ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
Andhra Pradesh Sampark Kranti Express
కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతున్న ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంసంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
స్థానికతతెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ , ఢిల్లీ
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే జోన్
మార్గం
మొదలుతిరుపతి నగరం
గమ్యంహజ్రత్ నిజాముద్దీన్
ప్రయాణ దూరం2,302 కి.మీ. (1,430 మై.)
సగటు ప్రయాణ సమయం36 గం. 15 ని.లు
రైలు నడిచే విధంవారానికి మూడు రోజులు
రైలు సంఖ్య(లు)12707 / 12708
సదుపాయాలు
శ్రేణులుఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్, ప్యాంట్రీ కార్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
సాంకేతికత
రోలింగ్ స్టాక్సికింద్రాబాద్ నుండి 4 లగేజీ కం బ్రేక్‌వ్యాన్
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం63 km/h (39 mph) విరామములతో సరాసరి వేగం
మార్గపటం

ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లో హజ్రత్ నిజాముద్దీన్ నుండి తిరుపతి వరకు నడుస్తున్న ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్ల శ్రేణిలో భాగం. ఈ శ్రేణి లోని రైళ్ళు ప్రతి సేవలో కేవలం పరిమిత సంఖ్యలో ఆగుతూ, భారత దేశపు రాజధాని క్రొత ఢిల్లీ, మిగిలిన రాష్ట్ర రాజధానులకు మధ్య అనుసంధానం చేస్తున్నాయి.

సంపర్క్ క్రాంతి

[మార్చు]

సంపర్క్, క్రాంతి పదాలు సంస్కృతం నుండి తీసుకున్నవి. సంపర్క్ (దేవనాగరి: - सम्पर्क) అంటే పరిచయం, క్రాంతి అనగా (దేవనాగరి: - क्रान्ति) విప్లవం అని అర్థం.

అధిక వేగ రైలు సేవలను అందించడానికి భారతీయ రైల్వే ద్వారా తీసుకున్న దశలను కలిపి ఈ పేరును సూచిస్తుంది. కేవలం పరిమిత సంఖ్యలో ఆగుతూ, ఎయిర్ కండిషన్డ్ కాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నియామకం, అధిక వేగంతో ఆపరేటింగ్ ద్వారా భారత దేశము రాజధాని క్రొత్తఢిల్లీ, భారతదేశం చుట్టూ ఉండే నగరాలతో ఇవి అనుసంధానం చేస్తున్నాయి. ఇలాంటి సామర్థ్యం గల సూపర్ ఫాస్ట్ ఒక రాజధాని శ్రేణి గతంలో ముందుగానే పరిచయం జరిగింది. కానీ ఈ రైళ్లు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ కలిగి ఉన్నాయి, అందువలన ప్రయాణం చాలా ఖరీదైనది అయ్యింది.

రాజధాని, శతాబ్ది సిరీస్ రైళ్ళ సగటు ప్రయాణ వేగం పరంగా గమనిస్తే భారతదేశంలో వేగంగా ప్రయాణించే రైళ్ల విభాగంగా ఉన్నాయి. సంపర్క్ క్రాంతి రైళ్లు రాజధాని, శతాబ్ది శ్రేణి కంటే నెమ్మదిగా సరాసరి వేగంతో పనిచేస్తాయి. అయిననూ ఇంకా ఇప్పటికీ సాధారణ ధరలు వద్ద కొన్ని చోట్ల మాత్రమే ఆగుతూ అధిక వేగం సౌకర్యాలను అందించుతూ, రాజధాని, కాని శతాబ్ది కాని మొదలైనవి ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లుతో పోలిస్తే సాపేక్షంగా అధిక వేగంతో నడుస్తూ ఉన్నాయి

సేవలు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ (హైదరాబాదు, తెలంగాణ రాష్ట్ర రాజధాని సమీపంలో), క్రొత్త ఢిల్లీ సమీపంలో హజ్రత్ నిజాముద్దీన్ మధ్య కార్యకలాపాలు ప్రారంభించింది. సికింద్రాబాద్ స్టేషన్ నుండి తిరుపతి వరకు కర్నూలు, మదనపల్లె, కడప ద్వారాసేవలు విస్తరించినప్పుడు, 2005 జూలై 6న, శ్రీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపి, హైదరాబాదు మేయర్, తీగల కృష్ణ రెడ్డి, రైలుకు జెండా ఊపి ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్, హజ్రత్ నిజాముద్దీన్, తిరుపతి మధ్య వారానికి మూడు సార్లు సర్వీసులను నిర్వహిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ పరిచయం చేయక ముందు, క్రొత్త ఢిల్లీ, త్రివేండ్రం మధ్య రోజువారీ నడిచే (2625/2626) కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రమే తిరుపతి, క్రొత్తఢిల్లీ లకు అందుబాటులో ఉండేది.

ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సమయ పట్టిక

[మార్చు]
వరుస

సంఖ్య

స్టేషన్ కోడ్ స్టేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ 12707 ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ 12708
రాక పోక దూరం

(కి.మీ)

రాక పోక దూరం

(కి.మీ)

1 TPTY తిరుపతి ప్రారంభం 05:40 (1వ రోజు) 0 21:35 (2వ రోజు) గమ్యం 2303
2 RU రేణిగుంట జం. 06:00 (1వ రోజు) 06:05 (1వ రోజు) 10 21:00 (2వ రోజు) 21:02 (2వ రోజు) 2293
3 HX కడప 07:58 (1వ రోజు) 08:00 (1వ రోజు) 135 18:29 (2వ రోజు) 18:30 (2వ రోజు) 2168
4 YA యర్రగుంట్ల 08:34 (1వ రోజు) 08:35 (1వ రోజు) 174 17:39 (2వ రోజు) 17:40 (2వ రోజు) 2129
5 TU తాడిపత్రి 09:38 (1వ రోజు) 09:40 (1వ రోజు) 244 16:29 (2వ రోజు) 16:30 (2వ రోజు) 2060
6 DHNE ధోన్ 11:55 (1వ రోజు) 12:00 (1వ రోజు) 347 14:45 (2వ రోజు) 15:00 (2వ రోజు) 1957
7 KRNT కర్నూలు పట్టణం 13:02 (1వ రోజు) 13:04 (1వ రోజు) 400 13:36 (2వ రోజు) 13:38 (2వ రోజు) 1904
8 GWD గద్వాల్ 14:04 (1వ రోజు) 14:05 (1వ రోజు) 456 12:32 (2వ రోజు) 12:34 (2వ రోజు) 1848
9 MBNR మహబూబ్ నగర్ 15:04 (1వ రోజు) 15:06 (1వ రోజు) 531 11:39 (2వ రోజు) 11:40 (2వ రోజు) 1773
10 KCG కాచిగూడ 17:05 (1వ రోజు) 17:15 (1వ రోజు) 636 09:50 (2వ రోజు) 10:00 (2వ రోజు) 1667
11 KZJ ఖాజీపేట జం. 19:38 (1వ రోజు) 19:40 (1వ రోజు) 774 06:48 (2వ రోజు) 06:50 (2వ రోజు) 1528
12 RDM రామగుండం 20:38 (1వ రోజు) 20:40 (1వ రోజు) 867 05:09 (2వ రోజు) 05:10 (2వ రోజు) 1436
13 MCI మంచిర్యాల్ 20:53 (1వ రోజు) 20:55 (1వ రోజు) 880 04:54 (2వ రోజు) 04:55 (2వ రోజు) 1422
14 BPA బెల్లంపల్లి 21:08 (1వ రోజు) 21:10 (1వ రోజు) 900 04:44 (2వ రోజు) 04:45 (2వ రోజు) 1402
15 SKZR సిర్పూర్ కాగజ్ నగర్ 21:38 (1వ రోజు) 21:40 (1వ రోజు) 939 04:20 (2వ రోజు) 04:21 (2వ రోజు) 1364
16 BPQ బాలహర్ష 23:05 (1వ రోజు) 23:15 (1వ రోజు) 1008 03:30 (2వ రోజు) 03:40 (2వ రోజు) 1294
17 NGP నాగపూర్ 02:00 (2వ రోజు) 02:10 (2వ రోజు) 1219 00:05 (2వ రోజు) 00:15 (2వ రోజు) 1083
18 BPL భోపాల్ జం. 08:05 (2వ రోజు) 08:15 (2వ రోజు) 1615 17:45 1వ రోజు) 17:55 1వ రోజు) 694
19 JHS ఝాన్సీ జం. 12:00 (2వ రోజు) 12:10 (2వ రోజు) 1906 13:45 1వ రోజు) 13:55 1వ రోజు) 403
20 NZM హజ్రత్ నిజాముద్దీన్ 18:00 (2వ రోజు) గమ్యం 2308 ప్రారంభం 07:10 1వ రోజు) 0

పెట్టెల కూర్పు

[మార్చు]

ప్రస్తుత కోచ్ కూర్పు 2-ఎస్ఎల్ఆర్ కోచ్‌లు, 2-II / జనరల్ కోచ్‌లు, 4- ఎసి 3 టైర్ కోచ్‌లు, 1-ఎసి 2 టైర్ కోచ్, 1-పాంట్రీ కార్, 8 స్లీపర్ కోచ్‌లు కలిగి ఉంది. వేసవిలో అవసరం ఆధారంగా అదనపు కోచ్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక అదనపు 3 టైర్ ఎసి కోచ్ 2012 సెప్టెంబరు నాడు జతచేసారు.

ఉపయోగిస్తున్న లోకోమోటివ్స్

[మార్చు]
  • 1). సికింద్రాబాద్ నుండి తిరుపతి, తిరుగు ప్రయాణం - డీజిల్ ట్రాక్షన్ - డబ్ల్యుడిపి-4
  • 2). సికింద్రాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్, తిరుగు ప్రయాణం - ఎలక్ట్రిక్ ట్రాక్షన్ - భారతీయ లోకోమోటివ్ తరగతి డబ్ల్యుఎపి-7

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://indiarailinfo.com/trains?date=undefined&dd=0&ad=0&co=0&tt=18&ed=0&dp=0&ea=0&ap=0&loco=&drev=undefined&arev=undefined&trev=0&rake=&rsa=0&idf=0&idt=0&dhf=0&dmf=0&dht=0&dmt=0&ahf=0&amf=0&aht=0&amt=0&nhf=-1&nht=-1&ttf=0&ttt=0&dstf=0&dstt=0&spdf=0&spdt=0&zone=0&pantry=0&stptype=undefined&trn=0&q=

బయటి లింకులు

[మార్చు]