జూలై 21
స్వరూపం
జూలై 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 201వ రోజు (లీపు సంవత్సరములో 202వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 164 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2025 |
సంఘటనలు
[మార్చు]- 0356 బి.సి. : హెరోస్ట్రేటస్ అనే యువకుడు, ప్రపంచపు 7 వింతలలో ఒకటైన, ఎఫెసిస్ లో ఉన్న ఆర్టెమిస్ ఆలయానికి, నిప్పు పెట్టాడు.
- 1588: స్పానిష్ ఆర్మడాని ఇంగ్లీష్ వారి నౌకాదళం ఓడించింది.
- 1667: బ్రేడా సంధి జరిగింది. దీనివలన రెండావ ఆంగ్లేయులు-డచ్చిదేశస్తుల మధ్య జరిగిన రెండవ యుద్ధం అంతమైంది.
- 1718: పస్సరోవిట్జ్ సంధి, ఒట్టోమన్ సామ్రాజ్యానికి, ఆస్ట్రియాకి, రిపబ్లిక్ ఆఫ్ వెనిస్ కి మధ్య జరిగింది.
- 1831: నెదర్లాండ్ నుంచి బెల్జియమ్ స్వాతంత్ర్యం పొందింది. లియోపోల్డ్ I రాజు అయ్యాడు.
- 1873: అయోవా (పశ్చిమ అమెరికా) రాష్ట్రంలోని అడేర్ దగ్గర జెస్సె జేమ్స్, జేమ్స్ యంగర్ ముఠా మొదటిసారిగా రైలు దోపిడీ చేసారు.
- 1904: కేమిల్లె జెనాట్జీ కారుని గంటకు 65.79 మైళ్ళ వేగంతో ప్రయాణించి, ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
- 1931: సి.బి.ఎస్. టెలివిజన్ చానెల్, అమెరికా లో, తన 7 రోజుల రోజు వారీ ప్రసారాలను, క్రమం తప్పకుండా ప్రసారం చేయటం మొదలుపెట్టింది.
- 1934: గల్లిపొలిస్ (అమెరికాలోని ఓహియో రాష్ట్రం) లో 113 డిగ్రీల ఫారెన్హీట్ (45 డిగ్రీల సెంటిగ్రేడ్). ఇది ఓహియో రాష్ట్రంలో నమోదు అయిన రికార్డు.
- 1940: ఎస్తోనియా, లాత్వియా, లిథూనియా దేశాలను, సోవియట్ యూనియన్, తనలో కలిపి వేసుకుంది.
- 1944: జపాన్ ఆక్రమించిన 'గువామ్' అనే ప్రాంతాన్ని, అమెరికన్ దళాలు విడిపించాయి. (రెండవ ప్రపంచ యుద్ధం).
- 1949: అమెరికన్ సెనేట్ నార్త్ అట్లాంటిక్ సంధిని (నాటో)ని 82-13 ఓట్లతో రద్దు చేసింది.
- 1954: జెనీవా సమావేశంలో వియత్నాం దేశాన్ని, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలుగా విడదీసారు.
- 1954: ఫ్రాన్స్, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలకు స్వాతంత్ర్యం ఇచ్చుటకు, జెనీవాలో ఒప్పుకున్నది.
- 1959: ప్రపంచంలో మొట్టమొదటిగా అణుశక్తితో నడిచే వాణిజ్య నౌక 'సవన్నా' జల ప్రవేశం చేసింది.
- 1960: సిరిమావొ బండారునాయకె, శ్రీలంక (నాటి సిలోన్) ప్రధాన మంత్రి (ణి) గా పదవిని చేపట్టి, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానిగా, మొదటి మహిళా దేశాధినేత్రిగా గుర్తింపు పొందింది. (1960 జూలై 20 అని కూడా అంటారు)
- 1960: అఫ్రికాలో కటం(తం)గా దేశంగా ఆవిర్భవించింది.
- 1961: మెర్క్యురీ 4 (మెర్క్యురీ - రెడ్స్టోన్ 4 మిషన్) అనే రోదసీ నౌకను (లిబర్టీ బెల్ 7) గుస్ గ్రిస్సాం (రోదసీ యాత్రికుడు) తో అమెరికా ఆకాశంలోకి పంపింది. ఇతడు రోదసీలోకి వెళ్ళిన రెండవ అమెరికన్( సబ్-ఆర్బిటల్ మిషన్ అంటే రోదసీ లోనే తక్కువ ఎత్తులో, కక్ష్యలో, ప్రయాణించటం). (మెర్క్యురీ ప్రోగ్రాం)
- 1965: పాకిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాలు ప్రాంతీయ సహకార సంధిని చేసుకున్నాయి.
