Jump to content

దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
(దేవరకద్ర అసెంబ్లీ నియోజక వర్గం నుండి దారిమార్పు చెందింది)
దేవరకద్ర
—  శాసనసభ నియోజకవర్గం  —
దేవరకద్ర is located in తెలంగాణ
దేవరకద్ర
దేవరకద్ర
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడినది. ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. రద్దయిన అమరచింత నియోజకవర్గంలోని దేవరకద్ర (పాక్షికం), చిన్నచింతకుంట మండలాలు, గతంలో వనపర్తి నియోజకవర్గంలో భాగంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర (పాక్షికం) మండలాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి.[1]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు

[మార్చు]
  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 2,55,570.
  • ఓటర్ల సంఖ్య (2008 ఆగస్టు నాటికి) : 2,13,385.[2]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 13.52%, 4.70%.

నియోజకవర్గ భౌగోళిక సమాచారం

[మార్చు]

భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా మధ్యన ఉన్న ఈ నియోజకవర్గం జిల్లాకు చెందిన 6 నియోజకవర్గాలను సరిహద్దులుగా కలిగిఉంది. ఉత్తరాన మహబూబ్‌నగర్ నియోజకవర్గం ఉండగా, ఈశాన్యాన జడ్చర్ల నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున వనపర్తి నియోజకవర్గం సరిహద్దును, పశ్చిమాన మక్తల్ నియోజకవర్గం, నారాయణపేట నియోజకవర్గాలను సరిహద్దుగా కలిగిఉంది. నియోజకవర్గం గుండా దేవరకద్ర మండలం మీదుగా హైదరాబాదు - రాయచూరు ప్రధాన రహదారి, ఉత్తరం నుండి దక్షిణంగా భూత్‌పూర్, అడ్డకల్. కొత్తకోటల మీదుగా 7వ నెంబరు జాతీయ రహదారి వెళ్తున్నాయి.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 సీతాదయాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 ఆల వెంకటేశ్వర్ రెడ్డి తె.రా.స పవన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ
2018 ఆల వెంకటేశ్వర్ రెడ్డి తె.రా.స పవన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ
2023[3][4] గవినోళ్ల మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి భారత్ రాష్ట్ర సమితి

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున స్వర్ణ సుధాకర్, భారతీయ జనతా పార్టీ నుండి భరత్ భూషణ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున కె.ఎస్.రవి కుమార్, లోక్‌సత్తా పార్టీ తరఫున కృష్ణకుమార్ రెడ్డి పోటీ చేశారు. ప్రధానపోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతాదయాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణసుధాకర్‌పై 19034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది.[5]

2014 ఎన్నికలు

[మార్చు]

2014 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీ చేయగా, తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీచేసిన ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి విజయం సాధించాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (21 November 2023). "పాలమూరు పందెం కోళ్లు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
  3. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009