మధ్య ప్రదేశ్

వికీపీడియా నుండి
(మధ్య ప్రదేశ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Madhya Pradesh
From top, left to right: UNESCO Temples at the Khajuraho Group of Monuments, Great Stupa of Sanchi, Chital deer at Kanha National Park, Marble Rocks near Jabalpur, Bhimbetka rock shelters and Jahaz Mahal in the ancient city of Mandu
Etymology: Central Lands
Nickname: 
"Heart of India"
Motto
Satyameva Jayate (Truth alone triumphs)
Anthem: Mera Madhya Pradesh (My Madhya Pradesh)[1]
The map of India showing Madhya Pradesh
Location of Madhya Pradesh in India
Country India
RegionCentral India
Before wasMadhya Bharat
Vindhya Pradesh
Bhopal state
Formation1 November 1956
CapitalBhopal
Largest CityIndore
Districts52 (10 divisions)
Government
 • BodyGovernment of Madhya Pradesh
 • GovernorMangubhai C. Patel
 • Chief MinisterShivraj Singh Chouhan[2] (BJP)
State LegislatureUnicameral
 • AssemblyMadhya Pradesh Legislative Assembly (230 seats)
National ParliamentParliament of India
 • Rajya Sabha11 seats
 • Lok Sabha29 seats
High CourtMadhya Pradesh High Court
విస్తీర్ణం
 • Total3,08,245 కి.మీ2 (1,19,014 చ. మై)
 • Rank2nd
Dimensions
 • Length605 కి.మీ (376 మై.)
 • Width870 కి.మీ (540 మై.)
Elevation
500 మీ (1,600 అ.)
Highest elevation1,352 మీ (4,436 అ.)
Lowest elevation
90 మీ (300 అ.)
జనాభా
 (2011)[3]
 • TotalNeutral increase 7,26,26,809
 • Rank5th
 • జనసాంద్రత240/కి.మీ2 (600/చ. మై.)
 • Urban
27.63%
 • Rural
72.37%
DemonymMadhya Pradeshis
Language
 • OfficialHindi[4]
 • Official ScriptDevanagari script
GDP
 • Total (2021-22)Neutral increase11.69 trillion (US$150 billion)
 • Rank10th
 • Per capitaNeutral increase1,24,685 (US$1,600) (24th)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-MP
Vehicle registrationMp
HDI (2018)Increase 0.606 Medium[6] (34rd)
Literacy (2011)Increase 70.6% (27th)
Sex ratio (2011)970/1000 [7] (15th)
Symbols of Madhya Pradesh
Emblem of Madhya Pradesh
SongMera Madhya Pradesh (My Madhya Pradesh)[1]
LanguageHindi[4]
BirdIndian paradise flycatcher
FishMahseer
FlowerWhite lily
FruitMango
MammalBarasingha
TreeBanyan Tree
State Highway Mark
State Highway of Madhya Pradesh
MP SH1 - MP SH53
List of State Symbols

మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) (హిందీ:मध्य प्रदेश) - పేరుకు తగినట్లే భారతదేశం మధ్యలో ఉన్న ఒక రాష్ట్రం. దీని రాజధాని నగరం భోపాల్. ఇంతకు పూర్వం దేశంలో వైశాల్యం ప్రకారం మధ్యప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రంగా ఉండేది. కాని 2000 నవంబరు 1 న మధ్యప్రదేశ్‌లోని కొన్నిభాగాలను వేరుచేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.

భౌగోళికం

[మార్చు]

మధ్యప్రదేశ్ భౌగోళిక స్వరూపంలో నర్మదా నది, వింధ్య పర్వతాలు, సాత్పూరా పర్వతాలు ప్రధాన అంశాలు. తూర్పు, పడమరలుగా విస్తరించిన ఈ రెండు పర్వతశ్రేణుల మధ్య నర్మదానది ప్రవహిస్తున్నది. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు తరతరాలుగా ఈ కొండలు, నది హద్దులుగా పరిగణింపబడుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన గుజరాత్, వాయవ్యాన రాజస్థాన్, ఈశాన్యాన ఉత్తర ప్రదేశ్, తూర్పున ఛత్తీస్‌గఢ్, దక్షిణాన మహారాష్ట్ర రాష్ట్రాలతో హద్దులున్నాయి.

భాషా (యాస) పరంగాను, సాంస్కృతికంగాను మధ్యప్రదేశ్‌ను ఈ ప్రాంతాలుగా విభజింపవచ్చును.

  • మాల్వా: వింధ్య పర్వతాలకు ఉత్తరాన ఉన్న పీఠభూమి. విశిష్టమైన భాష, సంస్కృతి కలిగి ఉంది. పెద్ద నగరం ఇండోర్. బుందేల్‌ఖండ్ ప్రాంతపు అంచున భోపాల్ నగరం ఉంది. మాల్వా ప్రాంతంలో ఉజ్జయిని ఒక చారిత్రాత్మక పట్టణం.
  • నిమర్ (నేమార్): నర్మదానదీలోయ పశ్చిమభాగం, వింధ్యపర్వతాలకు దక్షిణాన ఉంది.
  • బుందేల్‌ఖండ్: రాష్ట్రానికి ఉత్తరభాగాన ఉన్న కొండలు, సారవంతమైన మైదానాలు. ఈ ప్రాంతం క్రమంగా ఉత్తరాన ఉన్న గంగామైదానం వైపు ఏటవాలుగా ఉంటుంది. బుందేల్‌ఖండ్‌లో గ్వాలియర్ ముఖ్య నగరం.
  • బాగెల్‌ఖండ్: రాష్ట్రానికి ఈశాన్యాన ఉన్న పర్వతమయప్రాతం. వింధ్యపర్వతాల తూర్పుభాగం బాగెల్‌ఖండ్‌లోనే ఉన్నాయి.
  • మహాకోషల్ (మహాకౌశాల్): ఆగ్నేయ ప్రాంతం - నర్మదానది తూర్పు భాగం, తూర్పుసాత్పూరా పర్వతాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. మహాకోషల్‌లో ముఖ్యనగరం జబల్‌పూర్.

జిల్లాలు

[మార్చు]

మధ్య ప్రదేశ్‌లోని 48జిల్లాలను 9 డివిజన్‌లుగా విభజించారు. ఆ డివిజన్లు: భోపాల్, చంబల్, గ్వాలియర్, హోషంగాబాద్, ఇండోర్, జబల్‌పూర్, రేవా, సాగర్, ఉజ్జయిని.

చరిత్ర

[మార్చు]

ప్రాచీన చరిత్ర

[మార్చు]

ఉజ్జయిని ("అవంతీ నగరం" అనికూడా పేరు) ఒకప్పటి "మాల్వా" రాజ్యానికి రాజధాని. క్రీ.పూ. 6వ శతాబ్దిలోనే భారతదేశంలో నగరాలు, నాగరికత రూపుదిద్దుకొటున్న సమయంలో ఇది ఒక ప్రధాన నాగరిక కేంద్రంగా వర్ధిల్లింది. ధానికి తూర్పున బుందేల్‌ఖండ్ ప్రాంతంలో "ఛేది" రాజ్యం ఉండేది. క్రీ.పూ. 320లో చంద్రగుప్త మౌర్యుడు ఉత్తరభారతాన్ని అంతటినీ మౌర్య సామ్రాజ్యం క్రిందికి తెచ్చాడు. అందులో ఇప్పటి మధ్యప్రదేశ్ అంతా కలిసి ఉంది. క్రీ.పూ. 321 నుండి 185 వరకు సాగిన మౌర్యసామ్రాజ్యం అశోక చక్రవర్తి అనంతరం పతనమయ్యింది. అప్పుడు మధ్యభారతంపై ఆధిపత్యంకోసం శకులు, కుషాణులు, స్థానిక వంశాలు పోరుసాగించాయి.

క్రీ.పూ.1వ శతాబ్దం నాటికి పశ్చిమభారతంలో ఉజ్జయిని ప్రధాన వాణిజ్యకేంద్రం. గంగామైదానం ప్రాంతాలకు, అరేబియా సముద్రం తీరానికి మధ్యనున్న వాణిజ్యమార్గంలో ఉన్న నగరం. హిందూ, బౌద్ధ మతాల కేంద్రం. సా.శ. 1 నుండి మూడవ శతాబ్దం వరకు మధ్యప్రదేశ్‌లో కొంతభాగం శాతవాహనుల అధీనంలో ఉండేది. 4, 5 శతాబ్దాలలో ఉత్తరభారతదేశం గుప్త సామ్రాజ్యంలో స్వర్ణ యుగంగా వర్ధిల్లింది. అప్పుడు బంగాళాఖాతం, అరేబియా సముద్రం మధ్యభాగమైన దక్కన్ పీఠభూమిని పాలించే వాకాటకుల రాజ్యం గుప్తుల రాజ్యానికి దక్షిణపు హద్దు. 5వ శతాబ్దాంతానికి ఈ సామ్రాజ్యాలు పతనమయ్యాయి.

మధ్యయుగం చరిత్ర

[మార్చు]

"తెల్ల హూణుల" (Hephthalite) దండయాత్రలతో గుప్తసామ్రాజ్యం కూలిపోయింది. దానితో భారతదేశం చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. 528లో యశోధర్ముడు అనే మాళ్వా రాజు హూణులను ఓడించి, వారి రాజ్యవిస్తరణకు అడ్డుకట్టవేశాడు. తానేసార్‌కు చెందిన హర్షుడు అనే రాజు ఉత్తరభారతాన్ని కొద్దికాలం ఒకటిగా చేయగలిగాడు. ఆయన 647లో మరణించాడు. తరువాతికాలంలో రాజపుత్ర వంశాల ప్రాభవం మొదలయ్యింది. మాళ్వా పారమారులు, బుందేల్‌ఖండ్ చందేలులు వీరిలో ముఖ్యులు. సుమారు 1010-1060 మధ్య పాలించిన పారమఅర రాజు భోజుడు గొప్ప రచయిత, విజ్ఞాని (polymath). 950-1050 మధ్యలో చందేలులు ఖజురాహో మందిరాలను నిర్మించారు.

మహాకోసలలోని "గొండ్వానా"లో గోండ్ రాజ్యాలు నెలకొన్నాయి. 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు మధ్యప్రదేశ్‌ను జయించారు. ఢిల్లీ సుల్తానుల పతనం తరువాత మళ్ళీ కొంతకాలం స్థానిక స్వతంత్రరాజుల పాలన సాగింది. గ్వాలియర్‌లో తోమార రాజపుత్రులు, మాళ్వాలో ముస్లిం సులతానులు (వీరి రాజధాని "మండూ") రాజ్యం చేశారు. 1531లో మాళ్వా సులతానులను గుజరాత్ సుల్తానులు జయించారు.

ఆధునిక యుగ చరిత్ర

[మార్చు]

