Jump to content

జహీరాబాదు పురపాలకసంఘం

అక్షాంశ రేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
వికీపీడియా నుండి
(పురపాలక సంఘము, జహీరాబాదు నుండి దారిమార్పు చెందింది)
  ?జహీరాబాద్
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 21.78 కి.మీ² (8 చ.మై)[1]
జిల్లా (లు) మెదక్ జిల్లా
జనాభా
జనసాంద్రత
50,532[2] (2011 నాటికి)
• 2,320/కి.మీ² (6,009/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం జహీరాబాద్ పురపాలక సంఘము


జహీరాబాదు పురపాలక సంఘం, సంగారెడ్డి జిల్లాకు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. ఇది 9వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాదు నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్ళు మార్గంలో ఉంది.జహీరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాదు నుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఉంది.

ఇక్కడినుండి కర్ణాటక రాష్ట్ర్రపు బీదర్ పట్టణానికి 25 కి.మీ. దూరం.చుట్టుప్రక్కల గ్రామాలలో వ్యవసాయం ముఖ్య జీవనోపాధి. అంతే కాకుండా ఉపాధి కలిపించే మరి కొన్ని పరిశ్రమలున్నాయి - ఉదా - మహీంద్ర & మహీంద్ర, ట్రైడెంట్ షుగర్స్ (పాత పేరు నిజాం షుగర్స్), ముంగి (బస్ బాడీ బిల్డింగ్ యూనిట్). ఈ పరిశ్రమలకు తగినట్లుగా వాణిజ్య సదుపాయాలున్నాయి.అనేక గోడౌన్లు ఉన్నాయి.

చుట్టుప్రక్కల గ్రామాలలో చెరకు ముఖ్యమైన పంట. జహీరాబాద్-బీదర్ దారిలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం ప్రసిద్ధి చెందింది.

పురపాలక సంఘం స్థాపన

[మార్చు]
జహీరాబాదు పట్టణంలో 9వ నెంబరు జాతీయ రహదారి

1953లో స్థాపించబడిన[3]పురపాలక సంఘం ప్రస్తుతం మూడవగ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతున్నది. 24 వార్డులతో ఉన్న ఈ పురపాలక సంఘంలో 2014 మార్చి నాటికి 35738 ఓటర్లు ఉండగా, 2011 నాటి ప్రకారం జనాభా 52193. పట్టణ విస్తీర్ణం 21.74 చకిమీ. 2011-12 ప్రకారం పురపాలక సంఘం ఆదాయం సుమారు రూ.5 కోట్లు.పిన్ కోడ్ నం. 502 220., ఎస్.టి.డి.కోడ్ = 08451

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం జహీరాబాద్ జనాభా[4] 140,160.ఇందులో మగవారు 51%, స్త్రీలు 49%. అక్షరాస్యత 62%.

పాలనా విభాగాలు

[మార్చు]

ఇది లోక్ సభ నియోజక వర్గం కేంద్ర స్థానమే కానీ రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానం కాదు.అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది, కానీ రెవెన్యూ డివిజినల్ అధికారి ఉండడు.ఇది కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.జహీరాబాద్ ఒక శాసనసభ నియోజక వర్గం, లోక్ సభ నియోజకవర్గం కూడాను.[5]

ఆదాయ వనరులు

[మార్చు]

ఈ పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయవనరు ఆస్తిపన్ను. దీని ద్వారా ఏటా సుమారు రూ.50 లక్షలకు పైగా ఆదాయం సమకూరగా, నీటిపన్నుల ద్వారా రూ. 26 లక్షలు ఆదాయం వస్తుంది. ఇవి కాకుండా అనుమతి పనులు, లైసెన్స్ ఫీజులు, ప్రకటనల పన్నులు తదితరాల ఆదాయం కూడా సమకూరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంటుల ద్వారా అభివృద్ధి పనులు చేపడతారు.

2014 ఎన్నికలు

[మార్చు]

2014 మార్చి 30న ఈ పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 24 వార్డుల నుంచి ఒక్కో కౌన్సిలర్ ఎన్నికై పరోక్ష పద్ధతిలో చైర్మెన్‌ను ఎన్నుకుంటారు. పైగా నవాబ్ "జహీర్ యార్ జంగ్" పేరు మీద ఈ పట్టణానికి జహీరాబాద్ అనే పేరు వచ్చింది.జహీరాబాద్ అక్షాంశ రేఖాంశాలు 17°41′N 77°37′E / 17.68°N 77.62°E / 17.68; 77.62[6]. సగటు ఎత్తు 622 మీటర్లు (2040 అడుగులు).

కేతకి సంగమేశ్వర ఆలయం

[మార్చు]

జహీరాబాదు పట్టణానికి సుమారు 18 కి.మీ. దూరంలో చాలా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వ ఆలయం కలదు, ఈ ఆలయం నుండి వారణాసి గంగా నదికి కాశీ లోని ఆలయం నుండి ఇక్కడి ఈ ఆలయంలోని జల ద్వారం నకు కలసి అంతర్వేదిగా ఉందని ప్రసిద్ధి. కాశీ ఆలయం లోని ఒక ఋషి ఒక కమండలాన్ని ఆ జల ద్వారంలో వదిలితే ఇక్కడి కేతకి సంగమేశ్వర ఆలయంలో తేలిందని ప్రసిద్ధి. సంవత్సరం పొడవునా ఎల్లపుడు నీటితో నిండి జల ద్వారం కలకలలాడుతు ఉంటుంది.

దేవాలయాలు

[మార్చు]
  • సర్వమతాల సారం ఒక్కటేనని, సబ్ కా మాలిక్ ఏక్ అని ప్రవచించిన సద్గురువు శ్రీ సాయినాధుడు కొలువుదీరిన మందిరం ఇక్కడ నెలకొని ఉంది. వర్ణరంజిత ప్రాకారాదులతో శోభిల్లే ఈ మందిరం, వివిధ ఉపాలయాల సమాహారంగా భాసిల్లుతోంది.[1]

మూలాలు

[మార్చు]
  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 25 July 2014.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-09. Retrieved 2014-03-29.
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-12-20. Retrieved 2019-04-10.
  6. Falling Rain Genomics, Inc - Zahirabad

వెలుపలి లంకెలు

[మార్చు]