జవాహర్ లాల్ నెహ్రూ

వికీపీడియా నుండి
(జవహార్ లాల్ నెహ్రూ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పండిత్ జవాహర్‌లాల్ నెహ్రూ
జవాహర్ లాల్ నెహ్రూ


భారతదేశపు మొదటి ప్రధానమంత్రి
పదవిలో
ఆగష్టు 15 1947 – మే 27 1964
రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మరియూ సర్వేపల్లి రాధాకృష్ణన్
మునుపు (ఎవరూ లేరు)
తరువాత గుల్జారీలాల్ నందా (ఆపధర్మం)

భారతదేశపు మొదటి విదేశాంగ మంత్రి
పదవిలో
ఆగష్టు 15 1947 – మే 27 1964
మునుపు (ఎవరూ లేరు)
తరువాత గుల్జారీలాల్ నందా

పదవిలో
అక్టోబర్ 8 1958 – నవంబర్ 17 1959
మునుపు టి. టి. కృష్ణమాచారి
తరువాత మొరార్జీ దేశాయ్

జననం (1889-11-14) 1889 నవంబరు 14
అలహాబాద్, ఉత్తరప్రదేశ్,
భారతదేశం ఇండియా
మరణం 1964 మే 27 (1964-05-27)(వయసు 74)
కొత్త ఢిల్లీ, భారతదేశం
భార్య/భర్త కమలా నెహ్రూ
సంతానం ఇందిరా గాంధీ
Profession బారిస్టరు
మతం హేతువాది[1] or నాస్తికుడు[2]
సంతకం జవాహర్ లాల్ నెహ్రూ's signature

జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

విషయ సూచిక

తొలినాళ్ళు

జననం, కుటుంబ నేపథ్యం

జవాహర్‌లాల్ నెహ్రూ బ్రిటీష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్సులోని అలహాబాదు (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో భాగం) నగరంలో 1889 నవంబరు 14న రాత్రి 11.30 గంటలకు కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ సంపన్నుడైన బారిస్టర్, తర్వాతి కాలంలో జాతీయోద్యమంలో పాల్గొని రెండు మార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా పనిచేశాడు. తల్లి స్వరూపరాణి తుస్సు లాహోర్‌లో స్థిరపడ్డ కాశ్మీరీ పండిట్‌ కుటుంబానికి చెందినది. మోతీలాల్ మొదటి భార్య బిడ్డను ప్రసవిస్తూ, బిడ్డతో సహా చనిపోగా స్వరూపరాణిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు జవాహర్‌లాల్ తొలి సంతానం.[3]

1894లో తల్లిదండ్రులు మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణిలతో జవాహర్‌లాల్ నెహ్రూ

జవాహర్‌లాల్ నెహ్రూ పూర్వీకులు కాశ్మీర్‌కు చెందినవారైనా తరాల క్రితం రాజ్‌కౌల్ అన్న పూర్వీకుడు ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డాడు. నెహ్రూ వంశస్థులు ఢిల్లీలో మొఘల్ పాలకుల ఆదరాభిమానాలకు పాత్రులై ఉన్నతస్థితి, ఆర్థికాభివృద్ధి పొందారు. కౌల్ అన్న అసలు వంశం పేరుకు తోడు నెహ్రూ అన్న మరొక వంశనామం కూడా చేర్చి కౌల్-నెహ్రూగా పెట్టుకునేవారు. క్రమేపీ కౌల్ అన్నది పోయి నెహ్రూ స్థిరపడింది.[నోట్స్ 1] మోతీలాల్ నెహ్రూ తండ్రి అతను జన్మించడానికి కొద్ది నెలల ముందే మరణించినా, అప్పటికే భారతీయ సంస్థానాల్లో ఉన్నతోద్యోగులైన అన్నలు అతన్ని చదివించారు. మోతీలాల్ నెహ్రూ న్యాయవాదిగా మంచి పేరు సంపాదించి, బాగా సంపద ఆర్జించాడు. జవాహర్‌లాల్ జన్మించడానికి మూడేళ్ళ ముందే మోతీలాల్ వృత్తి రీత్యా కుటుంబం కాన్పూర్ నుంచి అలహాబాద్ చేరుకుని స్థిరపడింది.[4][5]

జవాహర్‌లాల్ నెహ్రూ పుట్టేసరికే కుటుంబం భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండేది. తల్లి స్వరూపరాణి ప్రభావంతో ఇంట్లో భారతీయమైన సంప్రదాయాలు, పండుగలు పబ్బాలు జరిగేవి. స్త్రీల నుంచి జవాహర్‌లాల్ అప్పటి సాధారణమైన భారతీయులందరిలానే పురాణగాథలు, జానపద కథలు విన్నాడు. గంగాస్నానం, దైవదర్శనం వంటివి తల్లి జవాహర్‌తో చేయించేది. జవాహర్ జననం నాటికే పేరొందిన న్యాయవాది, తర్వాతి కాలంలో బ్రిటీష్ బారిస్టర్ అయిన మోతీలాల్ నెహ్రూ బ్రిటీష్ పెద్దమనిషి తరహాలో వ్యవహరించేవాడు. ఇంటిలో విలాసవంతమైన ఈతకొలను, టెన్నిస్ కోర్టు వంటివి ఉండేవి. ఇలా కొంత భారతీయం, మరికొంత ఆంగ్లేయమైన పద్ధతులు కలిగిన ఈ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం అప్పటి అలహాబాద్ హిందూ అగ్రవర్ణ జీవనంలో పూర్తిగా కలవలేదు. అలహాబాద్‌కి కొత్తవారు కావడం, కాశ్మీరీ పండిట్లకు సహజంగా కొంత ఆచార వ్యవహారాల్లో పట్టింపు తక్కువ కావడం[నోట్స్ 2] వంటి కారణాలకు మోతీలాల్ 1899లో సముద్రయానం చేసివచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోకపోవడం తోడుకావడంతో వీరి కుటుంబాన్ని అలహాబాద్ బ్రాహ్మణులు వెలివేశారు. కాశ్మీరీ పండితుల్లో కూడా కాస్త చాందసంగా ఉండే కుటుంబాలకు నెహ్రూ కుటుంబం దూరంగానే ఉండేది. వెరసి ఈ కుటుంబం మతాచారాల విషయంలో పట్టింపు చూపేది కాదు.[4]

బాల్యం

15 సంవత్సరాల వయసులో హేరో పాఠశాలలో జవాహర్‌లాల్ నెహ్రూ

సుసంపన్నమైన కుటుంబంలో తల్లిదండ్రుల తొలి సంతానం కావడంతో జవాహర్‌లాల్ బాల్యం ముద్దుమురిపాల నడుమ, అతిగారాబంగా సాగింది.[4] జవాహర్‌లాల్‌ను తండ్రి కొద్దినెలల పాటు స్థానిక కాన్వెంటుకు పంపి ఆ ప్రయత్నం విరమించి, ఇంట్లోనే ప్రైవేటుగా చదివించడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. అతనికి మహాపండితుడైన గంగానాథ ఝా సంస్కృత విద్య, అనీ బిసెంట్ సూచించిన ఫెర్డినాండ్ టి. బ్రూక్స్ అనే దివ్యజ్ఞాన సమాజ యువకుడు ఆంగ్ల విద్య బోధించేవారు. తండ్రి ఆంగ్ల విద్యకే ప్రాధాన్యం ఇచ్చాడు, అందుకు అనుగుణంగానే జవాహర్‌కి సంస్కృత విద్య ఒంటబట్టలేదు.[నోట్స్ 3] బ్రూక్స్ అతనికి విజ్ఞానశాస్త్రం పట్ల ప్రాథమిక అవగాహన, దివ్యజ్ఞాన సమాజ తాత్త్వికత పట్ల ఆసక్తి, ఆంగ్ల కవిత్వం, సాహిత్యం, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి పలు అంశాలను పరిచయం చేశాడు.[6][7] దివ్యజ్ఞాన సమాజం పరిచయం నెహ్రూకు బౌద్ధ, హిందూ మతగ్రంథాల పట్ల ఆసక్తి కలిగించి అధ్యయనానికి పురిగొల్పింది. మూడు సంవత్సరాల పాటు బ్రూక్స్ నెహ్రూకు ట్యూటర్‌గా వ్యవహరించాడు.[8] అతని గురించి తర్వాతికాలంలో నెహ్రూ మాట్లాడుతూ "దాదాపు మూడేళ్ళు (అతను) నాతో ఉన్నాడు. ఎన్నోవిధాల అతను నన్ను గొప్పగా ప్రభావితం చేశాడు" అన్నాడు.[9]

పాఠశాల విద్యాభ్యాసం

మోతీలాల్ జవాహర్‌లాల్ ప్రైవేటు విద్యను ముగింపజేసి, 1905 మే నెలలో కుటుంబ సమేతంగా బ్రిటన్ వెళ్ళి ప్రతిష్టాత్మక హేరో పాఠశాలలో కుమారుడికి ప్రవేశం సంపాదించాడు. హేరోలో ప్రతిభా పాటవాలు చూపి పేరుతెచ్చుకున్నా,[7] క్రమేపీ హేరో పాఠశాల జీవితం అతన్ని విసుగెత్తించింది.[10] హేరో పాఠశాల విద్యాకాలం మొత్తం మీద అధికారుల శిక్షణ కోర్‌ మాత్రం అతన్ని ఆకట్టుకుని, ఉత్సాహభరితంగా పాల్గొనేలా చేసింది. మరోవైపు 1905లో భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు అతనికి ఆసక్తి కలిగించడం ప్రారంభించాయి. 1905లో జరిగిన బెంగాల్ విభజన, అది బెంగాల్‌లోని జాతీయోద్యమాన్ని బలహీనపరిచే చర్యగా ఆందోళనలు పెరుగుతూండడం, ఆ ఆందోళనలు కాంగ్రెస్ పార్టీలో అతివాదులు, మితవాదుల విభజన సృష్టించడం వంటి పరిణామాలను జవాహర్‌లాల్ ఆసక్తిగా పరిశీలించసాగాడు. తండ్రికి ఉత్తరాలు రాసి ఎప్పటికప్పుడు వార్తాపత్రికలు తెప్పించుకుంటూ ఉండేవాడు. ఆ దశలో అతనికి అతివాదుల మీద సానుభూతి ఏర్పడింది.[11] మరోవైపు షుషిమా వద్ద నౌకాయుద్ధంలో రష్యాపై జపాన్ ఘనవిజయం సాధించిందన్న వార్త అతనిని చాలా సంతోషపరిచింది. ఆసియా దేశాలు ఐరోపా వలసపాలనలో మగ్గుతూ ఉన్న ఆ దశలో తోటి ఆసియా దేశమైన జపాన్ ప్రదర్శించిన సైనిక పాటవం, శక్తి సామర్థ్యాలు అతనికి ఉత్సాహం కలిగించాయి.[10] హేరో పాఠశాలలో అతని విద్యావిషయమైన ప్రతిభకు బహుమతిగా బ్రిటీష్ చరిత్రకారుడు జి. ఎం. ట్రావెల్యాన్ ఇటలీ జాతీయవాది, సైన్యాధ్యక్షుడు అయిన గారిబాల్డ్ గురించిన పుస్తకాలు లభించాయి.[12] ఇవి జవాహర్‌లాల్‌ను ప్రభావితం చేశాయి. తన మనసులో భారతదేశ స్వేచ్ఛ కోసం అద్భుతమైన పోరాటాలు చేసినట్టు కొన్ని దృశ్యాలు తళుక్కుమనేవని, ఆ పుస్తకాలు చదివేప్పుడు ఆలోచనల్లో అతను వర్ణించే ఇటలీ, తన మాతృభూమి భారతదేశం గొప్పగా కలగలిసిపోయేవని జవాహర్‌లాల్ పేర్కొన్నాడు.[9]

కేంబ్రిడ్జి విద్యాభ్యాసం

కేంబ్రిడ్జిలో విద్యార్థిగా ఉండగా కుటుంబంతో జవాహర్‌లాల్ నెహ్రూ

జవాహర్‌లాల్ 1907లో కేంబ్రిడ్జి ప్రవేశపరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడై, ఆ సంవత్సరం అక్టోబరు నెలలో ట్రినిటీ కళాశాలలో చేరాడు. ప్రవేశపరీక్షకు, ట్రినిటీ ప్రవేశానికి మధ్యలో వేసవి కాలంలో కొన్ని వారాల పాటు ఐర్లాండును సందర్శించాడు. స్వయంపాలన కోసం పోరాటం చేస్తున్న ఐర్లాండు అతని ఆసక్తిని చూరగొంది. క్రియాశీలంగా ఆందోళనలు చేస్తున్న ఐరిష్ అతివాద ఆందోళనలు అతినికి నచ్చాయి. ఈ దశలో అతను తండ్రికి రాసే ఉత్తరాల్లో జాతీయవాద ఉద్యమాలు, వాటిలో ప్రత్యేకించి అతివాదం పట్ల తనకు ఏర్పడుతున్న అభిమానాన్ని వెల్లడించేవాడు.[13][10] కేంబ్రిడ్జిలో అతను రసాయనశాస్త్రం, భూవిజ్ఞాన శాస్త్రం, భౌతికశాస్త్రాలను అధ్యయనాంశాలుగా స్వీకరించి కొన్నాళ్ళకే భౌతికశాస్త్రాన్ని విడిచిపెట్టి వృక్షశాస్త్రం స్వీకరించాడు. కేంబ్రిడ్జిలో జవాహర్‌లాల్ అంతగా శ్రమించి చదవలేదు. యువకులకు ఉత్సాహభరితంగా ఉండే కేంబ్రిడ్జి వాతావరణం అతని నిరాసక్తతను మార్చలేకపోయింది. ఆ దశలో జవాహర్‌లాల్‌కి టెన్నిస్ ఆట, గుర్రపుస్వారీ, పందెపు పడవల జట్టులో ఆడడం వంటి వ్యాపకాలు ఉండేవి కానీ ఆ వ్యాపకాలు వేటిలోనూ పూర్తి అభినివేశం కానీ, మంచి ఉత్సాహం గానీ చూపించలేదు. ఫైనల్ ట్రైపోన్ పరీక్షలో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడైనవారిలోనూ అతని పేరు కింది వరుసలోనే వచ్చింది.[14] అలా 1910లో ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఈ దశలో అతను రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, సాహిత్యం చదువుకున్నాడు. జార్జి బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, జె.ఎం.కీన్స్, బెర్ట్రాండ్ రస్సెల్, లూయీస్ డిక్సన్, మెరెడిత్ టౌన్సెండ్ వంటి వారి రచనలు అతని రాజకీయ, ఆర్థిక చింతనపై ప్రభావం చూపాయి.[9]