అక్బరు చక్రవర్తి (1542-1605) కాలంలో మధ్యప్రదేశ్‌లో అధికభాగం ముఘల్ సామ్రాజ్యం క్రిందికి వచ్చింది. గొండ్వానా, మహాకోసల రాజ్యాలు గోండ్‌‌రాజుల పాలనలోనే ఉన్నాయి.[ఆధారం చూపాలి] 1707లో ఔరంగజేబు మరణానంతరం ముఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. అప్పుడే మధ్యభారతంలో మరాఠాలు తమ ప్రాభవాన్ని విస్తరింపజేసుకొనసాగారు. 1720-1760 మధ్య మధ్యప్రదేశ్ చాలాభాగం మరాఠాల అధీనంలోకి వచ్చింది. మరాఠా పేష్వాల అనుజ్ఞలకు లోబడి స్వతంత్ర మరాఠా రాజ్యాలు మధ్యప్రదేశ్‌లో నెలకొన్నాయి. ఇండోర్‌కు చెందిన హోల్కర్‌లు మాళ్వాను పాలించారు. నాగపూర్‌కు చెందిన భోంసలే‌లు మహాకోసల, గొండ్వానాలను, మహారాష్ట్రలోని విదర్భను పాలించారు. ఒక మరాఠా సేనాధిపతి ఝాన్సీ రాజ్యాన్ని స్థాపించాడు. ఆఫ్ఝన్‌ సేనాధిపతి దోస్త్ మొహమ్మద్ ఖాన్‌వంశానికి చెందిన వారు భోపాల్‌ను పాలించారు. 1761లో మూడవ పానిపట్టు యుద్ధం తరువాత మరాఠా విస్తరణకు కళ్ళెం పడింది.

ఆ కాలంలో బ్రిటిష్‌వారు బెంగాల్, బొంబాయి, మద్రాసులలో స్థావరాలు ఏర్పరచుకొని భారతదేశంలో తమ అధీనాన్ని విస్తరించుకొనసాగారు. తత్కారణంగా 1775 - 1818 మధ్య మూడు ఆంగ్ల-మరాఠా యుద్ధాలు జరిగాయి. మూడవ యుద్ధం తరువాత బ్రిటిష్‌వారి అధిపత్యానికి దాదాపు ఎదురులేకుండా పోయింది. మహాకోసల ప్రాంతం (సౌగార్, నెర్బుద్ద విభాగాలు) బ్రిటిష్ రాజ్యంలో కలిసిపోయింది. దీనిని మధ్య పరగణాలు (Central Provinces) అని పిలచేవారు. ఇండోర్, భోపాల్, నాగపూర్, రేవా, మరి చాలా చిన్న సంస్థానాలు బ్రిటిష్‌వారికి లోబడిన రాజ్య సంస్థానాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఉత్తరభాగరాజసంస్థానాలు Central India Agency పాలనలో నడచేవి.

స్వాతంత్ర్యానంతర చరిత్ర

[మార్చు]

1950లో నాగపూర్ రాజధానిగా - మధ్యపరగణాలు, బేరార్, మక్రాయ్ సంస్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లను కలిపి - మధ్యప్రదేశ్‌ను ఏర్పరచారు. Central India Agency ప్రాంతాన్ని మధ్యభారత్, వింధ్యప్రదేశ్‌రాష్ట్రాలుగా ఏర్పరచారు. 1956లో భోపాల్, మధ్యభారత్, వింధ్యభారత్‌లను కలిపి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మరాఠీ భాష మాట్లాడే దక్షిణప్రాంతమైన విదర్భను, నాగపూర్‌తో సహా, వేరుచేసి బొంబాయి రాష్ట్రంలో కలిపారు.

2000 నవంబరులో మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (Madhya Pradesh Reorganization Act) క్రింద, మధ్యప్రదేశ్‌లోని ఆగ్నేయ భాగం కొంత విడదీశి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు.

చారిత్రిక నిర్మాణాలు

[మార్చు]

మధ్యప్రదేశ్‌లో ఎన్నో ప్రదేశాలు సహజసౌందర్యానికి, అద్భుతమైన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాయి. మూడు స్థలాలు ప్రపంచ వారసత్వ స్థలాలుగా (World Heritage Sites) ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక సంస్థ (UNESCO) చే గుర్తింపబడ్డాయి. అవి

  • రాణి కమలపతి మహల్

ఇంకా చారిత్రిక నిర్మాణాలకు పేరుపొందిన స్థలాలు

మధ్యప్రదేశ్‌లో పర్యటనకు సంబంధించిన వివరాలకోసం వికిట్రావెల్ చూడండి.

