ఆగష్టు 9
స్వరూపం
(9 ఆగష్టు నుండి దారిమార్పు చెందింది)
ఆగష్టు 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 221వ రోజు (లీపు సంవత్సరములో 222వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 144 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1945: ఆగష్టు 6 న 'ఎనొలా గే' అనే అమెరికా బి-29 బాంబర్ ( బాంబులను ప్రయోగించడానికి వాడేది ), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని హిరోషిమా పట్టణంపైన విడిచింది. ప్రపంచ చరిత్రలో అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్ని క్షణాల్లొనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్పొటనంలో 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ మూడవ రోజున 1945 ఆగష్టు 9 అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన నాగసాకి పై అటువంటిదే మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్దంలో అమెరికాకు లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే అతి ఖరీదైన యుద్దంగా మిగిలిపోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించబడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పొయింది. 1945 ఆఖరికి 2 లక్షల మంది పైగా యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించగలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
- 1962: భారతదేశంలో తొలి భారజల ఉత్పత్తి కేంద్రాన్ని పంజాబు లోని నంగల్‌లో ప్రారంభించారు.
- 1965: సింగపూర్ స్వాతంత్ర్యం పొందింది.
- 1974: గెరాల్డ్ ఫోర్డ్ అమెరికా 39వ అధ్యక్షునిగా పదవీ స్వీకారం.
జననాలు
[మార్చు]- 1754 : ఫ్రాన్సుకు చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్ ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్. (వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాళిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు) (మ.1825).
- 1889: చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1951)
- 1910: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. (మ.1975)
- 1932: జాలాది రాజారావు, తెలుగు రచయిత. (మ.2011)
- 1962: వెలుదండ నిత్యానందరావు, రచయిత, పరిశోధకుడు, ఆచార్యుడు.
- 1965: బ్రహ్మాజీ, తెలుగు సినిమా నటుడు.
- 1970: రావు రమేష్, భారతీయ సిని, టీవి నటుడు.
- 1972: మురళిశర్మ , తెలుగు తో పాటు పలు ఇతర భాషలలో ప్రతి నాయకుడు .
- 1975: మహేష్ బాబు, తెలుగు సినిమా నటుడు.
- 1987: వి.జయశంకర్, తెలుగు సినిమా డైలాగ్ రచయిత, కథా రచయిత.
- 1991: హన్సిక మోత్వాని , చిత్రసీమ లో బాలనటిగా గుర్తింపు పొందిన భారతీయ సినీ నటీ
మరణాలు
[మార్చు]- 1948: యల్లాప్రగడ సుబ్బారావు, భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు. (జ.1895)
- 2016: జ్యోతిలక్ష్మి, దక్షిణ భారత శృంగార నృత్య నటి.తమిళ చిత్రాలలో కథానాయికగా పలు చిత్రాలలో నటించారు.(జ.1948).
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం
- 1965 : సింగపూర్ స్వాతంత్ర్య దినోత్సవం.
- నాగసాకి దినోత్సవం.
- క్విట్ ఇండియా దినోత్సవం .
- ప్రపంచ స్వదేశీ ప్రజల దినోత్సవం
- జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం .
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 9
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
ఆగష్టు 8 - ఆగష్టు 10 - జూలై 9 - సెప్టెంబర్ 9 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |