కంకిపాడు
కంకిపాడు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°27′N 80°47′E / 16.450°N 80.783°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కంకిపాడు |
విస్తీర్ణం | 3.37 కి.మీ2 (1.30 చ. మై) |
జనాభా (2011)[1] | 14,616 |
• జనసాంద్రత | 4,300/కి.మీ2 (11,000/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 7,271 |
• స్త్రీలు | 7,345 |
• లింగ నిష్పత్తి | 1,010 |
• నివాసాలు | 4,115 |
ప్రాంతపు కోడ్ | +91 ( 0866 ) |
పిన్‌కోడ్ | 521151 |
2011 జనగణన కోడ్ | 589503 |
కంకిపాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాలోని ఇదేపేరుతో ఉన్న కంకిపాడు మండలం లోని జనగణన పట్టణం. కంకిపాడు మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, ఇది రెవెన్యూయేతర గ్రామం. ఇది సముద్రమట్టానికి 24 మీ. ఎత్తులో ఉంది..
విద్యా సౌకర్యాలు
[మార్చు]- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, లాకుగూడెం.
- సెయింట్ మేరీస్ పాఠశాల.
- కృషి ప్రాథమికోన్నత పాఠశాల.
- ఎస్.ఎస్. ప్రగ్న్య జూనియర్ పాఠశాల.
- శ్రీ చైతన్య టెక్నో స్కూల్
గ్రామ ప్రముఖులు
[మార్చు]- కె.ఎల్.రావు (కానూరి లక్ష్మణరావు) - కంకిపాడు గ్రామంలో 1902 లో జన్మించాడు.ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఇతను బాగా కృషి చేశాడు. పదవీ విరమణ చేసాక కేంద్రంలోని నెహ్రూ మంత్రివర్గంలో నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేసాడు.
- కోట శ్రీనివాసరావు - కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు.
రవాణా సౌకర్యాలు
[మార్చు]కంకిపాడు, మానికొండ, పెనమలూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. సమీప రైల్వేస్టేషన్: విజయవాడలో ఉంది.
ప్రధాన గ్రామీణ రహదారులు
[మార్చు]బ్యాంకులు
[మార్చు]- ది కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్
- ది కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్., కంకిపాడు
- సప్తగిరి గ్రామీణ బ్యాంక్.
- ది కంకిపాడు మండల కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్
కంకిపాడు డైరీ
[మార్చు]కంకిపాడులో ఈ డైరీని 2011లో 3 కోట్లరూపాయల వ్యయంతో ఏర్పాటు చేసారు. తొలిదశలో లక్ష్యాన్ని మించి పాలసేకరణ జరిగింది. కానీ రెండు సంవత్సరాల అనంతరం, ఇది, నిర్వహణపరమైన లోపాలతో మూతబడింది.
రైతు బజారు
[మార్చు]స్థానిక రహదారి బంగళా ఆవరణలో, 2013, మార్చిలో 20 రైతు దుకాణాలు, నాలుగు డ్వాక్రా దుకాణాలతో ప్రారంభమైన ఈ రైతుబజార్, ప్రస్తుతం 37 దుకాణాలకు చేరింది. మొదటి సంవత్సరం రోజుకు సగటున ఒక లక్ష రూపాయల కొనుగోళ్ళు జరుగగా, ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలకు పెరిగింది. ఈ రైతుబజారులో దుకాణాన్ని కేటాయించడానికి, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు జియో ట్యాగింగ్ విధానాన్ని అనుసరించుచున్నారు. దీనితో వాస్తవంగా కూరగాయలు సాగుచేయుచున్నవారికే ఇక్కడ దుకాణం లభించుచున్నది. అందువలననూ, ప్రభుత్వం జరీ చేసిన మార్గదర్శకాలు కఠినంగా ఉండటంతో, దళారుల బెడద చాలా తగ్గిపోయింది. 50 గ్రామాలకు ప్రధాన కూడలి అయిన ఈ రైతు బజార్ లో, విజయవాడ రైతుబజారులోని ధరలనే అమలుచేస్తున్నారు.
సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]చాలా సంవత్సరాల తరువాత, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువు ప్రక్షాళన పనులను, 2016, మే-10న ప్రారంభించారు.
ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు.
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]• ఆరోగ్య మాత దేవాలయము కంకిపాడు
- శ్రీ గంగాపార్వతీ సమేత రామలింగేశ్వరాలయం
- శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం (విష్ణాలయం)
- శ్రీ గొంతేనమ్మ అమ్మవారి ఆలయం.
- శ్రీ కోదండ రామాలయం (పాత పెట్రోలు బానికి ఎదుట ఉంది)
- శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామివారి ఆలయం.
- స్థానిక గన్నవరం రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన పోతురాజు విగ్రహాన్ని, గంగానమ్మ ఆలయంలో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
వెలుపలి లంకెలు
[మార్చు]- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- ఆంధ్రప్రదేశ్ జనగణన పట్టణాలు
- కృష్ణా జిల్లా మండల కేంద్రాలు
- జనగణన పట్టణాలు
- కృష్ణా జిల్లా
- రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు
- కృష్ణా జిల్లా జనగణన పట్టణాలు
- Pages using the Kartographer extension