ఆగష్టు 30
Appearance
(30 ఆగష్టు నుండి దారిమార్పు చెందింది)
ఆగష్టు 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 242వ రోజు (లీపు సంవత్సరములో 243వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 123 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1574 – గురు రామ్ దాస్ నాలుగవ సిక్కు గురువు అయ్యాడు.
- 1791 – హెచ్.ఎమ్.ఎస్ పండోరా అనే నౌక ములిగిపోయింది.
- 1800 – వర్జీనియాలోని రిచ్ మండ్ దగ్గర బానిసల తిరుగుబాటుకి గేబ్రియల్ ప్రోస్సెర్ నాయకత్వం వహించాడు.
- 1813 – కుల్మ్ యుద్ధము: ఆస్ట్రియా, ప్రష్యా, రష్యాల కూటమి ఫ్రెంచి సైన్యాలను ఓడించాయి.
- 1813: క్రీక్ యుద్దము.
- 1835: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరాన్ని స్థాపించారు.
- 1836: ఆగస్టస్ చాప్‌మాన్ అల్లెన్, జాన్ కిర్బీ అల్లెన్ హౌస్టన్ అనే ఇద్దరు హౌస్టన్ నగరాన్ని స్థాపించారు. హౌస్టన్, అమెరికాలోని నాలుగవ పెద్ద నగరం. టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరం.
- 1862: అమెరికన్ అంతర్యుద్ధము : రిచ్‌మండ్ యుద్ధము :
- 1862: అమెరికన్ అంతర్యుద్ధము : రెండవ బుల్ రన్ యుద్ధములో యూనియన్ సైన్యము ఓడిపోయింది.
- 1873: ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న ఫ్రాంజ్ జోసెఫ్ లేండ్ అనే అర్చిపెలాగోని ఆస్ట్రియాకు చెందిన సాహసికులు (యాత్రికులు) జూలియస్ వాన్ పేయర్, కార్ల్ వీప్రెచ్ కనిపెట్టారు.
- 1897: మడగాస్కర్ లో ఉన్న అంబికీ అనే పట్టణాన్ని, మెనాబే నుంచి ఫ్రెంచి వారు గెలిచారు.
- 1896: ఫిలిప్పైన్స్ లోని ఎనిమిది రాష్టాలలో స్పానిష్ గవర్నర్ జనరల్ రామన్ బ్లాంకో మార్షల్ లా (సైనిక పాలన) విధించాడు. ఆ రాష్ట్రాలు మనిలా, కవిటె, బులాకన్, పంపంగ, నువే ఎకిజా, బతాన్, లగున, బతంగస్.
- 1909: బర్గెస్ షేల్ ఫాసిల్స్ (శిలాజాలు) ని ఛార్లెస్ డూలిటిల్ కనిపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ శిలాజాలు బ్రిటిష్ కొలంబియాలో ఉన్నాయి. ఇవి 505 మిలియన్ (50 కోట్ల 50 లక్షలు) సంవత్సరాల నాటి మధ్య కేంబ్రియన్ యుగానికి చెందినవి.
- 1914: తన్నెన్‌బెర్గ్ యుద్ధము. మొదటి ప్రపంచ యుద్ధము మొదటి రోజులలో జర్మన్ సామ్రాజ్యానికి, రష్యన్ సామ్రాజ్యానికి 1914 ఆగష్టు 23 నుంచి 1914 ఆగష్టు 30 వరకు జరిగిన యుద్ధము.
- 1922: గ్రీకులకు, టర్కీ వారికి జరిగిన అంతిమ యుద్ద్యమును దుమ్లుపినార్ యుద్ధము (1919 నుంచి 1922 వరకు)అని (టర్కీ దేశీయుల స్వాతంత్ర్య యుద్ధము )అని కూడా అంటారు.
- 1941: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన రెండు సంవత్సరాలు లెనిన్‌గ్రాడ్ ముట్టడి మొదలైంది.
- 1942: రెండవ ప్రపంచ యుద్ధము : ఆలం హాల్ఫా యుద్ధము మొదలైంది.
- 1945: బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది.
- 1945: జనరల్ డగ్లస్ మెక్ ఆర్ధర్, మిత్ర సైన్యాల సుప్రీం కమాండర్ అత్సుగి ఏర్ ఫోర్స్ బేస్ లో దిగాడు.
- 1963: అమెరికా అధ్యక్షుడు (శ్వేత సౌధము), రష్యా అధ్యక్షుడు (క్రెమ్లిన్) మధ్య హాట్‌లైన్ (టెలిఫోన్ సర్వీసు) ప్రారంభమైంది. ఎందుకంటే, అనుకోకుండా, రెండు దేశాల మధ్య ప్రమాదవశాత్తు యుద్ధం జరిగితే ఆపటానికి.
- 1967: అమెరికా సుప్రీం కోర్టుకు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయాధిపతిగా థర్‌గుడ్ మార్షల్ ని నియమించారు.
- 1974: బెల్‌గ్రేడ్ నుంచి డోర్ట్‌మండ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు 'జాగ్రెబ్' అనే పెద్ద రైల్వే స్టేషను దగ్గర పట్టాలు తప్పింది. 153 మంది ప్రయాణీకులు మరణించారు.
- 1974: టోక్యో లోని మరునౌచి దగ్గర ఉన్న 'మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ హెడ్‌క్వార్టర్స్ ' దగ్గర శక్తివంతమైన బాంబు పేలింది. ఎనిమిది మంది మరణించారు. 378 మంది గాయపడ్డారు. 1975 మే 19 తేదిని, ఎనిమిదిమంది లెఫ్ట్ వింగ్ సభ్యులను జపాన్ అధికారులు అరెస్ట్ చేసారు.
- 1980: పోలిష్ కార్మికులు కార్మిక సంఘపు హక్కులను సంపాదించుకున్నారు. సమ్మె చేస్తున్న పోలిష్ కార్మికులు కమ్యూనిష్ఠు పాలకులతో తలపడి, విజయం సాధించారు. ఫలితంగా, వారికి స్వతంత్ర కార్మిక సంఘాలను ఏర్పరచటానికి, సమ్మెచేసే హక్కు లభించాయి.
- 1982: పాలెస్తీనా లిబరేషన్ సంస్థ (పి.ఎల్.ఒ) నాయకుడు దశాబ్దం పైగా ఉంటున్న బీరూట్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
- 1984: అమెరికా రోదసీ నౌక ఎస్.టి.ఎస్-41-డి డిస్కవరీ స్పేస్ షటిల్ తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది.
- 1995: బోస్నియన్ సెర్బ్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి నాటో 'ఆపరేషన్ డెలిబెరేట్ ఫోర్స్'ని అమలు చేసింది.
- 1999: ఐక్యరాజ్య సమితి అజమాయిషీలో ఏర్పాటు చేసిన ఎన్నికలలో తూర్పు తైమూర్ ప్రజలు ఇండోనీషియా నుంచి స్వతంత్రము కోరుతూ ఓటు వేసారు.
- 2001: యుగోస్లావియా మాజీ అధ్యక్షుడు స్లొబొదాన్ మిలోసెవిక్ ప్రజలను మూకుమ్మడిగా హత్య చేసినట్లు (యుద్దనేరాలలో అత్యంత ఘోరమైన నేరం) ఆరోపణ జరిగింది.
- 2005: హరికేన్ కత్రినా, అమెరికాలోని న్యూ ఆర్లియెన్స్ ని తాకిన మరునాడు, 80 శాతము 'న్యూ ఆర్లియెన్స్' వరద నీటిలో ములిగిపోయింది. చాలామంది ప్రజలను హెలికాప్టర్లు / పడవల ద్వారా రక్షించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
- 2010: డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010ని లోక్ సభలో ప్రవేశపెట్టారు.
జననాలు
[మార్చు]- 1797: మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్ షెల్లీ, ఫ్రాంకెన్‌స్టీన్ నవలా రచయిత్రి (మ.1851).
- 1871: ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు. (మ.1937)
- 1912: వెల్లాల ఉమామహేశ్వరరావు, తెలుగు సినిమా తొలితరం కథానాయకుడు.
- 1913: రిచర్డ్ స్టోన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- 1934: బాలూ గుప్తె, భారతీయ క్రికెట్ ఆటగాడు. (మ.2005)
- 1936: జమున, సినిమా నటి (మ. 2023)
- 1949: మమ్మెన్ చాండీ, భారతదేశంలో ఎముక మజ్జ మార్పిడి (బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్) రంగంలో నిష్ణాతుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
- 1958: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (మ.2005)
- 1959: నాగబాల సురేష్ కుమార్, రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత.
- 1963: ఆనంద్ బాబు, తమిళ, తెలుగు, హిందీ, చిత్రాల నటుడు.(హాస్యనటుడు నగేష్ కొడుకు)
- 1983: మాధవి. ఒ, తెలుగు రంగస్థల నటి, గాయని.
- 1980: రిచా పల్లాడ్, తెలుగు, హిందీ నటి.
- 1994: నందితా రాజ్: తెలుగు చలన చిత్ర నటి .
మరణాలు
[మార్చు]- 30 బి.సి.: క్లియోపాత్ర ఉచ్చారణ తేడా క్లియోపాట్ర VII, ఈజిప్ట్ మహారాణి, గొప్ప అందగత్తె, ఆత్మహత్య చేసుకున్నది.
- 1949: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (జ.1899)
- 1963: రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (జ.1885)
- 2008: కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (జ.1918)
- 2013: సీమస్ హీనీ, ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1939)
- 2022: మిఖాయిల్ గోర్బచేవ్, చివరి సోవియట్ యూనియన్ నాయకుడు. (జ.1931)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- అంతర్జాతీయ తప్పిపోయిన వారి దినోత్సవము.
- సెయింట్ రోజ్ ఆఫ్ లీమా దినోత్సవము (పెరూ దేశము లో).
- విజయ దినము (టర్కీ దేశము లో).
- చిన్న పరిశ్రమల దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2023-04-06 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 30
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 29 - ఆగష్టు 31 - జూలై 30 - సెప్టెంబర్ 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |