655
నియోజక వర్గంలో మొత్తం భూమి                  58,452
జడ్చర్ల బాలానగర్                  30,311
రాజాపూర్                  10,000
జడ్చర్ల                  38,585
మిడ్జిల్                  32,097
నవాబ్‌పేట                  25,576
నియోజక వర్గంలో మొత్తం భూమి              1,36,569
మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ (గ్రామీణ)                    9,692
హన్వాడ                  12,527
నియోజక వర్గంలో మొత్తం భూమి                  22,219
మక్తల్ మాగనూరు                        264
మక్తల్                  17,549
నర్వ                    5,918
ఊటుకూరు                  34,281
నియోజక వర్గంలో మొత్తం భూమి                  58,012
నారాయణపేట దామరగిద్ద                    1,207
ధన్వాడ                  15,734
కోయిలకొండ                  25,794
నారాయణపేట                  16,056
నియోజక వర్గంలో మొత్తం భూమి                  58,791
*పర్గి గండీడ్                  24,414
నియోజక వర్గంలో మొత్తం భూమి                  24,414
*KODANGAL కోస్గి                  26,023
మద్దూరు                  28,687
నియోజక వర్గంలో మొత్తం భూమి                  54,710
మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం భూమి              4,13,167
వికారాబాదు *పరిగి దోమ                  20,473
కుల్కచర్ల                  10,412
పూదూరు                  11,750
పర్గి                  18,587
నియోజక వర్గంలో మొత్తం భూమి                  61,222
తాండూరు బషీరాబాద్                  26,982
పెద్దేముల్                  19,958
తాండూరు                  29,040
యాలాల                  22,112
నియోజక వర్గంలో మొత్తం భూమి                  98,092
వికారాబాదు కోటేపల్లి                  11,622
బంట్వారం                    5,985
ధరూర్                  21,357
మర్పల్లి                  28,049
మోమిన్‌పేట్                  18,753
వికారాబాద్                    9,286
నియోజక వర్గంలో మొత్తం భూమి                  95,052
*కోడంగల్ బొం‌రాస్‌పేట                  29,063
కోడంగల్                  18,003
దౌలతాబాద్                    8,667
నియోజక వర్గంలో మొత్తం భూమి                  55,733
చేవెళ్ళ నవాబ్‌పేట                  12,276
నియోజక వర్గంలో మొత్తం భూమి                  12,276
వికారాబాదు జిల్లాలో మొత్తం భూమి              3,22,375
నాగర్‌కర్నూలు అచ్చంపేట వంగూరు                    1,357
చారకొండ                    1,000
నియోజక వర్గంలో మొత్తం భూమి                    2,357
నగర్‌కర్నూల్ బిజినపల్లి                    7,712
తిమ్మాజీపేట                  23,263
తాడూరు                    4,082
నియోజక వర్గంలో మొత్తం భూమి                  35,057
*కల్వకుర్తి ఊరుకొండ                    4,482
కల్వకుర్తి                  18,957
వెల్దండ                  39,705
నియోజక వర్గంలో మొత్తం భూమి                  63,144
నాగర్‌కర్నూలు జిల్లాలో మొత్తం భూమి              1,00,558
రంగారెడ్డి *కల్వకుర్తి ఆమనగల్లు                  11,261
కడ్తాల్                    4,922
మాడ్గుల్                  30,609
తలకొండపల్లి                  24,104
నియోజక వర్గంలో మొత్తం భూమి                  70,896
చేవెళ్ళ చేవెళ్ళ                  24,028
షాబాద్                  25,369
మొయినాబాద్                  28,535
శంకరపల్లి                  19,331
నియోజక వర్గంలో మొత్తం భూమి                  97,263
షాద్‌నగర్ ఫరూక్‌నగర్                  21,345
కొందుర్గ్                  18,395
చౌదర్‌గూడెం                  13,500
కొత్తూరు                  18,852
నందిగామ                  10,000
కేశంపేట                    1,969
నియోజక వర్గంలో మొత్తం భూమి                  84,061
ఇబ్రహీంపట్నం మంచాల                  15,621
యాచారం                  28,612