ప్రకృతి దృశ్యాలు

[మార్చు]

మధ్యప్రదేశ్‌లో ఎన్నో జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని:

ఇంకా కొన్ని ప్రకృతిసహజ విశేషాలున్న స్థలాలు:

  • బాఘ్ గుహలు
  • బోరి
  • పంచ్‌మర్హి
  • పన్‌పఠా
  • షికార్‌గంజ్
  • కెన్ ఘరియల్
  • ఘటీగావ్
  • కునో పాల్‌పూర్
  • నర్వార్
  • చంబల్
  • కుక్‌దేశ్వర్
  • నర్సింగ్‌ఘర్
  • నొరాదేహి

మధ్యప్రదేశ్‌లో ప్రధానంగా మాట్లాడే భాష హిందీ. ప్రామాణికమైన హిందీతోబాటు ఒకోప్రాంతంలో ఒకో విధమైన భాష మాట్లాడుతారు. ఈ భాషలను హిందీ మాండలికాలు అని కొందరూ, కాదు హిందీ పరివారానికి చెందిన ప్రత్యేకభాషలని కొందరూ భావిస్తారు. ఇలా మాట్లాడే భాషలు (యాసలు) : మాళ్వాలో మాల్వి, నిమర్‌లో నిమడి, బుందేల్‌ఖండ్‌లో బుందేలి, బాగెల్‌ఖండ్‌లో బాఘేలి. ఇంకా మధ్యప్రదేశ్‌లో మాట్లాడే భాషలు - భిలోడి భాష, గోండి భాష, కాల్తో భాష; ఇవన్నీ ఆదివాసుల భాషలు. మరాఠీ భాష మాట్లాడేవారు కూడా మధ్యప్రదేశ్‌లో గణనీయంగా ఉన్నారు.

రాష్ట్రం లోని జిల్లాలు

[మార్చు]
క్ర.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా

(2011)

విస్తీర్ణం

(కి.మీ.²)

జన సాంద్రత

(/కి.మీ.²)

