సుహాసిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


సుహాసిని

సుహాసిని ముఖచిత్రం
జన్మ నామంసుహాసిని
జననం (1971-08-15) 1971 ఆగస్టు 15 (వయసు 53)
భార్య/భర్త మణిరత్నం
ప్రముఖ పాత్రలు సిరివెన్నెల
సంసారం ఒక చదరంగం
స్వాతి (సినిమా)

సుహాసిని (జ. 1971 ఆగస్టు 15) దక్షిణ భారత నటి. దర్శకుడు మణిరత్నంను వివాహమాడింది. తమిళనాడులో గల చెన్నై పట్టణంలో జన్మించింది. నటనలోనే కాకుండా కథకురాలిగా, నిర్మాతగా అనుభవముంది. ఈవిడ తొలిసారి 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంలో నటించింది.

సుహాసిని, భారతీయ నటుడు కమల హాసన్ అన్న, నటుడు చారు హాసన్ కూతురు. 1988లో ఈమె ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంను పెళ్ళిచేసుకున్నది. వీరికి 15 యేళ్ళ వయసున్న కొడుకు ఉన్నాడు.

1996లో, దర్శకత్వములో అడుగుపెట్టి, జి.వి.ఫిల్మ్స్ నిర్మించిన ఇందిర సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుహాసినినే సమకూర్చింది. ఈమె, ఈమె భర్త, తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ టాకీస్ యొక్క నిర్వహణ పనులు చూసుకుంటూ ఉంటారు. మద్రాస్ టాకీస్ లో మణిరత్నం సోదరుడు కీ.శే. జి.శ్రీనివాసన్ కూడా ఉండేవారు. సుహాసిని 1985లో కె.బాలచందర్ దర్శకత్వము వహించిన తమిళ సినిమా సింధుభైరవిలో తన నటనకు గాను 1986లో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారము (ఉత్తమనటి) అవార్డు అందుకున్నది.

ఈమె తమిళ, తెలుగు, కన్నడతో పాటు మళయాళము భాషా చిత్రాలలో కూడా నటించింది. 1999లో ఎ.ఎఫ్.ఐ చిత్రోత్సవముకు ఎన్నికైన వానప్రస్థమ్ సినిమాలో సుహాసిని తన నటనకుగాను ప్రశంసలందుకున్నది.

చిత్రసమాహారం

[మార్చు]

నటిగా

[మార్చు]

తెలుగు

[మార్చు]

ఇతర భాషలు

[మార్చు]

వెబ్ సిరీస్

[మార్చు]

దర్శకురాలిగా

[మార్చు]

కథకురాలుగా

[మార్చు]

నిర్మాతగా

[మార్చు]

చిత్రమాల

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
  2. ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడ‌వురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.

బాహ్య లంకెలు

[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=సుహాసిని&oldid=4303185" నుండి వెలికితీశారు