అక్టోబర్ 3
(అక్టోబరు 3 నుండి దారిమార్పు చెందింది)
అక్టోబర్ 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 276వ రోజు (లీపు సంవత్సరములో 277వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 89 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1791: కలకత్తా మ్యాగజైన్, ఓరియంటల్ మ్యూజియం, భారత ఉపఖండంలోని మొదటి మాసపత్రిక, ప్రచురించడం ప్రారంభమైంది
- 1831:బ్రిటిష్ వారు మైసూర్‌ను స్వాధీనం చేసుకున్నారు
- 1860: బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860 చూడు. దీని ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న పోలీస్ చట్టము 1861 ఏర్పడింది.
- 1950: న్యూయార్క్‌లో యుఎన్ దళాలు 38 వ సమాంతరాన్ని దాటడాన్ని భారత్ నిరసించింది.
- 1955: మద్రాసు వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది.
- 1957:రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించబడింది
- 1977:న్యూఢిల్లీలో అధికారిక అవినీతి ఆరోపణలపై ఇందిరా గాంధీని అరెస్టు చేశారు.
- 1978: ప్రపంచంలో రెండవ, భారతదేశంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జన్మించింది.
- 1984: భారతదేశపు అతి పొడవైన రైలు హిమ్సాగర్ ఎక్స్‌ప్రెస్ (జమ్మూ తావి నుండి కన్యా కుమారి వరకు) మొదటిసారిగా జెండా ఊపింది.
- 1985: సహారావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌ని న్యూఢిల్లీ ఆమోదించినట్లు ప్రకటించిన తర్వాత మొరాకో భారతదేశంతో దౌత్య సంబంధాలను విచ్ఛిన్నం చేసింది
- 1988: లెబనీస్ కిడ్నాపర్లు మిథిలేశ్వర్ సింగ్‌ను 30 నెలల బందీగా ఉంచిన తర్వాత విడుదల చేశారు.
- 1990: పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీలు ఏకమై ఐక్య జర్మనీగా ఏర్పడ్డాయి.
- 2000:వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటనపై భారత్, రష్యా సంతకాలు చేశాయి.
- 2005: వర్తుల సూర్యగ్రహణం (యాన్యులర్ సొలార్ ఎక్లిప్స్) ఏర్పడింది.
- 2013: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
- 2013: లాలూ ప్రసాద్ యాదవ్‌కు పశువుల దాణా కుంభకోణం కేసులో తొలి శిక్షగా ఐదేళ్ళు జైలు శిక్ష
- 2021: రోహ్తాంగ్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన అటల్ సొరంగంను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
జననాలు
[మార్చు]- [[1890]]: లక్ష్మీనారాయణ సాహు, సాహితీవేత్త, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త
- 1903: స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (మ.1972)
- 1924: ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (మ.1994)
- 1926: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (మ.2010)
- 1949 - జె.పి.దత్, భారతీయ చలనచిత్ర దర్శకుడు
- 1954: సత్యరాజ్, దక్షిణ భారత చలన చిత్రాలుతో పాటు హిందీ చిత్రాల్లో, సహాయ, ప్రతి నాయక నటుడు
- 1968: ఎన్.శంకర్, రచయిత, నిర్మాత, దర్శకుడు.
- 1988: కాశి రాజు, వర్థమాన కవులలో ఒకడు, కవిసంగమంలో గ్రూప్ కవితలు వ్రాస్తున్నాడు.
మరణాలు
[మార్చు]- 1923: కాదంబినీ గంగూలీ - భారతదేశపు మొదటి పట్టభద్రురాలైన మహిళా, మొదటి మహిళా వైద్యురాలు. (జ.1861)
- 1992: దిగవల్లి వేంకటశివరావు, స్వాతంత్ర్య యోథుడు, సాహిత్యాభిలాషి, అడ్వకేటు. (జ.1898)
- 2006: ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలలో పేరొందిన చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (జ.1935)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]- BBC: On This Day
- This Day in History Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 3
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 2 - అక్టోబర్ 4 - సెప్టెంబర్ 3 - నవంబర్ 3 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |