ఉత్తరాఖండ్

వికీపీడియా నుండి
(ఉత్తరా ఖండ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఉత్తరాఖండ్
Map of India with the location of ఉత్తరాఖండ్ highlighted.
Map of India with the location of ఉత్తరాఖండ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
Dehradun
 - 30°11′N 78°02′E / 30.19°N 78.04°E / 30.19; 78.04
పెద్ద నగరం డెహ్రాడూన్
జనాభా (2001)
 - జనసాంద్రత
8,479,562 (19వ స్థానం)
 - 159/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
53,566 చ.కి.మీ (18వ స్థానం)
 - 13
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[ఉత్తరాఖండ్ |గవర్నరు
 - [[ఉత్తరాఖండ్ |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
2000-11-09
 - సుదర్శన్ అగర్వాల్
 - భువన్ చంద్ర ఖండూరి
 - ఒకేసభ (30)
అధికార బాష (లు) హిందీ, సంస్కృతం, గర్వాలీ, కుమావొనీ
పొడిపదం (ISO) IN-UL
వెబ్‌సైటు: ua.nic.in
దస్త్రం:Uttaranchalseal.png

ఉత్తరాఖండ్ రాజముద్ర
డెహ్రాడున్ రాష్ట్రం తాత్కాలిక రాజధాని. కొత్త రాజధాని ఇంకా ఎంపిక చేసుకోవలసి ఉన్నది.

ఉత్తరాఖండ్ (హిందీ:उत्तराखण्ड) ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము. ఇది 2006 వరకు ఉత్తరాంచల్ గా పిలవబడింది. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరము నవంబరు 9న భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది అంతకు ముందు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగము. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతమై ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన చైనా (టిబెట్), నేపాల్ దేశాలతో సరిహద్దులున్నాయి. రాష్ట్రం యొక్క తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. హైకోర్టు మాత్రం నైనిటాల్లో ఉంది. రాష్ట్రానికి నట్టనడుమున ఉన్న గైర్సాయిన్ అనే చిన్న గ్రామాన్ని ముందుముందు రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉంది.

ఉత్తరాఖండ్‌లో పశ్చిమప్రాంతాన్ని ఘఢ్వాల్ అనీ, తూర్పు ప్రాంతాన్ని కుమావూ అనీ అంటారు. ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. ఉత్తర ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో హిమవాహినులతోనూ, దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతోనూ కనుల పండువుగా ఉంటుంది. ఎన్నో ప్రత్యేకమైన జీవజాలాలు (భరల్, మంచుపులి వంటివి), వృక్ష సంపత్తి ఈ ప్రాంతానికి పరిమితం. భారతదేశానికి జీవనాడులైన గంగా, యమునా నదులు ఉత్తరాఖండ్‌లోని హిమవాహినులలో పుడుతున్నాయి. తరువాత అవి ఎన్నో ఏరులు, సరసులు, హిమపాతాలతో కలసి మహానదులై మైదానంలో ప్రవేశిస్తున్నాయి.

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పర్యాటకుల వల్ల వచ్చే ఆదాయం ఒక ముఖ్యమైన ఆర్థికవనరు. బ్రిటిష్ కాలం నుండి ముస్సోరీ, ఆల్మోరా, రాణీఖేత్‌లు వేసవి యాత్రికులకు మంచి ఆకర్షణలుగా అభివృద్ధి చెందాయి. అంతే కాకుండా హరిద్వార్, ఋషీకేశ్, బదరీనాధ్, కేదారనాధ్ వంటి చాలా పుణ్య క్షేత్రాలు వేల సంవత్సరాలుగా భక్తులకు దర్శనీయ స్థానాలుగా పేరుగొన్నాయి. పర్వాటక పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నది.

ఇంకా వివాదాస్పదమైన తెహ్రీ ఆనకట్ట నిర్మాణం ఈ రాష్ట్రంలో భాగీరధీ-భిలంగనా నదిపై 1953లో ప్రారంభమైంది.

ప్రజలు

[మార్చు]

స్థానిక ప్రజలు తమను తాము "ఘర్వాలీలు", "కుమావొనీలు" అని చెప్పుకుంటారు. కుమావొనీలలో కొంతమంది "పహాడీ" అని చెప్పుకొంటారు. ఎక్కువమంది హిందూ మతస్థులు. ఇంకా గడచిన శతాబ్దంలో వలస వచ్చిన నేపాలీ సంతతి వారున్నారు. జధ్, మర్చా, సౌకా తెగలవారు భారత్-టిబెట్ సరిహద్దులలో నివసిస్తున్నారు. వీరందరినీ కలిపి "భోటియా"లంటారు. తెరాయి పర్వతప్రాంతాలలో "తారు", "భుక్షా" తెగలవారున్నారు. దక్షిణ తెరాయి ప్రాంతంలో "గుజ్జర్"లనే సంచార పశుపాలకజాతులవారు న్నారు.

