అక్షాంశ రేఖాంశాలు: 17°36′55″N 78°54′22″E / 17.6153364°N 78.9061921°E / 17.6153364; 78.9061921

యాదగిరిగుట్ట పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యాదగిరిగుట్ట పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
యాదగిరిగుట్ట పురపాలకసంఘం is located in తెలంగాణ
యాదగిరిగుట్ట పురపాలకసంఘం
యాదగిరిగుట్ట పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°36′55″N 78°54′22″E / 17.6153364°N 78.9061921°E / 17.6153364; 78.9061921
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి భువనగిరి
మండలం యాదగిరిగుట్ట
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ ఎరుకల సుధ
 - వైస్ చైర్‌పర్సన్‌ మేడబోయిన కాటంరాజు
జనాభా (2011)
 - మొత్తం 15,637
 - పురుషుల సంఖ్య 7,890
 - స్త్రీల సంఖ్య 7,747
 - గృహాల సంఖ్య 3,160
పిన్ కోడ్ - 508115
ఎస్.టి.డి కోడ్ - 08685
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

యాదగిరిగుట్ట పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] దీని ప్రధాన కార్యాలయ కేంద్రస్థానం యాదగిరిగుట్ట పట్టణం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని, భువనగిరి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితిగా ఉన్న యాదగిరిగుట్ట, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

[మార్చు]

యాదగిరిగుట్ట 12.74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, సముద్రమట్టానికి 609.9 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది 170–35 N 780-56’ E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. జిల్లా కేంద్రం భువనగిరి నుండి 12 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాదగిరిగుట్ట మునిసిపాలిటీ ప్రధానంగా నివాస ప్రాంతాల పరిధిలో ఉంది, తరువాత వాణిజ్య, పబ్లిక్ సెమీ పబ్లిక్ కార్యాలయాలు, సినిమా హాల్, టి.ఎస్.ఆర్.టి.సి బస్ డిపో, మార్కెట్ యార్డులు ఉన్నాయి.[4]

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15637 మంది కాగా, అందులో 7890 మంది పురుషులు, 7747 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 15 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[5]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సుధ చైర్‌పర్సన్‌గా, మేడబోయిన కాటంరాజు వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[6][7][8] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[9]

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. అరుణ గౌళికార్
  2. మేడబోయిన కాటంరాజు (వైస్ చైర్‌పర్సన్)
  3. బూడిద సురేందర్
  4. విజయాలక్ష్మీ సీస
  5. గుండ్లపల్లి వాణి
  6. మాలోతు సరోజ
  7. ఎరుకల సుధ (చైర్‌పర్సన్)
  8. ముక్కెర్ల మల్లేష్
  9. దండబోయిన అనిల్
  10. అవుల మమత
  11. తాళ్ళపల్లి నాగరాజు
  12. బబ్బూరి మౌనిక

మూలాలు

[మార్చు]
  1. "Yadagirigutta Municipality". yadagiriguttamunicipality.telangana.gov.in. Archived from the original on 7 ఆగస్టు 2020. Retrieved 7 March 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 7 March 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 7 March 2021.
  4. "Yadagirigutta Municipality". yadagiriguttamunicipality.telangana.gov.in. Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 7 March 2021.
  5. "Basic Information of Municipality, Yadagirigutta Municipality". yadagiriguttamunicipality.telangana.gov.in. Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 7 March 2021.
  6. "Council, Yadagirigutta Municipality". yadagiriguttamunicipality.telangana.gov.in. Retrieved 7 March 2021.[permanent dead link]
  7. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 7 March 2021.
  8. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 7 March 2021.
  9. skannegari. "Yadagirigutta Municipality into 12 wards - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు

[మార్చు]