జహీరాబాదు పురపాలక సంఘము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జహీరాబాదు పురపాలక సంఘము మెదక్ జిల్లాకు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. 1953లో స్థాపించబడిన[1] ఈ పురపాలక సంఘం ప్రస్తుతం మూడవగ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతున్నది. 24 వార్డులతో ఉన్న ఈ పురపాలక సంఘంలో మార్చి 2014 నాటికి 35738 ఓటర్లు ఉండగా, 2011 నాటి ప్రకారం జనాభా 52193. పట్టణ విస్తీర్ణం 21.74 చకిమీ. 2011-12 ప్రకారం పురపాలక సంఘం ఆదాయం సుమారు రూ.5 కోట్లు.

ఆదాయ వనరులు[మార్చు]

ఈ పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయవనరు ఆస్తిపన్ను. దీని ద్వారా ఏటా సుమారు రూ.50 లక్షలకు పైగా ఆదాయం సమకూరగా, నీటిపన్నుల ద్వారా రూ. 26 లక్షలు ఆదాయం వస్తుంది. ఇవి కాకుండా అనుమతి పనులు, లైసెన్స్ ఫీజులు, ప్రకటనల పన్నులు తదితరాల ఆదాయం కూడా సమకూరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంటుల ద్వారా అభివృద్ధి పనులు చేపడతారు.

2014 ఎన్నికలు[మార్చు]

2014 మార్చి 30న ఈ పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 24 వార్డుల నుంచి ఒక్కో కౌన్సిలర్ ఎన్నికై పరోక్ష పద్ధతిలో చైర్మెన్‌ను ఎన్నుకుంటారు.

మూలాలు[మార్చు]