అడిక్‌మెట్
అడిక్‌మెట్
సంగీత్ నగర్ కాలనీ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
Coordinates: 17°24′25″N 78°30′46″E / 17.40698°N 78.51284°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
ప్రభుత్వం | |
• సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
కాల మండలం | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500044 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
అడిక్‌మెట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతం ఉస్మానియా విశ్వవిద్యాలయంకి సమీపంలో ఉంది. అడిక్‌మెట్ లో నల్లకుంట నుండి తార్నాక వెళ్లే రహదారికి సమీపంలో ఆంజనేయ దేవాలయం ఉంది.
కాలనీలు, బస్తీలు
[మార్చు]లలితానగర్ కాలనీ, బాలాజీ నగర్, గణేష్ నగర్, ఎస్‌ఆర్‌టీ కాలనీ, ఈస్ట్ పార్సిగుట్ట మున్సిపల్ కాలనీ, ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్, అడిక్‌మెట్, వడ్డెర బస్తీ, పోచమ్మ బస్తీ, అంజయ్యనగర్, రాంనగర్ రామాలయం వీధి, మేడిబావి బస్తీ, బహుద్దూర్ నగర్, దీన్‌దయాళ్ నగర్, రాంనగర్ గుండు, కట్టంబాయి అడిక్‌మెట్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ). సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపన
[మార్చు]ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్మించడానికి అడిక్‌మెట్ ప్రాంతంలో విశాలంగా వున్న 1600 ఎకరాల స్థలం ఇచ్చారు. 1934, జూలై5న నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆర్ట్స్ కాలేజీ భవనానికి పునాదిరాయి వేశారు. అదే సమయంలో ఆ ప్రాంగణంలోనే రేకులతో తాత్కాలిక గదులను నిర్మించి, అద్దె భవనాల్లో నడుస్తున్న తరగతులను అడిక్‌మెట్ క్యాంప్‌సలోకి తరలించారు. 1939, డిసెంబరు 04న ఆర్ట్స్ కళాశాల భవనాన్ని మీర్‌ఉస్మాన్ అలీఖాన్ చేతులమీదుగా ప్రారంభించారు.[1]
విద్య
[మార్చు]అడిక్‌మెట్ ప్రాంతంలోని పాఠశాలలు:
- నేతాజీ పబ్లిక్ స్కూల్
- జ్యోతి బాలమందిర్ హైస్కూల్
- శ్రీవిద్యా మోడల్ హైస్కూల్
- సెయింట్ జాన్స్ స్కూల్
- శకుంతల హైస్కూల్
- ఆర్య సమాజ్ హైస్కూల్
- సీతఫల్ మండి హైస్కూల్
- మదర్ మేరీ కేజీ అండ్ ప్రైమరీ స్కూల్
- అపోలోనియా హైస్కూల్
- మదర్ థెరీసాస్ హైస్కూల్
- రాంనగర్ హైస్కూల్
- వాణి హైస్కూల్
ప్రముఖ దేవాలయాలు
[మార్చు]- ఆంజనేయ దేవాలయం: ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ ఊరేగింపు జరుగుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, ఆదివారం (23 April 2017). "ఖండాంతరాన కీర్తి కిరీటం". Retrieved 22 December 2017.