న్యాయవిద్యాభ్యాసం

కేంబ్రిడ్జిలో ఫైనల్ ట్రైపోన్ పరీక్షకు ముందే ఇన్నర్ టెంపుల్‌లో చేరాడు. ఇన్నర్ టెంపుల్ అన్నది న్యాయవిద్య అభ్యసించి బారిస్టర్ కావడానికి అవసరమైన నాలుగు ఇన్‌లలో ఒకటి. కనీసం న్యాయవిద్య తన కుమారుడి ఆసక్తిని చూరగొందని, ఇకపై ఉత్సాహంగా చదువుతాడని మోతీలాల్ నమ్మాడు. కానీ తన ఇష్టంతో ప్రమేయం లేకుండా సాగుతున్న తన జీవితం పట్ల ఆనాసక్తితో ఉన్న జవాహర్‌లాల్ న్యాయవిద్యాభ్యాసంలోనూ పెద్ద చురుకుదనం, ఉత్సాహం ప్రదర్శించలేదు..[15] ఇన్నర్ టెంపుల్‌లోని రెండేళ్ళ కాలంలో జవాహర్‌లాల్ ప్రాణానికి ప్రమాదమైన సాహసకార్యాలు చేశాడు, పాత మిత్రులను తిరిగి కలిశాడు, ఫాషన్లు అనుసరించాడు, అప్పులు చేశాడు. ఇలా లండన్ జీవితంలోని సందడి చవిచూశాడు. అంతేతప్ప విద్యాభ్యాసంలో మంచి పట్టుదల కనబరచలేదు. ఫలితంగా 1912లో స్కాలర్‌షిప్‌లు, బహుమానాలు వంటివి ఏమీ సాధించకుండా బార్ ఎట్ లా పరీక్షల్లో సాధారణంగా ఉత్తీర్ణుడయ్యాడు. అప్పటికి ఇంగ్లాండులో ఏడేళ్ళ విద్యాభ్యాసం పూర్తిచేసుకుని భారతదేశానికి తిరిగివచ్చాడు. భారతదేశం తిరిగివచ్చేనాటికి అతని మనస్సు, బుద్ధి ఒక వృత్తి కోసం కాక, భవిష్యత్తులో రాబోయే పిలుపును అందుకోవడానికి సంసిద్ధంగా తయారైంది.[16] నెహ్రూ జీవితచరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ ప్రకారం జవాహర్‌లాల్ విద్యభ్యాసం ముగించుకుని భారతదేశానికి తిరిగివచ్చేనాటికి చక్కని శిక్షణ పొందిన మనస్సు, మంచి భావనాశక్తితో పాటుగా జీవితాంతం శాశ్వతంగా అంటిపెట్టుకున్నవి మరో రెండు తెచ్చుకున్నాడు: అవి బ్రిటన్ పట్ల ప్రేమాభిమానాలు, బ్రిటీష్ విలువలు.[17]

న్యాయవాద వృత్తిలో

నెహ్రూ -గాంధీ కుటుంబం, కా 1927

బారెట్లా ఉత్తీర్ణుడై ఇన్నర్ టెంపుల్‌లో బారిస్టరుగా నమోదుకాగానే న్యాయవాద వృత్తిని అవలంబించడానికి 1912 ఆగస్టులో భారతదేశానికి తిరిగి వచ్చాడు. జవాహర్‌లాల్ అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకుని, తండ్రి ప్రాక్టీసులో సహ న్యాయవాదిగా వృత్తి ప్రారంభించాడు. తండ్రి వలె కాక జవాహర్‌లాల్‌ న్యాయవాద వృత్తిలో పెద్ద ఆసక్తి కనబరచలేదు. తత్ఫలితంగా అతను న్యాయవాదిగా పెద్దగా రాణించిందీ లేదు, తోటి న్యాయవాదుల సాంగత్యంలో ఇమడనూలేకపోయాడు. న్యాయవాదిగా ప్రాక్టీసుచేసిన రోజుల గురించి జవాహర్‌లాల్ మొత్తం మీద ఆ వాతావరణం మేధోపరంగా ఉత్తేజితంగా ఉండేది కాదని, తనకు జీవితం పట్ల విపరీతమైన నిరాసక్తత పెరిగిపోయిందని పేర్కొన్నాడు. తండ్రి జవాహర్‌లాల్‌కు కక్షిదారులను తీసుకువచ్చేవాడు. జవాహర్ క్రమశిక్షణతోనే కేసులను నడిపేవాడు. కానీ జీవితోత్సాహం లోపించేది. బ్రిటన్‌లో ఉన్నకాలంలో అతను జాతీయవాదంపైనా, అతివాదంపైనా చూపిన ఆసక్తి క్రియారూపంలోకి రాలేదు. ఈ దశలో సంపన్న పాశ్చాత్య ప్రభావితమైన భారతీయ జీవనంలో ఇమిడిపోవడానికి అదేమీ అడ్డురాలేదు. జవాహర్ ఈ దశలో కొంతమేరకు సామాజిక సేవ కూడా చేసేవాడు. వాటిలో దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యమానికి మద్దతుగా నిధుల సేకరణ ఒకటి. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యమాలకు సూత్రప్రాయంగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వ సానుభూతి ఉండేది కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు. జవాహర్‌లాల్ ఈ క్రమంలో ముందుకుపోయి బ్రిటీష్ పారామిలటరీలో చేరి, తోటి భారతీయ యువకులను ఆ దళంలో చేర్చడానికి అవసరమైన ప్రయత్నాలు చేసేవాడు. అప్పటికే అంతరంగంలో జాతీయవాద పోరాటాలు, అతివాద ఉద్యమాల పట్ల ఆరాధనాభావం ఉన్నా ఈ దశలో అతని క్రియాశీల రాజకీయ అవగాహన దయాళువులైన బ్రిటీష్ వారు భారతీయుల న్యాయమైన కోర్కెలు తీరుస్తారన్న వద్దే ఉండేది.

సహాయ నిరాకరణోద్యమం నుంచి పూర్ణ స్వాతంత్ర్యం వరకు (1919 - 1930)

రాజకీయాల్లోకి ప్రవేశం: రెండవ ప్రపంచయుద్ధం, హోంరూల్ లీగ్

అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో తండ్రి చాటు న్యాయవాదిగా పనిచేస్తున్న జవాహర్‌లాల్ తండ్రితో పాటుగా 1912లో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు హాజరయ్యాడు.[18] జీవితకాలం పాటు అనుబంధం పెంచుకున్న ఆ సంస్థ అప్పటి దశలో చేస్తున్న రాజకీయాలు జవాహర్‌లాల్‌కు కనీస ఆసక్తి కలిగించలేదు. అతనికి ఆ సమావేశాలు - "ఇంగ్లీషు తెలిసిన ఉన్నత వర్గాల వ్యవహారంగా మాత్రమే" అనిపించాయి.[19] ఆ దశలో కాంగ్రెస్ దాదాపుగా మితవాద రాజకీయ నాయకులతో నిండి ఉండేది.[18] మొదటి ప్రపంచయుద్ధం వచ్చిన ఆ దశలో తనకు ఒక స్పష్టమైన వైఖరి లేదని జవాహర్ తర్వాతి దశలో అంగీకరించాడు. నెహ్రూ జీవితచరిత్రకారుల్లో ఒకడైన ఫ్రాంక్ మోరిస్ రాసినదాని ప్రకారం "అతని (జవాహర్‌లాల్) సానుభూతి ఏ దేశంతో అయినా ఉందంటే అది ఫ్రాన్స్. ఫ్రెంచి సంస్కృతి పట్ల అతనికి ఎంతగానో గౌరవం ఉండేది."[20] యుద్ధసమయంలో జవాహర్ "సెయింట్ జాన్స్ అంబులెన్స్"కు స్వచ్ఛంద సేవకునిగా ఉన్నాడు. అలహాబాదులో సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీసు వారి ప్రాంతీయ కార్యదర్శుల్లో అతను ఒకడు.[18] కానీ ప్రభుత్వం పాస్ చేసిన సెన్సార్‌షిప్ బిల్లులను వ్యతిరేకించాడు.[21] 1917లో ప్రాంతీయ సైన్యం నమూనాలో తయారుచేసిన భారతీయ రక్షణదళంలో చేరడానికి తన సమ్మతిని తెలియజేశాడు. తనవంటి యువకులను అందులో చేరేలా ప్రోత్సహించే కార్యకలాపాల్లో పాల్గొనడానికి సంసిద్ధుడైనాడు.[22]

కాంగ్రెస్ సంస్థలో అతివాదులకు ప్రవేశం ఇప్పించే ప్రయత్నాలు బెడిసికొట్టి మితవాదులు విజయం సాధించడంతో బాలగంగాధర తిలక్, అనీ బిసెంట్ హోంరూల్ లీగులు స్థాపించారు. స్వయంపాలన ఆవశ్యకతను ప్రచారం చేసే ఉద్దేశంతో ఈ సంస్థలు స్థాపించారు. ప్రభుత్వం అనీబిసెంట్‌ని బొంబాయి, సెంట్రల్ ప్రావిన్సుల నుంచి బహిష్కరించింది.[22] దీనిపై దేశవ్యాప్తంగా ఎందరో విద్యావంతులు, అనీబిసెంట్ అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. అలా ప్రభుత్వ చర్యలను నిరసించినవారిలో జవాహర్‌లాల్ ఒకడు. ప్రతిస్పందనగా తాను భారతీయ రక్షణదళంలో చేరడానికి చేసిన దరఖాస్తు ఉపసంహరించుకుని, దళంలో చేరేలా ఇతరులను ప్రోత్సహించేందుకు నిర్వహించబోయిన సభ రద్దుచేశాడు. మోతీలాల్ అధ్యక్షతన జవాహర్‌లాల్ ఒకానొక కార్యదర్శిగా యునైటెడ్ ప్రావిన్సుల హోంరూల్ లీగ్ ఏర్పాటుచేశారు. అయితే హోంరూల్ సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విషయంలో జవాహర్‌లాల్‌కి స్పష్టత లేదు. హోంరూల్ నాయకులైన అనీబిసెంట్ ఆంగ్లో-సాక్సన్ పద్ధతి కానీ, తిలక్ తీవ్రమైన అతివాదం కానీ అతన్ని ఆకర్షించలేదు. అలాగని స్వంతంగా తనే కార్యాచరణ ఏర్పురుచుకోగల స్పష్టత కూడా లేదు.[23] సిరిసంపదల వల్ల దేశప్రజలకు సేవచేయగల స్థితిలో ఉండి కూడా తండ్రి స్థాపించిన ఇండిపెండెంట్ పత్రిక నిర్వహణలో సహకారం తప్ప మరేమీ చేయలేకపోతున్నందుకు అసంతుష్టితో గడిపేవాడు.[24]

సహాయ నిరాకరణోద్యమంలోకి

1919లో రౌలట్ చట్టం అమలులోకి రావడం, జలియన్ వాలాబాగ్ దురంతం జరగడం జవాహర్‌లాల్‌లో పెద్ద పరివర్తనానికి కారణమయ్యాయి. జలియన్‌ వాలాబాగ్ దురంతాన్ని గురించి నివేదించడానికి ఏర్పరిచిన కాంగ్రెస్ కమిటీకి జవాహర్‌లాల్ సహకరించేందుకు అమృత్‌సర్ సందర్శించాడు. ప్రత్యేకించి జలియన్ వాలాబాగ్ దురంతం పట్ల ఇంగ్లండులో వ్యక్తమైన అభిప్రాయం అతన్ని కలతపెట్టింది.[25] సర్వేపల్లి గోపాల్ ఈ దశలో వచ్చిన మార్పు గురించి - "(అంతవరకు) దయాసముద్రులైన బ్రిటీష్ పాలకులవల్ల ఉపకారం మేలు జరుగుతాయని (జవాహర్‌లాల్) ఆశిస్తూ ఉన్నాడు. కాని స్వాతంత్ర్యమనేది ఒకరు ఆదరభావంతో ఇచ్చే కాన్క కాదనీ, ప్రతిఘటించి పోరాటం సల్పినందువల్ల దక్కే ఫలితమనీ దేశంలో సర్వసాధారణంగా చాలామందికి కనువిప్పు కలిగింది. దాని పర్యవసానమే జవహర్‌లో వచ్చిన పెద్ద పరివర్తనం." అని రాశాడు.[26] 1920లో పలువురు భారతీయ జాతీయోద్యమ నాయకులు, కార్యకర్తల వలెనే జవాహర్‌లాల్ కూడా గాంధీ భావాలు, కార్యాచరణ విపరీతంగా ఆకర్షించాయి. గాంధీ పిలుపును అనుసరించి సహాయ నిరాకరణోద్యమంలో తన కృషి ప్రారంభించాడు. జవాహర్‌లాల్ యునైటెడ్ ప్రావిన్సుల్లో సహాయ నిరాకరణోద్యమాన్ని నిర్వహించే బాధ్యత స్వీకరించాడు. యుపిలో ప్రముఖుడైన కాంగ్రెస్ నాయకుడిగా అతికొద్ది కాలంలోనే పేరు సంపాదించాడు.[27]

