కన్నెగంటి బ్రహ్మానందం
కన్నెగంటి బ్రహ్మానందం | |
---|---|
జననం | |
వృత్తి | హాస్య నటుడు |
జీవిత భాగస్వామి | లక్ష్మి[1] |
పిల్లలు | రాజా గౌతమ్, సిద్ధార్థ్[1] |
తల్లిదండ్రులు |
|
కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.[2] 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.[3] ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు.[4] 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది.[1] కన్నెగంటి బ్రహ్మానందం రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు.
బాల్యం
బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో పల్నాడు జిల్లా (క్రితం గుంటూరు జిల్లా), ముప్పాళ్ళ మండలం, చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీ కన్నెగంటి నాగలింగాచారి, తల్లి శ్రీమతి కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. తను పుట్టగానే తల్లికి అనారోగ్యం వచ్చి, అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి.
చదువు
సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసాడు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎమ్మే పట్టా పుచ్చుకొన్నాడు. బ్రహ్మానందం అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు ఉపాధ్యాయ పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[5][1]
సినీరంగ ప్రవేశం
ఇప్పట్లోలా ఇలా వెళ్లి అలా సినిమాలు చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటూ జనాభా కూడా ఎక్కువే! అమ్మ అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే తనకు వినోదం! తండ్రి రంగస్థల నటుడే అయినా సీరియస్ ప్రొఫెషనేమీ కాదు. తల్లిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకీ అబ్బిందేమోనని బ్రహ్మానందం భావిస్తాడు. బాల్యంలో మారాం చేయకుండా బడికి బుద్ధిగానే వెళ్ళినా, ఎస్.ఎస్.ఎల్.సి.లో గట్టిగానే పాసైనా, చిన్న తప్పులు చేసినా, తండ్రి నుంచి బుద్ధితక్కువ వాడంటూ చివాట్లు తప్పేవి కావు. అయితే తెలివితక్కువ వాడని మాత్రం ఆయన ఎన్నడూ అనలేదంటాడు. చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు (మిమిక్రీ) చేయడం, సాంస్కృతిక బృందాలలో (కల్చరల్ ఆర్గనైజషన్) చురుకుగా పాల్గొనడం ఈయనకు అలవడింది. అత్తిలిలో ఉపన్యాసకుడుగా ఉంటూనే పలు నిజజీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందిన బ్రహ్మానందం 1985లో దూరదర్శన్లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించగా, మంచి స్పందన వచ్చింది. దూరదర్శన్ తప్ప, ఇతర ఛానెళ్ళేవీ లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తు పట్టేవారు.
తొలి సినిమా
బ్రహ్మానందాన్ని మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవ్యక్తి దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ.[3] నరేశ్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించాడు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1 వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా, తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ! నా పెళ్ళంట!.
పేరు తెచ్చిన పాత్ర
"...పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే అహ! నా పెళ్ళంట ! లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. "అరగుండు వెధవా" అని కోటతో తిట్టించుకొన్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం, తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాల తను దర్శకత్వం వహిస్తున్న "చంటబ్బాయ్" సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి పరిచయం చేయడం, తర్వాత "పసివాడి ప్రాణం"లో ఓ చిన్న పాత్ర వేయడం. ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహ నా పెళ్ళంటలో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాలను, అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు ను, ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికీ మరువలేను అంటాడు. ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో యేడాదికి 35 చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం.
ప్రజాదరణ పొందిన ఊత పదాలు
- నీ యంకమ్మా (చిత్రం భళారే విచిత్రం చిత్త్రంలోని సంభాషణ)
- పండగ చేసుకో (భిక్షగాడి పాత్ర ఆలీతో పోకిరి చిత్రంలో అర్థ రూపాయి దానం చేసి అనే సంభాషణ)
- రకరకాలుగా ఉంది మాస్టారూ (నువ్వు నాకు నచ్చావ్ చిత్రం)
- ఖాన్ తో గేమ్స్ ఆడకు... శాల్తీలు లేచిపోతాయి... (మనీ మనీ చిత్రం)
- దొరికాడా ఏశెయ్యండి... (పట్టుకోండి చూద్దాం)
- జఫ్ఫా (చాలా చిత్రాలలో)
- ఇరుకుపాలెం వాళ్లంటే ఏకసెక్కాలుగా ఉందా? (ధర్మచక్రం)
- నా పెర్ఫార్మెన్స్ మీకు నచినట్లైతే ఎస్సెమ్మెస్ చేయండి (దూకుడు)
- నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు (ఢీ)
కుటుంబం
బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతం, సిద్ధార్థ్. ఒకరు ఎం. బి. ఏ మరొకరు బి. టెక్ పూర్తి చేశారు. గౌతమ్ కథానాయకుడిగా పల్లకిలో పెళ్లికూతురు అనే చిత్రం వచ్చింది. బ్రహ్మానందం తండ్రికి శిల్పకళ తెలియడంతో ఆయనకు కూడా ఈ కళ కొద్దిగా అలవడింది. ఖాళీ సమయాల్లో బొమ్మలు కూడా గీస్తుంటాడు.[3][6] తండ్రి నుంచే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది.[1] బ్రహ్మానందం మనుమడి పేరు "పూర్ణ చంద్ర చారి".
నటించిన చిత్రాలు
కొన్ని చిత్రాలు
- చిట్టెమ్మ మొగుడు (1992)
- మామా కోడలు (1993)
- ముగ్గురు మొనగాళ్లు (1994)
- ఆంటీ (1995)
- జాబిలమ్మ పెళ్ళి (1996)
- సాహసవీరుడు - సాగరకన్య (1996)[7]
- పెళ్ళి చేసుకుందాం (1997)[8]
- ఆరో ప్రాణం (1997)
- ప్రేమసందడి (2001)
- చెప్పాలని ఉంది (2001)
- ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)
- అందాల ఓ చిలకా (2001)
- కలిసి నడుద్దాం (2001)
- అక్కా బావెక్కడ (2001)
- రామ్మా! చిలకమ్మా (2001)
- ఆంధ్రావాలా[9]
- ఫూల్స్ (2003)
- నీతో వస్తా (2003)
- ఐతే ఏంటి (2004)
- కొడుకు (2004)
- ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
- మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
- ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)
- శివ్ శంకర్ (2004)
- కాశి (2004)
- ఆపరేషన్ దుర్యోధన (2007)
- గణేష్ (2009)
- నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ (2009)
- నాగవల్లి (2010)[10]
- గ్రాడ్యుయేట్ (2011)
- గల్లీ కుర్రోళ్ళు (2011)
- నా ఇష్టం (2012)
- జీనియస్ (2012)
- అధినాయకుడు (2012)
- ధోని (2012)
- బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ (2013)
- సేవకుడు (2013)
- ఒక్కడినే (2013)
- రామాచారి (2013)
- పవిత్ర (2013)[11]
- బూచమ్మ బూచోడు (2014)[12]
- జోరు (2014)[13]
- అమృతం చందమామలో (2014)
- మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో (2014)
- బన్నీ అండ్ చెర్రీ (2013)
- యమలీల 2 (2014)
- అఖిల్ (2022)
- రంగమార్తాండ (2023)
- కీడా కోలా (2023)
- ది రాజా సాబ్ (2024)
- పురుషోత్తముడు (2024)
- ఉత్సవం (2024)
అవార్డులు - సత్కారాలు
- నటుడిగా గుర్తింపు నిచ్చిన అహ నా పెళ్లంట చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది. మనీ, అనగనగా ఒక రోజు, అన్న, వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందాడు.
- ఐదు కళాసాగర్ పురస్కారాలు
- తొమ్మిది వంశీ బర్కిలీ పురస్కారాలు
- పది సినీగోయర్స్ పురస్కారాలు
- ఎనిమిది భరతముని పురస్కారాలు
- ఒక్క ఫిలింఫేర్ పురస్కారము
- రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం
- ఆటా (అమెరికా), సింగపూర్, మలేషియా, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నాడు
- విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు
- పద్మమోహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది
- సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్, జర్నలిస్టు అసోసియేషన్ వారు స్వర్ణ హస్త కంకణాన్ని బహూకరించి, స్వర్ణ కమలాలతో "కనకాభిషేకం" చేశారు.
- అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటును అందుకున్నాడు
- విఖ్యాత హస్యనటులయిన రేలంగి, రాజబాబు, చలం, అల్లు, సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకోవడం అరుదైన ఘటన!
