వనపర్తి పురపాలక సంఘము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వనపర్తి పురపాలక సంఘము మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 11 పురపాలక/నగర పంచాయతీలలో ఒకటి. ఇది 1984 నుంచి పురపాలక సంఘంగా ఉన్నది. అంతకు క్రితం 1962 నుంచి 1966 వరకు కూడా పురపాలక సంఘంగా ఉండేది. ఆ కాలంలో బాలకృష్ణయ్య పురపాలక సంఘం చైర్మెన్‌గా పనిచేశారు. మేజర్ గ్రామపంచాయతీగా మార్పు చేసిన పిదప కూడా బాలకృష్ణయ్య సర్పంచిగా ఎన్నికయ్యారు. 1983లో ఈయన వనపర్తి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇది మూడవ గ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతోంది.

జనాభా[మార్చు]

2001 నాటికి పట్టణ జనాభా 50262 కాగా, 2011 నాటికి 60949కు పెరిగింది.

ఆదాయ-వ్యయములు[మార్చు]

2012-13 నాటికి పురపాలక సంఘం ఆదాయం 7.09 కోట్ల రూపాయలు, ఖర్చు 5.40 కోట్ల రూపాయలు.[1]

మూలాలు[మార్చు]