1920 జూలై నుంచి అలహాబాద్ జిల్లాకు ఉత్తరాన ఉన్న ప్రతాబ్‌గఢ్ జిల్లాలో జమీందార్లు చిత్తం వచ్చినట్టు కౌళ్ళు, జరిమానాలు, నజరానాలు విధిస్తూండడంతో తిరగబడ్డ[28] వెనుకబడ్డ కుర్మీ కులానికి చెందిన రైతుల పోరాటానికి జవాహర్‌లాల్ నాయకత్వం వహించాడు. రైతుల కోర్కెలకు న్యాయబద్ధమైన స్పష్టమైన రూపం ఇచ్చి, వారిని అహింసవైపు మళ్ళించి వారి సమస్యలను వెల్లడించేందుకు కిసాన్ సభలను ఏర్పాటుచేశాడు. మరోవైపు రైతులను అక్రమంగా అరెస్టు చేసిన బ్రిటీష్ అధికారులతో సంప్రదింపులు జరిపాడు.[29][30] రైతుల్లోని క్రమశిక్షణ, వారికి జవాహర్ నాయకత్వం పట్ల గౌరవం అతన్ని కదిలించాయి. ప్రతాబ్‌గఢ్ ప్రాంతంలో ఒకచోట సభలో తాను ప్రసంగిస్తూండగా జనంలో చిన్న కలకలం కనిపించింది, మాట్లాడకున్నా వారిలో వారే తోసుకోవడం, మోచేతులతో పొడుచుకోవడం కనిపించింది. ఆగ్రహించి అదేమని ప్రశ్నిస్తే - అక్కడొక పాము ఉందని, ప్రాణభయం ఓవైపు ఉన్నా కూడా క్రమశిక్షణ తప్పకుండా అలా మౌనంగానే ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారని తెలిసింది. మూడున్నర దశాబ్దాల తర్వాత గుర్తుచేసుకునేంతగా జవాహర్ మీద ఈ సంఘటన ముద్రవేసింది.[31] జమీందార్ల విధానాలకు తోడు ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల 1921 సంవత్సరంలో హింసాత్మకమైన రైతాంగ ఆందోళన అవధ్ అంతటా వ్యాపించింది.[32] జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో పోలీసుల దాడులు, నాయకుల అరెస్టుల వల్ల రెచ్చిపోతున్న గుంపుల ఎదుట నిలిచి జవాహర్ వారికి సాహసోపేతంగా అహింస బోధించి శాంతపరిచాడు. ప్రభుత్వం ఒకపక్క సహాయనిరాకరణ ఉద్యమ నాయకులైన గాంధీ, నెహ్రూ వంటివారి పట్ల అనుమాన దృక్కులతో చూస్తూనే, ఉద్యమ నాయకత్వం కౌళ్ళు చెల్లించమని సూచించే జవాహర్‌లాల్, గాంధీ వంటివారి చేతిలో ఉండాలని,[33] ఏమీ చెల్లించవద్దని ఆజ్ఞాపించే సాధువుల చేతిలో ఉండరాదని ఆశించారు. పన్నులు, కౌళ్ళ చెల్లింపు నిరాకరించమనే నాయకులను క్రమేపీ ప్రభుత్వం అరెస్టు చేసి, రైతు ఉద్యమ నాయకత్వాన్ని పూర్తిగా కాంగ్రెస్ పాలు చేసింది. జవాహర్ సహా కాంగ్రెస్ వారు రైతు సమస్యల మీద తక్కువగా వ్యవస్థా నిర్మాణం, నిధుల వసూళ్ళపై ఎక్కువగా కేంద్రీకరించడంతో ప్రభుత్వానికి వీలుచిక్కింది.[34] తర్వాతి దశలో రైతాంగం మరో రాజకీయ ఆందోళన అయిన ఏకా ఉద్యమం ప్రారంభించింది. జవాహర్ వేరే పనిలో మునిగి, ఈ ఉద్యమంలో పాల్గొనకుండా ఉండిపోయాడు. అంతటితో ఆ రైతు ఉద్యమంలో జవాహర్ అనుబంధం ముగిసింది.[35]

1921లో నెహ్రూ ఒకపక్క అఖిలభారత కాంగ్రెస్ వ్యవహారాల్లోనూ, ఇటుపక్క స్వంత రాష్ట్రంలోని కార్యాచరణలోనూ ఆసక్తిగా పాల్గొనసాగాడు. అలహాబాద్ జిల్లాలో కనీసం 50వేల మందిని కాంగ్రెస్ సభ్యులుగా చేర్పించాలని, ప్రత్యేకించి స్త్రీలను హెచ్చుసంఖ్యలో చేర్చాలని లక్ష్యం నిర్ణయించుకున్నాడు. సహాయ నిరాకరణ, ఖిలాఫత్ ఉద్యమాలను బలపరచడానికి యునైటెడ్ ప్రావిన్సుల్లోని జిల్లాలంతటా పర్యటనలు ప్రారంభించాడు. అనేక కార్యక్రమాలు, సభలు నిర్ణయించుకుని వాటికై విస్తారంగా ప్రయాణాలు చేశాడు. ఒకదశలో తాను చేరుకోవాల్సిన సభ కోసం రెండు ఊళ్ళ మధ్య పరుగులు కూడా పెట్టాడు.[36] మరో సందర్భంలో తప్పిపోయిన రైలును అందుకునేందుకు పక్క స్టేషనుకు రైల్వే ట్రాలీలో ప్రయాణించాడు. 1920, 21ల్లో స్వరాజ్యం సాధించడానికి స్వదేశీ వస్తువులు, దుస్తులు వినియోగించడమే ఏకైక మార్గమన్న అభిప్రాయంలో ఉండేవాడు. విదేశీ వస్త్ర బహిష్కరణ,[37] స్వరాజ్య నిధికి విరాళాల సేకరణ మంచి ఉత్సాహంతో చేస్తూండేవాడు. ప్రభుత్వాజ్ఞలను పూర్తిగా లెక్కచేయని మనస్థితి రాలేదు. సభల విషయంలో నిషేధాజ్ఞలు పాటించేవాడు.[38] అయితే ప్రభుత్వం హింసను ప్రేరేపించే రచనలు చేయనని పూచీ ఇమ్మని కోరగా, ప్రభుత్వానికి క్షమాపణ కానీ, పూచీ కానీ ఇవ్వనని నిరాకరించాడు. [39] 1921 డిసెంబరు 5న యునైటెడ్ ప్రావిన్సు స్వచ్ఛంద సేవకుల వ్యవస్థను చట్టవిరుద్ధమని ప్రకటించి, దాని కార్యదర్శి జవాహరలాల్‌ను, ఈ కార్యకలాపాలతో సంబంధం ఉన్న తండ్రి మోతీలాల్‌ను అరెస్టు చేశారు. జవాహర్‌లాల్‌కు ఆరునెలల సాధారణ జైలుశిక్ష, రూ.100 జరిమానా, అది చెల్లించకుంటే మరో నెల శిక్ష విధించారు. జవాహర్ అధికారులు అణచివేస్తున్నా, తాను నిర్బంధంలో ఉన్నా జైలు నుంచే యుపి కాంగ్రెస్ పని కొనసాగించాడు. ఏవో సాంకేతిక కారణాలతో సగం శిక్ష అనుభవించగానే 1952 మార్చిలో జవాహర్‌ని విడుదల చేశారు. చౌరీచౌరా సంఘటన వంటి హింసాత్మక ఘటనలు ఎక్కువ అవుతున్నాయన్న కారణంగా మహాత్మా గాంధీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం జవాహర్‌లాల్ వంటి పలువురు కాంగ్రెస్ నాయకులకు ఆశాభంగం అయింది.[40]

రెండు జైలు శిక్షలు, పార్టీ చీలకలతో మధ్యవర్తిత్వం (1922-1923)

మహర్షి వంటివాడైన మా ప్రియతమ నాయకుని(గాంధీ)కి శిక్ష విధించిన తర్వాత జైలు మాకు స్వర్గమైంది. పవిత్రమైన యాత్రా స్థలమైంది.... నా అదృష్టానికి నేనే అబ్బురపడుతున్నాను.

— న్యాయస్థానంలో జవాహర్‌లాల్ నెహ్రూ ప్రకటనలో భాగం[41]

సహాయ నిరాకరణోద్యమం ఆపేయాలని మహాత్మా గాంధీ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం తీవ్రమైనదీ, ఆశాభంగం కలిగించేదీ అయినా జవాహర్‌లాల్ గాంధీ మార్గనిర్దేశానికే కట్టుబడ్డాడు. ఆ నిర్ణయంతో దెబ్బతిన్న కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టడం జవాహర్‌కి చాలా కష్టమైంది.[40] యునైటెడ్ ప్రావిన్సుల్లో రాట్నం తిప్పడం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి నిర్మాణాత్మక కార్యక్రమాల్లోనూ, గాంధీ స్వరాజ్య కార్యక్రమాలను ప్రచారం చేయడంలోనూ గడిపేవాడు. అప్పటికే మహాత్మా గాంధీని అరెస్టు చేసి, జైలు శిక్ష విధించిన ప్రభుత్వం తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడసాగింది. ఈ నిర్బంధాల మధ్య నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా సాగడం కష్టమయ్యేది. 1922 మే 12న పికెటింగ్ జరుపుతూ, దాన్ని ప్రచారం చేస్తున్నాడన్న కారణంతో జవాహర్‌లాల్‌ని అరెస్టు చేశారు.[42] సహాయనిరాకరణ ఉద్యమ కార్యాచరణలో భాగంగా న్యాయస్థానాలు విడనాడాలన్న సూత్రం అనుసరించి జవాహర్‌లాల్ తన తరఫున వాదించడానికి, క్రాస్ పరీక్ష చేయడానికీ అంగీకరించలేదు. కోర్టులో న్యాయమూర్తి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు సుదీర్ఘమైన ప్రకటన ఒకటి చేశాడు. దానిలో తన దృక్పథాన్ని వివరిస్తూ, ప్రభుత్వ దమనకాండను నిరసించాడు. విదేశీ వస్త్రబహిష్కరణకు ఈ విధంగా ప్రాచుర్యం కలిగించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాడు. మహాత్మాగాంధీ వంటి నాయకుని కింద దేశసేవ చేయడం భాగ్యమని తోటి భారతీయులకు ప్రబోధిస్తూ ముగించాడు.[41] ప్రభుత్వం ఆశించని విధంగా విద్యావంతులైన భారతీయ యువతను జవాహర్ కోర్టు ప్రకటన ప్రభావితం చేసింది.

ఈసారి 18 నెలల కఠిన కారాగార శిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు. జరిమానా కట్టకపోతే మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అతనిని జైలుశిక్ష అనుభవించేందుకు లక్నో జైలుకు తరలించారు. ఆ జైలులో సందర్శకులను వేధిస్తారన్న చెడ్డపేరు ఉండడంతో స్నేహితులు, బంధువులను చూసే అవకాశం తానే వదులుకున్నాడు. జైలు జీవితం పేరిట బలవంతాన లభించే తీరికను జవాహర్ సద్వినియోగం చేసుకున్నాడు.[43] శారీరక వ్యాయామం, నూలు వడకడం, చరిత్ర, యాత్రా జీవనాలకు సంబంధించిన పుస్తకాలు చదవడం, ఉత్తరాలు రాయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యాడు. జైలు జీవితం తాలూకు కష్టాలు, ఇబ్బందులు అతనికి బాగా సంతృప్తి కలిగించాయి. దేశం కోసం కష్టపడుతున్నందుకు ఒకవిధమైన సంతృప్తి చెందేవాడు. జైలు నుంచి విడుదల కోరుకోవట్లేదని ఒక లేఖలో జవాహర్‌లాల్ రాశాడు. అందుకు భిన్నంగా యునైటెడ్ ప్రావిన్సుల శాసన మండలి తీర్మానాన్ని అమలు చేస్తూ శిక్ష పూర్తికాకుండానే 1923 జనవరి 31న సార్వత్రిక క్షమాభిక్షలో భాగంగా జవాహర్ శిక్షాకాలం ముగిసింది.[44]

విడుదల కాగానే కాంగ్రెస్ పార్టీ శాసనసభల్లో ప్రవేశించాలనే వారు, ప్రవేశించరాదనే వారి మధ్య చీలిపోయి ఉంది. ప్రవేశించాలనే మితవాద పక్షంలో తన తండ్రి మోతీలాల్ సహా తనకు సన్నిహితులు ఉన్నారు. స్వతాహాగా జవాహర్‌కి సహాయ నిరాకరణను తిరగదోడి శాసనసభల్లో చేరడం చేపట్టడం ఇష్టం లేదు. కానీ ఈ చీలికల విషయంలో సంస్థ దెబ్బతింటుందని కలతపడ్డాడు. సహాయ నిరాకరణమే స్వరాజ్యానికి మార్గమన్న తన విధానాన్ని పునరుద్ఘాటించినా శాసనసభల ప్రవేశం విషయంలో అప్పటికి ఏ అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇరుపక్షాలూ తమ ప్రచారాలు రెండు నెలలపాటు ఆపివేసేలా 1923 ఫిబ్రవరి మాసాంతంలో జరిగిన అలహాబాద్ సభలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌తో కలిసి ఇరుపక్షాలనూ జవాహర్ ఒప్పించాడు.[45] తిరిగి మే నెలలో రెండు పక్షాల వారూ కలహానికి సంసిద్ధులయ్యే సరికి కాంగ్రెస్ చీలిక నివారించడానికి జవాహర్‌లాల్ ఓ రాజీ సూత్రాన్ని ప్రతిపాదించాడు. దాని ప్రకారం శాసనసభల్లో ప్రవేశించరాదని 1922 డిసెంబరులో జరిగిన నిర్ణయాన్ని కొట్టివేయరు, అలాగని ప్రచారమూ ఇవ్వరు. అంటే సూత్రం అలానే ఉండనిచ్చి శాసనసభల్లో ప్రవేశించవచ్చని సారాంశం. ఇది శాసనసభల్లో ప్రవేశానికి ఆశిస్తున్నవారికే అనుకూలంగా ఉంది. ఈ తీర్మానం బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సైతం ఆమోదించింది. కానీ శాసనసభా ప్రవేశం ఇష్టంలేని ఆరుగురు సభ్యులూ రాజీనామా చేసి, ఆమోదించాలని పట్టుబట్టారు.[46] ఆ దశలో చివరకు కమిటీలో ఏ పక్షానికి మొగ్గకుండా ఉన్న జవాహర్‌లాల్ వంటివారు ఉండాలని ఇరుపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. అయితే అతికొద్ది నెలల్లోనే ఈ రాజీ తీర్మానాన్ని పలు రాష్ట్ర కమిటీలు తిరస్కరించాయి. ఆ కమిటీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జవాహర్ పెట్టిన తీర్మానం వీగిపోవడంతో పార్టీ పదవులన్నిటికి రాజీనామా చేశాడు.[47]