- ‘హాస్య కళా విధాత ’ అవార్డును టీ.ఎస్.ఆర్ కాకతీయ లలిత కళాపరిషత్, వారు బహూకరించారు. (12.03.2018)[14]
ఇతర విశేషాలు
- 'రేలంగి తన ప్యాంటూ షర్టూ మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ తెరమీదికొచ్చాడ' ని కితాబులందు కొన్న నటుడు బ్రహ్మానందం
- రెండు దశాబ్దాలుగా తన హాస్యనటనతో ఎన్నో మైలురాళన్లి అధిగమించి దాదాపు 745 చిత్రాల్లో నటించిన ఘనత వహించారు.
- తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం.
- "శ్రీ బ్రహ్మానందం గారు పైకి హాస్య నటుడిగా కనుపించినా ఆయన ఎంతటి భక్తి తత్పరులో, సాహిత్య ప్రియులో, గంభీర వ్యక్తిత్వ సంపన్నులో నాకు వ్యక్తి గతంగా ఎరుక" అని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
- "హాస్యనటుల్లో బ్రహ్మానందం చదువుకున్నవాడు కావటం వల్ల సైకాలజీ వంటి వాటి పట్ల అవగాహన బాగా ఉందని అనిపిస్తుంది. ఆయనలో నిగూఢమైన మరొక మనిషి, ఒక వేదాంతి, ఒక స్కాలర్ కూడా ఉన్నారనిపిస్తుంది" అని కీ.శే. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు గతంలో ఒక సావనీర్ లో పేర్కొన్నారు.
- ప్రతిష్ఠాత్మకమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోఅత్యధిక సినిమాలు నటించి నందుకు చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటుడు.
రచనలు
- నేను[15]
బయటి లింకులు
- బ్రహ్మానందం గురించి "ది హిందూ" లో వ్యాసం Archived 2008-02-26 at the Wayback Machine
- బ్రహ్మానందం అభిమానుల సైటు
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 సురేష్, కృష్ణమూర్తి. "Serious about his joking". thehindu.com. ది హిందు. Retrieved 4 February 2018.
- ↑ "Most screen credits for a living actor". guinnessworldrecords.com. గిన్నిస్ ప్రపంచ రికార్డులు. Retrieved 4 February 2018.
- ↑ 3.0 3.1 3.2 మహమ్మద్, అన్వర్. "ఒప్పించుకు తిరుగువాణ్ణి". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 4 February 2018. Retrieved 4 February 2018.
- ↑ "Brain teasers with Brahmanandam". The Hindu. Chennai, India. 14 July 2009. Archived from the original on 17 ఏప్రిల్ 2012. Retrieved 4 ఫిబ్రవరి 2018.
- ↑ "రాజబాబు నుంచి సుకుమార్ వరకు.. ఉపాధ్యాయ వృత్తి నుంచి సినీ రంగంలోకి వచ్చిన ప్రముఖులు వీళ్లే." (in ఇంగ్లీష్). 8 September 2022. Retrieved 8 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ ఆంధ్రజ్యోతి, నవ్య (ఓపన్ పేజీ) (16 August 2020). "నాలో దాగిన చిత్రకళ నాతో పాటే ప్రయాణించింది!". www.andhrajyothy.com. Archived from the original on 28 September 2020. Retrieved 12 December 2020.
- ↑ ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Retrieved 22 June 2020.[permanent dead link]
- ↑ తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
- ↑ FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
- ↑ "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
- ↑ "Pavitra to hit screens on May 10". Deccan Chronicle. 10 May 2013. Archived from the original on 14 అక్టోబరు 2016. Retrieved 28 జూలై 2019.
- ↑ తెలుగు గ్రేట్ ఆంధ్ర, రివ్యూ (5 September 2014). "సినిమా రివ్యూ: బూచమ్మ బూచోడు". www.telugu.greatandhra.com. Retrieved 7 August 2020.
- ↑ The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
- ↑ సాక్షి, మహబూబ్‌నగర్ (12 March 2018). "బ్రహ్మానందానికి 'హాస్య నట బ్రహ్మ' అవార్డు". Retrieved 13 March 2018.
- ↑ Andhrajyothy (28 December 2023). "'నేను'గా.. మనందరి బ్రహ్మానందం!". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- Pages using the JsonConfig extension
- All articles with dead external links
- నంది పురస్కారాలు
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా హాస్యనటులు
- 1956 జననాలు
- నంది ఉత్తమ హాస్యనటులు
- జీవిస్తున్న ప్రజలు
- గుంటూరు జిల్లా సినిమా నటులు
- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయులు
- గుంటూరు జిల్లా ఉపాధ్యాయులు