Jump to content

శ్రీలక్ష్మి

వికీపీడియా నుండి
శ్రీలక్ష్మి

జన్మ నామంమానాపురం లక్ష్మి
జననం జూలై ౩౦
మద్రాసు

శ్రీలక్ష్మి సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర హాస్యనటి. ఈమె నటులు అమర్‌నాథ్ కుమార్తె, రాజేష్ సోదరి.[1]

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

అమర్‌నాథ్ చిన్నతనంలోనే చనిపోవడంతో, శ్రీలక్ష్మి ఫ్యామిలీ కొన్ని కష్టాలు ఎదుర్కొంది. దాంతో ఆవిడ సినిమాల్లోకి రావాల్సివచ్చింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభోదయం సినిమా, బాపు దర్శకత్వంలో వంశవృక్షం సినిమాలలో కథానాయిక అవకాశం వచ్చిందికానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాల్లో చేయలేకపోయింది. అక్కినేని నటించిన గోపాలకృష్ణుడు సినిమాలోని ఒక పాటలో అక్కినేని పల్లవికో అమ్మాయితో కనిపిస్తాడు. 'అమరనాథ్‌గారి అమ్మాయినే పెట్టండి. వాళ్ల కుటుంబానికి సాయం చేసినవారం అవుతాం' అని అక్కినేని చెప్పడంతో ఒక అమ్మాయికోసం శ్రీలక్ష్మిని తీపుకున్నారు. అక్కినేని పక్కన పంజాబీ డ్రస్ వేసుకొని శ్రీలక్ష్మి డాన్స్ చేసింది. అయినా అవకాశాలు రాలేదు.

తమిళ, మలయాళంలో అయిదారు సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. ఆతర్వాత అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కె.బాపయ్య దర్శకత్వంలో వచ్చిన నివురుగప్పిన నిప్పులో మొదటిసారి కమెడియన్ గా (నగేష్ పక్కన) చేశారు. సినిమా విజయం సాధించలేదుకానీ, శ్రీలక్ష్మి పాత్ర సూపర్‌ హిట్టయ్యింది. తర్వాత జంధ్యాల గారి రెండుజెళ్ళ సీతలో చిన్న అవకాశం దొరికింది. ఒక్క సీన్ చేయగానే, డైరెక్టర్ శ్రీలక్ష్మిగారి టాలెంట్‌ని గుర్తించి, క్యారెక్టర్ని పొడిగించారు. ఆతర్వాత జంధ్యాల గారి చాలా సినిమాల్లో నటించారు. రెండు జెళ్ళ సీత సినిమాలో చేసిన హాస్యపాత్రకు గాను ఆమెకు ఉత్తమ హాస్యనటిగా కళాసాగర్ అవార్డు లభించింది. అయితే ఆ పాత్రతో ఆమె హాస్యనటిగా స్థిరపడడంతో వరసగా 13 ఏళ్ళపాటు అదే పురస్కారం పొందారు.[2]

నటించిన సినిమాలు

[మార్చు]

సీరియళ్ళు

[మార్చు]

వెబ్​సిరీస్‌

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఐ.ఎమ్.డి.బి.లో శ్రీలక్ష్మి పేజీ.
  2. పులగం, చిన్నారాయణ (ఏప్రిల్ 2005). జంధ్యా మారుతం (I ed.). హైదరాబాద్: హాసం ప్రచురణలు.
  3. Abbayi class Ammayi mass Movie Review {1.5/5}: Critic Review of Abbayi class Ammayi mass by Times of India, retrieved 15 May 2020
  4. "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.