అయిష్టమైన పార్టీ కలహాల నుంచి రాజీనామాతో విముక్తి పొందిన జవాహర్‌లాల్ తిరిగి కార్యాచరణపై దృష్టిపెట్టాడు. నాగపూరులో జాతీయ జెండాతో ఊరేగింపును అనుమతించేందుకు జిల్లా మొజిస్ట్రేటు నిరాకరించడంతో జెండా సత్యాగ్రహం ప్రారంభమైంది. దానిని వ్యవస్థీకరించి, ఎప్పటికప్పుడు స్థానిక కార్యకర్తలకు తోడుగా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తల బృందాలు వెళ్ళి ఊరేగింపుగా జెండాను తీసుకుపోతూ అరెస్టు అవుతూండేలా పంపుతూ వచ్చారు. చివరకు ప్రభుత్వం దిగి వచ్చి జాతీయ జెండాను ఎగురవేసుకునేందుకు అనుమతి ఇచ్చేదాకా ఇది కొనసాగింది. ఆ తర్వాత అకాలీ ఉద్యమంలో ఆసక్తి కనబరిచి, క్రమేపీ ఆ ఉద్యమంలో మమేకమయ్యాడు. పంజాబ్ రాష్ట్రంలోని సిక్ఖులకు గురుద్వారాల నిర్వహణలో సంస్కరణలు అమలు చేయాలని ప్రారంభించిన అకాలీల ఉద్యమం శాంతిభద్రతల సమస్య తెస్తుందని పంజాబ్ ప్రభుత్వం వారి ప్రయత్నాలు ప్రతిఘటించింది. అలా మతసంస్కరణల ఉద్యమం రాజకీయ ఉద్యమమై, మహాత్మా గాంధీ ప్రబోధించిన అహింసా సిద్ధాంతం స్వీకరించి ప్రభుత్వాన్ని ఎదిరించసాగారు. 1923 జూన్, జూలైల్లో వారి సభల్లో పాల్గొనడంతో ప్రారంభించి క్రమేపీ సెప్టెంబరు నాటికల్లా అకాలీలతో కలిసి అప్పుడప్పుడే పదవీచ్యుతుడై, సంస్థానం కోల్పోయిన సిక్ఖు సంస్థానాధీశ్వరుని ప్రాంతం- నాభా సంస్థానం వెళ్ళాడు. అధికారులు అప్పటికే సంస్థానంలో ప్రవేశించిన జవాహర్‌లాల్‌ని సంస్థానంలో ప్రవేశించవద్దన్న ఉత్తర్వు చూపించి, దానిని ఉల్లంఘించాడంటూ అరెస్టు చేశారు. జవాహర్‌లాల్‌నీ, అతని స్నేహితులనీ ఒకే గొలుసులకు కట్టివేసి, జనంతో కిక్కిరిసిన మూడో తరగతి రైలు పెట్టెలో నాభా పట్టణం తీసుకువెళ్ళి దారుణమైన స్థితిగతులు ఉన్న నాభా జైలులో నిర్బంధించారు. అతనిపై నేరారోపణలు అసంబంద్ధంగా ఉండడంతో సిక్ఖుల జాథాలలో ఉన్నాడనీ, వారంతా దౌర్జన్యం చేశారనీ అక్రమ కేసు బనాయించారు. కేసు నత్తనడకన సాగుతూండగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం కలగజేసుకుని కొన్ని సూచనలు చేసింది. తదనుగుణంగా నిందితులకు 30 నెలల కఠిన కారాగార శిక్ష విధించి, వెనువెంటనే నిలిపివేసి, సంస్థానాన్ని విడిచి వెళ్ళి తిరిగి రావద్దన్నారు.[48]

వ్యక్తిగత సమస్యలు, మున్సిపల్ పరిపాలన (1924-1926)

నాభా జైలు నుంచి తిరిగివచ్చాకా జవాహర్‌లాల్ ఉత్సాహలేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు తీసుకురావడం ఎలాగన్న ప్రశ్నపై సతమతమయ్యాడు. అప్పటికి జవాహర్‌ భావాల్లో సామ్యవాదం వంటివేమీ జొరబడలేదు, గాంధేయవాదానికే పూర్తి నిబద్ధునిగా ఉండేవాడు.[49] కాకినాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగిస్తూ - "భారతీయ స్వచ్ఛంద సేవకులకూ, పాశ్చాత్య దేశాల వలంటిర్లకూ మధ్య ఉభయ సామాన్యమైన విశేషం అంతగా లేదు. భారతీయ స్వచ్ఛంద సేవక సంస్థకు అహింస ప్రాథమిక సూత్రమై ఉండాలి. భారతదేశానికి అహింసను, క్రమశిక్షణను పాటించే సైనికులు అవసరమై వున్నారు" అంటూ అవే భావాలు గాంధీయమైన భాషలోనే వెల్లడించాడు. జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ముగ్గురిలో ఒకనిగా జవాహర్‌లాల్ పార్టీ నిర్వహణా భారాన్ని, అనుసంధాన కార్యకలాపాలను చాలావరకూ భుజాన వేసుకున్నాడు.[50] కాంగ్రెస్ పార్టీ ద్రవ్య వ్యవహారాలు, అకాలీ ఉద్యమాన్ని జాతీయోద్యమంతో అనుసంధానం చేసే కార్యకలాపాలతో తీరికలేకుండా పనిచేయసాగాడు.[51]

ఖిలాఫత్ ఉద్యమ స్ఫూర్తి నానాటికీ దెబ్బతింటూ దేశంలో హిందూ-ముస్లిం మత విద్వేషాలు రెచ్చిపోసాగాయి. 1924 ఫిబ్రవరిలో బ్రిటీష్ వారు ఆరోగ్యకారణాలతో విడుదల చేసిన గాంధీ సెప్టెంబరు నాటికి ఈ మతవిద్వేషాలు సమసిపోవాలంటూ 21 రోజుల ఉపవాస దీక్ష తీసుకున్నాడు. జవాహర్‌లాల్‌ను ఆ వార్త చాలా బాధించింది. అది తెలిసేనాటికే మతకలహాలు తగ్గించేందుకు, వాస్తవ స్థితిగతులు తెలుసుకునేందుకు పర్యటనలు చేస్తున్నాడు. హిందూ-ముస్లిముల నడుమ ఐక్యత సాధించే మార్గాన్వేషణకు యుపిలో ప్రతీ పట్టణంలో, ప్రతీ గ్రామంలో సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చాడు, స్వయంగా ఢిల్లీలో ఐక్యతా మహాసభలో పాల్గొన్నాడు.[51] అలహాబాద్‌ నగరంలో జరిగిన మత ఘర్షణల వివరాలను సేకరించి, గాంధీకి నివేదిక పంపాడు. మత ఘర్షణలు జవాహర్‌లాల్‌ మనస్సును చాలా గాయపరిచాయి. 1925 జనవరిలో ఈ అంశంపై జరిగిన అఖిల పక్ష మహాసభ విఫలమైంది. ఈ సభలో జరిగిన చర్చ వినాల్సిరావడమే అతనికి ఎంతో బాధాకరంగా పరిణమించింది. అతని ఉద్దేశంలో ఇది అవాస్తవికమైన, ఊహాత్మకమైన అంశాల చుట్టూ అల్లుకుపోతూండే సమస్య, కనుకనే ఈ సమస్యపై శక్తివంతమైన చర్యలు తీసుకోలేకపోయాడు.[52]

ఈ పరిస్థితులకు తోడు జవాహర్‌లాల్ సాంసారిక జీవితంలో కూడా పుట్టిన కుమారుడు పుట్టగానే చనిపోవడం, భార్యకు క్షయవ్యాధి పట్టుకోవడం, తాను ఆర్థికంగా ఆధారపడి ఉన్న తన తండ్రితో రాజకీయంగా వివాదాలు రావడం వంటి సమస్యలు చుట్టుముట్టాయి.[52] తండ్రిపై ఆర్థికంగా ఆధారపడకూడదని నిర్ణయించుకోవడంతో గాంధీ అతనికి పత్రికా విలేఖరిగా కానీ, కళాశాలలో ప్రొఫెసర్‌గా కానీ పని ఏర్పాటుచేయాలని ప్రయత్నించి చూశాడు. ఆపైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వేతనం స్వీకరించాలని గాంధీ అభ్యర్థించినా జవాహర్‌లాల్ అంగీకరించలేదు. తన పలుకుబడితో బొంబాయిలో టాటా సంస్థ మేనేజరు పదవి ఇప్పించాలని గాంధీ ప్రయత్నించగా, టాటా వారు సిద్ధపడినా జవాహర్‌కు అందుకు మనస్కరించలేదు. చివరకు భార్య కమల ఆరోగ్యం కోసం ఐరోపా పర్యటన చేయడానికి తప్పనిసరి స్థితిలో తనకేమాత్రం ఇష్టంలేని న్యాయవాది వృత్తి ఒకమారు చేపట్టాల్సివచ్చింది. తండ్రే కక్షిదారును తీసుకునివచ్చాడు. అతనికి న్యాయవాదిగా ముట్టింది రూ.పదివేలు కాగా ఆ వచ్చిన కక్షిదారు కూడా జవాహర్‌లాల్ వల్ల కాకుంటే మోతీలాల్ అయినా కేసు గట్టెక్కించకపోడని వచ్చాడు.[53]

నా ప్రియతమ నాయకుడు (గాంధీ) జైలులోపల మ్రగ్గుతూ ఉండగా నా సమయంలో అధిక భాగాన్ని ఏ పదవిలోనూ వ్యయపరచదలుచుకోలేదు. నాకు చేతనైనప్పుడల్లా యుద్ధం చేస్తాను. నాకు వీలైనప్పుడల్లా పోరాడుతాను, బలంగా దెబ్బతీస్తాను, స్వరాజ్యం వచ్చేదాకా అదే నా ముఖ్యమైన పని. తక్కినదంతా శిక్షణ, తయారీ.

— యుపి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా జవాహర్‌లాల్ నెహ్రూ 1923 ఏప్రిల్ 5న కాంగ్రెస్ కమిటీలకు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులకు పంపిన సర్క్యులర్‌లో భాగం.[41]

సహాయ నిరాకరణోద్యమ విరమణ తర్వాత ఐరోపా ప్రయాణంలోపు సంక్షుభిత సంవత్సరాల్లో జవాహర్‌ జీవితంలో చెప్పుకోదగ్గ విశేషం - అలహాబాద్ పురపాలక సంఘ అధ్యక్షునిగా చేసిన కృషి. 1923 ఏప్రిల్ నుంచి 1925 ఏప్రిల్ వరకూ ఈ పదవిలో ఉన్న జవాహర్ పరిపాలనలో తొలి అనుభవాన్ని ఇక్కడే గడించాడు.[53] సర్వేపల్లి గోపాల్ ఉద్దేశంలో తర్వాతి కాలంలో ప్రధానమంత్రిగా నెహ్రూ కనబరిచిన "సహచరులపై తన ప్రాబల్యం చూపడం, సామర్థ్యాన్ని అభిలషించడం, సమర్థులైన తన క్రింది అధికార్ల పట్ల విడవని విశ్వాసం చూపడం, కొత్త ఆలోచనలతో అన్ని దిక్కులా ముందుకు సాగిపోయేందుకు గట్టిగా ప్రయత్నించడం వంటి లక్షణాలు" బీజప్రాయంగా అలహాబాద్ పురపాలక సంఘంలో చేసిన పనిలో చూడవచ్చు.[54] పదవి చేపట్టినందుకు శక్తివంచన లేకుండా పనిచేసినా అతను ఏనాడూ దీనికి స్వరాజ్యం కోసం చేసే పోరాటం కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. మొదలుపెట్టినప్పుడు అయిష్టమైనదైనా పరిపాలనా వ్యవహారాలు క్రమేపీ అతని ఆసక్తిని చూరగొన్నాయి.[55] పురపాలక సంఘ సభ్యుల అలసత్వం, క్రమశిక్షణా రాహిత్యం పదవిలోకి వచ్చిన తొలినాళ్ళలోనే బహిరంగ విమర్శలతో తొలగించి, క్రమశిక్షణ నెలకొల్పాడు. చిన్న చిన్న అంశాలకు స్వరాజ్య విధానంతో ముడిపెట్టి పట్టుపట్టేవారు స్వంత పార్టీ సభ్యులే అయినా అంగీకరించేవాడు కాదు.[56] ఆంగ్లేయులపై నిష్కారణంగా ప్రతీకారం చూపే విధానాలనూ సమర్థించలేదు. అవసరమైనప్పుడు, తగినంత స్థాయి ఉన్న విధానాలలో కాంగ్రెస్ విధానాల దృష్ట్యా నడుచుకునేవాడు.[57] బ్రిటీష్ వస్తువుల బహిష్కరణ, పాఠశాలల్లో నూలు వడకడం, కాంగ్రెస్ నాయకులకు సన్మానం, తిలక్ వర్థంతి, గాంధీకి శిక్షవేసిన రోజు జ్ఞాపకార్థంగా గాంధీ దినోత్సవం సెలవులు ఇవ్వడం వంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించినా ఖాతరుచేయకుండా నిర్వహించాడు. ప్రజలకు మేలుచేకూర్చే పలు నిర్ణయాలు, క్రమం తప్పకుండా ప్రజలకు నివేదికలతో పారదర్శకత పాటించడం వంటి అనేక చర్యలు చేపట్టాడు. ప్రత్యక్షంగా కనిపించే న్యాయబుద్ధి, నీతి, నిజాయితీలతో పురపాలక సంఘ వ్యవహారాల్లోని అన్ని పక్షాల వారిలోనూ పలుకుబడి, ప్రాభవం సంపాదించాడు.[58] కమీషనర్ కూడా మునిసిపల్ వ్యవహారాలు మెరుగుకావడం వెనుక జవాహర్‌లాల్ కృషిని ప్రస్తావించాల్సిన స్థితి తీసుకువచ్చాడు. అయితే పురపాలక వ్యవహారాలు కేవలం గృహవసతి, పారిశుధ్యం వంటి అంశాలకే పరిమితమై విశాలమైన అర్థంలో సాంఘిక సంక్షేమాన్ని తమ పరిధిగా ఎంచే వీలులేకపోవడం, ఆ రంగంలో కృషిచేయలేకపోవడం అతనికి సంతృప్తి కలిగించలేదు.[59] 1925 ఏప్రిల్‌లో పార్టీ కార్యకలాపాల దృష్ట్యా బోర్డు పనులు చూడడానికి వీలుచిక్కడం లేదంటూ మునిసిపల్ బోర్డు ఛైర్మన్ పదవికీ, బోర్డు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు.[60]

ఐరోపా పర్యటన, నూతన రాజకీయ భావాల అంకురం (1926-1927)

