హైదరాబాదు రైల్వే స్టేషను
Hyderabad Deccan హైదరాబాద్ దక్ఖన్ రైల్వే స్టేషను | |
---|---|
Indian Railway Station | |
సాధారణ సమాచారం | |
Location | Hyderabad District, Telangana India |
Coordinates | 17°23′33″N 78°28′03″E / 17.3924°N 78.4675°E |
Elevation | 1,759 ft |
ఫ్లాట్ ఫారాలు | 6 |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | HYB |
జోన్లు | South Central Railway |
డివిజన్లు | సికింద్రాబాద్ |
History | |
Opened | 1874 |
విద్యుత్ లైను | 2003 |
హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషను, ప్రముఖంగా నాంపల్లి రైల్వే స్టేషను అని పిలుస్తారు. ఇది హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషను హైదరాబాద్ నగరాన్ని, దేశంలోని అనేక ముఖ్యమైన పట్టణాలు, నగరాల నుండి ప్రజల రాకపోకలకు రైలు మార్గము ద్వారా సేవలు అందిస్తున్నది. వివిధ నగరాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు చాలా ఈ స్టేషన్ నుండి ప్రారంభమవుతాయి.
నిజాం రాష్ట్రంలో 1670 AD సమయంలో దివాన్ ఆఫ్ నిజాంగా పనిచేసిన రజా అలీ ఖాన్ కు రాసిచ్చిన జాగీర్ పై ఆయన పేరు నేక్ నామ్ ఖాన్ అని ఉంది. చివరాకరుకు ఆ పేరు నేక్ నాంపల్లిగా, చివరకు నాంపల్లిగా స్థిరపడింది. 1874 అక్టోబరు 8 తేదీన హైదరాబాదు రవాణా చరిత్రలో ఒక మరుపురాని రోజు. ఈ రోజు అప్పటి నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ హైదరాబాదు రైల్వే స్టేషనును ప్రారంభించారు.
చరిత్ర
[మార్చు]బొంబాయి నుండి మద్రాసు వరకు ఆంగ్లేయుల కాలంలోనే రైలు మార్గాన్ని ప్రతిపాదించగా, హైదరాబాద్ నగరాన్ని ఈ మార్గంతో అనుసంధానం చేయడం మంచిదని అప్పటి నిజాం పాలకు భావించారు. 1855లో అప్పటి బ్రిటిష్ ప్రతినిధి డల్హౌసి నిజాం పాలకులకు ఈ మేరకు ప్రతిపాదనను పంపారు. తదనుగుణంగా షోలాపూర్ నుండి హైదరాబాద్ కు రైలు మార్గాన్ని నిర్మించేందుకు 1862లో ఆమోదం లభించింది. నిజాం పాలకుల ఆర్థిక వనరులతో నిజాం స్టేట్ రైల్వే కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అప్పటికే ప్రారంభించిన 110 కిలోమీటర్ల వాడి - హైదరాబాద్ రైలు మార్గ నిర్మాణ పనులు వేగం పుంజుకోవడంతో 1874 అక్టోబరు 8 తేదీన రైలు మార్గాన్ని ప్రారంభించారు.
మొదట ఈ రైలు మార్గంలో రాకపోకలు తక్కువగా సాగడంతో నిజాం స్టేట్ రైల్వే ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూసింది. తదనంతరం రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలను కలుపుతూ రైలు మార్గాల ఏర్పాటు పనులు ప్రారంభయ్యాయి. 1930లో నిజాం స్టేట్ రైల్వే సంస్థ ఒక ప్రత్యేక ప్రతిపత్తి గల సంస్థగా రూపుదిద్దుకొని రైల్వే కార్యకలాపాలు చేపట్టింది. భారత స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వంలో విలీనమైంది. క్రమంగా మధ్య రైల్వేలోని వివిధ డివిజన్లను, దక్షిణ రైల్వే పరిధిలోని కొంతభాగాన్ని విభాగించి, దక్షిణ మధ్య రైల్వేను ఏర్పాటుచేశారు.
రైలు మార్గములు
[మార్చు]- మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హైదరాబాద్
- ఫలక్‌నామా - సికింద్రాబాద్ (ఎఫ్ఎస్ లైన్)
సేవలు
[మార్చు]స్టేషను నుండి నిష్క్రమించే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు కొన్ని:
- హైదరాబాద్-క్రొత్త ఢిల్లీ - తెలంగాణ ఎక్స్ ప్రెస్
- హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్- - దక్షిణ ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-విశాఖపట్నం - గోదావరి ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-తాంబరము - చార్మినార్ ఎక్స్‌ప్రెస్,
- హైదరాబాద్-చెన్నై-చెన్నై ఎక్స్‌ప్రెస్,
- హైదరాబాద్-ముంబై - హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-ముంబై - ముంబై ఎక్స్‌ప్రెస్,
- హైదరాబాద్-హౌరా - ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్ - త్రివేండ్రం - శబరి ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-బీదర్ ఎక్స్‌ప్రెస్:
- హైదరాబాద్-నర్సాపూర్ - నరసాపురం ఎక్స్‌ప్రెస్,
- హైదరాబాద్-పుణే-పుణే ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-అజ్మీర్-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-దర్భాంగా-దర్భాంగా ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్ - పూర్ణా ప్యాసింజర్
- హైదరాబాద్ - ఔరంగాబాద్ ప్యాసింజర్
- హైదరాబాద్-పర్బణి ప్యాసింజర్
- హైదరాబాద్-బీజాపూర్ ప్యాసింజర్
- హైదరాబాద్-కలబురగి ప్యాసింజర్
- హైదరాబాద్-వరంగల్ ప్యాసింజర్.
ఎంఎంటిఎస్ రైలు
[మార్చు]నాంపల్లి రైల్వే స్టేషను, తెలంగాణ, భారతదేశం హైదరాబాద్ లో ఒక రైలు స్టేషను. సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, హైదర్‌గూడా వంటి పరిసరాలు ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి.
పరీవాహక ప్రాంతాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- నాంపల్లి స్టేషనుకు 135 ఏళ్ళు, ఈనాడు 2008 అక్టోబరు 8 దినపత్రికలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.