ఇబ్రహీంపట్నం                  29,185
హయత్‌నగర్                  12,496
నియోజక వర్గంలో మొత్తం భూమి                  85,914
రాజేంద్రనగర్ శంషాబాద్                    6,601
నియోజక వర్గంలో మొత్తం భూమి                    6,601
మహేశ్వరం మహేశ్వరం                    8,251
కందుకూరు                  10,914
నియోజక వర్గంలో మొత్తం భూమి                  19,165
రంగారెడ్డి జిల్లాలో మొత్తం భూమి              3,63,900
నల్గొండ దేవరకొండ చింతపల్లి                  10,454
చందంపేట                         75
గుండ్లపల్లె                    3,682
దేవరకొండ                  11,773
నియోజక వర్గంలో మొత్తం భూమి                  25,984
మునుగోడు మర్రిగూడ                    4,016
నియోజక వర్గంలో మొత్తం భూమి                    4,016
నల్గొండ జిల్లాలో మొత్తం భూమి                  30,000
ప్రాజెక్టు మొత్తం            12,30,000

మూలాలు

[మార్చు]
  1. "పాలమూరు పనుల్లో వేగం.. బీడు భూములకు సాగునీరు". Prabha News. 2022-11-05. Archived from the original on 2022-11-05. Retrieved 2023-05-27.
  2. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
  3. "CM KCR: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". EENADU. 2023-09-16. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.
  4. V Kurmanath, K. (2023-09-16). "Telangana CM unveils Phase-I of ₹50,000 crore Palamuru-Rangareddy lift irrigation scheme". BusinessLine (in ఇంగ్లీష్). Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.
  5. telugu, NT News (2023-08-12). "CM KCR | 70 ఏండ్ల పాలమూరు తండ్లాటకు మోక్షం.. ఇక కృష్ణానదిని కరువునేలపై వంపనున్న జలవిధాత". www.ntnews.com. Archived from the original on 2023-08-12. Retrieved 2023-08-12.
  6. Desk, HT Telugu (2023-08-11). "Palamur Rangareddy Lift: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు.. కేసీఆర్ హర్షం". Hindustantimes Telugu. Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
  7. ABN (2023-08-11). "PALAMURU : 'పాలమూరు'కు పర్యావరణ అనుమతి లాంఛనమే!". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
  8. "పాలమూరుకు పర్యావరణ అనుమతులు". EENADU. 2023-08-11. Archived from the original on 2023-08-11. Retrieved 2023-08-11.
  9. telugu, NT News (2023-09-03). "Palamuru dry run | పాలమూరు డ్రైరన్‌ సక్సెస్‌..సంబురాలు చేసుకున్న ఇంజినీర్లు". www.ntnews.com. Archived from the original on 2023-09-03. Retrieved 2023-09-03.
  10. "పాలమూరు - రంగారెడ్డి మొదటి మోటార్‌ డ్రైరన్‌ విజయవంతం". EENADU. 2023-09-03. Archived from the original on 2023-09-03. Retrieved 2023-09-03.
  11. telugu, NT News (2023-09-16). "Paalamuru | 70 ఏండ్ల కల సాకారం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్పెషల్‌". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.
  12. "Telangana CM KCR inaugurates lift irrigation project to fill Anjanagiri reservoir with water from Krishna River". The Indian Express (in ఇంగ్లీష్). 2023-09-16. Archived from the original on 2023-09-16. Retrieved 2023-09-17.
  13. Chandrashekhar, B. (2023-09-16). "KCR commissions first pump of Palamuru-Rangareddy project". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-17.
  14. telugu, NT News (2023-05-15). "Telangana | అడుగు దూరంలో అరవై ఏండ్ల కల.. శరవేగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు". www.ntnews.com. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-28.
  15. 15.0 15.1 "పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్" (PDF). తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ. Retrieved 2020-07-15.{{cite web}}: CS1 maint: url-status (link)