జవాహర్‌లాల్ 1926 మార్చి 1న భార్య కమల, కుమార్తె ఇందిరలతో బయలుదేరి ఐరోపా చేరుకున్నాడు. జెనీవాలో ఒక చౌక బసలో స్థిరపడ్డాడు. క్షయవ్యాధితో బాధపడుతున్న భార్య కోలుకునేందుకు ప్రధానంగా ఈ ఐరోపా నివాసం. అయితే అది ఆమె మీద ప్రభావం ఏమీ చూపించకపోగా జవాహర్‌లాల్ రాజకీయ, ఆర్థిక భావాలలో విప్లవాత్మకం అనదగ్గ పరిణామం తీసుకువచ్చింది. మరోవైపు భారతదేశంలో జాతీయవాద రాజకీయాల పరిస్థితి దారుణంగా తయారైంది. మతసామరస్యం లోపించి మతకల్లోలాలు వ్యాప్తిచెందుతూ ఉన్న వార్తలు జవాహర్‌కు అందుతూండేవి. ఈ వార్తలు ఆయనను కుంగతీసేవి. మతాన్ని అదుపులోకి తెచ్చుకుని, రాజకీయాలను లౌకిక తత్వం వైపు మళ్ళించడమే దీనికి పరిష్కారమని భావించేవాడు. ఈ దశలో అతను బౌద్ధికమైన పనులు కాక చేసినవి భార్యకు సేవ, కుమార్తెను పాఠశాలకు తీసుకెళ్ళి, తీసుకురావడం. అంటే అతని కార్యాచరణయుతమైన జీవితంలో అధ్యయనానికి బోలెడంత ఖాళీ దొరికినట్టు. ఫ్రెంచి భాష నేర్చుకోవడం, బహు గ్రంథ పఠనం, వివిధ కోర్సులకు, ఉపన్యాసాలకు హాజరుకావడం వంటి పనులతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విస్తారమైన అధ్యయనం వల్ల ఆయన మనస్సు, బుద్ధి నూతన సిద్ధాంత బీజాలకు సిద్ధంగా ఉంది. ఆ ఏడాది ముగిసేనాటికి కమల ఆరోగ్యంపై ఐరోపా నివాసం మెరుగదల ఏమీ చూపించడం లేదని తేలిపోయింది. మోతీలాల్ కూడా ఐరోపా పర్యటనకు వస్తూండడంతో ఇక జవాహర్ కుటుంబం ఐరోపా ఖండాన్ని సందర్శించింది. ఈ సందర్శన జవాహర్‌లాల్ అధ్యయనానికి, ఐరోపా రాజకీయవేత్తలతో పరిచయాలు, వారి ఉద్యమాల పట్ల అవగాహన కలిగించి, తర్వాతికాలపు జవాహర్ ఆలోచనల్లో వినూత్నమైన గాఢత్వాన్ని కల్పించింది.

1927 ఫిబ్రవరిలో బ్రస్సెల్స్‌లో వలసపీడన, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా జరిగిన అంతర్జాతీయ మహాసభలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా జవాహర్‌ అధ్యక్ష మండలి సభ్యుడి హోదాలో పాల్గొన్నాడు. సమావేశాల్లో వక్తగా, ఇష్టాగోష్ఠి సభ్యునిగా, ఒక సమావేశానికి అధ్యక్షునిగా, తీర్మానాల ముసాయిదా రచయితగా పలు హోదాల్లో చురుకుగా పాల్గొన్నాడు. సమావేశంలోని పలువురు రాజకీయవేత్తల సాంగత్యం అతనిని ప్రభావితం చేసింది. ఈ సమావేశాల్లో మాట్లాడుతూ జవాహర్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాల్లో సాధారణాంశం వివరించాడు. భారతీయుల్లో విభేదాలు తీవ్రతరం చేయడం, ఫ్యూడల్ సమాజానికి చెందిన సంస్థానాధీశులను, భారతీయ భూస్వాములను కాపాడడం వంటి సామ్రాజ్యవాద ప్రబలమైన దృష్టాంతాలను భారతదేశంలో ఎత్తిచూపాడు. తొలిసారి జవాహర్ ఆలోచనల్లో రాజకీయ-ఆర్థిక అంశాల పరస్పర సంబంధం పట్ల స్పష్టత వచ్చింది. అలా కేవలం బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని ఖండించే జాతీయవాది స్థాయి నుంచి సామ్రాజ్యవాదపు ఉద్దేశాలు, తీరుతెన్నులు, అది పనిచేసే తీరును అవగాహన చేసుకోవడానికి తన రాజకీయ జీవితంలో తొలిసారి ప్రయత్నించాడు.

చైనా-భారత దేశ జాతీయవాద రాజకీయాల మధ్య సంబంధాలు ఏర్పడాలని ఆశించాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల పాటు చైనాకీ, భారతదేశానికి ఉండవలసిన సత్సంబంధాల విషయమై మారకుండా నిలబడిన జవాహర్ దృక్పథానికి పునాది మహాసభలోనే పడింది. ప్రపంచ రాజకీయాలను కూడా చాలా సదవగాహనతో అంచనా వేశాడు. అప్పటికి చైనాలో జాతీయవాదులైన కూమిటాంగులు, కమ్యూనిస్టులు కలిసి బ్రిటీష్ సామ్రాజ్యవాదం, దాని ప్రభావంలో ఉన్న చైనా చక్రవర్తులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండగానే - చైనీయులకు విజయం సిద్ధిస్తే ఆసియాలో సోవియట్ మహా ప్రజాతంత్ర రాజ్యం ఏర్పాటైనట్టేననీ, చైనా-సోవియట్ రష్యా కలిసి ఆసియా, ఐరోపా ఖండాలపై ప్రాబల్యం చూపుతాయనీ, చైనాలోని రైతాంగ ఒత్తిడి వల్ల శుద్ధ కమ్యూనిజం నుంచి చాలామేరకు చైనీయ కమ్యూనిజం వైదొలగుతుందనీ భావించాడు. మరోవైపు బ్రిటన్ ప్రపంచంలో తన స్థానాన్ని కోల్పోతోందని, పూర్తిగా కోల్పోకుండా అమెరికా ఉపగ్రహంగా అమెరికన్ పెట్టుబడిదారీ పక్షాన నిలిచి పోరాడవచ్చని గ్రహించగలిగాడు. బ్రిటన్ ఐరోపాదేశాలన్నిటి మద్దతూ తీసుకున్నా ఒక మహాఖండంలా ఉండబోయే చైనా-రష్యా ప్రభావాన్ని ఎదుర్కోవడం సులభసాధ్యం కాదనీ ఊహించాడు. 1927 నాటికే వీటన్నిటినీ గ్రహించి, కాంగ్రెస్ కార్యవర్గానికి రహస్య నివేదికలో పంపాడు. క్రమేపీ దశాబ్దాల కాలంలో ఈ అంశాలన్నీ వాస్తవరూపం దాలుస్తూ ఉండడాన్ని అతని జీవితచరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ వ్యాఖ్యానిస్తూ ఇవన్నీ "జవాహర్‌లాల్ ... ప్రపంచ వ్యవహారాల్లో దూరదృష్టి కల రాజకీయ ప్రవక్తగా" నిలిపాయన్నాడు.

ఈ మహాసభ ఫలితంగా ఏర్పడ్డ సామ్రాజ్యవాద వ్యతిరేక లీగ్‌కు గౌరవ అధ్యక్షునిగా, కార్యనిర్వాహక మండలి సభ్యునిగా జవాహర్‌లాల్ ఎన్నికయ్యాడు. లీగ్ మీద, మహాసభ మీద సోవియట్ రష్యా ప్రభావం పైకి కనిపించకుండా ఉండేది. దీన్ని గ్రహించినా ఉపేక్షించగలిగాడు. పీడిత జాతులతో సోవియట్ రష్యా తన ప్రయోజనం కోసం సన్నిహితంగా వ్యవహరిస్తోందనీ, ఇది మరో కొత్త సామ్రాజ్యవాదానికి సుదూర భవిష్యత్తులో దారితీయవచ్చుననీ అంచనా వేశాడు. 1927లో సోవియట్ రష్యా అక్టోబర్ విప్లవం దశమ వార్షికోత్సవాల సందర్భంగా సోవియట్ ప్రభుత్వం పంపిన ఆహ్వానాన్ని అనుసరించి జవాహర్‌లాల్, మోతీలాల్ సోవియట్ రష్యాను సందర్శించారు. సోవియట్ యూనియన్ చరిత్రలో సుఖశాంతులతో కూడిన మొదటి దశ ఆఖరు రోజుల్లో సందర్శించాడు. సోవియట్ యూనియన్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు, వారు చూపించదలిచిన విషయాలు మాత్రమే చూస్తున్నామని తెలిసినా వ్యవసాయం, జైళ్ళ సంస్కరణ, స్త్రీల పట్ల ప్రవర్తన, అల్పసంఖ్యాకుల సమస్యల పరిష్కారం, నిరక్షరాస్యతా నిర్మూలన వంటి అంశాల్లో అభివృద్ధి త్వరితగతిన సాధించిందన్న అభిప్రాయానికి వచ్చాడు. వ్యవసాయ ప్రధాన దేశం కావడం, విస్తారంగా నిరక్షరాస్యత వేళ్ళూనుకొని ఉండడం వంటి పోలికల వల్ల భారతదేశానికి చాలా విషయాల్లో సోవియట్ యూనియన్ బోధించదగ్గ అంశాలు అనేకం ఉంటాయని నమ్మాడు. ఇలా రష్యా అతని తొలి సందర్శనలో గాఢమైన ముద్రే వేసింది.

మొత్తానికి నిఖార్సైన గాంధీ శిష్యునిగా, గాంధేయవాద మూసలో ఆలోచించే యువకుడిగా 1926 తొలి నెలల్లో ఐరోపా బయలుదేరిన నెహ్రూ దాదాపు పూర్తి కమ్యూనిస్టుగా, అంతర్జాతీయ తత్వంతో భారతదేశ సమస్యలు ముడిపెట్టగలిగే ఆలోచనా విధానంతో విప్లవాత్మకమైన మార్పుతో 1927 తుదినాటికి భారతదేశానికి తిరిగివచ్చాడు.

పూర్ణ స్వాతంత్ర్య వాదం

గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ అప్పటి వరకూ ఉపయోగిస్తూ వచ్చిన స్వరాజ్యమనే పదాన్ని అధినివేశ ప్రతిపత్తి కోరడం అనే సాంకేతిక అర్థంలో వాడుతూ వచ్చారు. అధినివేశ ప్రతిపత్తి అన్నది బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూనే అంతర్గతంగా కొంత స్వతంత్ర్యాన్ని పొందే ఒక ఏర్పాటు. కాంగ్రెస్ వంటి సంస్థ అధినివేశ ప్రతిపత్తి కోసం పాకులాడడం ఐరోపా నుంచి వచ్చాకా జవాహర్‌లాల్‌కి నిరర్థకమని తోచింది. కాంగ్రెస్‌తో వీలైనంత త్వరగా సంపూర్ణ స్వాతంత్ర్యం తమ లక్ష్యం అని అంగీకరింపజేయడం కనీసం మొదటి మెట్టుగా తోచింది. అధినివేశ ప్రతిపత్తిలో విడిపోయే హక్కు ఉంటుందని చేసే వాదాల్లోని యుక్తి అతను అంగీకరించేవాడు కాదు. అసలు అధినివేశ ప్రతిపత్తికి అంగీకరించడమే భారతదేశ మానసిక భ్రష్టత్వానికి నిదర్శనమని భావించాడు. ఇది ఐరోపాలో అతనికి కలిగిన నూతన రాజకీయ, ఆర్థిక చైతన్యానికి సరిగా సరిపోయే కార్యాచరణ అని తోచింది.

జవాహర్‌లాల్ మద్రాసు కాంగ్రెస్ మహాసభలో పూర్ణ స్వాతంత్ర్యం కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదింపజేయగలిగాడు. పూర్ణ స్వాతంత్ర్యానికి రక్షణ, ద్రవ్య, ఆర్థిక విషయాలు, విదేశాంగ విధానంపై పూర్తి అదుపు అని తీర్మానంలో అర్థం చెప్పాడు. అయితే ఈ తీర్మానాన్ని కేవలం జవాహర్‌లాల్‌ని సంతోషపరిచి, సంతృప్తుణ్ణి చేయడానికే గాంధీ ప్రధానంగా ఉద్దేశించాడు. కనుక కాంగ్రెస్ నియమావళిలో పూర్వ అర్థంలో స్వరాజ్యం అన్న పదమే కనిపిస్తుంది. అందుకే బ్రిటీష్ వారితో పూర్తి తెగతెంపులు చేసుకోవడానికి ఇష్టపడని వారు కూడా కాంగ్రెస్‌లో కొనసాగ సాగారు. ఈ కారణాలన్నిటి దృష్ట్యా జవాహర్ నెగ్గించిన తీర్మానం పూర్తిగా పరిహాసాస్పదం అయింది. ఆ దశలో మోతీలాల్ కాంగ్రెస్ ఆదేశంతో ఒక రాజ్యాంగాన్ని రాయడం ప్రారంభించాడు, ఈ రాజ్యాంగ కమిటీలో జవాహర్ కూడా ఒకడు. అధినివేశ ప్రతిపత్తిని ఏమాత్రం అంగీకరించకూడదని బహిరంగంగా తండ్రితోనే వివాదపడ్డాడు.

కాంగ్రెస్‌లో ఉంటూనే స్వాతంత్ర్యం కోసం ఒత్తిడి తీసుకువచ్చే పక్షంగా ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ నెలకొల్పాడు. జవాహర్ ఉద్దేశంలో ఈ లీగ్ కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాక స్వాతంత్ర్యానంతరం భారతదేశం పెట్టుబడిదారీ, భూస్వామ్య ప్రాతిపదికలు మార్చివేసి, రాజ్యాన్ని సహకార ప్రాతిపదికపై వ్యవస్థీకరించేందుకు పనిచేయాలి. అంటే భారత స్వాతంత్ర్యంతో పాటుగా సామ్యవాద, ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వవాదం వంటివి ఇందులో ఇమిడి ఉన్నాయి. దీనిని అంతర్జాతీయ వాదానికి ముడిపెడుతూ ఒక పెద్ద ప్రపంచ సహకార కామన్వెల్తుకు ఈ పరిణామాలు దారితీయాలని కూడా ఆశించాడు. తన ఉద్దేశాలను కాంగ్రెస్ నాయకత్వంలో చాలామంది ఆమోదించట్లేదని తెలిసిన జవాహర్ తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు. జవాహర్ చేస్తున్న ఈ కార్యాచరణకు కాంగ్రెస్ వారెవరూ పెద్ద ప్రాముఖ్యం ఇవ్వకపోవడంతో అతని రాజీనామా అంగీకరించలేదు. ఆ మాటకి వస్తే ఈ స్వాతంత్ర్యం అన్న డిమాండ్ అధినివేశ ప్రతిపత్తిని సాధించుకునేందుకు మంచి ఎత్తుగడగా వారు భావించారు.


