శరత్ బాబు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శరత్ బాబు | |
---|---|
జననం | సత్యం బాబు దీక్షిత్ 1951 జులై 31 |
మరణం | 2023 మే 22[1] | (వయసు 71)
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1973 – 2023 |
జీవిత భాగస్వామి | రమాప్రభ (-1988) |
శరత్‌బాబు (1951, జూలై 31 - 2023, మే 22) విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలలో తన 50 ఏళ్ల సినీ జీవితంలో 250కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు.[2] ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ్లు (కె.ప్రభాకర్, కె.బాబూరావు) సినీరంగానికి పరిచయం చేస్తూ ఈయన పేరును శరత్‌బాబుగా మార్చారు.
హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. అటుపిమ్మట సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాలలో నటించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించాడు.
బుల్లితెరపై అంతరంగాలు, ఎండమావులు తదితర ధారావాహికలలోనూ ఆయన నటించాడు. ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో కనిపించగా త్వరలో రిలీజ్ కానున్న మళ్లీ పెళ్లి (2023) సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు.
పురస్కారాలు
[మార్చు]వీరు 1981, 1988, 1989 సంవత్సరాలలో మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. మొదటిసారి సీతాకోక చిలుక, రెండవసారి ఓ భార్య కథ, మూడవసారి నీరాజనం సినిమాలలో తన నటనకు లభించాయి.
వ్యక్తిగత జీవితం
[మార్చు]శరత్ బాబు 1951, జులై 31న ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాలవలసలో జన్మించాడు. ఆయన జన్మనామం సత్యనారాయణ దీక్షిత్. అయితే ఇంట్లో ముద్దుగా సత్యం బాబుగా పిలుచుకునేవారు.
శరత్ బాబు సినిమాలలో నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో అప్పటికే తెలుగు సినీ రంగంలో సుస్థిరమైన నటి అయిన రమాప్రభను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. రమాప్రభ, శరత్ బాబు కంటే నాలుగేళ్ళు పెద్ద, వీరి వివాహం పద్నాలుగేళ్ల తర్వాత విడాకులతో అంతమైంది. 2007లో తెలుగు సినిమా.కాం (https://telugucinema.com)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ, నేను ఆసరా కోసం పెళ్ళిచేసుకుంటే, శరత్ బాబు అవసరానికి పెళ్ళిచేసుకున్నాడని, తమది పరస్పర అవకాశవాదపు పెళ్ళి అని చెప్పింది.[3]
నటించిన తెలుగు సినిమాల జాబితా
[మార్చు]- కన్నెవయసు (1973)
- రామరాజ్యం (1973)
- నోము (1974)
- అభిమానవతి (1975)
- అమెరికా అమ్మాయి (1976)
- బంగారు మనిషి (1976)
- మంచికి మరోపేరు (1976)
- వింత ఇల్లు సంత గోల (1976)
- కన్య - కుమారి (1977)
- చిలకమ్మ చెప్పింది (1977)
- జీవిత నౌక (1977)
- పల్లెసీమ (1977)
- పంతులమ్మ (1978)
- మరో చరిత్ర (1978)
- రామకృష్ణులు (1978)
- ఊర్వశీ నీవే నా ప్రేయసి (1979)
- ఇది కథ కాదు (1979)
- గుప్పెడు మనసు (1979)
- తాయారమ్మ బంగారయ్య (1979)
- శృంగార రాముడు (1979)
- మూడు ముళ్ళ బంధం (1980)
- రచయిత్రి (1980)
- 47 రోజులు (1981)
- తొలికోడి కూసింది (1981)
- బాలనాగమ్మ (1981)
- రాధా కల్యాణం (1981)
- సీతాకోకచిలుక (1981)
- ఇంద్రుడు చంద్రుడు (1982)
- ఏకలవ్య (1982)
- పన్నీరు పుష్పాలు (1982)
- పెళ్లీడు పిల్లలు (1982)
- యమకింకరుడు (1982)
- శ్రీలక్ష్మీనిలయం (1982)
- అమరజీవి (1983)
- గాజు బొమ్మలు (1983)
- తోడు నీడ (1983)
- పులిదెబ్బ (1983)
- రుద్రకాళి (1983)
- సాగర సంగమం (1983)
- కాంచన గంగ (1984)
