హైదరాబాదు రైల్వే స్టేషను
Hyderabad Deccan నాంపల్లి రైల్వే స్టేషను Indian Railway Station | |
---|---|
![]() Front view of the station | |
స్టేషన్ గణాంకాలు | |
చిరునామా | Hyderabad District, Telangana![]() |
భౌగోళికాంశాలు | 17°23′33″N 78°28′03″E / 17.3924°N 78.4675°ECoordinates: 17°23′33″N 78°28′03″E / 17.3924°N 78.4675°E |
ఎత్తు | 1,759 ft |
ప్లాట్‌ఫారాల సంఖ్య | 6 |
ఇతర సమాచారం | |
ప్రారంభం | 1874 |
విద్యుదీకరణ | 2003 |
స్టేషన్ కోడ్ | HYB |
జోన్లు | South Central Railway |
డివిజన్లు | సికింద్రాబాద్ |
నిజాం రాష్ట్రంలో 1670 AD సమయంలో దివాన్ ఆఫ్ నిజాంగా పనిచేసిన రజా అలీ ఖాన్ కు రాసిచ్చిన జాగీర్ పై ఆయన పేరు నేక్ నామ్ ఖాన్ అని ఉంది. చివరాకరుకు ఆ పేరు నేక్ నాంపల్లిగా, చివరకు నాంపల్లిగా స్థిరపడింది.
నాంపల్లి రైల్వే స్టేషనుగా ప్రసిద్ధిచెందిన హైదరాబాదు రైల్వే స్టేషను హైదరాబాదులోని ముఖ్యమైన రైల్వే స్టేషను. 1874 అక్టోబరు 8 తేదీన హైదరాబాదు రవాణా చరిత్రలో ఒక మరుపురాని రోజు. ఈ రోజు అప్పటి నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ హైదరాబాదు రైల్వే స్టేషనును ప్రారంభించారు.
చరిత్ర[మార్చు]
బొంబాయి నుండి మద్రాసు వరకు ఆంగ్లేయుల కాలంలోనే రైలు మార్గాన్ని ప్రతిపాదించగా, హైదరాబాద్ నగరాన్ని ఈ మార్గంతో అనుసంధానం చేయడం మంచిదని అప్పటి నిజాం పాలకు భావించారు. 1855లో అప్పటి బ్రిటిష్ ప్రతినిధి డల్హౌసి నిజాం పాలకులకు ఈ మేరకు ప్రతిపాదనను పంపారు. తదనుగుణంగా షోలాపూర్ నుండి హైదరాబాద్ కు రైలు మార్గాన్ని నిర్మించేందుకు 1862లో ఆమోదం లభించింది. నిజాం పాలకుల ఆర్థిక వనరులతో నిజాం స్టేట్ రైల్వే కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అప్పటికే ప్రారంభించిన 110 కిలోమీటర్ల వాడి - హైదరాబాద్ రైలు మార్గం నిర్మాణం పనులు వేగం పుంజుకోవడంతో 1874 అక్టోబరు 8 తేదీన రైలు మార్గాన్ని ప్రారంభించారు.
మొదట ఈ రైలు మార్గంలో రాకపోకలు తక్కువగా సాగడంతో నిజాం స్టేట్ రైల్వే ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూసింది. తదనంతరం రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలను కలుపుతూ రైలు మార్గాల ఏర్పాటు పనులు ప్రారంభయ్యాయి. 1930లో నిజాం స్టేట్ రైల్వే సంస్థ ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల సంస్థగా రూపుదిద్దుకొని రైల్వే కార్యకలాపాలు చేపట్టింది. భారత స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వంలో విలీనమైంది. క్రమంగా మధ్య రైల్వేలోని వివిధ డివిజన్లను, దక్షిణ రైల్వే పరిధిలోని కొంతభాగాన్ని విభాగించి, దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటుచేశారు.
రైలు మార్గములు[మార్చు]
- మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హైదరాబాద్
- ఫలక్‌నామా - సికింద్రాబాద్ (ఎఫ్ఎస్ లైన్)
పరీవాహక ప్రాంతాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- నాంపల్లి స్టేషనుకు 135 ఏళ్ళు, ఈనాడు అక్టోబరు 8, 2008 దినపత్రికలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.
![]() |
Wikimedia Commons has media related to Hyderabad Deccan Station. |