భారత దేశ మొదటి ప్రధాన మంత్రి

తీన్ మూర్తి భవన్, ప్రధాన మంత్రిగా నెహ్రూ యొక్క నివాసము, ప్రస్తుతం అయన జ్ఞాపకార్ధ మ్యూజియం.

బ్రిటిష్ కాబినెట్ మిషన్ అధికార బదిలీ ప్రస్తావన చేసేందుకు వచ్చినపుడు, నెహ్రూ మరియు ఆయన సహచరులు విడుదల చేయబడ్డారు.

బ్రద్దలైన మతకలహాలు మరియు గతి తప్పిన రాజకీయాలు, ప్రత్యేక ముస్లిం రాజ్య మైన పాకిస్తాన్ ఏర్పాటు కొరకు ముహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో నడుపబడుచున్న ముస్లింలీగ్ నుండి వ్యతిరేకతల నడుమ, నెహ్రూ అధిపతిగా నున్న తాత్కాలిక ప్రభుత్వం బలహీనపడింది. మిశ్రమ ప్రభుత్వం కొరకు చేసిన ప్రయత్నాలు విఫలమైన తరువాత, నెహ్రూ 1947 జూన్ 3 న ఆంగ్లేయులచే ప్రతిపాదించబడిన భారతదేశ విభజనకు అయిష్టంగానే అంగీకరించారు. ఆయన 15ఆగస్టున భారత దేశ ప్రధాన మంత్రిగా పదవీ స్వీకారం చేసి ఎ ట్రిస్ట్ విత్ డెస్టినీ :గా ప్రసిద్దమైన తన మొదటి ప్రసంగాన్ని చేసారు.

చాలా సంవత్సరాల క్రితం మనము విధితో తల పడ్డాము, ఇప్పుడు మనం అమిత ధృడంగా ప్రతిజ్ఞ నెరవేర్చుకొనే సమయం వచ్చినది. అర్ధరాత్రి సమయంలో, ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, భారతదేశం తన స్వతంత్ర జీవనానికై మేల్కొంది.మనం పాత నుండి క్రొత్తకి అడుగు వేసేటపుడు, ఒక యుగం అంతమైనపుడు, చాలా కాలం అణగ ద్రొక్క బడిన ఒక దేశం తనను తాను బహిర్గత పరచుకొనే ఒక క్షణం, చరిత్రలో అరుదుగా వస్తుంది.భారత దేశం కొరకు మరియు దాని ప్రజల కొరకు ఇంకా ముఖ్యంగా మానవ జాతి సేవకు అంకిత మవుతామనే ప్రతిజ్ఞకు ఈ పవిత్ర క్షణం యుక్తమైనది." [61]

ఏమైనప్పటికీ, ఈ కాలం తీవ్రమైన మతహింసకు ఆనవాలుగా ఉంది. ఈ హింస పంజాబ్ ప్రాంతం, ఢిల్లీ, బెంగాల్ మరియు భారత దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. శాంతిని పెంపొందించేందుకు, కోపోద్రిక్తులై, దిక్కుతోచక యున్న శరణార్ధులను శాంతింప చేసేందుకు, నెహ్రూ పాకిస్తానీ నాయకులతో కలిసి పర్యటనలు నిర్వహించారు. నెహ్రూ, మౌలానా ఆజాద్ మరియు ఇతర ముస్లింనాయకులతో కలిసి, ముస్లింలకు భద్రత కల్పించి, భారతదేశంలో ఉండేందుకు ప్రోత్సహించేలా చేసారు. ఈ కాలంలోని హింస నెహ్రూను తీవ్రంగా కలచి వేసి, కాల్పుల విరమణను పాటించేలా మరియు భారత-పాకిస్తాన్ యుద్ధం 1947, ఆపడానికి ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం వహించేలా చేసింది. మతవిద్వేషాలకు భయమునొంది హైదరాబాద్ రాష్ట్ర విలీనానికి మద్దతు ఇవ్వడానికి నెహ్రూ సంశయించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సంవత్సరాలలో, తన బాగోగులు చూడడానికి మరియు వ్యక్తిగత వ్యవహారాల నిర్వహణకు, నెహ్రూ తరచుగా తన కుమార్తె పై ఆధార పడేవారు. ఆయన నాయకత్వంలో, 1952 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీని సాధించింది. ఇందిర, తన తండ్రి సంరక్షణకై ఆయన అధికారికనివాసం లోనికి మారారు. వాస్తవానికి ఇందిర నెహ్రూ సిబ్బందిలో ముఖ్యురాలిగా ఉంటూ ఆయన భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలలో నిరంతరం తోడుగా ఉన్నారు.

తీన్ మూర్తి భవన్ లో నెహ్రూ అధ్యయనము

ఆర్ధిక విధానాలు

భారత ఆర్ధిక రంగానికి అనువుగా సవరించిన రాజ్య ప్రణాళిక మరియు నియంత్రణ విధానానికి నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. నెహ్రూ, భారత ప్రణాళికా సంఘంన్ని నెలకొల్పి, 1951 లో మొదటి పంచ-వర్ష ప్రణాళికను రచించి, అందులో పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులను పొందుపరిచారు. వ్యాపార మరియు ఆదాయ పన్ను పెరుగుదలతో, నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో కీలక పరిశ్రమలైన మైనింగ్, విద్యుత్ మరియు భారీ పరిశ్రమలు, పౌర సేవలతో ప్రైవేటు రంగాన్ని అదుపులో వుంచే మిశ్రమ ఆర్ధిక విధానాన్ని యోచించారు. నెహ్రూ భూపునఃపంపిణి విధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు కాలువలు త్రవ్వించడం, ఆనకట్టలు కట్టించడం మరియు వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. కమ్యూనిటీ అభివృద్ది పధకాలకు దారి తీసే లక్ష్యంతో గ్రామీణ భారత సామర్ద్యాన్ని ఇనుమడించే వివిధ కుటీర పరిశ్రమలను విస్తరింపచేసారు.భారీ ఆనకట్టలను ('నెహ్రూ వీటిని భారత దేశ ఆధునిక దేవాలయాలు' అనేవారు ) ప్రోత్సహించడం, నీటిపారుదల సౌకర్యాల కల్పన మరియుజలవవిద్యుత్ ఉత్పత్తితో పాటు, నెహ్రూ భారతదేశ అణుశక్తి కార్యక్రమాలను కూడా ప్రవేశ పెట్టారు.

నెహ్రూ పదవీకాలంలో అభివృద్ధి మరియు ఆహారోత్పత్తి పెరుగుదల జరిగినప్పటికీ, భారత దేశం తీవ్రమైన ఆహారపు కొరతను ఎదుర్కొంటూనే ఉంది.నెహ్రూ ఆర్ధిక విధానాలు, ఆర్ధిక విధాన ప్రకటన 1956 లో పొందుపరచబడి, విభిన్న ఉత్పాదక మరియు భారీ పరిశ్రమలను [62] ప్రోత్సహించినప్పటికీ, దేశ ప్రణాళిక, నియంత్రణ మరియు క్రమబద్దీకరణలు ఉత్పాదకత, నాణ్యత మరియు లాభదాయకతలను బలహీన పరచాయి. భారతఆర్ధిక వ్యవస్థ స్థిరమైన అభివృద్ధిని సాధించినప్పటికీ, విస్తారమైన పేదరికం, దీర్ఘకాల నిరుద్యోగిత అనే అంటురోగాల బారిన ప్రజలు చిక్కుకున్నారు. నెహ్రూ ప్రజాదరణ చెక్కుచెదరక పోగా, ఆయన ప్రభుత్వం విస్తారమైన భారత గ్రామీణ ప్రజానీకానికి నీరు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య రక్షణ, రహదారులు మరియు వ్యవస్థాపన సౌకర్యాలు కల్పించడంలో విజయవంతమయ్యింది. స్రివత్సల్, హెమంథ్, సుమంథ్, స్రుథి,సరన్య\

విద్య మరియు సంఘ సంస్కరణ

భారత దేశ బాలలు మరియు యువకులు విద్యను అభ్యసించాలనే తీవ్రమయిన కోరికగల నెహ్రూ, భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి అది అత్యవసరమని భావించారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ మరియుఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలను ఆయన ప్రభుత్వం నెలకొల్పింది. భారత దేశ బాలలందరికీ నిర్బంధ, ఉచిత ప్రాథమిక విద్య అందించాలనే సంకల్పాన్ని నెహ్రూ తన పంచ-వర్ష ప్రణాళికలలో ప్రతిపాదించారు. దీని కోసం నెహ్రూ మూకుమ్మడి గ్రామ భర్తీ కార్యక్రమాలను మరియు వేలాది పాఠశాలల నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అంతేకాక బాలలలో పోషకాహార లోప నివారణకై ఉచిత పాలు మరియు ఆహార సరఫరా ప్రారంభించడానికి చొరవ తీసుకున్నారు. వయోజనుల కొరకు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల వారికోసం, వయోజన విద్యా కేంద్రాలు, వృత్తి మరియు సాంకేతిక విద్యా పాఠశాలలు కూడా నిర్వహించారు.

కుల వివక్షను శిక్షార్హమైన నేరంగా పరిగణించుటకు మరియు స్త్రీల యొక్క న్యాయ పరమైన హక్కులను మరియు సాంఘిక స్వతంత్రతకు, హిందూ చట్టంలో పలు మార్పులను నెహ్రూ ఆధ్వర్యంలోని భారత పార్లమెంటు చేసింది.[63][64][65] [66] షెడ్యుల్డ్ కులాలు మరియు తెగల ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక అసమానతలను మరియు అననుకూలతలను రూపుమాపడానికి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. నెహ్రూ లౌకికవాదానికి, మత సామరస్యానికి మరియు ప్రభుత్వంలో అల్ప సంఖ్యాక వర్గాల ప్రాతినిధ్యానికి పూనుకున్నారు.

జాతీయ భద్రత మరియు విదేశాంగ విధానం

ఆంగ్లేయుల నుంచి స్వాతంత్ర్యాన్ని పొందిన నూతన స్వేచ్ఛా భారతానికి నెహ్రూ 1947 నుండి 1964 వరకు నాయకత్వం వహించారు. యు.ఎస్. మరియు యు.ఎస్.ఎస్.ఆర్.లు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో భారత దేశాన్ని తమ మిత్ర దేశంగా చేసుకోవడానికి పోటీ పడ్డాయి.

1948 లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జనాభిప్రాయ సేకరణకు నెహ్రూ అంగీకరించినప్పటికీ, తరువాతి కాలంలో ఐక్యరాజ్యసమితికి దూరమై 1953 లో జనాభిప్రాయ సేకరణకు నిరాకరించారు. అంతకుముందు తాను బలపరచిన షేక్ అబ్దుల్లా, వేర్పాటు వాద ఆశయాన్ని కలిగి ఉన్నారనే అనుమానంతో ఆయన అరెస్టుకు ఆదేశించి, ఆయన స్థానంలో బక్షి గులాం మొహమ్మద్ను నియమించారు. అంతర్జాతీయ రంగంలో నెహ్రూ ఒక శాంతి కాముక నాయకునిగా ఉండి ఐక్యరాజ్యసమితికి మంచి మద్దతుదారుగా నిలిచారు. ఆయన అలీన విధానాన్ని ప్రతిపాదించి, యు.ఎస్.మరియు యు.ఎస్.ఎస్.ఆర్. దేశాల నాయకత్వంలో ఉన్న వ్యతిరేక కూటముల మధ్య, తటస్థ వైఖరి అవలంబించే దేశాలతో అలీనోద్యమాన్ని స్థాపించి, దాని మూలధన ఏర్పాటుకు సహకారం అందించారు. స్థాపించిన వెంటనే పీపుల్స్ రిపబ్లిక్ అఫ్ చైనాను గుర్తించి (అనేక పశ్చిమ కూటములు రిపబ్లిక్ అఫ్ చైనాతో సంబంధాలు కొనసాగించాయి), ఐక్యరాజ్య సమితిలో దానిని చేర్చు కోవాలని వాదించి, కొరియాతో వైరం వల్ల చైనీయులను కలహ కారకులుగా గుర్తించడాన్ని వ్యతిరేకించారు.[67] చైనా 1950 లో టిబెట్ను ఆక్రమించినప్పటికీ దానితో సుహృద్భావ మరియు స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పాలని భావించి, కమ్యూనిస్ట్ దేశాలకు మరియు పశ్చిమ కూటమికి మధ్య ఏర్పడిన ఒత్తిడులను తొలగించేందుకు మధ్యవర్తిగా ఉండాలని ఆశించారు. చైనాతో ఈ విధమైన శాంతి కాముక విధానం సమస్యాత్మకమైనదిగా,చైనా కాశ్మీర్ ప్రాంతంలో నున్న, టిబెట్ సరిహద్దుగా ఉన్న అక్సాయి చిన్ను ఆక్రమించి, భారత-చైనా యుద్ధం, 1962 కు దారి తీసినపుడు ఋజువైనది.

అణు ఆయుధాల బెదిరింపులను మరియు ప్రపంచంవ్యాప్త వత్తిడులను తగ్గించడానికి నెహ్రూ కృషి పలువురి ప్రశంసలు అందుకుంది.[68] అణు విస్ఫోటనం వల్ల మానవ జాతికి కలిగే ఫలితాల తొలి అధ్యయనాన్ని ప్రారంభించి, తాను'వినాశకర భయానక యంత్రాలు'గా పిలిచే, వాటి నిరోధానికి నిరంతరం దండెత్తారు. అణు అస్త్రాల పోటి వల్ల దారితీసే అతి-సైనికీకరణ అభివృద్ధి చెండుతున్న దేశాలైన, తన దేశం వంటివి భరించలేనిదిగా భావించడం, ఆయన అణునిరాయుధీకరణకు వ్యతిరేకంగా ఉండడానికి కారణం.[69]

1956 లో సుఎజ్ కాలువపై ఆంగ్లేయ, ఫ్రెంచ్ మరియుఇజ్రాయిల్ ల ఉమ్మడి దండయాత్రను విమర్శించారు. అనుమానం మరియు అపనమ్మకము యు.ఎస్., మరియు భారత దేశాల మధ్య సంబంధాలను బలహీనపరచి, నెహ్రూ వ్యూహాత్మకంగా సోవియట్ యూనియన్ను బలపరుస్తున్నారనే అనుమానాన్ని కలిగించింది.1960 లో పాకిస్తాన్ పాలకుడైన ఆయుబ్ ఖాన్ తో సింధు నదీ జలాల ఒప్పందం పై సంతకం చేయడం ద్వారా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పంజాబ్ ప్రాంతంలోని నదీ వనరుల పంపక సమస్య సాధనకు, యునైటెడ్ కింగ్డం మరియు ప్రపంచ బ్యాంక్ల మధ్యవర్తిత్వానికి అంగీకరించారు.