- మేమూ మీలాంటి మనుషులమే (1984)
- సితార (1984)
- స్వాతి (1984)
- అనురాగబంధం (1985)
- అన్వేషణ (1985)
- ఆత్మబలం (1985)
- ఉక్కు మనిషి (1985)
- ఊరికి సోగ్గాడు (1985)
- కర్పూర దీపం (1985)
- దర్జా దొంగ (1985)
- విష కన్య (1985)
- శిక్ష (1985)
- స్వాతిముత్యం (1985)
- కాష్మోరా (1986)
- ఖైదీరాణి (1986)
- జీవన పోరాటం (1986)
- దాగుడు మూతలు (1986)
- నిప్పులాంటి మనిషి (1986)
- పసుపుతాడు (1986)
- భయం భయం (1986)
- భలే భయం (1986)
- సంసారం ఓ సంగీతం (1986)
- స్రవంతి (1986)
- ఉదయం (1987)
- కల్యాణ తాంబూలం (1987)
- గౌతమి (1987)
- చిన్నారి దేవత (1987)
- చైతన్యరథం (1987)
- ప్రేమ దీపాలు (1987)
- రేపటి స్వరాజ్యం (1987)
- విశ్వనాధ నాయకుడు (1987)
- సంకీర్తన (1987)
- సంసారం ఒక చదరంగం (1987)
- ఆగష్టు 15 రాత్రి (1988)
- ఆత్మకథ (1988)
- ఆణిముత్యం (1988)
- ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
- కాంచన సీత (1988)
- చిన్ని కృష్ణుడు (1988)
- జీవన జ్యోతి (1988)
- రక్తాభిషేకం (1988)
- సగటు మనిషి (1988)
- విజయ్ (1989)
- చెట్టుకింద ప్లీడరు (1989)
- నా మొగుడు నాకే సొంతం (1989)
- నీరాజనం (1989)
- పగలే వెన్నెల (1989)
- ప్రాణ స్నేహితులు (1989)
- యమపాశం (1989)
- స్వాతి చినుకులు (1989)
- అగ్గిరాముడు (1990)
- క్రోధం (1990)
- ఆడపిల్ల (1991)
- ఆపద్బాంధవుడు (1992)
- మృగతృష్ణ (1992)
- వదినగారి గాజులు (1992)
- శాంభవి (1993)
- శివరాత్రి (1993)
- నీకు 16 నాకు 18 (1994)
- హలో బ్రదర్ (1994)
- సిసింద్రీ (1995)
- నేను ప్రేమిస్తున్నాను (1997)
- తోడు (1997)
- సింహం (1997)
- రైతురాజ్యం (1999)
- అన్నయ్య (2000)
- ఇష్టం (2001)
- సాహస బాలుడు విచిత్ర కోతి(2001)
- నువ్వు లేక నేను లేను (2002)
- శంఖారావం (2004)
- రెండేళ్ళ తర్వాత (2005)
- అస్త్రం (2006)
- ఏవండోయ్ శ్రీవారు (2006)
- ఆట (2007)
- చంద్రహాస్ (2007)
- సింధూరి (2008)
- మగధీర (2009)
- నాగవల్లి (2010)[4]
- శుభప్రదం (2010)
- ఇట్స్ మై లవ్ స్టోరీ (2011)
- నేనేం..చిన్నపిల్లనా..? (2013)
- బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ (2013)
- అస్త్రం (2016)
- ఎంత మంచివాడవురా! (2020)[5][6]
- మళ్ళీ పెళ్ళి (2023)
మరణం
[మార్చు]శరత్‌బాబు తన 71 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023, మే 22న తుదిశ్వాస విడిచాడు.[7]
మూలాలు
[మార్చు]- క్వాలిటీ నా బాట...మంచి కోసం నా వేట, శరత్ బాబు ఆంధ్రప్రభ విశేష ప్రచురణ మోహిని (అరవై ఎనిమిది సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్థానం) 1999లో ప్రచురించిన వ్యాసం.
- ↑ Andhra Jyothy (22 May 2023). "నటుడు శరత్ బాబు మృతి". Archived from the original on 22 May 2023. Retrieved 22 May 2023.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-09. Retrieved 2009-04-23.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-11. Retrieved 2009-04-23.
- ↑ "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
- ↑ సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడవురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ "Sarath Babu: సీనియర్ నటుడు శరత్‌బాబు కన్నుమూత | actor sarath babu passes away". web.archive.org. 2023-05-22. Archived from the original on 2023-05-22. Retrieved 2023-05-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)