- 1978: ప్రపంచంలోనే అత్యంత బలమైన, 80 కె.జి. ల బరువున్న, 'సెయింట్ బెర్నార్డ్' జాతికి చెందిన కుక్క, 2909 కే.జి.ల బరువును 27 మీటర్ల దూరం లాగింది. ఈ జాతి కుక్కల గురించిన చరిత్ర, కధలు చదవండి.
- 1980: జీన్ క్లాడ్ డ్రోయెర్, పారిస్ లోని ఈపిల్ టవర్ని 2గంటల 18 నిమిషాలలో ఎక్కాడు.
- 1983: పోలిష్ ప్రభుత్వం 19 నెలల మార్షల్ లాని ఎత్తివేసింది.
- 1983: ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత వోస్తోక్ స్టేషను, అంటార్క్టికా ఖండంలో (-89.2 డిగ్రీల సెంటిగ్రేడ్ -128.6 డిగ్రీల ఫారెన్ హీట్) రికార్డ్ అయ్యింది.
- 1984: తూర్పు జర్మనీకి చెందిన 'మారిటా కోచ్' 200 మీటర్లను 21.71 సెకండ్లలో సాధించి మహిళల ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
- 1988: ఏరియేన్ -3 రాకెట్ ద్వారా 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపారు. అందులో ఒకటి భారత దేశానికి చెందినది.
- 1990: తూర్పు బెర్లిన్లో బెర్లిన్ గోడని తీసివేసినందుకు ఆనందంగా రాక్ కన్సర్ట్, 1,50,000 మంది ఒక పండుగలా జరుపుకున్నారు.
- 2005: లండన్లో బాంబు పేలుళ్ళు. అంతకు ముందు జూలై 7 న కూడా బాంబు పేలుళ్ళు జరిగాయి.
- 2007: జె.కె. రౌలింగ్ రాసిన హారీ పాటర్ వరుస నవలలో చివరిదైన హారీ పాటర్ అండ్ ది డెత్లో హాలోస్ విడుదలైంది.
జననాలు
[మార్చు]- 1899: ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికన్ నవలా రచయిత. నోబెల్ బహుమతి గ్రహీత
- 1923: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2005)
- 1936: జె.బాపురెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి, కవి, రచయిత (మ. 2023)
- 1940: శంకర్ సిన్హ్ వాఘేలా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
- 1947: చేతన్ చౌహాన్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1961: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు.(మ.1988)
- 1966: అనురాధ (నటి), తెలుగు నృత్యతార, సుమారు 35 చిత్రాలలో నటించింది.
- 1969: పసునూరు శ్రీధర్ బాబు, పాత్రికేయుడు, కవి.
- 1989: వరుణ్ సందేశ్ , తెలుగు సినీనటుడు
- 1989: మధుశాలిని , తెలుగు, తమిళ నటి, వ్యాఖ్యాత , మోడల్
మరణాలు
[మార్చు]- 1796: రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి.
- 1948: అర్షిలె గోర్కీ, అబ్స్ట్రాక్ట్ ఎక్ష్ప్రెషనిస్ట్, 43వ ఏట.
- 1957: బెర్నార్డ్ స్పూనర్, అమెరికాలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను వ్యక్తి.
- 1990: సౌమనశ్య రామ్మోహనరావు, రంగస్థల నటుడు, ఆకాశవాణి కళాకారుడు. (జ.1921)
- 1998: అలాన్ షెపార్డ్, అమెరికాకు చెందిన మొదటి రోదసీ యాత్రికుడు. అపొలో-14 రోదసీ నౌకను నడిపి చంద్రుడిని చేరి, చంద్రుడి మీద నడిచిన 5వ మనిషి.
- 2001: శివాజీ గణేశన్ , ప్రసిద్ధ దక్షిణ భారత చలన చిత్ర నటుడు (జ.1928)
- 2009: గంగూబాయ్ హంగళ్, హిందుస్తాని గాయని, పద్మభూషణ్, పద్మవిభూషణ్ గ్రహీత.
- 2013: గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (జ.1932)
- 2023:చిత్తరంజన్ , లలిత గీతాలు రచయిత , సంగీత దర్శకుడు, ఆకాశవాణి లో స్వరకల్పన.(జ.1938)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2006-08-21 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై21
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 20 - జూలై 22 - జూన్ 21 - ఆగష్టు 21 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |