44,092
edits
Arjunaraoc (చర్చ | రచనలు) చి (2404:F801:8028:3:155D:C51C:F2EC:744E (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.) ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు రోల్‌బ్యాక్ Advanced mobile edit |
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
సమర్ధులైన సంపాదక సిబ్బంది, పటిష్ఠమైన సమాచార సేకరణ వ్యవస్థ, ఆధునిక సాంకేతిక అభివృద్ధిని సమర్ధంగా వాడుకోవడం మొదలైనవి ఈనాడు అభివృద్ధికి ముఖ్యమైన తెరవెనుక కారణాలు కాగా, స్థానిక వార్తలకు ప్రాధాన్యతనివ్వడం, క్రమం తప్పకుండా ప్రతిరోజు కనిపించే [[కార్టూన్లు]], పేజీలో వార్తల అమరిక, మొదలైనవి పాఠకులకు కనిపించే కారణాలు.
పరిశోధనాత్మక వార్తలకు ఈనాడు పేరెన్నికగన్నది. 1978, 1983 మధ్య కాలంలో ఎన్నో సంచలనాత్మక పరిశోధనలతో అలజడి సృష్టించింది, ఈనాడు. సిమెంటు కుంభకోణం, టిటిడిలో మిరాశీదార్ల అక్రమాలు, భూకబ్జాలు మొదలైన వాటినెన్నిటినో వెలుగులోకి తెచ్చింది ఈనాడు. 1983లో [[తెలుగు దేశం]] పార్టీ అధినేత [[నందమూరి తారక రామారావు|రామారావు]] అధికారంలోకి రావడంలో ఈనాడు ప్రముఖ పాత్ర పోషించింది. రామారావు పర్యటనలకు, ప్రకటనలకు విస్తృత ప్రచారం కల్పించింది.<ref>
1989 జనవరి 26న గ్రామీణ వార్తల కొరకు మినీ ఎడిషన్లని ప్రారంభించింది. గ్రామీణ స్థాయిలో విలేకరుల వ్యవస్థని ప్రారంభించిన తొలిపత్రికగా పేరుపొందింది. తన రాష్ట్రం, తన జిల్లా వార్తల వరకే పరిమితమైన తెలుగు పాఠకులు తన గ్రామంలో జరిగిన వార్తలను కూడా పత్రికలలో చదవడం మొదలు పెట్టారు. ఈ సంప్రదాయాన్ని మిగిలిన పత్రికలూ అనుసరించాయి.
|