భౌగోళికము

[మార్చు]

ఉత్తరాఖండ్ రాష్ట్రము అధికభాగం హిమాలయ పర్వతసానువులలో ఉంది. ఎత్తునుబట్టి వాతావరణమూ, భూస్వరూపమూ మారుతూ ఉంటాయి. ఎత్తయిన ప్రాంతాలలో మంచు కొండలూ, హిమానదాలూ ఉండగా, తక్కువ ఎత్తులున్నచోట ఉష్ణమండల వాతావరణమూ, దట్టమైన అడవులూ ఉన్నాయి. మరీ ఎత్తయిన స్థలాలు మంచుకొండలతోనూ, రాతినేలతోనూ ఉన్నాయి.

  • 3000 - 3500 మీటర్ల ఎత్తున: హిమాలయ గడ్డి మైదానాలు, ఇంకా ఎత్తైన చోట్ల టండ్రా మైదానాలు
  • 2600-3000 మీటర్ల ఎత్తిన: కోనిఫెరస్ అటవీ ప్రాంతాలు
  • 1500-2600 మీటర్ల ఎత్తున: వెడల్పు ఆకుల చెట్లున్న అడవులు
  • 1500 మీటర్ల లోపు ఎత్తున: తెరాయి-దువార్ సవాన్నా మైదానాలు
  • ఇంకా దిగువన: గంగానదీతీర మైదానాలు, డెసిడ్యువస్ అడవులు - వీటిని "భాభర్"లు అంటారు.

అక్కడి ప్రత్యేక భౌగోళిక లక్షణాల కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చక్కని రాష్ట్రీయ ఉద్యానవనాలున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు

[మార్చు]

2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు 2022 ఫిబ్రవరి 14న జరిగాయి.

ప్రముఖులు

[మార్చు]

రిషబ్ పంత్ 2021 డిసెంబరులో తన స్వరాష్ట్రం ఉత్తరాఖండ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు.[1]

ఇవి కూడ చూడండి

[మార్చు]

అఫ్జల్‌ఘర్

గణాంకాలు

[మార్చు]
ఉత్తరాఖండ్ జిల్లాలు
  • మొత్తం విస్తీర్ణం: 51, 125 చదరపు కి.మీ.
పర్వత ప్రాంతం: 92.57%
మైదాన ప్రాతం: 7.43%
అడవి ప్రాతం: 63%
  • స్థానిక వివరాలు
రేఖాంశము తూర్పు 77° 34' 27" నుండి 81° 02' 22"
అక్షాంశము: ఉత్తరం: 28° 53' 24" నుండి 31° 27' 50"
  • మోత్తం జనాభా: 7, 050, 634 (పురుషులు, స్త్రీల నిష్పత్తి = 1000 : 976)
పురుషులు % 51.91
స్త్రీలు % 48.81
గ్రామీణ జనాభా: 76.90 %
నగర జనాభా: 23.10 %
మైనారిటీ వర్గాలు: సుమారు 2.0 %
  • అక్షరాస్యత 65%
  • గ్రామాలు: 15620
  • నగరాలు, పట్టణాలు: 81
  • రైల్వే స్టేషన్లు: కొత్వారా, డెహ్రాడూన్, హరిద్వార్, రిషీకేష్, హల్ద్వానీ, లాల్ కువాన్, కాథ్ గొడామ్K, తనక్ పూర్
  • విమానాశ్రయాలు : పంత్ నగర్, నైనిసాయిన్, జాలీగ్రాంట్
  • ముఖ్యమైన పర్వతాలు ( సముద్ర మట్టం నుండి ఎత్తు)
గౌరీ పర్వత్ (6590), గంగోత్రి (6614), పంచ్ చూలి( 6910), నందాదేవి (7816), నందాకోట్ (6861), కామెట్( 7756), బద్రీనాధ్ (7140), త్రిశూల్ (7120), చౌఖంబా(7138), దునాగిరి (7066)
  • ముఖ్యమైన లోయలు (పర్వత మార్గాలు)
మనా (5450), నితీపాస్ (5070), లిపులేఖ్( 5122), లుంపియాధుర (5650)
  • పరిశ్రమలు
పర్యాటక రంగము, పాడి పరిశ్రమ, వ్యవసాయం, పూలు పండ్ల తోటలు, చెఱకు, కొన్ని చిన్న పరిశ్రమలు
  • పండుగలు
ఉత్తరాణి, నందాదేవి మేళా, హోలి, దీపావళి, దసరా, కందాలీ, కొండజాతర, బిఖోటి, బగ్వాల్, హరేలా, ఘుగుటీ
  • ఉత్సవాలు
సర్దోత్సవ్, వసంతోత్సవ్, నందాదేవీ రాజ్ జాత్, చిప్లా కేదార్ జాత్, కేదారనాధ యాత్ర, బదరీనాధ యాత్ర, కుంభమేళా, అర్ధ కుంభమేళా, రామలీల
  • వాణిజ్య కేంద్రాలు
హల్ద్వానీ, రుద్రపూర్, తనక్ పూర్, డెహ్రాడూన్, హరిద్వార్, కొట ద్వార్, హృషీకేశ్

జిల్లాలు

[మార్చు]

ఉత్తరాఖండ్ 13 జిల్లాలుగా విభజించ బడింది.

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (21 December 2021). "ఉత్తరాఖండ్‌ ప్రచారకర్తగా పంత్‌". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.