గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ, మెదక్ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 17°51′0″N 78°40′48″E |
మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
గజ్వేల్ నియోజక వర్గ చరిత్ర
[మార్చు]గజ్వేల్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఉప ఎన్నికతో సహా 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, పీడీఎఫ్ ఒకసారి గెలిచాయి. 2014 ఎన్నికల్లో తొలిసారిగా టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ అధినేత కేసీఆర్ విజయం సాధించారు. 1957లో గజ్వేల్ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో జనరల్ స్థానంలో ఉన్న ఆర్.నరసింహారెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు చెప్పడంతో ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలోనూ నర్సింహారెడ్డి గెలిచారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి కొడకండ్ల గ్రామానికి చెందిన జి.సైదయ్య నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. గజ్వేల్ నుంచి 1989, 2004 ల్లో గెలిచిన గీతారెడ్డి జనరల్ స్థానంగా మారడంతో 2009లో జహీరాబాద్‌కు మారారు. ఈమె రిపబ్లికన్ పార్టీ నాయకురాలు ఈశ్వరీబాయి కుమార్తె. గజ్వేల్ నుంచి గెలిచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌ల్లో మంత్రిగా పనిచేశారు. 1962 నుంచి రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉన్న గజ్వేల్ 2009లో జనరల్‌గా మారింది. పునర్ విభజనలో రద్దయిన దొమ్మాట నుంచి కొండపాక మండలం కొత్తగా గజ్వేల్‌లోచేరింది. పూర్వం ఉన్న జగదేవపూర్, ములుగు మండలాలు యథాతథంగా ఉన్నాయి. తూప్రాన్ మండలం పూర్తిగా చేరింది. గజ్వేల్ మండలంలోని రెండు గ్రామాలు అంతకు ముందు దొమ్మాటలో ఉండేవి. పునర్ విభజనకు ముందు దొమ్మాటలో ఉన్న వర్గల్‌లోని 2 గ్రామాలు గజ్వేల్‌లో కలిశాయి. దౌల్తాబాద్ మండలంలోని 7 గ్రామాలు దొమ్మాట స్థానంలో ఏర్పడిన దుబ్బాకలో కలిశాయి.
నియోజకవర్గంలోని మండలాలు
[మార్చు]- గజ్వేల్
- కొండపాక
- గజ్వేల్
- జగదేవ్‌పూర్
- వర్గల్
- ములుగు
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2023[3] కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ 2018 కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ 2014 కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ 2009 తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ 2004 జె. గీతారెడ్డి కాంగ్రెస్ దుర్గయ్య టీడీపీ 1999 బి.సంజీవరావు టీడీపీ జె. గీతారెడ్డి కాంగ్రెస్ 1994 జి. విజయ రామారావు టీడీపీ జె. గీతారెడ్డి కాంగ్రెస్ 1989 జె. గీతారెడ్డి కాంగ్రెస్ బి.సంజీవరావు టీడీపీ 1985 బి.సంజీవరావు టీడీపీ గజ్వేల్ సైదయ్య కాంగ్రెస్ 1983 ఎ.సాయిలు టీడీపీ గజ్వేల్ సైదయ్య కాంగ్రెస్ 1978 గజ్వేల్ సైదయ్య[4] కాంగ్రెస్ సాయిలు జనతా 1972 గజ్వేల్ సైదయ్య కాంగ్రెస్ సాయిలు ఇండిపెండెంట్ 1967 గజ్వేల్ సైదయ్య కాంగ్రెస్ జి.హెచ్ కృష్ణమూర్తి ఇండిపెండెంట్ 1962 గజ్వేల్ సైదయ్య ఇండిపెండెంట్ జి.వెంకటస్వామి కాంగ్రెస్
2019 ఎన్నికలు :
[మార్చు]2019 ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి గజ్వేల్ నుంచి టీఆర్ఎస్ తరపున బరిలో దిగారు. కాంగ్రెస్ తరపున ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డిపై 55 వేల ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలిచారు. మరోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత పరిణామాల్లో ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ చేరి ఎఫ్డీసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
2014 ఎన్నికలు :
[మార్చు]2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, టీడీపీ నుంచి ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ దాదాపు 20 వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై గెలిచారు.
2009 ఎన్నికలు
[మార్చు]2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతాప్‌రెడ్డి పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ నుండి టి.నర్సారెడ్డి పోటీపడ్డాడు. భారతీయ జనతా పార్టీ తరఫున ఎ.సురేశ్ బాబు, ప్రజారాజ్యం పార్టీ తరఫున జి.ఎలక్షన్ రెడ్డి, లోక్‌సత్తా పార్టీ తరఫున రామ్మోహనరావు పోటీచేశారు.[5]
2004 ఎన్నికలు
[మార్చు]2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి జెట్టి గీత తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.దుర్గయ్య పై 24260 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. గీత 71955 ఓట్లు సాధించగా, దుర్గయ్యకు 47695 ఓట్లు లభించాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Andhra Bhoomi (14 October 2018). "చరిత్రను ఇముడ్చుకుంది". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
- ↑ Namasthe Telangana (12 April 2022). "శాసనసభ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Eenadu (26 October 2023). "అందని ద్రాక్ష 'ఎమ్మెల్యే'". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009