ఆఖరి సంవత్సరాలు

1957 ఎన్నికలలో నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ గొప్ప విజయాన్ని సాధించిన్పటికీ, ఆయన ప్రభుత్వం వెల్లువెత్తుతున్న విమర్శలను ఎదుర్కొంది . పార్టీ లోఅంతర్గతంగా ఉన్న అవినీతి అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన నెహ్రూ, పదవికి రాజీనామా చేసి, సేవను కొనసాగించాలని భావించారు.1959లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆయన కుమార్తె ఇందిరా గాంధీ ఎన్నిక బంధు ప్రీతి[ఆధారం చూపాలి] విమర్శలను రేకెత్తించింది, నెహ్రూ ఆమె ఎన్నికను ఆమోదించక, వంశానికి అపకీర్తిగా భావించి, దానిని పూర్తిగా అప్రజాస్వామికము మరియు అవాంచనీయంగా భావించారు, తన మంత్రివర్గంలో స్థానాన్ని తిరస్కరించారు .[70] ఇందిరా గాంధీ తన తండ్రి విధానంతో విభేదించారు; ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో ఉన్న వ్యక్తిగత విభేదాలను ఉపయోగించుకొని, ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా కేరళ లోని కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియాప్రభుత్వాన్ని రద్దు చేయించారు.[70] నెహ్రూ ఆమె దయలేని విధానాలు మరియు పార్లమెంటరీ సాంప్రదాయం పట్ల అగౌరవానికి తీవ్రంగా కలత చెందారు, ఆమె తండ్రిచాటు బిడ్డగా కాక, అకారణంగా నిర్దిష్ట చర్యలు తీసుకొనుట ఆయనను బాధించింది.[71]

పంచ - శీల (శాంతియుత సహజీవనానికి ఐదు సూత్రాలు)టిబెట్ పై భారత-చైనా ఒప్పందం 1954కు ఆధారం ఐనప్పటికీ,తరువాతి సంవత్సరాలలో సరిహద్దు వివాదాలు మరియు దలై లామాకు రాజకీయ ఆశ్రయం ఇవ్వాలనే నెహ్రూ నిర్ణయం చైనాతో పెరుగుతున్న విభేదాలు నెహ్రూ విదేశాంగ విధానానికి ఇబ్బంది కలిగించాయి.అనేక సంవత్సరాల చర్చలు విఫలమైన తరువాత, నెహ్రూ 1961 లో పోర్చుగల్ నుండి గోవాను స్వాధీన పరచుకోవలసినదిగా భారతీయ సైన్యాన్ని ఆజ్ఞాపించారు. చూడుము గోవా విముక్తి. సైనిక చర్య జరిపించినందుకు నెహ్రూ ప్రజాదరణతో పాటువిమర్శలను కూడా ఎదుర్కొన్నారు.

1962 ఎన్నికలలో, ఆధిక్యత తగ్గినప్పటికీ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీలైన, సాంప్రదాయ వాద పార్టీలు భారతీయ జన సంఘ్ మరియు స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్లుమరియుకమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియాలు కూడా గెలుపొందాయి.

కొద్దినెలల కాలంలోనే,సరిహద్దు వివాదాలను చైనా బహిరంగ యుద్ధాలుగా మార్చింది.సామ్రాజ్యవాద బాధితులుగా (భారత దేశం ఒక వలస రాజ్యం)మనం ఐకమత్యంగా ఉండాలని భావించి, "హిందీ-చీనీ భాయి భాయి ", (భారతీయులు మరియు చైనీయులు సోదరులు)అనే మాటలలో నెహ్రూ తన భావాన్ని వ్యక్తం చేసారు.అభివృద్ధి చెందుతున్న దేశాలమధ్య సోదర భావం మరియు ఐకమత్యానికి ఆయన అంకితం అయ్యారు. నెహ్రూ స్వాభావికంగా ఒక సామ్యవాద దేశం మరొక సామ్యవాద దేశం పై పోరుసల్పదని భావించారు, ఏ సందర్భంలో నైనా భారతదేశం చొరబడలేని మంచు గోడలైన హిమాలయాల వెనుక సురక్షితమని భావించారు. చైనా ఉద్దేశాలు, సైనిక సామర్ధ్యాల ముందు రెండూ కూడా తప్పని తేలాయి. చైనా ఆక్రమించుకున్న వివాదాస్పద ప్రాంతాల్లో వారిని ఎదుర్కోవాలనే ఆలోచనను - "వారిని (చైనీయులను )బయటకు విసిరేయండి"-అనే జ్ఞప్తికి ఉంచుకోదగిన ప్రకటనలో సైన్యాన్ని ఆదేశించారు-చైనా ముందస్తు దాడిని ప్రారంభించింది.[72]

దస్త్రం:Nehrudeath.jpg
ప్రజల సందర్శనార్ధం నెహ్రూ భౌతిక కాయం, 1964

చైనా భారత యుద్ధం ప్రారంభించిన కొద్ది రోజులలోనే చైనా సైన్యం ఈశాన్య భారత దేశంలోనిఅస్సాం వరకు చొచ్చుకు రావడం భారత సైన్య బలహీనతను బహిర్గత పరచింది.భద్రతపై అయన ప్రభుత్వ నిర్లక్ష్యానికి తీవ్ర విమర్శలు ఎదుర్కొని,రక్షణ మంత్రి అయిన కృష్ణ మీనన్ను తొలగించి, యు.ఎస్. సైనికసహాయం అర్దించవలసి వచ్చింది. క్రమంగా నెహ్రూ ఆరోగ్యం మందగించ సాగింది, కోలుకోవడానికి అయన 1963 లో కొన్ని నెలలు కాశ్మీర్లో గడపవలసి వచ్చింది. కొంతమంది చరిత్ర కారులు ఈ ఆకస్మిక ఇబ్బందికి కారణం చైనా దండయాత్ర వలన అయన పొందిన అవమానం మరియు విశ్వాస ఘాతుకంగా భావిస్తారు [73]]కాశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తరువాత నెహ్రూ గుండెపోటుతో బాధపడి తరువాత మరణించారు. 1964 మే 27 వేకువ సమయంలో ఆయన మరణించారు. హిందూమత కర్మల ననుసరించి యమునా నది ఒడ్డున గలశాంతివన్లో నెహ్రూ అంత్య క్రియలు జరుప బడ్డాయి, వందల వేల మంది సంతాపం ప్రకటించడానికి ఢిల్లీ వీధులలో మరియు అంత్యక్రియా స్థలం వద్ద గుమికూడారు.

వారసత్వం

అల్ద్విచ్, లండన్ లో నెహ్రూ విగ్రహం

భారత దేశ మొదటి ప్రధానమంత్రి మరియు విదేశాంగమంత్రిగా,జవహర్లాల్ నెహ్రూ నవ భారత ప్రభుత్వ విధానాలను, రాజకీయ సంస్కృతిని మరియు శక్తివంతమైన విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర వహించారు. సార్వత్రిక ప్రాథమిక విద్యా పధకాన్ని ప్రారంభించి, దేశంలోని మారుమూల గ్రామీణ బాలలకు విద్య అందించ గలిగినందుకు అయన ప్రశంశించబడతారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలైన అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్,[74] ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ,[75] మరియుఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్లు అభివృద్ధి చేసిన ఘనత నెహ్రూ విద్యా విధానానిదే.

భారతదేశ ప్రత్యేక జాతుల, అల్ప సంఖ్యాక వర్గాల, స్త్రీల, షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యుల్డ్ తెగలకు సమాన అవకాశాలు మరియు హక్కులు కల్పించేందుకు విస్తృతమైన విధానాన్ని రూపొందించి స్థిరమైన చర్యలను నెహ్రూ చేపట్టారు.[76][77]సమానత్వాన్ని నెలకొల్పాలనే నెహ్రూ ఆకాంక్ష, ఆయన స్త్రీలు మరియు అణగారిన వర్గాల [78] కొరకు ప్రభుత్వ పధకాలు విస్తృతంగా రూపొందించి, వాటి అమలుకు ప్రయత్నించేలా చేసింది,కాని అవి ఆయన జీవిత కాలంలో పరిమితంగానే విజయవంతమయ్యాయి.

ఓటమి ఎరుగని జాతీయ వాదిగా నెహ్రూ స్థానం ఆయన,ప్రాంతీయ భేదాలను గుర్తిస్తూ నే అణచి వేయబడిన సామాజిక వర్గాల కొరకు విధానాలు అమలు పరచుటకు దారి చూపింది. స్వాతంత్ర్య -అనంతర కాలంలో ఆంగ్లేయులు ఉపఖండం నుండి విరమించు కొన్న తరువాత, ఉపఖండంలో అంతకు ముందు ఒకే సామాన్య విరోధికి వ్యతిరేకంగా మిత్రులుగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఇక నుండి ఒకరికొకరు సంబంధం లేకుండా విభేదాలు పొడసూపిన కాలంలో ఇది ప్రాముఖ్యతను సంతరించు కుంది. సాంస్కృతిక వైవిధ్యం ప్రత్యేకించి భాషా వైవిధ్యం దేశ ఐక్యతను భంగపరచేదిగా ఉన్న సమయంలో, నెహ్రూ నేషనల్ బుక్ ట్రస్ట్ మరియు నేషనల్ లిటరసీ అకాడమీ వంటి సంస్థలను ఏర్పరచి వివిధ భాషల మధ్య అనువాదాలను ప్రోత్సహించారు మరియు విషయ పరిజ్ఞాన బదిలీలను ప్రోత్సహించారు.సమైక్య భారతదేశం కోసం నెహ్రూ "కలసిఉండడం లేదా నశించడం ", అని నినదించారు.[79]

జ్ఞాపకార్ధం

జవహర్లాల్ నెహ్రూ జ్ఞాపకార్ధం 1989 లో USSR విడుదల చేసిన తపాలా బిళ్ళ
నోన్గ్పోలో పిల్లలకు మిఠాయిలు పంచుతున్న నెహ్రూ

తన జీవిత కాలంలో నెహ్రూ భారత దేశంలో ఒక ఆదర్శ మూర్తిగా గుర్తింపబడి, ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆదర్శవాదము మరియు రాజకీయ ధురన్ధరత ప్రశంసించ బడ్డాయి. బాలల మరియు యువజనుల పట్ల నెహ్రూకు గల వాత్సల్యానికి, వారి శ్రేయస్సుకు, విద్యాభివృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా, ఆయన జన్మ దినమైన 14 నవంబర్,ను భారత దేశం బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నది. దేశ వ్యాప్తంగా బాలలు ఆయనను చాచా నెహ్రూ (నెహ్రూ అంకుల్)అని గౌరవిస్తారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాదరణ పొందిన నాయకునిగా ఆయనను తరచూ వారు గుర్తు చేసుకుంటారు. కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఆయన వస్త్ర ధారణను, ప్రత్యేకించిగాంధీ టోపీని మరియు అలవాట్లను అనుకరిస్తుంటారు. నెహ్రూ ఆదర్శాలు మరియు విధానాలు కాంగ్రెస్ ప్రకటన పత్రము (ముసాయిదా)ను మరియు మూల రాజకీయ తత్వాన్ని రూపొందించడంలో నేటికీ ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆయన వారసత్వ ప్రతినిధిగా ఇదిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రభుత్వ నాయకత్వాన్ని చేపట్టారు.

జవాహర్ లాల్ నెహ్రూ, హైదరాబాదు అబిడ్స్ దగ్గరి విగ్రహము

నెహ్రూ జీవితం పై ఎన్నోడాక్యుమెంటరీలు నిర్మింపబడ్డాయి.ఎన్నో కల్పిత చిత్రాలలో ఆయన చిత్రీకరింప బడ్డారు. 1982 లో రిచర్డ్ అటెన్ బరో చిత్రంగాంధీ లోను, నెహ్రూ చే రచింపబడిన ది డిస్కవరీ అఫ్ ఇండియా గ్రంథం పై ఆధారపడి 1988 లోశ్యాం బెనెగల్ యొక్క టెలివిజన్ సీరియల్ భారత్ ఏక్ ఖోజ్ లోను, 2007 లో ది లాస్ట్ డేస్ అఫ్ ది రాజ్ అనే టెలివిజన్ చిత్రం లోను మూడు సార్లు నెహ్రూ పాత్రను పోషించినరోషన్ సేథ్ ఆ పాత్రకు పరిపూర్ణత నిచ్చారు.[80] కేతన్ మెహతా చిత్రం సర్దార్లో నెహ్రూపాత్రను బెంజమిన్ గిలానీ పోషించారు.