1 AG అగర్ అగర్  – 2,785  –
2 AL అలీరాజ్‌పూర్ అలీరాజ్‌పూర్ 7,28,677 3,182 229
3 AP అనుప్పూర్ అనుప్పూర్ 7,49,521 3,747 200
4 BD అశోక్‌నగర్ అశోక్‌నగర్ 8,44,979 4,674 181
5 BL బాలాఘాట్ బాలాఘాట్ 17,01,156 9,229 184
6 BR బర్వానీ బర్వానీ 13,85,659 5,432 256
7 BE బేతుల్ బేతుల్ 15,75,247 10,043 157
8 BD భిండ్ భిండ్ 17,03,562 4,459 382
9 BP భోపాల్ భోపాల్ 23,68,145 2,772 854
10 BU బుర్హాన్‌పూర్ బుర్హాన్‌పూర్ 7,56,993 3,427 221
11  – చచువారా-బీనాగంజ్ చచౌరా  –  –  –
12 CT ఛతర్‌పూర్ ఛతర్‌పూర్ 17,62,857 8,687 203
13 CN ఛింద్వారా ఛింద్వారా 20,90,306 11,815 177
14 DM దమోహ్ దమోహ్ 12,63,703 7,306 173
15 DT దతియా దతియా 7,86,375 2,694 292
16 DE దేవాస్ దేవాస్ 15,63,107 7,020 223
17 DH ధార్ ధార్ 21,84,672 8,153 268
18 DI దిండోరీ దిండోరి 7,04,218 7,427 94
19 GU గునా గునా 12,40,938 6,485 194
20 GW గ్వాలియర్ గ్వాలియర్ 20,30,543 5,465 445
21 HA హర్దా హర్దా 5,70,302 3,339 171
22 HO హోషంగాబాద్ హోషంగాబాద్ 12,40,975 6,698 185
23 IN ఇండోర్ ఇండోర్ 32,72,335 3,898 839
24 JA జబల్‌పూర్ జబల్‌పూర్ 24,60,714 5,210 472
25 JH ఝాబువా ఝాబువా ఉవా10,24,091 6,782 285
26 KA కట్నీ కట్నీ 12,91,684 4,947 261
27 EN ఖాండ్వా (ఈస్ట్ నిమార్) ఖాండ్వా 13,09,443 7,349 178
28 WN ఖర్‌గోన్ (వెస్ట్ నిమార్) ఖర్‌గోన్ 18,72,413 8,010 233
29  – సాత్నా సాత్నా  –  –  –
30 ML మండ్లా మండ్లా 10,53,522 5,805 182
31 MS మంద్‌సౌర్ మంద్‌సౌర్ 13,39,832 5,530 242
32 MO మొరేనా మొరేనా 19,65,137 4,991 394
33 NA నర్సింగ్‌పూర్ నర్సింగ్‌పూర్ 10,92,141 5,133 213
34  – నాగ్దా నాగ్దా  –  –  –
35 NE నీమచ్ నీమచ్ 8,25,958 4,267 194
36  – నివారి నివారి 4,04,807 1170 345
37 PA పన్నా పన్నా 10,16,028 7,135 142
38 RS రాయ్‌సేన్ రాయ్‌సేన్ 13,31,699 8,466 157
39 RG రాజ్‌గఢ్ రాజ్‌గఢ్ 15,46,541 6,143 251
40 RL రత్లాం రత్లాం 14,54,483 4,861 299
41 RE రీవా రీవా 23,63,744 6,314 374
42 SG సాగర్ సాగర్ 23,78,295 10,252 272
43 ST సత్నా సత్నా 22,28,619 7,502 297
44 SR సీహోర్ సీహోర్ 13,11,008 6,578 199
45 SO సివ్‌నీ సివ్‌నీ 13,78,876 8,758 157
46 SH షాడోల్ షాడోల్ 10,64,989 6,205 172
47 SJ షాజాపూర్ షాజాపూర్ 15,12,353 6,196 244
48 SP షియోపూర్ షియోపూర్ 6,87,952 6,585 104
49 SV శివ్‌పురి శివ్‌పురి 17,25,818 10,290 168
50 SI సిద్ది సిద్ది 11,26,515 10,520 232
51 SN సింగ్రౌలి వైధాన్ 11,78,132 5,672 208
52 TI టికంగఢ్ టికంగఢ్ 14,44,920 5,055 286
53 UJ ఉజ్జయిని ఉజ్జయిని 19,86,864 6,091 356
54 UM ఉమరియా ఉమరియా 6,43,579 4,062 158
55 VI విదిశ విదిశ 14,58,212 7,362 198

మూలాలు

[మార్చు]
  1. "MP: State Song to be Sung Along with National Anthem". Outlook. 12 October 2010. Archived from the original on 21 March 2020. Retrieved 21 March 2020.
  2. Noronha, Rahul (23 March 2020). "BJP's Shivraj Singh Chouhan sworn in as Madhya Pradesh CM for fourth time". India Today. Archived from the original on 19 November 2021. Retrieved 23 March 2020.
  3. "2011 Census of India" (PDF). Censusindia.gov.in. Archived from the original (PDF) on 17 October 2011. Retrieved 14 September 2012.
  4. "Report of the Commissioner for linguistic minorities: 47th report (July 2008 to June 2010)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. pp. 122–126. Archived from the original (PDF) on 13 May 2012. Retrieved 16 February 2012.
  5. "MOSPI State Domestic Product, Ministry of Statistics and Programme Implementation, Government of India". 15 March 2021. Archived from the original on 15 April 2021. Retrieved 28 March 2021.
  6. "Sub-national HDI – Area Database". Global Data Lab. Institute for Management Research, Radboud University. Archived from the original on 23 September 2018. Retrieved 25 September 2018.
  7. "Sex ratio of State and Union Territories of India as per National Health survey (2019-2021)". Ministry of Health and Family Welfare, India.

బయటి లింకులు

[మార్చు]