కోస్గి పురపాలకసంఘం
కోస్గి పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°56′27″N 77°43′20″E / 16.9408546°N 77.7223162°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నారాయణపేట |
మండలం | కోస్గి |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | ఎం. శిరీష |
- వైస్ చైర్పర్సన్ | కె. అన్నపూర్ణ |
జనాభా (2011) | |
- మొత్తం | 21,318 |
- పురుషుల సంఖ్య | 10,651 |
- స్త్రీల సంఖ్య | 10,667 |
- గృహాల సంఖ్య | 4,100 |
పిన్ కోడ్ | 509339 |
ఎస్.టి.డి కోడ్ | 08505 |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
కోస్గి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] కోస్గి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని, కొడంగల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న కోస్గి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
[మార్చు]కోస్గి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16.98°N 77.71°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. జిల్లా కేంద్రం నారాయణపేట నుండి 48 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 21318 మంది కాగా, అందులో 10651 మంది పురుషులు, 10667 మంది మహిళలు ఉన్నారు. 4,100 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 4 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
[మార్చు]పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 16 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎం. శిరీష చైర్‌పర్సన్‌గా, కె. అన్నపూర్ణ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
[మార్చు]- కంతూరి కందురమ్మ
- చింతల గోవర్ధన్
- లింగం లక్ష్మి
- జనార్ధన్ రెడ్డి
- చిన్న బ్యాండప్ప
- భాను నాయక్
- తుడుం మంజుల శ్రీనివాస్
- నాగులపల్లి పద్మావతి
- కె. అన్నపూర్ణ (వైస్ చైర్పర్సన్)
- రస్నం అనితా బాలరాజ్
- వై. బాలేష్
- శ్రీనివాస్
- బెజ్జు సంగీత
- ఎండి ఇద్రిస్
- ఎం. శిరీష రాజేష్ (చైర్పర్సన్)
- బెస్ట ఎల్లమ్మ
మూలాలు
[మార్చు]- ↑ "Kosgi Municipality". kosgimunicipality.telangana.gov.in. Archived from the original on 8 ఆగస్టు 2020. Retrieved 22 March 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 22 March 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 22 March 2021.
- ↑ "Basic Information of Municipality, Kosgi Municipality". kosgimunicipality.telangana.gov.in. Retrieved 22 March 2021.[permanent dead link]
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 22 March 2021.
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 22 March 2021.
వెలుపలి లంకెలు
[మార్చు]- కోస్గి పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2020-08-08 at the Wayback Machine