శేర్వాని ధారణను నెహ్రూ వ్యక్తి గతంగా ఇష్ట పడడం దానిని ఉత్తర భారత దేశంలో నేటికి కూడా ప్రత్యేక సందర్భ వస్త్ర ధారణగా నిలిపింది. ఒక రకమైన టోపీకి ఆయన పేరును ఇవ్వడంతో పాటు, ఆయన ప్రాధాన్యతనిచ్చిన కోటుకు కూడానెహ్రూ కోటు అనే పేరునిచ్చి గౌరవిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వరంగసంస్థలు, జ్ఞాపక చిహ్నాలు నెహ్రూస్మృతికి అంకితం ఇవ్వబడ్డాయి. భారత దేశంలోని విశ్వవిద్యాలయాలలో ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ముంబై నగరానికి దగ్గరలో నున్న జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ భారీ సరుకు రవాణాకు, రాకపోకలకు అనువుగా నిర్మించ బడిన ఆధునికమైన పోర్ట్ మరియుడాక్. ఢిల్లీ లోని నెహ్రూ నివాసము నెహ్రూ జ్ఞాపకార్ధ మ్యూజియం మరియు గ్రంధాలయంగా సంరక్షించ బడుతోంది. నెహ్రూ కుటంబ భవనాలైన ఆనంద్ భవన్ మరియు స్వరాజ్ భవన్లు నెహ్రూ జ్ఞాపకార్ధం మరియు కుటుంబ వారసత్వంగా కాపాడబడుతున్నాయి. 1951 లో ఆయన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీసు కమిటీ (AFSC)ద్వారానోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించ బడ్డారు.[81]

ఇవికూడా చూడండి

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

నోట్స్

 1. ఢిల్లీలో తమ పూర్వీకుల ఇల్లు ఒక కాలువ గట్టు మీద ఉండడంతో ఉర్దూలో కాలువను సూచించే నెహర్ పదాన్ని అనుసరించి నెహ్రూ అన్న పేరు వచ్చిందని మోతీలాల్ నెహ్రూ చెప్పేవాడు. జవాహర్‌లాల్ నెహ్రూ దీన్ని విశ్వసించి ఆత్మకథ ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాడు. అయితే ఇప్పటికీ కాశ్మీర్‌లో నెహ్రూ వంశస్థులు ఉండడంతో పై కథను నెహ్రూ జీవితచరిత్రకారుడు ఎస్. గోపాల్ సంశయంతోనే స్వీకరించాడు.
 2. కాశ్మీర్ లోయలోని సామాజిక కారణాల దృష్ట్యా పండిట్‌లు ముస్లింల పట్ల వేరు భావం కలిగి ఉండేవారు కాదు. కులాల మధ్య అంతరాలు చూపే ఆచారాలు వారిలో అంతగా ఉండేవి కావు. ఇదంతా కలిసి వారికి ఆచార వ్యవహారాల్లో పట్టింపు తక్కువగా ఉండేది
 3. న్యాయవాదిగా ఆనాటి వలస సమాజంలో ఉన్నతస్థాయిని పొందిన మోతీలాల్ కుమారుడికి బ్రిటీష్ విద్యాబోధనే ప్రధానమని భావించాడు. మోతీలాల్ సహా కాశ్మీరీ పండిట్లయిన వారి పూర్వీకులంతా సంస్కృతం వంటి ఇతర భారతీయ భాషలకన్నా అరబ్బీ, ఫారసీ, ఉర్దూ వంటి భాషలలోనే ఎక్కువ ప్రవేశం కలవారు. ఇలా కుటుంబ సామాజిక స్థితి, సంప్రదాయానుశీలంగా వారి వాతావరణంలో ఈ భారతీయ విద్యల పట్ల ప్రత్యేకాభిమానం లేకపోవడం కూడా జవాహర్‌లాల్‌ సంస్కృతం నేర్వలేకపోవడాన్ని ప్రభావితం చేశాయి.

మూలాలు

 1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3556: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 2. In Jawaharlal Nehru's autobiography, An Autobiography (1936), and in the Last Will & Testament of Jawaharlal Nehru, in Selected Works of Jawaharlal Nehru, 2nd series, vol. 26, p. 612, ఏ రూపంలో ఉన్న దేవుడినీ తాను నమ్మనని నెహ్రూ చెబుతాడు.
 3. రఫీఖ్ జకారియా (1960). ఎ స్టడీ ఆఫ్ నెహ్రూ (in ఆంగ్లం). టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రెస్. p. 22. 
 4. 4.0 4.1 4.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 13.
 5. సర్వేపల్లి గోపాల్ 1993, p. 14.
 6. సర్వేపల్లి గోపాల్ 1993, p. 15.
 7. 7.0 7.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 16.
 8. Bal Ram Nanda; The Nehrus. Oxford University Press. 1962. ISBN 978-0195693430. p. 65.
 9. 9.0 9.1 9.2 Om Prakash Misra; Economic Thought of Gandhi and Nehru: A Comparative Analysis. M.D. Publications. 1995. ISBN 978-8185880716. pp. 49–65
 10. 10.0 10.1 10.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 18.
 11. సర్వేపల్లి గోపాల్ 1993, p. 17.
 12. Moraes 2008, p. 36.
 13. కేంబ్రిడ్జిలో చేరిన కొత్తల్లో జవాహరలాల్ తండ్రికి రాసిన ఉత్తరాల్లో తండ్రి మితవాద ధోరణిని విమర్శించడం, కొండొకచో హేళన చేయడం కూడా కనిపిస్తుంది
 14. సర్వేపల్లి గోపాల్ 1993, p. 21.
 15. సర్వేపల్లి గోపాల్ 1993, p. 22.
 16. సర్వేపల్లి గోపాల్ 1993, p. 23.
 17. సర్వేపల్లి గోపాల్ 1993, p. 24.
 18. 18.0 18.1 18.2 Ghose 1993, p. 25.
 19. Moraes 2008, p. 49.
 20. Moraes 2008, p. 52.
 21. Moraes 2008, p. 53.
 22. 22.0 22.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 27.
 23. సర్వేపల్లి గోపాల్ 1993, p. 28.
 24. సర్వేపల్లి గోపాల్ 1993, p. 29.
 25. సర్వేపల్లి గోపాల్ 1993, p. 30.
 26. సర్వేపల్లి గోపాల్ 1993, p. 31.
 27. సర్వేపల్లి గోపాల్ 1993, p. 33.
 28. సర్వేపల్లి గోపాల్ 1993, p. 36.
 29. సర్వేపల్లి గోపాల్ 1993, p. 38.
 30. సర్వేపల్లి గోపాల్ 1993, p. 39.
 31. సర్వేపల్లి గోపాల్ 1993, p. 40.
 32. సర్వేపల్లి గోపాల్ 1993, p. 47.
 33. సర్వేపల్లి గోపాల్ 1993, p. 48.
 34. సర్వేపల్లి గోపాల్ 1993, p. 49.
 35. సర్వేపల్లి గోపాల్ 1993, p. 50.
 36. సర్వేపల్లి గోపాల్ 1993, p. 51.
 37. సర్వేపల్లి గోపాల్ 1993, p. 52.
 38. సర్వేపల్లి గోపాల్ 1993, p. 53.
 39. సర్వేపల్లి గోపాల్ 1993, p. 54.
 40. 40.0 40.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 55.
 41. 41.0 41.1 41.2 సర్వేపల్లి గోపాల్ 1993, p. 57.
 42. సర్వేపల్లి గోపాల్ 1993, p. 56.
 43. సర్వేపల్లి గోపాల్ 1993, p. 58.
 44. సర్వేపల్లి గోపాల్ 1993, p. 59.
 45. సర్వేపల్లి గోపాల్ 1993, p. 60.
 46. సర్వేపల్లి గోపాల్ 1993, p. 61.
 47. సర్వేపల్లి గోపాల్ 1993, p. 62.
 48. సర్వేపల్లి గోపాల్ 1993, p. 67.
 49. సర్వేపల్లి గోపాల్ 1993, p. 69.
 50. సర్వేపల్లి గోపాల్ 1993, p. 70.
 51. 51.0 51.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 71.
 52. 52.0 52.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 72.
 53. 53.0 53.1 సర్వేపల్లి గోపాల్ 1993, p. 73.
 54. సర్వేపల్లి గోపాల్ 1993, p. 74.
 55. సర్వేపల్లి గోపాల్ 1993, p. 75.
 56. సర్వేపల్లి గోపాల్ 1993, p. 76.
 57. సర్వేపల్లి గోపాల్ 1993, p. 78.
 58. సర్వేపల్లి గోపాల్ 1993, p. 80.
 59. సర్వేపల్లి గోపాల్ 1993, p. 82.
 60. సర్వేపల్లి గోపాల్ 1993, p. 81.
 61. Nehru, Jawaharlal (2006-08-08). "Wikisource" (PHP). Retrieved 2006-08-08. 
 62. Farmer, B. H. (1993). An Introduction to South Asia. Routledge. p. 120. 
 63. Som, Reba (1994-02). "Jawaharlal Nehru and the Hindu Code: A Victory of Symbol over Substance?". Modern Asian Studies. 28 (1): 165–194. doi:10.1017/S0026749X00011732. Retrieved 2008-05-29.  Check date values in: |date= (help)
 64. Basu, Srimati (1999). She Comes to Take Her Rights: Indian Women, Property, and Propriety. SUNY Press. p. 3. The Hindu Code Bill was visualised by Ambedkar and Nehru as the flagship of modernisation and a radical revision of Hindu law...it is widely regarded as dramatic benchmark legislation giving Hindu women equitable if not superior entitlements as legal subjects. 
 65. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3556: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 66. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3556: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 67. Robert Sherrod (19 January 1963). "Nehru:The Great Awakening journal=The Saturday Evening Post". 236 (2): 60-67. 
 68. Bhatia, Vinod (1989). Jawaharlal Nehru, as Scholars of Socialist Countries See Him. Panchsheel Publishers. p. 131. 
 69. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3556: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 70. 70.0 70.1 Frank, Katherine (2002). Indira: The Life of Indira Nehru Gandhi. Houghton Mifflin Books. p. 250. 
 71. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3556: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 72. "A powder-keg on the border with China". Rediff. 2008-02-26. Retrieved 2008-02-26. 
 73. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Encyclopedia of Asian History అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 74. http://www.aiims.ac.in
 75. http://www.iitkgp.ac.in/institute/history.php
 76. Jackson, Thomas William (2007). From Civil Rights to Human Rights. Philadelphia: University of Pennsylvania Press. p. 100. ISBN 0-8122-3969-5. 
 77. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3556: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 78. Zachariah, Benjamin (2004). Nehru. New York: Routledge. p. 265. ISBN 0-415-25016-1. 
 79. Harrison, Selig S. (July 1956). ""The Challenge to Indian Nationalism"". Foreign Affairs. 34 (2): 620-636. 
 80. ది లాస్ట్ డేస్ అఫ్ ది రాజ్ (2007) (టివి)
 81. AFSC లాస్ట్ నోబెల్ నామినేషన్స్

ఇవి కూడా చదవండి

 • నెహ్రూ: ది ఇన్వెన్షన్ అఫ్ ఇండియా బై శశి ధరూర్ (నవంబర్ 2003) ఆర్కేడ్ బుక్స్ ISBN 1-55970-697-X
 • Frank Moraes (2008). Jawaharlal Nehru. Jaico Publishing House. ISBN 978-8179926956. 
 • జవహర్లాల్ నెహ్రూ (ఎడిటెడ్ బై ఎస్. గోపాల్ అండ్ ఉమా అయ్యంగార్) (జూలై 2003) ది ఎస్సెన్షియల్ రైటింగ్స్ అఫ్ జవహర్లాల్ నెహ్రూ ఆక్స్ఫర్డ్ యునివెర్సిటీ ప్రెస్ ISBN 0195653246
 • ఆటోబయోగ్రఫీ:టువార్డ్ ఫ్రీడం,ఆక్స్ఫర్డ్ యునివెర్సిటీ ప్రెస్
 • జవహర్లాల్ నెహ్రూ : లైఫ్ అండ్ వర్క్ ఎం.చలపతి రావ్, నేషనల్ బుక్ క్లబ్ (1966 జనవరి 1)
 • జవహర్లాల్ నెహ్రూ బై ఎం. చలపతి రావ్ [న్యూ ఢిల్లీ ] పబ్లికేషన్స్ డివిజన్, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వము [1973]
 • లెటర్స్ ఫ్రం ఎ ఫాదర్ టు హిస్ డాటర్ బై జవహర్లాల్ నెహ్రూ, చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్
 • నెహ్రూ: ఎ పొలిటికల్ బయోగ్రఫీ బై మైఖేల్ బ్రేచేర్ (1959). లండన్:ఆక్స్ఫర్డ్ యునివెర్సిటీ ప్రెస్
 • ఆఫ్టర్ నెహ్రూ, వ్హో బై వెల్ల్స్ హంగెన్ (1963). లండన్:రుపెర్ట్ హార్ట్-డవిస్.
 • నెహ్రూ: ది ఇయర్స్ అఫ్ పవర్ బై గెఒఫ్ఫ్రేయ్ టైసన్ (1966). లండన్: పాల్ మాల్ ప్రెస్.
 • ఇండిపెన్డేన్స్ అండ్ ఆఫ్టర్: ఎ కల్లెక్షన్ అఫ్ ది మోర్ ఇంపార్టంట్ స్పీచెస్ అఫ్ జవహర్లాల్ నెహ్రూ ఫ్రమ్ సెప్టెంబర్ 1946 టు మే 1949 (1949). ఢిల్లీ: ది పబ్లికేషన్స్ డివిజన్, గవర్నమెంట్ అఫ్ ఇండియా.
 • కమాండింగ్ హైట్స్. బై జోసెఫ్ స్టనిస్లా అండ్ డానిఎల్ ఎ. ఎర్గిన్. (సిమోన్ & స్చుస్టర్, ఇంక్: న్యూ యార్క్), 1998. http://www.pbs.org/wgbh/commandingheights/shared/pdf/prof_jawaharla.pdf
 • "ది ఛాలెంజ్ టు ఇండియన్ నేషనలిసం." బై సెలిగ్ స్. హర్రిసన్ ఫారిన్ అఫ్ఫైర్స్ వాల్. 34, no. 2 (1956): 620-636.
 • “నెహ్రూ, జవహర్లాల్.” బై ఐన్స్లీ టి. ఏమ్బ్రీ, ఎడ్., అండ్ ది ఆసియా సొసైటీ. ఎన్సైక్లోపీడియా అఫ్ ఆసియన్ హిస్టరీ. వాల్. 3. చార్లెస్ స్క్రిబ్నేర్స్ సన్స్. న్యూ యార్క్. (1988): 98-100.
 • “నెహ్రూ: ది గ్రేట్ అవేకెనింగ్.” బై రాబర్ట్ షెర్రొద్. సాటర్డే ఈవెనింగ్ పోస్ట్ వాల్ . 236, no. 2 (1963 జనవరి 19): 60-67.
 • సర్వేపల్లి గోపాల్ (1993). జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్ర. Translated by రామలింగం, డి,. సాహిత్య అకాడెమీ. ISBN 81-7201-212-8. 

బాహ్య లింకులు

Jawaharlal Nehru గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.


ఇంతకు ముందు ఉన్నవారు:
-
భారత ప్రధానమంత్రి
15/08/1947—27/05/1964
తరువాత వచ్చినవారు:
గుర్జారీలాల్ నందా


{{భారతీయ సంఘ సంస్కర