Jump to content

సఫిల్‌గూడ

(సఫిల్గూడ నుండి దారిమార్పు చెందింది)
సఫిల్‌గూడ
సఫిల్‌గూడ ఎక్స్ రోడ్ , నేరేడు మెట్టు
సఫిల్‌గూడ ఎక్స్ రోడ్ , నేరేడు మెట్టు
సఫిల్‌గూడ is located in Telangana
సఫిల్‌గూడ
సఫిల్‌గూడ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°27′50″N 78°32′30″E / 17.46389°N 78.54167°E / 17.46389; 78.54167
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
  Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
Area
  Total
8.4 కి.మీ2 (3.2 చ. మై)
Population
 (2011)[1]
  Total
35,891
భాషలు
  అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
నేరెడ్‌మెట్‌ & ఆర్కే పురం పోస్టు – 500056
మల్కాజ్‌గిరి పోస్టు – 500047
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
విదాన్ సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

సఫిల్‌గూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక నివాస ప్రాంతం.[2] నేరెడ్‌మెట్‌ గ్రామంలో ఉన్న ఈ గూడెం లేదా కుగ్రామం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని మల్కాజ్‌గిరి మండలం పరిధిలోకి వస్తుంది. ఇది 2009లో హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 137గా ఏర్పాటు చేయబడింది.[3] నగరంలో అత్యంత జనసాంద్రత కలిగిన మధ్య/ఉన్నత తరగతి ప్రాంతాలలో సఫిల్‌గూడ ఒకటి.

ఇక్కడ సఫిల్‌గూడ చెరువు ఉంది. హుస్సేన్ సాగర్ సరస్సులోని టాంక్ బండ్ లాగా ఈ చెరువు చుట్టూ రోడ్డు ఉంటుంది. అందువల్ల దీనిని సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్ అని కూడా పిలుస్తారు. జాగింగ్, ఈవినింగ్ వాక్ కోసం అనేకమంది ఇక్కడకు వస్తారు.[4]

చరిత్ర

[మార్చు]

1960/1970లలో ఈ ప్రాంతంలో నివాసగృహాలు నిర్మించబడ్డాయి. ఆ కాలంలో ఈ ప్రాంతం నుండి నగరానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు, విద్యుత్ వంటివి లేవు. గతంలో ఇది ఒక కుగ్రామం కాగా, నేరెడ్‌మెట్ గ్రామంలో ఒక భాగంగా ఉండేది.

ఉప ప్రాంతాలు

[మార్చు]

సఫిల్‌గూడ ప్రాంతాన్ని ఓల్డ్ సఫిల్‌గూడ, న్యూ సఫిల్‌గూడ అని రెండు ప్రధాన ప్రాంతాలుగా విభజించారు. నేరెడ్‌మెట్‌ గ్రామానికి చెందిన పాత కుగ్రామాన్ని (సఫిల్‌గూడ) ఇప్పుడు ఓల్డ్ సఫిల్‌గూడ అని పిలుస్తారు.[5] ఇక్కడ ఒక దర్గా ఉంది. సఫిల్‌గూడ ఎక్స్ రోడ్ - సఫిల్‌గూడ రైల్వే స్టేషన్ - సఫిల్‌గూడ పాకెట్ కాంప్లెక్స్ (డిఫెన్స్ క్వార్టర్స్) - సఫిల్‌గూడ ఎఒసి - ఆర్కే నగర్ - ఉత్తమ్ నగర్ - బలరామ్ నగర్ మొదలైన ప్రాంతాలను కలుపుకొని న్యూ సఫిల్‌గూడ అని పిలుస్తారు. ఈ ప్రాంతానికి రోడ్డు, రైల్వే సౌకర్యం ఉంది. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో, జూబ్లీ బస్ స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఓల్డ్ సఫిల్‌గూడలోని కాలనీలు

[మార్చు]
  • సంతోషిమా నగర్ కాలనీ
  • పాత సఫిల్‌గూడ
  • భరత్ నగర్
  • గణేష్ నగర్
  • పిబి కాలనీ
  • ద్వారకమై కాలనీ
  • సుధా నగర్
  • సాయినాథపురం
  • వెంకటేశ్వర నగర్ కాలనీ

న్యూ సఫిల్‌గూడలోని కాలనీలు

[మార్చు]
  • శారదా నగర్
  • సూర్యానగర్ ఎన్క్లేవ్
  • చాణక్యపురి కాలనీ
  • ఆర్.కె.నగర్
  • ఉత్తమ్ నగర్
  • దయానంద్ నగర్
  • చంద్రగిరి కాలనీ
  • బలరామ్‌నగర్
  • సీతారాంనగర్
  • దేవి నగర్

ఈ ప్రాంతంలో 1970లలో రాధాకృష్ణ నగర్, ఉత్తమ్ నగర్, దయానంద్ నగర్ మొదలైనవి ఏర్పడ్డాయి. 1970లలో రైల్వే ఉద్యోగులు ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసి, ఇళ్ళు నిర్మించుకున్నారు. ఇక్కడి రైల్వే ఉద్యోగులలో ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ర్టాల నుండి వచ్చినవారు ఉన్నారు.

వాణిజ్య ప్రాంతం

[మార్చు]

ఇక్కడ రిలయన్స్, ఫ్రెష్ @, మరిన్ని వంటి ప్రధాన రిటైల్ దుకాణాలు ఉన్నాయి. సబర్బన్ పట్టణానికి కావలసిన వైద్య, విద్య, షాపింగ్, కార్యాలయాలు, ప్రజా రవాణా వంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆనంద్‌బాగ్ ఎక్స్ రోడ్ నుండి సఫిల్‌గూడ మీదుగా ఉత్తమ్ నగర్, మెట్టుగూడ, ఇసిఐఎల్, మౌలాలీ, తార్నాక మొదలైన ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఉంది.[6] ఇక్కడ సఫిల్‌గూడ రైల్వే స్టేషను ఉంది. ఇది సికింద్రాబాద్ జంక్షన్, బొల్లారాం జంక్షన్ ల మధ్య ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Election Wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. the original (PDF) నుండి 10 నవంబరు 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 జూన్ 2017.
  2. "Safilguda Locality". www.onefivenine.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-01.
  3. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. the original (PDF) నుండి 2019-06-15 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-01.
  4. "Safilguda Lake Anything but Swachh, Needs Attention". The New Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-01.
  5. "Old Safilguda, Moula Ali, Secunderabad Locality". www.onefivenine.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-01.
  6. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-02-01.

ఇతర లంకెలు

[మార్చు]